banner
-
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఫీల్ గుడ్ మూవీ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై ఆకుల విజయ లక్ష్మి, సరస్వతి మౌనిక ప్రోడక్షన్ నంబర్ -1 గా నిర్మిస్తున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి దక్కుతాయని భావిస్తున్నాం అని తెలిపారు.కాగా.. ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నటీనటులు వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు వెంకట్ గౌడ్ కథ అందించగా.. కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్ సమకూరుస్తున్నారు. -
కాళ్లు పట్టుకో.. వదిలేస్తా
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమిలో వర్గపోరుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బ్యానర్ చించిన ఘటనలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ నేత ఒకరు రంగప్రవేశం చేసి, జనసేనలోని ఓ వర్గం నాయకుడితో కాళ్లు పట్టించుకొని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.ఇదీ జరిగింది..కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం పరాసుపేట సెంటరులో జనసేన పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి బ్యానరు కట్టారు. ఈ బ్యానర్లో అదే పార్టీకి చెందిన యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఫోటోలు లేవు. తమ ఫొటోలు లేకుండా తమ నుంచి చందాలు ఎలా తీసుకుంటారని నాని సోమవారం అక్కడి నిర్వాహకులను ప్రశ్నించారు. అక్కడి బ్యానర్‌ను నాని చేతితో కొట్టడంతో అది చిరిగిపోయింది. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన వర్గం నానితో వాగ్వాదానికి దిగింది. నాని క్షమాపణ చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. సోమవారం సాయంత్రం నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్‌ను పూర్తిగా చించేశాడు. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లి సామాన్లను ధ్వంసం చేశారు. వారిద్దరినీ రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టి వచ్చేశారు. నాని తిరిగి తమపై దాడి చేస్తారన్న భయంతో టీడీపీ నాయకుడు శంకు శ్రీను, మరికొందరిని తీసుకొని నాని, శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లారు. వారిద్దరినీ కా ళ్లతో తంతూ చితకబాదారు. జనసేన నాయకుడు నాని టీడీపీ నాయకుడు శంకు శ్రీనును కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. చివరికి రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలపూడి సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. -
ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్ హీరోయిన్ భర్త!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్‌కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్‌కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు. -
ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడికి వెల్కమ్ బ్యానర్
న్యూఢిల్లీ, సాక్షి: భారత దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్న వేళ.. హస్తినలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు.. పొరుగుదేశాల అధినేతకు సైతం ఢిల్లీ వర్గాలు ఆహ్వానం పంపాయి. ఈ క్రమంలో వాళ్లకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మాల్దీవుల అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.కిందటి నవంబర్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక.. ఒకవైపు భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ, మరోవైపు చైనాతో సత్సంబంధాలు నడిపించేందుకు యత్నించారాయన. ఈ క్రమంలో భారత్‌తో ఆ దేశ సంబంధాలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ను విమర్శించడంతో పాటు బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలంటూ వ్యాఖ్యలు చేశారాయన.ఇలాంటి పరిస్థితుల్లో.. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆ దేశ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది భారత్. అయితే ఆ ఆహ్వానానికి ముయిజ్జు అంతే సానుకూలంగా స్పందించారు. ఆహ్వానాన్ని స్వీకరించడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానంటూ బదులిచ్చారు. అంతేకాదు.. తన పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సానుకూలంగా సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. అంతకు ముందు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సోషల్ మీడియా వేదికగా ఆయన మోదీ విజయంపై అభినందనలు తెలియజేశారు.Congratulations to Prime Minister @narendramodi, and the BJP and BJP-led NDA, on the success in the 2024 Indian General Election, for the third consecutive term.I look forward to working together to advance our shared interests in pursuit of shared prosperity and stability for…— Dr Mohamed Muizzu (@MMuizzu) June 4, 2024ఆదివారం సాయంత్రం జరగబోయే మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మారిషస్.. దేశాల నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
టాలీవుడ్లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ!
టాలీవుడ్లో మరో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ‘శివమ్ మీడియా’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. తాజాగా శివమ్ మీడియా లోగో, బ్యానర్‌ను ప్రముఖ నటుడు అలీ, నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. 'శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనిల్ కడియాల మాట్లాడుతూ– 'శివమల్లాల మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. 'ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తోంది. ఈ విషయంలో నేను ఎంతో ఫీలవుతున్నా. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. 'నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం చాలా సంతోషం. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తా' అని అన్నారు. -
అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కొందరు తమ బ్యానర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు రావడంతో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో హెచ్చరికలు జారీ చేశారు. తమ సంస్థ పేరును తప్పుగా ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విటర్లో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్) సల్మాన్ ఖాన్ నోట్లో రాస్తూ.. ' మిస్టర్ సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఏ చిత్రాన్ని నిర్మించటం లేదు. అంతేకాదు.. మేము క్యాస్టింగ్ కోసం ఎలాంటి ఏజెంట్లను కూడా నియమించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ మెయిల్స్, మేసేజ్‌లు ఎవరూ నమ్మొద్దు. ఎవరైనా మా బ్యానర్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ట్వనీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింగి. కాగా.. 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' బ్యానర్లో చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. సల్మాన్ ఖాన్ తదుపరి 'టైగర్ 3'చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటించనుంది. అంతే కాకుండా సల్మాన్ కిక్- 2 చిత్రంలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో 'ప్రేమ్ కి షాదీ' అనే చిత్రం కోసం సల్మాన్ మరోసారి చిత్రనిర్మాత సూరజ్ బర్జాత్యాతో పనిచేయనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) Official Notice! pic.twitter.com/uIvAQgYbwl — Salman Khan (@BeingSalmanKhan) July 17, 2023 -
'ఐ లవ్ మనీష్ సిసోడియా'! దుమారం రేపుతున్న బ్యానర్!
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు వద్ద శనివారం ఏర్పాటు చేసిన ఐ లవ్ మనీష్ సీసోడియా అనే బ్యానర్ తీవ్ర కలకలం రేపింది. దీన్ని ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) కోఆర్డినేటర్ గజాలా, పాఠశాల ప్రిన్స్‌పాల్‌తో కలసి ఏర్పాటు చేశారు. దీంతో స్థానికి నివాసి దివాకర్ పాండే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు ఫిర్యాదులో పాండే..మార్చి 3 ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు శాస్త్రి పార్క్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటుకి ఈ బ్యానర్‌ని కట్టినట్లు తెలిపారు. ఆ బ్యానర్‌పై ఐ లవ్ యూ సిసోడియా అని రాసి ఉందని, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసుకువచ్చి దానిపై ఎక్కి మరీ ఈ బ్యానర్‌ని పెట్టారని చెప్పారు. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక విద్యా దేవాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చివాట్లు పెట్టినట్లు తెలిపారు. దీనికి అనుమతి తీసుకున్నారా అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్ తాలుకా అని చెప్పారు. దీంతో ఒక వ్యక్తి ఆ ఎమ్మెల్యేని సంప్రదిస్తే..ఔను! అనే సమాధానం ఇచ్చారు. కానీ మాకు తెలుసు ఆయన అబద్ధం చెబుతున్నారని, ఎందుకంటే కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాఠశాల ఉపయోగించుకునేందుకు అనుమతి ఉండదు. అని అన్నారు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో వారు ఆ బ్యానర్‌ని తొలగించినట్లు పాండే తెలిపారు. పిల్లలు ఇది రాశారని చెప్పేందుకు ఇలా చేశారని, వీటిని మన సంస్కృతి అనుమతించదని చెప్పారు. పిల్లలు బ్రెయిన్ వాష్ చేసేందుకు ఇలాంటి పన్నాగాలకు పాల్పడుతున్నారన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఐతే ఆయన ఈ విషయం సీరియస్ అవుతుందని ఆ పాఠశాల ప్రిన్స్‌పాల్ భావించలేదని కూడా చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడమే గాక, నిందితులను శిక్షిస్తామని హామీ కూడా ఇచ్చారని పాండే చెప్పారు. కాగా, ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిసోడియాను గత ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సిసోడియా శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేశ రాజధాని ట్రయల్ కోర్టు ముందు సిసోడియా తరుఫున దాఖలు చేసిన తాజా పిటిషన్లో ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీ జరిగాయి కాబట్టి అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ఫలవంతమైన ప్రయోజం ఉండదని పేర్కొంది. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణకు సహకరిస్తున్నారని సిబీఐ కూడా తెలిపింది. ఐతే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరవ్వడం గమనార్హం. (చదవండి: తాగిన మైకంలో మూత్రం పోసిన స్టూడెంట్.. ఆపై క్షమాపణలు! అయినా అరెస్ట్) -
చిన్న బడ్జెట్ సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు కొత్త బ్యానర్
భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ వ్యాపార వేత్త బి.శ్రీరంగం శ్రీనివాస్(GSR). సినిమా మీద ఉన్న మక్కువతో నూతనంగా ”ASR ”(Amezing Screen Reels) బ్యానర్ ఏర్పాటు చేస్తూ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర, నిర్మాతలు శోభారాణి ,లగడపాటి శ్రీనివాస్, అర్జున్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బి.సత్యనారాయణ, యల్.బి.నగర్ పి.వి.కె మల్టీప్లెక్స్ ఓనర్ పి. విజయ్ కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని ASR లోగోను గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమలో డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్, నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ, సూపర్ గుడ్ ఫిలిమ్స్, మైత్రి మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఏవియం ప్రొడక్షన్ సంస్థలు ఎన్నో సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆ సంస్థల్లాగే ఇప్పుడు వచ్చిన ASR సంస్థ మంచి చిత్రాలు నిర్మిస్తూ ఒక గొప్ప సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. నిర్మాత శోభారాణి మాట్లాడుతూ.. 'ASR పేరు చాలా అద్భుతంగా ఉంది. వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మంచి, చెడు నేర్పించేది సినిమా. ఇలాంటి సినీ ఇండస్ట్రీని కొన్ని లక్షల మంది నమ్ముకొని జీవిస్తున్నారు. వారిలో టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ గా నిలవడానికి ASR ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒక అమ్మలాంటిది. అలాంటి సినిమా ఫీల్డ్ అక్కున చేర్చుకుంటే ఆకాశానికి హద్దు లేదు అన్నట్లు ఉంటుంది' అన్నారు. ASR వ్యవస్థాపకులు శ్రీరంగం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు అందరూ వచ్చి మా ASR లోగో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమా అంటే ఇష్టం.సినిమా మీద ఉన్న మక్కువతో సినిమానే ప్రాణంగా భావించి యంగ్ న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ & ఎగ్జిబిటర్స్ అందరికీ సపోర్ట్ గా నిలవాలని "ASR "సంస్థను స్థాపించాను.వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. అలా మా మొదటి అడుగుకు మీ అందరి ఆశీర్వాదం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సంస్థ ద్వారా అనేక సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటాం అని అన్నారు. -
బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్!
సాక్షి ముంబై: బీజేపీకి వ్యతిరేకంగా ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందా? ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారిపై ఇంతవరకు చర్యలు కొనసాగుతున్నాయా? ఒకవేళ చర్యలు కొనసాగుతున్నాయని తెలిస్తే వివరాలు చెప్పండి.. అక్షరాల ఒక లక్ష రూపాయలను గెలుపొందండి’ అంటూ ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ బ్యానర్ కట్టాడు. ఈ బ్యానర్ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. అందిన వివరాల మేరకు ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఈ బ్యానర్‌ను ఔరంగాబాదులోని క్రాంతిచౌక్ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజీపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలుండవని, కేవలం ఈడీ, సీబీఐల పేర్లతో బెదిరించి ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని వివరించేందుకే ఈ బ్యానర్ ఏర్పాటు చేశానని పాటిల్ చెప్పారు. చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? VIDEO: भाजपा नेत्यांवर 'ईडी'ची कारवाई झाल्याचे दाखवा, १ लाख मिळवा; औरंगाबादमध्ये बॅनर झळकले! pic.twitter.com/7OhpdbS7fz — Lokmat (@lokmat) August 1, 2022 -
ఆప్ ఈవెంట్‌ను హైజాక్ చేసిన మోదీ! రాత్రికి రాత్రే ఏం జరిగింది?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని కేంద్రం హైజాక్ చేసిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్. రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై నరేంద్ర మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. ఈమేరకు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 'కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సం కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు. శనివారం రాత్రి అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై మొత్తం మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు.' అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. పోలీసులు ఉంది ప్రజలకు భద్రత కల్పించడానికి గానీ, ప్రధాని మోదీ కోసం బ్యానర్లు కట్టేందుకు కాదని ధ్వజమెత్తారు. Delhi Govt के वन महोत्सव में CM @ArvindKejriwal को शामिल होना था लेकिन प्रधानमंत्री कार्यलय के आदेश पर Police ने मंच पर कब्ज़ा कर ज़बरदस्ती Modi जी की तस्वीर लगा दी और हटाने पर गिरफ़्तारी की धमकी दी मोदी जी दिल्ली Govt के कायर्क्रम में अपनी तस्वीर लगाकर क्या साबित करना चाहते? pic.twitter.com/B3Hdo5KCLr — AAP (@AamAadmiParty) July 24, 2022 ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు గోపాల్ రాయ్. ఇప్పటికే తమ నేత సత్యేంద్ర జైన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కుట్ర జరుగుతోందని అన్నారు. సీఎం కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు వెళ్లకుండా అధికారిక ప్రక్రియ నిలివేశారని విమర్శించారు. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’
భీమునిపట్నం: కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ ఇక్కడ నేరెళ్లవలస కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి ఎవరూ రావద్దని బుధవారం బ్యానర్ కట్టారు. బంధువులు, మిత్రులు, ఎవరు రావద్దని అందులో రాశారు. ‘మనకు మొహమాటం ఉన్నా కరోనాకు లేదు’ అని బ్యానర్‌పై రాసి ఇలా ఇంటి ముందు పెట్టాడు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు -
తీన్మార్
అనసూయ లీడ్ రోల్లో వచ్చిన ‘కథనం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన మొవ్వ విజయ చౌదరి నూతనంగా ఎం స్క్రీన్స్ బ్యానర్‌ను నెలకొల్పారు. ఈ పతాకంపై మూడు సినిమాలు నిర్మించనున్నారు. మొవ్వ విజయ చౌదరి మాట్లాడుతూ–‘‘డిసెంబర్లో తొలి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా నటిస్తారు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించనున్నారు. నందినీరెడ్డి, పరశురామ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన స్మరణ్ రెడ్డి, ఆర్.సురేష్ దర్శకత్వంలో రెండో, మూడో సినిమా నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రవిశంకర్, కొండబత్తుల నాగశేఖర్. -
రూ. కోటి నష్టపరిహారం ఇప్పించండి
సాక్షి, చెన్నై: తన కుమార్తె మరణాన్ని శుభశ్రీ తండ్రి రవి తీవ్రంగా పరిగణించారు. నష్టపరిహారంగా రూ. కోటి ఇప్పించాలని, బ్యానర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేసే వాళ్లను కఠినంగా శిక్షించే విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, తన కుమార్తె మృతి కేసును ప్రత్యేక విచారణ బృందం ద్వారా దర్యాప్తు చేయించాలని పట్టుబడుతూ ఆయన మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.గత నెల పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడంతో కింద పడ్డ శుభశ్రీ మీదుగా నీళ్ల ట్యాంకర్ వెళ్లడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారాన్ని రేపింది. ఈ ఘటనతో ఫ్లెక్సీలు, బ్యానర్లపై అధికార వర్గాలు కొరడా ఝుళిపించే పనిలో పడ్డాయి. శుభశ్రీ మరణానికి కారణంగా ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేసిన వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇక, కెనడా వెళ్లాల్సిన శుభశ్రీ కాటికి వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఆ కుటుంబాన్ని అన్ని రాజకీయ పక్షాల నేతలు పరామర్శిస్తూ వస్తున్నారు. అలాగే, బ్యానర్లు, ఫ్లెక్సీలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మద్రాసు హైకోర్టు సైతం స్పందించింది. ఆ కుటుంబానికి తాత్కాలిక సాయంగా రూ. ఐదు లక్షలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ సమయంలో బుధవారం శుభశ్రీ తండ్రి రవి కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అందులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె భవిష్యత్తు, కన్న కలల గురించి గుర్తు చేశారు. తన కుమార్తె మరణం కేసును ప్రత్యేక విచారణ బృందం ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రత్యేక విచారణ బృందాన్ని కోరుతున్నట్టు పట్టుబట్టారు. అలాగే, బ్యానర్లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసే వాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శిక్షలు మరీ కఠినంగా ఉండే రీతిలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేవిధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.ఇక, తన కుమార్తె మరణం దృష్ట్యా, రూ.కోటి నష్ట పరిహారం ఇప్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, చట్టాల్ని కఠినత్వం చేయాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం దసరా సెలవుల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది. అయితే, ఈ బెంచ్ ఏదేని ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చేనా, లేదా, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఇప్పటికే దాఖలు చేసి ఉన్న పిటిషన్‌తో కలిసి సంబంధిత బెంచ్ విచారణకు ఆదేశించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
బ్యానర్ల దుమారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ రాక సందర్భంగా బ్యానర్లు ఏర్పాటుకు అనుమతి కోరుతూ మద్రాసు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన పిటిషన్ దుమారం రేపింది. అధికార పక్షం సమర్థన, ప్రతిపక్షాల విమర్శలతో దుమారం రేగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ మూడురోజుల పర్యటన నిమిత్తం ఈనెల 11వ తేదీన చెన్నైకి ప్రత్యేక విమానంలో వస్తున్నారు. చెన్నై నుంచి హెలికాప్టర్లో మహాబలిపురం సమీపంలోని తిరువిడందైకిచేరుకుంటారు. అక్కడి నుంచి కోవలంలోని తాజ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి బసచేస్తారు. అదే రోజు రాత్రి ఇరువురూ అనేక అంశాలపై భేటీ అవుతారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఆ తరువాత ఇరువురు నేతలూ 12, 13 తేదీల్లో మహాబలిపురాన్ని సందర్శిస్తారు. ఇద్దరు అగ్రనేతలు మూడురోజులపాటు పర్యటిస్తున్న నేపథ్యంలో అనూహ్యరీతిలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల తీరును పరిశీలించే నిమిత్తం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి బుధవారం మహాబలిపురానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, డీజీపీ త్రిపాఠి, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్య సీఎంను అనుసరించారు. టెక్కీ మృతితో నిషేధం: చెన్నై పల్లికరణైలో అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ శుభశ్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను హరించిన తరువాత బహిరంగప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం అమల్లో ఉంది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే కఠినశిక్ష తప్పదని కోర్టు హెచ్చరికలు జారీచేసింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్లకు స్వాగత సత్కార ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదురోజులపాటు బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 3న విచారించనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఖండన: ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టును కోరడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేఎస్ అళగిరి విమర్శించారు.మోదీ, జీ జిన్పింగ్లకు స్వాగతం పలికేందుకు టీవీలు, పత్రికల్లో ప్రకటనలు, వాల్‌పోస్టర్లు, గోడలపై రాతలు వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉండగా ఫ్లెక్సీలకు అనుమతి కోరడం చట్టాన్ని దిక్కరించడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పేంటి: మంత్రి జయకుమార్: బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోర్టు అనుమతి కోరడంలో తప్పేంటని మంత్రి జయకుమార్ ప్రశ్నిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోర్టు అనుమతితో బ్యానర్లను ఏర్పాటు చేయడం తప్పుకాదని ఆయన సమర్థించుకున్నారు. చట్టానికి లోబడే తాము అనుమతి కోరుతున్నామని అన్నారు. -
శుభశ్రీ కేసులో మరో మలుపు
సాక్షి, చెన్నై: బ్యానర్ కూలి శుభశ్రీ మృతిచెందిన కేసులో అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ను శుక్రవారం పోలీసులు కృష్ణగిరిలో అరెస్టు చేశారు. క్రోంపేట నెమిలిచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు శుభశ్రీ ఇటీవల స్కూటర్లో వెళుతుండగా బ్యానర్ కూలిపడడంతో వెనుక వచ్చిన లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సెయింట్‌థామస్‌మౌంట్ ట్రాఫిక్ పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. దీనికి సంబంధించి అన్నాడీఎంకే నేత జయగోపాల్, అతని బావమరిది మేఘనాథన్‌పైన సెయింట్‌థామస్‌మౌంట్ ట్రా ఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జయగోపాల్ కోసం ఐదు పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపులు జరిపారు. జయగోపాల్, అతని బంధువులు ఇళ్లకు తాళాలు వేసి పరారీలో ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా జయగోపా ల్ ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అతని బంధువులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. జయగోపాల్ ధర్మపురి జిల్లా హొగెనేకల్ ప్రాంతంలో దాగివుండొచ్చని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ తీవ్రంగా గాలింపులు జరిపారు. జయగోపాల్ అరెస్టు శుభశ్రీ కేసులో నిందితుడు అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ను ఎట్టకేలకు పోలీసులు కృష్ణగిరిలో శుక్రవారం అరెస్టు చేసి చెన్నైకు తీసుకువచ్చారు. గత 14 రోజుల అనంతరం అతను పట్టుబడ్డాడు. అతన్ని న్యాయస్తానంలో హాజరుపరిచి జైలులో నిర్బంధించనున్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నాం అతను బెయిల్ మీద విడుదలయ్యారు. విచారణకు ప్రత్యేక అధికారులు బ్యానర్ కూలిపడి శుభశ్రీ మృతిచెందిన వ్యవహారం గురించి ఇంజినీర్ వద్ద విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. తర్వాత విచారణ నివేదికను నగర కార్పొరేషన్ కమిషనర్‌కు అందజేయనున్నారు. నేరం నిరూపించబడితే సస్పెన్షన్, వేతన పెంపు రద్దు, గరిష్టంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ కూడా చేయవచ్చని అధికారులు వెల్లడించారు. -
చెన్నై: ప్రాణం తీసిన పొలిటికల్ ఫ్లెక్సీ
-
యువతిని బలిగొన్న పెళ్లి బ్యానర్
సాక్షి, చెన్నై: పల్లావరం సమీపంలోని ఓ బ్యానర్ స్కూటర్‌పై వెళ్తున్న యువతిని బలికొంది. వివాహ ఆహ్వానం పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆ యువతి కింద పడింది. అదే సమయంలో వెనుక వైపున వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. గురువారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పల్లావరం రెడియల్ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్ మీద వెళుతోంది. ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ రూపంలో మృత్యువు కబళించింది. అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు ఇచ్చినా, వాటిని భేఖాతరు చేయడంతో ఓ నిండు ప్రాణం బలి అయింది. వివాహ ఆహ్వానం పేరిట మాజీ కౌన్సిలర్ ఒకరి కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ నేలకొరిగింది. స్కూటర్ మీద బ్యానర్ పడడంతో అదుపు తప్పింది. స్కూటర్ నుంచి కింద పడ్డ శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్ ట్యాంకర్ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతిచెందింది. సమాచారంతో పళికరణై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. ఆ బ్యానర్‌ను ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా ఏర్పాటు చేసి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ బ్యానర్ రూపంలో శుభశ్రీ మరణించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఈ మార్గంలో ఇష్టానుసారంగా రాజకీయ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబు బ్యానర్‌తో దర్జాగా ఇసుక దందా
చిత్తూరు, నాగలాపురం : తెలుగుదేశం నాయకులు సరికొత్త పంథాలో ఇసుక అక్రమ రవాణాను దర్జాగా సాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో ఉన్న బ్యానర్లను ట్రాక్టర్ల ముందు భాగంలో కట్టుకుని ఇసుక తరలిస్తున్నారు. బ్యానర్లపై శాండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ గవర్నమెంట్ పర్పస్ అట్ సత్యవేడు (సత్యవేడులో ప్రభుత్వ అవసరాల కోసం ఇసుక రవాణా) అని ముద్రించి ఉంది. శుక్రవారం సుమారు 20 ఇసుక ట్రాక్టర్లకు ఈ రకమైన బ్యానర్లను కట్టుకుని నాగలాపురం మండల పరిధిలోని ఆరణియార్ నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించారు. ఈ ట్రాక్టర్లలో అధిక శాతం ఇటీవల ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రైతు రథాలే ఉన్నాయి. కొన్ని ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లూ లేవు. చంద్రబాబు బ్యానర్లతో ఇసుకను తరలిస్తున్నారు ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసులును వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిన్నదురై, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మోహన్ ముదలియార్, జిల్లా కార్యదర్శి జగదీష్‌రెడ్డి, మండల కార్యదర్శి విజయకుమార్ ఫోన్లో ప్రశ్నించారు. సత్యవేడులో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ ఐదు ట్రాక్టర్లకు ఇసుక పర్మిట్లు ఇచ్చారని ఆయన బదులిచ్చారు. తహసీల్దార్ సమాధానం సరైనదికాదని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహించారు. నిబంధనలకు విరుద్ధంగా జాయింట్ కలెక్టర్ ఇసుక పర్మిట్లు ఇవ్వరని వాదించారు. అందులోను నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లకు అసలు పర్మిట్లు ఇవ్వరని తెలిపారు. నాగలాపురం మండల పరిధిలో ఎటువంటి ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవని, ఈ పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్లు ఇచ్చారనడం సరికాదని తెలిపారు. మండలంలో జరిగే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోవడం, రవాణా చేసేవారికి పర్మిట్లు ఉన్నాయా ? లేవా ? అనే విషయాలను తహసీల్దార్ పరిశీలించకపోవడం సమంజసంకాదని సూచించారు. -
వివాదానికి దారి తీసిన బ్యానర్
బొమ్మనహళ్లి: టిప్పు జయంతిని పురస్కరించుకొని బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి పేరుతో మంగమ్మపాళ్యలో కొంతమంది వ్యక్తులు బ్యానర్ ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీరిసింది. మంగమ్మ పాళ్యలో అధిక శాతం ముస్లిం సముదాయం ప్రజల ఉన్నారు. ముస్లిం సముదాయం ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కొందరు వ్యక్తులు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్‌ను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని కామెంట్లు జోడించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి బ్యానర్ తొలగించారు. ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సముదాయానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం టిప్పు జయంతి నిర్వహణకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఆ బ్యానర్ తమ కార్యకర్తలు ఏర్పాటు చేయలేదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేశారన్నారు. -
ఫ్లెక్సీ రచ్చ
ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల సంస్కృతి మరోమారు రచ్చకెక్కింది. వీటిని అరికట్టడంలో పాలకుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వమే ఈ ఫ్లెక్సీలతో హంగామా సృష్టిస్తుంటే, ఇక, ఎలా అడ్డుకట్ట వేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. తిరుచ్చి వేదికగా హంగామా సాగడంపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రంలోగా ఒక్క ఫ్లెక్సీ, బ్యానర్ ఉండేందుకు వీలు లేదని తొలగించాల్సిందేనన్న ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్ సంస్కృతి ఎక్కువేనన్న విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలే కాదు, సంఘాలు, సంస్థలు, ఏ చిన్న వేడుకైనా సరే హంగామా చేయాల్సిందే. వీటికి అడ్డుకట్ట వేసే విధంగా ఏళ్ల తరబడి సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పోరాడుతూనే వస్తున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు వీటి తొలగింపు విషయంగా పలుసార్లు ఉత్తర్వులు, ఆదేశాలు జారీచేసినా ఫలితం శూన్యం. రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ అయితే, తీవ్రంగానే స్పందించారు. ఫ్లెక్సీ, బ్యానర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేశారు. అనేక రకాల ఆంక్షలు విధించడంతో పాటు, ఇష్టారాజ్యంగా ఏర్పాటుచేసే వాటిమీద పరిశీలించి, అందుకు తగ్గ చర్యలు తీసుకునేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృ త్వంలో ఓ కమిటీ నియమకానికి తగ్గ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఖాతరు చేయని రాజకీయ పక్షాలు ప్రైవేటు ఫ్లెక్సీ, హోర్డింగ్, బ్యానర్ల వ్యవహారంలో నిబంధనలు తప్పని సరిగా అమల్లో ఉన్నా, రాజకీయ పక్షాలు మాత్రం ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. దీంతో ఎక్కడ ఫ్లెక్సీ, బ్యానర్ కనిపించినా, స్వయంగా వాటిని తొలగించే పనిలో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీఆర్ శత జయంతి పేరుతో సాగుతున్న వేడుకల్లో ప్రభుత్వ హంగామా మళ్లీ ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల వ్యవహరాన్ని రచ్చకెక్కెలా చేశాయి. రెండు రోజుల క్రితం న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ అయితే, ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌లలో బతికే ఉన్న వాళ్ల ఫొటోల్ని పొందుపరిచేందుకు వీలు లేదని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, తిరుచ్చి వేదికగా పాలకులు హంగామా సృష్టిస్తూ గత రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని బెంచ్ ముందుకు గురువారం చేరింది. తీవ్రంగా పరిగణన గురువారం హైకోర్టులో ఫ్లెక్సీల వ్యవహారంగా రెండు బెంచ్‌ల ముందు విచారణలు సాగాయి. ఇందులో ఒకటి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా. మరొకటి ప్రభుత్వమే హంగామా సృష్టించడం. బతికి ఉన్న వాళ్ల ఫొటోలను పొందు పరచవద్దని జారీచేసిన ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ తరఫున అత్యవసర పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగాయి. అయితే, హైకోర్టు నిరాకరించడమే కాకుండా, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు లేదని ఏకీ భవిస్తున్నామని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణ ముగియగానే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన ప్రభుత్వం తరఫు హంగామా గురించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈసందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తిరుచ్చిలో అనుమతులతోనే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎంజీఆర్ జయంతి వేడుకల నిమిత్తం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రభుత్వం తరఫున 200, బయటి వ్యక్తులు 20 ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి పొందినట్టు పేర్కొన్నారు. 220కు అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ వందలాదిగా ఎలా ఏర్పాటు చేస్తారని న్యాయమూర్తులు సుందరేష్, సుందర్‌ల నేతృత్వంలోని బెంచ్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. ప్రభుత్వ వేడుకలకు ఇంత అవసరమా? ప్రభుత్వమే ఫ్లెక్సీలతో ఇలా హంగామా చేస్తుంటే, ఇక, బయటి వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించవా.?, అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేడుకలకు ఇంత హంగామా అవసరమా..? అన్న ప్రశ్నలు ఇరకాటంలో పడేశాయని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నల వర్షంతో, చివరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణకు నిర్ణయించడం గమనార్హం. దీంతో తిరుచ్చిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను శుక్రవారం సాయంత్రంలోపు తొలగిస్తామని ప్రభుత్వం తరఫున కోర్టుకు న్యాయవాదులు హామీ ఇచ్చారు. తొలగించాల్సిందేనని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేశారు. ఆరోజున సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా, ఇదివరకు న్యాయమూర్తి సుందరేష్, సుందర్ పలుమార్లు ఈ వ్యవహారాలపై ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తాజాగా, సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కలిసి విచారించనున్న దృష్ట్యా, కీలక ఆదేశాలు, తీవ్ర హెచ్చరికలు సంధించే అవకాశాలు ఎక్కువే. -
ఖుద్దుస్‌నగర్‌లో రౌడీషీటర్ హల్చల్
పూర్ణానందపేట(విజయవాడపశ్చిమం) : స్థానిక ఖుద్దుస్‌నగర్‌లో అధికార పార్టీ నేతల అండతో ఓ రౌడీషీటర్ హల్చల్ చేసిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. ఖుద్దుస్‌నగర్ శివ కాళేశ్వరీదేవి ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు ఆలయానికి దగ్గరలో బ్యానర్ ఏర్పాటుచేశారు. అయితే ఆ స్థలంలో ఇంటింటికీ టీడీపీ బ్యానర్ ఉంది. ఆ కార్యక్రమం ముగిసి ఐదురోజులు గడిచింది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆ బ్యానర్‌కు ముందుగా దసరా పూజల వివరాలు తెలిపే బ్యానర్ ఏర్పాటుచేయగా స్థానిక టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు. స్థానిక టీడీపీ నాయకుల అండతో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. ఈ ప్రాంతంలో ఏం చేసినా తమ బ్యానర్లే ఉండాలని, అలా కాదంటే బ్యానర్లు ఏర్పాటుచేసినవారిని కూడా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించి, ఆలయ నిర్వాహకులను, భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో భయపడిపోయిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు టీడీపీ నాయకులతో మంతనాలు జరిపారు. అంతలో అక్కడి నాయకులు ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌చేశారు. ఆ నాయకుడు కూడా పోలీసులకు హెచ్చరికలు చేయడంతో చివరికి వారు ఆలయ నిర్వాహకులనే పిలిపించి బ్యానర్లను పక్కన ఏర్పాటుచేయాలని సూచించారు. -
శరణార్థులకు స్వాగతం!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ మంగళవారం ఓ బ్యానర్ వెలిసింది. బ్యానర్‌ను గమనించిన వెంటనే నేషనల్ పార్క్ రేంజర్స్ దానిని తొలగించారు. అయితే.. అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. కనిపించిన ఈ బ్యానర్‌పై నెటీజన్లు పాజిటీవ్‌గా స్పందించారు. ఈ బ్యానర్‌ను తామే ఏర్పాటు చేశామని ఆల్ట్ లేడీ లిబర్టీ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. 'దాదాపు అమెరికన్లందరి పూర్వికులు వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వలసదారులు, శరణార్థులే ఈ దేశాన్ని గొప్పగా మార్చారు. అంతేగానీ వలస వ్యతిరేక విధానాలు ఈ దేశాన్ని గొప్పగా చేయవు. ముస్లింలు, శరణార్థులు, వలసదారులు అందరూ దేశంలోకి ఆహ్వానితులే' అని ఆల్ట్ లేడీ లిబర్టీ గ్రూప్ వెల్లడించింది. అలాగే..దేశాల మధ్య గోడలు, మత ప్రాతిపదికన నిషేధం విధించడం లాంటివి మన విలువలకు వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొన్నారు. -
'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'
చిత్తూరు : టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వీ. కోట మండల కేంద్రంలో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ బ్యానర్‌ను పార్టీ కార్యకర్తలు శుక్రవారం ప్రదర్శించారు. ఆ బ్యానర్లో ఏముందంటే... ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు... అలాగే ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదని.. కానీ మిమ్మల్ని మేము ఓట్లు వేసి గెలిపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండన్నారు. అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మీ ఇష్టం... కానీ మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి... ఓటర్లుగా మాకు విలువ వుంది. ఓటుకు కూడా ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా ? అని బ్యానర్ ద్వారా ప్రశ్నించారు. సిగ్గు... సిగ్గు.. అని బ్యానర్లో రాసి ఉంది. -
ఫ్లెక్సీ వివాదంలో పార్థసారథిపై దాడి
రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో టీడీపీ కార్యకర్తల వీరంగం వైఎస్సార్ సీపీ మహాధర్నాకి ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం పెనమలూరు : పెనమలూరు మండలం పోరంకి సెంటర్లో బ్యానర్‌పై తలెత్తిన వివాదాన్ని పరిశీలించటానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో సారథి కారు డ్రైవర్ గురువిందపల్లి నవీన్‌పై టీడీపీ ఈ కార్యకర్తలు దాడి చేసి, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ప్రేక్షకపాత్ర విహ ంచారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సారథికి అండగా నిలువగా పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్లు పోరంకి సెంటర్లో పార్టీ నాయకుడు గుడికందుల శివకోటి పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని పోరంకి సెంటర్లో కడుతున్నారు. టీడీపీ నేతలు దానిని బుధవారం రాత్రి తొలగించారు. దాని స్థానంలో టీడీపీ బ్యానర్ కట్టారు. ఈ విషయం పార్థసారథి దృష్టికి నేతలు తీసుకు వెళ్లారు. ఆయన పోరంకి సెంటర్‌కు వచ్చి వైసీపీ బ్యానర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి సారథిపై దౌర్జాన్యానికి దిగారు. నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. సారథి కారు అద్దాలు రాళ్లతో పగులగొట్టి డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. సారథి వెంటనే వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలో సారథిపై దాడి జరుగగా పోలీసులు దాడి చేసిన వారిని వదిలేసి సారథిని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలు, చూడటానికి వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మా బ్యానర్ తొలగించి దౌర్జన్యం చేశారు : సారథి వైఎస్సార్ కాంగ్రెస్ బ్యానర్ తొలగించి తనపై దాడి చేశారని పార్థసారథి ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ బ్యానర్లు కట్టినా ఇలానే చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు సీపీ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. తన కారు అద్దాలు పగుల కొట్టి దళితుడైన తన కారు డ్రైవర్ నవీన్‌పై దాడి చేశారన్నారు. ఈ దాడికి పాల్పడినవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల రాస్తారోకో కంకిపాడు : కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కి సారథిని తరలించడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసనగా స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. -
జన్మభూమి బ్యానర్‌పై మాజీ మంత్రి ఫొటో
అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే క్షమాపణ కోరిన తహశీల్దార్ పాకాల : జన్మభూమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమముని, గ్రామసభలకు సంబంధించిన బ్యానర్‌పై స్థానిక శాసనసభ్యునిగా తన ఫొటో ప్రచురించకుండా మాజీ మంత్రి ఫొటో పెట్టడమేమిటని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తహశీల్దార్ కృష్ణయ్యుపై మండిపడ్డారు. పాకాల వుండలంలోని శంఖంపల్లెలో మంగళవారం జరిగిన గ్రామసభలో వేదికపై ఏర్పాటుచేసిన అధికారిక బ్యానర్‌పై మాజీవుంత్రి గల్లా అరుణకువూరి ఫొటోను ముద్రించారు. ఈ బ్యానర్‌పై స్థానిక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి ఫొటో లేదు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభాప్రాంగణం ముందు కారులోనే ఉండిపోయూరు. ప్రభుత్వ కార్యక్రవుంలో నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేయడం ఏంటని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను జన్మభూమి అధికారిక బ్యానర్‌పై ఉండాలన్నారు. బ్యానర్‌ను తొలగిస్తేకానీ తాను సభావేదికపైకి రానని చెప్పి ఆయన దాదాపు పది నిమిషాలపాటు కారులోనే కూర్చుండిపోయూరు. దీంతో బ్యానర్ తయారు చేయించిన పంచాయుతీ కార్యదర్శి స్వర్ణమంజులపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పార్టీలను మోయవద్దని ఆమెపై మండిపడ్డారు. ఫ్లెక్సీని వెంటనే మార్పించి, జన్మభూమి బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ ఘటనపై తహశీల్దార్ క్షమాపణ కోరారు.