రేపటి వరకు పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం
తిరుపతి సిటీ: తిరుపతి జిల్లాలోని వర్సిటీల పరిధిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పీజీసెట్–2024 వెబ్‌ఆప్షన్లకు బుధవారం వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పీజీసెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 23వరకు వెబ్ ఆప్షన్లకు చివరి తేదీగా నిర్ణయించిన అధికారులు విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు. 29వతేదీ ఆప్షన్ల మార్పునకు అవకాశమిస్తూ, 31వతేదీన మొదటి విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వర్సిటీల్లో వచ్చేనెల 2వతేదీ నుంచి 5వతేదీ లోపు ఒరిజినల్ ధృవపత్రాలతో అడ్మిషన్లు పొందాలని తెలియజేశారు.
ఎమ్మెస్సీ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సులను కొనసాగించండి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఒక్కొక్కటిగా తొలగించడం దారుణమని విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్‌లో ఎంతో డిమాండు ఉన్న ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సు కోసం వెబ్‌ఆప్షన్లలో ఎంత వెతికినా కనబడకపోవడంతో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరాశే ఎదురైందని తెలిపారు. ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోర్సును పూర్తి స్థాయిలో ఆపివేయాలని కుట్రపూరితంగా కొందరు వర్సిటీ అధికారులను తప్పుదోవపట్టించడం దారుణమన్నారు. ఈ నెల 28వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉందని, తిరిగి ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సును కొనసాగేలా అధికారులు చొరవ చూపాలని ఆ ప్రకటనలో వారు విజ్ఞప్తి చేశారు.
ఏయూ హాస్టళ్లు, మెస్‌ల తనిఖీ
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టళ్లు, మెస్‌లను సోమవారం ఏయూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్‌బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఎం.వి.ఆర్.రాజు, చీఫ్ వార్డెన్‌లు ఆచార్య ఎస్.హరనాథ్, ఆచార్య కె.రమే‹Ùబాబు ముందుగా మెస్‌లలో భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందించే టిఫిన్‌ను స్వయంగా రుచిచూశారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థుల హాస్టళ్లు తనిఖీ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
పార్వతీపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం అంగీకారం కాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ్ణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పథకం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వంటిదేనని, సరీ్వసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమన్నారు. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదని సీపీఎస్ పథకంలో లాగానే ఉద్యోగి జీతంలో నుంచి 10% మినహాయింపు ఉంటుందన్నారు. ఏప్రిల్ ఒకటి 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
అండర్–19 ఏపీ జట్టుకు ఎంపిక
అమలాపురం రూరల్: ది అమలాపురం కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ధబండి బాలప్రసాద్‌రెడ్డి కడపలో జరిగిన అండర్–19 క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో ఏపీ జట్టుకు అర్హత సాధించాడు. గతంలో ఢిల్లీలో జరిగిన యంగ్ స్టార్ ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో 100 పరుగులు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌పీఎల్ లీగ్‌లో సత్తా చాటిన బాలప్రసాద్‌రెడ్డిను అండర్–19 ఏపీ టీమ్ సెలక్షన్స్‌కు ఎంపిక చేశారు. కర్ణాటకలో జరిగే ఐపీఎల్, ఎన్‌సీఎల్ జోనల్ సెలక్షన్స్‌కు ఎంపికయ్యాడు. సోమవారం ఆ కళాశాలలో బాలప్రసాద్‌రెడ్డిని డైరెక్టర్లు కిరణ్‌కుమార్, నాయుడు, సతీ‹Ù, ఎం.రాంబాబులు అభినందించారు.
విద్యా సమాచారం
Published Tue, Aug 27 2024 12:04 PM | Last Updated on Tue, Aug 27 2024 12:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment