ఫ్లెక్సీ వివాదంలో పార్థసారథిపై దాడి
రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో టీడీపీ కార్యకర్తల వీరంగం
వైఎస్సార్ సీపీ మహాధర్నాకి ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం
పెనమలూరు : పెనమలూరు మండలం పోరంకి సెంటర్‌లో బ్యానర్‌పై తలెత్తిన వివాదాన్ని పరిశీలించటానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో సారథి కారు డ్రైవర్ గురువిందపల్లి నవీన్‌పై టీడీపీ ఈ కార్యకర్తలు దాడి చేసి, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ప్రేక్షకపాత్ర విహ ంచారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సారథికి అండగా నిలువగా పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్లు పోరంకి సెంటర్‌లో పార్టీ నాయకుడు గుడికందుల శివకోటి పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని పోరంకి సెంటర్‌లో కడుతున్నారు. టీడీపీ నేతలు దానిని బుధవారం రాత్రి తొలగించారు. దాని స్థానంలో టీడీపీ బ్యానర్ కట్టారు. ఈ విషయం పార్థసారథి దృష్టికి నేతలు తీసుకు వెళ్లారు. ఆయన పోరంకి సెంటర్‌కు వచ్చి వైసీపీ బ్యానర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి సారథిపై దౌర్జాన్యానికి దిగారు. నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. సారథి కారు అద్దాలు రాళ్లతో పగులగొట్టి డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. సారథి వెంటనే వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలో సారథిపై దాడి జరుగగా పోలీసులు దాడి చేసిన వారిని వదిలేసి సారథిని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలు, చూడటానికి వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
మా బ్యానర్ తొలగించి దౌర్జన్యం చేశారు : సారథి
వైఎస్సార్ కాంగ్రెస్ బ్యానర్ తొలగించి తనపై దాడి చేశారని పార్థసారథి ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ బ్యానర్లు కట్టినా ఇలానే చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు సీపీ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. తన కారు అద్దాలు పగుల కొట్టి దళితుడైన తన కారు డ్రైవర్ నవీన్‌పై దాడి చేశారన్నారు. ఈ దాడికి పాల్పడినవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల రాస్తారోకో
కంకిపాడు : కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కి సారథిని తరలించడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసనగా స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.