Ambika
-
పత్తి మనదే ప్రతిఫలం మనదే
హైదరాబాద్‌కు చెందిన దండోతికర్ అంబిక చిన్నప్పటి నుంచి మూసీ నది కాలుష్యాన్ని చూస్తూ పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూసి నీళ్లలో నింపుతున్న విషాన్ని గురించి తెలుసుకుంది. అప్పటి నుంచే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయాలు వెదకడం మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను తయారుచేయడమే కాదు వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకుంది.ఉస్మానియా యూనివర్సిటీలో ‘సోషల్ సర్వీసెస్’లో పీజీ చేసింది అంబిక. ఇది కేవలం చదువు కాదు. సామాజిక సేవ దిశగా వేసిన తొలి అడుగు. రైతుల ఆత్మహత్యలతో కలత చెందిన అంబిక ఎన్నో గ్రామాల్లోకి వెళ్లి ఎంతోమంది పత్తి రైతులతో మాట్లాడింది. వారి సమస్యలను తెలుసుకుంది.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణానికే కాదు పత్తి రైతుకూ మేలు జరుగుతుందని ఆలోచించింది. మచ్చలు వచ్చిన పత్తిని కూడా సేకరించి వస్త్రాన్ని తయారుచేసి, బ్యాగులు తయారు చేయాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. పర్యావరణ స్పృహ, ఉపాధి కల్పన, కాటన్ దుస్తుల గురించి ప్రచారం... అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. మూసీ ప్రక్షాళన చేసే దిశగా విద్యార్థులతో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2016లో జరిగిన హిల్లరీ వెబర్ బూట్ క్యాంప్‌లో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. ఎన్ ఐఆర్డీ ఏర్పాటు చేసిన రిస్క్ కాంక్లేవ్‌లో అంబిక ఇచ్చిన ప్రెజెంటేషన్ కు ‘బెస్ట్ స్టార్టప్ ఇన్ సస్టెయినబుల్ లైవ్లీహుడ్’ ‘బెస్ట్ ఇన్నొవేటివ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డులు వచ్చాయి. సామాజిక సేవ పునాదిపై సొంతంగా స్టార్టప్‌ను నిర్మించిన అంబిక రూపాయి లాభంతో మాత్రమే సేవలు అందించింది. రైతుల నుంచి పత్తిని సేకరించడం నుంచి బ్యాగులు తయారు చేయడం వరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. సంప్రదాయంగా వస్తున్న డైయింగ్, ప్రింటింగ్ కళలను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘పర్యావరణ స్పృహతో ఒక్క అడుగు పడినా....ఒక్క అడుగేనా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఆ అడుగును అనుసరిస్తూ వందల అడుగులు పడతాయి’ అంటుంది దండోతికర్ అంబిక. కాలుష్య సమస్యకు కలత చెందడం కంటే ‘నా వంతుగా ఒక పరిష్కారం’ అనుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వ్యర్థాల వరద భయపెడుతున్న వేళ, వాటి దుష్పరిణామాల గురించి తెలిసినా....అవి మన దైనందిన జీవితంలో భాగమైన దురదృష్ట కాలాన.....అంబికలాంటి పర్యావరణ ప్రేమికులు పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు.తన వంతు పరిష్కారంగా ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులు తయారుచేస్తూ వాటి ్రపాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది దండోతికర్ అంబిక. ‘పత్తి మనదే ప్రతి ఫలం మనదే’ అనే నినాదంతో రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికకు ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.– ఎన్.సుధీర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్‌ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
ఇక చాలు ఆపండి.. నేను ఆమె భర్తను కాదు: నటుడు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అంబిక. సీనియర్ హీరోయిన్ రాధ సోదరి అయిన ఈ మలయాళ నటి తన సొంత భాషతో పాటు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ యాక్ట్ చేసింది. దొంగలు బాబోయ్ దొంగలు, మా నాన్నకు పెళ్లి, రాయుడు, నేటి గాంధీ, కొండవీటి సింహాసనం, మనసు పలికే మౌనరాగం.. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.రెండు పెళ్లిళ్లు?1988లో ఎన్నారై ప్రేమ్‌కుమార్‌ను పెళ్లాడగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వ్యక్తిగత విభేదాల కారణంగా 1996లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2000వ సంవత్సరంలో నటుడు రవికాంత్‌ను పెళ్లాడగా 2002లో విడాకులు తీసుకున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వికీపీడియాలోనూ ఈ విషయం రాసి ఉండటంతో అందరూ అదే నిజమని భావిస్తున్నారు.భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన..తాజాగా ఈ ప్రచారంపై నటుడు రవికాంత్ స్పందించాడు. 'నేను అంబిక భర్తనంటూ ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన నిజంగానే దంపతులమైపోతామా? మేమిద్దరం పక్క పక్క ఇంట్లోనే నివసిస్తాం. కాబట్టి షూటింగ్ ఉన్నప్పుడు రెండు కార్లు తీయకుండా ఒకే కారులో వెళ్తుంటాం. భార్యాభర్తలు కలిసొస్తున్నారంటూ అందరూ సరదాగా ఆటపట్టిస్తుంటారు.నేను ఆమె భర్తను కాదుఅంతేకానీ మేము పెళ్లి చేసుకోలేదు. అంబిక.. ప్రేమ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండేది. షూటింగ్స్ కోసం వచ్చి వెళ్తుండేది.. అంతే! నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. తన భర్తను కానే కాదు' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా రవికాంత్ తమిళంలో సరోజ, బిర్యానీ, అభిమన్యు, మానాడు వంటి చిత్రాల్లో అలరించాడు. ప్రస్తుతం మలర్ అనే సీరియల్ చేస్తున్నాడు.చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు -
హిందూపురం: నిమ్మల వర్సెస్ అంబికా..
సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గాల నుంచి పలువురు హిందూపురం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారు టీడీపీ పెద్దలను కలిసి లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. అయితే వీరిలో ఎవరిని బరిలో దింపినా...మిగతా వారితో ఇబ్బందే అన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తోంది. హిందూపురం పార్లమెంటులో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, సొంత కేడర్ లేని వ్యక్తికి టికెట్ ఇస్తే అంతేసంగతులని ఆశావహులు అధిష్టానం వద్ద తమ అభిప్రాయం తెలిపినట్లు సమాచారం. అందరి పరిస్థితీ అంతంతే.. హిందూపురం పార్లమెంటు సీటుకు టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ సొంత ఓటు బ్యాంకు లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ బలంపై ఆధారపడాల్సిన పరిస్థితి. కనీసం వారి కులాల నుంచి కూడా సరైన మద్దతు లేదనేది స్పష్టం అవుతోంది. ఆయా కులాల ఓటు బ్యాంకు టీడీపీ కంటే వైఎస్సార్సీపీకే బలంగా ఉండటం విశేషం. వైఎస్సార్ సీపీ గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు బీసీలకే ఇవ్వగా, ఈ సారి టీడీపీ తరఫున బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. అయితే ఆయా కులాలకు వైఎస్సార్సీపీ ఎనలేని గుర్తింపు ఇచ్చింది. నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యాధికారం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ఓటర్లు ఎవరూ టీడీపీ వైపు మొగ్గుచూపడం లేదని అధిష్టానికి తెలిసిపోయింది. దీంతో వారికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మల వర్సెస్ అంబికా.. 2009లో కాంగ్రెస్ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంబికా లక్ష్మీనారాయణ ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయనకు ఇప్పటివరకు ఒకసారి కూడా టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు సొంత కులంలో బలం లేదని సమాచారం. మరోవైపు బోయ సామాజిక వర్గంలో చాలా మంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తుండటం తెలిసిందే. ఇక నేసే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎంపీ సీటుకు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. లేదంటే తనకు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. నిమ్మల కూడా ఆ సామాజిక వర్గంలో పెద్దగా ప్రభావం చూపించలేరని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. రేసులో మరికొందరు.. హిందూపురం ఎంపీ స్థానం నుంచి అంబికా, నిమ్మలతో పాటు పుట్టపర్తికి చెందిన సామకోటి ఆదినారాయణ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే కనీసం ఎంపీ సీటైనా ఇవ్వాలని ఇటు సవితమ్మ అటు బీకే పార్థసారథి కోరుతున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం నుంచి ఎవరికీ హామీ దక్కలేదని సమాచారం. బీసీ కులాల నుంచి సమర్థుడు దొరకడం లేదని పార్టీ పెద్దలు చర్చించుకున్నట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. వెంటాడుతున్న ఓటమి భయం.. ఓటమి భయంతో కొందరు టీడీపీ నేతలు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టికెట్ రేసులో ఉన్నవారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరోవర్గం అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా చెబుతున్నారు. గ్రూపు రాజకీయాలతో పోటీలో ఉన్న వారు బలి కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పురం’ ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలో నిలపాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్‌కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
‘ఏదో రాసి, పాడేసి.. మార్కెట్టులో వదిలాను’ అనుకోవడం సరికాదు..
Mumbai DJ Model Ambika Nayak: ముంబైకి చెందిన కయన్ డిజే, మోడల్, రైటర్, సింగర్. తల్లి దగ్గర గాత్రసంగీతాన్ని అభ్యసించింది. హిప్–హప్, గెట్టో టెక్, ఆర్ అండ్ బీ...ఇలా రకరకాల మ్యూజిక్ జానర్స్ అంటే ఇష్టం. సీబీ హోయో, జెమిమా కిర్కే. జోర్జా స్మీత్, బ్రెంట్ ఫయాజ్... మొదలైనవారి నుంచి ఇన్స్పైర్ అయింది. ‘కూల్కిడ్స్’ పాటతో బాగా పేరు తెచ్చుకుంది కయన్. ‘ఏదో రాసి, పాడేసి మార్కెట్టులో వదిలాను’ అనుకునే ధోరణి ఎప్పుడూ విజయవంతం కాదు అని నమ్ముతుంది కయన్. అందుకే తన పాట మార్కెట్ ను తాకే ముందు ఎప్పటికప్పుడు మరింత బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రచనకు అవసరమైన ముడిసరుకును తన అనుభవాల్లో నుంచి తీసుకొని రాస్తుంది. అందుకే ఆ పాటలు సహజంగా ఉంటాయి. పనిలో నుంచి సంగీతం పుట్టింది కదా! అందుకే పాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో పనికీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తుంది. నడుము వంచి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ‘ఖాళీ సమయంలో ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు కాస్త వెరైటీగా ఇలా సమాధానం చెప్పింది.... ‘ఖాళీ సమయంలో కూడా ఏదో ఒక పని చేస్తూ ఎంజాయ్ చేస్తాను’. అదిసరే, ‘కయన్’ అనే పేరు కాస్త వెరైటీగా ఉందేమిటీ? అనుకుంటున్నారా! ఏమీలేదండీ...ఆమె అసలు పేరు అంబికా నాయక్. సర్నేమ్ ‘నాయక్’ను తిరగేసి కయన్ అయింది. అంతే!! చదవండి: Rewind 2021: సామాన్యురాలు ఫోర్బ్స్' లిస్టులో.. విశ్వకిరీటం మరోసారి View this post on Instagram A post shared by Ambika Nayak (@kayan.a) -
బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు
న్యూఢిల్లీ: ఖైబర్ పక్తూంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్‌లో అప్పర్ కోహిస్తాన్ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్‌కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) కారణమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు. -
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టిలో చేరాను
-
పాసయ్యాడు
అజయ్ అమన్, అంబిక, సాయి కేతన్ ముఖ్య తారలుగా ప్రేమ్ భగీరథ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అజయ్ పాసయ్యాడు’. ఝాన్సీ, శివన్నారాయణ ప్రధాన పాత్రల్లో మాగాపు సూర్యకమల, వై.రాజేంద్ర నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇది. నేటి యువతకి అన్నీ పరీక్షలే. చదువులో, ఆటల్లో, ఉద్యోగాల వేటలోనే కాదు.. ఇంట్లో తల్లిదండ్రులు, ప్రేమలోనూ పరీక్షలు తప్పడం లేదు. వీటన్నింటినీ పాసవ్వడం సాధ్యమే అంటాడు అజయ్. అవి సాధ్యం కాదని పెద్దలు హితబోధ చేయడం మొదలు పెడితే వినే ఓపిక యువతకి ఉండదు. మోడ్రన్ టెక్నాలజీ పుణ్యమా అని తమ సమస్యలకు పరిష్కారం కూడా యువతే వెతుక్కుంటోంది. వాళ్ల ప్రయాణం అడ్డదారుల్లో వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకుంటే చాలనే విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. శ్రీనివాస్, కెమెరా: జె.గణేశన్. -
భవిష్యత్తుకు భరోసా
-
చిక్కు తీసిన చక్కనమ్మ
జీవితంలో చిక్కులు తప్పవు. చిక్కులకు భయపడి.. భయంలో చిక్కుకుపోతే ఎదగం. ఎదగలేం. అదే.. ప్రతి చిక్కునూ విప్పుకుంటూ పోతే.. భయాన్ని జుట్టుపట్టి ఈడ్చిపారేయొచ్చు. అంబికా పిళ్లై కూడా అదే చేశారు. చిక్కులు తీసే ముస్తాబమ్మ అయ్యారు. తన చిక్కులు తీసుకున్న చక్కనమ్మా అయ్యారు. జీవితంలో నిలబడడం కన్నా... చక్కదనం ఏముంటుంది చెప్పండి?! అంబికా పిళ్లై వయసు 56 ఏళ్లు. సొంతూరు కేరళ రాష్ట్రంలోని కొల్లాం. ప్రస్తుతం ఉంటున్నది ఢిల్లీలో. సింగిల్ మదర్. తనక్కడ ‘డిజైనర్ సెలూన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించి ఎనిమిదేళ్లవుతోంది. 150 మంది ఉద్యోగస్తులు, పదికోట్ల టర్నోవర్‌తో ఆ సెలూన్స్‌ను నడిపిస్తోంది అంబికా. ‘‘జుట్టు కట్ చేసినంత ఈజీ కాదు ఈ వ్యవహారం.. వాటర్ ప్రూఫ్లేని మేకప్ వానకు కొట్టుకుపోయినట్టు.. నమ్మక ద్రోహంతో రెండుసార్లు వ్యాపారం తుడిచిపెట్టుకుపోయింది’’ అంటుంది అంబికా పిళ్లై! ఇరవై నాలుగేళ్లకే విడాకులు అంబికా వాళ్లది కాస్త కలిగిన కుటుంబమే. పదిహేడేళ్లకే ఆమెకు పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. అయితే ఆమె కాపురం కలహాలతో సాగింది. ప్రయత్నించినా భర్త తీరులో మార్పు రాలేదు. దాంతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయే నాటికి ఆమె వయసు 24 ఏళ్లు. చంకలో రెండేళ్ల పాపతో మెట్టినిల్లు వదిలి పుట్టింటి తలుపు కొట్టకుండా సొంత శక్తిమీద నిలబడాలని ఢిల్లీ వెళ్లింది. రకరకాల జడలు వేయడం, బట్టల సెలెక్షన్, మిక్స్ అండ్ మ్యాచ్, బాగా ముస్తాబు అవడం, స్నేహితులకు మేకోవర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆసక్తి కూడా. అందుకే ఢిల్లీలో హెయిర్ స్టయిలిస్ట్ కోర్సు చేసి, మేకప్‌లో శిక్షణ తీసుకుంది. తండ్రి చేయూతనీ వద్దంది కోర్సు అయిన వెంటనే ఓ బ్యూటీ సెలూన్లో రెండువేల రూపాయలకు ఉద్యోగంలో చేరింది అంబిక. అందులో సగం రెంట్, మిగతా సగం ఇంటి ఖర్చులకే అయిపోయేది. అందుకే పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టుల దగ్గర, హెయిర్ స్టయిలిస్టుల దగ్గర పార్ట్ టైమ్ చేసేది. అంటే.. ఫ్యాషన్ షోలకు, పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లకు అసిస్టెంటుగా వెళ్లేది. దీనివల్ల అదనపు ఆదాయంతో పాటు పనిలో నైపుణ్యం కూడా పెరిగింది ఆమెకు.అలా కష్టపడ్డ డబ్బును దాస్తూ, దాంట్లో కొంత మొత్తంతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంది. తన సొంత సంపాదనతో కొన్న కారును తండ్రికి చూపించాలనే ఆరాటంతో తండ్రిని ఢిల్లీకి పిలిచింది. తన కారులోనే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆయనను రిసీవ్ చేసుకుంది. ‘‘ఇది నీ కూతురు కారు...’’ అంటూ తన కారును చూపించింది. అప్పటికే హై ఎండ్ కార్లను వాడుతున్న ఆయన.. బిడ్డ కారును చూసి పెదవి విరిచాడు. ‘‘నన్ను అడిగితే మంచి కారే కొనిపెడతా కదా’’ అన్నాడు. చిన్నబుచ్చుకోలేదు అంబిక. ‘‘సొంత సంపాదనలో ఉన్న ఆనందం, అందే గౌరవం నీ కూతురికి బాగా తెలుసు నాన్నా’’ అంది కార్ స్టార్ట్ చేస్తూ! బిడ్డ ధైర్యాన్ని పరీక్షించిన తండ్రి మనసు కుదుటపడ్డది. పార్ట్నర్ దగా చేశాడు ‘‘ఎన్ని రోజులు ఇలా ఒకరి చేతి కింద పనిచేస్తాం? ధైర్యం చేయకపోతే ఏదీ సాధించలేం’’.. తనతో పాటే పనిచేస్తున్న ఫ్రెండ్ కామెంట్. ‘‘నిజమే.. నా దగ్గర కొంత డబ్బుంది. కొంత లోన్ తీసుకొని సొంతంగా సెలూన్ పెట్టుకుందామా?’’ అడిగింది అంబిక. ఫ్రెండ్‌కూ నచ్చి ఓకే అయింది ప్రపోజల్. సొంత సెలూన్ కోసం ఏడు లక్షలు అప్పు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడింది అంబిక. అకౌంట్స్ అన్నీ ఫ్రెండ్ చేతిలో పెట్టింది. పెళ్లిళ్ల సీజన్లో రోజుకు 22 మ్యారేజెస్ అటెండ్ చేస్తే రిజిస్టర్లో రెండు మ్యారేజెస్ మాత్రమే నమోదయినట్లు తెలిసింది అంబికకు... సెలూన్ నష్టాల్లో ఉందని ఫ్రెండ్ చెప్పినప్పుడు! హతాశురాలైంది. నిలదీస్తే... నిజం చెప్పకపోగా అంబిక మీదే నిందలు పడ్డాయి. అప్పుల కింద ఆమె పెట్టుబడిని జమకట్టుకొని ఎగ్జిట్ దారి చూపించారు. మరోవైపు కూతురు పెరుగుతోంది. వ్యాపారం వృద్ధిలోకి వస్తే పిల్లను బాగా చదివించుకోవచ్చని చాలా ఆశపడింది. కానీ ఇలా జరిగింది! కళ్లు తుడుచుకుని మళ్లీ లేచి నిలబడింది అంబిక. సొంత సంస్థకిప్పుడు 12 బ్రాంచీలు 2010లో పదకొండు మంది సిబ్బందితో ‘అంబికా పిళ్లై డిజైనర్ సెలూన్ ప్రైవేట్ లిమిటెడ్’ను మొదలుపెట్టింది. రోజుకు అయిదుగురి కంటే ఎక్కువ కస్టమర్స్ ఉండే వాళ్లు కాదు. ఇలాగైతే ఇదీ మూసేయాల్సిందే అనుకుంది. కాని స్థయిర్యం కోల్పోలేదు. రెండు నెలలు తిరిగేసరికి పుంజుకుంది. రెండేళ్లు తిరిగే సరికి ఢిల్లీలోనే 12 బ్రాంచ్‌లను ప్రారంభించింది. త్వరలోనే వెస్ట్ ఆసియాలోనూ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆమె కూతురు కవిత కూడా పెద్దదైంది. తల్లి వ్యాపారంలో భాగస్వామిగా చేరింది. జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘‘ఇంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకూ పనిచేసేదాన్ని. ఇప్పుడంత ఓపిక ఉండట్లేదు. అందుకే పన్నెండు నుంచి అయిదింటి వరకు టైమింగ్స్‌ను కుదించుకున్నాను. మిగతా సమయంలో ఫేస్బుక్లో బ్యూటీ టిప్స్, హెయిర్‌కు సంబంధించిన సొల్యూషన్స్ ఇస్తున్నాను. ట్రావెలింగ్, రాయడం అంటే ఇష్టం. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. త్వరలోనే ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నా’’ అంటుంది అంబిక. ఆమె ఫేస్ బుక్ పేజీకి ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘‘నా ప్రొఫెషన్‌లోనూ.. పర్సనల్‌గానూ నన్ను చాలా మంది మోసం చేశారు. నా డబ్బు తీసుకున్నారు. కాని నా టాలెంట్‌ను, ధైర్యాన్ని, నా ఆత్మవిశ్వాసాన్ని తీసుకోలేకపోయారు’’ అంటుందీ విజేత. మేకప్ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డు అంబిక పనితనం, కష్టపడే తత్వం తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ త్రివేది సపోర్ట్‌గా నిలిచాడు. ఆ సమయంలో.. అంటే 90ల్లో ఢిల్లీలో ఏవైనా ఫ్యాషన్ షోలు జరిగితే ముంబై మోడల్స్ అందరూ తమ సొంత మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టయిలిస్ట్లతో దిగేవారు. ఆ అవసరంలేదు.. అక్కడా మంచి హెయిర్ స్టయిలిస్ట్ ఉందని ఆ మోడల్స్‌కు అంబికను పరిచయం చేశాడు హేమంత్. అలా ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోల్లో పని కల్పించడమే కాక, సుభాష్ ఘయ్ ‘తాల్’ సినిమాకు చాన్స్ ఇప్పించాడు. ఆ సినిమాకు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డ్‌నూ అందుకుంది అంబిక. సొంత సెలూన్పెట్టి వట్టిచేతులతో నిలబడ్డ ఆమెకు అదెంతో రిలీఫ్‌నిచ్చింది. ఆ ఫీల్డ్‌లోనూ ఆదరణనూ పెంచింది. ఈసారి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు సెలూన్ పెడ్దామని. మళ్లీ నమ్మింది. ఇంకోసారీ మోసపోయింది. తండ్రి గుర్తొచ్చాడు. వెళ్లింది. బాధపోయేలా ఏడ్చింది. కొత్త శక్తితో తిరిగొచ్చింది. -
అడ్డుగా ఉన్నాడని.. చంపించింది..!
మియాపూర్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య కిరాయి హంతకులతో అంతం చేసింది. తన చేతికి మట్టి అంటకుండా పక్కాగా ప్లాన్ చేసినా.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు...మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లూర్కు చెందిన డి.అంకుశ్ (24), అంబిక భార్యాభర్తలు. అయితే బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం అంకుశ్ ఒక్కడే హైదరాబాద్‌లో ఉంటున్న తన బాబాయి వద్దకు వచ్చాడు. స్వగ్రామంలోనే ఉన్న అంబిక.. సూర్యకాంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తన సంతోషానికి అడ్డు ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే భర్తతో మాట్లాడుతూ అతని కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తోంది. వారిద్దరూ కలసి అంకుశ్‌ను చంపేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన తుకారాం, ప్రకాశ్ అనే వారికి రూ.1.30 లక్షల సుపారీ ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా వారికి రూ.10 వేలు ఇచ్చి వారిని హైదరాబాద్ కు పంపింది. ఈ మేరకు 9వ తేదీ రాత్రి ప్రకాశ్, తుకారాంలు మియాపూర్‌లో అంకుశ్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మద్యం దుకాణం వద్దకు అతడిని తీసుకెళ్లారు. మద్యం తాగిన అనంతరం అదను చూసుకుని తలపై రాయితో మోది చంపేశారు. ఈ ఘటనపై ఈ నెల 10 వ తేదీన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి భార్యనే ముద్దాయి అని తేల్చారు. నిందితులు సూర్యకాంత్, తూకారాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న 1అంబికా, ప్రకాశ్‌ల కోసం గాలిస్తున్నారు. -
ఇక దేశవ్యాప్తంగా అంబికా అగర్బత్తీస్
బ్రాండ్ అంబాసిడర్‌గా జయప్రద హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగర్బత్తీల తయారీలో ఉన్న అంబికా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్లో అమ్మకాలను సాగిస్తున్న ఈ సంస్థ.. 2020 నాటికి అన్ని రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 కోట్ల విలువైన అగర్బత్తీల విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.200 కోట్లు. ఇందులో తమ కంపెనీ 60% వాటాతో అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోందని అంబికా సీఎండీ అంబికా కృష్ణ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 15-16లో రూ.180 కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.160 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2015-16లో రూ.180 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 80 లక్షల అగర్బత్తీల తయారీ సామర్థ్యం ఉందని కంపెనీ డెరైక్టర్ అంబికా రామచంద్రరావు తెలిపారు. 100 రకాల పరిమళాలను సొంతంగా అభివృద్ధి చేశామన్నారు. అగర్బత్తీల తయారీకి కావాల్సిన వెదురును దేశీయ కంపెనీలు ఇండోనేషియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాలసీల కారణంగా ఏటా రూ.400 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నామని అంబికా కృష్ణ అన్నారు. వెదురు చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కాగా, 70వ వసంతంలోకి కంపెనీ అడుగు పెడుతున్న సందర్భంగా జయప్రదతో చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. -
పెళ్లంటే అతడికి ఎగ'తాళి'
గుంటూరు : మొదట్లో ప్రేమంటాడు.. నువ్వు లేనిదే బతకలేనంటాడు.. నిన్నే పెళ్లాడతానంటూ నమ్మిస్తాడు.. ఈ తంతగాన్ని ఒక్కరితో ఆపకుండా పలువురు యువతులను ఇదే విధంగా ట్రాప్ చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ మృగాడి నైజం గుంటూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. పెళ్లిని ఎగ‘తాళి’ చేస్తూ తన వాంఛలు తీర్చుకునేందుకు లెసైన్స్లా వాడుకుంటున్నాడు. ఫేస్బుక్లో ఛాటింగ్ ద్వారా యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని సంతానం కలిగిన తరువాత వదిలించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ మృగాడి మోసానికి బలై చిత్రహింసలు అనుభవించిన ఓ మహిళ తన ఇద్దరు ఆడపిల్లలతో గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. బాధితురాలు ఎస్పీకి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం, మైసూరు జిల్లా, పిరియా పట్టణానికి చెందిన అంబిక పదో తరగతి పూర్తికాగానే 14 ఏళ్ల వయసులో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన పంతగాని సత్యప్రసాద్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా 1999 మే ఐదో తేదీన పొన్నూరు వచ్చి బీబీసీ చర్చిలో వివాహం చేసుకుంది. జూపూడిలో కాపురం పెట్టిన సత్యప్రసాద్ అంబికను చిత్రహింసలకు గురిచేసేవాడు. అంబికను తీవ్రంగా కొట్టి ఇద్దరు ఆడపిల్లలను సైతం పస్తులుంచేవాడు. 2008 వరకూ భర్తతో కలిసి ఉన్న అంబిక ఉద్యోగ నిమిత్తం భర్త బెంగుళూర్ వెళ్లినా తాను మాత్రం జూపూడిలోనే ఉంది. అక్కడ చిక్‌మంగుళూరుకు చెందిన కవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నట్లు అంబికకు ఫోన్ చేసి చెప్పడంతో నిర్ఘాంతపోయింది. తనకు వారసుడు కావాలని నీకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో మరో పెళ్లి చేసుకున్నానని తనకు ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించాడు. కవితతో కొన్నేళ్ళు కాపురం చేసిన సత్యప్రసాద్‌కు మళ్ళీ ఆడ పిల్లే పుట్టడంతో ఆమెను కూడా వదిలేసి జూపూడికి వచ్చేశాడు. అంబిక తిరిగి భర్తతో కలిసి కొన్నాళ్లు కాపురం చేసింది. మూడో భార్యతో దేశం దాటేందుకు యత్నం.. తీరు మార్చుకోని సత్యప్రసాద్ ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా ఇవాంజిలిన్ అనే అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి విడాకులు ఇవ్వమంటూ అంబికను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త హింస తట్టుకోలేక తల్లిదండ్రులైనా ఆదరిస్తారనే ఆశతో కర్నాటక వెళ్లింది. వారు ఇంటిలోకి కూడా రానివ్వలేదు. చేసేది లేక ఇద్దరు ఆడ పిల్లలతో జూపూడికి వచ్చింది. మూడో భార్య ఇవాంజిలిన్తో కలిసి దేశం విడిచి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ తీసుకున్నాడని అంబిక పేర్కొంది. తల్లిదండ్రులు, భర్త తనను వదిలించుకోవాలని చూస్తుండటంతో రోడ్డుపాలయ్యానని విలపించింది. భర్తపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తనలాగా మరే ఆడపిల్ల జీవితం బలి కాకుండా కాపాడాలని కోరింది. స్పందించిన ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పొన్నూరు పోలీసులను ఆదేశించారు.