పాసయ్యాడు | Ajay Passayyadu Theatrical Trailer | Sakshi
Sakshi News home page

పాసయ్యాడు

Dec 29 2018 1:11 AM | Updated on Dec 29 2018 1:11 AM

Ajay Passayyadu Theatrical Trailer - Sakshi

అజయ్, అంబిక

అజయ్‌ అమన్, అంబిక, సాయి కేతన్‌ ముఖ్య తారలుగా ప్రేమ్‌ భగీరథ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అజయ్‌ పాసయ్యాడు’. ఝాన్సీ, శివన్నారాయణ ప్రధాన పాత్రల్లో మాగాపు సూర్యకమల, వై.రాజేంద్ర నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నేటి యువతకి అన్నీ పరీక్షలే. చదువులో, ఆటల్లో, ఉద్యోగాల వేటలోనే కాదు.. ఇంట్లో తల్లిదండ్రులు, ప్రేమలోనూ పరీక్షలు తప్పడం లేదు.

వీటన్నింటినీ పాసవ్వడం సాధ్యమే అంటాడు అజయ్‌. అవి సాధ్యం కాదని పెద్దలు హితబోధ చేయడం మొదలు పెడితే వినే ఓపిక యువతకి ఉండదు. మోడ్రన్‌ టెక్నాలజీ పుణ్యమా అని తమ సమస్యలకు పరిష్కారం కూడా యువతే వెతుక్కుంటోంది. వాళ్ల ప్రయాణం అడ్డదారుల్లో వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకుంటే చాలనే  విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌. శ్రీనివాస్, కెమెరా: జె.గణేశన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement