district
-
19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సంస్థాగత ఎన్నికలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంస్థాగతంగా పార్టీని 38 జిల్లాలుగా విభజించగా, సోమవారం 19 జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించారు. ఈ జిల్లాల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదని, సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు ఇంకా పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదని తెలుస్తోంది.ఏకాభిప్రాయం కుదరని కొన్ని జిల్లాల్లో రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు ప్రతిపాదించిన పేర్లపై స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా అధ్యక్షులుగా ప్రతిపాదించిన వారి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో నియామకాలు ఆగినట్టుగా తెలిసింది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు. 8 జిల్లాల్లో ఏకాభిప్రాయం దిశగా.. 8 జిల్లాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరే దిశగా కసరత్తు జరుగుతోంది. మొత్తం 38 జిల్లాలకు గాను యాభై శాతానికి పైగా అంటే 20కు పైగా జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకుంటేనే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక లేదా నియామకానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారం, పది రోజుల్లో 8 జిల్లాలకు కూడా అధ్యక్షులను ప్రకటిస్తే మొత్తం 27 జిల్లాలకు అధ్యక్షులను నియమించినట్టు అవు తుందని చెబుతున్నారు. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యాక మిగిలిన 11 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాలను చూస్తే...రెడ్డి–6, ఎస్సీ–1, వైశ్య–2, బీసీలు–10 మంది ఉన్నట్టుగా తేలింది. ఇక త్వరలో ప్రకటించే 8 జిల్లాల్లో ఒకటి మహిళకు, ఆ తర్వాత ఖరారు చేసే 11 జిల్లా ల్లో కూడా మరో రెండు లేదా మూడు జిల్లాలకు మహిళలకు అవకాశం లభించవచ్చునని అంచనా వేస్తున్నారు. 19 జిల్లాల అధ్యక్షులు వీరే.. పతంగి బ్రహ్మానంద (ఆదిలాబాద్ జిల్లా), వెంకటేశ్వర్‌గౌడ్ (మంచిర్యాల), శ్రీశైలం ముదిరాజ్ (ఆసిఫాబాద్), దినేష్ కులాచారి (నిజామాబాద్), నీలం చిన్నరాజులు (కామారెడ్డి), రాచకొండ యాదగిరిబాబు (జగిత్యాల), కర్రే సంజీవ్‌రెడ్డి (పెద్దపల్లి), వి.రాధామల్లేష్ గౌడ్ (మెదక్), బుద్ధి శ్రీనివాస్ (మేడ్చల్–మల్కాజిగిరి), నాగం వర్షిత్‌రెడ్డి (నల్లగొండ), పి.శ్రీనివాసరెడ్డి (మహబూబ్‌నగర్), దుప్పలి నారాయణ (వనపర్తి), కొలను సంతోష్‌రెడ్డి (హనుమకొండ), గంట రవికుమార్ (వరంగల్), నిశిధర్‌రెడ్డి (భూపాలపల్లి), సౌడ రమేష్ (జనగామ), సిరికొండ బలరాం (ములుగు), గుండగోని భరత్‌గౌడ్ (మహంకాళి సికింద్రాబాద్), లంకాల దీపక్‌రెడ్డి (హైదరాబాద్ సెంట్రల్ జిల్లా) లను అధ్యక్షులుగా బీజేపీ ప్రకటించింది. -
ఏ ఈవెంట్.. ఎక్కడ..?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడూ బిజీ బిజీ లైఫ్‌తో తీరిక లేకుండా ఉండే నగరవాసులు ఒక్కసారిగా హైదరాబాద్‌లో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ప్రొఫెషనల్, పర్సనల్ పనులు సైతం కాస్త పక్కపెట్టి మరీ ఈ డిసెంబర్‌పై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే వాట్సాప్ హైదరాబాద్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిటీ అంటూ గూగులింగ్ చేస్తున్నారు. ఇయర్ ఎండ్ నేపథ్యంలో డిసెంబర్ నెలలో వేడుకలు, ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించి ముందే ప్లానింగ్ చేస్తున్నారు సిటీజనులు. ఇప్పటి నుంచే నగరంలో జరగనున్న ఈవెంట్లు, లైవ్ కన్సర్ట్లు, కేక్ మిక్సింగ్‌లు, 31 నైట్ సెలబ్రేషన్స్‌పై ముందస్తు బుకింగ్స్‌కు ఆసక్తి చూపుతున్నారు. లైవ్ కన్సర్ట్లు.. మెమరబుల్ ఈవెంట్స్.. పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన ఏడాదికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడం నగరం ఆనవాయితీ. ప్రతీ ఏడాది ఈ వేడుకల కోసం నగరం అందంగా ముస్తాబై విభిన్న ఆహ్లాదకర వేడుకలతో అలరిస్తూనే ఉంది. అయితే.. ఈ ఈవెంట్స్‌కు సంబంధించి ముందుగానే ప్లాన్ చేకుంటే పాసులు, ఎంట్రీ దొకరడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో నగరంలో జరగనున్న ఈవెంట్ల గురించి ముందుగానే ఆరా తీస్తున్నారు. చివరి రెండు వారాల్లో జరగనున్న లైవ్ కన్సర్ట్లు, ఫైవ్ స్టార్ ఈవెంట్లు, ఇతర వినోద కార్యక్రమాకు సంబంధించి గూగుల్‌లో, ఈవెంట్స్ వెబ్సైట్లలో వెతుకుతున్నారు. ఇలాంటి వేడుకలకు నగరవాసుల నుంచి పెరుగుతున్న ఆదరణ, అంతేగా కుండా ఆయా రోజుల్లో ముందస్తుగానే సెలవులు పెట్టుకోవాల్సిన దృష్ట్యా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. గ్రాండ్‌గా.. ఈవెంట్స్.. డిసెంబర్ నెలకు సంబంధించి నిర్వహించనున్న ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికు ప్రణాళికలు మొదలైనప్పటికీ అనుమతులు, ఆంక్షల నేపథ్యంలో తేదీల వివరాలను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. కొన్ని ప్రత్యేక ఈవెంట్ల వివరాలు మాత్రం ఇప్పటికే వెల్లడించి బుక్ మై షోలో టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే మాదాపూర్, గచి్చబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. వీటి కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి సైతం ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్, ఈవెంట్స్ ఆర్గనైజర్స్ నగరానికి చేరుకోనున్నారు. -
జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం
హరిద్వార్: నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు. రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా జైలు సీనియర్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో రామబరాత్ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.ఇది కూడా చదవండి: బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం -
బంతి, కనకాంబరాల పూల తోటలు.. ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
Pakistan: భారీ వర్షాలతో అతలాకుతలం.. పెరిగిన వరద ముప్పు
పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జనం నానా అవస్థలు పడుతున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగర పరిధిలోని కోట్-ముర్తాజా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.పాక్‌లోని బలూచిస్తాన్, దక్షిణ పంజాబ్‌లోని పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ట్యాంక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ట్యాంక్-సౌత్ వజీరిస్తాన్ రహదారిని మూసివేయడంతో పాటు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు.ఆగస్టు 4 నుంచి 7 వరకు కరాచీలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని పేర్కొంది. కోహ్-ఎ-సులైమాన్లోని రోజాన్లోని 100కు పైగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాజన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ మీడియాకు తెలిపారు. -
జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..
జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్‌ఫర్‌కు ఆప్షన్ ఇచ్చుకున్నారు.బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.బదిలీలకు 256 మంది ఆప్షన్..జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్ వాచ్‌మన్, ఎంఎన్ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్‌మన్, ఫైర్‌మన్, థియేటర్ అసిస్టెంట్, వాటర్ మెన్, స్వీపర్ తదితరులు డిపార్ట్మెంట్ వారీగా 788 మంది ఉన్నారు.ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్ఫర్లు కోరుకున్నారు.కలెక్టరేట్లో బదిలీ కేటాయింపులుజిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్‌కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్ కాపీలను అందించనున్నారు.ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్ పంచాయతీ, జూనియర్ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు చొప్పున ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశమయ్యారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. సంక్షేమం..అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని, తాను గత సీఎం తరహా కాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత వారానికి మూడురోజులు సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఉంటుంది. తొలిసభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసభ ఇంద్రవెళ్లిలో నిర్వహించగా, సీఎం హోదాలోనూ అక్కడ జరిగే తొలిసభలో రేవంత్ పాల్గొంటారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మతివనానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు రేవంత్ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, రెట్టి ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు బదనాం చేస్తున్నారు నియోజకవర్గ సమస్యలతోపాటు పార్టీ బలోపేతానికి సీఎం పలు సూచనలు చేశారని మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రభుత్వ పథకాల విధివిధానాలు తయారుకాక మునుపే బీఆర్ఎస్ నేతలు తమను బదనాం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడుతున్నారని, ఐదేళ్ల వరకు ఎన్నికలు రావని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకే సీఎం సమావేశం ఏర్పాటు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ పాలన తట్టుకోలేక తమకు అధికారం ఇచ్చారని, వచ్చే టర్మ్‌లోనూ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. సీఎంగా రేవంత్‌కు వంద మార్కులు : జగ్గారెడ్డి సీఎంతో జరిగిన భేటీలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున సీఎం ఇస్తారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ పరిధిలోని రెండు స్థానాలు గెలుచుకోవాలని తమకు దిశానిర్దేశం చేశారన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదన్నారు. ఓటమి పాలైనా తాము పార్టీ తరపున ఎమ్మెల్యేలమని, సీఎంగా రేవంత్‌కు వంద మార్కులు వేస్తానన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు అంశం చర్చకు వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్‌కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ ఎందుకయ్యింది?
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోన్‌భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్‌భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. సోన్‌భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చదవండి: ఆ బాబాలు ఏం చదువుకున్నారు? -
దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఈ పేరుతో రాష్ట్రం ఉండేదని తెలుసా?
భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి సారధ్యంలో పరిపాలన కొనసాగుతుంది. రాజ్యాంగంలో జిల్లాలను నిర్ణయించే వ్యవస్థ కూడా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో అవసరాన్ని అనుసరించి జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జిల్లాల సంఖ్యను పెంచుతుంది. అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద జిల్లా గురించి మీకు తెలుసా? నాటి రోజుల్లో ఆ జిల్లా పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిల్లాలో సగభాగం ఎడారి భారతదేశంలోని అతిపెద్ద జిల్లా పేరు కచ్. ఇది గుజరాత్లో ఉంది. విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద జిల్లాగా పేరొందింది. గుజరాత్‌లోని ఈ జిల్లా మొత్తం వైశాల్యం 45,674 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని 23.7 శాతం భూభాగంలో విస్తరించివుంది. ఈ జిల్లాలోని సగానికి పైగా ప్రాంతం ఎడారితో నిండి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ జిల్లా పేరుతో రాష్ట్రం ఒకప్పుడు భారతదేశంలో కచ్ పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఇది 1950లో ఏర్పాటయ్యింది. 1956 నవంబర్ ఒకటిన ముంబై రాష్ట్రంలో విలీనమయ్యింది. మరాఠీ, గుజరాతీ ప్రజలు అప్పట్లో కచ్‌లో నివసించేవారు. మార్వాడీలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. 1960లో ముంబై రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు. దీంతో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్. ఈ నేపథ్యంలో కచ్ జిల్లా గుజరాత్లో చేరింది. 2001 జనవరి 26న కచ్‌లో సంభవించిన భూకంపం ఆ జిల్లాను అతలాకుతలం చేసింది. ఇది కూడా చదవండి: ‘హిప్పీలు’ ఇస్కాన్ అనుచరులుగా ఎలా మారారు? -
YSRCP: జిల్లా నూతన కార్యవర్గాల నియామకం
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ►అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ►అనకాపల్లి జిల్లా-బొడ్డేట ప్రసాద్ ►అనంతపురం-పైల నరసింహయ్య ►అన్నమయ్య జిల్లా-ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ►బాపట్ల-ఎంపీ మోపిదేవి వెంకటరమణ ►చిత్తూరు-ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ►కోనసీమ-ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ►తూర్పు గోదావరి- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ►ఏలూరు-ఎమ్మెల్యే ఆళ్ల నాని ►గుంటూరు-డొక్కా మాణిక్య వరప్రసాద్ ►కాకినాడ-ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ►కృష్ణా-ఎమ్మెల్యే పేర్ని నాని ►కర్నూలు-ఎమ్మెల్యే బీవై. రామయ్య, మేయర్ ►నంద్యాల-ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ►ఎన్టీఆర్ జిల్లా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ►పల్నాడు జిల్లా- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పార్వతీపురం మన్యం- శత్రుచర్ల పరీక్షిత్ రాజు ►ప్రకాశం-జంకె వెంకటరెడ్డి ►నెల్లూరు- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ►సత్యసాయి జిల్లా- ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ ►శ్రీకాకుళం- ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ►తిరుపతి జిల్లా- నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ►విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్ ►వెస్ట్ గోదావరి- ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ►వైఎస్సార్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్ -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
పల్నాడులో దారితప్పి తిరుగుతున్న రెండు పెద్ద పులులు
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
సిద్ధిపేట: మునిగడపలో అదుపుతప్పి గుంతలో పడ్డ కారు
-
నారాయణపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
-
జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టిన కారణంగానే తొక్కిసలాట : జిల్లా ఎస్పీ
-
చంద్రబాబు కందుకూరు రోడ్ షో లో అపశృతి
-
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం..
-
పారదర్శకంగా పనిచేస్తేనే మంచిపేరు
బాపట్ల టౌన్: వలంటీర్లు పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజల మన్నన పొందగలరని కలెక్టర్ కె.విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం బాపట్ల జిల్లాలోని వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలకు ఎంపికైన వలంటీర్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పెద్దిరోజా, రెవెన్యూ డివిజనల్ అధికారి జి.రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల జెడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి పాల్గొన్నారు. -
సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల
రొంపిచర్ల(పల్నాడు జిల్లా): మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతి మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంతగుడిపాడు గ్రామంలో గురువారం దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాడు నేడు రెండవ ఫేజ్‌లో భాగంగా కోటి ఐదు లక్షల రూపాయల నిధులతో 9 తరగతి గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో 320 విద్యార్థులు ఉన్న హైస్కూల్లో ఈ ఏడాది 700 మంది విద్యార్థులు చేరారన్నారు. తరగతి గదులు రానున్న వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. అలాగే ఐదు ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎంపీటీసీ ఇరుగుల మాధవి, సర్పంచ్ ఉయ్యాల సీతమ్మ, మాజీ సర్పంచ్ పల్లకి అంజనారెడ్డి, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, ఏలేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వాతావరణ సమాచారం వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్సైట్ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్ అబ్జర్వేషన్‌లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. గుబాళించిన పూల సాగు మార్కెట్లో అలంకరణ పూలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. గిరిజనులను ప్రోత్సహిస్తాం వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్‌ఫ్లవర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. – డాక్టర్ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం -
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు..ఆకట్టుకునే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య పురుడుపోసుకున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఈ కేంద్రంలో జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు రూ.500 కోట్లు వెచ్చించాయి. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఇక్కడ ఆరు జనరేటర్లు సేవలందిస్తున్నాయి. 1, 2, 3 జనరేటర్లతో 51, 4,5,6 జనరేటర్లతో 69 చొప్పున 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమారు 65 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఈ విద్యుత్ కేంద్రంలో పురాతన యంత్రాలు కావడంతో గత పదేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. తరచూ సాంకేతిక సమస్యలతో అధికారులు, సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ కేంద్రంపై దృష్టి సారించి, శత శాతం విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్ కేంద్రాలు కేవలం పీక్‌లోడ్ అవర్స్‌లో మాత్రమే ఉత్పాదన చేస్తుండగా మాచ్‌ఖండ్ మాత్రం ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో ఆరు జనరేటర్లతో 120 మోగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. డుడుమ, జోలాపుట్టు ప్రధాన ఆధారం మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంంద్రంలో ఉత్పత్తికి నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలశయాలు ప్రధాన ఆధారం. డుడుమ నీటి సామర్థ్యం 2590, జోలాపుట్టు నీటి సామర్థ్యం 2750 అడుగులు. వీటికి మత్స్యగెడ్డ నీరే దిక్కు. జి. మాడుగుల మండలం గెమ్మెలి నుంచి మొదలై మత్స్యగుండం మీదుగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ గెడ్డ విస్తరించింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా రెండు జలశయాల్లో నిల్వ చేస్తారు. డుడుమ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తుంటారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయినా నీరు తొలుత అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అక్కడ నుంచి ఆంధ్ర భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన తరువాత మిగతా నీరు గోదావరిలో కలుస్తోంది రూ.500 కోట్లతో ఆధునికీకరణ.. 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రతీ జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు పైబడినా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరణకు నిర్ణయించాయి. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయించాయి. విద్యుత్ కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక తయారీ బాధ్యత టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకు ఏపీజెన్కో వర్గాలు అప్పగించాయి. దీంతో అదే సంస్థకు చెందిన 14 మందితో కూడిన బృందం గత ఏడాది డిశంబర్ నెలలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌యార్డులు, భవనాల స్థితిగతులను పరిశీలించింది. వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కన్సల్టెన్సీ బృందం అందజేసింది. పూర్తిస్థాయిలో ఉత్పాదన శుభపరిణామం విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరగడం శుభపరిణామం. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి తక్కువే అయినా వాటికి ధీటుగా ఉత్పాదకత ఉంటుంది. ఆధునికీకరణ కోసం ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఎంతో మేలు జరుగుతుంది. – కేవీ నాగేశ్వరరావు, సీనియర్ ఇంజినీర్, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
జిల్లాల పునర్విభజన; ద్వారకాతిరుమలపైనే అందరి దృష్టి
ఏలూరు (మెట్రో): ‘మీది ఏ జిల్లా.. మీ జిల్లాకు ఏది ప్రాధాన్యం.. మా జిల్లా కేంద్రంగా మా పట్టణమే ఉంది..’ ఇవీ ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలు. జిల్లా కేంద్రాలు, వసతులపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన, మార్పులు అంశాలపై ఇటీవల అమరావతిలో జిల్లా అధికారులు చర్చించారు. జిల్లా ప్రజల వినతులపై సాధ్యాసాధ్యాలను రాష్ట్ర అధికారులకు వివరించారు. నాలుగు జిల్లాల అధికారులు అమరావతిలో జిల్లాల విభజన, వినతులపై కీలకంగా చర్చించారు. కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, నాలుగు జిల్లాల అధికారులతో పాటు రాష్ట్ర సర్వే రికార్డుల కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ప్రణాళికాశాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. జిల్లాల విభజనలపై వచ్చిన వినతులపై కూలంకషంగా చర్చించారు. చిన వెంకన్న క్షేత్రంపై సుదీర్ఘంగా.. జిల్లాలో వచ్చిన వినతుల్లో ప్రధానంగా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలనే ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి భీమవరం జిల్లాకు మావుళ్లమ్మ ఆలయం, క్షీరారామలింగేశ్వర ఆలయం వంటి ప్రధాన దేవస్థానాలు ఉన్నాయనీ అయితే ఏలూరు జిల్లాకు మాత్రం ప్రధాన ఆలయం ఏమీ లేదని, చినవెంకన్న దేవస్థానం ఉండేలా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలనే వాదన బలంగా ఉందని రాష్ట్ర కమిటీకి నివేదించారు. ఇప్పటివరకూ పశ్చిమగోదావరిలో ఉన్న ద్వారకాతిరుమల మండలాన్ని రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో కలపడాన్ని జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు కేంద్రానికి ద్వారకాతిరుమల 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆర్థికంగా ఏలూరు జిల్లాకు వనరుగా ఉండటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నరసాపురం కేంద్రం కోసం.. నరసాపురం కేంద్రంగా జిల్లాను మార్పు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అలాగే పోలవరం జిల్లా ప్రతిపాదన సైతం చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను జిల్లాగా చేసే అంశాలను చర్చించారు. ఆయా ప్రాంతాల మధ్య దూరం, గిరిజనుల ఇబ్బందులు, వెసులుబాటు వంటి అంశాలపై రాష్ట్ర కమిటీకి జిల్లా అధికారులు నివేదించారు. వినతుల పెట్టె ఏలూరు కలెక్టరేట్లో జిల్లాల విభజనలపై వచ్చే వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకించి ఒక బాక్సును ఏర్పాటుచేశారు. ఆయా వినతులను కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అంబేడ్కర్, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో ప్రతిరోజూ పరిశీలించి ప్రత్యేక నోట్‌ను తయారు చేస్తున్నారు. ఈ నోట్లోని అంశాలను రాష్ట్ర కమిటీకి వివరిస్తున్నారు. తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు. -
Puttaparthi: పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
అనంతపురం విద్య / శ్రీకంఠం సర్కిల్/పుట్టపర్తి: విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లా అయిన అనంతపురం ఇక మీదట రెండు జిల్లాలు కానుంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బుధవారం నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశముంది. అనంతపురం జిల్లా పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలోకి అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ వస్తాయి. కొత్తగా ఏర్పాటయ్యే సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అనంతపురం జిల్లా విస్తీర్ణం 11,359 చదరపు కిలోమీటర్లుగా, సత్యసాయి జిల్లా విస్తీర్ణం 7,771 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది. ఎన్నెన్నో అనుకూలతలు పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు భౌగోళిక, ఆధ్యాత్మిక తదితర అంశాలు దోహదపడ్డాయి. పుట్టపర్తి ఇప్పటికే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. సత్యసాయి బాబా నడయాడిన నేల కావడంతో పాటు ప్రకృతి రమణీయత, అందాలొలికే నిర్మాణాలు, విద్య, వైద్య సౌకర్యాలు, జిల్లా కేంద్రం అవసరాలకు అనుగుణంగా భూ, నీటివనరులు అందుబాటులో ఉండడం తదితర అంశాలు కలిసొచ్చాయి. సత్యసాయి జిల్లా ఏర్పాటు ఎంతో మంది బాబా భక్తుల ఆకాంక్ష కూడా. ఇప్పుడది కార్యరూపం దాల్చడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఇక 26 జిల్లాలు) పారిశ్రామిక ప్రగతికి ఊతం సత్యసాయి జిల్లా ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతికి కూడా ఊతం ఇచ్చినట్లు అవుతోంది. విశ్వనాగరిక నగరం బెంగళూరుకు కేవలం 154 కిలోమీటర్ల దూరంలోనే పుట్టపర్తి ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే 131 కిలోమీటర్ల దూరమే. ఇప్పటికే పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది. దీనివల్ల పారిశ్రామిక, పాలనాపరమైన కార్యకలాపాలు సులువుగా నిర్వహించుకోవచ్చు. పెనుకొండ సమీపంలోని కియా కార్ల కంపెనీ, కొడికొండ వద్ద ఏర్పాటైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాంతాలు కూడా పుట్టపర్తికి దగ్గరగానే ఉంటాయి. దీంతో కొడికొండ చెక్‌పోస్టు నుంచి కియా కంపెనీ వరకు పరిశ్రమలు వృద్ధి చెందడానికి, మిగిలిన ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు సత్యసాయి జిల్లా దోహదం కానుంది. సేద్యపు సిరులు..చారిత్రక వైభవాలు సత్యసాయి జిల్లా పరిధిలో ఆయకట్టున్న చెరువులు సింహభాగం వస్తున్నాయి. బుక్కపట్నం చెరువు 2,971 ఎకరాలు, పరిగి చెరువు 2,851 ఎకరాలు, ధర్మవరం చెరువు 1,922 ఎకరాలు, కొట్నూరు చెరువు 1,508 ఎకరాలు, హిందూపురం చెరువు 1,130 ఎకరాలు, గొట్లూరు చెరువు 642 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నాయి. యోగివేమన, చిత్రావతి, పెడబల్లి రిజర్వాయర్లు, హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిధిలోని గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు ఈ జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. వీటితో పాటు చారిత్రక ప్రాంతాలైన పెనుకొండ, లేపాక్షి, హేమావతి, ఖాద్రీ లక్ష్మీనృసింహుని క్షేత్రం, తిమ్మమ్మమర్రిమాను వంటివి ఈ జిల్లాలో ఉంటాయి. తప్పనున్న వ్యయప్రయాసలు పాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్ పరిధిలో సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల వారికి ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రం సుదూరంలో ఉంది. ఎన్పీ కుంట వాసులకు 120 కి.మీ, మడకశిర వాసులకు 115 కి.మీ. దూరంలో ఉండడం గమనార్హం. పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు వల్ల వీరికి దూరం తగ్గి వ్యయప్రయాసలు తప్పనున్నాయి. -
మా మొర వినే ఆప్షనే లేదా?
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు ప్రతీ జిల్లాలో కోకొల్లలు. ఇలా అసంతృప్తి, ఆందోళనల మధ్య ఉద్యోగుల విభజన శరవేగంగా సాగిపోతోంది. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్‌ను గానీ, సీనియారిటీ వల్ల అన్యాయం జరుగుతోందన్న జూనియర్ల వాదనను గానీ ఎక్కడా పరిగణలోనికి తీసుకోలేదు. దీంతో ఎవరు ఎక్కడకు వెళ్తారో? ఎంతమంది స్థానికేతర జిల్లాలకు వెళ్తారో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించి, జిల్లా కేటాయింపు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మెదక్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నారు. దీంతో ఈ జిల్లా ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 13న ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఆప్షన్ల పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అదే రోజు రాత్రి విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు స్థానికత, ఆప్షన్ల విషయంలో నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. నకిలీల నాటకం.. దివ్యాంగుల ప్రాధాన్యతనూ కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. 75 శాతం వైకల్యం ఉంటే నిబంధనల ప్రకారం ఆప్షన్లలో రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఇష్టానుసారం తప్పుడు ధ్రువీకరణలు పెడుతున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. భవిష్యత్‌లో ఇవన్నీ కోర్టు కేసుల వరకూ వెళ్లే వీలుందని, సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు టీచర్లు చెప్పారు. హడావిడి విభజన వల్లే ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు. సంతృప్తినివ్వని ఊరట! ఉద్యోగుల విభజనలో ఉపాధ్యాయులే ఎక్కువ. వారి నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఉన్నతాధికారులు కొంత ఊరట కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. విభజనలో జిల్లా మారకపోతే వీలైనంత వరకూ వాళ్లు పనిచేస్తున్న స్కూల్లోనే కొనసాగించేలా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ చిన్న ఊరట ఉపాధ్యాయ వర్గాలను ఏమాత్రం సంతృప్తి పర్చడం లేదు. ‘జిల్లాల్లో సీనియారిటీ జాబితా పెట్టామని అధికారులు చెబుతున్నారే గానీ దాన్ని ఎక్కడా డిస్ప్లే చేయలేదు. అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు మూర్ఛవ్యాధి ఉన్న సంతానం ఉందని, ఆప్షన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకూ చాన్స్ లేకుండా పోయింది. సీనియారిటీలో వెనుకబడి ఉండటం వల్ల ఎక్కడేస్తారో అని గందరగోళంగా ఉంది.’– కార్తీక్, టీచర్, వరంగల్ జిల్లా ‘నాకు సీనియారిటీ లేకపోవడంతో కొత్తగూడెం జిల్లాలో వేస్తారేమో? ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో? కనీసం వంద కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తుందేమో. నాకు వృద్ధ తల్లిదండ్రులున్నారు.. వాళ్లను అక్కడకు తీసుకెళ్లడం అదనపు భారమవుతుంది.’– వసంత్, టీచర్, ఖమ్మం జిల్లా నేను మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నా.. అత్తమామలతో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నాకు దూరప్రాంతానికి బదిలీ తప్పదేమోనని భయంగా ఉంది. స్థానికతకు ప్రాధాన్యత నిస్తే, సమీపంలోనే ఏదో ఒక స్కూల్లో అవకాశం ఉంటుంది.’ – స్వరూప, టీచర్, మేడ్చల్ జిల్లా -
సరిహద్దు జిల్లాల్లో తగ్గని ఉధృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి రాలేదని.. వాటికి సరిహద్దుగా ఉన్న మన జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కొన్నిజిల్లాల్లో ఒక్కో రోజు ఒక్కకేసు కూడా నమోదుకాని పరిస్థితి ఉంటే.. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం వరుసగా పదులకొద్దీ కేసులు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు ఎక్కువగా వస్తున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, మరికొందరితో కూడిన ఉన్నతస్థాయి బృందం హెలికాప్టర్లో సుడి గాలి పర్యటనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేటలలో ఉన్నతాధికారులు పర్యటించారు. స్థానిక వైద్య సిబ్బందిని, అధికారులతో సమావేశమై కరోనా నియంత్రణలోకి రాకపోవడానికి కారణాలను పరిశీలించారు. కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల బృందం ఆదివారం రాత్రి ఖమ్మంలోనే బసచేసింది. సోమవారం డోర్న కల్, హుజూరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ రాత్రి గోదావరిఖనిలో బసచేసి.. మంగళవారం సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పర్యటించనుంది. సీఎం ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతుండటంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. అటు వంటి ప్రాంతాలను గుర్తించి అధ్యయ నం చేయాలని.. కరోనా విస్తరణకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల బృందం మూడు రోజుల పాటు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ కేసుల పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ నెల ఐదో తేదీన 62 కేసులు నమోదైతే, పదో తేదీన 64 కేసులు వచ్చాయి. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉండటం, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం, కరోనా టెస్టులు, ట్రేసింగ్ సరిగా నిర్వహించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నా నియంత్రణపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
హృదయ విదారక ఘటన: ఆస్పత్రి బయటే..
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో వచ్చిన రోగిని చేర్చుకోకపోవడంతో ఆస్పత్రి ఎదుటే మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నగరం నవభారత్ జంక్షన్ సమీపంలోని యాతపేటకు చెందిన రాములు (60) అనే వృద్ధుడు కరోనా లక్షణాలతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. జిల్లా అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చూపిస్తున్న లెక్కల్లో అక్కడి బెడ్లు ఖాళీగానే ఉన్నప్పటికీ బెడ్లు ఖాళీ లేవన్న సాకుతో ఆ వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. కొన్ని గంటలపాటు అదే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా ఆయాసం రావడంతో ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని చూసి చుట్టుపక్కల ఉన్నవారు చలించిపోయారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో వారు ఓ ఆక్సిజన్ సిలిండర్‌ను అక్కడికే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి వృద్ధుడికి అమర్చారు. కొద్దిగా పరిస్థితి కుదుటపడడంతో వృద్ధుడు మూత్ర విసర్జనకు వెళతానని సిబ్బందిని అడిగాడు. అయితే ఆస్పత్రిలో ఉన్న మూత్రశాలను వినియోగించుకోవడానికి వారు నిరాకరించడంతో రోడ్డుపైకి వెళ్లాడు. అక్కడ ఎండ వేడిమి తట్టుకోలేక రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రి లోపలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా ఆస్పత్రి సిబ్బంది సహకరించలేదు. మళ్లీ అక్కడున్న వారంతా గొడవ చేయడంతో లోపలకు తీసుకెళ్లి వృద్ధుడు మృతి చెందాడని చెప్పి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: కొత్త సెల్‌ఫోన్: బైక్ దిగగానే ఒక్కసారిగా షాక్.. ఆన్లైన్ పేమెంట్‌కు ఒప్పుకోని ఆస్పత్రి యాజమాన్యం -
ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుగా నిర్ణయించుకుని (ప్రీ డిటర్మైండ్) వచ్చి తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ తీర్పును కొట్టివేయాలంటూ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అప్పీల్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జికి ఉద్దేశాలను ఆపాదించడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడింది. న్యాయస్థానంలో దాఖలు చేసే పిటిషన్లలో సంతకాలు చేసే ముందు సంబంధిత అన్ని అంశాలను జాగ్రత్తగా చదువుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఈ తరహా వ్యాఖ్యలను అనుమతించమని, ప్రభుత్వ న్యాయవాదులు అప్రమత్తంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పిటిషన్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అప్పీల్లో ఈ తరహా అంశాలను పేర్కొన్నందుకు వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్ కర్ణన్ సహా స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జిపై చేసిన వ్యాఖ్యల అంశాలను అప్పీల్ నుంచి తొలగించేందుకు అనుమతించాలంటూ అభ్యర్థించడంతో ఎ.సంజీవ్‌కుమార్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును రీకాల్ చేసింది. కలెక్టర్‌ను మాత్రం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నిబంధనల కు విరుద్ధంగా కొందరు రైతులమని చెబుతూ గ్రామీణ వికాస బ్యాంక్ నుంచి రుణాలు పొందారంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్‌ను 2019, డిసెంబర్ 11న ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో వెంకట్రామయ్య గత ఏడాది సెప్టెంబర్‌లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కలెక్టర్ స్పందించారని, హైకోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌కు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ రూ.500 జరిమానా విధించారు. ఈ డబ్బును కలెక్టర్ జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణన్ అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అని, కోర్టుల మీద గౌరవం కలిగిన అధికారిగా ఆదేశాలను అమలు చేస్తున్నారని సంజీవ్‌కుమార్ వివరించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... ఈ నెల 10న కలెక్టర్ కర్ణన్ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: భూవివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూవివాదాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యుడిగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయిలో మూడంచెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16 వేల కేసులు పరిష్కారమయ్యే వరకు ఈ ట్రిబ్యునళ్లు పనిచేయనున్నాయి. ఆ తర్వాత అవసరాల మేరకు వీటి కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–2020 తీసుకొచ్చింది. ఇనామ్‌తో పాటు రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం–1971 రద్దయిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ప్రభుత్వం అప్పట్లో సీసీఎల్ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్)కు బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లకు అప్పగించింది. బదిలీ చేసిన నెల రోజుల్లోగా అన్ని కేసులను పరిష్కరించాలని ట్రిబ్యునళ్లకు గడువు విధించింది. అదనపు కలెక్టర్(రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ట్రిబ్యునల్ సభ్యుడిగా.. ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సమయంలో డీఆర్వో సభ్యుడి గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. చివరకు కలెక్టర్లకే బాధ్యతలు రిటైర్డ్ జిల్లా జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరైన ఐఏఎస్‌లతో ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకున్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. ఇలా కొంతమంది అధికారుల జాబితాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. చివరకు జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునళ్ల ప్రత్యేకతలు.. జిల్లా కేంద్రంలోనే కాకుండా అవసరమైతే రెవెన్యూ డివిజనల్, మండల కేంద్రాల్లో కేసుల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ సమావేశం కావచ్చు. ట్రిబ్యునళ్ల కోసం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాలి. ప్రతి కేసుకు సంబంధించిన తీర్పులను కంప్యూటరైజ్డ్ చేయాలి. కేసు పురోగతిని ట్రాక్ చేసి పరిష్కరించేందుకు వీలుగా కేసుకు సంబంధించిన మెటా డేటాను జాగ్రత్తపర్చాలి. సిస్టం ద్వారా ప్రతి కేసుకు నంబర్ కేటాయించాలి. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం–2020లోని సెక్షన్ 13లో పేర్కొన్న అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు సంక్రమిస్తాయి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ట్రిబ్యునల్‌కు బదలాయించాలి. చట్టం మేరకు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలవుతాయి. కేసుల పరిష్కారం అనంతరం వీటికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టరేట్లో నిబంధనల ప్రకారం భద్రపర్చాలి. -
నేటికి పాలమూరుకు 130 ఏళ్లు
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి శుక్రవారం నాటికి 130 ఏళ్లు గడుస్తోంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులతో కీర్తింపబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండటంతో పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని కథనాలు ఉన్నప్పటికీ.. మహబూబ్‌నగర్‌ను అసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారని తెలుస్తోంది. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అసఫ్జాహి రాజులు 1890, డిసెంబర్ 4న మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్ర చెబుతోంది. శాతవాహన, చాళుక్య రాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందికి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు అసబ్‌జాహి నవాబులు పాలించారని, స్వాతం్రత్యానంతరం 1948, సెపె్టంబర్ 18న నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవనాలు, భూములను ప్రభుత్వం స్వా«దీనం చేసుకొని వాటిని వివిధ కార్యాలయాలకు వినియోగించారు. నిజాం భవనాలే ప్రభుత్వ కార్యాలయాలు.. నిజాం పాలనలో నిర్మించిన భవనాలను ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ ఆఫీస్, ఆర్అండ్బీ ఈఈ కార్యాలయం, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాషాబ్‌గుట్ట హైసూ్కల్, మోడల్ బేసిక్ హైస్కూల్, రైల్వేస్టేషన్ ఉన్నాయి. నేడు ఆవిర్భావ వేడుకలు.. ఆరో నిజాం నవాబ్మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో 130వ మహబూబ్‌నగర్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రహీం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. -
ఏడాదిలో ఒక్కరే మరణించారట
విశాఖ జిల్లాలో ఆరోగ్యం సుభిక్షంగా ఉందని జిల్లా యంత్రాంగం చెబుతోంది. గడచిన ఏడాదిలో మలేరియా, డయేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, ఆంత్రాక్స్, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన 10,902 మంది పడగా వారిలో ఒక్కరంటే ఒక్కరే చనిపోయారని తేల్చింది. సాక్షి, విశాఖపట్నం : ఏటా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, పచ్చకామెర్లతో పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇలా మరణించే వారి సంఖ్య మైదానం, పట్టణ ప్రాంతాలకంటే మన్యంలోనే ఎక్కువగా ఉంటోంది. కానీ జిల్లా మొత్తమ్మీద స్వైన్‌ఫ్లూతో ఒక్కరే చనిపోయారని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అలాగే 2018 జనవరి నుంచి ఇప్పటివరకు 753 మంది వ్యాధులకు గురవ్వగా వీరిలోనూ ఒక్కరే మరణించినట్టు చూపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతోందని, నిర్లక్ష్యం వహించడం లేదని అందరూ భావించాలన్న ఎత్తుగడతోనే మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వేసవికాలంలో డయేరియా ఉధృతమవుతోంది. వర్షాకాలం ఆరంభానికి ముందే వ్యాధుల (ఎపిడమిక్) సీజన్ మొదలవుతుంది. అలా అక్టోబరు దాకా ఆ సీజను ప్రభావం, ప్రతాపం చూపుతుంది. అప్పట్నుంచి దోమల బెడద తీవ్రమవుతుంది. ఎపిడమిక్ సీజన్లోను, శీతాకాలంలోనూ దోమలు కుట్టడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు విజృంభిస్తాయి. వీటి బారిన పడిన వారు సకాలంలో సరైన వైద్యం చేయించుకోకపోతే మృత్యువాత పడుతుంటారు. ఇలా ఏటా ప్రతి మండలంలోనూ వివిధ ప్రమాదకర వ్యాధులతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వైద్యం అందుబాటులో ఉండని గిరిజన (ఏజెన్సీ) ప్రాంతాల్లో అయితే మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. మారుమూల మన్యం గూడేల్లో పిట్టల్లా రాలిపోతుంటారు. ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో ఎక్కువ మంది చనిపోతుంటారు. అయినప్పటికీ ఇవేమీ రికార్డుల్లోకి ఎక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఇళ్ల వద్దో, ఆస్పత్రుల్లోనో చనిపోయిన వారికి వేర్వేరు కారణాలు చూపుతున్నారు. ఫలితంగా నామమాత్రంగా ఒకటి, అరా మరణాలను నమోదు చేస్తున్నారు. అంకెల గారడీ ఇలా అంకెలతో మోసం చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం వ్యాధి తీవ్రత లేదన్న నిర్ధారణకు వస్తుంది. ఫలితంగా అక్కడ శ్రద్ధ చూపడం మానేస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పేదలు అనారోగ్యం బారిన పడడం, కొన్నాళ్లకు తగిన చికిత్స అందక చనిపోవడం జరుగుతోంది. -
ముచ్చటగా మూడు..
సాక్షి, మెదక్ : జిల్లాలో మూడు నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట నూతనంగా నగర పంచాయతీలుగా మారనున్నాయి. దీంతో ఈ మూడు పంచాయతీల దశ మారనుంది. ఇక్కడ అభివృద్ధి ఊపందుకోనుంది. అయితే అదే సమయంలో ప్రజలపై పన్నుల భారం పడే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవలే జనాభా నిబంధనలను సైతం సవరించింది. జిల్లాలో ప్రభుత్వ నిబంధలను అనుసరించి నగర పంచాయతీల ఏర్పాటుకోసం ప్రతిపాదనలను అధికారులు డిసెంబర్లోనే పంపించారు. జిల్లాలో కొత్తగా తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఎంతోకాలంగా నగర పంచాయతీలుగా ఏర్పడాలనుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల కోరిక నెరవేరింది. ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్.. ఆరు గ్రామాల విలీనంతో తూప్రాన్ నగర పంచాయతీగా ఏర్పాటు కానుంది. 2011 జనాభా లెక్కలను అనుసరించి తూప్రాన్‌లో 14,401 జనాభా ఉంది. నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 15వేల జనాభా అవసరం. దీంతో సమీపంలోని అల్లాపూర్, హుస్సెన్పూర్, రావెల్ల, వెంకటాపూర్, బ్రాహ్మణపల్లి, పడాలపల్లి గ్రామాలను తూప్రాన్‌లో విలీనం చేయనున్నారు. నగర పంచాయతీ ఏర్పాటుతో తూప్రాన్ జనాభా 21,148 లకు చేరనుంది. తూప్రాన్ సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఉండటంతో అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. నగర పంచాయతీ ఏర్పాటుతో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్‌లో రెండు గ్రామాలు.. నర్సాపూర్ ప్రస్తుత జనాభా 17వేలు ఉంది. సమీపంలోని చిన్నచింతకుంట, పెద్ద చింతకుంటలు విలీనం చేయనున్నారు. దీంతో జనాభా 20వేలు దాటుతుంది. నగర పంచాయతీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేటలో విలీనం లేకుండానే.. రామాయంపేట మేజర్ పంచాయతీ కూడా నగర పంచాయతీగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కలనను అనుసరించి రామాయంపేట 17వేల జనాభా ఉంది. దీంతో రామాయంపేటను నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమీపంలోని గ్రామాలను విలీనం చేయకుండానే రామాయంపేట నగర పంచాయతీగా ఏర్పతుంది. నగర పంచాయతీల ఏర్పాటుతో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌ల అభివృద్ధికి అదనంగా నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే ఆదాయం కూడా రెట్టింపు కానుంది. దీంతో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధి పనులు మరింత ఎక్కువగా చేసేందుకు వీలవుతుంది. అయితే నగర పంచాయతీల ఏర్పాటుతో పన్నులభారం పెరుగుతుందన్న ఆందోళన ప్రజలలో వ్యక్తమవుతోంది. -
అవినీతిమయం
ప్రభుత్వ సేవలను ఆయా శాఖల సిబ్బంది సకాలంలో పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. లబ్ధిదారుల విలువైన సమయాన్ని వృథా చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విస్తృత ప్రచారం చేయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు డబ్బులు(లంచం) డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయాలని 1064 టోల్‌ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం అవినీతి రోజురోజుకు పెరిగిపోతోంది. సంగారెడ్డి క్రైం: ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే రెవెన్యూ, విద్యుత్, వైద్యం, పౌర సేవలు, మున్సిపల్ కార్యాలయాల పనితీరుపై విరివిగా ఫిర్యాదులు అందాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయినప్పటికీ ఈ శాఖలే కాకుండా పరోక్షంగా పోలీసు, ఎక్సైజ్, సబ్ రిజిస్ట్రార్, విద్యాశాఖ, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖ, డీఐసీ, ఆర్టీఏ, జలమండలి, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు తదితర శాఖల్లో చేతివాటం ప్రదర్శించనిదే పని కాదనే విమర్శలున్నాయి. లచ్చం ఇచ్చినా.. తీసుకున్నా.. నేరమే లంచం ఇవ్వడం, తీసుకోవడం, పోత్సహించడం నేరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూ.కోట్లల్లో అవినీతి చోటు చేసుకుంటున్నా అడపాదడపా నిర్వహించే దాడుల్లో కేవలం చిన్న చేపలే చిక్కుతున్నాయి. ఏసీబీ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా... బడా అధికారులు పైస్థాయిలో ఉన్న పరిచయాలు, నెట్వర్క కారణంగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 2016లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నర్సాపూర్ తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, దౌల్తాబాద్ తహసీల్దార్ రవీందర్‌రెడ్డిలను నేరుగా అధికారులు కార్యాలయాల్లోనే అవినీతికి పాల్పడితే అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఉమ్మడి జిల్లా పరిధిలో సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో నాగాపూర్ వీఆర్వోగా పని చేస్తున్న నాయికోటి వెంకటేశ్వరరావును బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎడ్ల గంగాధర్‌రెడ్డి ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీపై ఆసక్తి చూపని బాధితులు అవినీతి నిరోధక శాఖ పనితీరు, కేసుల పురోగతి తదితర అంశాలపై ప్రజలు, బాధితులకు పూర్తిస్థాయిలో నమ్మకం, అవగాహన లేక పోవడంతోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం లేదు. కేసుల పేరుతో కార్యాలయాల చుట్టూ తిరిగే కంటే అయినకాడికి పని కానిచ్చుకుని కాలం నెట్టుకొస్తున్నారు సామాన్య జనం. ఓ బాధితుడు ఓ శాఖ అధికారిపై ఏసీబీకి సమాచారం ఇస్తే లోపాయికారి ఒప్పందంతో ఆర్థిక ప్రయోజనాలు తప్ప బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి. నాణ్యతలేని కేసులే ఎక్కువ ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను వివరణ కోరగా మెదక్, సిద్దిపేట్ జిల్లాల నుంచి ఎక్కువగా నాణ్యతలేని కేసులే వస్తున్నాయి. వచ్చిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ జరుపుతూ దాడులు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పనులు చేసేందుకు డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలి. సెల్ 94404 46149లో నేరుగా ఫిర్యాదు చేయాలి. – సూర్యనారాయణ, ఏసీబీ డీఎస్పీ(ఉమ్మడి జిల్లా) ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏసీబీ కేసులు 2011 05 2012 08 2013 10 2014 06 2015 16 2017 01 ఆకస్మిక తనిఖీలు 2013 02 2014 01 2015 04 2016 04 -
నిలదీత: వాడీవేడిగా జెడ్పీ సమావేశం
ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం చూపాల్సిన జిల్లా సర్వసభ్య సమావేశం గతి తప్పింది. ప్రధానంగా సాగు, తాగునీరు, మరుగుదొడ్ల కుంభకోణంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఈ అంశాలపై పాలకపక్ష, విపక్ష సభ్యుల వాగ్వాదంతో సమావేశం రచ్చ..రచ్చగా మారింది. సాగునీటి సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు సోమశిల ప్రాజెక్ట్ ఎస్ఈ నాగూర్‌మీరా ఊగిపోతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై జోక్యం చేసుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎస్ఈ తీరు సరికాదంటూనే ఆయనకు మద్దతుగా నిలిచారు. కావలి ఎమ్మెల్యేను ‘నీవు రౌడీవి, చాలెంజ్ చేస్తున్నా’ అంటూ ఏక వచనంతో బీద మాట్లాడిన తీరును పలువురు సభ్యులు తప్పుపట్టారు. సభ పక్కదారి పడుతున్న నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కలుగజేసుకుని సభను గాడినపెట్టారు. నెల్లూరు(అర్బన్): స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షత వహించిన సర్వసభ్య సమావేశంలో సీఈఓ సీహెచ్ సుబ్రహ్మణ్యం అజెండాను ప్రవేశపెట్టారు. తొలుత సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీరు, మరుగుదొడ్లు, వీధి లైట్ల నిర్వహణలో పంచాయతీరాజ్ వ్యవస్థ విఫలమైందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తూ పోలీసు పికెట్ పెట్టి కొన్ని గ్రామాలకు సాగునీరు ఇవ్వకుండా తరువాత గ్రామాలకు సాగునీరు ఇస్తున్నారని ఆరోపించారు. కండలేరు కింద మంత్రులు 20,700 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారని అయితే ఎస్ఈ మాత్రం 4,500 ఎకరాలకు సరిపడేవిధంగా చెరువులకు ముందు నీరు నింపుతామంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓజిలి ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే 100 ఎకరాల్లో వరిపంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం సోమశిలకు అదనంగా ఐదు టీఎంసీలు నీరు ఇచ్చి కూడా ఏమి లాభమని నిలదీశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న చోట ఇరిగేషన్ అధికారులే పరిశీలించి నీటిని విడుదల చేసే విధంగా కలెక్టర్ అనుమతివ్వాలని కోరారు. డీవీసత్రం జెడ్పీటీసీ సభ్యురాలు ముప్పాళ్ల విజిత మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఒకటి, రెండు తడులు నీరిస్తే పంటలు పండుతాయని తెలిపారు. అధికారులు మధ్యలో గ్రామాలను పక్కకు నెట్టేసి చివరి గ్రామాలకు నీరిస్తున్నారని ఇందులో ఏఈలు, డీఈల స్వార్థం ఉందని ఆరోపించారు. జేసీ ఇంతియాజ్ అహ్మద్ జోక్యం చేసుకుంటూ పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. మరుగుదొడ్లు కుంభకోణం సిగ్గుచేటు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. మరుగుదొడ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారని వారందరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జేసీని ప్రశ్నించారు. పేదలకు అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. 60 శాతం కూడా మరుగుదొడ్లు పూర్తి కాలేదని, ఇలాంటప్పుడు ఓడీఎఫ్‌గా జిల్లాను ఎలా ప్రకటించారని నిలదీశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ తాను కూడా కొన్ని గ్రామాలను పరిశీలించానన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామిరెడ్డి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ మరుగుదొడ్లు కుంభకోణానికి పాల్పడిన వారిపై పార్టీలకతీతంగా చర్యలు చేపట్టాలని కోరారు. జేసీ ఇంతియాజ్ సమాధానమిస్తూ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలతో పాటు నిధులు మింగిన వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు లెట్రిన్ కమ్ బాత్రూం నిర్మాణానికి సరిపోవడం లేదని, ఈ మొత్తాన్ని రూ 25,000 ఇచ్చేవిధంగా జెడ్పీ తరపున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సూచన విషయంలో కూడా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు కాకాణి, కోటంరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ప్రాణాలతో వైద్యశాఖ చెలగాటం దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యుడు చీదెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తేలుకుట్టిన బాలికను పీహెచ్‌సీకి తీసుకెళ్తే అక్కడి డాక్టర్ చేయికూడా పట్టుకోకుండానే బయటకు నెట్టేశారని విమర్శించారు. దుత్తలూరు, ఉదయగిరి మండలాలకు సంబంధించి 2016లో ఉపాధి హామీ ప«థకం కింద రూ.90లక్షల మేర పనులు చేపట్టారన్నారు. అధికారుల తప్పిదంతో కంప్యూటర్లో వివరాలు ఎగిరిపోయాయన్నారు. ఈ నిధులు రాక నేటికీ పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్వామా పీడీ శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసి విజయవాడకు పంపించి నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ నీళ్లలో మునిగిపోయిన ఇద్దరు బాలురను వాకాడు, కోట ఆస్పత్రులకు తీసుకెళ్తే రెండు చోట్ల డాక్టర్ లేరని అందువల్లనే వారు ప్రాణాలు వదిలారని ఆరోపించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సరుకులు ఇళ్లలో పెట్టడం వల్లనే అవినీతి జరుగుతోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే సరుకుల నిల్వ ఉంచాలని సూచించారు. వింజమూరు జెడ్పీటీసీ సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో గత సంవత్సరం తాగునీటిని ట్యాంకర్లతో తోలామని, ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇఫ్కోపై కలెక్టర్ తీరు సరికాదు రేగడి చెలిక గ్రామం వద్ద ఏర్పాటు అయిన ఇఫ్కో పరిశ్రమలో అదనంగా ఏర్పాటు చేసే ఎలాంటి పరిశ్రమలకు అనుమతులిచ్చేది లేదంటూ గ్రామ సభ తీర్మానం చేసినా, కోర్టులో కేసు ఉన్నా కలెక్టర్ ముత్యాలరాజు దొడ్డిదారిలో అక్కడ కాలుష్య పరిశ్రమలకు అనుమతిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఇందూరు శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖం చాటేసిన మంత్రులు జిల్లా మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమావేశానికి రాకుండా ముఖం చాటేశారు. తొలుత జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డితో పాటు వైస్ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష, జేసీ ఎ.ఇంతియాజ్ అహ్మద్, సీఈఓ సీహెచ్ సుబ్రహ్మణ్యం సభను నడిపించారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
సాక్షి, వికారాబాద్: పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత మేరకు కృషిచేస్తున్నానని అన్నారు. తాత్కాళిక పనులతో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినవని చెప్పారు. వీటితో రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీరు, సాగునీటికి కొరత ఉండదని పునరుద్ఘాటించారు. యువతకు ఉపాధి కల్పించడానికి గాను వారి స్వగ్రామాలలోనే ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను సోయా పాలు పంపిణీ చేయాలని కూడా యోచిస్తున్నామని తెలిపారు. జిల్లాలో స్వతహాగా పర్యాటకం అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాత్రివేళ బస చేసేందుకు ఇక్కడ సౌకర్యాలు లేవని, పర్యాటకుల కోసం సుమారుగా 500 గదులను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 85 మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు, నిర్వహణకు గాను ప్రయోగాత్మకంగా వాహనాలను ఏర్పాటుచేశామని తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకుగాను అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. నోరు తెరిచిన బోర్‌వెల్స్‌ను గుర్తించి క్యాపింగ్ చేసేందుకుగాను ప్రత్యేక యాప్‌ను తయారుచేశామని వివరించారు. ఆ యాప్‌లో బోరు ఫొటో అప్‌లోడ్‌చేస్తే దానంతట అదే లొకేషన్ చూపిస్తుందని, తద్వారా క్యాపింగ్ సులభమవుతుందని తెలిపారు. సమావేశంలో ధారూరు పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కె.రాందేవ్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. నాగసమందర్ గ్రామం సందర్శన ధారూరు: మండలంలోని నాగసమందర్ గ్రామాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వివేకానంద విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామానికి ప్రజలతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, యువతకు ఉపాధిపై మాట్లాడారు. ఎంపీ వెంట ధారూరు పీఏసీఎస్ చైర్మెన్ హన్మంత్‌రెడ్డి, గ్రామ సర్పంచు శ్రీనివాస్, ఎబ్బనూర్ సర్పంచు రాజేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ యువజన విబాగం ఉపాధ్యక్షుడు వడ్లనందు, నాయకులు రవీందర్‌రెడ్డి, వరద మల్లికార్జున్‌లు ఉన్నారు. -
అనుమతి లేనిదే జిల్లాను వదిలి వెళ్లొద్దు
ఏలూరు (మెట్రో): జిల్లాలో అన్ని శాఖల అధికారులు సాధారణ సెలవులు, ప్రభుత్వ సెలవుదినాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే జిల్లా దాటి వెళ్లాలని ఆయా శాఖాధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు స్థానికంగా పనిచేసే ప్రదేశంలో నివాసం ఉండకుండా విజయవాడ, ఇతర ప్రాంతాల నుండి ప్రతి రోజు జిల్లాకు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో ఏదైనా అనుకోని ప్రమాద సంఘటన జరిగినప్పుడు సంబంధిత శాఖాధికారులు అందుబాటులో లేకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారన్నారు. ఇఆఫీస్లో జిల్లా అధికారులు సెలవులు పెట్టి తన అనుమతి లేనిదే వెళ్లకూడదని కలెక్టర్ చెప్పారు. చంద్రన్న బీమా క్లెయిమ్స్ మీద సమీక్షిస్తూ పోలీస్ శాఖ వారి దగ్గర ఎఫ్ఐఆర్లు 10 పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటినీ 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం ద్వారా వచ్చిన, మీ సేవలో వచ్చిన అర్జీలు సెల్ఫీ లేదా వీడియోలో చిత్రీకరించి నమోదు చేయాలని ఆదేశించినా కొన్నిశాఖలు నమోదు చేయడం లేదన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు. నూరు శాతం టీకాలు వేయించాల్సిందే పొంగు, తట్టు వ్యాధి నిరోధక టీకాలు జిల్లాలో 100శాతం పిల్లలకు వేయించాలని జిల్లా వైద్యాధికారి, ఇమ్యునైజేషన్ అధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 3వ జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో పల్స్ సర్వే ప్రకారంగా 8లక్షల 36వేల మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ సెప్టెంబరు 8వ తారీకు లోపల వైద్యాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బాధ్యత వహించి అందరికీ తట్టు, పొంగు నివారణ టీకాలు వేయించాలని, వారి వివరాలన్నీ ఆన్లైన్ యాప్‌లో నిర్ణయించిన ప్రొఫార్మాలో పొందు పరచాలని ఆదేశించారు. గతంలో చేసిన నిర్లక్ష్యం ప్రస్తుతం చేయొద్దని సూచించారు. టీకాలు వేయించడంలో విద్యాశాఖ, శిశు సంక్షేమశాఖ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ, మైనార్టీ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటింటా సర్వే నిర్వహించండిః స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా జిల్లాను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా గుర్తించేందుకు ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకూ నివేదిక సమర్పించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలను గుర్తించి నివేదికను త్వరితగతిన ఎంపీడీఓలు పంపాలని ఆదేశించారు. జిల్లాకు నూతనంగా వచ్చి నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరించి వారి గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేందుకు స్త్రీశిశు సంక్షేమశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్త్రీశిశు సంక్షేమశాఖ సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెలా 31వ తేదీ నాటికి ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యావతిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, డీఆర్ఓ కె.హైమావతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని, డీఎస్ఓ షరీఫ్, డీఎం పీ.కొండయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.కోటేశ్వరి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గత 24 గంటల్లో 19.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని సీపీఓ బాలకృష్ణ శనివారం తెలిపారు. అత్యధికంగా ఆచంట మండలంలో 94.8 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, పోడూరు 67.4, యలమంచిలి 60, పెనుగొండ 51.4, వీరవాసరం 50, పెంటపాడు 35.6, తణుకు 28.4, ఉండ్రాజవరం 25.8, పెరవలి 35.2, ఇరగవరం 33.2, అత్తిలి 38.4, ఉండి 49.2, ఆకివీడు 39.6, కాళ్ల 26.4, భీమవరం 45, పాలకోడేరు 48, పెనుమంట్ర 47, పాలకొల్లు 45, జీలుగుమిల్లి 2, బుట్టాయిగూడెం 3, పోలవరం 17, నిడదవోలు 3, తాడేపల్లిగూడెం 7, ఉంగుటూరు 2.4, పెదవేగి 1.4, పెదపాడు 6.4, ఏలూరు 11, దెందులూరు, నిడమర్రులలో 7.4, గణపవరం 2.6, నర్సాపురం 9, మొగల్తూరు 15, కుకునూరు 11, వేలేరుపాడు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. -
ప్రజలకు వాస్తవాలు తెలిపేదిగా పత్రికారంగం ఉండాలి
- ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో డిప్యూటీ సీఎం రాజప్ప కాకినాడ సిటీ : ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవిధంగా పత్రికారంగం ఉండాలని, అటువంటి పాత్రికేయులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజప్ప మాట్లాడుతూ, నిజమైన వార్తలు రాసినప్పుడు రక్షణ ఉంటుందని, అవాస్తవమైన వార్తలు రాసినప్పుడు చర్యలు తప్పవని అన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇప్పటికే ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డ్ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణానికి చర్యలు చేపడతామని, ఏజెన్సీలో ఇళ్ల సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు చేపడతామని, అనారోగ్యం తదితర సమస్యలు వస్తే సీఎం సహాయ నిధి నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి విలేకరులు వారధి వంటి వారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, ఎ.ఆనందరావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, ఆదిత్యా విద్యాసంస్థల చైర్మన్ ఎన్.సతీష్‌రెడ్డి, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఏపీయూడబూ్ల్యజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ధర్మారావు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డి.సోమసుందరం, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీరామ్మూర్తి, జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జిల్లాకు తరలివచ్చిన అదనపు పోలీస్ బలగాలు
ఏలూరు అర్బన్ : జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500కు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగులు శనివారం జిల్లా కేంద్రం ఏలూరుకు వచ్చారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈ సిబ్బందిని రిజర్వు ఫోర్స్‌గా పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఈ బలగాలను అవసరం మేరకు ఆయా ప్రాంతాలకు తరలించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు ఈ బలగాలను అధికారులు ఉపయోగించుకోనున్నారు. నలుగురు డీఎస్పీ, నలుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 250 మంది కానిస్టేబుళ్లు, 220 మంది హోంగార్డులను వినియోగించనున్నారు. -
ముసురు.. ముసుగు
కానరాని ఎండ పొడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు నిండుగా ప్రవహిస్తున్న కొండవాగులు నీట మునిగిన పంట పొలాలు గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల కుదింపు భారీ వర్షాలన్న వాతావరణ శాఖ అన్నదాతల ఆందోళన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతూనే ఉన్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం తీవ్రరూపు దాల్చి వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు చేసిన హెచ్చరికతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొవ్వూరు :రెండు రోజుల నుంచి జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. బుట్టాయగూడెం మండలంలో జల్లేరు, రౌతుగూడెంవాగు, కొవ్వాడ కాలువ, కన్నాపురం వాగులతోపాటు ఎర్రవాగు తదితర కొండ వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం, రౌతుగూడెం, విప్పలపాడు వాగులయితే పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, కొవ్వూరు మండలాల్లో లోతట్టు ప్రాంతంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాలకు పైగా వరిపంట ముంపు బారిన పడింది. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి తదితర మండలాల్లో పలుచోట్ల వరి నారుమళ్లు నీటమునిగాయి. ప్రస్తుతానికి ఈ పంటలకు అంత నష్టం లేకపోయినప్పటికీ మరిన్ని రోజుల పాటు నీటిలో నానితే నారుకుళ్లి పోతుంది. తద్వారా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. డెల్టాకు నీటివిడుదల కుదింపు : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి విడుదలను భారీగా కుదించారు. పశ్చిమ డెల్టాకు ఆదివారం ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు సోమవారం సాయంత్రం నుంచి మూడు వేల క్యూసెక్కులు తగ్గించి రెండు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతు న్నారు. ఆదివారం మూడు డెల్టాలకు 8,700 క్యూసెక్కులు అందించిన అధికారులు సోమవారం సాయంత్రం నుంచి 4,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 900, సెంట్రల్ డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల చోప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. గోదావరిలో పెరుగుతున్న ఇ¯ŒSఫ్లో: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద పెరుగుతోంది. సోమవారం ఉద యం 42,993 క్యూసెక్కులు ఉన్న ఇ¯ŒSఫ్లో సాయంత్రానికి 90,564 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టుకి సాగునీరు విడిచిపెట్టగా 86,464 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ధవళేశ్వరం వద్ద ఇ¯ŒSఫ్లో పెరుగుతున్న దృష్ట్యా ఆనకట్టకు నాలుగు ఆర్మ్‌ల వద్ద ఉన్న 175 గేట్లలో 143 గేట్లును 0.20 ఎత్తులేపి వరదను దిగువకు విడిచి పెడుతున్నారు. ఎగువున భద్రాచలంలో సోమవారం ఉదయం 13.50 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 16.50 అడుగులకు పెరిగింది. కొయిదాలో ఉదయం 6.35 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రం ఆరుగంటలకు 7 మీటర్లుకు పెరిగింది. స్తంభించిన జనజీవనం : సోమవారం ఉదయం నుంచి వర్షం తెరిపివ్వకుండా చినుకులు పడుతూనే ఉండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జన జీవనం స్తంభించడంతో వ్యాపారాలు సైతం మందకొడిగానే నడిచాయి. కొందరు వ్యాపారులు ముసురును దృష్టిలో ఉంచుకుని దుకాణాలు తెరవలేదు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రయివేటు పాఠశాలల్లో పిల్లల్ని మధ్యాహ్నం నుంచి ఇళ్లకు పంపించి వేశారు. పట్టణాల్లో రోడ్లుపైన, వీధుల్లోను తోపుడు బండ్లుపై చిరు వ్యాపారులు చేసుకునే వర్తకులపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. -
స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుంటే చర్యలు
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి రాజమహేంద్రవరం క్రైం : స్కూల్, కళాశాల బస్సులు ఫిట్నెస్ లేకుంటే ఆ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు. ఎస్‌కేవీటీ కళాశాలలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ను, నిర్వహణను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 719 బస్సులకు 574కు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. మే 15వ తేదీకి ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగుస్తుందని రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రోడ్డు రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఐదు టీమ్‌లు ఏర్పాటు చేశామని ఇవి హైవేపై పెట్రోలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాయన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి స్కూల్, కాలేజీ బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, క్లినర్ లేకుండా బస్సులు తీయవద్దన్నారు. విద్యార్థులు బస్సులో నుంచి చేతులు బయట పెట్టకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నోడల్ ఆఫీసర్ భరత్ మాతాజీ, సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐలు చింతా సూరిబాబు, బాజీలాల్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీ రావు, ఎస్సై రాజశేఖర్, రోడ్ రవాణా శాఖల అధికారులు సాయినాథ్, పరందామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలే అజెండాగా...
- నేడు వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ - హాజరుకానున్న రాష్ట్ర ప్రముఖులు - వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు - ఏర్పాట్లు పూర్తి చేసిన నేతలు కాకినాడ : ప్రజా సమస్యలు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేశారు. కాకినాడకు సమీపంలోని తూరంగి–నడకుదురు రహదారిలోని కుసుమ సత్య కన్వెన్షన్ హాలు వద్ద ఈ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ జరిగే వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు పెట్టి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు జిల్లా ముఖ్యనేతల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. జెండా వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రముఖులు ప్లీనరీకి విచ్చేస్తున్నారు. 30 వేల మందికి ఆహ్వానాలు... మున్నెన్నడూ జరగని రీతిలో జిల్లా ప్లీనరీని నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సుమారు 30 వేల మందికి నాయకులు, కార్యకర్తకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు కూడా పంపారు. ఆయా నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ముఖ్య నేతలను సమన్వయం చేసి ప్లీనరీకి ఆహ్వానించారు. ప్రముఖుల రాక... జిల్లా ప్లీనరీకి రాష్ట్ర స్థాయిలోని పార్టీ ప్రముఖులను ఆహ్వానించారు. జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.పార్థ సారథి, రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ,బీసీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి ప్లీనరీకి విచ్చేస్తున్నారు. .ప్రజా సమస్యలే అజెండా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీకి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ప్లీనరీలో అనేక ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లా ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి నివేదించనున్నారు. ఏర్పాట్లు పూర్తి... ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను పార్టీనేతలు పూర్తి చేశారు. జిల్లాకు చెందిన అనేక మంది నేతలను సమన్వయం చేసి బాధ్యతలు అప్పగించారు. వేదిక అలంకరణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను నేతలు పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి తరలిరండి... జిల్లా ప్లీనరీకి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలిరావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గ స్థాయిల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలపై కూడా చర్చించనున్నారు. జిల్లాస్థాయి అంశాలను కూడా చర్చించి తీర్మానాల రూపంలో రాష్ట్ర పార్టీకి నివేదిస్తాం. రాష్ట్ర స్థాయి ప్లీనరీ అనంతరం పార్టీ ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. - కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
వద్దు వద్దన్నా.. ఆయనకే పగ్గాలు
- టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నామన - నియమించిన చంద్రబాబు - మెజార్టీ నోరు నొక్కి ఏకపక్ష నిర్ణయం - జెడ్పీ పీఠం నుంచి రాంబాబు ఉద్వాసన తప్పదని అనుమానాలు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎంతో కాలానికి వచ్చిన పదవిని వదులుకోవాలంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అందునా ఏ తప్పూ లేకుండా వైదొలగమంటే మనసుకు మరింత కష్టంగా ఉంటుంది. పైగా ఆ పదవిని తన కళ్లముందే మరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే.. పంచభక్ష్య పరమాన్నాలతో ఉన్న తన విస్తరిని ఎవరో తన్నుకుపోయినంతగా పరివేదన కలుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు సరిగ్గా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వద్దు వద్దన్నా ఆయనకు అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలను అప్పగించారు. మరోపక్క జెడ్పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును నియమితులయ్యారు. తనకు పార్టీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదని, అలాగే, జెడ్పీ పీఠాన్ని కూడా వదులుకునేది లేదని ఇప్పటికే నామన కరాఖండీగా చెప్పారు. మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు కూడా ఆయనను జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తొలగించవద్దని కోరారు. అయినప్పటికీ వారి మనోగతాన్ని బేఖాతరు చేస్తూ.. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి నామన పేరునే అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఖరారు చేశారు. తద్వారా.. అసలే తమకు అధికారాలు లేవని మధనపడుతున్న జెడ్పీటీసీ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఇష్టం లేదన్నా.. వాస్తవానికి నామనను జెడ్పీ పీఠం నుంచి తప్పించి, ఆ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు, జగ్గంపేట జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు అప్పగించేందుకు పార్టీ నేతలు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు సమక్షంలో గత నెల 21న కాకినాడలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్ మార్పును వ్యతిరేకించారు. వివాదరహితుడైన నామన రాంబాబును ఆ పదవి నుంచి తప్పించవద్దని, దీనివల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వారి మనోధైర్యం దెబ్బ తింటుందని మొత్తుకున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పారు. అధికారాలు, నిధులు, విధులు లేకపోతే పోయే.. కనీసం తమకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పనులు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమకు చెందిన నామన సహితం జెడ్పీ పీఠాన్ని విడిచిపెట్టేందుకు, పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఒత్తిడి తేవడంతో అలకబూనిన నామనను.. ప్రత్తిపాడులో నిర్వహించిన మినీ మహానాడు వేదిక పైకి తీసుకువచ్చి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. అయితే, అవి బెడిసికొట్టాయి. అప్పటినుంచీ ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాన్చుతూ వచ్చారు. తన వ్యూహంలో భాగంగా పక్షం రోజులుగా జెడ్పీటీసీ సభ్యులను విభజించి పాలించే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఎమ్మెల్యేల ద్వారా నయానా భయానా వారి నోరు నొక్కి దారికి తెచ్చుకున్నారు. తద్వారా చివరకు నామనకు నామం పెట్టే దిశగా చర్యలు ఆరంభించారు. ఇందులో భాగంగానే ఆయనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక జెడ్పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనకు ఉద్వాసన పలకడం కూడా ఖాయమని పలువురు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసేవారు కరివేపాకుల్లా తీసి పారేస్తారన్న విషయాన్ని అధిష్టానం మరోసారి రుజువు చేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సహితం తమకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారని, చివరకు చైర్మన్‌ను మార్చాలన్నా వారి పెత్తనమే చెల్లుబాటవుతోందని టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు రగిలిపోతున్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆత్మాభిమానం చంపుకుని అనివార్యంగా కట్టుబడి ఉండాల్సి వచ్చిందని వారంటున్నారు. కానీ ఈ అర్ధాంతరపు ఉద్వాసన ప్రక్రియ మాత్రం పార్టీకి తీవ్ర నష్టమే తెస్తుందని స్పష్టం చేస్తున్నారు. నామనకు జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో మూడేళ్లు వచ్చే జూలై 5 నాటికి పూర్తి కానున్నాయి. అప్పటివరకైనా ఆయనను ఆ పీఠంపై ఉంచుతారా లేక ఈలోపే ఉద్వాసన పలుకుతారా అనేది వేచి చూడాల్సిందే. -
డీపీఓ కావలెను
- రెండేళ్లుగా ఇన్‌చార్జిలతోనే సరి - గుట్టలుగా పేరుకుపోతున్న ఫైళ్లు - ఏ అనుమతి కావాలన్నా కలెక్టరేట్‌కే.. - 3 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్న కార్మికులు బోట్‌క్లబ్ (కాకినాడ) : పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) లేకపోవడంతో జిల్లాలో గ్రామ పరిపాలన గాడి తప్పుతోంది. ఇక్కడ డీపీఓ పని చేసిన ఆనంద్ 2015 జూలైలో బదిలీ అయ్యారు. అప్పటి నుంచీ ఈ స్థానాన్ని ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. వారు కూడా కార్యాలయానికి సక్రమంగా రాకపోవడంతో ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయి ఇన్చార్జిలను సహితం మారుస్తున్నప్పటికీ పాలన గాడిలో పడడం లేదు. ఆనంద్ బదిలీ తరువాత నుంచి ఇప్పటివరకూ నలుగురు ఇన్చార్జ్ డీపీఓలుగా పని చేశారు. ఆనంద్ బదిలీ అయిన వెంటనే జిల్లా సహకార అధికారి ప్రవీణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సుమారు ఆరు నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా డీపీఓ కార్యాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో ఫైల్స్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీనిపై అప్పట్లో ‘ఇన్చార్జి పాలనతో అవస్థలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి, అమలాపురం డీఎల్పీఓ శర్మను ఇన్చార్జ్గా నియమించారు. ఆయన సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ఆరు నెలల తరువాత జెడ్పీ సీఈఓ పద్మకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్‌లో పని భారం ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా డీపీఓ కార్యాలయంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో ఆమెను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించి రంపచోడవరం గిరిజన సంక్షేమ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న టీవీఎస్‌జీ కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. ఆరు నెలలుగా ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పెండింగ్ ఫైళ్లకు మోక్షమెప్పుడో! జిల్లాలోని మేజర్ పంచాయతీలు మినహా మైనర్ పంచాయతీల్లో రెగ్యులర్ సిబ్బంది ఉండరు. దీంతో అక్కడ కాంట్రాక్టు సిబ్బందితో పారిశుద్ధ్యం, ట్యాంకు వాచర్లు, బిల్లు కలెక్టర్ల వంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. వారికి జీతభత్యాలు చెల్లించేందుకు అనుమతి కోరుతూ డీపీఓకు పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా ఫైల్ పెడతారు. డీపీఓ అనుమతి లేనిదే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్చార్జ్ డీపీఓ కావడంతో ప్ర ఫైలునూ కలెక్టర్ అనుమతి కోసం పంపుతున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న 500 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ జీతం చెల్లించాలి. తమకు జీతాలు చెల్లించాలని పంచాయతీ అధికారులపై కాంట్రాక్టు సిబ్బంది ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు డీపీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడంలేదు. వేరే శాఖ అధికారి వల్ల ఇబ్బందులు జిల్లాలో ఐదుగురు డివిజనల్ పంచాయతీ అధికారులుండగా వారికి కాకుండా వేరే శాఖకు చెందిన వారికి ఇన్చార్జి డీపీఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి గ్రామ పరిపాలనపై సరైన అవగాహన లేనందువల్లనే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయన్నది సిబ్బంది వాదన. రెగ్యులర్ డీపీఓను నియమిస్తే తప్ప తమ ఇబ్బందులు తొలగవని వారంటున్నారు. ప్రస్తుతం కడప డీపీఓగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొందరు ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం
- కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు హాజరుకావాలి - పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించామని, జిల్లా స్థాయి ప్లీనరీ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. జిల్లా ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే అంశంతోపాటు, సమావేశ అజెండా, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లా ప్లీనరీకి పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ పరిశీలకులుగా పార్టీ నియమించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరవుతారన్నారు. సన్నాహక సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలు విధిగా హాజరుకావాలని కన్నబాబు కోరారు. -
వసూల్ రాణిపై విచారణంటేనే హడల్!
చేతులెత్తేసి తప్పుకున్న డీపీఓ వసూళ్లపై ప్రాథమికంగా నిర్థారణ విచారణాధికారిగా జేసీ–2 రాధాకృష్ణ నియామకం సాక్షి ప్రతినిధి, కాకినాడ : వసూళ్ల రాణిపై విచారణ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎం.బాలామణిపై శాఖాపరమైన విచారణ చేయలేనంటూ స్వయంగా ఇన్చార్జి డీపీఓ టీవీఎస్‌జీ కుమార్ చేతులెత్తేశారు. డీపీఓ కార్యాలయ ఏఓ బాలామణి పంచాయతీ కార్యాదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయాన్ని గత నెల 29న ‘వసూళ్ల రాణి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో గత నెల 30న ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వసూళ్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ డీపీఓ కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన డీపీఓ నలుగురైదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను విచారించి వసూళ్ల విషయం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. విచారణ ముందుకు వెళితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనే నిర్థారణకు రావడంతో అధికార పార్టీ నేతలు విచారణను అడ్డుకునే ప్రయత్నాలకు తెరతీశారు. కాకినాడలోని డీపీఓ కార్యాలయంలో అన్ని వ్యవహారాలు తెలిసి పరోక్షంగా ఆధిపత్యం చెలాయించే ఒక రిటైర్డ్ డీపీఓ కూడా విచారణను ముందుకుసాగకుండా అడ్డుతగులుతున్నారని కార్యాలయ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలే ఇన్చార్జి బాధ్యతలు, తనను డీపీఓగా నియమించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పుడు అనవసర రాద్ధాంతం నెత్తిన పెట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గానీ డీపీఓ కుమార్ హఠాత్తుగా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవడం కార్యాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టర్ అప్పగించిన బాధ్యతల మేరకు డీపీఓ అప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభమైన నాలుగు రోజులకే అధికార పార్టీ నేతలు అడ్డుచక్రం వేయడం మొదలుపెట్టారు. విచారణ నివేదిక ‘కర్ర విరగకండా...సామెత మాదిరిగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇంతలో డీపీఓ విచారణలో వసూళ్ల వ్యవహారం వాస్తవమేనని ప్రాథమికంగా ఒక నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమయంలోనే విచారణ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో డీపీఓ స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. వసూళ్ల వ్యవహారంపై డీపీఓ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జేసీ–2ను లోతైన విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే విచారించిన గ్రామ కార్యదర్శులతో పాటు కోనసీమలోని పలువురు కార్యదర్శులను విచారించాల్సి ఉందని చెబుతున్నారు. -
సుర్రుమనిపించిన సూరీడు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ ప్రచండంతో జిల్లా ప్రజలు విలవిల్లాడారు. సోమవారం జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడినా.. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకూ 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే చవిచూసిన ప్రజలు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో తల్లడిల్లారు. వడగాడ్పుల తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోయారు. వృద్ధులు, చిన్నారులు వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి వేళలోనూ వదలని వేడి సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రత కనిపించింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. ఇళ్లల్లోని గోడలు, ధరించిన వస్త్రాలు వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లల్లోని మంచినీళ్లు సైతం కాగిపోయాయి. నాసా హెచ్చరికలతో ఆందోళన రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ప్రకటిం చింది. ఆ 8 జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నాలుగు రోజులపాటు ప్రజలు ఎండల్లో తిరగకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వడదెబ్బ బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నీలగిరి’లో నిప్పులు
అత్యధికంగా 44.2 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదు ఉదయం 8 గంటల నుంచే వేడిగాలులు నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు.. అల్లాడుతున్న ప్రజలు నల్లగొండ టౌన్: నీలగిరి నిప్పుల కొలిమిగా మారింది. ఈ సీజన్లో ఎన్నడూ లేని విధంగా శనివారం 44.2 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే వేడిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, దినసరి కూలీలు, వ్యాపారస్తులు మినహా సామాన్యులు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వడగాడ్పుల కారణంగా వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నిలువనీడ, తాగునీరు లేక అవస్థలు పడ్డారు. ఎండలు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు ఏసీలు, కూలర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు మండుతుండడంతో పనులకు వెళ్లే వారు కేవలం సాయంత్రం 7 గంటల తర్వాతనే బయటికి వస్తున్నారు. పట్టణాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకం దారులు, ఉపాధి హామీ కూలీలు, దినసరి కూలీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేని స్థితి. గడిచిన పక్షం రోజుల్లోనే పదిహేను మందికి పైగా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ మూడో వారంలోనే ఎండలు మండుతుంటే మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎండల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
జిల్లా రిజిస్ట్రార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం రూ.3 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాష్ ఇటీవల రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించి కేసు నమోదు చేసినట్టు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపారు. కాకినాడలోని ప్రతాప్‌నగర్‌లోని బాలప్రకాష్ ఇంట్లో శుక్రవారం తనిఖీ చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగులను కూడా విచారించారు. హైదరాబాద్‌లో ఆయన కుమార్తె, కుమారుడు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. కాకినాడలో మూడు ఇళ్లు, ఒక ప్లాట్, 250 గజాల స్థలం, తాడేపల్లి గూడెంలో 400 గజాల స్థలం, గుంటూరులో డాబా ఇల్లు బాలప్రకాష్కు ఉన్నట్టు గుర్తించారు. అలాగే బ్యాంక్ అకౌంట్లలో కుటుంబ సభ్యులు, ఆయన పేరుమీద రూ.30 లక్షలు ఉన్నట్టు తెలుసుకున్నారు. రూ.కోటి 51 లక్షల విలువైన ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం, వెండిని గుర్తించారు. బాలప్రకాష్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కలు వేస్తే ఆయన ఆదాయానికి మించి రూ.3 కోట్లు అధికంగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని తెలియవచ్చింది. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ డి.రమేష్, ఎస్సై టి.నరసింహం, హైదరాబాద్‌లో పి.మోహన్‌రావు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జిల్లా రిజిస్ట్రార్
భూమి రిజిస్ర్టేషన్‌కు రూ.40 వేలు డిమాండ్ బ్రోకర్ ద్వారా అందజేస్తుండగా పట్టుకున్న అధికారులు కాకినాడ క్రైం: ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం మధ్యవర్తి ద్వారా రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాశ్ను పట్టుకున్నారు. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన గుండా శ్రీరామచంద్రమూర్తికి సూర్యారావుపేట అశోక్‌నగర్ సమీపంలో 191/4,195/5, 190/1 సర్వే నంబర్లలో ఉన్న 1.10 ఎకరం భూమిని అభివృద్ధి చేసేందుకు ఆయన కుమారుడు గుండా ప్రసాద్ (కిషోర్) డెవలెపర్స్కి విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం 2016 డిసెంబర్ 30న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సూచించారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాశ్ను సంప్రదించగా ఆయన కూడా అదే విషయం స్పష్టం చేశారు. దీంతో 1964 సంవత్సరం నుంచి ఉన్న సదరు భూ రికార్డులను రెవెన్యూ అధికారులకు చూపగా వారు వాటిని పరిశీలించి ఈ భూమి అసైన్డు భూమి కాదని, యాజమాని గుండా శ్రీరామచంద్రమూర్తికి చెందినదేనని నిర్థారిస్తూ ఆర్డీవో ఎన్వోసీ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ తీసుకెళ్లి రిజిస్ట్రార్‌కు అందించినా రిజిస్ట్రేషన్‌కు ససేమిరా అనడంతో రియల్ ఎస్టేట్ మధ్యవర్తి, రిజిస్ట్రేషన్‌శాఖకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న ఎం.సురేష్‌ను గుండా ప్రసాద్ సంప్రదించగా, రిజిస్ట్రేషన్ చేయిస్తానని, ఇందుకు రిజిస్ట్రార్‌కి రూ.50 వేలు లంచం ఇవ్వాలని మ«ధ్యవర్తి కోరాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని రూ. 40 వేలు ఇస్తానని చెప్పడంతో ఇందుకు మధ్యవర్తి అంగీకరించాడు. అదే సమయంలో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు బుధవారం రూ.40 వేలను కాకినాడ జెడ్పీ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సురేష్‌కు అందించాడు. నగదు కవర్‌ను తీసుకువెళ్లి రిజిస్ట్రార్ బాలప్రకాశ్కు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయనను రెడ్‌హేండెడ్‌గా పట్టుకుని 20 రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రతాప్‌నగర్‌లో రిజిస్ట్రార్ ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిందితుడ్ని గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు మోహన్, పశ్చిమగోదావరి జిల్లా సీఐ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. బాలప్రకాశ్ ఇక్కడకు రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌శాఖలో డీఐజీగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఐజీ పోస్టు అందుబాటులో లేకపోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌గా కాకినాడ వచ్చాడు. ఈయన పదవీ విరమణ చేసేందుకు మరో ఏడాది ఉండడం గమనార్హం. -
అగ్గి భగ్గు
= సండే, మండే ఎండే = నేడు, రేపు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు = ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దు = వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన = అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం = పాఠశాలల వేళలు సైతం కుదింపు ఒంగోలు టౌన్/కారంచేడు: ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ మాసంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న ప్రజలకు వాతావరణ నిపుణుల హెచ్చరికలు మరింత హడలెత్తిస్తున్నాయి. రానున్న రెండురోజులు ఆది, సోమవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ప్రజల్ని అప్రమత్తం చేయాలి :డీఆర్వో : రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు జిల్లాకు వచ్చాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరూ బయట తిరగరాదన్నారు. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో మైకులు, దండోరాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో పశువులను కూడా బయటకు వదలరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలను ఉదయం 10 గంటలకే మూసివేయాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 10గంటలకే పనులు ముగించుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ఉదయం 9గంటలకే పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు అవసరమైన మేరకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ భరత్‌కుమార్, డీఎంహెచ్ఓ యాస్మిన్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, డీపీఓ ప్రసాద్, పశుసంవర్థకశాఖ జేడీ రజనీకుమారి పాల్గొన్నారు. పాఠశాలల వేళలు కుదింపు..: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు సూచించారు. జిల్లాలో శనివారం 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దారవీడు – 42.78 మార్కాపురం – 42.53 మర్రిపూడి – 42.36, పొదిలి – 42.10, వెలిగండ్ల – 41.79, రాచర్ల – 41.55, ముండ్లమూరు – 41.51, బల్లికురవ – 41.24, సీఎస్‌పురం – 41.15, అద్దంకి – 40.48, అర్ధవీడు – 40.30, దొనకొండ – 40.39, దోర్నాల – 40.87, గుడ్లూరు – 40.58, హనుమంతునిపాడు–40.66, కనిగిరి – 40.92, కొమరోలు – 40.89, కొనకనమిట్ల –40.54, కొండపి – 40.58, పామూరు – 40.83, పొన్నలూరు – 40.06, సంతనూతలపాడు– 41.0, తర్లుపాడు – 40.62, తాళ్లూరు – 40.87, త్రిపురాంతకం – 40.26 -
రోడ్ల అభివృద్ధికి రూ.186 కోట్లు మంజూరు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారుల అభివృద్ధి నిధులు రూ.1000 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో జిల్లాకు రూ.186 కోట్లు కేటాయించారు. జిల్లాలోని వివిధ రోడ్ల అభివృద్ధికి ఈ నిధుల కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.. యర్నగూడెం నుంచి పొంగుటూరు వరకు రోడ్ల విస్తరణ, పటిష్టత కోసం రూ.15 కోట్లు, తేతలి–మునిపల్లి రోడ్డులోని గోస్తనీ నది కాలువపైన, కాకరపర్రు కాలువపైన ఉన్నత స్థాయి వంతెనల నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. తేతలి–మునిపల్లి రోడ్డు విస్తరణ, పటిష్టత కోసం రూ.12 కోట్లు, గుండుగొలను, ఆగడాలలంక మీదుగా పెద్దింట్లమ్మ దేవస్థానం వరకూ రోడ్డును మెరుగుపరచడానికి రూ.25 కోట్లు, తణుకు–భీమవరం రహదారి విస్తరణ, పటిష్టతకు రూ.8 కోట్లు, నరసాపురం–తూర్పుతాళ్లు రోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు, ఏలూరు–గుండుగొలను–కొవ్వూరు (ఈజీకే) రోడ్డు మెరుగుపరచడానికి రూ.12 కోట్లు, ఏలూరు–నూజివీడు రోడ్డు విస్తరణకు రూ.11 కోట్లు కేటాయించారు. సిద్ధాంతం–జుతి్తగ రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు, కొణితివాడ మీదుగా బుధారాయుడు చెరువు–రాయకుదురు రోడ్డును మెరుగుపరచడానికి రూ.6 కోట్లు, శృంగవృక్షం–బేతపూడి రోడ్డుకు రూ.7 కోట్లు, పెంటపాడు–వరదరాజపురం రోడ్డుకు రూ.12 కోట్లు, తాడేపల్లి–అనంతపల్లి రోడ్డుకు రూ.25 కోట్లు, తాడేపల్లిగూడెం–అప్పారావుపేట రోడ్డుకు రూ.12 కోట్లు, పాలకొల్లు–దొడ్డిపట్ల రోడ్డుకు రూ.9 కోట్లు కేటాయించారు. -
సేవ్ డెమోక్రసీ ప్రదర్శనలు
► నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు ► పాల్గొన్న పార్టీశ్రేణులు, పౌరులు ► చంద్రబాబు పై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ద్వజం శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీల సన్నద్ధతపై పార్టీ జిల్లా నాయకులతో రెడ్డి శాంతి శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సమాలోచనలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ప్రజలకు ఏవిధంగా వివరించాలి, చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను ఏవిధంగా ఎండగట్టాలి... అనే విషయాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో టీడీపీలోకి చేర్పించుకున్నారని విమర్శించారు. వారిలో నలుగురికి మంత్రి పదవులూ నిస్సిగ్గుగా కట్టబెట్టారన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం పాలుచేసేలా వ్యవహరించిన చంద్రబాబును గవర్నరు సైతం మందలించకపోగా వత్తాసు పలకడం అన్యాయమన్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధ పనులను వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వ మెడలు వంచేందుకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం, ఎంవీ పద్మావతి, కోణార్క్ శ్రీను, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, గుమ్మా నగేష్, సాధు వైకుంఠరావు, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, పి.జీవరత్నం, మూకళ్ళ తాతబాబు, గొండు కృష్ణ, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, పడపాన సుగుణారెడ్డి, పప్పు పొట్టెమ్మ, కె.చంద్రకళ, ఆదిత్య శ్రీను, దున్న దేవా తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సాగేదిలా....: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ తొలుత బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం స్థానిక ఆర్డీవో లేదా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొంటాయి. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు బైక్‌ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ చేరుకొని, అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. -
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
= మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన = వివరాలు వెల్లడించిన డీఎంహెచ్ఓ యాస్మిన్ ఒంగోలు సెంట్రల్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా కొనకనమిట్ల, సింగరాయకొండలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. జిల్లా స్థాయిలో సీఎస్‌పురం, రాజుపాలెం, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం విజయవాడలో సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు 8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, వాటిని కూడా ప్రారంభిస్తామని వివరించారు. ఒంగోలులో 4, చీరాలలో 2, మార్కాపురంలో 2 కేంద్రాలు చొప్పున ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ కేంద్రాల్లో కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్ఓ యాస్మిన్ వివరించారు. -
క్షీరవిప్లవానికి నిర్లక్ష్యం దెబ్బ
పెరవలి/భీమడోలు : రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో పాడి పశువులు సంఖ్య 18 లక్షలు. వీటిలో 12 లక్షల వరకు గేదెలు, 6 లక్షల వరకు ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 8 లక్షలకు పడిపోయింది. ఇందులో గేదెలు 6 లక్షలు కాగా, మరో 2 లక్షల ఆవులు మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ పాలిచ్చే గేదెలు 4 లక్షలు, ఆవులు లక్ష వరకూ ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలి తంగా పాల దిగుబడి గణనీ యంగా పడిపోయింది. దీంతో ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చే పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కీలకమైన సమయాల్లో పాల ఉత్పత్తి సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీల ఎత్తివేతతో సమస్య పాడి రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుక్రాంతి తదితర పథకాల ద్వారా రాయితీ ఇచ్చేవారు. హర్యానా నుంచి పశువులను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు ఇచ్చేవారు. ఒక్కో పశువుకు 50 శాతంపైగా రాయితీ ఉండేది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా సమకూర్చేవారు. పశుక్రాంతి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిం చింది. ప్రస్తుతం కేవలం క్షీరసాగర పథ కం కింద చూడి పశువులకు మాత్రం దాణాను రాయితీపై ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఒక్కో లబ్ధిదారుడికి ఒక్కో పాడిపశువు చొప్పున ఇస్తున్నారు. ఒక్కో గేదె రూ.60 వేలు కాగా దీనిలో రూ.45 వేలు రాయితీకాగా మిగిలింది లబ్ధి దారుడు చెల్లించాలి. ఈ పథకం మం చిదే అయినా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో లేకుండాపోయింది. గతంలో డెయిరీ పెట్టే ఔత్సాహికులకు రాయితీలు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా బ్యాంకులపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ పథకాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేటుకు ప్రోత్సాహం : భీమడోలులోని విజయ డెయిరీ పాలనే జిల్లాలో చాలామంది వినియోగిస్తారు. గతంలో ఈ డెయిరీ పరిధిలో 200 పాల సేకరణ కేంద్రాలు ఉండేవి. ప్రభుత్వం ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహిస్తూ.. సహకార రంగంలోని విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డెయిరీకి 50 లీటర్ల పాలను శీతలీకరణ చేసే సామర్థ్యం ఉండగా.. ప్రస్తు తం 17 వేల లీటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే సీజన్లో 23 వేల లీటర్ల వరకు పాలను సేకరించేవారు. ఇక్కడ ఉత్పత్తి పడిపోవడంతో ఇతర జిల్లాల పాలపై ఆధారపడాల్సి వస్తోంది. అవి నాణ్యంగా ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ సేకరించిన పాలను జిల్లాలో డెయిరీలకు ఇవ్వకుండా కృష్ణా, తూర్పుగోదావరిలోని ఇతర డెయిరీలకు పంపిస్తున్నారు. ఇక్కడి రైతులను ఆకట్టుకుని పాల సేకరణ లక్ష్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. కల్తీపాలతో అనారోగ్యం జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోవడంతో కల్తీ పాలు మార్కెట్లో స్వైరవిహారం చేస్తున్నాయి. మిల్క్ పౌడర్, సోయాబీన్ పౌడర్‌ను నీటిలో కలిపి పాటినే అసలైన పాలుగా విక్రయిస్తున్నారు. వీటి రంగు మెరుగుపరచడానికి డిటర్జెంట్లు కలుపుతున్నారు. వీటిని తాగిన వారు గ్యాస్ట్రిక్, కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్ని ఆహార కల్తీ నిరోధక శాఖ మిన్నకుండిపోతోంది. ఆందోళన అవసరం లేదు విజయ డెయిరీకి గతంలో పాలు సరఫరా చేసిన రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. విజయ పాలకు మంచి డిమాండ్ ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కలెక్టర్ సారథ్యంలో ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసకుంటున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘం ధర పెంచాలని కోరుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతులు ప్రైవేటు డెయిరీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ పాల డెయిరీని బలోపేతం చేసేందుకు సహకరించాలి. పాడి రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. – గుత్తా వెంకట శశాంక్ధర, ఏడీ, విజయ మిల్క్ డెయిరీ, భీమడోలు -
కీలక శాఖలే దక్కాయి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌కు కీలక శాఖలే దక్కాయి. మంత్రి పితానికి కార్మిక , ఉపాధి, శిక్షణ, పరిశ్రమల శాఖ కేటాయించగా, మరో మంత్రి కేఎస్ జవహర్‌కు ఎక్సైజ్ శాఖ దక్కింది. మొదటిసారి మంత్రి అయిన కేఎస్ జవహర్‌కు కీలకమైన శాఖను కేటాయించారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శాఖలో ఎటువంటి మార్పు చేయలేదు. అయనకు తిరిగి దేవాదాయ శాఖ దక్కింది. ఇదిలావుంటే, టీడీపీలో ఏర్పడిన అసమ్మతి ఇంకా చాపకింద నీరులానే ఉంది. రాజీమానా అస్త్రం సంధించిన చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నారు. విధేయతతో పనిచేస్తానంటూ పత్రికలకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పితాని సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై పార్టీలో ఇప్పటివరకూ చక్రం తిప్పిన ఓ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ అప్పట్లో తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టించడంతోపాటు వారిని అణచివేయడానికి చూశారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేరుగా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం విదితమే. సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరును, అతనిని ముఖ్య మంత్రి ప్రోత్సహిస్తున్న వైనాన్ని పలుమార్లు బహిరంగంగానే పితాని తప్పు పట్టారు. ఇప్పుడు ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవడం, జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఆయనకు పట్టు ఉండటంతో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కదనే భావన టీడీపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద కూడా ప్రస్తావించినట్టు సమాచారం. బీసీలకే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అంగర రామ్మోహన్‌కు ఇవ్వాల్సిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎందుకు ఇచ్చారంటూ వారు ముఖ్యమంత్రి వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి జోక్యంతో అసమ్మతి తాత్కాలికంగా చల్లారినట్టు కనిపిస్తున్నా భవిష్యత్‌లో జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. -
మద్యం షాపులకు ‘వేలం’వెర్రి
ఏలూరు అర్బన్ : నగరంలో శుక్రవారం జిల్లాలోని మద్యం షాపులకు సంబం«ధించి ఎక్సైజ్ శాఖ నిర్వహించిన వేలం పాట జాతరను తలపించింది. రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించి గతంలో అమలు చేసిన మద్యం పాలసీకి భిన్నంగా ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహణకు ఆదేశాలిచ్చింది. వ్యాపారులు తాము దక్కించుకున్న దుకాణాన్ని మండలం, నగర పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీంతో వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. ఒక వ్యాపారి కనీసం రెండుకు మించి దుకాణాలకు నాలుగు నుంచి ఐదు దరఖాస్తులు పెట్టుకోవడంతో ఎక్సైజ్‌శాఖకు దరఖాస్తుల రూపేణా భారీ ఆదాయం సమకూరింది. జిల్లాలో 474 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా ఏలూరు యూనిట్‌లోని 236 షాపులకు 5,762 దరఖాస్తులు రాగా వాటి ద్వారా రూ.35.54 కోట్లు, భీమవరం యూనిట్‌లోని 238 షాపులకు గాను 237 షాపులకు 3,706 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో గడిచిన 30వ తేదీన వెరిఫికేషన్ పూర్తి చేసుకుని వ్యాపారులు లాటరీకి అనుమతి పొందారు. శుక్రవారం స్థానిక వట్లూరు పంచాయతీ పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాలులో ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన లాటరీ కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు. ఎక్సైజ్‌శాఖతో పాటు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన లాటరీ కార్యక్రమాన్ని జేసీ షరీఫ్ ప్రారంభించగా అనంతరం డీఆర్వో కె.హైమవతి కొనసాగించారు. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు, ఏలూరు భీమవరం యూనిట్ల సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసచౌదరి, కె.శ్రీనివాస్ పర్యవేక్షించారు. లాటరీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు డీసీ భాస్కరరావు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లాటరీ ప్రక్రియనంతా వ్యాపారులు పరిశీలించేలా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభంకాగా రాత్రి 9 గంటలకు కేవలం నూరు దుకాణాలకు మాత్రమే లాటరీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ లాటరీని రాత్రి ఏ సమమయానికైనా పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా జిల్లావ్యాప్తంగా మద్యం వ్యాపారులు అనేకమంది కార్లలో తరలిరావడంతో వాటి సంఖ్య వందల సంఖ్య దాటిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. -
రుణాల కల్పనలో జిల్లా మొదటిస్థానంలో ఉండాలి
జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో కలెక్టర్ రూ.19770.21 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల కాకినాడ సిటీ : లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు నూరుశాతం రుణాలు అందించి జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ.19770.21 కోట్లతో రూపొందించిన 2017–18 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల ద్వారా ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. పంట రుణాల కోసం రూ.7380.07 కోట్లు కేటాయించగా వ్యవసాయ, వ్యవసాయానుబంధ రంగాలు అయిన పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, అగ్రి ఇన్ ప్రాస్ట్రక్చర్, గొర్రెలు, మేకలు పెంపకం తదితర రంగాలకు కలిపి రూ.3641.13కోట్లు కేటాయించారన్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.2058.99కోట్లు కేటాయించగా విద్యారంగానికి సుమారు రూ.200కోట్లు కాగా గృహ రుణాల కోసం రూ.707కోట్లు, ఎక్స్పార్టు క్రేడిట్ కోసం రూ.347కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ సెక్టార్ రూ.2వేల 664కోట్లు మహిళా సంఘాల రుణాల కోసం రూ.1200 కోట్లు కేటాయించారన్నారు. జిల్లా నాబార్డు రూపొందించిన పీఎల్పీ 2017–18 ప్రాతిపదికగా వార్షిక రుణ ప్రణాళిక కేటాయింపులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, స్టేట్‌బ్యాంకు ఏజీఎం సాయిబాబు, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్‌హెచ్-216 పనులు త్వరగా పూర్తి చేయాలి జాతీయ రహదారి 216 విస్తర్ణకు సంబంధించి పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టపరిహారంపై రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పనసపాడు, చేబ్రోలు గ్రామాల్లో రోడ్డు విస్తరణలో ఉన్న దేవాదాయ భూములకు ప్రత్యామ్నయ భూములు గుర్తించి వారికి అప్పగించాలని సూచించారు. చిత్రాడలో మార్కింగ్ దాటి కట్టడాలు కూల్చివేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయని, లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు సర్వే చేసి ఎంత భూమి తీసుకుంటున్నామో నిర్ధారించి చెప్పాలన్నారు. విస్తరణలో నష్టపోయిన కట్టడాల విలువ 3వ పార్టీ ద్వారా మదించి చెల్లింపులకు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 3న ఐడియాలజీ రన్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 3న ఐడియాలజీ రన్ నిర్వహించాలని, అందుకు యువతను సమీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 14న నిర్వహించే ముగింపు ఉత్సవాలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు, రెడ్‌క్రాస్ కార్యదర్శి వైడీ రామారావు పాల్గొన్నారు. -
సమయం.. స్వల్పం–లక్ష్యం..దూరం
వీరవాసరం: స్వచ్ఛభారత్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టింది. దీనిలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బహిరంగ మలవిసర్జన నేరంగా పరిగణిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే రేషన్, పింఛన్లు వంటి పథకాలు నిలుపుచేస్తామని కూడా చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాలకు సన్నాహాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తుండగా జిల్లాలో 13,757 మరుగుదొడ్లు నిర్మాణానికి నోచుకోలేదు. జిల్లాలో లక్ష్యం 1,73,197 పూర్తయినవి 1,36,611 నిర్మాణంలో ఉన్నవి 23,011 నిర్మాణం చేపట్టనవి 13,757 గడువు 9 రోజులు ఇక తొమ్మిది రోజులే.. 2016–17లో జిల్లావ్యాప్తంగా 1,73,197 వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం పూర్తిచేసింది. వాటిలో 1,36,611 పూర్తి కాగా మరో 23,011 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా 13,575 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి. మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు మండల స్థాయిల్లో అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. అయినా ప్రజల్లో అవగాహన లోపం, చైతన్యలేమి కారణంగా నిర్మాణానికి ముందుకు రావడం లేదు. జిల్లాలో కేవలం భీమడోలు, తణుకు మండలాల్లో మాత్రమే నూరు శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణాలు ఇలా.. మండలం మంజూరైనవి పూర్తయినవి చింతలపూడి 6341 2486 లింగపాలెం 3648 1303 టి.నరసాపురం 3501 1425 కామవరపుకోట 3877 2218 పోడూరు 2975 1636 గోపాలపురం 4117 2340 పోలవరం 4276 3158 కొవ్వూరు 4266 3170 తాడేపల్లిగూడెం 5575 4420 గణపవరం 3739 3283 ఇరగవరం 2600 1869 తాళ్లపూడి 3303 2439 పెరవలి 2859 2210 బుట్టాయగూడెం 4610 3084 మొగల్తూరు 4166 2316 నరసాపురం 4846 3415 పెదవేగి 9376 8084 దేవరపల్లి 4155 2903 పెదపాడు 4475 3293 జంగారెడ్డిగూడెం 2504 1936 జీలుగువిులి్ల 3005 1923 ఆచంట 2871 2479 ఉండ్రాజవరం 2630 2073 అత్తిలి 2287 1856 పెనుమంట్ర 2784 2262 భీమవరం 3077 2022 పెంటపాడు 4439 3979 నిడమర్రు 1750 1632 ఉంగుటూరు 5681 5324 ఏలూరు 4671 4320 కాళ్ల 4216 4076 చాగల్లు 2259 2028 యలమంచిలి 3022 3150 పాలకొల్లు 2095 1809 పాలకోడేరు 4218 4062 దెందులూరు 5069 4660 నల్లజర్ల 7822 7779 వీరవాసరం 2730 2282 పెనుగొండ 2834 2756 కొయ్యల గూడెం 3488 2901 ఆకివీడు 3529 3420 నిడదవోలు 2765 2680 ద్వారకాతిరుమల 2846 2791 ఉండి 3299 3268 భీమడోలు 1745 1745 తణుకు 2356 2346 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలు చేయడం కోసం అన్ని విధాలా కృషిచేస్తున్నాం. ప్రజల్లో అవగాహన, ప్రేరణ కల్పిస్తున్నాం. అయినా వినకుంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో రేషన్, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాం. వీరవాసరం మండలంలో 27 మాత్రమే ప్రారంభం కాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. ఈనెల 25 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి తీరతాం. – పి.జగదాంబ, ఎంపీడీవో, వీరవాసరం -
మహదేవపూర్ అడవుల్లో జింకల వేట
-
ప్చ్..!
గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టి అధికారం ఇచ్చిన జిల్లా ప్రజలను సర్కారు మరోమారు ఉసూరుమనిపించింది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు అన్యాయం చేసింది. కేవలం కంటితుడుపు కేటాయింపులతో సరిపెట్టింది. నామమాత్రంగా పెంచి అంకెల గారడీ చేసింది. గత హామీలకూ చోటివ్వలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై అన్నివర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని సాగునీటి పథకాలకు అరకొర కేటాయింపులు చేసి సర్కారు చేతులు దులుపుకుంది. గతంతో పోలిస్తే నామమాత్రంగా నిధులు పెంచినా.. వాటితో పథకాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అభివృద్ధిపై పెద్దగా ప్రకటనలు, కేటాయింపులు కూడా లేవు. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది రూ.3,357 కోట్లుగా సవరించిన అంచనాలు ఉండగా.. ఈ ఏడాది వాటిని రూ.6,889 కోట్లకు పెంచింది. ఈ మొత్తం నాబార్డు రుణంగా కేటాయిస్తేగానీ ఖర్చు చేసే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది రూ.1700 కోట్లు మాత్రమే నాబార్డు రుణంగా వచ్చింది. ఈ ఏడాది రూ.6,889 కోట్లు రుణం వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది రూ.160.76 కోట్లు ఖర్చు పెట్టగా వచ్చే ఏడాది బడ్జెట్లో రూ.91.90 కోట్లు కేటాయిం చారు. ఈ పథకానికి ఇంకా రూ.982 కోట్లు అవసరం. అదనంగా 2.8 లక్షల ఎకరాలకు నీరు అందించే రెండోదశ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ టెండర్లే పిలవలేదు. రెండోదశతో సుమారు రూ.4,909 కోట్ల అంచనాలు పెరిగితే ప్రభుత్వం మాత్రం రూ.91.90కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.554 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.98.64 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించి అందులో రూ. 46.80 కోట్లు ఖర్చుపెట్టారు. ఎర్రకాల్వ ఆధునికీకరణ కోసం ఇంకా రూ.64 కోట్లు అవసరం కాగా, గత ఏడాది రూ.2.6 కోట్లు కేటాయించి రూ.3.32 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది కేటాయింపులను రూ.18.80 కోట్లకు పెంచారు. ఇదే పద్ధతిలో సాగితే ఈ పథకాలు పూర్తవడానికి మరో మూడేళ్లు పడుతుంది. గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.85.25 కోట్లు, గోదావరి పుష్కరపనులు, వరదల నియంత్రణకు రూ.89.86 కోట్లు, కృష్ణా,గోదావరి, పెన్నా డెల్టాలలో డ్రెయిన్ల నిర్వహణ కోసం రూ.45.21 కోట్లు కేటాయింపులు జరిగాయి. గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం రూ.1,383 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకూ రూ.660 కోట్లు ఖర్చు పెట్టారు. గత ఏడాది బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఉభయగోదావరి జిల్లాలకు కలిపి రూ.85.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది మన ఒక్క జిల్లాకే రూ.136 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. వీటి ప్రస్తావనేదీ! గతంలో సీఎం చంద్రబాబునాయుడు తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించినా బడ్జెట్లో దీని ప్రస్తావన లేదు. కొల్లేరు కాంటూరు కుదింపుపై గత అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడి తీర్మానం చేసిన ప్రభుత్వం కొల్లేటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే ఈ ఊసు బడ్జెట్లో లేదు. కాంటూరు కుదింపు ప్రక్రియ, అందుకు సంబంధించిన నిధుల గురించి కూడా ప్రస్తావించలేదు. గతంలో నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశముందని ప్రకటించినా దాని ఊసే మరిచారు. గతంలో జిల్లాలో సిరామిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తామని, సాగు ప్రధాన జిల్లా కావడంతో నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. అవన్నీ వట్టిమాటలుగా మిగిలిపోయాయి. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పి, జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు గతంలో ప్రకటించినా.. బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఆక్వా వర్సిటీ ఏర్పాటు ఊసు కూడా బడ్జెట్లో కానరాలేదు. ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించినా రూ.15 కోట్లు కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 స్మార్ట్ సిటీలకు కలిపి రూ.150 కోట్లు కేటాయించారు. కొత్త ఊరింపు గత హామీల ప్రస్తావన లేకపోయినా కొత్తగా కొన్ని ఊరింపు ప్రకటనలను బడ్జెట్లో వల్లెవేశారు. జిల్లాలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహకానికి రూ. 55 కోట్లు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో భారత ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అప్రాధాన్యమే ! అధికారం చేపట్టాక 40సార్లు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా రుణం తీర్చుకోలేనని, జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ హామీ బడ్జెట్లో ఎక్కడా ప్రతిఫలించలేదు. పొరుగు జిల్లాలకు దక్కిన ప్రాధాన్యంలో సగం కాదు కదా.. కనీస మాత్రంగా కూడా జిల్లాకు దక్కలేదు. -
జిల్లాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్
లబ్బీపేట(విజయవాడతూర్పు) : నగదు రహిత సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంగా జిల్లాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. తమ మొబైల్ నంబర్‌నే అకౌంట్ నంబరుగా వినియోగిస్తూ నగదు డిపాజిట్, విత్డ్రాల్తోపాటు, అన్ని జాతీయ బ్యాంకులు, ఫోన్ బిల్స్, కరెంటు, ఇతర పన్నులను చెల్లించే అవకాశం ఉన్నట్లు నగరంలోని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ప్రతినిధి మద్ది శరత్ చెప్పారు. గవర్నర్‌పేట రాజగోపాలచారి వీధిలోని తన షోరూమ్‌లో గురువారం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వినియోగంపై మీడియాకు వివరించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన మొబైల్ నంబరు ఉన్నా, తమ స్మార్ట్‌ఫోన్‌లోకి ఎయిర్టెల్ మనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే, పేమెంట్ బ్యాంక్ అకౌంట్‌ను పొందవచ్చన్నారు. ఆ కౌంట్‌లో రూ. వంద నుంచి ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్‌లోని నగదును తమ ఇతర బ్యాంక్ ఖాతాలోకి, ఇతరుల ఖాతాలోకి సులువుగా ట్రాన్స్ఫర్ చేయవచ్చన్నారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లోని మొత్తంపై దేశంలోనే అత్యధికంగా 7.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రతి అకౌంట్ దారునికి రూ.లక్ష పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూ్యరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు శరత్ తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారుల్లో 70 శాతం గ్రామీణులు ఉండేలా చూడడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వాసులకు నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. -
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు: పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం 4,280 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,340 క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,660 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 28 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. వంతుల వారీ విధానం కారణంగా అత్తిలి కాలువకు నీటి విడుదల తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ కాలువ పరిధిలో ఆయకట్టుకు నీరందకపోవడంతో చేలు నెరలు తీస్తున్నాయి. -
జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్ విభాగంలో ఎం.చైతన్య, ఆర్.నరసింహ రవీంద్ర, ఎస్.సాయి గృహికేష్, ఎస్.బాలాజీరెడ్డి, అండర్ -15 బాలుర విభాగంలో సాయిసుహాస్, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కొత్త ఎంఈవోలొచ్చారు..
ఏలూరు సిటీ : జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈవో) పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ జరిగింది. జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీనియార్టీ ఆధారంగా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో)గా నియామకాలు చేపట్టారు. స్థానిక సర్వశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవో పోస్టులను భర్తీ చేశారు. చింతమనేని పేరుతో భయపెట్టిన యూనియన్ దెందులూరు నియోజకవర్గంలోని ఎంఈవో పోస్టులకు సంబంధించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమతి లేకుండా ఇక్కడకు వస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎమ్మెల్యే తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రధానోపాధ్యాయులను భయపెట్టారు. ఈ నియోజకవర్గంలో దెందులూరు ఎంఈవో పోస్టు భర్తీ చేయగా, పెదపాడు ఎంఈవో పోస్టు మాత్రం ఖాళీగా మిగిలిపోయింది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రధానోపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జిల్లాలో 42 ఎంఈవో పోస్టులు భర్తీ కాగా మూడు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. 3 ఎంఈవో, ఒక డీఐ పోస్టు ఖాళీ జిల్లాలో ఇన్ఛార్్జల పాలనలో కొనసాగుతున్న మండల విద్యాశాఖ అ«ధికారి పోస్టుల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్టారు. జిల్లాలో 48 మండలాల విద్యాధికారి పోస్టులు, ఏలూరు, భీమవరంలో రెండు అర్భన్ పాఠశాలల ఉప తనిఖీ అధికారి (డీఐ) పోస్టులు ఉన్నాయి. తాళ్లపూడి, ఆచంట మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు కాలేదు. ఇక మిగిలిన 46 పోస్టుల్లో ఒకచోట రెగ్యులర్ ఎంఈవో ఉండగా 45 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 204 మంది అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సీనియార్టీ జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 42 మంది ఆయా మండలాలను కోరుకోగా వారికి నియామక ఉత్తర్వులను డీఈవో అందజేశారు. పెదపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండల విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రం ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక ఏలూరు అర్భన్ డీఐ పోస్టు భర్తీ చేయగా, భీమవరం డీఐ పోస్టు ఖాళీగా ఉంది. కొత్తగా నియమితులైన ఎంఈవోలు వీరే జంగారెడ్డిగూడెం – బి.రాముడు ఏలూరు రూరల్ – కె.అన్నమ్మ కొయ్యలగూడెం – జె.సురేష్‌బాబు తణుకు – జి.సత్యజ్యోతి యలమంచిలి – సీహెచ్ అరుణకుమారి పోడూరు – ఎం.చిట్టిరాజు పెంటపాడు – ఎం.శ్రీనివాస్ జీలుగుమిల్లి – కె.శ్రీనివాసరావు బుట్టాయగూడెం – టి.బాబూరావు చింతలపూడి – గుగ్గులోతు రామారావు కామవరపుకోట – డి.సుబ్బారావు గోపాలపురం – గుగ్గులోతు శ్రీనివాసరావు టి.నరసాపురం – టి.రామమూర్తి లింగపాలెం – కె.రామారావు తాడేపల్లిగూడెం – వి.హనుమ భీమవరం – బి.ఐజాక్ ఇజ్రాయెల్ న్యూటన్ కొవ్వూరు – జె.కెంపురత్నం ఉండ్రాజవరం – వైవీ మాణిక్యాలరావు దెందులూరు – ఎస్.సత్యనారాయణ నరసాపురం – పి.పుష్పరాజ్యం నిడదవోలు – పీవీ పాపారావు పెదవేగి – సీహెచ్ బుద్ధవ్యాస్ చాగల్లు – వి.ఖాదిర్బాబు ఇరగవరం – ఎస్.శ్రీనివాసరావు అత్తిలి – ఎస్.నరసింహమూర్తి పెరవలి – వి.హైమావతి గణపవరం – పి.శేషు భీమడోలు – వి.జయలక్ష్మి పాలకోడేరు – ఏఏవీబీ సత్యానంద్ పాలకొల్లు – యం.గంగరాజు పెనుగొండ – యం.కృష్ణారావు కాళ్ల – డి.సీతారామరావు పెనుమంట్ర – డి.శారదజ్యోత్స్న దేవరపల్లి – వీఎస్ఎన్ మూర్తి ఉంగుటూరు – డి.సుభాకరరావు నల్లజర్ల – వీఎస్ రత్నకుమార్ పోలవరం – పి.కృష్ణ వీరవాసరం – బి.వినాయకుడు ద్వారకాతిరుమల – ఎస్.ధర్మదాస్ నిడమర్రు – వి.నరసింహమూర్తి ఆకివీడు – ఎ.రవీంద్ర మొగల్తూరు – సీహెచ్ లక్ష్మణప్రభాకరరావు -
కాపులపై సెక్షన్ 144 కత్తి
ఏలూరు (మెట్రో) : కాపుల ఉద్యమంపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించి కాపుల పోరా టాన్ని అణచివేసేందుకు యత్నించింది. అప్పట్లో టీడీపీ నాయకులు నిర్వహించిన జనచైతన్య యాత్రలకు మాత్రం అనుమతి ఇచ్చింది. తాజాగా, మరోమారు ఆ సామాజిక వర్గం వారిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 25వ తేదీన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 30వ తేదీ వరకూ కొనసాగే ఈ యాత్ర అంతర్వేది చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోనూ కాపులు ఎటువంటి సభలు పెట్టకూడదంటూ నిషేధాజ్ఞలు విధిం చింది. మంగళవారం నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 144 సెక్షన్ ప్రకారం.. ఐదుగురికి మించి గుంపులుగా తిరగకూడదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల అమలుకు జిల్లా పోలీస్ అధికారులతో ప్రజలు సహకరించాలని కోరారు. రేపు చలో రావులపాలెం ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల కాపు సంఘాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. ముద్రగడకు సంఘీభావంగా కాపులంతా రావులపాలెం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లానుంచి తరలివెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని పోలీస్ యంత్రాగానికి ఆదేశాలు అందాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు పాదయాత్రకు వెళ్లకుండా కాపు వర్గాలను అడ్డుకోవాలని సూచనలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచే నిషేధాజ్ఞలు అమలు చేసేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. -
16న జిల్లాస్థాయి విద్యా సదస్సు
కర్నూలు సిటీ: ఎస్టీయూ ఏర్పడి 70 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల16న జిల్లా స్థాయి విద్యాసదస్సు ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎస్ ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న తెలిపారు. శుక్రవారం స్థానిక సలాంఖాన్ భవన్లో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశ«ంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ విద్య– పరిరక్షణ అనే అంశంపై 16వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ ఆవరణలోని మండల పరిషత్ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నామన్నారు. మొదట కలెక్టరేట్ నుంచి జెడ్పీ వరకు మహార్యాలీ జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సన్మూర్తి, జోసెఫ్ సుధీర్‌బాబు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–1938, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు సుధాకర్‌గౌడు, వెంకట్రాముడు, రహీం, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
నూజెండ్ల: మండలంలోని మారెళ్లవారి పాలెం గ్రామంలో వైఎస్సార్ జెఎస్ఆర్ ఎంపిఎల్ –5 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త జక్కిరెడ్డి చిన సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ మారెళ్ల పేరిరెడ్డి దివంగత నాయకులు జక్కిరెడ్డి సుబ్బారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ ట్రోఫీని ఆవిష్కరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పేరిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లనుంచి నిర్విరామంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. క్రీడాప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రెండు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతోపాటు వీక్షించేవారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన చిన్నసుబ్బారెడ్డికి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వందలాది మంది క్రీడాభిమానుల మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, మారెళ్ల నాగిరెడ్డి, గోవిందరెడ్డి, కమిటీ సభ్యులు గాదె నాగార్జున రెడ్డి, రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారెళ్లవారిపాలెం– తలార్లపల్లి జట్లు తలపడగా మరెళ్లవారిపాలెం జట్టు విజయం సాధించింది. -
’రవాణా’ బాదుడు
10 శాతం చార్జీలు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి వాహన రిజిస్ట్రేషన్ వరకూ అన్నీ ప్రియమే జిల్లాలో రోజుకు రూ.9 లక్షల అదనపు భారం ఏలూరు (మెట్రో) : వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రవాణా శాఖ ద్వారా సేవలు పొందే జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.9 లక్షల మేర అదనపు భారం పడింది. పెంపుదల ఇలా.. ఇప్పటివరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన వారినుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.150కి పెంచారు. దీనిపై వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.60ని యథాతథంగా వసూలు చేస్తారు. రూ.550 ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును రూ.960కి పెంచారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.500 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.1,000కి పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు రూ.50 వసూలు చేసేవారు. ఇదికాస్తా రూ.200కు పెరిగింది. గడువు తీరిపోయిన లైసెన్స్ రెన్యువల్‌కు అపరాధ రుసుంతో రూ.100 వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని రూ.300కు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు చేయాల్సి వస్తే రూ.50 వసూలు చేసేవారు. ప్రస్తుతం అది రూ.200కు పెరిగింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగాయి. ఏ మేరకు పెంచారనే విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు. కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మా శాఖ ద్వారా 83 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి సేవలోనూ పెరిగిన చార్జీలను అమలు చేస్తున్నాం. ఎస్ఎస్ మూర్తి, డెప్యూటీ కమిషనర్, రవాణా శాఖ -
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మన్ పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
దోమల దండయాత్ర
జిల్లాలో దోమలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జనం రక్తం తాగుతున్నాయి. కాయిల్స్, లిక్విడ్లు వాటిని కనీసం నిద్రlపుచ్చలేకపోతున్నాయి. ఇక ప్రభుత్వం చేపట్టిన దండయాత్ర వాటికి చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. ఈ దోమల రాజ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఖాళీ జాగా.. దోమల పాగా భీమవరం టౌన్ : ఇటీవల నిర్వహిస్తున్న జన్మభూమి సభల్లో కౌన్సిలర్లు, ప్రజలు దోమల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భీమవరం 5వ వార్డు జన్మభూమి సభను ఆకస్మికంగా సందర్శించిన డీఎంఏ కె.కన్నబాబు దృష్టికి కూడా దోమల సమస్యను ప్రజలు తీసుకువచ్చారు. పట్టణంలో ఖాళీ స్థలాలు మురుకికూపాలుగా మారడంతో దోమల సమస్య పెరిగిందని అధికారులు గుర్తించారు. పట్టణంలో 2,300 ఖాళీ స్థలాలు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన 34 ఎకరాల మేర ఉన్న 72 రిజర్వుడు స్థలాల్లో 80 శాతం దోమలకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని వాటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మునిసిపాలిటీ మాత్రం తమ స్థలాలను నిర్లక్ష్యంగా వదిలేసింది. కాగా స్థలాలకు ప్రహరీ నిర్మాణానికి రూ.50 లక్షలు, స్థలాల లెవెలింగ్‌కు రూ.20 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తూ వస్తోంది. మలేరియా, ఫైరోసిన్ ఆయిల్‌కు ఏటా రూ.11 లక్షలు, ఫాగింగ్ నిర్వహణకు రూ.13 లక్షలు కేటాయిస్తోంది. దోమలపై దండయాత్రకు బడ్జెట్లో రూ.10 లక్షలు కేటాయించడం విశేషం. పేరుగాంచిన గూడెం తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెంకు దోమలగూడెం అనే పేరు కొనసాగుతున్న దుస్థితి. స్మార్ట్‌వార్డు కార్యక్రమం అంటూ తీసుకున్న చర్యలు కొంత ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మాస్ స్ప్రేయింగ్ ప్రయోగం ఫలించలేదు. ఖాళీ జాగాల యజమానులకు మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చినా స్పందన కానరాలేదు. దోమల పునరుత్పత్తికి అనువైన సమయం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలు కావడంతో మరింతగా వృద్ధి చెందుతున్నాయి. కాయిల్స్. కెమికల్ కాగితాలు, లిక్విడ్లు బలాదూర్. చేతిలో సత్తువ ఉంటే కునుకు పట్టేవరకూ రూ.360 దోమల బ్యాట్ వినియోగించాల్సిందే. సిబ్బంది కొరతతో ఇబ్బంది నరసాపురం : పట్టణంలో దోమల నివారణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు మునిసిపల్ రికార్డులు చెబుతున్నాయి. కానీ పట్టణంలో ఎక్కడ చూసినా దోమల బెడదే! ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ దోమలపై రగడ షరా మామూలే! 60 వేల జనాభా, 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో రెండు శానిటరీ డివిజన్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఇన్స్పెక్టర్ల పోస్టులు 8 నెలలుగా ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్‌ను ఇన్చార్జిగా పెట్టి, శానిటరీ పనులు మమ అనిపిస్తున్నారు. ఇక డ్రెయినేజీలను శుభ్రం చేసే పనుల్లోనూ, ఎంఎల్ ఆయిల్ వినియోగంలోనూ జరుగుతున్న అవినీతి కూడా దోమల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఈ నగరానికి ఏమైంది? ఏలూరు (సెంట్రల్) : నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలోని తూర్పు వీధి, పంట కాలువ రోడ్డు, వీవర్స్ కాలనీ, ఫిల్ హౌస్పేట, నాలుగు కాలువల సెంటరు, మోటేపల్లివారి వీధి, కత్తేపువీధి, టూటౌన్‌లోని తంగెళ్లమూడి, దాదా పలావు సెంటరు, చాణ్యకపూరి కాలనీ, శివగోపాలపురం, పవర్‌పేట, కొత్తపేట, బాలయోగి వంతెన, చేపల తూము సెంటరు, గిలకల గేటు సెంటర్ తదితర ప్రాంతల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద డ్రెయి¯ŒSపై కల్వర్టు నిర్మాణ పనులు అధికారులు ఇటీవలే చేపట్టారు. అయితే మురుగు నీరు పోయేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో నీరు ఇళ్ల మధ్యనే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. కాగా దోమల నివారణకు ఏలూరు నగరపాలక సంస్థలో 10 హ్యండ్ ఫాగింగ్ మెషీన్లు, ఒక ఆటో మెషీన్ ఉన్నాయి. వీటిలో 4 హ్యాండ్ మెషీన్లు మరమ్మతులతో మూలనపడ్డాయి. చైర్మన్ వార్డులోనే అధ్వానం పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో యడ్ల బజారు సెంటర్ అగ్నిమాపక కేంద్రం వద్ద చూస్తే పారిశుద్ధ్య పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. యడ్లబజారు, బ్రాడీపేట, చిత్రావి చెర్వుగట్టు, యినకొండవారి తోట, బంగారువారి చెర్వు గట్టు, గుత్తులవాని పేటల్లోని డ్రైన్లు దోమలకు నిలయాలుగా మారాయి. బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ హైస్కూల్ వద్ద పరిస్థితి అధ్వానం. ఇది మునిసిపల్ చైర్మ¯ŒS వార్డు కావడం గమనార్హం. బంగారు వారి చెరువు గట్టు ఎస్కేపీ స్కూల్ వద్ద సైకిల్‌స్టాండ్ మురుగునీటితో నిండిపోయింది. ఇక్కడ విద్యార్థులు సైకిళ్లు పార్కింగ్ చేయడం మానేశారు. 16వ వార్డులో సుమారు రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మించినా ప్రయోజనం కనిపించడం లేదు. స్ప్రేయింగ్ దాఖలాలు లేవు జంగారెడ్డిగూడెం :దోమలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో అధికారులు చెప్పడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మురుగునీరు పారుదల సక్రమంగా లేకపోవడంతో దోమలు పెరిగిపోయాయి. కచ్ఛాడ్రైన్ల పరిస్థితి సరేసరి. అప్పుడప్పుడు నామమాత్రంగా పట్టణంలో ఫాగింగ్ నిర్వహిస్తున్నా మలాథియన్ స్ప్రేయింగ్ చేసిన దాఖలాలు కానరావడం లేదు. రోజుకు రూ.లక్ష తణుకు : దోమల నియంత్రణకు రోజుకు పట్టణ ప్రజలు సుమారు రూ.లక్ష వెచ్చిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కేవలం దండగయాత్రగానే ముగిసిందని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలోని పాతవూరు, ఇరవగవరం కాలనీ, బ్యాంకు కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొన్ని మురికివాడల్లో దోమల బెడద అధికంగా ఉంది. అటకెక్కిన ఫాగింగ్ యంత్రాలు నిడదవోలు : పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో డ్రైన్లు లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఖాళీ స్థలాలనైతే దోమలు కబ్జా చేశాయి. పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా 1.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముగ్గు, ఆయిల్ బాల్స్, చీపుర్లకు రూ.10 లక్షలు, కార్మికుల జీతాలకు ఏటా రూ.కోటి వ్యయం. అయినా దోమల నివారణ సాధ్యం కావడం లేదు. ఉన్న మూడు ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిర్మూలనకు చర్యలు శూన్యం కొవ్వూరు : పురపాలక సంఘం ఏటా పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా రూ.1.80 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. కేవలం దోమల నిర్మూలనకు ఏటా రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ప్రయివేటు స్థలాలను శుభ్రం చేయించడంతో కాస్త పరిస్థితి మెరుగుపడింది. స్వయంగా మునిసిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో పారిశుద్ధ ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ డ్రెయిన్ల శుభ్రత సంతృప్తికరంగా లేదని ఒప్పుకున్నారు. సిబ్బందిని ఇతర విధులకు వినియోగిస్తు న్నట్టు ఆరోపణలున్నాయి. ఫాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. భారీ ఫాగింగ్ యంత్రం ఐదేళ్లుగా మూలనపడి ఉంది. దండయాత్ర కొనసాగిస్తున్నాం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయలేదు. కంటిన్యూ చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల సీజన్ కాబట్టి నిరంతరం దోమల నివారణకు ఎబెట్ ఆయిల్ పిచికారీ చేయించాం. ఇప్పుడు గురు, శుక్రవారం రెండు రోజులు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – మునిసిపల్ కమిషనర్, కె.సాయిరాం, పాలకొల్లు స్ప్రే చేయిస్తున్నాం దోమల నివారణకు పట్టణంలో ఇటీవల 300 ఆయిల్ బాల్స్ డ్రైయిన్లలో వేయించాం. 15 రోజుల క్రితం స్ప్రే చేయించాం. కొత్తగా పది స్ప్రేయర్లు కొనడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. అవి రాగానే తిరిగి స్ప్రేయర్లు వినియోగిస్తాం. –సంగీతరావు. అసిస్టెంట్ కమిషనర్, తాడేపల్లిగూడెం -
చిరుతల్లా.. శరాల్లా..
సత్తా చాటుతున్న డీఎడ్ విద్యార్థులు హోరాహోరీగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు రాజమహేంద్రవరం రూరల్ :వారు వేట వేళ చిరుతల్లా లంఘిస్తున్నారు. సంధించిన శరాల్లా దూసుకుపోతున్నారు. వివిధ క్రీడల్లో తమ సత్తాను, వడీ, వడుపులను చాటుతూ సంభ్రమానందాలు కలిగిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్)లో జిల్లాస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు రెండవరోజు గురువారం హోరాహోరీగా సాగాయి. డైట్ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలు, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌లలో విద్యార్థులు తలపడ్డారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కాగా సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్యపోటీలు నిర్వహించారు. పోటీలను డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు, లెక్చరర్ రాయుడు, ఇతర లెక్చరర్లు, పీఈటీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, పీడీ ప్రసాద్, పీఈటీలు పర్యవేక్షించగా, ప్రైవేటు డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో భవానీల బస్సు బోల్తా
పెనుగొండ : శ్రీశైలంలో శుక్రవారం ఉదయం భవానీల బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. 15 మంది గాయపడ్డారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా వాసులే. వివరాల్లోకి వెళితే.. పెనుగొండ, మార్టేరులకు చెందిన 80 మంది భవానీలు గురువారం పుణ్యక్షేత్రాల దర్శనం నిమిత్తం అమలాపురం, భీమవరాలకు చెందిన ప్రైవేటు బస్సుల్లో వెళ్లారు. తొలుత కొటప్పకొండలో దర్శనం చేసుకుని, శుక్రవారం తెల్లవారుజామున డోర్నాలకు చేరుకున్నారు. అక్కడ పూజలు ముగించుకొని శ్రీశైలం వెళ్లారు. ఉదయం 8.30గంటలకు అమలాపురానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు తిరగబడిపోవడంతో అందులో ఉన్న ఆచంట మండలం కొడమంచిలికి చెందిన బాలిక గుత్తుల రేవతి(11) అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కసిరెడ్డి గణేష్, కొప్పిశెట్టి రాంపండు, కొప్పిశెట్టి సత్యవతి, గుగ్గిలపు దుర్గాప్రసాద్, వేండ్ర దుర్గాప్రసాద్, వాడమదల కోటమ్మ, కొక్కిర రాకేష్, అడబాల దుర్గ, జుత్తిగ నాగలక్ష్మి, జుత్తిగ వెంకటలక్ష్మి, పిల్లి వీర్రాజు, పిల్లి అపర్ణ, సీహెచ్ మల్లేష్, రాంపూడి సత్యనారాయణ, జె.దుర్గారావు గాయపడ్డారు. వీరిలో పెనుమంట్ర మండలం వనంపల్లికి చెందిన కొప్పిశెట్టి సత్యవతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చొరవతో విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి అంబులెన్‌లో తరలించారు. ప్రత్యేక బస్సులో భవానీల తరలింపు భవానీల బస్సు ప్రమాదానికి గురైందన్న సమాచారంతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వెంటనే స్పందించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా ఎస్పీ, శ్రీశైలం డీఎస్పీ, తహసీల్దార్లతో పోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని, రేవతికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో పంపాలని కోరారు. దీంతో శ్రీశైలం దేవస్థానం ఏఈఓ శ్రీనివాసరెడ్డి స్పందించి తీవ్రంగా గాయపడిన సత్యవతిని విజయవాడ తరలించడానికి ప్రత్యేక అంబులెన్ను, భవానీల తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. పెద్దమ్మతోపాటు మాల వేసుకుని.. గుత్తుల రేవతి పెనుగొండలో అమ్మమ్మ జుత్తిగ లక్షీ్మదేవి ఇంట్లో ఉంటోంది. స్థానిక వివేక బాలభారతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. పెద్దమ్మ జుత్తిగ నాగలక్ష్మి భవానీమాల వేసుకోవడంతో, ఆమెతోపాటు రేవతి కూడా మాలధారణ చేసింది. రేవతి తండ్రి వీరవెంకట సత్యనారాయణ జీవనోపాధి నిమిత్తం గల్ప్‌లో ఉంటున్నాడు. తల్లి సత్యవతి కొడమంచిలిలో ఉంటోంది. రేవతి మృతితో బంధువులు, వివేక బాలభారతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు. వనంపల్లిలో విషాదఛాయలు వనంపల్లి, (పెనుమంట్ర) : బస్సు బోల్తా ఘటనతో పెనుమంట్ర మండలం వనంపల్లి ఉలిక్కిపడింది. బోల్తా పడిన బస్సులో గ్రామానికి చెందిన కొప్పిశెట్టి రాంపండు, సత్యవతి దంపతులతోపాటు వారి మనుమరాలు ఊర్మిళ, కడలి నాగ శ్రీను, కలిశేటి ఏసు, కర్రి ప్రసాదరెడ్డి ఉన్నారు. ప్రమాదంలో సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. వెలగలేరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కూడా బస్సులో ఉన్నారని తెలుస్తోంది. -
వైఎస్ఆర్సీపీలో పలువురికి స్థానం
కర్నూలు(ఓల్డ్‌సిటీ) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పదవులను కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిని స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా, పి.ఆర్.వెంకటేశ్వరరెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, వంగాల పరమేశ్వరరెడ్డిని స్టేట్ అఫిలియేటెడ్ వింగ్ కమిటీలో యూత్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమించారు. జిల్లా కమిటీలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వి.రామ్మోహన్‌రెడ్డి జిల్లా కార్యదర్శిగా, బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన డి.రామసుబ్బారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, వెంకటశివారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులయ్యారు. కర్నూలు సిటీ అఫిలియేటెడ్ వింగ్ ప్రెసిడెంట్స్‌లో కర్నూలు నియోజకవర్గానికి చెందిన పెయ్యల కిషోర్‌ను కర్నూలు సిటీ ఆటోరిక్షా వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్ఆర్టీయూసీ), ఎస్.వహీదాను కర్నూలు సిటీ బీడీ వర్కర్స్ ప్రెసిడెంట్‌గా (వైఎస్ఆర్టీయూసీ) నియమించారు. -
మంచు కొండల్లోన అందమా..!
వేలేరుపాడు : మంచుకొండల్లోన అందమా.. మళ్లీమళ్లీ వచ్చిపో.. అన్న చందంగా జిల్లాలోని ఏజెన్సీలో అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పంట పొలాలు, చెట్లతో కనువిందు చేస్తున్న నేల తల్లి ఓ వైపు...భూమి ఆకాశానికి వారధిలా అలుముకున్న మంచు, మరోవైపు చిత్రకారుని కుంచె నుంచి జాలువారిందా అన్నట్టు ఉన్న ప్రకృతి సోయగం కళ్లకు, కాళ్లకు బంధాన్ని వేస్తున్నాయి. వేలేరుపాడు పరిసర ప్రాంతాల్లో ఈ సుందర దృశ్యాలు ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇలా అలరిస్తున్నాయి. -
కోనసీమ ప్రత్యేక జిల్లాయే అందరి లక్ష్యం
కేఏఎస్ఎస్ అధ్యక్షుడు ఆర్వీ నాయుడు కొత్తపేట : కోనసీమ ప్రత్యేక జిల్లా సాధన ప్రతీఒక్కరి లక్ష్యం కావాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి (కేఏఎస్ఎస్) అధ్యక్షుడు ఆర్వీ నాయుడు పిలుపునిచ్చారు. కొత్తపేటలో సంఘ ప్రణాళిక కార్యదర్శి సత్తిరాజు ఆదిత్యకిరణ్ స్వగృహంలో బుధవారం సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సమితి వ్యవస్థాపకుడు పాలూరి సత్యానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్వీ నాయుడు మాట్లాడారు. కోనసీమలో ఎన్నో ఆర్థిక వనరులున్నా, అవి కోనసీమ అభివృద్ధికి దోహదపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడి చమురు, సహజ వాయువు వంటివి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ ప్రత్యేక జిల్లా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కోనసీమలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలిసి, వారి మద్దతుతో ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు కముజు గంగాధరరావు, బండి రామకృష్ణ, అడ్డగాళ్ళ సాయిరాం, గాడి సత్తిబాబు, వాడపల్లి సూరిబాబు, మోకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు -
అవినీతిలో ప్రథమం అభివృద్ధిలో అథమం
ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలి జగన్ పుట్టినరోజున సేవాకార్యక్రమాలు జిల్లా యూత్ సమావేశంలో కన్నబాబు కాకినాడ : ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కార్ అవినీతిలో ప్రథమంగాను, అభివృద్ధిలో అథమస్థానంలో నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. స్థానిక డి కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జిల్లా యూత్ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సింగపూర్, మలేషియాలు పర్యటించి చివరకు బాహుబలి చిత్రనిర్మాత రాజమౌళితో మాహిష్మతి నగర రూపురేఖలతో నిర్మాణమంటూ విన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అధికారాన్ని కట్టబెడితే యువతకు మొండిచెయ్యి చూపారని కన్నబాబు «ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి పోరాడాలని ఆయన యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏజన్సీ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధులు, పౌష్టికాహారలోపం, వసతిగృహ నిర్వహణ లోపాలను ఎత్తిచూపి గిరిజనులకు అండగా నిలవడం ద్వారా జగన్ అధికార పక్షాన్ని ఉలిక్కిపడేలా చేశారన్నారు. నిద్ర నటిస్తోన్న ప్రతిపక్షాన్ని మేల్కొలిపే బాధ్యత యువజన విభాగానిదేనన్నారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న నినాదం పోయి ‘బాబు పోతేనే జాబు’ అనే పరిస్థితి ఉందన్నారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతీ యువజన కార్యకర్త సుసిక్షితులైన సైన్యంలా పనిచేసి ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాడాలన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేసిన చంద్రబాబు తీరుపై యువత గట్టిగా పోరాడాలన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు నమ్మి యువత ఎంతో మోసపోయారన్నారు. జనవరి నుంచి దశలవారీగా ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. యువజన విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు అలంకారప్రాయం కాకుండా పదవికి వన్నె తెచ్చేలా, ఇతర జిల్లాలకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెండు సమావేశాలకు మించి హాజరుకాకపోతే ఆ నాయకులు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే బాధ్యత యువజన కార్యకర్తలదేనన్నారు. కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుపాలనలో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్తీక్‌తోపాటు పలువురు నాయకులు ప్రసంగిస్తూ గ్రామస్థాయి నుంచి యువజన విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు. నేతలకు ఘన సత్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం తొలిసారిగా జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన జక్కంపూడి రాజాకు ఘన సత్కారం జరిగింది. కాకినాడ నగరం యువజన విభాగం అధ్యక్షుడు బి.కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జక్కంపూడి రాజాతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్లను గజమాలతో సన్మానించారు. ఘనంగా జగన్ పుట్టినరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. పేద వర్గాలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించా రు. జిల్లాలోని మూడుపార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్నవరం, అయినవిల్లి, కోరుకొండల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల పక్షాన పోరాడేలా శక్తిని ప్రసాదించాలని పూజలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అమలాపురం నగర యువజన విభాగం అధ్యక్షుడు నల్లా శివాజీ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి లింగం రవి, కాకినాడ నగర యువజన విభాగం అధ్యక్షుడు ఎం. కిషోర్ వివిధ మండలాలకు చెందిన రాష్ట్ర, జిల్లా కమిటీల్లో యువజన విభాగంలోని నాయకులు హాజరయ్యారు. -
జిల్లా బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎంపిక
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా బ్రాహ్మణ సంఘం ఆద్వరంలో పలు విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక మల్లిగ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామకం పొందిన వారంతా ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా బ్రాహ్మణ సంఘం కమిటీ నూతన అధ్యక్షుడిగా దంతూరి సత్యప్రసాద్, కార్యదర్శిగా మంత్రి ప్రగడ వేణుగోపాల్, కోశాధికారిగా గాడేపల్లి సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈసందర్భంగా జిల్లా పురోహిత సంఘం అ««దl్యక్షుడిగా ఆకెళ్ల మురళీకృష్ణ, జిల్లా యువజన విభాగం అ«««దl్యక్షుడిగా ఆకొండి మహేశ్ శర్మ, జిల్లా ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షుడిగా నాగాభట్ల సుబ్రమణ్యం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీమలకొండ వీరభద్రప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తేజోమూర్తుల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పొన్నాడ హనుమంతరావు,మళ్లపురాజు డొక్కా హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం : ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలి¯ŒS ముఖ్యతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ అసోసియేష¯ŒS కార్యవర్గ సభ్యులు పిల్లా వీరవెంకట సత్యనారాయణ, కనకాల వెంకటేశ్వరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల జట్టు : జి.జగపతి, జి.జగదీష్, జి.గణేష్, వి.నవీ¯ŒS సాగర్, పి.దుర్గాప్రసాద్, డి.డేవిడ్‌రాజ్, ఎం.శివదుర్గాప్రసాద్ (రామచంద్రపురం), పి.సాయిబాబరాజు, ఎస్.కృష్ణారెడ్డి (అనపర్తి), ఎ¯ŒS.వీరన్న (పిఠాపురం), సంపత్(రాజమండ్రి), సతీష్ (కాకినాడ). మహిళల జట్టు : బి.రమాదేవి, బి.సాయిజ్యోతి, షేక్లహరున్నీశా(రామచంద్రపురం), సుస్మిత, సూర్యకళ, లావణ్య (కాకినాడ), శ్వేత, అనిత, స్రవంతి (పిఠాపురం), తేజశ్వని, నాగదుర్గ (అమలాపురం), పద్మ (రాజమండ్రి). 15 నుంచి పోటీలు పిఠాపురం టౌ¯ŒS : ఈ నెల 15 నుంచి 18 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరులో అంతర జిల్లాల సీనియర్స్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వ హించనున్నారని బాస్కెట్‌బాల్ సంఘం నేత డాక్టర్ సి.స్టాలిన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఐ. భీమేష్ ఆదివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులను రామచంద్రపురంలో ఆదివారం ఎంపిక చేసినట్టు వారు చెప్పారు. -
జిల్లాకు రూ.60 కోట్ల కొత్త కరెన్సీ
– మళ్లీ రూ.2వేల నోట్లే.. కర్నూలు(అగ్రికల్చర్): నగదు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లాకు రూ.60 కోట్ల కొత్త కరెన్సీ వచ్చింది. ఇటీవల జిల్లాకు రూ.160 కోట్లు వచ్చాయి. తాజాగా రూ.60 కోట్లు రావడంతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్ర బ్యాంకు చెస్ట్‌కు రూ.40 కోట్లు, ఎస్బీఐ చెస్ట్‌కు రూ.20 కోట్లు వచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని ఏఏ బ్యాంకుకు ఎంతెంత ఇవ్వాలనేది ఆర్బీఐ సూచించింది. కాగా జిల్లాకు వచ్చిన మొత్తం అంతా రూ.2వేల నోట్లలోనే రావడం గమానార్హం. ఇప్పటికే రూ.2వేల నోట్లకు చిల్లర లభించక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మళ్లీ పెద్ద నోట్లే రావడం పట్ల బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడల్లోనూ దేశఖ్యాతిని చాటాలి
కాకినాడ రూరల్: విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం ఉంటే దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందవచ్చని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా క్రీడామైదానంలో రెండు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను ఆయన రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలసి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి క్రీడాకారులు ఎంతో మంది తమ క్రీడల్లో తమ ప్రతిభను దేశ, విదేశాల్లో చాటారన్నారు. జిల్లాలో ప్రతి మండలంలోను క్రీడలను అభివృద్ధి చేసేందుకు వీలుగా రూ. 20 లక్షలు కేటాయించామన్నారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక క్రీడా స్టేడియంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనిలో భాగంగా తుని, సామర్లకోట, కొత్తపేట, రామచంద్రపురంలో క్రీడా స్టేడియంలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అంశాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే అనంతలక్ష్మిలు ఆర్చీరీ పోటీలను ప్రారంభించడంతో క్రీడలు ప్రారంభమయ్యాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మురళీధరన్, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మట్టా ప్రకాష్‌గౌడ్, వ్యాయామోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు లంక జార్జి, కోచ్‌లు రంగారావు, రవిరాజు, శ్రీరామమూర్తి, వ్యాయామోపాధ్యాయులు నూకరాజు, హరిబాబు, సునీత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.160 కోట్లు
–అన్నీ రూ. 2000 నోట్లే కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాకు శుక్రవారం రూ.160 కోట్ల నగదు వచ్చింది. అయితే అంతా రూ. 2000 నోట్లలోనే ఉండటం గమానార్హం. రూ.500, 100 నోట్ల అవసరం ఎక్కువగా ఉండగా రూ. 2000 నోట్లు రావడం పట్ల బ్యాంకర్లు పెదవి విరుస్తున్నారు. ఆంధ్రబ్యాంకు చెస్ట్‌కు రూ.100 కోట్లు , ఎస్బీఐ చెస్ట్‌కు రూ.60కోట్లు వచ్చాయి. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అన్ని బ్యాంకులకు పంపిణీ చేయనున్నారు. శుక్రవారమే ఈ నగదు కొన్ని బ్యాంకులకు వెళ్లింది. పూర్తి స్థాయిలో ఈ నగదు శనివారం బ్యాంకులకు చేరనుంది. అయితే ఇప్పటికే 2 వేల నోట్లకు చిల్లర దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. మళ్లీ రూ.160కోట్ల రూ. 2వేల నోట్లు రావడంతో చిల్లర సమస్య మరింత తీవ్రం కానుంది. -
మన వారంతా అనామకులేనా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఒకప్పుడు మంత్రుల మాటకు తిరుగుండేదే కాదు. వారు చెప్పినట్టు చేయకుంటే తదనంతర పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండేవి. అటువంటిది ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యమైన మంత్రులకు కూడా దిక్కూమొక్కూ ఉండటం లేదు. వారి మాటలు, ఆదేశాలు, సిఫారసులు గాలిలో కలిసిపోతున్నాయి. వారు కూడా అధికార దర్పం ఉంటే అదే చాలు! అని సరిపెట్టుకుంటున్నారు. బుగ్గ కారులో తిరుగుతున్నామా.. లేదా! వెంట భారీ కాన్వాయ్ వస్తోందా.. లేదా! ఎక్కడికి వెళ్లినా సెల్యూట్లు ఉంటున్నాయా.. లేవా! అతిథి మర్యాదలకు లోటు లేదు కదా. జీ హుజూర్ అనే వందిమాగదులు వెంటే ఉంటున్నారు కదా! ఇంతకన్నా ఏమి కావాలని అనుకుంటున్నారు. ఏదైనా చినబాబు, పెదబాబు చూసుకుంటున్నారు కదా! అని సరిపెట్టుకుంటున్నారు. వారి ఆలోచనా ధోరణి ఇలా ఉండబట్టే.. అధిష్టానం దృష్టిలో ఒట్టి అనామకులుగా మిగిలిపోతున్నారన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆ వ్యవహారమేమిటో మీరూ చూడండి.. జిల్లా కేంద్రం కాకినాడ మెయి¯ŒS రోడ్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థకు అధికార పార్టీ ద్వారా నియమితులయ్యే ఒక చైర్మన్, పరిపాలనా నిర్వహణ కోసం ప్రభుత్వం ద్వారా ఒక కార్యదర్శి ఉంటారు. ఈ సంస్థ అజమాయిషీలో జిల్లాలో 180 వర కూ శాఖా గ్రంథాలయాలు, ఉప గ్రంథాలయాలు, గ్రామీ ణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ గ్రంథాలయాలు ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి. అటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థను నడిపించే కార్యదర్శి పోస్టు ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో రాజమహేంద్రవరంలోæ గ్రేడ్–1 అధికారి మారిశెట్టి సత్యనారాయణ ఇ¯ŒSచార్జిగా కొనసాగుతున్నారు. ఆయననే అక్కడ పూర్తిస్థాయిలో కొనసాగించాలనుకున్నారు. అలా అనుకున్నది ఏదో ఆషామాషీ నేతలు కాదు. సీఎం తరువాత సీఎంగా చెప్పుకునే పచ్చని సీమకు చెందిన ఒక మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. వారంతా పట్టుబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా సత్యనారాయణను పూర్తిస్థాయిలో నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రప్పించారు. రెండున్నర నెలల క్రితం ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే.. కారణమేమిటో తెలియదు కానీ గుంటూరు జిల్లాకు చెంది న ఓ గ్రంథాలయ అధికారి ఈ పోస్టుపై మనసు పారేసుకున్నాడట! తూర్పు గోదావరి జిల్లాలో పని చేయాలనేది అతని చిరకాల కోరికట. అందుకుగానూ ఆయనో ‘సామాజిక’ మార్గం ఆలోచించాడు. ఆ మార్గంలో తీర్పులు చెప్పే ఒక పెద్దాయనను లై¯ŒSలోకి తీసుకున్నాడట. ఆ పెద్దాయన ముఖ్యనేతకు దూరపు చుట్టమట. ఆ ముఖ్య నేతను పలు కేసుల్లో నుంచి ఒంటిచేత్తో బయటపడేసినట్టు కూడా ఆయనకు పేరుంది. అంతటి పెద్దాయనే చెబుతుంటే ముఖ్యనేత కార్యాలయంలో ఎవరైనా ఏం చేస్తారో.. ఇప్పుడు కూడా బుద్ధిగా అదే చేస్తున్నారు. చినబాబు నుంచి పెదబాబు వరకూ అంతా కూడా ఓకే చేసేయడంతో నిబంధనలు, మార్గదర్శకాలు, మానవీయ కోణాలు అన్నీ గాలిలో కలిపేస్తున్నారు. నియామకం జరిగి రెండు నెలలు కూడా గడవకుండానే సత్యనారాయణకు పొగ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఏడాదిన్నరలో రిటైర్ కానున్నారు. అటువంటిది ఆయనను ఇంత తక్కువ సమయంలో మార్చేయాలనుకుంటున్నారు. ఈ పోస్టుకు ఏకంగా ముఖ్యమైన నాయకుడి కార్యాలయం నుంచి సిఫారసు రావడంతో.. అడ్డుచెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చేస్తాయన్నదే ప్రస్తుతం ఉన్న సమాచారం. తప్పించుకు తిరుగువారు ధన్యులు.. ముఖ్యనేత ప్రమేయం ఉండడంతో.. సత్యనారాయణ నియామకం సమయంలో అన్నీ తానై చూసిన జిల్లాకు చెందిన మంత్రి ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశాడట. మెట్టసీమకు చెందిన ఒక నియోజకవర్గ ముఖ్యనేత ‘పైవాళ్లతో వ్యవహారం గమ్మునుండవయ్యా!’ అంటూ సినీ స్టయిల్లో చెప్పడంతో ముఖం చాటేశారట. ఎవరో చెప్పారని నిన్నగాక మొన్న వచ్చిన కార్యదర్శిని ఎలా పంపిచేస్తారని గ్రంథాలయ సంస్థ ఉద్యోగులంతా ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పించుకు తిరుగువారు ధన్యులు అనుకుంటూ జిల్లాకు చెందిన నేతలు కిమ్మనడంలేదు. ఆ అధికారిని ఏం చేస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
23న హాకీ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
కర్నూలు(టౌన్): జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు స్థానిక ఎస్టీబీసీ కళశాల మైదానంలో హాకీ జూనియర్ బాలుర జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి డి. సుధీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 1998 తర్వాత జన్మించిన క్రీడాకారులే ఎంపికకు హాజరు కావాలన్నారు. 15 సంవత్సరాల వయస్సు దాటిన అభ్యర్థులు ప్రవేశ రుసుం రూ.10 చెల్లించి పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారన్నారు. -
27న జిల్లా స్థాయి రగ్బీ జట్టు ఎంపిక
కర్నూలు(టౌన్): నంద్యాల ఎస్డీఆర్ స్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అండర్–17 రగ్బీ బాలబాలికల జట్లకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సి. రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 28న నంద్యాల ఎస్డీఆర్ స్కూలు మైదానంలో నిర్వహిస్తున్న 62వ రాష్ట్ర స్థాయి స్కూలుగేమ్స్ రగ్బీ (అండర్–17) పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో 27వ తేదీ మధ్యాహ్న 3 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
మంజునాథ కమిషన్ ముట్టడిద్దాం
కాపులను బీసీల్లో చేరిస్తే అన్యాయమైపోతాం అమలాపురం బీసీ సంఘాల సమావేశంలో తీర్మానం అమలాపురం రూరల్ :'ఆర్థికంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల జాబితాలో చేరిస్తే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. జిల్లాలోని బీసీ కులాలన్నీ ఐక్యంగా దీనిని ప్రతిఘటించాలి. ఈనెల 28న విచారణకు వస్తున్న మంజునాథ కమిషన్‌ను ముట్టడించాలి' అని జిల్లా బీసీ సంఘాల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లా బీసీ సంఘాల సమావేశం బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన అమలాపురంలోని సూర్యనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగింది. చిట్టబ్బాయి మాట్లాడుతూ తాము ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించే వారికి..చేర్చాలని కోరుతున్న వారికి జిల్లాలో ఒకేచోట మంజునాథ కమిషన్ విచారించడం వల్ల కులాల మధ్య వైషమ్యాలు, ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ రెండు సామాజిక పక్షాలను ఒకే రోజు కాకండా వేర్వేరు తేదీల్లో విచారణ నిర్వహించాలని చిట్టబ్బాయి సూచించారు. ఈనెల 28న జిల్లా నలుమూలల నుంచి బీసీ సంఘాలన్నీ సంఘటితమై మంజూనా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించి వినతిపత్రం ఇవ్వాలని చిట్టబ్బాయి కోరారు. 28న ఛలో కాకినాడకు తరలిరండి జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి బీసీలకు జరిగే నష్టంపై మంజునా«థ కమిషన్‌కు తమ వాదన వినిపించాలన్నారు. వినతిపత్రాలు తయారు చేసేందుకు డ్రాప్టింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మోటార్‌సైకిళ్లు, కార్ల ద్వారా ఛలో కాకినాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జనాభా తామాషా ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడి కులవృత్తులున్నవారిని మాత్రమే బీసీల్లో చేర్చాలనే నిబంధన ఉందన్నారు. ఇప్పటికే 93 కులాలు ఉండాల్సిన బీసీల్లో 149 కులాలను చేర్చడం వల్ల బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం చెబుతున్న కమిషన్లు, కాపులను ఏ విధంగా బీసీల్లో చేర్చుతారని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ రాజ్యంగ ప్రకారంగా కాపులను బీసీల్లో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు కుడుపూడి పార్థసారథి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వాసంశెట్టి గంగాధరరావు, మార్గాని నాగేశ్వరరావు, బూడిగ శ్రీనివాసరావు, యిళ్ల సత్యనారాయణ, మట్టపర్తి నాగేంద్ర, యిళ్ల శేషారావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సుభాష్, చొల్లంగి వేణుగోపాల్, వాసంశెట్టి తాతాజీ, పంపన రామకృష్ణ, డి.వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, బిళ్ల శ్రీనివాసరావు, రాజులపూడి భీముడు, రెడ్డి సురేష్, పాలాటి బాలయోగి, మావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధి గాలికి..!
- ఇన్చార్జ్ పాలనలో డీఎస్డీవో -క్రీడాకారుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం కర్నూలు (టౌన్): జిల్లాలో క్రీడల అభివృద్ధి ప్రభుత్వానికి, అధికార యంత్రాగానికి ఏమాత్రం పట్టనట్లు కనిపిస్తోంది. మూడు నెలలుగా రెగ్యులర్ డీఎస్డీవో లేకపోవడంతో క్రీడల అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని అధికారులను క్రీడల అధికారిగా నియమించడంతోనే అసలు సమస్య వస్తోందని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని నియమిస్తారు. అయితే కర్నూలులో రెగ్యులర్ డీఎస్‌డీవోను నియమించలేదు. హంద్రీనీవా సుజలస్రవంతి యూనిట్ -4 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈయన డీఎస్డీవో కార్యాలయానికి రావడం లేదు. క్రీడాకారుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈయన డిప్యూటీ కలెక్టర్‌గా బిజీగా ఉంటారని, అటువంటి అధికారులను క్రీడలకు అధికారిగా నియమించడం ఎంత వరకు సబబు క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. మండలస్థాయిలో, జిల్లాస్థాయిలో టోర్నమెంటులు నిర్వహించడం, ఔట్ డోర్స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్వహణపై నిత్యం దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జిల్లాకు సంబంధించి క్రీడలకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంది. గత ఏడాది జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించి రూ. 16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రగతి తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పనులన్ని చేయాలంటే.. క్రీడలపై అవగాహన, ఆసక్తి ఉన్న అధికారులనే క్రీడల అభివృద్ధి అధికారిగా నియమించాలన్న డిమాండ్ సర్వాత్ర వినిపిస్తోంది. -
పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
సామాజిక హక్కుల వేదిక నాయకుల పిలుపు అమలాపురం టౌన్ : దేశ జనాభాలో అత్యధికులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం, మైనార్టీలను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్న పాలక పక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సామాజిక హక్కులవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ప్రచార జీపుజాతా బుధవారం అమలాపురం వచ్చింది. వేదిక కోనసీమ కో ఆర్డినేటర్ కె.సత్తిబాబు ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జీపుజాతాకు స్వాగతం పలికారు. స్థానిక హైస్కూల్ సెంటర్లో జరగిన సభలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.ఈ వైఖరికి నిరసనగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదిక జిల్లా కన్వీనర్, జిల్లా సీపీఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తుండటం వల్ల ప్రభుత్వ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వేదిక అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, రిపబ్లికన్ పార్టీ జాతీయ నాయకుడు డీబీ లోక్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అ««దl్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు చెల్లుబోయిన కేశవశెట్టి, సామాజికవేత్త ఎంఏకే భీమారావు, కార్మిక నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు తదితరులు ప్రసంగించారు. తొలుత అంబేడ్కర్, ఫూలే చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళులర్పించారు. -
జిల్లాలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి
ఏలూరు(సెంట్రల్)ః రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో బయోమోట్రిక్ పేరుతో వేధిస్తున్నారని ఎపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారని ఫలితంగా రోజుకు రూ. 20 నుండి 40 వరకు వారికి ఖర్చు అవుతుందన్నారు. రెండు పూటలా రెండు గంటలకు పైగా వారికి సమయం వృధా అవుతుందని ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టలేని పరిస్ధితిలో అంగన్వాడీలున్నారన్నారు. బయోమెట్రిక్ విధానానికి తమ యూనియన్ వ్యతిరేకం కాదని, ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఫ్రీ స్కూల్‌ను నిర్వహించేందుకు సమయం లేMýంండా ఇతర అదనపు పనులు కేటాయిస్తూ ప్రభుత్వాధికారులే అంగన్వాడీ కేంద్రాలను బలహీనపరుస్తున్నారని, ఎస్ఎంఎస్ల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ సూపర్వైజర్లు చేయాల్సిన పనులు సైతం వర్కర్లతోనే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని ఆమె ఆరోపించారు. అర్హత కలిగిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉన్న జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా అన్యాయం చేస్తున్నారని, వేతనాల పెంపు సందర్భంగా రూ. 63ను ఇంక్రిమెంట్లో కోత విధించి అంగన్వాడీలపై సవిత తల్లి ప్రేమ కనబరిచారన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబుకు ఆ వాగ్ధానం గుర్తు లేదా అని ప్రశ్నించారు. జిల్లాలోని తక్షణమే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని, లేదా ఆయా కేంద్రాల్లోనే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సుబ్బరావమ్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
3 నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
భానుగుడి (కాకినాడ) : జిల్లాస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ఆర్.నరసింహారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా శాలిపేట బాలికోన్నత పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డీవైఈఓ డి.వాడపల్లి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని, జిల్లా స్థాయిలో కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజమండ్రిలో రేపటి నుంచి కాకినాడలో 3 నుంచి నిర్వహించబోయే కార్యక్రమంలో 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు రానున్నాయని, రాజమండ్రిలో 500 ప్రాజెక్టులలో మొత్తం 1,060 ప్రాజెక్టులు ప్రదర్శితమవుతాయన్నారు. ప్రతి ప్రాజెక్టును మండల స్థాయిలో ప్రత్యేక స్క్రూట్నీ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీ, ఎస్సీఆర్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు తయారీకి రూ.5 వేలు విద్యార్థులకు ఇస్తారన్నారు. విజేతలుగా ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయి విజేతలు జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాజెక్టుగా నిలిస్తే వారికి ఐదేళ్లపాటు ఉన్నతవిద్యతో పాటు, ప్రత్యేక ఉపకార వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చెవ్వూరి రవి, పుల్లయ్య, టి.రంగరావు, కేసరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. నేడు బీవీఎం స్కూల్లో ప్రారంభం కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని బీవీఎం స్కూల్లో ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక బీవీఎం స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల నుంచి సుమారు 524 పైగా ప్రదర్శనలు వస్తాయని, వీటిని మూడు రోజలు పాటు వీక్షించేలా రోజువారీ టైంటేబుల్ ఆయా స్కూళ్లకు ఇస్తామన్నారు. డీఐ అయ్యంకి తులసీదాస్, పరస జగన్నాథరావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరం
ఏలూరు (మెట్రో): జిల్లా అభివృద్ధికి అందరి సహకారం తీసుకుంటానని జిల్లా రెవెన్యూ అధికారి కె.హైమావతి అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారిగా మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాలో చేపట్టే ఈ ఫైలింగ్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తానని ఆమె చెప్పారు. తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్‌ను, జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సాగర్, రమేష్, నాంచారయ్య, పూర్ణచంద్రప్రసాద్, కలెక్టరేట్ ఎఒ సుబ్బారావు నూతన డిఆర్‌ఒను కలుసుకుని పుష్పగుచ్చాలు అందించారు. -
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్
–మారణాయుధాలు, ఆటో స్వాధీనం –మరో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్న పోలీసులు ఏలూరు అర్బన్ ః జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యకేసులో నలుగురు నిందితులను ఏలూరు టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక ఏలూరు సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పట్టపగలు స్థానిక టూ టౌన్ పరిధిలోని చింతచెట్టు సెంటర్ రోడ్లో శివకేశవ స్వామి ఆలయం వద్ద చేపలతూము సెంటర్‌కు చెందిన కంచి నరేంద్ర కుమార్ అలియాస్ పెద కృష్ణ (37) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో నరికి చంపి పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో తరచూ జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని ప్రకటించారు. డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు నేతత్వంలో టూ టౌన్ సీఐ బంగార్రాజు, ఎసై ్సలు ఎస్ఎస్ఆర్ గంగాధర్, అల్లు దుర్గారావులో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన సీఐ ఉడతా బంగార్రాజు బందం ఎట్టకేలకు నిందితులు దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామం సమీపంలో సంచరిస్తున్నారని తెలుసుకుని మాటు వేసి వెంకటాపురం పంచాయితీకి చెందిన బొట్టా చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన బొట్టా దుర్గాప్రభాకరరావు అలియాస్ దుర్గారావు, నగరంలోని పాండురంగపేటకు చెందిన కోమాకుల శ్రీను అలియాస్ పూల శీను, స్థానిక వైఎస్ఆర్ కాలనీకి చెందిన పిల్లా ప్రశాంత కుమార్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. – ఇది ప్రతీకార హత్యే కంచి నరేంద్ర కష్ణ హత్య ప్రతీకార హత్యేనని డీఎస్పీ స్పష్టం చేశారు. మతుడు నరేంద్ర కష్ణ కుమార్ అలియాస్ పెద కష్ణ 2012లో బొట్టా గంగాధరరావు అనే వ్యక్తిని హత్య చేశాడు. దాంతో గంగాధర తమ్ముళ్ళు (ప్రస్తుతం పెద కష్ణ హత్యకేసులో ప్రధాన నిందితులు బొట్టా చంద్రశేఖర్, బొట్లా దుర్గాప్రభాకరరావులు) అన్న గంగాధరరావును కిరాతకంగా హత్య చేసిన పెద కష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనే పగతోనే ఈ హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. – హత్యకు సహకరించిన మరో 9మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది. కంచి పెద కష్ణ హత్యకు పరోక్షంగా సహకరించిన మరో తొమ్మిదిమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. నిందితులలో నగర కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్ కుమార్, తాబేలు ధనుంజయ, టోని అలియాస్ మిండాల నాగ శివ, అక్కి మురళి, దండా నాని, వనమాల సతీష్ అలియాస్ కోకిల, దండా చినశేఖర్, రెల్ల, వాసు, మాడుగుల ప్రేమ్కుమార్లు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జహీర్‌బాషా
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎన్.జహీర్ బాషా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లో నియమించినట్లు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లా కార్యనిర్వాహక సభ్యుడిగా సీఎల్.ప్రహ్లాద్ (ఆలూరు), రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.భాస్కర్‌రెడ్డి (పాణ్యం), పార్టీ కొలిమిగుండ్ల మండల ప్రెసిడెంట్‌గా మొలకల రాజారెడ్డి (బనగానపల్లె)లను నియమించారు. నంద్యాల మండల అధ్యక్షుడిగా అదే నియోజకవర్గానికి చెందిన బి.వెంకట భూపాల్‌రెడ్డి, పత్తికొండ మండల కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన కె.కారుమంచప్ప నియమితులయ్యారు. -
సినీ రంగంలో గోదారి జిల్లా నటులే అధికం
సాక్షి, రాజమహేంద్రవరం : గుంటూరు జిల్లా వాసి భాస్కరుణి సత్య జగదీష్. ఉద్యోగ రీత్యా మూడేళ్ల నుంచి రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ఓ పక్క పోలీసు శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తీరిక సమయంలో జిల్లాల వారికి కూడా తెలియని సమాచారాన్ని ఆయన సేకరించారు. ఆ సమాచారాన్నంత ’గోదారి గట్టోళ్లు గట్సున్న గొప్పోళ్లు’ పేరుతో పుస్తకం రూపంలో పొందుపరిచారు. గతవారం హైదరాబాద్‌లో దర్శక రత్న, జిల్లా వాసి దాసరి నారాయణ రావు చేతులమీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. సమాచారం సేకరించడానికి పురికొల్పిన భావనలు, పుస్తకంలోని విశేషాలను ఆయన ’సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పుస్తక రచనకు దారితీసిన అంశాలు సినీరంగంలో ఉభయగోదావరి జిల్లాల వారే అధికం. నటులు, ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 500 మంది ఉన్నారు. వారందరి వివరాలు, ఇక్కడ తీసిన చిత్రాల సమాచారం సేకరించాను. వాటిని ’గోదారి గట్టోళ్లు గట్సున్న గొప్పోళ్లు’ పేరుతో పుస్తకం రూపంలో తెచ్చాను. పుస్తకంలోని అంశాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్లు, మూల పురుషులు, వారి తరాల వాళ్లు, ఇక్కడ స్థిరపడిన వారు.. ఇలా ఈ నేలతో అనుబంధం ఉండి సినీ రంగంలో ఉన్న వారందరి సమాచారం, చిత్రాలు పుస్తకంలో పొందుపరిచాను. సినీ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు, సినీ గేయ ర చయితలు, గాయకులు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రఫీ.. ఇలా ఆయా విభాగాల్లో ఉన్న గోదావరి జిల్లాల వారి చిత్రాలు, పేర్లు ప్రచురించాను. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల(పాతది) చిత్రాల నుంచి నేటి వరకు గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకొన్న చిత్రాల పేర్లతో సహా ముద్రించాను. ఇతర రచనలు ఎస్పీ బాల సుబ్రమణ్యం జీవితంపై ’బహుముఖ ప్రజ్ఞశాలి బాలు’ పేరుతో పుస్తకం రచించాను. ఆయన పాడిన గీతాలల్లో ఆదరణ చూరగొన్న వాటిని సేకరించి ’బాలు భలే గీతాలు’ పేరుతో పుస్తకం ప్రచురించాను. మధ్యతరగతి కుటుంబాల మానసిక సంఘర్షణలను ఆవిష్కరిస్తూ ’క్రికెట్ అండ్ లవ్’ పేరుతో నవల రాశాను. దీనిని సినిమాగా చిత్రీకరించే ప్రయత్నంలో క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్, రామారావు ఉన్నారు. గత ఏడాది పుష్కరాల సందర్భంగా గోదావరి జిల్లాలో ఉన్న ప్రదేశాలు, తినుబండారాలు, పాపికొండల అందాలు, మన సంప్రదాయాలను రుచి చూపించే హోటళ్లు వివరాలతో ’ కలయో.. గోదావరి మాయో’ నవల రచించాను. కుటుంబ నేపథ్యం మాది గుంటూరు జిల్లా వినుకొండ. నాన్న భాస్కరుణి వెంకట గోపాలరావు, అమ్మ సుబ్బలక్ష్మమ్మ. కళాశాల చదువు ఒంగోలు బీబీఎంవీవీఎం కాలేజీల్లో సాగింది. అనంతరం పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయానికి ఏవోగా పదోన్నతిపై వచ్చేంత వరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశాను. నా పుస్తకాలకు తొలి పాఠకురాలు నా భార్య సి.మీనాకుమారి. ఇద్దరు కుమారులు. పెద్దాబ్బాయి సంతోష్ ప్రభుత్వ ఉద్యోగి కాగా చిన్నాబ్బాయి సాయి చరణ్ సినీ గాయకుడుగా రాణిస్తున్నాడు. ఘంటశాల జీవితంపై సినిమా తీయాలి గాయకుడు, సంగీత దర్శకుడిగా మాత్రమే ఘంటశాల అందరికీ తెలుసు. కానీ స్వతంత్య్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంతోపాటు పలు ప్రాంతాల్లో జైలు జీవితం గడిపారు. ఆ అంశాలతో ’గాంధీ మార్గంలో ఘంటశాల’ పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్ దూరదర్శ¯ŒSలో ప్రసారమైంది. ఘంటశాల జీవితంపై సినిమా, సీరియల్ నిర్మించాలి. అందుకు సంబంధించని స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఎవరైనా నిర్మాత వస్తే మొదలు పెడతాను. ఉద్యోగ విరమణ తర్వాత డైరెక్ష¯ŒSపై దృష్టి పెడతాను. -
జిల్లాలో 36 కరువు మండలాలు
– జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన మండలాలు 38 –రుద్రవరం, దొర్నిపాడుకు మొండిచేయి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఈనెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం రుద్రవరం, దొర్నిపాడు మండలాలను మినహాయించి మిగిలిన 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీఓ 9 విడుదల చేసింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు, ఆగస్టులో వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెళ్లు ఉన్న మండలాలు, సాధారణ సాగు కంటే 50 శాతం తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగైన మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించింది. త్వరలోనే ఈ మండలాల్లో పంట నష్టంపై సర్వే నిర్వహించే అవకాశం ఉంది. కరువు మండలాలు ఇవే.. పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరివెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. -
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
అట్టహాసంగా ఎంపిక పోటీలు చంద్రమాంపల్లి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలకు బాలబాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎస్ఎం జిలాని స్మారక మెమోరియల్ ఖోఖో చాంపియన్ షిప్ పేరిట ఆజాద్ నేషనల్ ఆర్మీ, జెడ్పీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పది బాలుర జట్లు, సుమారు 60 మంది బాలికలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే బాలికల జట్టుకు 17 మందిని ఎంపిక చేశారు. హాజరైన వంద మందిలో 17 మందిని బాలుర జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అ«««దl్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావడానికి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఎంపికైన జట్లను అభినందించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నలమాటి జానకి రామయ్య, పట్టాభిరామ్, మాజీ ఎంపీపీలు గోపు అచ్యుతరామయ్య, ఇంధన జయకృష్ణ, శృంగార వల్లభ స్వామి ఆలయ చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పాగా సురేష్, యండ్రు సత్తిబాబు, బుజ్జి, తుమ్మల రాజా, పచ్చిపాల ప్రసాదరావు, వేమల పండు, తుమ్మల వీరస్వామి నాయుడు, ఎంఈఓ బాబురావు, హెచ్ఎం కె.గాయత్రి, పీఈటీలు మట్టా సుబ్బారావు, మట్టా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, పీఎస్ఎన్ మూర్తి, కేఎస్ఎన్ మూర్తి, టీఎస్ఎన్ మూర్తి, ఎన్.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాలికల జట్టు : ఓ.నాగదేవి, డి.అమృత, డి.లక్ష్మీసౌందర్య, సీహెచ్.దివ్య, పి.చంద్రఅనూష, ఎన్.అంజలి శ్రీదేవి, ఎన్.మౌనిక, కె.శ్యామల, పి.సదా, కె.రాజేశ్వరి, ఎల్.వీరలక్ష్మి, ఎస్.లీలా సత్యవేణి, వి.అక్షయ, ఎ.సుగుణ, ఎ.వెంకటదుర్గ, ఎ.రమ్యభారతి, పి.లక్ష్మి. బాలుర జట్టు : వి.వెంకటేష్, జి.నాగేంద్ర, ఎం.సాయి, వెంకట్, రాజీవ్, వై.మహేష్, జి.సూర్య మణికంఠ, ఎస్వీ ప్రసాద్, జి.సత్యేంద్ర, మణికంఠ, పి.చందు, ఎం.వెంకటరమణ, వీర ఆదిశివ, వై.అప్పాజీ. -
పరిశ్రమలపై అవగాహనకు చర్యలు
ఏలూరు (మెట్రో) జిల్లాలో పారిశ్రామిక రంగంపై ఆసక్తిగల వారికి వివిధ పరిశ్రమల స్థాపనకై బ్యాంకు రుణాలు, సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ప్రసాదరావు చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నూతన సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ, అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జెడి ప్రసాదరావు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసమరైన అన్ని అనుమతులు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ విధానం ద్వారా లభిస్తాయని ఆయన చెప్పారు. వివిధ పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు రుణాలు, సబ్సిడీ వంటి వివరాలను అవగాహన చేసుకుని పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుని పూర్తి అవగాహన పొందిన వారికి ప్రభుత్వం తమవంతు సహకారాన్ని లబ్ధిదారులకు అందిస్తుందని ప్రసాదరావు చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ప్రస్తుతం చేసుకున్న వ్యాపారాల అభివద్ధికి బ్యాంకు రుణాలు, అవగాహన కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తల సమస్యలను, సలహాలను అధికారులు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన సూచనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు మేనేజర్ సుభ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు ఎజిఎం రామప్రభు, నాబ్కాన్స్ సెక్టోరియల్ హెడ్ సుభ్రహ్మణ్యం, ప్రసాద్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, జిల్లా పరిశ్రమల డిప్యూటీడైరెక్టర్ పి.ఏసుదాసు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు పాల్గొన్నారు. -
జిల్లాకు క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం రాక
భీమవరం టౌన్: క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు విచ్చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితం ఎంత వరకూ అమలు జరుగుతుందో ఈ బందం తనిఖీ చేస్తుంది. ఆరుబయట ఒకటి, రెండు విసర్జన రహిత పట్టణాలు, నగరాలకు ప్రధానమంత్రి చేతుల మీదుగా కేంద్ర పురస్కారం అందించనున్న నేపథ్యంలో స్వచ్చభారత్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రబందం జిల్లాలోని పలు పట్టణాలు, నగరాలను సందర్శించనుంది. ఈ బృందం తమ తనిఖీలు నిర్వహించి, పరిశీలన చేసి పూర్తిగా సంతృప్తి చెందితే కేంద్ర పురస్కారానికి సిఫార్సు చేస్తారు. క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం ఈనెల 24వ తేదిన ఏలూరు నగరంలో, 25వ తేదిన నిడదవోలు, 26వ తేదిన భీమవరం, 27వ తేదిన జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పర్యటిస్తారు. బహిరంగ మలవిసర్జన రహితాన్ని పాటించేందుకు గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిలు, నగర పంచాయితీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రతీ ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు కమీషనర్లు, చైర్మన్లు నిమగ్నమయ్యారు. వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ.15వేలు ఉచితంగా మంజూరు చేస్తుంది. కేంద్ర పురస్కారం అందుకునేందుకు పట్టణాలు, నగరాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రధాన కూడళ్లలో ప్రజల అవసరార్థం ప్రజా, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి. తద్వారా ఆరుబయట బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటించగలుగుతారు. పట్టణం, నగరంలోని ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలి. బహిరంగ మలమూత్ర విసర్జనా రహిత స్థితిని తెలుపుతూ మునిసిపాలిటిలు, నగరపాలక సంస్థలు, నగరపంచాయితీలు ధవీకరణ పత్రాన్ని స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి. డి.మురళీధరరెడ్డికి పంపాలి. ధవీకరణ పత్రం పంపే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, మునిసిపల్ కౌన్సిలర్లు, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, కోఆప్షన్ సభ్యుల నుంచి తమ పట్టణాలు, నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహితాన్ని పాటిస్తున్నామని పొందుపరచాలి. కౌన్సిల్లో ఈ ధవీకరణను ఆమోదించాలి. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియచేయాలని ప్రకటించాలి. ఈ నిబంధనలను ఇప్పటికే పలు పట్టణాలు, నగరాలు పూర్తి చేశాయి. తుది డాక్యుమెంటేషన్‌ను స్వచ్చాంద్ర కార్పోరేషన్ ఎండి.డి.మురళీధరరెడ్డికి ఈ మార్గదర్శకాల ప్రకారం పంపించారు. అక్కడి నుంచి స్వచ్చభారత్ కార్పోరేషన్‌కు డాక్యుమెంటేషన్లను పంపించారు. దీంతో క్వాలిటి కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బందం ఆయా పట్టణాలు, నగరాల్లో ఏ మేరకు బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అమలు జరుగుతుందో తనిఖీ చేసేందుకు రానున్నారు. -
తెరపైకి మరిన్ని మండలాలు
నిజామాబాద్ అర్బన్ : చిన్న జిల్లాలు, చిన్న మండలాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మండలాల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో 13 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. దీనికితోడు మరిన్ని మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలు ఉండేవి. 19 మండలాలతో నిజామాబాద్, 17 మండలాలతో కామారెడ్డి విడిపోయాయి. కొత్తగా నిజామాబాద్‌లో 8, కామారెడ్డిలో 5 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సెప్టెంబర్ 21న జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నిజామాబాద్ నార్త్, సౌత్, ఇందల్వాయి, మోపాల్, మెండోరా, ఆలూరు, రుద్రూరు, కామారెడ్డిలోని రాజంపేట, రామారెడ్డి మండలాలను పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అనంతరం కొత్త జిల్లాలు ఏర్పాటు కాగానే ఆలూరు మినహా గెజిట్‌లో పేర్కొన్న మండలాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు బాల్కొండ మండలంలోని ఏర్గట్ల, ముప్కాల్, కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడపగల్, నరుస్రుల్లాబాద్ మండలాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొత్త మండలాల కోసం మరిన్ని డిమాండ్లు రావడంతో ఈనెల 9వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా ఆర్మూర్ రూరల్, డొంకేశ్వర్, ఆలూరు, చందూరు, బోధన్ రూరల్, రెంజర్ల, మోస్రా, సాలూర మండలాల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాలను మండలాలుగా ప్రకటించాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీరి విన్నపం మేరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొనసాగుతున్న ఆందోళనలు ఆలూరు మండలం ఏర్పాటులో సందిగ్ధం ఏర్పడింది. ఆలూరు మండలం ఏర్పాటు చేసే ఆర్మూర్ మండల పరిధిలోని గ్రామాలు మండలాన్ని వ్యతిరేకించాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆర్మూర్ రూరల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈయన ప్రతిపాదన మేరకు మండలాల ఏర్పాటుపై సమీక్ష కొనసాగుతోంది. మరోవైపు ఎస్సారెస్పీ ముప్పు ప్రాంతాలైన డొంకేశ్వర్, మారంపల్లి, కుద్వాన్పూర్, నూత్పల్లి గ్రామాలను కలుపుకొని డొంకేశ్వర్‌ను మండల కేంద్రం చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఎంపీ కవిత దృష్టికి కూడా స్థానిక ప్రజలు డిమాండ్లు తీసుకెళ్లారు. డొంకేశ్వర్ మండల ఏర్పాటుపై కూడా పరిశీలన కొనసాగుతుంది. మరోవైపు బోధన్ మున్సిపాలిటీ కావడంతో అర్బన్ కేంద్రంగా ప్రకటించి సమీప గ్రామాల్లో బోధన్‌రూరల్ మండలంగా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన ఉంది. బోధన్ పక్కనే ఉన్న సాలూరు గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా చేయాలని స్థానికంగా డిమాండ్లు రావడంతో ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. మోస్రా, చందూరు గ్రామాల ప్రజలు మండలాల కోసం డిమాండు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపడంతో పరిశీలన కొనసాగుతోంది. త్వరలోనే మండలాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. -
ఆందోళన మరింత ఉధృతం చేస్తాం
– జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఏలూరు (మెట్రో) : జీఎస్టీ (గూడ్స్ సేల్స్ టాక్స్) కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలను మార్చుకోకుంటే భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అనేకరీతుల్లో నిరసనలు తెలిపారు. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ ఆఫీస్ సబార్డినేట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గెజిటెడ్ అధికారులు సమైక్యంగా ఈనెల 3 నుంచి 16 వరకూ భోజన విరామ సమయంలో రాష్ట్ర కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. 17న సామూహిక సాధారణ సెలవులు పెట్టి జీఎస్టీ కౌన్సిల్‌కు నిర్ణయాలకు నిరసన తెలిపారు. ఢిల్లీలో 18, 19, 20 తేదీల్లో సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ తమ నిర్ణయాలు మార్చుకోకుంటే 20న ఏఐసీసీటీఏ ఇచ్చే పిలుపుమేరకు తమ భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తామని ఉద్యోగులు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరావు, ఏపీ సిటీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఇసి మెంబర్ ఎండీ మస్తాన్, ఎస్.శ్రీనివాసరెడ్డి, జి.జి.ఎస్.ఎస్. ఫణికుమార్ తదితరులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ములుగును జిల్లా చేయాలని రాస్తారోకో
నల్లజెండా, బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన ములుగు : ములుగును జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తన కుమారునికి అప్పగించేందుకు తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్ ఆరోపించారు. తండ్రీకొడుకులు పదవుల్లో ఉండి నియోజకవర్గ ప్రజలకు చీకటి రోజులు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నా యకులు ఆదివారం నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి మండలకేంద్రం లో నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మంది కార్యకర్తలు మౌనదీక్షగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కూరగాయాల మార్కె ట్ సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్నంగా మోకాళ్ళపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగును జిల్లాగా ప్రకటించకపోవడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమన్నారు.టీఆర్ఎస్ నాయకులు జి ల్లాను రాకుండా చేశారని, మంత్రి చందూలాల్ ప్యాకేజీల కోసం స్పీకర్ మధుసూదనాచారికి అనుగుణంగా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మంత్రి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జిల్లా కోసం ఒప్పించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వేములపల్లి భిక్షపతి, ఎండీ. యూనుస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజుయాదవ్, నాయకులు నరేందర్‌రెడ్డి, పురుషోత్తం, బాబి, శ్రీనివాస్‌యాదవ్, మహేందర్, డీవి. రెడ్డి, సమ్మయ్య, రవి, కుమార్, రాములు, తిరుపతి, షర్పోద్దీన్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. -
56 మండలాల్లో కురిసిన వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని 56 మండలాలో వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిడమనూరు మండలంలో 49.8 మిల్లీమీటర్లు, తిరుమలగిరిలో 47.6, అనుములలో 46.2, చిలుకూరులో 44.6, కనగల్‌లో 41.6, మునుగోడులో 37.8, వేములపల్లిలో 35.0, దామరచర్లలో 32.4, మిర్యాలగూడలో 28.0, నకిరేకల్‌లో 24.6, పెద్దవూరలో 23.8, నల్లగొండలో 22.8, త్రిపురారంలో 22.2, తిప్పర్తిలో 18.4, పీఏపల్లిలో 17.2, రామన్నపేటలో 16.2, మఠంపల్లిలో 15.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా కట్టంగూరులో 15.2, నేరేడుచర్లలో 14.2, దేవరకొండలో 13.8, కోదాడలో 12.8, కేతేపల్లిలో 11.8, జాజిరెడ్డిగూడెంలో 11.4, గుండాలలో 10.8, హుజూర్‌నగర్‌లో 10.2, తుంగతుర్తిలో 9.6, పెన్‌పహాడ్‌లో 9.6, నడిగూడెంలో 9.4, మోత్కూరులో 9.2, రాజాపేటలో 8.4, మోతెలో 8.4, చింతపల్లిలో 8.2, నూతన్‌కల్‌లో 8.2, చివ్వెంలలో 8.2, సూర్యాపేటలో 8.0, శాలిగౌరారంలో 7.2, నారాయణపురంలో 7.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చండూరులో 7.0, ఆత్మకూరు(ఎస్)లో 5.6, నార్కట్‌పల్లిలో 5.2, నాంపల్లిలో 4.8, గుండ్లపల్లిలో 4.8, వలిగొండలో 4.2, మునగాలలో 4.2, ఆలేరులో 4.0, మర్రిగూడలో 3.6, పోచంపల్లిలో 3.4, మేళ్లచెరువులో 3.0, ఆత్మకూరు(ఎం)లో 2.6, చందంపేటలో 2.4,యాదగిరిగుట్టలో 2.2, చిట్యాలలో 2.0, గరిడేపల్లిలో 1.4, బొమ్మలరామారంలో 1.0, భువనగిరిలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
బాన్సువాడ జిల్లా కోసం నిరాహార దీక్షలు
బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల రగడ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్ష నాయకులు ఆదివారం రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. అలాగే వర్ని మండలంలోని మోస్రా గ్రామాన్ని మండలంగా చేయాలంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. -
నూతన జిల్లాల్లోని భవనాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
రాంనగర్ : నూతన జిల్లాలోని భవనాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలతో నూతన జిల్లాల భవనాలు, సదుపాయాలపై సమీక్షించి మాట్లాడారు. నూతన జిల్లాలకు ఆర్డర్లు తీసుకున్న ఉద్యోగులందరూ 11వ తేది ఉదయం 10.30గంటలకు ఆయా కార్యాలయాల్లోని రిజిష్టర్‌లో సంతకం చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో జెండా వందనం నిర్వహించాలని సూచించారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులందరు సంబంధిత కార్యాలయాల్లో గ్రూపు ఫొటోలు దిగాలని అన్నారు. కొత్త మండలాలు, నూతన డివిజన్లకు కేటాయించే ఉద్యోగుల వివరాలను ఈనెల 10వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని అన్నారు. నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసి సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్వో రవి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి, తదితరులున్నారు. -
జిల్లాలో 38 కరువు మండలాలు
– ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు నివేదిక పంపారు. వర్షాలు అతి తక్కువగా పడటం, సాగు 50శాతం కంటే తక్కువ ఉండటం, వర్షానికి, వర్షానికి ఉన్న వ్యవధిని బట్టి 38 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రభుత్వం ఇటీవల కరువు ప్రాంతాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపాలని మార్గదర్శకాలు పంపింది. ఈ నెల7వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగన్ని ఆదేశించింది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సాధరణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే 50 శాతం కంటే తక్కువ సాగైన మండలాలు మూడు ఉన్నాయి. వరుసగా 28 రోజుల పాటు వర్షాలు పడని మండలాలు 26 ఉన్నాయి. కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించిన మండలాలు ఇవే... పెద్దకడుబూరు, హొళగొంద, ఆలూరు, శిరివెళ్ల, రుద్రవరం, దొర్నిపాడు, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యలవాడ, గోస్పాడు, కోవెలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. -
అంకెల గారడీ.. వృద్ధి పేరిట బురిడీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుత సీజన్లో నీరందక నారుమడులు ఎండిపోయాయి. నాట్లు సైతం దెబ్బతిన్నాయి. నరసాపురం మండలం చిట్టవరంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పేరిట నాట్లు వేసిన పొలంలోనూ వరి దుబ్బులు ఎండిపోయాయి. నీళ్లందక పలుచోట్ల పంట విరామం ప్రకటించారు. గడచిన సీజన్లలోనూ ప్రకృతి వైపరీత్యాలు, సాగునీటి కొరత, వాతావరణ సమస్యల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలావుంటే.. జిల్లాలో వ్యవసాయ రంగం పురోగమిస్తోందని.. గడచిన రెండేళ్లలో 15 శాతం వృద్ధి సాధించామని సర్కారు కోతలు కోస్తోంది. వ్యవసాయ రంగంలో మన జిల్లా 15 శాతం వృద్ధిరేటు సాధించిందని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం కట్టిన లెక్కలు వాస్తవం కాదన్న వాదన రైతు సంఘాల నుంచి వినిపిస్తోంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోగా.. గడచిన రెండేళ్లలో 15 శాతం వృద్ది సాధించామని చెప్పడాన్ని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. రెండేళ్లలో 15 శాతం వృద్ధి సాధ్యం కాదని, ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు తప్పుడు లెక్కలు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం గడచిన రెండేళ్ల కాలంలో వరి దిగుబడి రెండిం తలు పెరగాలి. అలాంటి పరిస్థితి జిల్లాలో ఉందా అంటే ఎక్కడా లేదనే సమాధానం వస్తోంది. అంతా బూటకం టీడీపీ అధికారంలోకి రాక ముందు వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇప్పుడు ఇస్తున్న నివేదికలను పరిశీలిస్తే 15 శాతం వృద్ధి సాధించామన్న ప్రకటన వట్టి బూటకమని చెప్పక తప్పదు. గత రెండేళ్లుగా ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా రైతులు ఇబ్బంది పడ్డారు. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినడంతోపాటు, సరైన దిగుబడి రాక నష్టపోయారు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే.. అధికారులు మాత్రం లెక్కలతో మాయ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన వరి దిగుబడులను పరిశీలిస్తే 2012 ఖరీఫ్‌లో జిల్లాలో 6.70 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆ ఏడాది అధికారులు అంచనా వేసిన దిగుబడి లక్ష్యం హెక్టార్‌కు 3,117 కిలోలు. అంటే హెక్టార్‌కు 41.56 బస్తాలు (బస్తా 75 కిలోలు). ఈ లెక్కన ఎకరాకు సగటు దిగుబడి 16.62 బస్తాలు. అదే ఏడాది రబీలో 4.20 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, దిగుబడి లక్ష్యం హెక్టారుకు 6,734 కిలోలు. అంటే హెక్టారుకు 89.7 బస్తాల చొప్పున ఎకరానికి 35.91 బస్తాలు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏడాది మొత్తంగా ఖరీఫ్, రబీ కలిసి 52.53 బస్తాల దిగుబడి ఉండేది. అప్పట్లో వ్యవసాయ వృద్ధి రేటును 8 శాతంగా చెప్పేవారు. 2014లో 5.77 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. అదే ఏడాది రబీలో 4.25 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 2015–16లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 5.90 లక్షల ఎకరాల్లోనే పంట సాగు చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోవడం, తర్వాత అకాల వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతినడం వంటి పరిస్థితులు తలెత్తాయి. కృష్ణాడెల్టా ఆయకట్టులో సగానికి పైగా విస్తీర్ణంలో నాట్లు వేయలేదు. అయినా 13 శాతం వృద్ధి సాధిస్తామని లెక్కల్లో పేర్కొన్నారు. గత రెండేళ్లలో సాగు విస్తీర్ణం, ఉత్పాదన ప్రకారం లెక్కించినా ఖరీఫ్, రబీలో ఎకరానికి 100 బస్తాల దిగుబడి వచ్చి ఉండాలి. ఖరీఫ్‌లో 50 బస్తాలు, రబీలో 50 బస్తాల దిగుబడి రాలేదనే విషయం సామాన్యుడికి సైతం తెలిసిన విషయమైనా.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా భారీ వృద్ధి రేటు సాధించినట్టు లెక్కలు కట్టి ప్రభుత్వానికి సమర్పించారు. సగటు దిగుబడి 20 బస్తాలు దాటలేదు పంట పొలాలను చేపల చెరువులుగా మార్చేం దుకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో సదరు భూముల్లో సగటున 20 బస్తాల దిగుబడి అయినా రావడం లేదని వ్యవసాయ అధికారులు నివేదిక ఇస్తున్నారు. తక్కువ దిగుబడి వస్తున్నందున్న చేపల చెరువుల తవ్వకానికి అభ్యంతరం లేదని పేర్కొంటున్నారు. మరి ఇలాంటప్పుడు దిగుబడి అమాంతం ఎలా పెరిగిపోయింది, వృద్ధి రేటు 15 శాతం ఎలా సాధ్యమయ్యిందనే దానికి వారివద్ద సమాధానం లేదు. వ్యవసాయ వృద్ధి రేటును సాగు విస్తీర్ణం, దిగుబడి, ఉత్పాదన ఆధారంగా లెక్కిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు విస్తీర్ణం ఎంత, సరాసరి దిగుబడి ఎంత వచ్చిందనే లెక్కల ఆధారంగా వ్యవసాయ వృద్ధి రేటును అంచనా వేస్తారు. మెట్ట ప్రాంతంలో వరి దిగుబడులు తక్కువగాను, డెల్టాలో కొంచెం ఎక్కువగాను ఉంటాయి. రెండుచోట్లా దిగుబడిని సరాసరి చేసి సగటు వృద్ధి రేటు నమోదు చేస్తారు. అదే తరుణంలో సాగు ఆరంభానికి ముందు ఈ ఏడాది ఎంతమేర దిగుబడి సాధించాలనే లక్ష్యాలను సైతం వ్యవసాయ శాఖ నిర్దేశించుకుంటుంది. గడచిన రెండున్నరేళ్ల కాలంలో జిల్లాలో వ్యవసాయ రంగం ఒడిదుడుకులతో సాగింది. 2014 ఖరీఫ్‌లో వర్షాలకు తోడు, దోమపోటు కారణంగా పంట దిగుబడి రాక రైతులు విలవిల్లాడిపోయారు. 2015 ఖరీఫ్‌లో డిసెంబర్ రెండో వారంలో విరుచుకుపడిన భారీ వర్షాలకు జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రూ.80 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ఏడాది రబీలో కొన్నిచోట్ల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల సాధారణ దిగుబడులే వచ్చాయి. వరి విషయం ఇలా ఉంటే.. విత్తన కంపెనీల మోసంతో మొక్కజొన్న దిగుబడి తగ్గింది. పొగాకు కూడా ధర లేక దిగుబడి తగ్గి రైతులు ఇబ్బంది పడ్డారు. చెరకు రైతుల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదనేది తెలిసిన విషయమే. గడచిన రెండేళ్లుగా మామిడి దిగుబడి పడిపోయింది. వాస్తవ పరిస్థితులు ఇలావుంటే అధికారులు మాత్రం వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కదంతొక్కిన ములుగు
ములుగు జిల్లా కోసం ఆందోళనలు అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు ములుగు : ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా..ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడంతో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్ మాట్లాడుతూ తనతో పాటు టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్ సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వినర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డు తాత్కాలిక చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి,తో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్, లాల్‌పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, చీకుర్తి మధు, కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
‘కొత్త’ దిశగా..
- సిద్ధమవుతున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు - ఖమ్మం నుంచి తరలివచ్చిన కంప్యూటర్లు - దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు - కలెక్టరేట్ పనుల్లో నిమగ్నమైన రెవెన్యూ సిబ్బంది కొత్తగూడెం: కొత్త జిల్లాల పాలనకు విజయదశమే ముహూర్తం కావడంతో నూతన కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం సింగరేణి శాప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల కోసం గదులను ముస్తాబు చేస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ డిస్పెన్సరీ నుంచి ఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పనులన్నీ చకచకా సాగుతున్నాయి. విజయ దశమి రోజున కొత్తజిల్లాల కార్యకలాపాలు ప్రారంభించాలని, జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సింగరేణి అప్పగించిన భవనాలను కలెక్టర్ పాలన కార్యాలయం, ఎస్పీ పాలన కార్యాలయాలుగా తీర్చిదిద్దే పనుల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించింది. జిల్లా కలెక్టరేట్ కోసం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి శాఫ్ కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో సింగరేణి కంప్యూటర్లు, ఆన్లైన్ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే జరిగేవి. కలెక్టరేట్లోని వివిధ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు భవనంలోని గదులను తీర్చిదిద్దుతున్నారు. కలెక్టర్ గదితోపాటు సిబ్బంది ఉండేందుకు వీలుగా రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో మొత్తం 21 గదులు, ఒక హాల్ ఉంది. జిల్లా ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్ భవనంలో జిల్లా ట్రెజరీ, వెనుకబడిన తరగతుల గృహనిర్మాణ సెల్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ఏర్పాటు చేసే భవనంలోని గదులను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. కంప్యూటర్లు సిద్ధం దసరా నాటికి జిల్లా కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పనులను ప్రారంభించేందుకు ఖమ్మం కలెక్టరేట్ నుంచి 24 కంప్యూటర్లు, ఐదు ప్రింటర్లను పంపించారు. వీటిని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సిద్ధం చేశారు. జిల్లా ప్రారంభం నుంచే పాలన కొనసాగాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త మండలాల పనులను ప్రారంభించారు. మండలాలకు సంబంధించిన ఫైళ్లను వేరు చేసే పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్ వచ్చిన తర్వాత కొత్త మండలాలకు పూర్తి పనులు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లా పేరుతో ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశాలు రావడంతో మండలాల వారీగా మీ సేవలో వేరు చేస్తున్నారు. దసరా తర్వాత ధ్రువీకరణ పత్రాలు కొత్త జిల్లాల పేరుతో రానున్నాయి. చురుగ్గా ఎస్పీ కార్యాలయం పనులు ఎస్పీ కార్యాలయం కోసం సింగరేణి సంస్థ కార్పొరేట్ డిస్పెన్సరీని కేటాయించింది. గత ఐదేళ్ల నుంచి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో చుట్టూ పొదలు, చెట్లతో నిండిపోయింది. ప్రస్తుతం పోలీస్ శాఖ అధికారులు చుట్టూ చెట్లను తొలగింపజేశారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సరిపోయే విధంగా గదులను తయారు చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్‌లు చేస్తున్నారు. భవనం చుట్టూ గుంతలు ఉండటంతో మట్టిని తొలగించి వాటిని చదును చేయిస్తున్నారు. దసరా వచ్చేస్తుండటంతో పనులను త్వరితగతిన చేపట్టేందుకు కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి. -
'ఇబ్రహీంపట్నం జిల్లా ఏర్పాటుచేయాలి'
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా నేతలు గురువారం హైపవర్ కమిటీని కలిశారు. మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని కలిసిన నేతలు.. ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాలను కలిపి ఇబ్రహీంపట్నం జిల్లాగా ఏర్పాటుచేయాలని కోరారు. -
కొత్తగా 12 మండలాలు
మూడు ఔట్.. మూడు ఇన్ పునర్విభజనలో అనూహ్య మార్పులు తొర్రూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు డివిజన్ హోదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాలో కొత్తగా 12 మండలాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్ఎస్ నేతలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 22న ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్లో ఇందులో 6 మండలాలను పొందుపరిచారు. తాగాగా మరో ఆరు మండలాలు ప్రకటించారు. వీటితో పాటు తొర్రూరు, స్టేషన్ఘన్పూర్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్త మండలాలు జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాయి. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. గత ఆగష్టు 22న వెలువరించిన జిల్లాల పునర్విభజనలో కాజీపేట, ఖిలావరంగల్, ఐనవోలు, వేలేరు, చెల్పూరు, ఇల్లంతకుంట మండలాలను ప్రకటించగా, కొత్తగా దంతాలపల్లి, పెద్దవంగర, తరిగొప్పుల, చిన్నగూడూరు, కొమురవెల్లి, టేకుమట్లను మండలాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు కానున్న 12 మండలాల్లో వరంగల్ జిల్లాలో 5 , జయశంకర్ జిల్లాలో 1, జనగామలో 3, మహబూబాబాద్‌లో 2 , సిద్ధిపేటలో ఒక మండలం కలువనున్నాయి. మారనున్న సరిహద్దులు ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన జిల్లాల సరిహద్దులు మారేందుకు ఆస్కారం ఉంది. కొత్తగా జనగామ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఉన్న మూడు మండలాలు జనగామ, జయశంకర్ జిల్లాల్లో కలపాలని నిర్ణయించింది. నల్గొండ జిల్లాలోని గుండాల మండలాన్ని చేర్చాలని నిర్ణయించారు. ముసాయిదాలో ఈ మండలం యాదాద్రి జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాలను జయశంకర్ జిల్లాలో కలపాలని నేతలు సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు. ముసాయిదాలో ఈ మండలాలు కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ముసాయిదాలో హన్మకొండ జిల్లాలో పేర్కొన్న జమ్మికుంట, హుజురాబాద్ మండలాలు తిరిగి కరీంనగర్ జిల్లాలోకి వెళ్తున్నాయి. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు కలుస్తున్నాయి. జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్లో తొర్రూరు, స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు జనగామ జిల్లాలో స్టేషన్ఘన్పూర్ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో ఉన్న తొర్రూరును డివిజన్ చేయాలనే డిమాండ్‌కు గతంలో సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. -
జయహో జనగామ
ఉద్యమ గడ్డపై మిన్నంటిన సంబురాలు జనగామ జిల్లా ఏర్పాటుకు సీఎం అంగీకారం అన్ని వర్గాల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు పార్టీల జెండాలతో కార్యకర్తల కోలాహలం జనగామ : జనగామ పోరుగడ్డ తన ఉద్యమ పటిమను మరోమారు చాటుకుంది. పోరాటాలతో దేన్నైనా సాధించుకుంటామని నిరూపించుకుంది. జిల్లా కోసం ఏడాదిగా చేస్తున్న పోరాటంలో విజయం సాధించింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో జనగామ జిల్లా ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డివిజన్వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రం 4.30 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అన్ని వర్గాల ప్రజలు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, మహిళా కౌన్సిలర్లు వంగాల కళ్యాణి, పన్నీరు రాధిక, వేమళ్ల పద్మతో పాటు అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. నెరవేరిన ప్రజల ఆకాంక్ష జిల్లాల పునర్విభజనలో జనగామ పేరు ప్రతిపాదించడంతో సంబురాలు చేసుకున్న ప్రజల సంతోషాలు క్షణాల్లో కనుమరుగయ్యాయి. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన సకల జనులు ఉద్యమాలకు నాంది పలికారు. ఏడాది పాటు జాతీయ రహదారిని దిగ్భందిస్తూ, వరంగల్–హైదరాబాద్‌కు వెళ్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు జనగామ పౌరుషాన్ని చూపించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలసి జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశారు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..దైవాన్ని కూడ నమ్ముకున్నారు. జన గర్జన సభతో జనగామ సత్తా చాటిన ప్రజలు.. చివరకు జిల్లాను సాధించుకొని విజయగర్వంతో తలెత్తుకున్నారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, డాక్టర్ లకీ‡్ష్మనారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, బండ యాదగిరిరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, ఆకుల సతీష్, ఆకుల వేణు, ధర్మపురి శ్రీనివాస్, రంగరాజు ప్రవీన్‌కుమార్, ఉడ్గుల రమేష్, బర్ల శ్రీరాములు, వైఎస్ఆర్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్ తదితరులు బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు.. ప్రజాభీష్టం మేరకే సీఎం కేసీఆర్ జనగామ జిల్లాను ఏర్పాటు చేశారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీతో కలసి జేఏసీ సంబురాలు భువనగరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలసి సీఎం క్యాంప్ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, రాజమౌళి, వీరేందర్‌రెడ్డి, ఆకుల సతీష్, మంగళంపల్లి రాజు, బొట్ల శ్రీనివాస్, సౌడ రమేష్ వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహముద్ అలీ, ఎంపీ నర్సయ్యతోపాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు జిల్లాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ పెద్దపల్లి, జగిత్యాల యథాతధం కమలాపూర్ మినహా హుజురాబాద్ మనకే హుస్నాబాద్, కోహెడ సిద్దిపేటకే నాల్గు మండలాలు భూపాలపల్లికి రెండు మండలాలు వరంగల్‌కు కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. జిల్లాల విభజన తెరపైకి వచ్చినప్పుడు మూడు జిల్లాలుగానే విభజించిన ప్రభుత్వం నాల్గో జిల్లాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి ప్రకటనలో కరీంనగర్‌తో పాటు జగిత్యాల, సిరిసిల్లలను ప్రకటించి, ఆ తర్వాత సిరిసిల్లకు బదులు పెద్దపల్లిని ప్రతిపాదించారు. సిరిసిల్లకు మొండి చేయి చూపడంతో గత 40 రోజులుగా నిరసనలు మిన్నంటాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనంటూ జేఏసీలుగా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం తాజాగా సోమవారం జరిగిన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపిస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిరిసిల్లను రాజన్న జిల్లాగా ప్రకటించాలని, పెద్దపల్లి నగరపంచాయితీని మున్సిపాలిటీగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కరీంనగర్ జిల్లా నాలుగు ముక్కలు కానుంది. కరీంనగర్ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న జిల్లాల విభజన ప్రక్రియ ఉత్కంఠకు తెరపడినట్లయింది. గత ముసాయిదాలో ప్రతిపాదించిన విధంగా మంథని నియోకవర్గంలోని మహాదేవ్‌పూర్, మల్హార్, కాటారం, మహాముత్తారం మండలాలు కొత్తగా ఏర్పడబోయే భూపాలపల్లి జిల్లాలోకి కలుస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని గతంలో హన్మకొండ రూరల్ జిల్లాలో కలిపే విధంగా ప్రతిపాదించినప్పటికీ తాజా పరిణామాలతో కమలాపూర్ మండలం మినహా మిగతా మండలాలన్నీ కరీంనగర్‌లోనే కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హన్మకొండ రూరల్ జిల్లాలోకి కలుపనున్నారు. గత కొద్దిరోజులుగా కరీంనగర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేస్తున్న హుస్నాబాద్, కోహెడ మండలాలలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలోనే ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల విభజన ఇలా.... కరీంనగర్ ః కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి, మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట జగిత్యాల ః జగిత్యాల, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, వెల్గటూర్, సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కొడిమ్యాల. పెద్దపల్లి ః పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగుండం, ముత్తారం, మంథని, సుల్తానాబాద్, ఎలిగేడ్, జూలపల్లి, ధర్మారం. సిరిసిల్ల ః సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్, వేములవాడ, వేములవాడ రూరల్, పొత్తూరు, ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, బోయినపల్లి. ప్రతిపాదిత మండలాలు ః జగిత్యాల అర్భన్, మెట్పల్లి అర్భన్, కోరుట్ల అర్భన్, బీర్పూర్, బుగ్గారం, ఇల్లందకుంట, పోత్తూరు, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, అంతర్గాం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, సిరిసిల్ల రూరల్ మండలాలు అందుబాటులో ఉన్న జిల్లాలో కలపనున్నారు. ప్రజల కోరిక మేరకే ః ఈటల ప్రజల కోసమే జిల్లాల విభజన తప్ప రాజకీయ నాయకులు, పార్టీల కోసం కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాల పునర్విభనలో భాగంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావులు సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా గ్రామాలు, మండలాల కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజల కోరిక మేరకు గ్రామాలను సైతం జిల్లాలుగా మార్చామని చెప్పారు. నాయకులు శాశ్వతం కాదని ప్రజలు శాశ్వతమన్నారు. విభజన వల్ల పది మండలాలు కరీంనగర్ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయగా, కొత్తగా 15 మండలాలు ఏర్పాటు కాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కరీంనగర్ 11 లక్షలు, జగిత్యాల 10 లక్షలు, పెద్దపల్లి 8 లక్షలు, సిరిసిల్ల 6 లక్షల జనాభాతో ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టం చేశారు. విభజన పూర్తి శాస్త్రీయంగా ప్రజాభిప్రాయం మేరకే చేసినట్లు తెలిపారు. దేశంలో లక్షలోపు జనాభా గలవి 26 జిల్లాలు, 2 లక్షల జనాభా లోపు 100 జిల్లాలున్నాయని, అరుణాచల్ ప్రదేశ్‌లో 8 వేల మందికి ఒక జిల్లా ఉందన్నారు. ఈ రోజు సమావేశంలో ప్రజాప్రతినిధులతో చర్చించి నివేదిక తయారు చేసి మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక అందజేస్తామని ఈటల వెల్లడించారు. సిఎంకు కతజ్ఞతలు ః ఈద కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లో కలపాలని కోరగా సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. జిల్లాల పునర్విభనలో భాగంగా సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. గతంలో మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలో కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని కలుపొద్దని అనేక ఆందోళనలు జరిగిన విషయాన్ని సిఎంకు వివరించానని, ప్రజల కోరిక మేరకు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లో కలిపితే రవాణా సౌకర్యంతో పాటు అనుకూలంగా ఉంటుందని తెలుపగా సిఎం సానుకూలంగా స్పందించారని ఈద వెల్లడించారు. -
తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం రద్దు చేయాలి
– లేకుంటే జిల్లా నుంచి సాగనంపుతూ – జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మిపై కలెక్టర్ ఆగ్రహం ఏలూరు (మెట్రో) : జిల్లాలో పనిచేయాలంటే వారం రోజుల్లో తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి తక్షణమే అసలైన భూమి గల యజమానికి న్యాయం చేయాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుని, జిల్లా నుంచి సాగనంపుతానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్షి్మని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఏలూరు సత్రంపాడుకు చెందిన బచ్చు నాగవెంకటేశ్వరరావుకు చెందిన 761 గజాల స్థలాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన భాస్కర్ వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, ఆ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్‌కు కారణ మైన సిబ్బందే పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలా చేయకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకూ వెనుకాడనని హెచ్చరించారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం ఆకివీడు మండలానికి చెందిన బొల్లం వెంకట సుబ్బారాయుడు ఫిర్యాదు చేస్తూ ఆకివీడు పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నా కార్యదర్శులు స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లాలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రతి వారం మీ కోసం కార్యక్రమంలో 90 శాతం ఫిర్యాదులు పంచాయతీ శాఖకు చెందినవే ఉంటున్నాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే శాఖను పటిష్ట పరచకుంటే తాను ప్రక్షాళకు పూనుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌ను హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామ రైతులు టి.సత్తిరెడ్డి, ఆర్ఒ రామ్మోహన్‌రెడ్డి వినతిపత్రం అందిస్తూ యర్రకాలువ ఆధునికీకరణలో వంతెన నిర్మాణం చేపట్టారని కానీ పూర్తిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గోపాలపురం మండలం దొండపూడి, రాజుపాలెం గ్రామస్తుడు ఎన్.ఉదయభాస్కర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ కన్నాపురం నుంచి పోలవరం వెళ్లే దారిలో దొండపూడిలో రోడ్లకు ఇరువైపులా ఆర్అండ్బీ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు, పక్కా గహాలు నిర్మించుకున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్అండ్బీ అధికారులు ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. మరికొందరు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్‌డీఎంవో ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, డీపీవో సుధాకర్, ఇరిగేషన్ ఎస్ఈ ఇ.శ్రీనివాస్, డీఎస్వో శివశంకరరెడ్డి పాల్గొన్నారు. -
అటవీ శాఖలో భారీ మార్పులు
కొత్తగూడెం జిల్లాలోకి రెండు డివిజన్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం ఎత్తివేత కొత్తగూడ : జిల్లాల పునర్విభజనతో ఫారెస్ట్ శాఖలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతనంగా ఏర్పడుతున్న మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ మండలాన్ని కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో ఫారెస్ట్ శాఖ మహబూబాబాద్, గూడూరు డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వాటికి ఎఫ్డీఓ (ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్)లు, ఒక జిల్లా ఫారెస్ట్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు డివిజన్లు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడుతున్న కొత్తగూడెం జిల్లాలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పరిధిలోకి వెళ్తున్నాయి. కాగా మండలంలోని అటవీప్రాంతం 5 సెక్షన్లు, 14 బీట్లుగా కొత్తగూడ రేంజ్ పరిధిలో ఉంది. ఓటాయి సెక్ష¯ŒSలో పూనుగొండ్ల, ముస్మి–1, ముస్మి–2, పొగుళ్లపల్లి బీట్లు, మేడపల్లి సెక్ష¯ŒSలో ఎంచగూడెం నార్త్, ఎంచగూడెం సౌత్ బీట్లు నర్సంపేట రేంజ్ పరిధిలో, ఓటాయి సెక్ష¯ŒS పరిధిలో రాంపూర్, ఓటాయి, పూనుగొండ్ల బీట్లు వైల్డ్ లైఫ్ రేంజ్ పరిధిలో ఉండేవి. వాటిలో వైల్డ్‌లైఫ్ శాఖను పూర్తిగా మండలం నుంచి ఎత్తివేస్తూ ఆ ప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. నర్సంపేట రేంజ్ పరిధిలో ఉన్న బీట్లను కొత్తగూడ రేంజ్లో కలిపారు. కొత్తగూడ రేంజ్ పరిధిలో 6 సెక్షన్లు, 20 బీట్లుగా అటవీప్రాంతాన్ని విభజించారు. ప్రస్తుతం ఒక్క బీట్ పరిధిలో 3 వేల నుంచి 3500 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. దీన్ని 800 నుంచి వెయ్యి హెక్టార్ల లోపు ఒక్క బీట్‌గా విభజించేందుకు హద్దుల నిర్ణయం జరుగుతోంది. గంగారంలో కొత్త రేంజ్ మండలంలోని గంగారం గ్రామంలో కొత్తగా రేంజ్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. తిరుమళగండి గ్రామం నుంచి దుబ్బగూడెం, ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిర్యాలపెంట వరకు విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 6 సెక్షన్లు, 20 బీట్లుగా విభజించి గంగారం రేంజ్‌కు అప్పగించనున్నారు. దీంతో మండలంలో చిన్నచిన్న ఫారెస్ట్ బీట్లు ఏర్పడనున్నాయి. ఈమేరకు అధికారులు పూర్తి స్థాయి నివేదికలు జీపీఎస్‌ల ద్వారా రూపొందిస్తున్నారు. దీంతో అటవీ సంరక్షణ చాలా సులభమవుతుంది. అధికారుల సంఖ్య కూడా పెరుగుతుంది. పోడు వ్యవసాయం, అక్రమ కలప రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చని ఆ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడ, గంగారం, గూడూరు రేంజ్‌లకు గూడూర్లో ఎఫ్డీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారం రోజుల క్రితం అదనపు పీసీసీఎఫ్ ఎంజే.అక్బర్ కార్యాలయాల పరిశీలన చేశారు. ఈదిశగా పనుల వేగవంతం చేస్తున్నారు. ‘వన్యప్రాణి సంరక్షణ’ తొలగింపుపై అనుమానాలు వన్యప్రాణి సంరక్షణ విభాగం పూర్తి స్థాయిలో తొలగించి ఆ సెక్షన్లను మొత్తం ఫారెస్ట్ శాఖలో విలీనం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని పూనుగొండ్ల, ఓటాయి గ్రామాలను ఆనుకుని వైల్డ్‌లైఫ్ సాంచురీ ఉంది. ఆ ప్రాంతం మొత్తం గుట్టలు, దట్టమైన అడవితో నిండి ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ విభాగం రేంజ్ పరిధి విస్తీర్ణంలో ఎక్కువ కావడం, సిబ్బంది పర్యవేక్షణ సరిగా ఉండక పోడు వ్యవసాయం, వన్యప్రాణుల వేట కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కాగా వైల్డ్‌లైఫ్ సాంచురీ ప్రాంతంలోనే బొగ్గు, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. రానున్న కాలంలో వాటిని వెలికి తీయాలంటే వన్యప్రాణి చట్టాల ప్రకారం కుదరదు. అందుకే ప్రభుత్వం వ్యూహత్మకంగా ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్ శాఖకు బదలాయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ చట్టాల ప్రకారం ఘనుల వెలికితీత కొంత సులభమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మెట్టలో అతివృష్టి.. డెల్టాలో అనావృష్టి
–జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం తీరిది –పది డెల్టా మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదు –మెట్ట, ఏజెన్సీ మండలాల్లో అత్యధికంగా వర్షాలు –భారీవర్షాలకు 4,675 ఎకరాల్లో పంటలకు తీరని నష్టం కొవ్వూరు : వర్షాకాల సీజన్ ఆరంభ నెలలో అదరగొట్టిన వర్షాలు ఆ తర్వాత రెండు నెలల పాటు దోబూచులాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్‌లో జిల్లావ్యాప్తంగా గడిచిన వారం, పదిరోజుల నుంచి భారీవర్షాలు కురిశాయి. జిల్లాలో ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, పెదపాడు, ఆచంట, పెనుమంట్ర, నిడమర్రు, నిడదవోలు, ఇరగవరం మండలాల్లో జూన్ ¯ð ల ఆరంభం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 19 శాతం నుంచి 59 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ మండలాలన్నీ డెల్టా ప్రాంత మండలాలే కావడం గమనార్హం. పది మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ పది మండలాలు పూర్తి మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలోనివే. కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం ఏజెన్సీ మండలాలతో పాటు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, భీమడోలు, ద్వారకాతిరుమల, టి.నరసాపురం మండలాల్లో జిల్లాలో అత్యధికంగా వర్షపాతం రికార్డంది. ఈ మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 4,675 ఎకరాల్లో పంటలు వర్షార్పణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్‌లో సాధార ణం కంటే అ«ధికంగా కురిసిన వర్షపాతం జూలై నెలలో 43.1 శాతం, ఆగస్ట్‌లో 51.5 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. సెప్టెంబర్‌లో మూడోవారం వరకు వర్షాలు నామమాత్రంగానే కురిశాయి. గడిచిన వారం, పదిరోజుల్లో కురిసిన వర్షాలతో ఈ నెల సాధారణ వర్షపాతం కంటే 44.2 శాతం అదనంగా వర్షం కురిసింది. ఇదే రైతులు పాలిట శాపంగా మారింది. ప్రధానంగా పది మెట్ట, ఏజెన్సీ ప్రాంత మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీరనినష్టం వాటిల్లింది. జూలై, ఆగస్ట్ నెలల్లో నీటితడులు సరిగా అందక ఇబ్బందులు పడిన రైతులు సెప్టెంబర్‌లో కురిసిన అకాలవర్షాలతో అతలాకుతలమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం వరి 1,800 ఎకరాలు, మినుము పంట 2,800 ఎకరాలు, వేరుశెనగ 75 ఎకరాల్లో దెబ్బతింది. ఎర్రకాలువ వరద ప్రభావంతో జగన్నాథపురం, సింగవరం, నందమూరు తదితర ప్రాంతాల్లో, కొవ్వాడ కాలువ ప్రభావంతో కొంతమేరకు వరి పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలు అందినట్టు వ్యవసాయ జేడీ సాయిలక్ష్మీశ్వరీ తెలిపారు. ఆందోళనలో అన్నదాతలు పశ్చిమ బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హె చ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ నెల పదో తేదీ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల వరి పంట కోతకు వచ్చింది. ముందస్తుగా నాట్లు వేసిన చోట్ల కోతలు సైతం ప్రారంభించారు. ఈ తరుణంలో వర్షం కురిస్తే పంటలు నేలవాలిపోవడంతో పంటరాలిపోయి తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తీవ్రవాద ప్రభావిత జాబితాలో జిల్లా
‘విదేశీ వ్యవహారాల’ వీసీలో వెల్లడి భద్రాచలం: దేశంలో 35 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించగా..అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా కూడా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్ఐసీ ఢిల్లీ డైరెక్టర్ ఆనంద్ జైన్ ప్రకటించారు. బుధవారం వీడియో కాన్ఫెరెన్స్‌లో కలెక్టర్ లోకేష్ కుమార్, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హనుమంతు, ఓఎస్డీ భాస్కరన్ భద్రాచలంలో హాజరయ్యారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ కేంద్రంకు ఖమ్మం జిల్లాలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల సమాచారాన్ని జీఐఎన్ సిస్టమ్ ద్వారా వెబ్సైట్లో పొందుపర్చేందుకు చర్చించారు. జిల్లా నుంచి తీవ్రవాద ప్రభావిత గ్రామాల భౌగోళిక సమాచారంలో భాగంగా ఫోస్టాఫీస్లు, బ్యాంకులు, ఏటీఎమ్‌లు, బ్యాంకు మిత్రా, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, టెలికం కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ సంస్థలు, పోలీసు స్టేషన్లు, రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించిన సమాచారం జీఐఎస్ ప్రాజెక్టు క్రింద వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, ఎస్వో డెవిడ్‌రాజ్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మంగళవారం రాత్రి 16 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంత్రాలయంలో 31.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. ఆలూరులో 30.6 మి.మీ., ఆళ్లగడ్డలో 18.4, గోస్పాడులో 18.2, పెద్దకడుబూరులో 16, ప్యాపిలిలో 15.4, తుగ్గలిలో 10, మద్దికెరలో 10 మి.మీ., ప్రకారం వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ., ఉండగా ఇప్పటి వరకు 151.6 మి.మీ., వర్షాలు కురిశాయి. అంటే 21 శాతం అధికంగా వర్షం కురిసింది. 14 మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది. -
పుంజుకున్న వర్షపాతం
ఖమ్మం వ్యవసాయం: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వర్షపాతం ఒక్కసారిగా పుంజుకుంది. మంగళవారం జిల్లాలో తొమ్మిది మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మణుగూరు మండలంలో 4.66 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కామేపల్లి మండలంలో 3.88 సెం.మీ.; నేలకొండపల్లి, కొణిజర్ల, తల్లాడ, గార్ల, బయ్యారం, సింగరేణి, వెంకటాపురం, వాజేడు, ముల్కలపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో 1 - 3 సెం.మీ,ల మధ్యన; ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, వైరా, చింతకాని, ముదిగొండ, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, అశ్వారావుపేట, జూలూరుపాడు, ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పినపాక, చర్ల మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. మిగిలిన తొమ్మిది మండలాల్లో వర్షం కురవలేదు. ఈ వర్షాల కారణంగా గోదావరి వరద పెరిగింది. జలాశయాల్లోకి నీటి వరద వస్తోంది. ప్రాజెక్టులు నిండాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లులోకి నీరు చేరుతోంది. జూన్ నుంచి వర్షపాతం ఇలా.. - జూన్‌లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 127 మి.మీ.కుగాను 337.1 మి.మీ. (164.4 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. - జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు అంతగా కురవలేదు. జూలైలో సాధారణ వర్షపాతం 309 మి.మీ.లకుగాను కేవలం 185.8 మి.మీ. మాత్రమే (39.8 శాతం లోటు) నమోదైంది. - ఆగస్టులో సాధారణ వర్షపాతం 276 మి.మీ.కుగాను 156.7 మి.మీ. మాత్రమే (43.2 శాతం లోటు) నమోదైంది. - ఖరీఫ్ సీజన్ గడిచాక సెప్టెంబ నెలలో వర్షాలు అందుకున్నాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 164 మి.మీ. 27వ తేదీ నాటికి 147.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటివరకు 272.8 మి.మీ. వర్షపాతం (85 శాతం అధికం) నమోదైంది. - కూసుమంచి మినహా అన్ని మండలాల్లో కొన్నిచోట్ల సాధారణం, మరికొన్నిచోట్ల అంతకు మించి వర్షపాతం నమోదైంది. - ఆగస్టులో 19 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. సెప్టెంబర్ అంతానికి ఒకే ఒక్క మండలం మాత్రమే లోటు వర్షపాతంలో ఉంది. 28 మండలాలు సాధారణ, 12 మండలాలు అధిక వర్షపాతంలో ఉన్నాయి. దెబ్బతింటున్న పంటలు పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌లో సాగు చేసిన వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయి. - ప్రధానంగా జిల్లాలో పత్తి 1.22 వేల హెక్టార్లలో, మిర్చి 30వేల హెక్టార్లలో, వరి 80వేల హెక్టార్లలో సాగయింది. ఈ వర్షాలతో వీటికి నష్టం వాటిల్లుతోంది. - ఏపుగా పెరిగిన పత్తి నేలవాలటంతో పూత, కాత దెబ్బతింటోంది. - మిర్చి పైరు నేలవాలింది. గాలి, నేలలో తేమ అధికంగా ఉండటంతో పైర్లు తెగుళ్లబారిన పడుతున్నాయి. నీరు నిలవడంతో మొక్కలు కుళ్లిపోయే పరిస్థితేర్పడింది. - ఇప్పటికే కొన్ని మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అశ్వారావుపేట మండలంలో వేరుశనగ 40 హెక్టార్లలో, మినుము 12 హెక్టార్లలో; కొత్తగూడెం మండలంలో పత్తి 50 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు వారు చెప్పారు. - ప్రకృతి వైపరీత్యాలతో 50 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే పరిహారం వర్తిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం.. ఇప్పటివరకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందదనే చెప్పాలి. మండలాలవారీగా వర్షపాతం - అధిక వర్షపాతం (12 మండలాలు): పినపాక, గుండాల, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, టేకులపల్లి, ముల్కలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి. - సాధారణ వర్షపాతం (28 మండలాలు): వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సింగరేణి, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం. -లోటు వర్షపాతం: కూసుమంచి -
వృద్ధ కళాకారులు పూర్తి సమాచారం అందించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) జిల్లాలో వృద్ధ కళాకారుల పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న కళాకారులు వారి వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సమాచార శాఖ సహాయ సంచాలకులు వీ.భాస్కర నరసింహం ఒక ప్రకటనలో కోరారు. కళాకారులు వారికి అందించిన గుర్తింపుకార్డు నకళ్లు, వారు ఏ కళారంగానికి చెందిన వారు, కళాబంద కార్యక్రమం నిర్వహించిన జిరాక్స్ తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ సంబంధించి జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా అందించాలని ఆయన కోరారు. కళాకారులు వారి పూర్తి అడ్రస్‌తో పాటు సెల్‌నెంబరు తప్పనిసరిగా అందించాలని ఎవరైనా కళాకారులకు సెల్‌నెంబరు లేకపోతే వారి సమీప బంధువులుగాని లేదా వారికి సమాచారం అందించే దగ్గర వారి సెల్‌నెంబరు నమోదు చేయాలని తద్వారా భవిష్యత్తులో ఉత్తర ప్రత్యుత్తరాలకు అవసరమైన సమాచారం తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
సాధారణం కంటే అధికంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఈ నెల సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. సెప్టంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మీ.మీ ఉండగా ఇప్పటి వరకు 145 మిమీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సి.బెళగల్లో 34.6 మీమీ వర్షపాతం నమోదు అయింది. పెద్దకడుబూరులో 32.4, దేవనకొండలో 26.4, ఎమ్మిగనూరులో 21.2, కోసిగిలో 16.4, పాములపాడులో 14.8, నందవరంలో 14.2, దొర్నిపాడులో 14, ఆత్మకూరులో 12.2, ఆదోనిలో 11.6, బండిఆత్మకూరులో 11.2, కోవెలకుంట్లలో 10.2, ఆస్పరిలో 10 మీమీ ప్రకారం వర్షాలు కురిశాయి. -
ఎన్ఫోర్స్మెంట్తో మరణాల నివారణ
జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ కాకినాడ సిటీ : రహదారులు, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ, పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్ అమలు ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను నివారించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, ఉప రహదారుల కూడళ్లలో జీబ్రా క్రాసింగ్‌లు, హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఆటోలు ఏడు వేలు మాత్రమే ఉండగా, రాజమండ్రిలో వీటి సంఖ్య 13వేలు, కాకినాడలో 18వేలు ఉందని, రోడ్లపై పెరిగిన రద్దీ, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల్లో ఇకపై కొత్తగా ఆటోలను అనుమతించకూడదని, పాతబడిన వాటిని తొలగిస్తూ ఆటోల సంఖ్యను ఏడువేలకు నియంత్రించాలని కమిటీ తీర్మానించింది. ప్రజలకు ప్రత్యామ్నాయంగా ముఖ్య రూట్లలో ఆర్టీసీ లేదా ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా బస్సు రవాణా వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు. ఎస్పీ ఎన్.రవిప్రకాష్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమారి, రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, ఇ¯Œæచార్జి ఉప రవాణా కమిషనర్ సిరి ఆనంద్, ఎన్‌హెచ్ విభాగం పీడీ జేసీహెచ్ వెంకటరత్నం, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఆర్టీఓలు, ఎంవీఐలు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ :జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరై భవనాల డిజైన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రగతి లేదన్నారు. ఇప్పటికే మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే అవి రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారీవర్షాల నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో ఈనెల 14 నుంచి 22 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు తెలిపారు. 2,459 హెక్టార్లలో వరి, 830 హెక్టార్లలో అపరాలు, 563 హెక్టార్లలో ప్రత్తి, 20 హెక్టార్లలో మిరప నీట మునిగినట్టు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందాయన్నారు. 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు దెబ్బతిన్నాయని, 244 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.52.57 కోట్లు, తక్షణ పనులకు రూ.2.48 కోట్లు అవసరమవుతాయన్నారు.రాజమహేంద్రవరంలోని కుమారీ టాకీస్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపును మూసివేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిపై కలెక్టర్ ఆదేశాలు ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 180 మంది అర్జీదారులు హాజరయ్యారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీలను స్వీకరించారు. -
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
–46 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి కూడా వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దాదాపు 46 మండలాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కొత్తపల్లిలో 30 మీ.మీ. వర్షపాతం నమోదు అయింది. ఆళ్లగడ్డలో 21.8, ఉయ్యలవాడలో 19, ఆలూరులో 18, బేతంచెర్లలో 16, దొర్నిపాడులో 16, పాములపాడులో 15.4, కర్నూలులో 13.4, కల్లూరులో 13.4, మిడుతూరు 13.2, ఓర్వకల్లో 13.2, వెల్దుర్తిలో 12.8, కోవెలకుంట్లలో 12.6, పెద్దకడుబూరులో 12.2, మంత్రాలయంలో 11.8, తుగ్గలిలో 10.6, శ్రీశైలంలో 10.4 మిమీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ. ఉండగా 138.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. -
‘ముసురు’కుంది..!
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు l వరద నీటితో జలాశయాలకు కళ l సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఖమ్మం వ్యవసాయం: ఐదు రోజుల నుంచి కురుస్తున్న వానలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. పాలేరు రిజర్వాయర్‌లోకి వరద చేరుతోంది. జిల్లాలో పెద్దదైన బయ్యారం చెరువు అలుగుపోస్తోంది. మున్నేరు, ముర్రేడు, కిన్నెరసాని తదితర వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. సగటున 8.7మి.మీల వర్షపాతం.. జిల్లాలో ఆదివారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది. సగటున 8.7 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లి మండలం లో 3.68 సెం.మీలు, దమ్మపేట మండలంలో 3.66 సెం.మీల వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో 3సెం.మీల వరకు, 23 మండ లాల్లో 1సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. కలెక్టర్ లోకేష్‌కుమార్ ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయించి.. వానలు, వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులతో భద్రాచలంలో సమావేశం ఏర్పాటు చేసి గోదావరి వరద కారణంగా ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతలపై సమీక్షించారు. జలాశయాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, తాలిపేరు, కిన్నెర సాని ప్రాజెక్టుల నీటి విడుదలపై తగిన సూచనలు చేశారు. పొంగిన వాగులు.. నిండిన జలాశయాలు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ నిండింది. ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో గేట్లను ఎత్తారు. జిల్లాలో పెద్దదైన బయ్యారం చెరువు అలుగు పోసింది. ఇక్కడి వరద కలవడంతో మున్నేరు ఉధృతంగా పారుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఖరీఫ్ సంకటం..రబీకి అనుకూలం ఈ వర్షాలతో ఖరీఫ్‌లోని పూత, కాత దశలో ఉన్న పత్తి చేలు దెబ్బతినే ప్రమాదముంది. ఏపుగా పెరిగిన పత్తి, మొక్కజొన్న పంటలు నేలవాలే అవకాశాలున్నాయి.అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమేర పంటలకు నష్టం వాటిల్లింది. రబీ పంటలకు ముందుగా వర్షాలు కురవడంతో భూగర్బ జలాలు పెరిగి..సాగు బాగుంటుందని వ్యవసాయ శాఖ, రైతాంగం భావిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాల్వకు నీటి విడుదల లేక ఈ సారి ఖరీఫ్ పంటలను వేయలేదు. ఈక్రమంలో కురిసిన వానలు..కనీసం రబీ సాగుకోసం ఆశలు సజీవం చేశాయి. -
విద్యుత్‌శాఖకు రూ. 7లక్షల నష్టం
నిజామాబాద్ నాగారం: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ.7 లక్షల మేర నష్టం వాటిల్లింది. వర్షాల తీవ్రతకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 స్తంభాలు పడిపోగా, 13 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోనే 91 స్తంభాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. అయితే, వర్షాలు తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఎస్ఈ ప్రభాకర్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
విద్యాస్థితి గతులపై సమగ్ర సర్వే
అయ్యలూరు(నంద్యాలరూరల్): జిల్లాలో విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు అసర్–2016 సర్వే చేస్తున్నట్లు బెంగళూరుకు చెందిన ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ గోవిందరాజు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని అయ్యలూరు్ర గామంలో కర్నూలు డైట్ కళాశాల విద్యార్థులు శ్రావణి, పవిత్రలు వార్షిక విద్యాస్థితి నివేదిక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏక కాలంలో ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యాస్థాయిని అంచనా వేసేందుకు మూడేళ్ల నుంచి 16సంవత్సరాలలోపు చిన్నారులు పాఠశాలలకు వెళ్తున్నారా.. లేదా? చదవగలరా.. గణితం చేయగలరా.. ఇంగ్లిష్ పదాలు నేర్చుకున్నారా? తదితర ప్రశ్నలతో ఈ సర్వే చేస్తున్నామన్నారు. -
వాలీబాల్ జట్ల ఎంపిక
కరీంనగర్ స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా బాల బాలికల జట్లను ఆదివారం ఎంపిక చేశారు. వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అండర్–21 యువతీ యువకులకు పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 35 గ్రామాల నుంచి 120 మంది హాజరై ప్రతిభ కనబర్చారు. జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 2 వరకు నిజమాబాద్ జిల్లా కామారెడ్డిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు పాల్గొంటాయని సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.వేణుకిషన్‌రావు, గిన్నె లక్ష్మణ్ తెలిపారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. పోటీల నిర్వహణను వాలీబాల్ సంఘం ప్రతినిధులు ముస్తాల రవీందర్, జి.సంజీవ్‌రెడ్డి, ఎం.రాజేందర్ కుమార్, దూడం రమేశ్, టి.రాజయ్య, శ్రీనివాస్‌రావు, మురళీధర్‌రెడ్డి, ప్రభాకర్, చంద్రశేఖర్, నర్సయ్య, సత్యనారాయణ, మధుకర్‌రెడ్డి, చంద్రబాబు, వీర్పాల్, శ్రీనివాస్, ఆశాలు, శిరీష పాల్గొన్నారు. అనంతరం జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను లక్ష్మణ్ ప్రకటించారు. బాలుర జట్టు... ఎస్.వంశీ కృష్ణ , ఎస్కే.సాజీద్ (రామడుగు), ఎస్.సాగర్ (జూలప్లలి), ఎల్,నVó శ్ (గంగాధర), కె.మహేశ్ (నంది మేడారం), వి.మలుపాల్(గట్టెపల్లి), కె.మహేశ్(చంజర్ల), పి.కార్తీక్(పెగడపల్లి), ఎన్.మునీందర్(నమిలికౌండ), ఎం.అరవింద్(పూడురు), ఎస్.గోపి(రామవరం), స్టాండ్ బైగా బి.సురేశ్(గౌరవెల్లి), జి.లక్ష్మణ్ (కమ్మర్‌ఖాన్‌పేట), ఎం.గణేశ్(పెగడపల్లి), కె.రమేశ్ (బోయినపల్లి) ఎంపికయ్యారు. బాలికల జట్టు... ఓ.కీర్తన, వి.వెన్నెల, ఎస్.భవాని(ఆసీఫ్‌నగర్), సీహెచ్.ఐశ్వర్య, కె.అర్పిత, బి.జ్యోతి, జి.ఆమని (పెగడపల్లి), సీహెచ్.అశ్విని( గంగాధర), ఎం.అఖిల(గొల్లపల్లి), డి.అఖిల(కరీంనగర్), బి.అఖిల(వెల్గటూర్), బి.మల్లీశ్వరి (జూలపల్లి), స్టాండ్ బైగా బి.శిరీష, డి.మమత (పెగడపల్లి), డి.పూజిత(కరీంనగర్), ఎం.కనకమహాలక్ష్మి(ఆసీఫ్‌నగర్) ఎంపికయ్యారు. -
బంగారు బొడ్డెమ్మ
‘బతుకమ్మ’కు ముందు వచ్చే సంబరం కొన్ని చోట్ల నేటి నుంచి ప్రారంభం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం.. తెలంగాణ. ఆచార, వ్యవహారాలే కాదు.. పండుగల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. యాస భాషకే అందాన్నిస్తే.. పండుగలు సంప్రదాయాలకు అద్దం పడతాయి. మహిళలకే ప్రత్యేకమైన మన ‘బతుకమ్మ’.. తెలంగాణే కాదు.. దేశ సరిహద్దులు దాటి నేడు విశ్వవ్యాప్తమైంది. ఈ బతుకమ్మకు ముందు వచ్చే మరో ముఖ్యమైన పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ పెద్దల పండుగ అయితే, బొడ్డెమ్మ చిన్నపిల్లలు, కన్నె పిల్లల వేడుక. అయితే, ఒక్కోచోట ఒక్కోలా ఈ పండుగను జరుపుకొంటారు. కొన్నిచోట్ల పది రోజుల పాటు బొడ్డెమ్మ ఆడుతుంటే, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఆడతారు. మరికొన్ని చోట్ల ఐదు వారాల పాటు ఆడతారు. భాద్రపద బహుళ పం^è మి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మను, మహాలయ అమావాస్య నుంచి అశ్వీయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. ఒకప్పుడు పల్లె పల్లెన, పట్టణాల్లో వీధివీధిన కనిపించిన ‘బొడ్డెమ్మ’కు ప్రస్తుతం ఆదరణ కరువైంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే బొడ్డెమ్మ ఆడడం కనిపిస్తోంది. నిజామాబాద్ కల్చరల్/కామారెడ్డి: -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
కర్నూలు(రాజ్‌విహార్): పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సాహిస్తామని, సమస్యలుంటే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రాజేంద్ర తెలిపారు. శనివారం స్థానిక ఐలా అసోసియేషన్ భవనంలో వివిధ పారిశ్రామికవేత్తలు, సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటైన, కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమల స్థితిగతులు తెలుసుకునేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. అనుమతులు పొందడం, ఇతర టెక్నికల్ కారణాల సమస్యలు ఎదురైతే తన దష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఫ్యాప్సీయా అధ్యక్షుడు జిఆర్కె రెడ్డి, కార్యదర్శి ఎం జగన్మోహన్రెడ్డి, జనరల్ మేనేజరు సోమశేఖర్‌రెడ్డి, మధుసూదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ టీచర్ల పోస్టులకు 728 మంది హాజరు
ఏలూరు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కంప్యూటర్ విద్యలో భాగంగా కంప్యూటర్ టీచర్ల నియామకాలకు శనివారం నిర్వహించిన ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షకు మొదటి రోజు 728 మంది అభ్యర్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు శనివారం తెలిపారు. 1,200 మంది హాజరుకావాల్సి ఉండగా 68 శాతం అభ్యర్థులు పరీక్షలు రాశారని చెప్పారు. రెండో రోజు ఆదివారం మరో 1,100 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షను రాషీ్ట్రయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్ఎంఎస్ఎ) ఏవో పార్వతి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్‌కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
శశి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు
ఉండ్రాజవరం, (తణుకు టౌన్) : వేలివెన్ను, కానూరు శశి విద్యాసంస్థలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపికైనట్టు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకష్ణ తెలిపారు. వేలివెన్ను క్యాంపస్‌కు సంబంధించి పోతుల దుర్గాప్రసాద్, గూడపాటి బాలకష్ణ, కురం రాణి, కానూరు కాంపస్ నుంచి బద్ది దుర్గాభవాని, ఉప్పలపాటి మౌనిక, వెంపాటి సూర్యతేజ, నంద్యాల నవ్యశ్రీ, తాడి ఆమని, యారసామి లోహితలక్ష్మి ఎంపికైనట్టు తెలిపారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మేకా నరేంద్ర కష్ణ, క్రాంతిసుధ అభినందించారు. -
టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడిగా పద్మాకర్‌రెడ్డి
విద్యారణ్యపురి : తెలంగాణ ప్రాంత ఉ పాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లాస్థాయి సమావే శం శుక్రవారం హన్మకొండలోని వివేకానంద నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా కార్యవర్గం లోని సీనియర్ ఉపాధ్యక్షుడైన సల్లగొండ పద్మాకర్రెడ్డిని అడహక్ జిల్లా అధ్యక్షుడిగా నియమాకం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మాకర్‌రెడ్డి గతంలో వెంకటాపూర్ మండలం అధ్యక్షుడిగాను, జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన టీపీయూఎస్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ సంఘం శ్రేయస్సుకు, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఎం.మహేందర్, కె.వెంకటకృష్ణ, ఎ.శేఖర్, సీని యర్ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుదాం
– బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పిలుపు – వ్యవసాయానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాను పారిశ్రామికహబ్‌గా అభివద్ధి చేసేందుకు బ్యాంకర్లు అన్ని విధాలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో హాలులో శుక్రవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అక్టోబర్ రెండో పక్షంలో అన్ని మండల కార్యాలయాల్లో పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడుతూ ఖరీఫ్‌లో రూ. 2790 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. రబీ సీజన్ కూడా ప్రారంభమవుతున్న దష్ట్యా పంట రుణాల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అన్ని బ్యాంకులు వెంటనే రుణ మంజూరు పత్రాలు ఇస్తే యూనిట్ల గ్రౌండింగ్‌కు అవకాశం ఉంటుందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆర్బీఐ అధికారి గణేష్, లీడీసీఎం నరసింహారావు, సిండికేట్ బ్యాంకు ఏజీఓం మహంతి, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్బీఐ, ఏపీజీబీ ఆర్ఎంలు రమేష్‌కుమార్, వీసీకే ప్రసాద్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్కే నియామకం జిల్లా క్రికెట్‌కు మేలు
ఏలూరు రూరల్ : భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎస్కే ప్రసాద్ నియామకం జిల్లాకు మేలు చేస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, ఎంపీ గోకరాజు గంగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రసాద్ ఏలూరు భోగాపురం వద్ద అసోసియేషన్‌కు క్రికెట్ గ్రౌండ్ కోసం స్థలం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. భీమవరం డీఎన్ఆర్ కళాశాల క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడంలో ప్రసాద్ కీలకపాత్ర పోషించారన్నారు. మంగళగిరిలో అండర్–14, కడపలో అండర్–17, విజయనగరంలో అండర్–19 అకాడమీతో పాటు గుంటూరు జేకేసీ కళాశాలలో మహిళా క్రికెట్ అకాడమీ స్థాపనకు ముఖ్య భూమిక పోషించినట్టు చెప్పారు. జిల్లాకు చేసిన సేవలకు గుర్తుగా మంగళగిరిలో ఆయనను ఘనంగా సన్మానించామని వివరించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, ఎం.నగేష్‌కుమార్, వి.విద్యాప్రసాద్, బీఎస్ మంగేష్, ఎండీఎఫ్ రహమాన్, కె.రామచంద్రరావు, బాపూజీ పాల్గొన్నారు -
జిల్లాలో 365 డెంగీ కేసులు
డీఐఓ డాక్టర్ వెంకటేశ్వరరావు కల్లూరు: జిల్లాలో 365 డెంగీ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ బి.వెంకటేశ్వరరావు వివరించారు. గురువారం కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది కంటే ఈసారి డెంగీ జ్వర పీడితుల సంఖ్య పెరిగిందని, ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలతో పాటు, తల్లాడ మండలంలోని మల్లవరం, గోపాలపేట, మల్సూరు తండా, కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం, బోనకల్ మండలంలోని ఆళ్లపాడు, గోవిందాపురం, రామాపురం తదితర గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. టైగర్ దోమ కాటు వల్ల డెంగీ జ్వరం వస్తుందని, ఇవి మంచినీళ్లల్లో పెరుగుతాయని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరి బోండాలు, టైర్లు, కూలర్లలో నీటిని గుర్తించకుంటే..ఈ దోమలు అక్కడ పెరుగుతాయని, వాటర్ ట్యాంక్‌లపై మూతలు వేయాలని తెలిపారు. ఈ దోమలు పగలు కుడతాయని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేదని చెప్పారు. కల్లూరు మండలం చెన్నూరు, నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉందని, బడ్జెట్ కేటాయింపు జరగాల్సి ఉందని వివరించారు. సమావేశంలో ఎస్‌హెచ్‌పీఓ డాక్టర్ ఎల్. భాస్కర్, వైద్యాధికారి పద్మజ, హెచ్ఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిలో ఇందూరే నెంబర్‌వన్
లింగంపల్లి (సదాశివనగర్): పాల ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని విజయ డెయిరీ జిల్లా జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 38 వేల క్వింటాళ్ల పశుగ్రాసం విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆదివారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల పాల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పాల ఉత్పత్తిలో ఇందూరు మొదటి స్థానంలో ఉందని.. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి జిల్లాకు 1.14 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లాలో 14,158 మంది పాడి రైతులు ఉన్నారని, 323 పాల కేంద్రాలు పని చేస్తున్నాయని, రోజూ 65 వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపల్లిలో దాణా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు జీఎంకు విన్నవించారు. సదాశివనగర్ బీఎంసీ మేనేజర్ బాల్‌రెడ్డి, పాల కేంద్రం అధ్యక్షుడు రాములు, కామారెడ్డి డెయిరీ మేనేజర్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా దంతూరి
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా దంతూరి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక విద్యుత్‌నగర్ చల్లా ఫంక్షన్హాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో వివిధ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొని సంఘ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ కార్యదర్శిగా మంత్రిప్రగడ వేణుగోపాల్, కోశాధికారిగా గాడేపల్లి సత్యనారాయణ ఎన్నికయ్యారు. దంతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ ఒకటై ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతీ సభ్యునికి అందేలా కృషి చేస్తానన్నారు. అందరి సమ్మతితో మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. పట్టణ పురోహిత సంఘ అధ్యక్షుడు అకెళ్ల మురళీకృష్ణ, సభ్యులు దువ్వూరి కామేశ్వర్రావు, వాడ్రేపు దశరధకుమార్, పాలూరి శ్రీనివాస్, కాదంబరి రామ్మోహన్, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహానందీశ్వరుడి సేవలో..
మహానంది: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుపమచక్రవర్తి ఆదివారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో హారతి తీసుకుని పూజలు చేపట్టారు. న్యాయమూర్తి దంపతులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేయించారు. -
కొత్త జిల్లాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు
–అధికారుల పనితీరు భేష్ –రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ భువనగిరి : కొత్తగా ఆవిర్భవించనున్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన భవనాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. అధికారుల పని తీరు బాగుందని కితాబునిచ్చారు. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన తాత్కాలిక భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. తొలుత భువనగిరి శివారులోని పగిడిపల్లిలో గల బంజారా ట్రైబల్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని, జగదేవ్‌పూర్ రోడ్డులోని మాధవ బీఈడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సందర్శించారు. కలెక్టర్ భవన సముదాయంలో వివిధ శాఖల కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలు, కేటాయించిన బ్లాక్‌లు, తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అనంతరం హన్మాపురం శివారులో ఉన్న మాధవ బీఈడీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ఎస్పీ, డీఎస్పీ, ఎస్‌బీతో పాటు వివిధ విభాగాల కోసం నిర్మితమవుతున్న గదులను పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సీఎస్‌కు వివరించారు. అక్కడి నుంచి రాయగిరిలో గల మాసుకుంట సమీపంలో ఉన్న డ్వాక్రా భవనాలను, ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తదనంతరం సూర్యాపేటకు వెళ్లారు. ఆయన వెంట జేసీ సత్యనారాయణ, ఏఎస్పీ గంగారం, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి,డీఎస్పీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, సీఐలు శంకర్‌గౌడ్, అర్జునయ్య, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద సీఎస్‌కు కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. అలాగే భువనగిరి రహదారి బంగ్లాలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
నేత్రదానంలో జిల్లా ముందుండాలి
–నేత్రదాన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయిస్తా – డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు : చరిత్రలో నిలిచేలా నేత్రదానంలో కర్నూలు జిల్లా ముందుండాలని ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆకాంక్షించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఉద్యమంలా చేపట్టిన నేత్రదాన కార్యక్రమాలకు తాను అండగా ఉంటానన్నారు. నేత్రదాన సమాచారం కోసం ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయిస్తానని కేఈ హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని దూపాడు వద్దనున్న కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉదయం మెగా నేత్రదాన స్వచ్ఛంద అంగీకార పత్రాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా ఉపముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. గతంలో కళ్లు లేనివారికి దేవుడే దిక్కు అనేవారని, ఇప్పుడు వారికి ఎస్పీ గారి ఉద్యమం జీవితంపై భరోసా ఇస్తుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీడియా కూడా విస్తత ప్రచార ం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో చేపట్టిన ప్రతి అభివద్ధి కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి హాజరై ప్రోత్సహించారని గుర్తు చేశారు. నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాసులు, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, చైర్మన్ అశోకవర్ధన్‌రెడ్డి, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, హరినాథరెడ్డి, హుసేన్ పీరా, బాబా ఫకద్దీన్, ఎ.జి.కష్ణమూర్తి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, ఈశ్వర్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, వెంకటాద్రి, సుప్రజతో పాటు పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కార్యక్రమంలో పాల్గొని నేత్రదాన అంగీకార పత్రాలను సమర్పించారు. జిల్లా పోలీసులు సేకరించిన 1.52 లక్షల నేత్రదాన అంగీకార పత్రాలను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. వాటన్నింటినీ కేవీ సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థుల ద్వారా ఆన్లైన్లో రెడ్‌క్రాస్ వెబ్సైట్లో నమోదు చేయించారు. -
నేడు జిల్లాలో హరీష్‌రావు పర్యటన
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకున్న తర్వాత ఆయన హన్మకొండ మండలం పలివేల్పులలో హరితహారం మొక్కలు నాటనున్నారు. 11 నుంచి 2 గం టల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
జల సవ్వడి
హన్మకొండ : నాలుగు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నీటితో నిండి మత్తడి పోస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు కురవిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్లు, మద్దూరులో 85.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. చేర్యాలలో 58.6, నర్మెట 13.6, బచ్చన్నపేట 75, జనగామ 21.4, లింగాలఘఘన్పూర్ 2, రఘునాథపల్లి 8.4, స్టేషఘన్పూర్ 27.4, ధర్మసాగర్ 68.4, హసన్‌పర్తి 40, హన్మకొండ 41.6, వర్థన్నపేట 41.2, జఫర్గడ్ 0.8, దేవరుప్పుల 4, కొడకండ్ల 4, రాయపర్తి 24.2, నెల్లికుదురు 30.4, తొర్రూరు 34.6, నర్సింహులపేట 12.4, మరిపెడ 29.6, డోర్నకల్ 1.0, మహబూబాబాద్ 9.2, కేసముద్రం 23.6, నెక్కొండ 24.2, గూడూరు 66.2, కొత్తగూడ 31.2, ఖానాపూర్ 85.4, నర్సంపేట 37.2, చెన్నారావుపేట 23.8, పర్వతగి రి 6.6, సంగెం 64.4, నల్లబెల్లి 4.4, దుగ్గొండి 8.2, గీసుకొండ 30.2, ఆత్మకూర్ 3.6, శాయంపేట 3.4, పరకాల 6.8, రేగొండ 6, మొగుళ్లపల్లి 2.4, భూపాలపల్లి 13.2, గణపురం 3.2, ములుగు 2.4, వెంకటపూర్ 3.8, గోవిం దరావుపేట 5.2, తాడ్వాయి 9.2, ఏటూరునాగారం 10, మంగపేట 4.6, వరంగల్ 28 మిల్లీమీటర్లు నమోదైంది. -
‘జిల్లాల విభజన సహేతుకంగా లేదు’
చిలుకూరు: జిల్లాల విభజనను స్వాగతిస్తున్నాం. కానీ మండలాలు, డివిజన్ల విభజన సహేతుకంగా లేదని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యతిపతిరావును అన్నారు. మంగళవారం చిలుకూరు ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన అ సంఘం మండల సమావేశంలో మాట్లాడారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలి డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా అమలు చేయాలన్నారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2016 డీఎస్సీ తక్షణమే నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాఘవులు, మండల అధ్యక్షుడు కొండా వెంకయ్య, ప్రధాన కార్యదర్శి కంచుగంటి వెంకటేశ్వర్లు, జిల్లా, మండల నాయకులు గుండు ఆదినారాయణ, మండవ ఉపేందర్, మంద పుల్లయ్య, ఎస్. రాదాకృష్ణ, సురేష్, పి. నాగేశ్వరారవు, కీరీటం, ఎస్. శ్రీనివాస్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం: జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్ టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్‌కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఐఎంఏ హాల్ నిర్వహించిన జిల్లాస్థాయి ద్వితీయ సబ్‌జూనియర్, జూనియర్, పురుషులు, మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ముగిసిశాయి. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పోటీలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 65 మంది క్రీడాకారులు ఆయా కేటగిరీల్లో పాల్గొన్నారు. ఒక్క రోజుకు పరిమితంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలను కెరీర్‌గా మార్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయా కేటగిరిల్లో విజేతలుగా నిలిచినవారికి ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ పీటీఆర్ కృష్ణారావు, అధ్యక్షుడు జి.నరేంద్ర, కార్యదర్శి సీహెచ్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా శిరీష
దుగ్గొండి: వరంగల్ జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ముద్రబోయిన శిరీష ఎంపికైనట్లు పీఈటీ కోట రాంబాబు తెలిపారు. ఇటీవల జేఎన్ఎస్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ – 17 విభాగంలో ఆమె ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి రంగారెడ్డి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు కెప్టెన్‌గా శిరీష వ్యవహరిస్తారన్నారు.