ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది.
చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్‌కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు.
గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే..
Comments
Please login to add a commentAdd a comment