
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కొందరు తమ బ్యానర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు రావడంతో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో హెచ్చరికలు జారీ చేశారు. తమ సంస్థ పేరును తప్పుగా ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్)
సల్మాన్ ఖాన్ నోట్‌లో రాస్తూ.. ' మిస్టర్ సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఏ చిత్రాన్ని నిర్మించటం లేదు. అంతేకాదు.. మేము క్యాస్టింగ్ కోసం ఎలాంటి ఏజెంట్లను కూడా నియమించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ మెయిల్స్, మేసేజ్‌లు ఎవరూ నమ్మొద్దు. ఎవరైనా మా బ్యానర్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ట్వనీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింగి. కాగా.. 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' బ్యానర్‌లో చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా.. సల్మాన్ ఖాన్ తదుపరి 'టైగర్ 3'చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటించనుంది. అంతే కాకుండా సల్మాన్ కిక్- 2 చిత్రంలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 'ప్రేమ్ కి షాదీ' అనే చిత్రం కోసం సల్మాన్ మరోసారి చిత్రనిర్మాత సూరజ్ బర్జాత్యాతో పనిచేయనున్నట్లు సమాచారం.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! )
Official Notice! pic.twitter.com/uIvAQgYbwl
— Salman Khan (@BeingSalmanKhan) July 17, 2023
Comments
Please login to add a commentAdd a comment