తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ | Telangana Village Oriented Movie Announced By Under new Banner | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ

Published Fri, Oct 11 2024 9:18 PM | Last Updated on Sat, Oct 12 2024 9:36 AM

Telangana Village Oriented Movie Announced By Under new Banner

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సరికొత్త  ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ రానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్‌, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై ఆకుల విజయ లక్ష్మి, సరస్వతి మౌనిక ప్రోడక్షన్ నంబర్ -1 గా నిర్మిస్తున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి దక్కుతాయని భావిస్తున్నాం అని తెలిపారు.

కాగా.. ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు వెంకట్ గౌడ్ కథ అందించగా.. కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్ సమకూరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement