వృద్ధ కళాకారులు పూర్తి సమాచారం అందించాలి
Published Tue, Sep 27 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)
జిల్లాలో వృద్ధ కళాకారుల పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న కళాకారులు వారి వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సమాచార శాఖ సహాయ సంచాలకులు వీ.భాస్కర నరసింహం ఒక ప్రకటనలో కోరారు. కళాకారులు వారికి అందించిన గుర్తింపుకార్డు నకళ్లు, వారు ఏ కళారంగానికి చెందిన వారు, కళాబంద కార్యక్రమం నిర్వహించిన జిరాక్స్ తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ సంబంధించి జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా అందించాలని ఆయన కోరారు. కళాకారులు వారి పూర్తి అడ్రస్‌తో పాటు సెల్‌నెంబరు తప్పనిసరిగా అందించాలని ఎవరైనా కళాకారులకు సెల్‌నెంబరు లేకపోతే వారి సమీప బంధువులుగాని లేదా వారికి సమాచారం అందించే దగ్గర వారి సెల్‌నెంబరు నమోదు చేయాలని తద్వారా భవిష్యత్తులో ఉత్తర ప్రత్యుత్తరాలకు అవసరమైన సమాచారం తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Advertisement