information
-
అంతా.. ఏఐమయం
‘బూన్ గైడ్ ఉండగా.. పరీక్షల భయం దండగ’.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) సామాన్యులకు అందుబాటులోకి రాని 1980లలో కాలేజీ కుర్రాళ్లు తమను పరీక్షల గండం గట్టెక్కించే గైడ్ గురించి గొప్పగా చెప్పుకొనే మాట అన్నమాట. అయితే కాలంతోపాటు కంప్యూటర్ల పనితీరు, సామర్థ్యాలు అనూహ్యంగా పెరగడంతో ఇప్పుడు విద్యార్థులు మొదలు ఉద్యోగుల దాకా ఏ రంగానికి చెందిన వారికి కావాల్సిన సమాచారమైనా చిటికెలో అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(Artificial intelligence)(ఏఐ) సాంకేతికత యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ అప్లికేషన్లు, వాటి ఉపయోగాలపై కథనం. – సాక్షి, హైదరాబాద్కృత్రిమ మేధ (ఏఐ) రంగం కేవలం ఐదంటే ఐదేళ్లలో ప్రపంచ గమనాన్ని మార్చేసింది. అదెలాగో తెలియాలంటే జనరేటివ్ ఏఐ ఎదుగుదలను చూడాలి. ఓపెన్ ఏఐ అనే సంస్థ 2019లో తొలిసారి ‘జీపీటీ–2’ను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రశ్నలడిగినా తడుముకోకుండా అక్షరాల్లో బదులివ్వడం దీని ప్రత్యేకత. అయితే ఓపెన్‌సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండటంతో ఏఐ వేగంగా అభివృద్ధి చెందింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్ల శకం మొదలైంది.అందరికీ చిరపరిచితం సిరి, అలెక్సా..మనలో చాలామందికి చిరపరిచితమైన చాట్‌జీపీటీ వర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్. సిరి, అలెక్సా, ‘ఓకే గూగుల్’ లాంటివన్నీ ఈ కోవకు చెందిన జనరేటివ్ ఏఐ అప్లికేషన్లే. మీరేదైన ప్రశ్న అడిగితే.. ఇంటర్నెట్ మొత్తాన్ని వెతికి సమాధానాలు చెబుతాయి. స్క్రీన్లపై అయితే పదాల రూపంలో.. మొబైల్ఫోన్లు ఇతర గాడ్జెట్ల ద్వారానైతే మాటల్లో బదులిస్తాయి. ఇవి కాకుండా ఫొటోలు, వీడియోలను గుర్తుపట్టేందుకు, వాటిని వర్గీకరించేందుకు గూగుల్ ఫొటోస్, డీప్ఆర్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంగ్లిష్ అంత బాగా రాకపోయినా...తప్పుల తడకలా ఉండే వాక్యాలను కూడా సరి చేయాలంటే ‘గ్రామర్లీ’, ‘క్విల్బోట్’ వంటి ఏఐ అప్లికేషన్లు వాడుకోవచ్చు. అంకెల్లోని సమాచారాన్ని (ఎక్సెల్ షీట్లు) చదివేసి విశ్లేషించేందుకు ‘జూలియస్.ఏఐ’ ఉపయోగపడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులకు నిత్యం ప్రాణ సంకటంగా మారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు ‘కాన్వా’తోపాటు బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అంచనాలకూ ఏఐ యాప్స్..ఇప్పటివరకు మనం చూసిన అప్లికేషన్లన్నీ నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా పనిచేస్తాయి. కానీ ప్రిడిక్టివ్ అనలటిక్స్ రకం ఏఐ అప్లికేషన్లు ఉన్న సమాచారం ఆధారంగా అంచనాలు కట్టేందుకు వాడతారు. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐబీఎం’ వాట్సన్ పేరుతో సిద్ధం చేసిన జనరేటివ్ ఏఐ అప్లికేషనే అందుకు ఉదాహరణ. ఆరోగ్య రంగంలో కొత్త సంచలనం ఇది. ఇమేజ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎక్స్–రేలను చదివేస్తుంది. వైద్య నివేదికలు, వైద్య పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని (సైంటిఫిక్ జర్నళ్ల ద్వారా) ఔపోసన పట్టేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వైద్యుల కంటే ముందే కేన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులను కూడా కచి్చతంగా గుర్తించేలా దీన్ని సిద్ధం చేశారు. ‘అడా’, ‘బాబిలోన్ హెల్త్’ వంటివి కూడా మన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి సలహా సూచనలు ఇవ్వగలిగే ఏఐ అప్లికేషన్లు.సొంతంగా సృష్టిస్తాయి కూడా... మనిషిని, యంత్రాన్ని వేరు చేసేదేమిటని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం యంత్రం సొంతంగా ఏదీ సృష్టించలేదని చెబుతారు. అది నిజం కూడా. కానీ జనరేటివ్ ఏఐ అప్లికేషన్లతో ఈ పరిస్థితి కూడా మారిపోయింది. ‘డాల్–ఈ’, ‘మిడీజరీ్న’ వంటి అప్లికేషన్లు సొంతంగా బొమ్మలు గీయగలవు. సంగీతాన్ని సృష్టించగలవు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని తమదైన రాగాలు తయారు చేయగలవు కూడా..! అంతెందుకు.. ఒక సినిమా స్టోరీ రాయాలనుకోండి.. కథ తాలూకూ ప్రధాన ఇతివృత్తాన్ని చెబితే చాలు.. ఏఐ అప్లికేషనే స్క్రీన్ ప్లేతో కలిపి కథ మొత్తాన్ని రాసిచ్చేస్తుంది!డబ్బు లెక్కలకూ యాప్‌లు..స్టాక్మార్కెట్లో పెట్టుబడులంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫలానా కంపెనీ షేర్ కొన్నేళ్లుగా ఎలాంటి లాభాలు తెచి్చపెడుతోందో? లేదా ఇబ్బందులు ఎదుర్కొంటోందో తెలియాలి. అయితే ‘మింట్’, ‘రాబిన్‌హుడ్’ వంటి అప్లికేషన్లు ఈ పనులన్నీ చిటికెలో చక్కబెట్టేస్తాయి. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్ఎల్ఎం) ఆధారంగా కంపెనీల ఆర్థిక పరిస్థితులన్నింటినీ మదించి పెట్టుబడుల సలహాలిస్తాయి.డీప్‌సీక్ రాకతో విప్లవం..తాజాగా ‘డీప్‌సీక్’ సృష్టించిన ప్రభంజనం అంతాఇంత కాదు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఏఐ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయన్న ఊహలను పటాపంచలుచేస్తూ చైనా సంస్థ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆధారిత ఎల్ఎల్ఎం మోడల్ ‘ఆర్1’ను చూసి ఎని్వడియా వంటి దిగ్గజ సంస్థలే నోరెళ్లబెట్టాయి. ఇప్పుడున్న ఏఐ మోడల్స్కన్నా ఎంతో మెరుగైన తార్కిక విశ్లేషణ సామర్థ్యం డీప్‌సీక్ ఆర్1కు ఉండటమే దాన్ని మరో మెట్టుపై నిలబెడుతోంది. దీని రాకతో ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయం. -
తెలుగులోనూ కుంభమేళా సమాచారం
రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. -
అయ్యప్పభక్తులకు గుడ్‌న్యూస్ : వాట్సాప్‌లో శబరిమల సమాచారం
ఇకపై శబరిమల వెళ్లే యాత్రికులు ఆలయ సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాస పడనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్‌లో 6238998000 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... క్షణాల్లో శబరిమల ఆలయ సమాచారం అందుతుంది.‘స్వామి చాట్‌బాట్’ పేరిట అందించే ఈ సేవలను ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఇంగ్లిష్, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అందించనున్నట్టు పథానంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసింది. ఆలయ వేళలు, ప్రసాద లభ్యత, పూజ వేళలు, శబరిమల చుట్టుపక్కల ఉండే ఇతర ఆలయాల వివరాలు, దగ్గరలో ఉండే రైళ్లు, బస్సులు, ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చాట్‌బోట్ ద్వారా తెలుసుకోవచ్చునని దేవస్థానం అధికారులు తెలియజేశారు -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
August 30: ఆధ్యాత్మిక సమాచారం..
శ్రీవారి దర్శనానికి 18 గంటలు..తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు.కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు.. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు. -
విద్యా సమాచారం
అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు తిరుపతి సిటీ: థాయిలాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సొంజ్కలా యూనివర్సిటీ వేదికగా గురువారం నుంచి రెండురోజుల పాటు జరగనున్న రీజనల్ నెట్వర్క్స్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్ అనే అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు హాజరుకానున్నారు. 14దేశాలకు చెందిన వర్సిటీ అధ్యాపకులు హాజరుకాన్ను ఈ సదస్సుకు మహిళా వర్సిటీ నుంచి రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రజిని, డీన్ ఆర్ ఉషా, ప్రొఫెసర్ జ్యోత్న్స పాల్గొంటారని వర్సిటీ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఒన్ హెల్త్ రాష్ట్రస్థాయి సదస్సు తిరుపతి కల్చరల్: ఐఏపీఎస్ఎం, ఐపీహెచ్ఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రపంచ వ్యాప్తంగా మనిíÙతో పాటు మనిషి చుట్టూ ఉన్న వాతావరణం, జంతువుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఒన్ హెల్త్ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక వైద్య విభాగాధిపతి సునీత తెలిపారు. ఈ నెల 31 ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. 31 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాలో టయోటా, హోండా కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత దృవీకరణపత్రాలతో ఉద్యోగ మేళాలో పాల్గొనాలని తెలిపారు. జాబ్‌డ్రైవ్‌లో పలువురికి ఉద్యోగాలు వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాల జేకేసీ, హెటిరోల్యాబ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 26 మంది అభ్యర్థులు పాల్గొనగా, 16 మంది అభ్యర్థులు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. తెలుగు భాషను కాపాడుకుందాం మనుబోలు (వెంకటాచలం): తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ విజయ్‌భాస్కర్‌రావు అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలోని తిక్కన సాహితీ పీఠం నెల్లూరు తెలుగు శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలువబడే తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులరి్పంచారు. -
విద్యా సమాచారం
రేపు ఉద్యోగ మేళా శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గురువారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ ట్రెయినీ కెమిస్ట్‌గా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో పనిచేసేందుకు పురుషులు, తిరుపతి యంగ్ ఇండియా శాఖలో పనిచేసేందుకు 21–32 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు, టీసీఎల్‌లో పనిచేసేందుకు 21–32 వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు కావాలన్నారు. విద్యార్హత 10 నుంచి డిగ్రీ చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10గంటలకు విద్యార్హత ద్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరు కావాలన్నారు. శ్రీ పద్మావతిలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి తుడా: స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లో ఎంబిబిఎస్ 2024 –25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆరుగురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్ చేతులమీదుగా వీరు అడ్మిషన్ పత్రాలను అందుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ 26వ తేదీ నుంచి ఆల్ ఇండియా కోట అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. 30న ఎస్వీయూలో జాబ్ మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి టి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. మూడు ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194 నంబర్ల నందు సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపిక ఉప్పలగుప్తం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలానికి చెందిన భీమనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లిష్ వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీల్లో శిరంగు శృతి, కుంపట్ల చాతుర్య ప్రథమ స్థానంలో నిలిచారు. వారు వచ్చే నెల సెప్టెంబర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. గొల్లపాలెం పాఠశాలకు మూడోసారి ప్రతిభా పురస్కారం కాజులూరు: స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, క్రీడా ప్రతిభా పురస్కారానికి కాకినాడ జిల్లా గొల్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల మరోసారి ఎంపికైనట్టు పీడీ జి.సునీల్‌కుమార్ తెలిపారు. గతేడాది స్కూల్ గేమ్స్‌లో తమ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో 40 మంది, జాతీయ స్థాయిలో ఇద్దరు క్రీడాకారులు మెరిట్లో రాణించినందుకు ఈ పురస్కారం వచి్చందన్నారు. గత మూడేళ్లుగా తమ పాఠశాల వరుసగా అవార్డు సాధిస్తుందన్నారు. యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తుల ఆహా్వనం రంగంపేట: హోమియో ఆసుపత్రిలో యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె.విద్యాసాగర్ మంగళవారం తెలిపారు. యోగాలో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమా చేసి అనుభవం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 83282 75475 నంబరులో సంప్రదించాలన్నారు. స్పౌజ్ కేటగిరీకీ కొత్త భాష్యం చెబుతున్న విద్యాశాఖ గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియలో విద్యాశాఖ రోజుకో కొత్త నిబంధన పేరుతో ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేయడం తగదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఏఐఎస్టీఎఫ్ ఆరి్థక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సు«దీర్‌బాబు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. డివిజన్‌స్థాయిలో నిర్వహించనున్న సర్దుబాటు కౌన్సెలింగ్ నిర్వహణపై మంగళవారం విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించిన వెబ్ ఎక్స్‌లో భాగంగా స్పౌజ్ కేటగిరీపై కొత్త నిబంధనలు విధించడం తగదన్నారు. పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్‌కు కౌన్సిలింగ్ గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు మంగళవారం వైద్య కళాశాల అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు ఎలాట్ చేశారు. వైద్య కళాశాలలో డీఎంఎల్టీ, ఎనస్థీషియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీíÙయన్, కార్డియాలజి టెక్నీషియన్, తదితర కోర్సుల్లో చేరేందుకు గత నెల 30న దరఖాస్తులకు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు వంద సీట్ల కోసం 600 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు. ఏయూలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి చర్యలు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్శిటీలోని అన్ని విభాగాల్లో బోధన పటిష్టతకు అవసరమైన గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించుకోడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌కు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్ కొరత లేకుండా చూస్తామని, ఎక్కడా కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆపిన గెస్ట్ ఫ్యాకలీ్టలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
విద్యా సమాచారం
రేపటి వరకు పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం తిరుపతి సిటీ: తిరుపతి జిల్లాలోని వర్సిటీల పరిధిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పీజీసెట్–2024 వెబ్ఆప్షన్లకు బుధవారం వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పీజీసెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 23వరకు వెబ్ ఆప్షన్లకు చివరి తేదీగా నిర్ణయించిన అధికారులు విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు. 29వతేదీ ఆప్షన్ల మార్పునకు అవకాశమిస్తూ, 31వతేదీన మొదటి విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వర్సిటీల్లో వచ్చేనెల 2వతేదీ నుంచి 5వతేదీ లోపు ఒరిజినల్ ధృవపత్రాలతో అడ్మిషన్లు పొందాలని తెలియజేశారు. ఎమ్మెస్సీ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సులను కొనసాగించండి తిరుపతి సిటీ: ఎస్వీయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఒక్కొక్కటిగా తొలగించడం దారుణమని విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్లో ఎంతో డిమాండు ఉన్న ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సు కోసం వెబ్ఆప్షన్లలో ఎంత వెతికినా కనబడకపోవడంతో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరాశే ఎదురైందని తెలిపారు. ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోర్సును పూర్తి స్థాయిలో ఆపివేయాలని కుట్రపూరితంగా కొందరు వర్సిటీ అధికారులను తప్పుదోవపట్టించడం దారుణమన్నారు. ఈ నెల 28వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఉందని, తిరిగి ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సును కొనసాగేలా అధికారులు చొరవ చూపాలని ఆ ప్రకటనలో వారు విజ్ఞప్తి చేశారు. ఏయూ హాస్టళ్లు, మెస్‌ల తనిఖీ విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టళ్లు, మెస్‌లను సోమవారం ఏయూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్‌బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఎం.వి.ఆర్.రాజు, చీఫ్ వార్డెన్లు ఆచార్య ఎస్.హరనాథ్, ఆచార్య కె.రమే‹Ùబాబు ముందుగా మెస్‌లలో భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందించే టిఫిన్‌ను స్వయంగా రుచిచూశారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థుల హాస్టళ్లు తనిఖీ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి పార్వతీపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం అంగీకారం కాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ్ణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పథకం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వంటిదేనని, సరీ్వసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమన్నారు. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదని సీపీఎస్ పథకంలో లాగానే ఉద్యోగి జీతంలో నుంచి 10% మినహాయింపు ఉంటుందన్నారు. ఏప్రిల్ ఒకటి 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అండర్–19 ఏపీ జట్టుకు ఎంపిక అమలాపురం రూరల్: ది అమలాపురం కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ధబండి బాలప్రసాద్రెడ్డి కడపలో జరిగిన అండర్–19 క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో ఏపీ జట్టుకు అర్హత సాధించాడు. గతంలో ఢిల్లీలో జరిగిన యంగ్ స్టార్ ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో 100 పరుగులు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌పీఎల్ లీగ్‌లో సత్తా చాటిన బాలప్రసాద్రెడ్డిను అండర్–19 ఏపీ టీమ్ సెలక్షన్స్‌కు ఎంపిక చేశారు. కర్ణాటకలో జరిగే ఐపీఎల్, ఎన్సీఎల్ జోనల్ సెలక్షన్స్‌కు ఎంపికయ్యాడు. సోమవారం ఆ కళాశాలలో బాలప్రసాద్రెడ్డిని డైరెక్టర్లు కిరణ్‌కుమార్, నాయుడు, సతీ‹Ù, ఎం.రాంబాబులు అభినందించారు. -
డిజిటల్ సమాచారం తొలగింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను ఆ లేఖలో కేటీఆర్ జత చేశారు. సీఎంగా కేసీఆర్ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్ 2014 – డిసెంబర్ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
YouTube: మీకు మీరే బాస్
ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..? ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..? ఏమి కావాలి..? ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్ టూల్ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ అనంతరం పబ్లిష్ చేయాలి. ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్లోడ్ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్ రతీష్ (‘రతీష్‌ఆర్‌మీనన్’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్ అవసరం. ఆరంభం ఇలా.. ► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్ ప్రారంభించి వీడియోల పోస్టింగ్ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజబుల్’ నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్ నుంచి ఆహా్వనం వస్తుంది. ► ఒక్కసారి మీ చానల్ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పని చేస్తుంది..? యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్నర్ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ వివరించారు. చానల్ సక్సెస్ కోసం..? ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి. వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్ పెరుగుతుంది. అనలైసిస్ టూల్ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది. ఆదాయం ఏ రూపంలో..? యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్ సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్ పంచుతుంది. సూపర్ చాట్, సూపర్ స్టికర్స్ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మన్దీప్ సింగ్ 2021లో ‘డేటాసైన్స్డైరీస్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచాడు. కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ రతీష్ ఆర్ మీనన్ ‘రతీష్‌ఆర్‌మీనన్’ పేరుతో 2012 నుంచి చానల్ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్ ప్రకటనలు, అఫిలియేట్ మార్కెటింగ్ కమీషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. చానల్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్లో ఉంచడం. ఎవరైనా యూజర్ ఆ లింక్‌ను క్లిక్ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది. రెగ్యులర్ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..? తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్ ప్రపంచంలో ప్యాసివ్ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు. కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే. అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది. అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్ ట్రైనర్ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్ అవర్స్ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్ అంటున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్ ఛానల్ ఆరంభించి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు. రతీష్‌ఆర్‌మీనన్ 2011లో చానల్ ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్ సబ్స్క్రయిబర్ల మార్క్ దాటింది. టెక్ వీడియోలు అప్లోడ్ చేసే రతీష్, ట్రావెల్ వీడియోలను కూడా పోస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్టైన్మెంట్ చానల్ అయి, ఒక మిలియన్ వ్యూస్ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట. ఏమిటి మార్గం..? చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్ చానళ్లు తెరిచి యూట్యూబ్ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు. -
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్‌లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్‌గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
సచివాలయాల వద్ద సంక్షేమ సమాచార బోర్డులు
సాక్షి, అమరావతి :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక సమాచార బోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఏ పథకంలో ఎంతమంది లబ్ధిదారులకు.. ఎంత మొత్తం లబ్ధిచేకూరిందన్న వివరాలను ఆ సమాచార బోర్డులలో ప్రదర్శిస్తారు. నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 3,842 వార్డు సచివాలయాల వద్ద ఎక్కడిక్కడ నగర, పట్టణ, జిల్లా, మండల, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ ‘ప్రగతి సమాచార బోర్డు’లను ఆవిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. రెండు మూడ్రోజుల్లోనే ఏ సచివాలయానికి సంబంధించిన సమాచార బోర్డును ఆయా సచివాలయానికి పంపేందుకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు సమాచారం.. ఇక ఈ సంక్షేమ పథకాల సమాచార బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయనున్నారు. సచివాలయాల వారీగా ప్రతి కుటుంబానికి ముందుగానే వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖాధికారులు చెప్పారు. వీటి ఆవిష్కరణ అనంతరం ఓ పది రోజులపాటు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివిధ పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం ఎంతమేర లబ్ధిచేకూరుస్తోంది తెలియజేసి, ఆ కుటుంబంలో ఒక సభ్యుని నుంచి ఈ–కేవైసీ రూపంలోధ్రువీకరణ తీసుకుంటారు. -
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
దుల్కర్‌కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ మధ్య చాట్ జీపీటీ చిచ్చు..
-
సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి!
ఎగవేతదార్లు(డిఫాల్టర్లు) నుంచి జరిమానా బకాయిలు వసూలు చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సరికొత్త ప్రణాళిక రచించింది. డిఫాల్టర్ల ఆస్తులు, ఇతర సమాచారాన్ని తెలియచేసే వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 515 మంది ఎగవేతదార్ల జాబితాను సెబీ విడుదల చేసింది. వీళ్లకు సంబంధించిన సమాచారాన్నే తెలియజేయాల్సి ఉంది. రెండు దశల్లో చెల్లింపు ఇలా డిఫాల్టర్ల ఆస్తుల సమాచారాన్ని తెలియజేస్తే సెబీ రెండు దశల్లో నజరానా అందిస్తుంది. ఎగవేతదారు నుంచి వసూలు చేసిన బకాయి విలువలో 2.5 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అది తొలిదశలో చెల్లిస్తుంది. ఇక తుది దశ కింద బకాయి విలువలో 10 శాతం లేదా రూ.20 లక్షలు ఏది తక్కువైతే అది ఇవ్వనుంది. సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యం సెబీ ప్రకటన ప్రకారం.. డిఫాల్టర్లను నుంచి బకాయి వసూలుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నించినా పూర్తి బకాయి వసూలు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ ఎగవేతదారు ఆస్తులకు సంబంధించి విశ్వసయనీయ సమాచారం అందించేవారికి ఈ నజరానా అందిస్తారు. ఇదే సమయంలో సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలను, నజరానా మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరో తెలుసా? సమాచారం అందించేవారికి ఎంత మేర నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. ఈ నజరానాను ఇన్వెస్టర్ల భద్రత, అవగాహన నిధి నుంచి చెల్లిస్తారు. మార్చి 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 2021-22 సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. వసూలు కష్టంగా మారిన బకాయిల విభాగం కింద 2022 మార్చి చివరి నాటికి రూ.67,228 కోట్ల బకాయిలను సెబీ గుర్తించింది. నజరానా ప్రకటించడం వల్ల బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు దోహదం చేస్తుందని సెబీ భావిస్తోంది. -
విద్యాలయాలుగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి : అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) యూనివర్సిటీల్లో పాఠ్యాంశమయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ, కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులుగా కూడా మారాయి. యూనివర్సిటీలు, అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు ఇక నుంచి విధిగా ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా మార్పుచేశారు. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యార్థులు ఇందుకు శ్రీకారం చుట్టగా, మత్స్య యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విజ్ఞాన భాండాగారాలుగా ఆర్బీకేలు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఆర్బీకేలు రెండున్నరేళ్లుగా రైతులకు విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. వన్‌స్టాప్ సెంటర్‌గా వీటిని తీర్చిదిద్దారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతోపాటు ఎరువులను రైతు ముంగిటకు సరఫరా చేస్తున్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా అద్దెకు సాగు యంత్రాలనూ అందుబాటులోకి తెచ్చారు. అలాగే, ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియోస్‌్కలు, డిజిటల్, స్మార్ట్ గ్రంథాలయాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక పోకడలు, మెళకువలను మారుమూల రైతులకు అందిస్తూ వాటిని నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక వీటిల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లలో రెండు కోట్ల మందికి పైగా రైతులు వీటి ద్వారా సేవలందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టగా, పలు దేశాల ప్రతినిధులూ ఇక్కడికొచ్చి వీటిపై అధ్యయనం చేశారు. ఈ కేంద్రాల్లో ఇంటర్న్‌షిప్ సాధారణంగా.. మెడికోలకు బోధనాస్పత్రుల్లోనూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లోనూ చివరి ఏడాది ఇంటర్న్‌షి ప్ ఉంటుంది. అదేరీతిలో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులను జిల్లా కేంద్రాల్లో ఉండే డాట్ సెంటర్లకు, మిగిలిన వర్సిటీలు రీసెర్చ్ స్టేషన్, కేవీకేలకు అటాచ్ చేసేవారు. వాటి పరిధిలో ఓ వారం పదిరోజుల పాటు విద్యార్థులు స్టడీ చేసేవారు. ప్రస్తుతం ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షిప్ నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు, వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలలు, వెటర్నరీ విద్యార్థులకు నెలరోజుల చొప్పున ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా ఆయా యూనివర్సిటీ వీసీలు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 20 నుంచి నెలరోజులపాటు ఇంటర్న్‌షి ప్ ఉండేలా మత్స్య యూనివర్సిటీ కూడా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో ఈ ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టారు. ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్ ఇక ఇంటర్న్‌షి ప్ కోసం ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్‌ను ఏర్పాటుచేశారు. రీసెర్చ్, ఎక్స్టెన్షన్ సెంటర్ల శాస్త్రవేత్తలతో పాటు స్థానిక అధికారులు, ఆర్బీకే సిబ్బందితో అనుసంధానం చేశారు. ప్రతీరోజు ఆర్బీకేలను విజిట్ చేస్తూ వాటి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రధానంగా ఇన్పుట్స్ సరఫరా, కియోస్‌్కల పనితీరు, వాతావరణ సమాచారం, నాలెడ్జ్ షేరింగ్, ఈ–క్రాప్ బుకింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ సరీ్వస్, కొనుగోలు తీరు, ఆర్బీకే సిబ్బంది, బ్యాంక్ మిత్రల సేవలు, పశువులకు వ్యాక్సినేషన్, హెల్త్‌కార్డుల జారీ, సీహెచ్‌సీలు, పొలంబడులు, తోటబడులు, పశు విజ్ఞాన బడులు, వ్యవసాయ సలహా మండళ్ల పనితీరు, ఎఫ్పీఓలు, జేఎల్‌జీ గ్రూపుల పనితీరుతో పాటు పంటల బీమా, రైతుభరోసా, సున్నా వడ్డీ పంటల రుణాలు వంటి పథకాల అమలు తీరుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు సమరి్పంచాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై విద్యార్థుల అధ్యయనాన్ని అంచనా వేస్తూ 5–10 మార్కుల వరకు ఇస్తారు. తరగతి గదుల్లో ఆర్బీకేల గురించి.. ఈ నేపథ్యంలో.. రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్బీకేల అంశాన్ని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సీటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు. గ్రామీణ ఆరి్థక వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న వీటిæ గురించి తరగతి గదుల్లో బోధిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? వాటి ఆవశ్యకత, లక్ష్యాలు, వాటి ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలు, రైతుల జీవితాల్లో ఆర్బీకేలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి.. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆర్బీకేలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. ఆర్బీకేల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం నేను బీఎస్సీ హానర్స్ ఫైనల్ ఇయిర్ చదువుతున్నా. నాతో పాటు మరో ఆరుగురు విద్యార్థులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆర్బీకే పరిధిలో ఇంటర్న్‌షి ప్ చేస్తున్నాం. ఆర్బీకేల పనితీరు.. అందిస్తున్న సేవలను పరిశీలిస్తున్నాం. రోజూ ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నాం. సాయంత్రం పూట రైతులతో భేటీ అవుతూ వారి సమస్యలకు సలహాలు, సూచనలిస్తున్నాం. – దాసరి షీలా జయశ్రీ, పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థిని ఆర్బీకేల గురించి కాలేజీలో ఎంతో చెప్పారు నేను బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చదువుతున్నా. ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షి ప్‌కు వెళ్లబోతున్నాం. ఈసారి ఇంటర్న్‌షి ప్లో ఆర్బీకేల విజిట్‌ను కూడా చేర్చారు. కాలేజిలో కూడా వాటి కోసం ఎంతో చెప్పారు. ఇంటర్న్‌షిప్‌లో వాటి పనితీరుపై ప్రత్యక్షంగా స్టడీ చేస్తాం. – భూక్యాసాయి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చేసరికి పరిశోధనలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహిస్తున్నాం. – డా.ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం. ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఐదు నుంచి ఆరుగురు చొప్పున ఒక్కో ఆర్బీకేకు అటాచ్ చేశాం. – డాక్టర్ టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
సొంతానికి ఓ శాటిలైట్.. మనకు మనమే సమాచారం తెలుసుకునే వీలు!
రమేష్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వచ్చే వారం రోజులు వర్షాలు అనే సమాచారం ఉంది. అయితే, తాను ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడతాయో లేదో తెలుసుకునేందుకు తాను పంపిన ప్రైవేటు శాటిలైట్ ద్వారా వర్షం పడుతుందా? లేదా చూశాడు. వర్షం పడదని నిర్ధారించుకుని తన పనిలో మునిగిపోయాడు. ఒక ప్రైవేటు విద్యా సంస్థ.. దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్‌లోని అన్ని విద్యా సంస్థల్లో ఒకేసారి ఆన్లైన్లో పాఠాలు బోధించేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా తమ విద్యార్థి ప్రయోగించిన శాటిలైట్ ద్వారా నేరుగా సేవలను ఉపయోగించుకుంటోంది. అదీ తక్కువ ఖర్చుతోనే.. ఒక ప్రైవేటు సంస్థ మారుమూల ప్రాంతాల్లో పనులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తాను సొంతంగా నిర్వహిస్తున్న శాటిలైట్ ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీచేస్తోంది. ..అవును కేంద్రం కొత్తగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయంతో మనమూ సొంతంగా ఒక ప్రైవేటు శాటిలైట్‌ను ప్రయోగించుకుని సేవలను పొందే రోజు దగ్గర్లోనే ఉంది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఏర్పాటుచేసుకున్న అంతరిక్ష రవాణా కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తరహాలో కాకపోయినా.. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, మెడికల్ సంస్థలు మొదలైనవి తమ సొంత శాటిలైట్ ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకునే వీలు కలగనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎప్పుడో తలుపులు తెరిచారు. కానీ, భారత్‌లో మాత్రం కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు (ఎన్జీపీఈ).. అంతరిక్ష పరిశోధనలను తమ సొంత అవసరాలకు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమలకు ఎండ్ టు ఎండ్ (నేరుగా సమాచారం చేరే విధంగా) అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)ను ఏర్పాటుచేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటు సంస్థలకు సహాయ సహకారాలతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇస్రోకు చెందిన సాధన సంపత్తిని ప్రధానంగా రాకెట్ లాంచింగ్ కేంద్రాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలూ వినియోగించుకునే వెసులుబాటు లభించింది. ఇక బోలెడు అవకాశాలు.. ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడంతో అంతరిక్ష రంగంలో అనతికాలంలోనే భారత్ గొప్ప ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు ఒక ఉదాహరణ చెబుతున్నారు. వాస్తవానికి మార్స్ (అంగారకుడు)లో అడుగుపెట్టేందుకు భారత్ కేవలం 75 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది. మిగిలిన పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం అంగారకుడిపై అడుగు పెట్టగలిగామనేది వారి అభిప్రాయం. అంతేకాక.. భారత్‌లో ఉన్న నిపుణులైన యువత ఈ అవకాశాలను మరింత త్వరగా అందిపుచ్చుకునే అవకాశం ఉందనేది వారి అంచనా. ప్రైవేటు సంస్థలకు అవకాశమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా విశాఖ, హైదరాబాద్‌కు చెందిన యువకులు.. స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ద్వారా దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి 2022 నవంబరు 18న విజయవంతంగా ప్రయోగించారు. అవకాశాలు అందుబాటులోకి వస్తే భారత యువత రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లి ప్రపంచ మార్కెట్లో త్వరలోనే పాగావేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 నాటికి భారత అంతరిక్ష మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు కాగా... ఇది కాస్తా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్టార్టప్స్ షురూ.. ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ 2020 నాటికి 447 బిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి ఇది 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇప్పటికే స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్విప్మెంట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న సమాచార వ్యవస్థ పునరుద్ధరణలో స్టార్ లింక్ ప్రధాన పాత్ర పోషించింది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ అంతరిక్షంలో ఏకంగా 3,271 శాటిలైట్స్‌ను ప్రయోగించింది. ఇందులో 3,236 శాటిలైట్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అయితే, భారత్‌లో కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల క్రమం ఇప్పుడే మొదలవుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగ పరిశోధనలకు మనం వెచ్చిస్తున్న మొత్తం తక్కువే. అమెరికా అంతరిక్ష బడ్జెట్ 41 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులో నాసా ప్రాజెక్టుల మీద 23.3 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు.. భారత్ అంతరిక్ష బడ్జెట్ రూ.13,700 కోట్లు మాత్రమే. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఎండ్ టు ఎండ్ సర్వీసులను ప్రైవేటు సంస్థలు పొందేందుకు వీలుగా జూన్ 2022లో ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లోనూ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. భారత్‌లో ఇప్పటికే ఇస్రో వద్ద 60 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. సమాచారం మరింత ఖచ్చితంగా.. అంతరిక్షంలో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల సమాచారాన్ని కూడా మరింత సమగ్రంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి.. ఇంట్లో కూర్చుని మనం వివిధ సినిమాలు, న్యూస్, సీరియల్స్, గేమ్స్ చూస్తున్నామంటే అందుకు కారణం శాటిలైట్సే. ఎక్కడో దూరాన ఉన్న మన వారితో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నామన్నా.. మనం ఉన్న చోటునుంచే ఎక్కడో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తున్నామన్నా.. ఎక్కడెక్కడో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఆన్లైన్లో సమావేశం కావడం, ఫలానా తేదీన, ఫలానా ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న సమాచారం కానీ.. మనం ఉన్న ప్రాంతం నుంచి ఫలానా ప్రదేశం ఎంతదూరం ఉందన్న సమాచారం కానీ మనకు వస్తోందంటే శాటిలైట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారమే కారణం. ఇక అంతరిక్షంలోకి మరిన్ని శాటిలైట్లను ప్రయోగిస్తే ఏయే లాభాలు కలుగుతాయంటే.. వాతావరణంలో వచ్చే మార్పులను మరీ సూక్ష్మంగా విశ్లేషించొచ్చు. తద్వారా ఆయా సమాచారాన్ని రైతులకు, సంస్థలకు అందించడం ద్వారా నష్టాన్ని నివారించే వీలు కలుగుతుంది. స్టూడెంట్ శాటిలైట్స్ ద్వారా మారుమూలప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో సేకరించొచ్చు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్‌కు కనెక్ట్ కాని 49 శాతం మంది ప్రజలు వీటి ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో తయారుచేసే చిన్నచిన్న శాటిలైట్లు ప్రధానపాత్ర పోషించనున్నాయి. తక్కువ ఖర్చుతో ఆయా సంస్థలు అంతరిక్ష నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇతరులకు తమ సమాచారమేదీ పొక్కకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. మన భూమిని ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునే వీలుంది. -
స్విగ్గీ బంపర్ ఆఫర్: నెటిజన్ల సెటైర్లు
సాక్షి, ముంబై: ముంబై భారీ వర్షాలలో స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేసిన అంశంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించాలని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరింది. వైరల్ వీడియోలో తమ డెలివరీ ఏజెంట్‌ను గుర్తించలేక పోయామని అతని ఆచూకీ కనిపెట్టిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామంటూ స్విగ్గీ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. స్విగ్గీమాన్ ఆన్ ఎ హార్స్ గురించి ఆచూకీ తెలిపిన వ్యక్తికి రూ. 5000 బహుమతి అంటూ స్విగ్గీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎందుకంటే అతని గురించి తెలుసుకోవాలని యావత్ దేశంతో పాటు తామూ కోరుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంబిస్తామని స్పష్టం చేసింది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు లాంటివి తమ డెలివరీ వాహనాల్లో లేవని వివరణ ఇచ్చుకుంది. దీంతో కమెంట్ల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ప్రసారమైన హిందీ టీవీ సీరియల్లోని చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇతని గురించేనా వెతికేది అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘ఏ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు అసలు గుర్రం మీద డెలివరీ ఓకేనా? కాదా? అనే పోల్ నిర్వహించాలని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఇటీవల ముంబైలో తెల్లటి గుర్రంపై స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాదాద్రి సమాచారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ పూజాధికాలు.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన. రాత్రి 9–9.30 రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం. ద్వార బంధనం. సర్వ దర్శనాలు: ఉదయం 6–7.30. మళ్లీ 10–11.45. మధ్యాహ్నం 12.30 –3. సాయంత్రం 5–7. రాత్రి 8.15–9. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వీఐపీలకు ఉదయం, సాయంత్రం కల్పించే బ్రేక్ దర్శనాలను శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దుచేసినట్లు ఈఓ గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహులను ఆదివారం 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని బస్టాండ్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు భారీగా కనిపించారు. కొండపైన గల క్యూ కాం ప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తాగునీరు, మరుగుదొడ్ల వసతులు లేకపోవడంతో భక్తు లు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది. -
యాదాద్రి సమాచారం: ఆలయ వేళల్లో మార్పులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని సూచించారు. ►సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు.. ►బ్రేక్ దర్శనాలు: ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు.. ►విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం, ద్వార బంధనం. ►ఆండాళ్ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. స్వర్ణ తాపడానికి రూ.18.71 కోట్ల విరాళాలు సాక్షి, యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాలను దేవస్థానం అధికారులు గురువారం ప్రకటించారు. బుధవారం సాయంత్రం వరకు భక్తుల నుంచి రూ.18,71,11,346 దేవస్థానం ఖాతాలో జమయ్యాయని తెలిపారు. దివ్య విమాన గోపురానికి 125 కిలోలతో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా. -
యాదాద్రి సమాచారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని బుధవారం వేకువజామున 3 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. అనంతరం విశేష పూజాధికాలు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు).. ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.30 వరకు తిరువారాధన. 7.30 నుంచి 8.15 వరకు సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. 9.15 నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన (ఆరగింపు). 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం.. ఆలయ ద్వారబంధనం. సర్వ దర్శనాలు: 6.30 నుంచి 8 గంటల వరకు. తిరిగి 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్లీ 12.45 నుంచి 4 గంటల వరకు, ఆపై సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు..చివరిగా రాత్రి 8.15 నుంచి 9.15 వరకు సర్వ దర్శనాలు. వీఐపీ బ్రేక్ దర్శనాలు: ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. 16 నుంచి నిత్య కల్యాణాలు! యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో వచ్చే నెల 16 నుంచి నిత్య కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పూజలకు సంబంధించి త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. యాదాద్రిలో ప్రసాదం కౌంటర్లు ప్రారంభం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనాన్ని ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. కల్యాణ కట్ట వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం (సీఆర్వో) వద్ద టికెట్లు తీసుకుని, కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రసాదం కౌంటర్లలో ప్రసాదం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం ప్రసాదం కొనుగోలు ద్వారా ఆలయానికి రూ.817,580 ఆదాయం వచ్చింది. – యాదగిరిగుట -
Hyderabad to Bengaluru: ఎన్‌హెచ్ 44 ఇక ‘సూపర్’ హైవే
సాక్షి, అనంతపురం: హైదరాబాద్ (తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు (కర్ణాటక)కు వెళ్లే జాతీయ రహదారి–44 సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ప్రదర్శించేలా ఈ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతమున్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలో మీటర్లు ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలోనే హైదరాబాద్ – బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చదవండి: (Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..) సర్వే పనులు ప్రారంభించాం హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నాం. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్రప్రదేశ్‌లో 251 కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య తీరనుంది. – జేఎల్ మీనా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
తప్పుడు ప్రకటనలపై గూగుల్ కీలక నిర్ణయం
లండన్: వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించకూడదని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ నిర్ణయించింది. తన ప్లాట్‌ఫామ్స్‌పై శీతోష్ణస్థితి మార్పుపై తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించడం, అలాంటి సమాచారాన్ని ఇతరులు ఆర్జనకు ఉపయోగించుకోకుండా నిలిపివేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు కూడా తాజా నిర్ణయం వర్తింస్తుందని కంపెనీ వెల్లడించింది. శాస్త్రీయాధా రితం కాని శీతోష్ణస్థితి మార్పు సమాచారాన్ని ఇతర ప్రకటనకర్తలు తమ ప్రకటనల పక్కన కనిపించాలని కోరుకోరని తెలిపింది. శీతోష్ణస్థితి మార్పు అనేది లేదని చెపుతూ సొమ్ము చేసుకునే వీడియోలను యూట్యూబ్‌లో ఉంచమని పేర్కొంది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పు లేదా గ్రీన్హౌస్ వాయువుల వల్ల ప్రమాదం అనేవి నిజాలు కావని కొందరు ప్రచారం ఆరంభించిన సంగతి తెలిసిందే! వీరు తమ వాదనలకు అనుకూలంగా వీడియోలను, ప్రకటనలను రూపొందిస్తున్నారు. ఇలాంటివాటిని నిరోధిం చాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్ టూల్స్‌ను ఉపయో గించనుంది. పర్యావరణ హితకారులైన కొన్ని విధానాలను ఇటీవల గూగుల్ ప్రవేశపెట్టింది. అయితే తాజా మార్పులను కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక సమాచారం సరైనదా? కాదా? ఎలా గూగుల్ నిర్ణయిస్తుందని వాతావరణ పరిశోధకురాలు లీసా షిప్పర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కంపెనీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు. -
Facebook:‘ఫేస్బుక్ అని కాదు.. ఫేక్‌బుక్ అని పెట్టుకో’
సరదా పోస్టులతో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సాధనం, సీరియస్ చర్చలతో ఉద్యమాలకు బీజం వేయడం.. ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడో కమర్షియల్ మోజులో జెన్యూన్ ఫన్ అనేది జంక్‌తో నిండిపోతోంది. సీరియస్ చర్చల స్థానంలో అప్రస్తుతమైన, అవసరమైన అంశాలపై వాదోపవాదనలు నడుస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అప్పుడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫేస్బుక్ .. తప్పుడు సమాచారాన్ని అందించే ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది. యస్.. ఫేస్బుక్, ఇప్పుడు ఫేక్ సమాచారంతో యూజర్‌ను తప్పుదోవ పట్టించడంలో నెంబర్ వన్‌గా ఉంది. సాధారణ పోస్టుల కంటే, వాస్తవ కథనాల కంటే ఆరు రెట్లు తప్పుడు, తప్పుడుదోవ పట్టించే సమాచారాన్ని యూజర్లు క్లిక్ చేయాల్సి వస్తోంది. ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ ఆల్ప్స్ యూనివర్సిటీ చేపట్టిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది యూజర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో.. తమను తప్పుదారి పట్టిస్తున్న ఫేస్‌బుక్‌ను.. ‘ఫేక్ బుక్’గా యూజర్లు ఈ సర్వేలో వ్యవహరించడం విశేషం. ముఖ్యంగా సీరియస్ విషయాల్లో పక్కదారి పట్టించే అంశాలపై యూజర్లు గుర్రుగా ఉన్నారు. ఇక ఫేక్ ప్రచారాల్లో సగం వాటా మీడియా సంస్థల ద్వారా, మరో 20 శాతం రాజకీయ నాయకుల వాటా ఉంటుండగా.. మిగిలిన 30 శాతం ఇతర యూజర్ల నుంచి ఫేస్బుక్ వాల్ మీదకు చేరుతోంది. క్లిక్: సోషల్ మీడియా కిరాణం! హెడ్డింగులే.. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాకు చేరాయి. ఆ మిస్ లీడ్ కంటెంట్ వల్లే యూజర్లు ఆకర్షితులు అవుతున్నారని న్యూయార్క్ యూనివర్సిటీ రీసెర్చర్లు(ఆగస్టు 2020-జనవరి 2021 మధ్య ఎన్నికల టైంలో జరిగిన సర్వే) చెప్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియాను మీడియా కంటే ముందుగా క్విక్ అప్డేట్స్ అందించే సాధనంగా యూజర్లు భావిస్తుంటారు. అదీగాక ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన కొనసాగింపు ప్రస్థానాలన్నీ సోషల్ మీడియాకే చేరుతుంటాయి. అందుకే టీవీలు, యూట్యూబ్‌లాంటి లైవ్ ప్లాట్‌ఫామ్స్ కంటే ముందు.. సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటాడు యూజర్. ఈ క్రమంలో కనిపించిన ప్రతీదాన్ని క్లిక్ చేయడం వల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్కి తెలియకుండానే ఆదరణ ఎక్కువ ఉంటోందని సర్వే ద్వారా తేల్చి చెప్పారు. అయితే ఫేస్బుక్లో మునుపటిలా హెల్తీ చర్చలు జరగకపోవడం, ఫేక్ సమాచారం వ్యాపించడం.. ఈ ప్రభావాలతోనే యూజర్ మానసిక స్థితి సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తోందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. ఫేస్బుక్ మాత్రం ఆ స్టడీని తోసిపుచ్చుతోంది. కంటెంట్ ఎలా ఉన్నా జనాలు ఎలా ఇంటెరాక్ట్ అవుతారు. నచ్చితేనే లైకులు కొట్టి, షేర్లు చేసేది అని వ్యాఖ్యానించారు ఫేస్బుక్ ప్రతినిధి జోయ్ ఓస్‌బార్నె. అంతేకాదు ఫేక్‌కంటెంట్ కట్టడికి ఫేస్బుక్ తీవ్రంగా శ్రమిస్తోందని, ప్రపంచంలోని 60 భాషల్లో 80 ఫ్యాక్ట్ చెక్టింగ్ బ్లాగులతో కలిసి అలాంటి కంటెంట్ తొలగింపు కోసం పని చేస్తోందని జోయ్ చెప్తున్నారు. చదవండి: వాట్సాప్‌లో ఎడిట్ ఫొటోల్ని వాడితే ప్రమాదమా? -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్‌పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
టీఐఎఫ్ఏసీ– ఉమెన్ సైంటిస్ట్ స్కీం
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్(టీఐఎఫ్ఏసీ).. ఉమెన్ సైంటిస్ట్ స్కీంలో ప్రవేశాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఉమెన్ సైంటిస్ట్ స్కీం–సీ: శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. అర్హతలు: మాస్టర్స్ ఇన్ సైన్స్/బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణత. వయసు: 01.04.2021 నాటికి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్ ► ఎమ్మెస్సీ(బేసిక్/అప్లయిడ్ సైన్సెస్)/బీటెక్/ఎంబీబీఎస్ తత్సమాన–నెలకు రూ.25వేలు. » ఎంఫిల్/ఎంటెక్/ఎంఫార్మా/ఎంవీఎస్సీ/తత్సమాన–నెలకు రూ.30వేలు. » పీహెచ్డీ(బేసిక్/అప్లయిడ్ సైన్సెస్/తత్సమాన)–నెలకు రూ.35వేలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021 ► వెబ్సైట్: https://tifac.org.in -
ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్..
న్యూఢిల్లీ: ఎయిరిండియాలో భారీ సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. 2011 ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. హ్యాక్ ఆయన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు సమాచారం. చదవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ -
సైబరాబాద్ పోలీస్: కోవిడ్ సేవల కోసం ప్రత్యేక వెబ్సైట్
సాక్షి, సిటీబ్యూరో( హైదరాబాద్) : కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు మరో ఆవిష్కరణ చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో covid.scsc.in పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా, వాట్సాప్ తదితరాల్లో కొవిడ్‌పై రకరకాలైన అంశాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం, ఏది కాదో తెలియక ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఆ పరిస్థితులకు covid.scsc.in వెబ్సైట్ ఓ పరిష్కారం అవుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సైట్లో వివిధ రకాలైన ఉపయుక్త సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు. సైట్లో ఉండే వివరాలివి... ► క్రిటికల్ కేర్ సర్వీసెస్: అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు ► సెల్ఫ్ కేర్ సర్వీసెస్: ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు, డాక్టర్ ఆన్ కాల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహారం అందించే సంస్థలు ► ప్రివెంటివ్ కేర్ సర్వీసెస్: సైకాలజిస్టులు/కౌన్సిలర్ల సేవలు, వాక్సినేషన్ సెంటర్ల వివరాలు, పీపీఈ కిట్స్ సరఫరాదారులు, శానిటైజేషన్ సేవలు అందించే సంస్థలు ► లేటెస్ట్ ఇన్ఫర్మేషన్: కోవిడ్ బులెటిన్స్, కీలక ఫోన్ నెంబర్లు, వివరాలు, నెట్వర్క్ గ్రూపులు ( చదవండి: కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా? ) -
దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘గ్రామంలో కులపెద్దనైన నన్ను ఇబ్బంది పెట్టిండు. నా తమ్ముడైన సర్పంచితో నోటీసులు ఇప్పించిండు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించిండు. ఇన్ని అవమానాల పాలు చేసినందుకే వామన్‌రావును చంపాలని నిర్ణయించుకున్నా’అని న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచినట్లు తెలిసింది. ‘వామన్‌రావు దంపతులు కోర్టుకు వచ్చిన విషయాన్ని లచ్చయ్య అనే వ్యక్తి కుంట శ్రీనివాస్‌కు చేరవేశాడు. ఆ వెంటనే వామన్‌రావును హత్య చేసే విషయమై సహకరించాలని కుంట శ్రీను.. చిరంజీవిని, బిట్టు శ్రీనును కోరాడు. ఇందుకు వారు ఒప్పుకున్నారు. వామన్‌రావును ఎలాగైనా చంపాలని బిట్టు శ్రీను.. కుంట శ్రీనుకు చెప్పడంతోపాటు రెండు కత్తులు, కారు సమకూర్చాడు. అనంతరం బిట్టు శ్రీను సీన్లో నుంచి వెళ్లిపోయాడు. హత్య తర్వా త కుంట శ్రీను కారులో పరారవుతూ బిట్టు శ్రీను కు ఫోన్ చేస్తే.. మంథనిలో ఉండొద్దని అతడికి సూచించాడు. దాంతో సుందిళ్ల బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తూ బ్యారేజీ మీద ఆగి బట్టలు, కత్తులు కట్ట కట్టి, దానికి బండ కట్టి బ్యారేజీలో వేశారు. ఫోన్లు కూడా బ్యారేజీలో పడేశారు. డ్రైవర్ చిరంజీవి తన ఫోన్లో సిమ్ విరిచి కొత్తది వేసుకున్నాడు’అని రిమాండ్ రిపోర్టులో పోలీసు లు పొందుపరిచినట్లు సమాచారం. లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారని తెలిసింది. చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం) -
చిటికెలో చిట్టా
అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఏ స్థానిక సంస్థ అయినా సమర్థంగా పనిచేయాలన్నా, ప్రజలకు ఉత్తమ సదుపాయాలు కల్పించాలన్నా ఎప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉండాలి. గ్రేటర్లో కోటిమందికి వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ వద్ద ఇలాంటి సమాచారం లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతోంది. సమస్త సేవలన్నింటినీ వెనువెంటనే అందించేందుకు జీఐఎస్ ఆధారిత, ప్రాదేశిక మ్యాప్‌లతో కూడిన అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. సాక్షి, హైదరాబాద్: అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టం కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణకు ఉన్నత స్థాయిలో స్పెషలాఫీసర్‌ను నియమించనున్నారు. ఈ సిస్టం అందుబాటులోకి వస్తే జీఐఎస్ మ్యాపింగ్‌తో సహా ప్రతి ఆస్తికి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. నగర ప్రజలకు సేవలందించే వివిధ విభాగాలను సమన్వయం చేసుకొని దీన్ని రూపొందిస్తారు. టౌన్‌ప్లానింగ్, ఐటీ విభాగాలు ఇందులో ముఖ్యభూమిక వహించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే, ఏ సమాచారం కావాలన్నా చిటికెలో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక రోడ్డుకు సంబంధించిన సమాచారమే కావాలంటే.. దానిని ఎప్పుడు నిర్మించారు? దీనికోసం ఎన్ని ఆస్తులు సేకరించారు? వంటి వివరాలు సహా పూర్తి సమాచారం తెలుస్తుంది. అన్ని విభాగాలకు సంబంధించిన తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గానే పోర్టల్‌లోకి చేరతాయి. తద్వారా అత్యంత తాజా సమాచారం తెలుస్తుంది. వివిధ విభాగాలు.. ⇔ ఐటీ, ఇంజినీరింగ్, ప్రాజెక్టులు, టౌన్‌ప్లానింగ్, బయోడైవర్సిటీ, రవాణా, ఫైనాన్స్, రెవెన్యూ.. అన్ని విభాగాల్లో జరిగే పనులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. ⇔ తద్వారా నిర్ణీత సమయంలో ఎన్ని భవనాలను అనుమతులిచ్చారు.. ఎంత ఆస్తిపన్ను పెరిగింది.. వంటి వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. ⇔ అంతేకాదు.. మలేరియా, డెంగీ వంటి కేసులు ఏ ప్రాంతంలో ఏ నెలలో ఎన్ని ఉన్నాయి వంటివి కూడా తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకునే వీలుంది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం నుంచి జోన్లు, సర్కిళ్ల వారీగా, మొత్తం నగరానికి సంబంధించి స్లమ్లెన్ని.. వాటిల్లో నివసిస్తున్నవారెందరు, ట్రాఫిక్ ఐలాండ్లు, ఓపెన్‌స్పేస్‌లు, జీహెచ్ఎంసీ మార్కెట్లు, ఎస్టేట్స్ దుకాణాలు, శ్మశానవాటికలు, ప్లేగ్రౌండ్స్, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు, రోజుకు వెలువడే చెత్త, చెత్త రవాణా వాహనాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటోలు , ఫాగింగ్ మిషన్లు.. నగరంలో నెలవారీ జననాలు, మరణాలు.. ప్రార్థనాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు.. ఇలా సమస్త సమచారం అందుబాటులో ఉంటుంది. తద్వారా ఏ పని చేయాలన్నా అందుకు సంబంధించిన వనరులు, సమాచారం సిద్ధంగా ఉంటుంది. తద్వారా నిర్వహణ సామర్ధ్యం పెరుగుతుంది. కీలకంగా డేటాబేస్.. ఎప్పటికప్పుడు అప్డేట్.. ఆయా విభాగాల వారీగా ప్రస్తుతమున్న వనరులు, సిబ్బంది.. అది నిర్వహించే పనులు, పనిచేస్తున్నవారు, సంస్థాగత నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, వర్క్‌ఫ్లో, సమస్యల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు భవిష్యత్ ప్రణాళికలు, వాటిని పూర్తిచేయాల్సిన సమయం, అందుకు అవసరమైన సమాచారంతోనూ సమాంతర వ్యవస్థ పని చేస్తుందని, అన్నింటికీ డేటాబేస్ కీలకంగా ఉంటుందని, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తాజా పరిస్థితి అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఐటీ పరిభాషలో.. ఐటీ పరిభాషలో మానిటరింగ్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం, లేయర్ ఆపరేషన్స్, డేటా అప్డేట్, ఆటోమేటిక్ డాక్యుమెంట్ అడ్జస్ట్మెంట్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ, ఈ– అప్లికేషన్స్, తదితరమైనవి ముఖ్య విభాగాలుగా ఈ సిస్టమ్ పని చేయనుంది. -
ట్విట్టర్‌కు గట్టి మనిషి
జేమ్స్ బాండ్ ఛేదిస్తాడు. రింకీ సేథీ బ్లాక్ చేస్తారు. బాండ్ కూపీకి వెళ్తాడు. రింకీ లోపలికే రానివ్వరు. ట్విట్టర్‌కి ఇప్పుడామె.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. నువ్వుగింజ సామెతల్ని తీసి పడేయండి. ఆవలిస్తే హ్యాకర్స్ పేగులు అంతే సంగతులు!మెడలో వేస్కుంటారు రింకీ. ఎంత పెద్ద బాండ్ హ్యాకర్స్ అయినా. బయటికి వెళ్తుంటే ఆడవాళ్లకు మగవాళ్లు సెక్యూరిటీగా ఉండటం ఇప్పటికీ ఉంది. తండ్రి, అన్న, తమ్ముడు, భర్త ఎవరో ఒకరు భద్రంగా వెంట ఉంటారు. అయితే బయటి వెళ్లకూడని అత్యంత గోప్యమైన సమాచారానికి భద్రత కోసం మాత్రం ఈ డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్నే చీఫ్లుగా ఎంపిక చేసుకుంటున్నాయి! కీలకమైన విషయాలను బయటికి పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషులకన్నా సమర్థులని, విశ్వసనీయులని మల్టీనేషనల్ సంస్థలు భావిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా జెయింట్ అయిన ‘ట్విట్టర్’ తన చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండేందుకు శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారతీయురాలు రింకీ సేథీని ఆహ్వానించింది! ఒక మామూలు కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉండటం వేరు. హ్యాకర్ల కళ్లన్నీ పాస్‌వర్డ్‌ల కోసం నిరంతరం బొరియలు తవ్వుతుండే ట్విట్టర్ వంటి కంపెనీకి భద్రతగా చేతులు అడ్డుపెట్టడం వేరు. ‘ఆడవాళ్ల నోట్లో ఆవగింజ నానదు’ అనే సామెత ఉంది. దాన్నిక పక్కన పెట్టేయొచ్చు. ఆవలిస్తే హ్యాకర్స్ పేగులు లెక్కపెట్టి మెడలో వేసుకుంటారు రింకీ. మునుపు ఆమె ఐబీఎం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌గా, కాలిఫోర్నియాలోని కంప్యూటర్ స్టోరేజ్ కంపెనీ ‘రూబ్రిక్’లో సీనియర్ ఆఫీసర్‌గా పని చేశారు. రింకీ సేథీని తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ఎంతో ఉత్తేజపూర్వకంగా ప్రకటించింది. ‘‘రింకీ మా ఇన్ఫో సెక్షన్ టీమ్‌ని లీడ్ చేస్తారు. మా కస్టమర్ల డేటాకు, వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణగా ఉంటారు’’ అని రెండంటే రెండే లైన్లలో ఆమె సామర్థ్యాల పట్ల తమ నమ్మకాన్ని వెలిబుచ్చింది. ఐ.బి.ఎం., రూబ్రిక్లకు మాత్రమే కాదు, మిగతా ఫార్చూన్ 500 కంపెనీలైన పి.జి. అండ్ ఇ, వాల్‌మార్ట్ డాట్ కామ్, ఈబే సంస్థల కోసం కూడా గతంలో వినూత్నమైన ఆన్లైన్ సెక్యూరిటీ విధాలను అభివృద్ధిపరచి ఇచ్చారు రింకీ. 2010లో ప్రతిష్టాత్మకమైన ‘సీఎస్ఓ మ్యాగజీన్ అండ్ ఎగ్జికూటివ్ ఉమెన్స్ ఫోరమ్’ రింకీని ‘వన్ టు వాచ్’ అవార్డుతో సత్కరించింది. ఈబేలో ఆమె నాయకత్వం వహించిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బృందాన్ని మరో ప్రసిద్ధ మీడియా మ్యాగజీన్ ఎస్.సి.. టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపులను అలా ఉంచితే, ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సెక్యూర్ వరల్డ్’ సలహా మండలిలో కూడా రింకీ సభ్యురాలిగా ఉండి వచ్చారు. ఆమె పని చేసిన సంస్థల్లానే, ఆమె చదివొచ్చిన యూనివర్శిటీలు అన్నీ కూడా అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగినవే. కాపెల్లా, స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థులలో రింకీ సేథీ కూడా ఒకరు! 2019 డిసెంబర్ నుంచి సెక్యూరిటీ చీఫ్ లేకుండానే ట్విట్టర్ పనిచేస్తోంది. ఆ బాధ్యతకు రింకీ వంటి ప్రజ్ఞ గల టెకీని అన్వేషించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడన్, అమెరికన్ మిలియనీర్ ఎలాన్ మస్క్, అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దేషియన్, ఇంకా 150 మంది ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయి, వారి ప్రేమయం లేకుండా వారి పేరున డిజిటల్ విరాళాల సేకరణ మొదలైంది! ప్రముఖుల రహస్య సమాచారం ఇంత ఘోరంగా లీక్ అవడం ట్విట్టర్‌కు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటివి జరక్కుండా ఉండేందుకు పురుష అభ్యర్థులు ఎందరు ముందుకు వచ్చినా, రింకీని మాత్రమే తన సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఎంపిక చేసుకుంది ట్విట్టర్! పద్నాలుగేళ్ల వయసులో రింకీ తొలిసారి తన పర్సనల్ కంప్యూటర్లోని చాట్లను తల్లిదండ్రులకు కనిపించకుండా చేసేందుకు ఒక విధానాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత పూర్తిగా ఆమె ఆ లైన్లోకే వెళ్లిపోయారు. డేటాను దుర్భేద్యంగా ఉంచే కెరీర్లోకి. న్యూ నార్మల్! భారతీయ మహిళల నాయకత్వ సామర్థ్యాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం అనేది ఇప్పుడొక సాధారణ విశేషంగా (న్యూ నార్మల్) కనిపిస్తోంది! అనేక రంగాల అత్యున్నత స్థాయులలో మన మహిళల ప్రతిభా సామర్థ్యాలు మన్నన పొందుతున్నాయి. 2019లో ప్రపంచ బ్యాంకు తన ఎండీగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌ని నియమించుకుంది. గ్యాప్ ఇంక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సోనియా శింగాల్ పదవీబాధ్యతలు చేపట్టారు. 2018లో ‘పులిట్జర్ సెంటర్’కు ఇందిరా లక్ష్మణన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యారు. గతవారమే మనాలీ దేశాయ్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ సోషియాలజీ విభాగం హెడ్‌గా వెళ్లారు. -
ఎస్బీఐ పోర్టల్‌లో రుణ పునర్వ్యవస్థీకరణ సమాచారం
ముంబై: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణ గ్రహీతలకూ తమ రుణాలను ఒక్కసారి పునర్వ్యవస్థీకరించుకునే సదుపాయాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. రిటైల్ కస్టమర్లు తమ రుణ పునర్వ్యవస్థీకరణకు తాము అర్హులా, కాదా తెలుసుకునే సదుపాయాన్ని ఎస్బీఐ పోర్టల్‌లో ఏర్పాటు చేసినట్టు బ్యాంకు ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు. రుణ పునర్ వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకు శాఖలను సందర్శించడానికి బదులుగా ఆన్లైన్లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకు శాఖకు వెళితే సరిపోతుందన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటే, మిగిలిన చెల్లింపుల కాలానికి అదనంగా 0.35 శాతం వార్షిక వడ్డీని రుణదాతలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకు పోర్టల్‌ను 3,500 మంది సందర్శించగా, వారిలో 111 మంది రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్నవారిగా చెప్పారు. రిస్క్‌కు విముఖం కాదు.. డిమాండ్ లేదంతే.. బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు వెనకాడవని, అదే సమయంలో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాతి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన వివేకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రజనీష్ మాట్లాడారు. -
నాయిన.. ఎట్లున్నడో?
సాక్షి, సిటీబ్యూరో: ‘మాది బోడుప్పల్ కాకతీయ కాలనీ. రెండు వారాల క్రితం మా నాన్నకు కోవిడ్ నిర్ధారణ అయింది. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేక ఆయనను అర్ధరాత్రి అత్యవసర పరిస్థితుల్లో గాంధీ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లాం. వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఫోన్ చేద్దామంటే వారి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. ఆస్పత్రి ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేసి అడిగితే...ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తే.. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పోయిన రోజు పోయిండు..మళ్లీ మాటా ముచ్చటా లేదు. ఉండబట్టలేక లోనికి వెళ్లేందుకు యత్నించా. ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అదేమంటే నాన్‌కోవిడ్ బాధితులకు ఆస్పత్రిలో అనుమతి లేదని స్పష్టం చేశారు. కనీసం మా నాన్న ఎలా ఉన్నాడో..? తెలుసుకుని చెప్పమని వేడుకున్నా. అయినా స్పందన లేదు’ అని బాధితుడి కుమార్తె సరస్వతి సహా ఇతర బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సరస్వతి కుటుంబ సభ్యులు, బంధువులకే కాదు కోవిడ్‌తో గాంధీలో చికిత్స పొందుతున్న అనేక మంది కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఇదే అనుభవం ఎదురవుతుంది. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతా..అయోమయం 1890 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 806 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలోని వెంటిలేటర్‌పై 178 మంది చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్‌పై 410 మంది చికిత్స పొందుతున్నారు. మరో 218 మంది సాధారణ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్ కావడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సహాయంగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను మినహా ఇతరులను అనుమతించడం లేదు. వీరిలో చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి సెల్ఫోన్లు లేవు. ఒక వేళ ఉన్నా..మాట్లాడలేని స్థితి. బాధితులకు ఎలాంటి వైద్య సహాయం అందుతుంది? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? చికిత్సకు ఏమైనా స్పందిస్తున్నారా? వేళకు ఆహారం తీసుకుంటున్నారా? అసలు వారి ఆరోగ్యం ఎలా ఉంది? వంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కో ఆర్డినేటర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాక పోవడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు ఉన్నా...వారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వివరించడం లేదు. కుటుంబ సభ్యులు నేరుగా ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని భావించే వారిని పోలీసులు లోనికి అనుమతించక..లోపల ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి తెలియక..బయట ఉన్న బంధువులు ఆందోళన చెందుతున్నారు. అదే కార్పొరేట్ ఆస్పత్రిలోనైతే... ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రెండు పూటలా కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు పిలుస్తుంటాయి. రోగుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలు, వాడుతున్న మందులు, రోగి స్పందిస్తున్న తీరు...చికిత్సలో ఎదురవుతున్న ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు కుటుంబ స భ్యులకు వివరిస్తుంటాయి. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో కౌన్సిలింగ్ కాదు కదా..! కనీసం రోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దినట్లు ప్రభుత్వం చెప్పుతుంది. గాంధీ సహా ఒక్కో ఆస్పత్రిలో వంద మందికిపైగా పేషంట్ కేర్ ప్రొవైడర్లను నియమించినట్లు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వీరెవరూ కన్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వివరాల ఆరాపై ‘మర్కజ్’ వెళ్లొచ్చిన వారి అపోహలు
సాక్షి, హైదరాబాద్: తబ్లిగీ జమాత్ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాల సేకరణ పోలీసులకు కష్టంగా మారుతోంది. ఎన్నార్సీ సర్వే జరుగుతోందన్న అపోహతో చిరునామాలు తీసుకునేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్ఆర్సీ కోసమే అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లకపోతే దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తమ ఆధార్ కార్డులు, ఇంటి నెంబర్లు మీకెందుకు అని సతాయిస్తున్నారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు సమాచారమిస్తున్నారు. వారు రంగ ప్రవేశం చేసి ఒప్పించే సరికి తలప్రాణం తోకకు వస్తోందని వాపోతున్నారు. తెలంగాణ నుంచి 1,030 మంది ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమాలకు వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో ఇంకా 100 మందికి పైగా ఉన్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదు. మరోవైపు శుక్రవారం ఒకేరోజు 75 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో పోలీసులు వారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు.. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు. అందుకే, పోలీసులకు అందరి వివరాలు తెలియడం లేదు. కొందరు సమూహాలుగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా వచ్చారు. ఇలాంటి వారి ఆచూకీ సులభంగా కనిపెట్టగలుగుతున్న పోలీసులు.. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లినవారి వివరాలు కనుక్కోవడం గగనంగా మారిందంటున్నారు. ఇలాంటి వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. క్వారంటైన్‌కు వెళ్లకుండా విధులకు హాజరవుతుండటంతో సెక్రటేరియట్, సింగరేణిలో కరోనా ఇదే పద్థతిలో విస్తరించిన సంగతి తెలిసిందే. తాజాగా నల్లగొండలో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతని వద్ద పాఠాలు విన్న 60 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారాన్ని దాచిపెట్టిన వారిపై కేసులు పెడుతామని హెచ్చరించినా కొందరిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన వారంతా.. లాక్డౌన్ విధించాక నేరుగా రాష్ట్రానికి రాలేదు. మధ్యలో పలు ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఫలితంగా ఆలస్యంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిరోజూ బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అధికశాతం వీరే కావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. స్వచ్ఛందంగా ముందుకు రండి.. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు అందించి సహకరించాలని పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారిని..వారి కుటుంబీకుల ప్రాణాలను ఆపదలోకి నెట్టవద్దని సూచిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి వివరాలు డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పలు చైతన్య కార్యక్రమాల ద్వారా వివరించే యత్నం చేస్తున్నారు. -
చైనా దాస్తోంది: పాంపియో
వాషింగ్టన్: కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాస్తోందని జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీ–7 దేశాల భేటీలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని దాచేందుకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని సమావేశం అనంతరం ఆయన ఆరోపించారు. (చైనాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ !) చదవండి: బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా -
యూట్యూబ్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: నిరాధార వార్తలను అరికట్టడమే లక్ష్యంగా, ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేయడాన్ని యూట్యూబ్‌లో నిషేధించనున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది. తాము నియమించిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లు ఆయా వీడియోలను నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది. ‘వార్తా సమాచారానికి విశ్వసనీయ సోర్స్‌గా యూట్యూబ్‌ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కసరత్తు ముమ్మరం చేశాం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా మలిచేందుకు కృషి చేస్తున్నామ’ని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్ పేర్కొన్నారు. ఆన్లైన్ వివక్ష తొలగించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు దుర్వినియోగంతో వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు గత నెలలో ఫేస్బుక్ ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నామని ట్విటర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: యూట్యూబ్ డబ్బుతో 25 కోట్ల భవంతి) -
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ‘సింగరేణి’ సమాచారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బోగీలకు వెలువల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన సమాచారం కనిపించనుంది. ఆ కంపెనీ ఆవిర్భావం, ప్రత్యేకతలు, విశిష్టతలు.. ఇలా సమస్త సమాచారం ఒక్కో బోగీపై ఒక్కో రకంగా కనిపిస్తుంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏర్పాటు జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు బొగ్గు సరఫరా రూపంలోనే వస్తుంది. కానీ ఆ కంపెనీ మాత్రం ఇతరత్రా మార్గాల్లో అడ్వర్టైజ్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రధాన ఆదాయాన్ని అందించే సంస్థలు రైళ్లపై ప్రకటనలు అతికిస్తే రైల్వేకు ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. ఇప్పటికే రెండు జోన్లు వీటిని అమలులో పెట్టాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన తొలిప్రయత్నంగా సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది పాటు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బోగీలపై ఆ కంపెనీ వినాయిల్ రాపింగ్ ద్వారా ప్రకటనలు ప్రదర్శిస్తుంది. ఇందుకు రైల్వేకు సింగరేణి రూ.50 లక్షలు చెల్లిస్తుంది. 8 రాష్ట్రాల మీదుగా దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ఈ ప్రకటనలతో తమ కంపెనీకి దేశవ్యాప్తంగా గుర్తింపు పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని కోల్‌మైన్స్ కంపెనీలతో ఉన్న పోటీలో ప్రయోజనం ఉంటుందని సింగరేణి భావిస్తోంది. సింగరేణి ప్రకటనలతో కూడిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తొలి ప్రయాణం శుక్రవారం మొదలైంది. -
సైబర్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: కీలకమైన సమాచార భద్రతకు సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో... సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 2018లో ఈ విభాగం వార్షికంగా 40 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) నివేదిక వెల్లడించింది. డేటా ఉల్లంఘనలు జరిగితే ఎదురయ్యే ఆర్థిక పరిణామాలను తట్టుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపింది. భారత మార్కెట్ ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉందని, 2018 నాటికి 40% వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2017 నాటికి 4.2 బిలియన్ డాలర్లు (రూ.29,400కోట్లు) ఉండగా, ఏటా 27 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తోందని పేర్కొంది. -
అవును..అక్కడ అన్నీ ఐరావతాలే
సాక్షి, ఒంగోలు సిటీ: ఎన్నికల వేళ పేరుకే మీడియా కేంద్రం. ఇక్కడ సమాచారమే మృగ్యం. ఆ కేంద్రంలో అన్నీ తెల్ల ఏనుగులే. పని చేసేదే లేదు. వాటికి మొక్కినా ఫలితం శూన్యం అన్నది తేటతెల్లం. మీడియా కేంద్రంలోని ఐరావతాల వల్ల జిల్లా పౌరులకు ఎన్నికల వేళ అందాల్సిన సమాచారం వస్తేనా. యథారాజా తథాప్రజా అన్నట్లుగా సిబ్బంది పనితీరు ఉంది. జిల్లా కేంద్రంలో ఈ మీడియా పాయింట్ పేరుకు మాత్రమే. తాత్కాలికంగా మీడియా సెంటర్ బోర్డు. దానికి ఆనుకొని నిక్నెట్ శాఖ బోర్డు కూడా ఉంటుంది. ఇంతకీ ఈ కార్యాలయంలో ఏ విభాగం నడుస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంతా అయోమయం. జిల్లా ఏర్పడిన తర్వాత మీడియా కేంద్రం నిర్వహణలో ఇంతటి లోపాలు ఎప్పుడూ ఎదురుకాలేదు. జిల్లా పరిపాలనా కేంద్రం ప్రకాశం భవన్‌లోకి వచ్చేటప్పుడు దక్షిణం వైపు ఉన్న ప్రజాఫిర్యాదుల విభాగం గదిలో ప్రత్యేకంగా మీడియా కేంద్రం నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇక్కడ మీడియా పాయింట్ ఉంటుంది. టెలిఫోన్, కంప్యూటర్, ఫ్యాక్స్ సదుపాయం ప్రత్యేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ అభ్యర్థులు నామినేషను వేసి ఇక్కడ మీడియాతో మాట్లాడేవారు. అక్కడి నుంచే ఫొటోలు, ఇతర సమాచారాన్ని చేరవేసుకొనే సదుపాయం ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో అందరూ భావిస్తున్నట్లుగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అవసరం లేదనుకున్నారేమో..ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారన్న విమర్శలున్నాయి. పై అంతస్తులో మీడియా కేంద్రం ప్రకాశం భవన్ మొదట్లోనే ఉండే మీడియా కేంద్రం ఈ ఎన్నికల సందర్భంగా లేకుండా పోయింది. ఇక్కడ అభ్యర్థులకు నామినేషన్ ఫారాలు ఇచ్చే విభాగంగా మార్చేశారు. ఇంతకీ మీడియా కేంద్రం ఎక్కడ పెట్టారంటే .. ప్రకాశం భవన్ టాప్‌ఫ్లోర్‌లోని నిక్నెట్ కేంద్ర కంప్యూటర్ విభాగంలో ఏర్పాటు చేశారు. అక్కడికి మీడియా వెళ్లాలంటే ప్రకాశం భవన్ ఇన్, అవుట్ గేట్ల వద్దే అనుమతి లేదంటూ నిలిపివేస్తున్నారు. ఎన్నికల వేళ కదలరు..మెదలరు ఎన్నికల వేళ అధికారులు కదలడం లేదు. ఏ సమాచారం అడిగినా సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి స్పందన లేదంటున్నారు. ఎన్నికల వేళ వచ్చే ఫిర్యాదులు, ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఉత్తర్వులు, ఓటర్లను చైతన్య పరిచే ఉత్తర్వుల ఇతర సమాచారం ఏది అడిగినా స్పందన కొరవడుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ రెగ్యులర్ ఐఎన్పీఆర్ ఏడీ లేకపోవడమే ప్రధాన సమస్య. డీపీఆర్వోకే ఏడీ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. కందుకూరు, మార్కాపురంలోనూ డివిజనల్ పీఆర్వోలు లేరు. ఇద్దరు ఏపీఆర్వోలు జిల్లా కేంద్రంలో ఉన్నారు. రెగ్యులర్ ఏడీ లేరనే డ్వామా పీడీని కోఆర్డినేటింగ్ అధికారిగా నియమించారు. ఆయనతోనూ వీరు సక్రమంగా సహకరించే పరిస్థితి లేదు. ఎన్నికలకు సంబంధించిన నిత్యం లావాదేవీలు పరిశీలించేందుకు ప్రధానంగా 23 బృందాలను నియమించారు. ఈ బృందాలకు కోఆర్డినేటింగ్ అధికారులను నియమించారు. వీరి నుంచి సమాచారాన్ని సేకరించి మీడియాకు అందజేయాలి. అదే సక్రమంగా జరగడం లేదు. సమాచార సేకరణ ప్రయాసే జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నుంచి నామినేషన్లు ఇతర సమాచారాన్ని గడువు ముగిసిన తర్వాత వేగంగా సేకరించి ఇవ్వాలి. నామినేషన్లను వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు ఇతర సమాచారాన్ని రోజు గడినా ఇంకా ఆర్వోల వద్ద నుంచి రాలేదన్న జవాబు చెబుతున్నారు. మీడియా కేంద్రంలో తగిన వసతి ఉంటే అక్కడికి వచ్చి సేకరించుకొనే వీలుంది. పేరుకు మీడియా కేంద్రం అయినా అక్కడ పాత్రికేయులకు, మీడియా విలేకర్లకు వసతి లేదు. వారికి సదుపాయం కల్పించలేదు. అధికారులను ఏ సమాచారం అడిగిన తెల్లముఖం వేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు వారు మీడియాతో మాట్లాడాలంటే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయలేదు. అదేమంటే అధికారులు నోరుమెదపరు. ఐదు రోజులు గా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు రిటర్నింగ్ అధికా రుల కార్యాలయాలకు వంద మీటర్ల దూరం తర్వాత మాత్రమే మీడియా పాయింట్‌ను అనుమతించారు. అభ్యర్థులు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడాలి. నడి బజారులో ఈ కేంద్రం తాత్కాలికంగా మీడియా నిర్వహించుకోవడం గమనార్హం. మీడియా పాయింట్ సమగ్రంగా లేకపోవడం ఇతర సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. -
చంపావత్ ప్రశ్నల భవంతి
ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే చంపావత్ జిల్లా గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవలసి వస్తోంది! మాధవ్ శింగరాజు ‘ఫైనాన్స్ కమిషన్’ అనే మాట ఎంచేతో భయంగొల్పేలా ఉంటుంది. ఇంతకన్నా పోలీస్ కమిషన్ కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందేమో. ఉంటుందేమో కానీ, భారత రాజ్యాంగంలో పోలీస్ కమిషన్ అనేది లేదు. ఉంటే అది కూడా భయమో, అభయమో గొల్పుతూ ఉండేది ఇప్పటికి.ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నది పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్. కమిషన్ ఐదేళ్ల కాలపరిమితిలో ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నాయి. 2020 వరకు. అయినప్పటికీ రెండేళ్ల క్రితమే 2017లో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా రెడీ అయిపోయింది. 2020 నుంచి 25 వరకు. ఆ కమిషన్‌కు ఛైర్మన్ ఎన్.కె.సింగ్. పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ తరఫున వచ్చిన కొంతమంది అధికారులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు! మొదట వాళ్లు ఆ జిల్లాలోని ఘర్చమ్ గ్రామానికి వెళ్లారు. వాళ్లకేదో ఇన్ఫర్మేషన్ అందింది.. పంచాయతీ నిధులతో అక్కడ కొత్తగా కట్టిన ఒక భవంతి లెక్కల్లో అవకతవకలు జరిగాయని. ఆ నిధులు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులే. పని సక్రమంగానే జరిగింది. అయితే ఆ భవంతిని వినియోగిస్తున్న తీరే సక్రమంగా లేదు! లేకపోవడమే కాదు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా కూడా ఉంది. భవంతి లోపలంతా మహిళలు ఉన్నారు! వాళ్లేమీ డ్రాక్వా మహిళలు, స్వయం సహాయ బృందాల మహిళలు కాదు. రుతుక్రమంలో ఉన్న మహిళలు! కేంద్ర నిధులతో పంచాయతీ కట్టించిన భవనంలో వీళ్లు ఉండడం ఏంటి? ఇది రెండో ప్రశ్న. ఊళ్లో రుతుక్రమంలో ఉన్న మహిళలందర్నీ ఇలా ఊరికి దూరంగా ఉంచడం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. మరి మొదటి ప్రశ్న ఏమిటి? రుతుక్రమంలో ఉన్న మహిళను అసలు ఇంటి బయట ఉంచడం ఏమిటి? ప్రశ్నల క్రమం ఎలా ఉన్నా మహిళల్ని ఇలా ఇంటికి దూరంగా , ఊరికి దూరంగా, రాజ్యాంగ హక్కుకు దూరంగా ఉంచడం సక్రమం కాదు. భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు కొందరు జిల్లా మేజిస్ట్రేట్ రణ్‌బీర్ చౌహాన్ దృష్టికి తెచ్చినప్పుడు, ఆ భవనాన్ని ‘బహిష్టు కేంద్రం’లా వినియోగిస్తున్నట్లు బయటపడింది. చౌహాన్ నివ్వెరపోయారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ‘పంచాయతీ నిధుల బహిష్టు కేంద్రాలు’ ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఉన్నదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఉండేందుకే అవకాశం ఉందనిపిస్తోంది.చంపావత్ జిల్లా.. భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్ గ్రామాల్లో ‘నెలసరి పాక’ల (పీరియడ్ హట్స్) ఆచారం ఉంది. రుతుక్రమం వచ్చిన మహిళల్ని ఆ ఐదు రోజులూ వాటిలో ఉంచుతారు. ఆ అనాగరిక ఆచారానికి సరిహద్దుకు ఇవతల ఉన్న మన గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయనేందుకు నిదర్శనమే ఇప్పుడు బయట పడిన ఘర్చమ్ గ్రామంలోని బహిష్టు కేంద్రం. ఇటీవలే నేపాల్‌లోని బజురా జిల్లాలోని ఒక గ్రామంలో అంబా బొహారా (35), పన్నెండు, తొమ్మిదేళ్ల వయసు గల ఆమె కొడుకులిద్దరు నిద్రిస్తున్నప్పుడు నెలసరి పాకకు నిప్పంటుకుని ఊపిరి ఆడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు వార్తలు వ చ్చాయి. గత నవంబర్‌లో వచ్చిన గజ తుఫాన్లో తమిళనాడులో విజయలక్ష్మి అనే పన్నెండేళ్ల బాలిక నెలసరి పాకలో ఉన్నప్పుడు ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపడి చనిపోయింది. ఆమె తల్లి గాయపడింది. ఇంకా ఇలాంటి వార్తలు మిగతా రాష్ట్రాల నుంచీ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి కనుక ఆడపిల్లల విషయంలో నేపాలైనా, భారత్ అయినా, ఇంకో దేశమైనా ఒకటే అనుకోవాలి. ఇంకొకటి కూడా అనుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవాలి. చంపావత్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ సంగతి తెలిసినప్పుడు మొదట ఆయన అన్నమాట.. ‘ఇదేంటీ!’ అని. రెండో మాట.. ‘అలా ఉంచేశారా, ప్యాడ్స్ ఏమైనా ఇచ్చారా?’ అని. మంచి మాట. అరవై ఏడేళ్లుగా ఫైనాన్స్ కమిషన్ దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు లెక్కలు చూస్తోంది. మహిళా సంక్షేమం అన్నది కమిషన్ పరిధిలోకి రాని విషయమే అయినా, అభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే, స్త్రీల జీవితాలను దుర్భరం చేసే దురాచారాలను పాటిస్తున్న గ్రామాలకు నిధులను తగ్గిస్తాం అన్న భయం పెట్టొచ్చు. డబ్బు ఇచ్చే కాదు, డబ్బును ఇవ్వకుండా కూడా అభివృద్ధిని సాధించవచ్చు.. స్త్రీ సంక్షేమం కూడా దేశాభివృద్ధిలో ఒక భాగం అనుకుంటే. -
స్థానిక సమాచారం కోసం గూగుల్ ‘నైబర్లీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానిక సమాచారం కోసం చాలా సందర్భాల్లో ఇంటిదగ్గర వారిని సంప్రదిస్తాం. అదే వేరే ప్రాంతానికి వెళ్తే రోడ్డునపోయే అపరిచితులను అడగాల్సి వస్తుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో అడుగు ముందుకేసి ‘నైబర్లీ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఓపెన్ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఖాతా ఉన్న బ్యాంకు ఎస్బీఐ అనుకుందాం. ఏటీఎంకు వెళ్లాల్సి వస్తే.. ఎస్ఎంఎస్ లేదా వాయిస్ రూపంలో ‘దగ్గరలో ఎస్బీఐ ఏటీఎం ఎక్కడ ఉంది’ అని అడిగితే చాలు. నైబర్లీ యాప్‌ను వాడుతున్న అక్కడి ప్రాంతం వారు ఎస్ఎంఎస్ రూపంలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తారు. బాగా స్పందించే వారికి టాప్ నైబర్ స్టేటస్ ఇస్తారు. నోటిఫికేషన్ల పరిమితిని యూజర్లు సెట్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా త్వరలో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైజాగ్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. నేటి (శనివారం) నుంచి హైదరాబాద్‌లో పనిచేయనుంది. రెండు వారాల్లో దేశవ్యాప్తంగా నైబర్లీ సేవలను అందుకోవచ్చని గూగుల్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ బెన్ ఫోనర్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నైబర్లీ యాప్‌ను భారత మార్కెట్ కోసం దేశీయంగా అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఇంగ్లిషుతోపాటు తెలుగు వంటి ఎనిమిది భారతీయ భాషల్లో యాప్ పనిచేస్తుంది. అవసరమైతే మరిన్ని స్థానిక భాషలను జోడిస్తాం. 15 లక్షల మందికిపైగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. భారతీయులది స్నేహపూర్వక మనస్తత్వం కాబట్టే తొలుత నైబర్లీని ఇక్కడ అమలులోకి తెచ్చాం. ఇతర దేశాలకు ఈ యాప్‌ను పరిచయం చేసే అవకాశమూ ఉంది’ అని వివరించారు. -
ఖాళీ కప్పు
‘సర్ ఉన్నారా?’’.. పెద్ద బంగళాలా కనిపిస్తున్న ఇంటి ముందు ఆగి, గేటు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని అడిగాడు ఆ యువకుడు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇల్లు అది. రెండు రోజులుగా అతడు ఆ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. అది మూడో రోజు. ‘‘సర్, ఇంటి దగ్గర ఎవర్నీ కలవరు. ఆఫీస్‌కి వెళ్లి కలువు’’ అన్నాడు గార్డ్. ఆ మాటకు ఆ యువకుడి చేతి నరాలు బిగుసుకున్నాయి. ‘‘సర్.. ఆఫీసులో కలవడం లేదు. అందుకే ఇంటికొస్తున్నాను’’ అన్నాడు అదే రిథమ్‌లో. ఇవాళ ఎలాగైనా కమిషనర్ని కలిసే తీరాలని నిశ్చయించుకున్నాడు అతడు. ఉదయాన్నే, ఏడు గంటలైనా కాకముందే కమిషనర్ ఇంటికి వచ్చేశాడు! ‘‘సర్ని కలవనివ్వకపోతే, ఇక ఎప్పటికీ ఇక్కడి నుంచి కదలను’’.. అంటూ అక్కడే ఇంటి ముందు ఒక బండరాయిపై కూర్చున్నాడు.‘‘లెయ్ ఇక్కణ్ణుంచి’’ అన్నాడు గార్డ్ అతడి దగ్గరికొచ్చి, కర్ర ఊపుతూ.‘‘లేవను.. మీ సార్‌ని పిలువు బయటికి’’ అన్నాడు అతడు. మాటామాటా పెరిగింది. కర్రతో అతడి వీపు మీద కొట్టబోయాడు సెక్యూరిటీ. ఆ కర్రను రెండుగా విరిచేసి, ఆ ముక్కల్ని దూరంగా విసిరేశాడు అతడు! సెక్యూరిటీ ఖిన్నుడయ్యాడు. అది మనుషులు విరిచేస్తే విరిగిపోయే కర్ర కాదు. అలాంటి కర్రను అతడు విరగ్గొట్టాడు. గార్డ్‌కి బలమే కర్ర. ఆ బలాన్నే విరిచేశాడు. గార్డ్‌కి తల కొట్టేసినట్లయింది. అతడిపై చెయ్యి చేసుకోబోయాడు. అప్పుడొచ్చాడు కమిషనర్. ‘‘ఏం జరుగుతోందక్కడ?’’ అంటూ.అప్పటికే ఆయన ఎక్కడికో వెళ్లేందుకు తయారై ఉన్నాడు. ‘‘ఎవరో పిచ్చివాడు సార్’’ అన్నాడు సెక్యూరిటీ. ఆ యువకుణ్ణి చూశాడు కమిషనర్. ‘‘నేను పిచ్చివాణ్ణి కాద్సార్. పిచ్చి పట్టిస్తున్నారు. నెల రోజులుగా మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కరూ సరిగా సమాధానం చెప్పరు. మిమ్మల్ని కలవనివ్వరు. అందుకే ఇంటికి వచ్చేశాను. ఇక్కడా కలవనివ్వడం లేదు’’ అన్నాడు సెక్యూరిటీ వైపు కోపంగా చూసి.అతడిని నిశితంగా గమనించి, ‘‘లోపలికి రా’’ అన్నాడు కమిషనర్. వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు. కూర్చున్నాడు. ‘‘చెప్పు..?’’ అన్నాడు. చెప్పాడు. కమిషనర్ అతడిని వింతగా చూశాడు. ‘‘ఆఫీస్‌కి రా.. నేరుగా నన్నే కలువు’’ అని చెప్పాడు. అబిడ్స్‌లో మొజాంజాహి మార్కెట్ వెనుక ఉంటుంది ‘సమాచార హక్కు భవన్’. అందులోనే ఉంటాడు కమిషనర్. ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆ యువకుడు. ‘‘నువ్వడిగిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు మిస్టర్ తీర్థా. ఆర్టీఐ చట్టం అన్నీ ఇవ్వలేదు. ఇవ్వకూడదని కాదు. లేనిది ఎలా ఇవ్వగలదు? గూగుల్‌లో ట్రయ్ చెయ్యి’’ అన్నాడు కమిషనర్. విరక్తిగా నవ్వాడు ఆ యువకుడు. గూగుల్కైనా ఎక్కడి నుంచి వస్తుంది సర్ ఇన్ఫర్మేషన్? మీలాంటి వాళ్లు ఇస్తేనే కదా’’ అన్నాడు. ‘‘కావచ్చు! కానీ తీర్థా.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూత్ బంగళాలు ఉన్నాయో చెప్పమని ఆన్లైన్లో నువ్వు అడిగిన ప్రశ్నకు.. నిజంగా మా దగ్గర సమాధానం ఉండి ఉంటే, నీకెప్పుడో ఆ సమాచారం అంది ఉండేది’’ అన్నాడు కమిషనర్. తీర్థ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అని కమిషనర్ అనొచ్చు కానీ, అతyì తో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. టీ తెప్పించాడు. ‘‘భూత్ బంగళాలు ఎందుకు నీకు? ఏదైనా రిసెర్చ్ లాంటిది చేయబోతున్నావా? లైక్.. దెయ్యాలు, భూతాలు?’’ ఆసక్తిగా అడిగాడు కమిషనర్. నిజానికది ఆసక్తి కాదు. ఆసక్తి కనబరచడం. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని.. తనకు సాధ్యమైనంత వరకు నిరాశకు లోను చెయ్యకూడదనుకున్నాడు కమిషనర్. చెప్పడం ఇష్టం లేదో, చెప్పినా అర్థం కాదనో మౌనంగా ఉన్నాడు తీర్థ.‘‘ప్రధానమంత్రి పర్యటనలకు ఎంత ఖర్చయిందీ మేము చెప్పగలం కానీ.. పాడుబడిన బంగళాలు ఎక్కడెక్కడున్నదీ చెప్పలేం. బహుశా అది ఇంకో డిపార్ట్మెంట్ అయి ఉంటుందోమో. నాకైతే తెలియదు’’ అన్నాడు కమిషనర్. టేబుల్ మీద వాళ్లిద్దరూ తాగేసిన ఖాళీ టీ కప్పులు ఉన్నాయి. ‘‘జీవితం ఖాళీ టీ కప్పులాంటిది కదా సర్’’ అన్నాడు తీర్థ.. ఆ కప్పుల వైపు అభౌతికంగా చూస్తూ.కమిషనర్‌కు అర్థం కాలేదు. అయితే ఆ మాట అనకుండా.. ‘‘కానీ నేననుకోవడం ఏంటంటే తీర్థా.. జీవితం ఖాళీ కప్పు కాదు. ఖాళీ కప్పుపై వాలుతున్న ఈగ’’ అన్నాడు. ఆ మాట తీర్థకు అర్థం కాలేదు. ఇద్దరికీ అర్థమైంది ఒకటే.. ఇద్దరిలో ఒకరు అబ్నార్మల్గా ఆలోచిస్తున్నారు. ‘‘మన జీవితాన్ని ఎవరో తాగేస్తే మనం ఖాళీ కప్పులా మిగిలిపోతాం’’ అన్నాడు తీర్థ. ‘‘ఎవరో తాగేసిన మన జీవితంలో ఇంకా ఏదో మిగిలి ఉందన్న ఆశతో.. మనమే ఈగలా ఖాళీ కప్పు చుట్టూ తిరుగుతుంటాం’’ అన్నాడు కమిషనర్. కమిషనర్ వైపు అనుమానంగా చూశాడు తీర్థ. ‘‘జీవితం ఖాళీ కప్పు అని నేను అంటున్నప్పుడు, ఖాళీ కప్పుపై వాలే ఈగే జీవితం అని మీరు అంటున్నారంటే.. మన దృక్పథాలు వేరు అని అర్థం. దృక్పథాలు వేరైనవారు కూడా హాయిగా కలిసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉండగలిగే చోట్లు ఈ లోకంలో భూత్ బంగళాలు మాత్రమే సర్’’ అన్నాడు తీర్థ. కమిషనర్ నవ్వాడు.‘‘ఇప్పుడు మన ఇద్దరం చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కాసేపూ ఈ సమాచార హక్కు భవన్‌ను భూత్ బంగళా అనుకోవచ్చు కదా తీర్థా’’ అన్నాడు కమిషనర్.తీర్థ నవ్వలేదు. ‘‘దృక్పథాలు వేరైనవారు కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవడం అంటే.. దృక్పథాలను దాచిపెట్టుకుని మాట్లాడుకోవడం అవుతుంది సర్. ఆ దాపరికం భూత్ బంగళాల్లో ఉండదు’’ అన్నాడు. ‘‘మరి?!’ అన్నాడు. ‘‘మామూలు ఇళ్లలో ఉంటుంది. మామూలు మనుషుల్లో ఉంటుంది’’‘‘మనుషుల్ని మామూలు అంటున్నావా? ఇళ్లను మామూలు అంటున్నావా తీర్థా?’’‘‘బుద్ధుల్ని అంటున్నాను సర్’’‘‘మనుషుల బుద్ధికి కొత్తగా ఏమైంది తీర్థా ఇప్పుడు? లోకం çపుట్టినప్పటి నుంచీ ఉన్న బుద్ధులు, ఉన్న మనుషులే కదా!’’‘‘అందుకే కదా సార్.. మనుషుల్లో ఉన్నంతసేపూ మనిషిలా ఉండడం కష్టం కాదు’’ అన్నాడు తీర్థ. ఒక్కసారిగా కమిషనర్ బిగుసుకుపోయాడు. వెన్నులోకి చలి పాకడం అంటే ఏంటో జీవితంలో తొలిసారి తెలుస్తోంది ఆయనకు. ‘‘ఇళ్లకు ఉన్నట్లు భూత్ బంగళాలకు కూడా టూ–లెట్ బోర్టులు ఉంటే అసలు మీ వరకు వచ్చేవాడిని కాదు సార్..’’ అనే మాట తర్వాత.. కమిషనర్‌కి ఇంకేమీ వినిపించలేదు. - మాధవ్ శింగరాజు -
చెప్పుకోండి చూద్దాం
ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్నుఆదేశించాడు సీఐ. కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైరన్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. జూన్ 05. 2017. సాయంత్రం.చిత్తూరు జిల్లా, భాకరాపేట సమీపం. దుస్సావాండ్లపల్లి శివారు చెరువు దగ్గర. అంతసేపూ కురిసిన వాన ఎవరో స్విచాఫ్ చేసినట్టు ఆగింది. గాలి మాత్రం హోరున వీస్తోంది.ఉండుండి ఉరుములు, మెరుపులు పోటీ పడుతున్నాయి. గాలి విసురుకి నేలను తాకుతూ పైకి లేస్తూ తంగేడు చెట్ల కొమ్మలు అవస్థపడుతున్నాయి.మళ్లీ వాన మొదలవుతుందేమో అని ఇంటికి త్వరగా వెళ్లేందుకు ఊరి మనిషి ఒకడు సైకిల్ తొక్కుతున్నాడు వేగంగా. గాలికి ఏదో ఎండుగడ్డి నలుసు కంట్లో పడింది. సైకిల్ తొక్కుకుంటూనే ఒక చేత్తో తీసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు. సైకిల్ ఆపి భుజంపై ఉన్న టవల్‌తో తుడుచుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా చెరువు వైపు చూశాడు. ఏదో కనిపించినట్టయ్యింది.మళ్లీ చూశాడు.వెంపలి చెట్టు పక్కన ఆకు పచ్చని గుడ్డ ఏదో గాలికి రెపరెలాడుతోంది. నిశితంగా చూశాడు. అది చీర. లోతుగా చూశాడు. గుండె ఝల్లుమంది. బురదలో నుంచి పైకి లేచిన రెండు కాళ్లు. నాలుగు అడుగులు వేసి చెరువు దగ్గరికి వెళ్లాడు. దుర్వాసన. అతనికి అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పుడే మళ్లీ వర్షం మొదలైంది. సీఐ చెరువు దగ్గరకు వచ్చి చూశాడు. అప్పటికే బాగా ఉబ్బి, చివికిపోయిన మహిళ శవం. కొంత నీళ్లలో మరికొంత బురదలో కూరుకుపోయి ఉంది. ఊర్లో వాళ్లతో కలిసి శవాన్ని బయటికి తీయించాడు.చనిపోయిన మనిషి బాహ్య ఆనవాళ్లు తెలుస్తున్నాయి. కాని ముఖం గుర్తుపట్టలేకుంది. ఎన్ని రోజులయ్యిందో... శరీరం జీర్ణావస్థలో ఉంది.‘వాన తగ్గింది కదా.. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో జాగ్రత్తగా వెదకండి’ సిబ్బందిని ఆదేశించాడు సీఐ.క్లూ కోసం వెదుకుతున్నారు కానిస్టేబుళ్లు. చెరువు గట్టు కింద ఒక చెప్పు దొరికింది. సిబ్బంది ఆ చెప్పును సీఐకి చూపించారు. అది ఆమెదే అయ్యుంటందనే నిర్థారణకు వచ్చాడు సీఐ. శవాన్ని పోస్టుమార్టంకి పంపాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు.ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్‌ను ఆదేశించాడు సీఐ.కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైర న్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. 20 నిమిషాల తరువాత ఆ గ్రామానికి చేరుకున్నారు. సైరన్ సౌండ్‌కు ఇళ్లలోని జనం ఆందోళనగా బయటికొచ్చారు.‘ఊరి చివర చెరువులో ఓ ఆడమనిషి చచ్చి శవమై తేలిందంట. ఎవరై ఉంటారో’.. అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.కానిస్టేబుల్ మైక్‌లో ‘ఆడోళ్లందరూ రచ్చబండ ఉన్న చోటుకు రావాలి’ అని అనౌన్స్ చేశాడు.భయం భయంగా పరుగున వచ్చారు గ్రామంలోని మహిళలు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులూ.‘ఒక్కొక్కరికీ.. చెరువు దగ్గర దొరికిన చెప్పు చూపించు’ కానిస్టేబుల్‌ను ఆదేశించాడు సీఐ. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకునేవారా? జాగ్రత్తగా చూసి చెప్పండి’.. అని అందరికీ చూపిస్తున్నాడు కానిస్టేబుల్.అందరూ ‘తెలియదు’ అని చెప్పారు.‘అది ఖరీదైన చెప్పు సార్! మా ఊళ్లో ఎవరూ వేసుకోరు’ బదులిచ్చారు.సీఐ ఆలోచనలో పడ్డాడు.అటువైపుగా గడ్డి ఎత్తుకెళుతున్న ఓ ఆడమనిషిని దూరం నుంచే చూసిన సీఐ ‘ఆమెను ఇలా పిలుచుకురండి’ అని ఆదేశించాడు.కానిస్టేబుల్ ఆమె దగ్గరికి పరిVð త్తుకు వెళ్లి ‘మా సార్ పిలుస్తున్నాడు’ అన్నాడు.‘ఎందుకూ’ అంది ఆమె. ‘ఊరంతా అక్కడే ఉంది..’ అని కానిస్టేబుల్ విషయం చెప్పేసరికి ఆమె గడ్డి మూట కింద పడేసి గబగబా సీఐ ఉన్న చోటుకు వచ్చింది. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకోవడం చూశావా..’ ప్రశ్న పూర్తికాకముందే... ‘చూశా సార్! బెంగుళూరామే వేసుకుంటది’.. అందామె.‘బెంగుళూరామేనా?’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సీఐ.‘ఈ ఊరోళ్లే సార్. ఏడెనిమిదేళ్ల కింద బెంగుళూరు వెళ్లిపోయారు! ఇప్పుడు బెంగుళూరులో బతుకుతాండారు. వెంకటప్ప పెండ్లాం అనిత ఇట్టాంటి చెప్పులే వేసుకుంటాది సార్’ అంది.‘ఈ మధ్య కాలంలో ఆమె ఎప్పుడైనా ఈ ఊరు వచ్చిందా’‘రాలేదు సార్. మొగుడొక్కడే వస్తున్నాడు.అంతకుమించి నాకేం తెలియదు సార్’ అంది ఆమె.‘సరే.. సరే..’ చెప్పిన వివరాలు నోట్ చేసుకొని అందరినీ వెళ్లిపొమ్మన్నారు. ‘చనిపోయిన మహిళ పేరు అనితనే అయ్యుంటుందా?’ సీఐ ఆలోచనలో పడ్డాడు.ఇది తమ అనుమానం మాత్రమే. రుజువులు ఏమీ లేవు. ఒకవేళ అనితనే అనుకుంటే ఆమెను ఎవరు చంపి ఉంటారు? భర్తా? అయితే, ఎందుకు? పోలీసులు రోజూ దుస్సావాండ్లపల్లికి వెళ్లి వస్తూ మరికంత సమాచారం కోసం వాకబు చేస్తున్నారు అనిత కుటుంబీకులు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నారు. ఈలోపు అనిత భర్త వెంకటప్ప, అతని అన్న ఊరికి వచ్చారని అనిత రాలేదని తెలిసింది. వెంటనే వెంకటప్పను పిలిచి ‘నీ భార్య అనిత ఏమైంది’ అని అడిగాడు సీఐ. ‘బెంగుళూరులోనే ఉంది సార్. ఎందుకు అడుతున్నారు?’ అనుమానంగా అడిగాడు వెంకటప్ప. ‘మరేం లేదు. ఓ కేసు విషయమై ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు వెళ్లచ్చు’ అని స్టేషన్‌కి బయల్దేరాడు సీఐ. అనిత బెంగళూరులో ఉంటే చనిపోయిన ఈమె ఎవరు? అనుమానాలే తప్ప మరే రుజువులు దొరకడం లేదు. విసుక్కున్నాడు సీఐ. ఊర్లోనే మరికొందరిని కలిసి, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో చెప్పి స్టేషన్‌కి వెళ్లిపోయాడు. జులై 15. దుస్సావాండ్లపల్లి నుంచి సీఐకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ‘బెంగళూరులో అనిత భర్త వెంకటప్ప అన్న కూతురు వివాహం జరుగుతోంది’ అని ఆ ఫోన్ తాలూకు సారాంశం.సీఐకి అనుమానం వచ్చింది. సొంత ఊళ్లో పెళ్లి జరపకుండా బెంగళూరులో పెళ్లి ఎందుకు జరుపుతున్నారు? బెంగుళూరు వెళ్లి స్థిరపడినా తరచూ ఊరికి మాత్రం వస్తూనే ఉన్నారు... స్థిరాస్తులు కూడా ఇక్కడే ఉన్నప్పుడు పెళ్లి ఇక్కడే చేయాలి కదా అనుకున్నాడు. ఏదైతేనేం మరిన్ని వివరాలు రాబట్టాలంటే ఈ పెళ్లికి వెళ్లాలి. నిర్ణయానికి వచ్చిన సీఐ తన సిబ్బందిని పిలిచాడు. పెళ్లి జరుగుతున్న రోజు సీఐ టీమ్ బెంగుళూర్ వెళ్ళింది. ఆ పెళ్లిలో అనిత లేదు. పోలీసులకు అర్థమైంది. వెంటనే అనిత భర్త వెంకటప్ప, అతని అన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేయడంతో వెంకటప్ప అతని అన్న తప్పు ఒప్పుకున్నారు. అనితను చంపడానికి ఒక్కో కారణాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు అన్నాదమ్ములు. అనితకు వెంకటప్పకు పెళ్లయ్యి 15 ఏళ్ల పైనే అయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. వెంకటప్ప చిన్న కంపెనీలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండేవాడు. అతని అన్న కుటుంబం కూడా బెంగుళూరులోనే ఉంది. రెండేళ్ల కిందటి వరకు బాగానే ఉన్న అనితకు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విలాసవంతమైన జీవనం కోరుకునేది. అందుకు భర్త వెంకటప్పని డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ‘కోరినవన్నీ తెచ్చివ్వలేనని, ఉన్నదాంట్లోనే సర్దుకోవాలని’ ఖరాకండిగా చెప్పేవాడు వెంకటప్ప. ఇద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. వెంకటప్పతో ఉంటే తన సరదాలు ఎలాగూ తీరవని నిశ్చయించుకున్న అనిత తనకు ఉన్న పరిచయాలను ‘ఉపయోగించుకోవడం’ మొదలుపెట్టింది. ఎంతటి పనులు చేయడానికైనా వెనకాడేది కాదు. ధనవంతులతో పరిచయాలు ఏర్పరుచుకుంది. కార్లు, నగలు, ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తుండేది. వెంకటప్ప నచ్చచెప్పాలని చూసినా వినేది కాదు. ఎదురు తిరిగేది. ఓ రోజు వెంకటప్ప అన్న కూడా అనితకు చెప్పి చూశాడు. ఇలాగే ఉంటే విషయం చాలా దూరం వెళుతుందని బెదిరించాడు. ‘నాకు పెద్ద పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. నా దారికి అడ్డు వస్తే మీ ఇద్దరిని చంపేయడానికి నాకెంతో టైమ్ పట్టదు’ అంటూ ఎదురు తిరిగింది అనిత. దాంతో అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు. ఈ విషయం బంధువుల్లోనూ, ఊర్లోనూ తెలిస్తే తమ పరువు పోతుందని ఆలోచనలో పడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న వెంకటప్ప ఓ రోజు అనితతో.. ‘ఊళ్లో మనకు భూములున్నాయి కదా! వాటిని అమ్మకానికి పెట్టాం. నువ్వు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఊరెళ్లి రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక తిరిగి వద్దాం’ అన్నాడు.‘సరే’ అని బయల్దేరింది అనిత. మే 31 రాత్రి సమయానికి కారులో దుస్సావాండ్లపల్లి శివారు ప్రాంతంలోని చెరువు కట్టమీదుగా వెళుతున్నారు అనిత, వెంకటప్ప అతని అన్న. అప్పటికే బాగా చీకటి పడింది. ఓ చోట కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందని అన్నదమ్ములిద్దరూ కిందకు దిగారు. కారు స్టార్ట్ అవడం లేదని అనిత కూడా దిగింది. అక్కడే అన్నదమ్మలిద్దరూ అనితను గొంతుపిసికి చంపేశారు. అనిత శరీరాన్ని చెరువు కట్టమీదుగా ఓ వైపుకు తీసుకెళ్ళారు. చెరువు ఒడ్డున కొంతమేరలోపలికి వెళ్లి అక్కడ బురదగా ఉన్న చోట తవ్వి, అనిత శరీరాన్ని అందులో పూడ్చేసి, పైన కొన్ని రాళ్లు పడేసి తిరిగి కారులో వెళ్లిపోయారు. పెనుగులాటలో అనిత చెప్పు ఒకటి గట్టు మీద పడిపోగా,మరికొటి చెరువు నీటిలో ఎటో కొట్టుకుపోయింది. గట్టు మీద పడిపోయిన కాలి చెప్పు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది.ఐదు రోజుల తర్వాత విపరీతంగా కురుస్తున్న వానలకు శరీరం కొంతవరకు పైకి తేలింది. అభిప్రాయ భేదాలు, చెడు ప్రవర్తనలు, కుటుంబానికి మచ్చ తెచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు అందుకు కారణమైన వ్యక్తులను చట్టబద్ధంగా వదిలించుకోవచ్చు.కాని మనమే నేరపూరితమైన చర్యలకు పూనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
పది మంది పట్టణ బహిష్కరణ
సాక్షి, కదిరి : తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌కు పోలీసులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. టీడీపీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ సాలమ్మ భర్త, కందికుంట అనుచరుడు అయిన చెట్ల శ్రీరాములు సహా పదిమందిని పట్టణం నుంచి బహిష్కరించారు. వీరంతా ఇటీవల జరిగిన మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన నారాయణస్వామి హత్య కేసులో నిందితులు. ఈ హత్య అనంతరం కూడా వీరు పలు హత్యాయత్నం కేసుల్లో ఉన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్యత్‌లో నేరాలు పెరిగే అవకాశం ఉందని భావించి కొన్నాళ్ల పాటు వీరిని కదిరి నుంచి బహిష్కరిస్తున్నట్లు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ ప్రకటించారు. మంగళవారం వారందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, లగేజ్‌తో సహా వెంట తీసుకుని రమ్మని అక్కడి నుంచి పట్టణానికి దూరంగా వెళ్లి ఎక్కడికైనా వెళ్లి జీవితం గడపాలని ఆదేశించారు. అక్కడ కూడా నేరాలకు పాల్పడితే మరింత కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు వాయిదాలకు హాజరు కావాలన్నా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే పట్టణంలోకి ప్రవేశించాలని సీఐ ఆదేశించారు. బహిష్కరణ వేటుకు గురైంది వీరే.. టీడీపీ నాయకుడు చెట్ల శ్రీరాములు, మహేష్, జగదీష్, వీర మహేష్ అలియాస్ వీర, తేజ్‌దీప్ అలియాస్ తేజ, అంపావతిని సురేష్ అలియాస్ శరత్, జయ, చంద్రశేఖర్, సుదర్శన్, నందకుమార్ అలియాస్ నంద బహిష్కరణ వేటుకు గురైన వారిలో ఉన్నారు. వీరంతా కందికుంట అనుచరులేనని పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. -
మన జిల్లాలో అరుదైన శాసనం..!
సాక్షి, కడప కల్చరల్ : మన జిల్లాలో మరో శాసనం వెలుగుచూసింది. కడప నుంచి గండి వాటర్ వర్క్స్‌కు వెళ్లే దారిలో తూర్పునగల గుట్టపై మగ్దూమ్ సాహెబ్ కొట్టాల గ్రామంలో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. యానాదులు ఉంటున్న ఈ గ్రామం కడప నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతనమైన శిథిలమై మొండిగోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆలయంలో మూడేళ్ల క్రితం వరకు భైరవేశ్వరస్వామి విగ్రహం తల మాత్రమే ఉండేది. దానికి స్థానికులు పూజలు చేసేవారు. కాగా 2015లో కడపకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు, ‘బాసట స్వచ్ఛంద సంస్థ’ అధ్యక్షులు మేరువ బాలాజీరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సభ్యులతో కలిసి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించారు. భైరవేశ్వరుని నూతన విగ్రహాన్ని తయారు చేయించి మూలవిరాట్టుగా ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో కనిపించిన భైరవేశ్వరుని శిథిల మూలమూర్తి, ఇతర దేవతా విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రహరీగా నిలిపారు. వెలుగు చూసిందిలా... బాలాజీరావు ద్వారా సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వివరాలుగల శాసనాలు, ఇతర ఆనవాళ్ల గురించి ఆరా తీశారు. ఆలయం ఎదురుగా ముళ్లపొదల్లో ఉన్న శాసనాన్ని స్థానికులు బయటకు తీశారు. అందులోని లిపిని గమనించిన సాక్షి ప్రతినిధి దాన్ని చరిత్ర పరిశోధకులు విద్వాన్ కట్టా నరసింహులుకు పంపారు. ఆయన దాన్ని పరిశీలించి ఆ బండపై ‘శ్రీ సమరాదిత్య’ అన్న అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆ పురాతన లిపిని మరింత స్పష్టంగా పరిశీలించేందుకు మైసూరు పురాతత్వశాఖ ప్రతినిధులకు పంపారు. దాంతో పాటు మరో ఇద్దరు చారిత్రక పరిశోధకులకు కూడా పంపారు. కాగా ఇంతవరకు చేసిన పరిశోధనలో జిల్లాలోని పెద్దముడియం గ్రామాన్ని సమరాదిత్య తదితర ప్రభువులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయం వద్ద లభించిన బండపై గల అక్షరాలు తక్కువే అయినా దీని ద్వారా జిల్లాకు సంబంధించిన మరింత చరిత్ర లభించే అవకాశం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. చరిత్ర వెలుగులోకి వస్తుంది... ఈ గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని చూసిన పెద్దలంతా ఇది పురాతనమైన ఆలయమని చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ శాసనంలోని వివరాలు తెలిస్తే గ్రామచరిత్రతోపాటు జిల్లా చరిత్ర కూడా మరికొంత వెలుగుచూసే అవకాశం ఉంది. – మేరువ బాలాజీరావు, అధ్యక్షులు, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ, కడప -
ఆ సమాచారం ఇస్తే రూ కోటి రివార్డ్..
సాక్షి, న్యూఢిల్లీ : బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపడుతున్న మోదీ సర్కార్ ఈ తరహా ఆస్తులపై నిర్థిష్ట సమాచారం అందించిన వారికి కోటి రూపాయల రివార్డు స్కీమ్‌ను ప్రకటించింది. నిర్ధేశిత రూపంలో బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలో సంబంధిత అధికారులకు ఎవరైనా నిర్థిష్ట సమాచారం అందచేయవచ్చు. బినామీ లావాదేవీల సమాచారం అందించిన వారికి ఇచ్చే రివార్డు పథకానికి ఎంపికయ్యేందుకు ఎవరైనా బినామీ ఆస్తులపై ఐటీ విభాగంలోని బినామీ నిరోధక యూనిట్లకు చెందిన సంయుక్త, అదనపు కమీషనర్లకు నిర్ధేశిత రూపంలో సమాచారం అందచేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం బినామీ ఆస్తుల లావాదేవీల సవరణ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు అనువైనదిగా ఉండాలి. బినామీ ఆస్తుల వెలికితీతకు దారితీసే సమాచారం అందించే విదేశీయులూ రివార్డు స్కీమ్‌కు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. బినామీ ఆస్తులు, కంపెనీలు, లావాదేవీలపై నిరంతర నిఘా ఉంటుందని, బినామీ లావాదేవీలపై సమాచారం అందచేసిన వారికి రివార్డు పథకం ప్రవేశపెడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఈ రివార్డ్ స్కీమ్‌ను ప్రకటించారు. -
కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. -
చికిత్స సమాచారం రోగి హక్కు
ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. పూర్తిగా రోగి జీవితం ఈ చికిత్సా సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా తెలిసి కొంటేనే మన స్వేచ్ఛకు విలువ– తిండైనా, చికిత్స అయినా. వృత్తి ప్రమాణాలను రక్షిం చడానికి వైద్యమండలిని భారతవైద్యమండలి చట్టం ద్వారా పార్లమెంట్ 1956లో రూపొందించింది. ఈ చట్టం కింద మార్చి 11, 2002న వైద్య రికార్డుల గురించి ఒక రెగ్యులేషన్ జారీ చేసింది. దీన్ని డిసెంబర్ 2010లో సవరించారు. సెక్షన్ 33(ఎం) కింద కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో భారత వైద్యమండలి కింద నమోదయిన వైద్యులకోసం వృత్తి పరమైన ప్రవర్తన, నైతికవిలువలకు సంబంధించిన నియమావళిని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వాటిని రోగులకు అందుబాటులో ఉంచడం వైద్యుల బాధ్యత. మెడికల్ రికార్డ్స్ నిర్వహణ : 1.3.1 చికిత్స మొదలైన తేదీనుంచి ఆస్పత్రిలో చేరిన రోగి చికిత్స పత్రాలను మెడికల్ కౌన్సిల్ అనుబంధం 3లో పేర్కొన్న నిర్ణీత ప్రమాణాల ప్రకారం మూడేళ్లపాటు కాపాడాలి. 1.3.2. రోగి కాని అతను అధికారం ఇచ్చిన ఇతర వ్యక్తి గానీ, లేదా చట్టపరమైన అధికారులు గానీ అడిగితే ఆ రికార్డులను 72 గంటలలోగా ఇచ్చి వేయాలి. ప్రతి వినియోగదారుడికి ఉత్పత్తి గురించి లేదా తాము కొనుక్కున్న సేవల గురించి పూర్తి సమాచారం ఇవ్వవలసిందే. తనకు ఏ ప్రమాణాలతో కూడిన వస్తువులు, సేవలు ఏ ధరకు దొరుకుతాయో ముందే తెలియజేస్తే కొన్నవి ముందే చెప్పిన ప్రమాణాల ప్రకారం ఉన్నాయా ఏవైనా లోపాలు ఉన్నాయా పరిశీలించే హక్కు, లోపాలు ఉంటే పరిహారం కోరే హక్కు ఉందని ఒజైర్ హుస్సేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఏడీ సింగ్, ఎం ముద్గల్ నిర్ధారించారు. కొన్న ఆహారంలో జంతులేశాలుంటే ఉత్పత్తిదారులు తమంత తామే తెలియజేయాలని కోరుతూ ఒజైర్ çహుస్సేన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మన సంవిధానంలో ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావవ్యక్తీకరణ స్వేచ్ఛ రెండు ప్రధాన ఆశయాలను సిద్ధింపజేయాలి. 1. వినియోగదారుడికి కొనబోయే ఉత్పత్తుల నిజాలు తెలుసుకునేందుకు సహకరించాలి. తాను కొన్న ఆహారంలో జంతు, పక్షి, చేప, ఇతర జలచరాలు, గుడ్ల భాగాలు ఉన్నాయా చెప్పాలి. 2. శాకాహారిగా కొనసాగే హక్కును, విశ్వాసాన్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిదారులు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. యూరప్ మానవ హక్కుల ఒప్పందంలోని ఆర్టికల్ 10 ప్రకారం ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది. భారతదేశం ఈ ఒప్పందం పైన సంతకం చేసింది. ‘‘ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః’’ అని రుగ్వేద వాక్యం. విశ్వం నలుమూలలనుంచి మనకు సదాలోచనలు అందాలని దీని అర్థం. అనేక భావాలను అన్ని వైపులనుంచి ఆహ్వానించాలన్నదే ఆర్యోక్తి. ఇతరులనుంచి అభిప్రాయాలు వినే హక్కు లేకపోతే సొంతంగా అభిప్రాయం ఏర్పడటం కష్టం, అప్పుడు వ్యక్తం చేయడానికి కూడా ఏమీ ఉండదు. వైద్య చికిత్సపై నిర్ణయానికి రావాలంటే ముం దస్తు సమాచారం ఉండాలి. ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. తన పరిస్థితికి మరే వైద్యం అవసరమో అదెక్కడ దొరుకుతుందో దాని ఖరీదు ఎంతో తెలియకుండా ఆ వ్యక్తి గానీ అతని బంధువులు గానీ ఏ నిర్ణయమూ తీసుకోలేరు. పూర్తిగా అతని జీవితం ఈ చికిత్సా సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. తీసుకునే తిండి విషయంలో చికిత్స విషయంలోనూ సమాచారం ముందే లేకపోతే అతని బ్రతుకుకే ప్రమాదం. ఢిల్లీ హైకోర్టు ఈ అంశం గురించి వివరిస్తూ, ఆహార పదార్థాలు, మందులు, అలంకరణ వస్తువుల గురించి వాటి ప్యాకెట్ల మీద పూర్తి వివరాలు లేకపోతే, ఆ ఉత్పత్తులలో ఉన్న పదార్థాల గురించిన సమాచారం తెలియకపోతే, వాటిని కొని వాడాలో వద్దో నిర్ణయించుకోవడం అసాధ్యమవుతుంది. వినియోగదారులు స్వయంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం జీవన స్వేచ్ఛ, నిర్ణయ స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు చెందిన విషయం. ఒకవేళ తను కొనబోయే ఆహారపదార్థం శాకాహారమా లేక మాంసాహారమా తెలియకపోతే, తెలియకుండానే అది తింటే, ఒకవేళ అతను శాకాహారి అయి ఉండి తిన్నది మాంసాహారమైతే అతని స్వేచ్ఛను, సమాచార హక్కును, జీవన విధానాన్ని ఎంచుకునే హక్కును మతభావాలను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. అంటే ఆర్టికల్ 19(1)(ఎ), 21, 25 కింద హామీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరిగినట్టే అని ఢిల్లీ హైకోర్టు వివరించింది. మందులు, డ్రగ్స్ విషయంలో కూడా అవి జంతువుల నుంచి తీసినవా లేక మొక్కలనుంచి తీసిన పదార్థాలా తెలియజేయాల్సిన బాధ్యత ఉత్పత్తి దారుల పైన ఉంది. ఆకుపచ్చ రంగులో శాకాహారమని తెలియజేయాలి. మాంసాహారమైతే ఆ విషయం స్పష్టంగా తెలియజేయాలి. ఆహార పదార్థాల విషయంలో ఇచ్చిన ఈ తీర్పు, సూత్రప్రాయంగా అన్ని రకాల వస్తువులకు, సేవలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యసేవలపై పూర్తి సమాచారం పొందేహక్కును ఇది గుర్తించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
పద పదవే వయ్యారి.. పావురమా..!
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒడిశా పోలీసులు రాజుల కాలం నాటి పాత పద్ధతి కనుమరుగుకాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే పావురాళ్లతో సందేశాలు, వర్తమానాలు పంపించడం... మొఘల్ రాజుల కాలంలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. యుద్ధక్షేత్రాలతో పాటు అంతఃపురాల్లోకి రహస్యసమాచారాన్ని చేరవేసేందుకు ఈ పద్ధతిని పాటించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) భువనేశ్వర్ సహకారంతో ఒడిశా పోలీసులు ఇటీవల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సందేశాలు పంపించేందుకు ఈ ప్రయోగం చేశారు. దీని కోసం భువనేశ్వర్ నుంచి 25 కిలోమీటర్ల దూరమున్న కటక్‌కు 50 పావురాళ్లను పంపించారు. గంటలోపే ఇవన్నీ గమ్యస్థానం కటక్ చేరుకున్నాయి. అయితే ఒడిశాకు ఓ ప్రత్యేకత ఉంది. వైర్లెస్, టెలిఫోన్ లింక్‌లు లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 1946లో 200 పావురాళ్లతో కూడిన ‘ఒడిశా పావురాళ్ల సర్వీసు’ ను పోలీసుసిబ్బందికి సైన్యం అందజేసింది. మొదట కొండలతో కూడుకున్న కోరాపుట్ జిల్లా లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు దీనిని విశ్వసనీయమైనదిగా భావించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 700 బెల్జియన్ హోమర్ పావురాళ్లతో సందేశాలు పంపించే డ్యూటీని కొనసాగించారు. కొన్నేళ్ల పాటు మారుమూల ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పిడికి ఈ విధానం ఉపయోగపడింది. ఒక చిన్న కాగితం ముక్కపై రాసిన సందేశాన్ని ఓ ప్లాస్టిక్ క్యాప్సుల్‌లో పెట్టి ఈ పావురాళ్ల కాళ్లకు కట్టేవారు. ఇవి 15 నుంచి 25 నిమిషాల్లోనే 25 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఈ రకం పావురాళ్ల జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉండేది. 1982లో వరదల్లో బాంకీ పట్టణం చిక్కుకున్నపుడు, 1999లో సూపర్ సైక్లోన్, వరదల సందర్భంగా కూడా కటక్ కేంద్రంగా ఈ సర్వీసు ఉపయోగించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బైక్ దొంగ అరెస్ట్
సాలూరు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న యువకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ ఇలియాస్ మహ్మద్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలం నెలిపర్తి గ్రామానికి చెందిన సేనాపతి శంకరరావు అలియాస్ రామకృష్ణ సాలూరు పట్టణంలో మూడు బైక్‌లు.. మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్‌ను దొంగిలించాడన్నారు. క్రైమ్ పోలీసులు విచారణ జరిపి దొంగతనాలకు పాల్పడుతున్న శంకరరావును పట్టుకుని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనుమానితుల సమాచారం ఇవ్వండి.. పట్టణ ఎస్సై ఫకృద్దీన్ మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్ల వదిలి వేరే ఊర్లకు వెళ్లేవారు కూడా సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని చెప్పారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు వసంత మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. గురువారం తిరుప్పావడ సేవతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు(శుక్రవారం) స్వర్ణ రథంపై శ్రీవారిని ఊరేగిస్తారు. మద్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. -
‘సమాచారం’ మన హక్కు
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పథకాల అమలు, మంజురైన నిధులు, చేసిన పనులు తదితర వివరాల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. అయితే, తాము కోరిన సమాచారం పొందేందుకు ఓ చట్టం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం రూ.10తో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా పొందే వీలుంది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని ప్రతి పౌరుడు అడిగి తెసుకోవాలన్న ఉద్ధేశంతో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా దరఖాస్తు చేసుకుని.. కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం చేసిన పనులు, నిధుల విడుదల, వినియోగం తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో వివరాలు ఉండాలి.. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, సమాచార అధికారి, అప్పిలేట్ అధికారిని నియమిస్తారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లను ప్రజలకు కనిపించేలా బోర్డుపై స్పష్టంగా రాసి ఉంచాలి. తెల్లకార్డు ఉంటే ఫీజు ఉచితం తెల్లకార్డు ఉన్నవారికి దరఖాస్తు రుసుం ఉచితం. గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం లేదు. మండల స్థాయిలో అయితే రూ.5, జిల్లా స్థాయిలో రూ.10 చెల్లించాలి. దీనిని నగదు, డీడీ, బ్యాంక్ చెక్కు, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవచ్చు. కాగా, అడిగిన సమాచారం మేరకు వివరాలు ముద్రణ రూపంలో ఇచ్చేందుకు అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారుడి నుంచే వసూలు చేస్తారు. సాధారణంగా దరఖాస్తు ఫీజుతో పాటు ముద్రణ రూపంలో సమాచారం కోరితే పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సీడీ ద్వారా సమాచారం కోరితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రికార్డులు పరిశీలన విషయంలో మొదటి గంటకు ఉచితం, ఆపై ప్రతి గంటకు రూ.5 చెల్లించాలి. సమాచారం కోరే పద్ధతి.. సమాచారం కావాల్సిన వారు సంబంధిత కార్యాలయంలో సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్లకాగితంపై రాస్తే సరిపోతుంది. రాయడం తెలియకపోయినా.. సమాచారం సక్రమంగా కోరే అవగాహన లేకపోయినా.. సంబంధిత పౌర సమాచార అధికారి తగిన సహాయం చేస్తారు. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినేట్ మీటింగ్‌లు, రికార్డులు, మంత్రులు, వారి కార్యదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. అయితే, అవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవైతే తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. స.హ. చట్టంపై అవగాహన కల్పించాలి సామాన్యులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సామాన్యులు వివిధ కార్యాలయాల సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగిన సందర్భాలు అనేకం. అలాగే సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత గడువులోగా సమాచారం అందించాల్సి ఉంటుంది. – వడ్డెపల్లి మల్లేశం, ఐకాస మండల చైర్మన్, హుస్నాబాద్ నిర్ణీత సమయంలో సమాచారం అందించాలి సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న సమాచారాన్ని నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారుడికి అందించాలి. లేని పక్షంలో సంబంధిత పౌర సమాచార అధికారులు బాధ్యుత వహించాలి. దరఖాస్తుదారుడి ఫిర్యాదు మేరకు కోర్టు చట్టరీత్యా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – భీమా సాహెబ్, న్యాయవాది, హుస్నాబాద్ -
భద్రత సమాచారమూ ఇవ్వరా?
విశ్లేషణ రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? 1. రైళ్ల రక్షణ హెచ్చరిక వ్యవస్థ (ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టం)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (íసీఈఎల్) 2013లో ప్రతిపాదించిన పథకానికి మంజూరు చేసిన వ్యయం ఎంత? 2. మంజూరుపత్రం కాపీ ఇవ్వండి. 3. విడుదలైన డబ్బు వినియోగించినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 4. సీఈఎల్‌కు విడుదల చేసిన నిధుల వివరాలు ఇవ్వండి. 5. సీఈఎల్ పథకాన్ని పూర్తిచేసినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 6. ప్రాజెక్టు పూర్తికాకపోతే కారణాలు తెలపండి, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పండి. 7. మంజూరు చేసిన వ్యయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి అయిందా? కాక అదనపు ఖర్చును మంజూరు చేస్తూ జారీ చేసిన పత్రం నకలు ఇవ్వండి. 8. ఈ ప్రాజెక్టు టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలించి ఉంటుంది. వారి నివేదికలో ఆర్థిక సాంకేతిక లోపాల గురించి ప్రస్తావిస్తే ఆ వివరాలు ఇవ్వండని ఎనిమిది అంశాలమీద సమాచారాన్ని అడిగారు అస్తిత్వ అనే వ్యక్తి. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డీఎస్ఐఆర్) జవాబు ఇవ్వాలి. కానీ ఇదంతా వ్యక్తిగతమట. సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వరట. అస్తిత్వ అడిగిన సమాచారం సంక్షిప్తంగానైనా ఇవ్వాలని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. ప్రాజెక్టు వివరాలను వ్యక్తిగత సమాచారమంటూ తిరస్కరించడం తీవ్రమైన విషయం. రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? పోనీ íసీపీఐఓ భావించినట్టు ఇది వ్యక్తిగత సమాచారమని అనుకున్నా, దానికి జనహితం అనే మినహాయింపు ఉంది కదా! ఆ జనహితం కోసమైనా ఈ సమాచారం ఇవ్వవచ్చు కదా? ఆర్టీఐ దరఖాస్తు 23.5.2017న దాఖలైంది. విమల్ కుమార్ వరుణ్ ఆ దరఖాస్తును జి– విభా గం శాస్త్రజ్ఞుడు బీఎన్ సర్కార్‌కు పంపారు. సెక్షన్ 5(4) కింద అస్తిత్వగారు కోరిన సమాచారం ఇవ్వాలని కోరుతూ 25.5.2017న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని సమాచార కమిషన్‌కు వివరణతో పాటు సమర్పించారు. అయినా బీఎన్ సర్కార్ ఇది వ్యక్తిగత సమాచారమనీ, సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వడం చెల్లదనీ జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఆదేశం తరువాత కూడా పూర్తి సమాచారం రాలేదని అస్తిత్వ కమిషన్‌కు వివరించారు. సీఇఎల్కు పరిశోధన చేయడానికి గాను తమ విభాగం (డీఎస్ఐఆర్) ఆర్థిక సాయం చేస్తుందని, మార్కెట్ అవసరాలను అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు చేయడానికి సహకరించి, ఆ వస్తువులను వాణిజ్యపరంగా వినియోగిస్తుందని వివరించారు. కొన్ని ధృవపత్రాలు కూడా అస్తిత్వకు ఇచ్చామనీ, అయితే పొరబాటున వాటిని ధృవీకరించడం మరి చిపోయామనీ చెప్పారు. అయితే సీఈఎల్ అనేది కంపెనీ కనుక, వాణిజ్య వ్యవహారాలను నడుపుతుంది కనుక అడిగిన సమాచారం మొత్తం ఇస్తే అందులో వాణిజ్య రహస్యాలు ఉంటాయి కనుక ఇవ్వకూడదని సెక్షన్ 8(1)(డి) కింద మినహా యింపు వర్తిస్తుందని భావించామని, కానీ పొరబాటున సెక్షన్ 8(1)(జె) అని రాశామని కూడా సీపీఐఓ తన వివరణలో తెలియజేశారు. రికార్డు పరిశీలిస్తే డిసెంబర్ 13 (2017)న ఇచ్చిన జవాబుల్లో కూడా డీమ్డ్ పీఐఓ బీఎన్ సర్కార్ 5,6,7,8 అంశాలకు సరైన జవాబు, పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. అయిదో అంశంపైన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పలేదు. ఆరో ప్రశ్నకు ఆలస్యంగా ‘పరిశీలనలో ఉంది’ అని జవాబు ఇచ్చారు. ఏ పరిశీలన? ఎవరి పరిశీలన? ఏడో పాయింట్‌కు నాట్ అప్లికబుల్ అని ఊరుకున్నారు. మొత్తం ప్రాజెక్టు మంజూరైన వ్యయానికి లోబడి ఉందా లేదా అంటే వర్తించదు అని జవాబిస్తారా? ఎనిమిదో పాయింట్‌కు అటువంటి కమిటీ లేదు. కమిటీ ఏ లోపాన్నీ కనిపెట్టలేదని జవాబు. 5 నుంచి 8 వరకు పాయింట్లకు వాణిజ్య రహస్యానికి సంబంధమే లేదు. కనుక 8(1)(డి) కూడా వర్తించదు. బీఎన్ సర్కార్ గారు మళ్లీ మళ్లీ 8(1)(డి)నే వర్తిస్తుందని, పత్రాలను ధృవీకరించనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఇవ్వాల్సిన జవాబులా ఇవి? విమల్ కుమార్ వరుణ్ సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని స్పష్టంగా లేఖ రాశారు. కానీ సమాచారం అధీనంలో ఉన్న శాస్త్రజ్ఞుడైన సర్కార్ నిరాకరించడం వల్ల ఇవ్వలేకపోయారు. అస్తిత్వ ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనేకానేక లోపాలను వివరిస్తూ ఆడిట్ ఇచ్చిన ఒక నివేదిక భాగాలను కమిషన్‌కు సమర్పించారు. వీటికి జవాబి వ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. (అస్తిత్వ వర్సెస్ సైన్స్/టెక్నాలజీ మంత్రిత్వశాఖ CIC/DOSIR/A/2017/159662 కేసులో సీఐసీ 12 జనవరి 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాఢభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
చిటికెలో... తుఫాన్ సమాచారం!
భోగాపురం(నెల్లిమర్ల): ప్రకృతి ప్రకోపంవల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. హుద్‌హుద్ తుఫాన్ వంటి విపత్తులు సృష్టించిన బీభత్సం ఇప్పటికీ ప్రజ ల మదిలో మెదులు తూనే ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికారిక సంస్థ ముందస్తుగానే ప్రమాదాలను గుర్తించి అధికారులను సమాయత్తం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విపత్తుల ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా అరికట్టేందుకు తీరప్రాంతాలున్న జిల్లాలు, మండలాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసి అక్కడ ఉండే అధికారులు, ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ సెంటర్లు పనిచేస్తాయి. ఇస్రో, నాసా, ఐఎండీ, ఐఐఆర్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సహా అంతరిక్షం అందించే సమాచారాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సేకరించి ఆ విషయాన్ని సంబంధిత శాఖలకు త్వరితగతిన పంపే ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ శాఖపై ఆధారపడకుండా... ఇప్పటివరకూ తుఫాన్లు సంభవించినప్పుడు వాతావరణ శాఖ అధికారులు సంబంధిత మండలాలకు హెచ్చరికలు జారీ చేసేవారు. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాలు, మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు తీవ్రతపై సమాచారాన్ని వైర్లెస్ సెట్లు, ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా చేరవేసేవారు. ఆ హెచ్చరికల మేరకు తీరప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తమై తీరానికి ఆనుకుని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. ఇకపై వాతావరణ శాఖ అధికారులతో సంబంధం లేకుండా తీర ప్రాంతాలున్న జిల్లాల్లో డీఈఓసీ(జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్), మండలాల్లో ఎంఈఓసీ(మండల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్) లను విపత్తుల నిర్వహణా సంస్థ కొత్తగా ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రంలో తీర ప్రాంతాలు కలిగి ఉన్న 9జిల్లాల్లో, 86మండలాల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌తో అనుసంధానం విజయవాడ వద్ద గొల్లపూడిలో ఏర్పాటుచేసిన ఎస్ఈఓసీ (స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్) నుంచి డీఈఓసీ, ఎంఈఓసీలు అనుసంధానమై ఉంటాయి. ఎస్‌ఈఓసీలో సిబ్బంది 24గంటలూ శాటిలైట్‌కు అనుసంధానం చేసిన టీవీలు చూస్తూ తుఫానులు మాత్రమే గాకుండా ఏ గ్రామంలో, ఎక్కడ పిడుగులు పడబోతున్నాయో కూడా ముందుగా గ్రామంలోని వీఆర్ఓలకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం తెలుసుకుని దాన్ని జిల్లా కేంద్రానికి, వార్తా పత్రికలు, చానెళ్లకు కూడా సమాచారం అందిస్తుంటారు. -
సెక్స్ వర్కర్లు అరెస్టు
భువనేశ్వర్: నగరం శివార్లు హంసపాల్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం ఆధారంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేయడంతో సెక్స్ రాకెట్ ముఠా పట్టుబడింది. ఘటనా స్థలం నుంచి ఒక నిందితుడు పరారు అయ్యాడు. హంసపాల్ మెట్రో సెటలైట్ సిటీ సముదాయంలో ఓ ఇంటిపై దాడి చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో అభ్యంతరకర సామగ్రిని జప్తు చేశారు. వ్యభిచారానికి పాల్పడిన నిందిత యువతులు దేవ్గడ్, నయాగడ్ ప్రాంతాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం నిర్వహిస్తున్న మహిళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ముగ్గురు మహిళల వ్యతిరేకంగా కేసుల్ని నమోదు చేసినట్లు బలియంత ఠాణా పోలీసులు తెలిపారు. -
అంతా మోసం
రోజురోజుకు మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం వీరు పన్నే వలలో అమాయకులు చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులకు వచ్చిన వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే ఫోన్ చేసి ఏటీఎం వివరాలు తెలుసుకుని ఖాతాదారులను మోసగిస్తున్న ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జిల్లాలోని ఓ కల్తీ పాల కేంద్రంపై అధికారులు దాడి చేసి మోసాన్ని బయటపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ‘ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నాను..’ జంగారెడ్డిగూడెం : “హలో... ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాం... మీరు ఎస్బీఐ కార్డు వాడుతున్నారు కదా! ఆ కార్డు మీద పాయింట్లు వచ్చాయి.. ఆ పాయింట్లను నగదుగా మార్చాలి.. మీ కార్డు వివరాలు తెలియజేయగలరు.’ ఇలా ఒక ఆగంతకుడు ఫోన్ చేసి సదరు వ్యక్తి ఖాతాలోని నగదు డ్రా చేసి బురిడీ కొట్టించాడు. గురువారం జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకోగా బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.కేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పీవీఎస్‌ఆర్‌కే ప్రసాద్ జంగారెడ్డిగూడెం ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్నాడు. ఏటీఎం కార్డు వినియోగిస్తున్నాడు. ఆగంతకుడు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్న అనంతరం స్వల్ప వ్యవధిలో మూడుసార్లు కార్డు నుంచి 14,985 రూపాయలు విత్ డ్రా చేశాడు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. బామ్మకు టోకరా.. నగలతో జంప్ ఏలూరు అర్బన్ : బ్యాంకులో నగలు కుదువపెట్టి డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలిని మాయచేసిన మోసగాడు ఆమె తెచ్చుకున్న నగలు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక వంగాయగూడెం సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన చిల్లా పార్వతి తన వద్ద ఉన్న 12 గ్రాముల విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు స్థానిక వన్‌టౌన్ కెనాల్‌రోడ్‌లోని విజయబ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఆమెకు డబ్బు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమె నుంచి నగలు తీసుకుని ఆధార్ కార్డు జిరాక్సు తీసుకురమ్మని ఆమెను బయటకు పంపాడు. కార్డు జిరాక్స్ తీసుకువచ్చిన ఆమెకు ఆగంతకుడు కనిపించకపోవడంతో అక్కడే ఉన్న కార్పొరేటర్ రాధాబాబుకు మొరపెట్టుకుంది. ఆయన బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీంతో వారు సీసీ ఫుటేజ్ పరిశీలించి మోసగాణ్ణి గుర్తిస్తామని చెప్పారు. బాధితురాలు కార్పొరేటర్ సహకారంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్లీ పాలు తయారీ కేంద్రం గుట్టు రట్టు! కామవరపుకోట : మండలంలోని సాగిపాడు పంచాయతీ పరిధిలోని వీరంపాలెం గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తోన్న ఒక ఇంటిపై తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్థన్ శుక్రవారం దాడి చేశారు. అనంతరం పుడ్ ఇన్స్పెక్టర్ జి.వెంకటరామయ్యకు సమాచారం అందించారు. ఎస్సై సమక్షంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ పాలను పరీక్షించారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలం ఆసన్నగూడెంకు చెందిన జెట్టి మోషే ఐదు నెలలుగా మంగతాయారు అనే మహిళకు చెందిన ఇంటిలో ఒక గది అద్దెకు తీసుకుని కల్తీ పాలు తయారు చేస్తున్నాడు. అసలు పాలకు నీళ్లు కలిపి దానిలో మంచునూనె, పాల పౌడర్ కలిపి మిక్సిలో ఆడి వచ్చిన ద్రవ్యాన్ని బయట ప్రజలకు అమ్ముతున్నాడు. దాడిలో పాల తయారీకి ఉపయోగించే నూనె ప్యాకెట్లు, పాల పౌడర్ ప్యాకెట్లు, మిక్సీ, రెండు క్యాన్ల పాలు సీజ్ చేసినట్టు ఎస్సై చెప్పారు. పాల నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. -
పేదలకు ఆసరా.. సీఎం సహాయ నిధి
అనంతపురం అర్బన్ : ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలకు కోసం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం రూ.50 వేలు వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అయితే చాలా మంది ఈ పథకం గురించి తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు. సమాజంలో అట్టడుగువర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హులు. మొత్తం 17 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స పొందొచ్చు. ఏఏ వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చంటే.. : 1. కార్డిక్ వాల్వ్ రీప్లెస్‌మెంట్ 2. కార్డిక్– సీఏబీసీ 3. కార్డిక్– ఓపెన్ హార్ట్ సర్జరీ 4. మ్యో కార్డినల్ ఇన్ఫ్రాక్షన్ ఏంజియోప్లాస్టీ 5. కిడ్నీ ఫెయిల్యూర్ (మూత్ర పిండాలు పాడేతే) 6. బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్, ఇతర బ్రెయిన్ వ్యాధులు 7. స్పైనల్ కార్డ్ (వెన్నుముక)కు సంబంధించి మేజర్ న్యూరోలాజికల్ కంప్లైంట్స్ 8. కాన్సర్, కాన్సర్ కీమోథెరిపీ 9. మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్ 10. క్రానిక్ లివర్ (కాలేయ) జబ్బు 11. కిర్రోసిస్ ఆఫ్ లివర్ 12. ఊపరితిత్తుల సర్జరీ, క్రానిక్ లంగ్ జబ్బు 13. పాన్క్రియాటిట్స్, కోలిసిస్ట్టిట్స్ (అబ్డామినల్ పెద్ద జబ్బులు) 14. మేజర్ అబ్డామినల్ సర్జరీ 15. ట్రాయుమా 16. బ్లాడర్, ప్రొస్టేట్, ముత్రపిండాల్లో రాళ్ల తొలగింపు వంటి మేజర్ యూరోలాజికల్ సర్జరీలు 17. హెమోడయాలసిస్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే : + వ్యాధిగ్రస్తులు తమ దరఖాస్తులో పూర్తి వివరాలు పొందపర్చాలి. పూర్తీ పేరు, పెద్దల పేర్లు, వయస్సు, ఇంటి నంబరు, మొబైల్ నంబరు, వీధి పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు పొందుపరచాలి. ఏ వ్యాధికి ఆర్థిక సహాయం కోరతున్నారు అనేది తెలియజేయాలి. + దరఖాస్తును మండల తహసీల్దారు ద్వారా కలెక్టర్‌కు పంపుతారు. అర్హత ఉన్నట్లయితే సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి కలెక్టర్ సిఫారసు చేస్తారు. ప్రజాప్రతినిధుల ద్వారా అయినా ప్రభుత్వానికి పంపొచ్చు.వ్యాధిగ్రస్తులు నేరునైనా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపొచ్చు. + వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన తరువాత ఏడాదిలోపు చికిత్స చేయించుకోవాలి.అలా చేయించుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ల్యాప్స్ అవుతుంది. -
శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. జులై నెలకు సంబంధించి 58, 067 సేవా టికెట్లను భక్తులకోసం అందుబాటులోకి తెస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సుప్రభాతం 6,542, తోమాల 120, అర్చన 120 అష్టాదళం 60, విశేషపూజ 1,875, నిజపాద దర్శనం 1,500, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3 వేలు, అర్జిత బ్రహ్మోత్సవం 6,450 వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకరణ సేవ 14,250 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.68 కోట్లమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని గత ఏడాది కంటే 20.69 లక్షలమంది భక్తులు అదనంగా శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. శ్రీవారి హుండీ ద్వారా 1,038 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. నోట్ల రద్దు వల్ల హుండీ ఆదాయం కొంత మేరకు తగ్గిందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలియజేశారు. -
ప్రలోభాలకు లొంగొద్దు
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, దాని వల్ల మంచి కెరీర్‌ను పోగొట్టు కోవాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శనివారం అన్నారు. విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిన విషయాలిలా ఉన్నాయి. పోలీసు అధికారులు శాస్త్రసాంకేతిక పరంగా అప్డేట్ కావాలన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా చేసేవారు, మట్కా క్రికెట్ బెట్టింగ్‌లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారితో పోలీసు అధికారులు, సిబ్బంది కుమ్మక్కు అయినట్లు తెలిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి (ఆపరేషన్స్) బి. సత్య ఏసుబాబు, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. -
ప్రలోభాలకు లొంగొద్దు
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, దాని వల్ల మంచి కెరీర్‌ను పోగొట్టు కోవాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శనివారం అన్నారు. విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిన విషయాలిలా ఉన్నాయి. పోలీసు అధికారులు శాస్త్రసాంకేతిక పరంగా అప్డేట్ కావాలన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా చేసేవారు, మట్కా క్రికెట్ బెట్టింగ్‌లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారితో పోలీసు అధికారులు, సిబ్బంది కుమ్మక్కు అయినట్లు తెలిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి (ఆపరేషన్స్) బి. సత్య ఏసుబాబు, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు సతీసమేతంగా ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అలాగే తమిళ నటుడు ఎస్.వి.శేఖర్ స్వామివారిని దర్శించుకున్నారు. -
వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు
అమృత్సర్: పంజాబ్‌లో జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరికొందరు పారిపోయిన ఘటనలో పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నుంచి పారిపోయిన వారి సమాచారం అందించిన వారి రూ 25 లక్షల రివార్డు అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం నభా జైలుపై సాయుధులు దాడి చేసి హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురిని జైలు నుంచి విడిపించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జైలు నుంచి పారిపోయిన కోసం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ చోట ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కాగా జైల్ బ్రేక్ ఘటనలో ప్రభుత్వ హస్తముందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. -
ఆన్లైన్లో అర్జితసేవా టిక్కెట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్లో టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన 1,00,147 అర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు, వారపు సేవా టిక్కెట్లను భక్తులు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. కాగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 4 వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను జరగనున్నాయి. డిసెంబర్ 4న పంచమి తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని ఈవో సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా త్వరలో సర్వదర్శనం భక్తులకు వసతి సముదాయ నిర్మాణం జరగనున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి కాళ్ల మండపాన్ని కూడా అనుసంధానిస్తామని సాంబశివరావు తెలిపారు. టికెట్ల వివరాలు అర్చన 190 తోమల సేవ 190 సుప్రభాతం 9,073 అష్టదళపాదపద్మారాధన 160 విశేషపూజ 3,200 నిజపాదదర్శనం 2,604 కల్యాణోత్సవం 20,500 వసంతోత్సవం 22,360 సహస్రదీపాలంకర సేవ 25,175 వూంజల్‌సేవ 5,300 అర్జిత బ్రహ్మోత్సవం 11,395 -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా ఉంది. సోమవారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
వృద్ధ కళాకారులు పూర్తి సమాచారం అందించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) జిల్లాలో వృద్ధ కళాకారుల పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న కళాకారులు వారి వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సమాచార శాఖ సహాయ సంచాలకులు వీ.భాస్కర నరసింహం ఒక ప్రకటనలో కోరారు. కళాకారులు వారికి అందించిన గుర్తింపుకార్డు నకళ్లు, వారు ఏ కళారంగానికి చెందిన వారు, కళాబంద కార్యక్రమం నిర్వహించిన జిరాక్స్ తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ సంబంధించి జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా అందించాలని ఆయన కోరారు. కళాకారులు వారి పూర్తి అడ్రస్‌తో పాటు సెల్‌నెంబరు తప్పనిసరిగా అందించాలని ఎవరైనా కళాకారులకు సెల్‌నెంబరు లేకపోతే వారి సమీప బంధువులుగాని లేదా వారికి సమాచారం అందించే దగ్గర వారి సెల్‌నెంబరు నమోదు చేయాలని తద్వారా భవిష్యత్తులో ఉత్తర ప్రత్యుత్తరాలకు అవసరమైన సమాచారం తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్ప్రొటెక్టెడ్ పాస్వర్డ్లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు. మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే. -
సమాచారంతో సిద్ధంగా ఉండాలి
నల్లగొండ : విద్యాశాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ తన చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం సమీక్షించే విద్యాశాఖకు సంబంధించిన విద్యా, మాద్యమిక, ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు, సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులు నివేదికలు తయారు చేసుకుని సూచించారు. అదే విధంగా అదనపు తరగతి గదులు, రిపేర్లు, సీసీ కెమెరాలు తదితర పూర్తి వివరాలు అందుకు అవసరమైన నిధులపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిచే వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాఠశాల విద్యపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి, డీఈఓ చంద్రమోహన్, ఎస్ఎస్ఏ అధికారి కిరణ్, ఆర్ఐఓ, మైనార్టీ అధికారి పాల్గొన్నారు. -
ఇక ఫ్యామిలీ బిజినెస్ ప్లాన్ సర్వే
భీమవరం టౌన్ : ఫ్యామిలి బిజినెస్ ప్లాన్ పేరిట స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని ప్రతి సభ్యురాలి కుటుంబ వివరాల సేకరణ సర్వేను శుక్రవారం నుంచి చేపట్టనున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సర్వే చేయనున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో ఎంపిక చేసిన స్లమ్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీలు) సర్వే చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. భీమవరం మునిసిపల్ కార్యాలయంలో జిల్లా రిసోర్స్పర్సన్లు టి.మేరి (పాల కొల్లు), కిన్నెర (ఏలూరు) ఆధ్వర్యంలో ఇక్కడ సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. సేకరించే వివరాలు l స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ) పేరు l ఎస్‌హెచ్‌జీ కోడ్, మునిసిపాలిటీ పేరు l సభ్యురాలి పేరు l కుటుంబ సభ్యుల పేర్లు l వారి మధ్య సంబంధం l వృత్తి/ వ్యాపారం l నైపుణ్యం l మొత్తం కుటుంబ నెల ఆదాయం l కుటుంబపరమైన ఖర్చులు (నెల వారీగా గృహ ఉపకరణాలు, చదువు, వైద్యం, ఆరోగ్యం, ఇతరాలు) l కుటుంబపరమైన ఖర్చులు పోను మిగిలే నికర ఆదాయం l వృత్తి/వ్యాపారం నెలకు టర్నోవర్ l వ్యాపార పరమైన ఖర్చులు (ముడిసరుకు, అద్దె, విద్యుత్ మొదలైనవి) l టర్నోవర్, వ్యాపారపరమైన ఖర్చులు పోను మిగిలే వ్యాపార ఆదాయం నెలకు l వ్యాపార సామర్థ్యం మేరకు అవసరమైన పెట్టుబడి l సభ్యురాలి ప్రస్తుత పెట్టుబడి l వ్యాపారం లేదా వృత్తిలో జత కలపాల్సిన పెట్టుబడి ఎంత అవసరం l వ్యాపార సామర్థ్యం మేర పెట్టుబడి తర్వాత టర్నోవర్ l వ్యాపార ఖర్చులు l ఆదాయం పట్టణంలో 16,910 మంది సభ్యులు భీమవరంలో 1,691 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 16,910 మంది సభ్యులున్నారు. సర్వేలో సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా మెప్మా పీడీ జి.శ్రీనివాసరావు ఆదేశించారని పట్టణ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.సుబ్బారాయుడు తెలిపారు. -
ఇదేమి ‘కృష్ణా!’
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్న కృష్ణా పైప్‌లైన్ మరోసారి పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంచినీరు వృథాగా పోయింది. భారీ లీకేజీ ఏర్పడటంతో తాగునీరు ఫౌంటె న్లా విరజిమ్మింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు లీకైన నీరు పక్కనే అ ల్ జుబేల్ కాల నీలోని ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పట్టాలపై కూడా నీరు చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఎట్టకేలకు సరఫరా నిలిపివేయడంతో లీకేజీకి తెరపడింది. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
నల్లగొండ జిల్లా సమాచార రచనకు శ్రీకారం
హబ్సిగూడ: నల్లగొండ జిల్లాకు చెందిన సమస్త సమాచారాన్ని గ్రంథస్తం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటా విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. 1952వ సంవత్సరం మొదలుకొని 2015 వరకు జిల్లా సంపూర్ణ సమగ్ర సమాచారాన్ని గ్రంథస్తం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లును కలిసి ఆయనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాలోని తెలంగాణ సాయుధ పోరాటం, జైన బౌద్ధ మతం, జిల్లా నీటి పారుదల, జిల్లా పరిశ్రమలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, హైకోర్టు న్యాయమూర్తులు, వైద్య రంగ నిపుణులతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచిన ప్రముఖులకు సంబంధించిన విశేషాలను సేకరిస్తామన్నారు. అలాగే వివిధ దేవాలయాల చరిత్రలను నల్లగొండ జిల్లా రచయిత జిన్నం అంజయ్య ఆధ్వర్యంలో గ్రంథ రచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రంథ రచన పూర్తయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తామన్నారు. జిల్లాకు సంబంధిచిన, ఇతర జిల్లాల్లో నివసిస్తున్న నల్లగొండవాసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు రచయితలు, కవులు, జర్నలిస్టులు సహకరించాలని కోరారు. -
అంతా వారిష్టమే!
ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం నష్టపోతున్న రైతులు పనుల అడ్డగింత బాల్కొండ: చత్తీస్ఘడ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న భారీ విద్యుత్ టవర్ల నిర్మాణం వివాదాస్పదమవుతోంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పంటపొలాల్లో టవర్ నిర్మాణ పనులు చేపడుతూ పంటను నాశనం చేస్తున్నారని, తాము కోల్పోతున్న భూములకు పరిహారం ఎంతిస్తారో స్పష్టం చేయకుండా పనులు చేయడమేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్, సోన్‌పేట్, ముప్కాల్, కొత్తపల్లి, వేంపల్లి, వన్నెల్(బీ) గ్రామాల రైతులు టవర్ల నిర్మాణంలో విలువైన భూములు కోల్పోతున్నారు. ఈ గ్రామాల పరిధిలో సుమారు 50 భారీ టవర్లు నిర్మిస్తున్నారు. రైతులతో ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండానే పంటపొలాల్లోకి వాహనాల ద్వారా సామగ్రి తీసుకువచ్చి పనులు చేపట్టడం పట్ల ఇదెక్కడి దౌర్జన్యమని రైతులు అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకం పరిహారం.. కొందరు రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం ఇస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఓ రైతుకు రూ.48 వేలు, మరో రైతుకు రూ.80 వేలు, మరో రైతుకు రూ.2 లక్షల పరిహారం చెల్లించారని రైతులు తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పరిహారం చెల్లించి తమ మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోతున్నారు. తమ మధ్య ఐక్యత లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం.. గత ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో చేతికొచ్చిన పసుపు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం చేతికొచ్చిన సోయా, పసుపు పంటను రైతులు నష్టపోతున్నారు. విద్యుత్ తీగలను ట్రాక్టర్ల సహాయంతో లాగుతున్నారు. ఒక్కో తీగ లాగేందుకు మూడు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతున్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాక్టర్లను పంటపొలాల్లోకి తీసుకొస్తున్నారని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.80 వేలు చెల్లించారు మా భూమిలో టవర్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.80 వేలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఎన్నిస్తారో, ఎప్పుడిస్తారో చెప్పలేదు. అంతా అయోమయంగా ఉంది. తమకు చెల్లించే నష్టపరిహారం ప్రకటించాలి. లింగారెడ్డి, రైతు, ముప్కాల్ ఎన్ని ఇస్తారో చెప్పలేదు మా భూమిలో విద్యుత్ టవర్ నిర్మిస్తున్నామని కనీస సమాచారం ఇవ్వలేదు. నా భూమి కోల్పోయాను. పరిహారం ఎంత చెల్లిస్తారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఆందోళనగా ఉంది. పరిహారం ఎంతిస్తారో చెప్పాలి. – తిరుపతి, రైతు, బుస్సాపూర్ పంట నష్టపోతున్నాం మా పక్క చేనులో విద్యుత్ టవర్ నిర్మిస్తున్నారు. ట్రాక్టర్ల సహాయంతో విద్యుత్ తీగలు లాగుతున్నారు. దీంతో మా భూమిలో పసుపు, మక్క, సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టించుకునే వారు లేరు. – చిన్నారెడ్డి, రైతు, బుస్సాపూర్ -
చెత్త నిండగానే జీహెచ్ఎంసీకి సమాచారం
బాలానగర్: బాలానగర్‌లోని కేంద్రీయ పరికరాల రూపకల్పన సంస్థ (సీఐటీడీ– సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజాయత్ ఖాన్, లెఫ్టినెంట్ కర్నల్ రవి చౌధురి, డైరెక్టర్ పవిత్ర కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ జి. సనత్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఓ నలుగురు శాస్త్రవేత్తలు ‘ఇంటెలిజెంట్ డస్ట్‌బిన్’ను రూపొందించారు. ప్రస్తుతం ఈ డస్ట్‌బిన్‌ను ట్రైల్ రన్లో ఉంచారు. ప్రస్తుతం పేపర్ వేస్టేజ్ ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో పెట్టి పరిశీలిస్తున్నారు. ఆ డస్ట్‌బిన్‌లో వాటర్ బాటిల్స్, టీ కప్స్, వేస్ట్ పేపర్ అటువంటివి అయితే డస్ట్‌బిన్ నిండడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అదే మన ఇంట్లో అయితే నలుగురు సభ్యులు ఉన్న వారికి మూడు రోజుల నుంచి అయిదు రోజుల్లో నిండిపోతుంది. నలుగురు డిజైన్ ఇంజినీర్లు పి.కె. విష్ణు, అనుపమ జాజు, సుందరగిరి శ్రీనివాస్, మదన్మోహన్ కులకర్ణి నెలరోజులు శ్రమించి ఈ ఇంటెలిజెంట్ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు.