Kolusu Parthasarathy
-
ఇక ప్రైవేట్ మద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3,736 దుకాణాల్లో గీత కారి్మకులకు 10 శాతం షాపులను కేటాయించనున్నారు. ఈమేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సంపాదనే లక్ష్యంగా ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసిందని విమర్శించారు. మద్యం కొత్త విధానంపై సబ్ కమిటీ సిఫారసులను తాజాగా మంత్రి మండలిలో ఆమోదించినట్లు చెప్పారు. 180 ఎంఎల్ మద్యాన్ని రూ.99కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం షాపులు వస్తాయన్నారు. రెండేళ్ల కాల వ్యవధిలో ప్రైవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నట్లు చెప్పారు. ఇందుకు రూ.2 లక్షలు (నాన్ రిఫండబుల్) దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబుల్లో రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలుగా ఉంటుందన్నారు. 20 శాతం ప్రాఫిట్ మార్జిన్‌తో పాటు జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఐదేళ్ల కాల వ్యవధితో 12 ప్రీమియర్ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.15 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి మండలిలో చర్చకు రాలేదని, అజెండాలో ఆ అంశాలు లేవని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన వలంటీర్, సచివాలయ వ్యవస్థల కొనసాగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎస్ఆర్ఎం వర్సిటీ డీమ్డ్ టూబీ వర్సిటీగా రూపాంతరం చెందేందుకు ఎన్ఓసీ జారీని మంత్రి మండలి ఆమోదించిందన్నారు. వచ్చే రబీకి కొత్త కౌలు కార్డులు కౌలు రైతులకు మేలు చేసేలా నిబంధనల్లో మార్పులు తెస్తున్నట్లు మంత్రి చెప్పారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. ప్రస్తుతం కౌలు కార్డులపై రైతు (భూ యజమాని) సంతకం తప్పనిసరి చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాస్తవ భూ యజమానులు సంతకాలు చేయకపోవడంతో కౌలు రైతులకు ఆర్థిక సాయం, రుణాలు దక్కడం లేదన్నారు. రైతు సంతకం అవసరం లేకుండా 2011లో నాటి ప్రభుత్వం అమలు చేసిన నమూనాలో కౌలు కార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతుల భూమి హక్కుకు నష్టం లేకుండా వచ్చే రబీకి కార్డులు అందజేస్తామన్నారు. పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్..» రెండున్నరేళ్లలో కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి చెప్పారు. దెబ్బతిన్న డయా ఫ్రంవాల్ స్థానంలో రూ.990 కోట్లతో పాత కాంట్రాక్టర్ ద్వారానే కొత్తది నిర్మించేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. » బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు మంత్రిమండలి ఆమోదం. » భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం. » ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ‘స్టెమీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం. దీని ద్వారా కాన్సర్, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. పాఠశాల విద్యార్థులకు కేంద్రం సహకారంతో ఆరోగ్య ఐడీ కార్డుల జారీ. » ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి. సీజీటీఎస్‌ఎంఈ ద్వారా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోసం రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ఆమోదం. » మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఇచ్చేందుకు ఆమోదం. » కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం లబ్ధిని ఎంఎస్ఎంఈలకు అందించేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం. కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రూ.5 వేల కోట్ల మేర ఋణ సౌకర్యం. » కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులు అమరావతిలో రెండో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం. -
ఏలూరు జిల్లాలో మంత్రి పార్థసారథికి చేదు అనుభవం
-
‘గ్యారెంటీ’ అప్పు రూ.5,200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్ఫెడ్లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.అప్పులు మినహా మరో మార్గం లేదు..రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది. ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దుఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.కౌన్సిల్లో బలం లేదు.. నిజమే‘‘కౌన్సిల్లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు. హౌసింగ్‌లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.ఇసుకలో తలదూర్చొద్దు!ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.ఐదు రోజులు అసెంబ్లీఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. -
గత ప్రభుత్వంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఐదేళ్లలో 6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని, 1.05 లక్షల టిడ్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్టు వివరించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉందన్నారు. వైఎస్సార్, జగనన్న కాలనీల పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలకు సేకరించిన భూములను 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించారో లేదో విచారణ జరుపుతామని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.లేదంటూనే.. అవునంటూఅయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూనే 11,782 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఒప్పుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు స్థలాలను అందించిన విషయం తెలిసిందే. -
నేనే మంత్రి
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో జయకేతనం ఎగరేసింది. ఇప్పుడు కేబినెట్లో స్థానం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కొందరు ఆశావహులు రేసులో ఉన్నారు. మంత్రివర్గం ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ స్థానాలపై కూటమిలో పార్టీల ప్రాతినిధ్యాలపై నేతలు చర్చించుకుంటున్నారు. సామాజిక వర్గాలతో పాటు, సీనియార్టీ ప్రకారం చూసినా ‘అమాత్యయోగం’ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారి జాబితా అధికంగానే ఉంది. ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ఉమ్మడి కృష్ణాలోని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు.సాక్షి, విజయవాడ ప్రతినిధి, అవనిగడ్డ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏపీలో ‘ఎన్టీఏ కూటమి’ ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుంది. అయితే రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చేవారు. గతంలో వారికి ఇచ్చిన హామీలు, సామాజిక కోటాల పేరుతో మంత్రి పదవులు దక్కేవి. ఎన్డీఏ కూటమిలో టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు ఉన్నారు. బీసీ కోటాలో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్ర చంద్రబాబు మంత్రి వర్గంలో, పార్థసారథి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ సీపీ నుంచి పార్థసారథి టీడీపీలో చేరారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన రవీంద్రకు మంత్రి పదవి వరించే అవకాశముంది. ఎస్సీ, మహిళా కోటాలో.. నందిగామ నుంచి విజయం సాధించిన తంగిరాల సౌమ్య ఎస్సీ, మహిళా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రెండోసారి గెలుపొందిన ఆమెకు మంత్రిగా అవకాశం రావచ్చని తెలుస్తోంది. మారిన కోటాలో.. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీలో ఉన్న వీరిద్దరూ పారీ్టలు మారడం.. ఆ నియోజకవర్గాల నుంచి గెలుపొందడంతో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం కలిసొచ్చే అంశం. పోటా పోటీ.. ఉమ్మడి కృష్ణాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గెలుపొందిన సుజనాచౌదరికి చంద్రబాబు ఆశీస్సులు ఉండటంతో మంత్రి వర్గం రేసులో ముందున్నారని తెలుస్తోంది. కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి ఏకైక అభ్యరి్థగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవి రేసులో ముందున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేయడం, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం కాపు సామాజిక వర్గం కావడంతో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.పోటీలో గద్దె, బొండా, శ్రీరాంవిజయవాడ తూర్పు నుంచి గెలుపొందిన గద్దె రామ్మోహనరావు సీనియర్ కోటాలో, సెంట్రల్ నుంచి బొండా ఉమా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, జగ్గయ్యపేట నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన శ్రీరాం తాతయ్య వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నానిపై గెలుపొందిన వెనిగండ్ల రాము మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో నూతన మంత్రి వర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే. -
టీడీపీ అభ్యర్థి పార్థసారథికి పెద్దవ్వ ఝలక్
నూజివీడు: ‘మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తామని హామీపత్రం రాసివ్వండి. లేకపోతే మీకు ఓటు వేయం...’ అంటూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓ వృద్ధురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.పార్థసారథి శనివారం నూజివీడులోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... స్థానికులు తమ గృహాలు చెరువు పోరంబోకు స్థలంలో ఉన్నాయని, వాటికి పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై పార్థసారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నివేశన స్థలాలకు పట్టాలు ఇప్పిస్తామని, లేనిపక్షంలో పొజిషన్ సర్టిఫికెట్లు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో స్థానికంగా నివాసం ఉంటున్న తులసమ్మ అనే వృద్ధురాలు జోక్యం చేసుకుని ‘నోటి మాట చెబితే కుదరదు. రాతపూర్వకంగా హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే ఓట్లు వేయం’ అని చెప్పారు. దీంతో తులసమ్మతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈలోపు కొందరు స్థానికులు జోక్యం చేసుకోవడంతో వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఈనాడు పత్రికపై ఎమ్మెల్యే పార్థసారిధి ఆగ్రహం
-
జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!?
గుంటూరు, సాక్షి: పేదలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కానీ, యెల్లో మీడియా మాత్రం విషపు రాతలతో ద్వేషం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మండిపడ్డారు. తాజాగా జగనన్న గోరుముద్దపై ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ‘‘జగనన్న గోరుముద్ద మీద విషం చిమ్మడం ఘోరమైన విషయం. గోరుముద్దకు బడ్జెట్ పెంచడంతో పాటు మంచి మెనూను రూపొందించాం. ప్రతీ రోజూ వెరైటీ మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. ఈ మెనూని రూపొందించింది స్వయంగా సీఎం జగనే. ఈ పథకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను స్వయంగా అనేక గ్రామాల్లో నేరుగా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నా.. .. గతంలో వంట ఖర్చులకు రూ. 3.50 పైసలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.6.50 రూపాయలిస్తోంది. దేశంలో ఎక్కడా ఏ పాఠశాలలోనూ లేనట్లుగా గోరుముద్ద ద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం. గతంలో 32 లక్షల మందికి మాత్రమే భోజనం పెట్టేవారు. మా ప్రభుత్వంలో 43 లక్షలకు పైచిలుకు విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్ధులకు మంచి భోజనం అందించేందుకు సంవత్సరానికి రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయినా అసత్యపు రాతలతో విద్వేషం ప్రదర్శించడం సరికాదని అన్నారాయన. ఇంకా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏమన్నారంటే.. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులు తినే తిండిపైనా రామోజీ విషం చిమ్ముతున్నాడు. మీడియాను అడ్డంపెట్టుకుని వారి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఖర్చు చేసిన దానికంటే, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, 50-60 శాతం నిధులు పెంచి, 16 రకాల మెనూతో 43 లక్షలకు విద్యార్థులకు(గతంలో కంటే11లక్షల మంది విద్యార్థులకు అదనంగా) శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంటే, పనిగట్టుకుని రామోజీ కట్టకథలు రాయడంపై పార్థసారథి తూర్పారబట్టారు. ఎల్లోమీడియా పైత్యపు రాతలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. రోజుకో మెనూతో, శుచి, శుభ్రమైన పౌష్టిక ఆహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంగా నూకలతో వండిన అన్నం పెట్టేవారు. ఉడికీ ఉడకని అన్నంతో, సాంబారు పేరుతో పల్చటి నీళ్లచారుతో మమ అనిపించేవారు అలాంటిది, మా ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన, విట్‌మిన్‌లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్‌ను వాడుతున్నామని అందరూ గమనించాలి. పిల్లలకు పాఠశాలల్లో బలవర్థకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ప్రభుత్వంపై పనిగట్టుకుని కల్పిత కథనాల్ని రాస్తుంది. దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై ఎల్లోమీడియా పైత్యం చూపించే రాతలు రాయడం ఎంతమాత్రం తగదు. 16రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతీ రోజూ రాగిజావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నాం. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు, ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందిస్తున్నాము. మిగిలిన మూడురోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందజేయడం జరుగుతోంది. ప్రతీరోజూ స్వీట్, ఆకుకూర పప్పు, సాంబార్‌లాంటి రుచికరమైన పదార్థాలతో పాటు వారానికి ఐదురోజుల పాటు ఉడికించిన కోడిగుడ్డు కూడా విద్యార్థులకు అందిస్తున్నాం టీడీపీ హయాంలో కంటే 50శాతం పెంపు ఖర్చుతో.. కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదు. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం విద్యార్థికి రూ.3.50పైసలు ఇస్తే.. మా ప్రభుత్వం మాత్రం దాన్ని రూ.6.50పైసలకు పెంచింది. అదేవిధంగా వంటసిబ్బందికి అందజేసే గౌరవ వేతనం విషయంలో గత ప్రభుత్వం కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చింది. అదే మా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3వేలు చేసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతీ విద్యార్థికి భోజన ఖర్చు రూ.11.26పైసల నుంచి 50 శాతం పెంచి రూ.16.07పైసలు ఖర్చు చేస్తున్నారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు గత ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం కంటే 50 నుంచి 60 శాతం పెంచి, ప్రతి విద్యార్థికి రూ. 18.75, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ. 23.40 చొప్పున ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందజేస్తున్నాం. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు గత ప్రభుత్వహయాంలో వంట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల నుంచి ఏడాది దాటినా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే పరిస్థితిలేదు. అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడురెట్లు అధికంగా వంటసిబ్బందికి గౌరవ వేతనాలు పెంచడంతో పాటు వంట ఏజెన్సీలకు క్రమం తప్పకుండా సకాలంలో బిల్లుల్ని చెల్లిస్తున్నాం 11 లక్షల విద్యార్థులకు అదనంగా.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43 లక్షల 46వేల 299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తున్నాం. అంటే, గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి చేసిన సగటు వ్యయం రూ.450 కోట్లు అయితే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రూ.7,244 కోట్లకు పైగా ఉన్నాయి.2023-24 బడ్జెట్ లోనూ రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. అంటే పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎల్లోమీడియా రాతల్ని అంతా ఖండించాలి జగనన్న గోరుముద్ద లాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వాన్ని అభినందించకపోగా.. ప్రభుత్వంపైనే ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరూ ఇలాంటి రాతల్ని హర్షించరు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనలాంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంలో జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటోంది. జగన్‌గారు రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా ఇప్పటికే డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లల్లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక, మంచి పరిపాలన అందజేస్తోన్న ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా ఎల్లోమీడియా రాతలు రాయడాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను. -
కంకిపాడు జన కెరటం
కంకిపాడు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాబు, పవన్‌ను తరిమికొట్టండి దొంగలకు, చంద్రబాబు, పవన్‌లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్‌పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అసమానతలు జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానమేది? ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి.. సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తో స్ట్రెయిట్ టాక్
-
ఎమ్మెల్యే పార్థసారథికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి పితృవియోగం నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నగరానికి వచ్చారు. పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ అయిన కొలుసు రెడ్డయ్య యాదవ్ ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రెడ్డయ్య భౌతికకాయానికి నివాళి అర్పించి.. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు అక్కడికి వెళ్లారు సీఎం జగన్. ముందుగా ఎమ్మెల్యే పార్ధసారథి ఇంటికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. కొలుసు రెడ్డయ్య యాదవ్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మచిలీపట్నం ఎంపీగా పని చేసిన రెడ్డయ్య యాదవ్.. ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగానూ నెగ్గారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పెనమలూరులో పచ్చ రాజకీయం.. ఆ క్రెడిట్ కొట్టేయడానికే చీప్ పాలిటిక్స్
ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఐదేళ్ళలో ఒక కాలువపై చిన్న వంతెన కూడా పూర్తి చేయించలేకపోయాడు. అన్ని రకాలుగా జనాన్ని దోచుకుతిన్నాడు. ఇప్పుడు మాజీగా మిగిలాక కూడా జనంపై కక్ష తీర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన గొడవేంటో.. మీరే చదవండి సైకిల్ పని వివాదం సృష్టించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులతో పచ్చ పార్టీ నాయకులు గంగవెర్రులెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి నానాపాట్లు పడుతున్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విజయవాడ నగర శివార్లలోని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్ చూసి జనం అసహ్యించుకుంటున్నారు. యనమలకుదురులో అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన వద్ద బోడే ప్రసాద్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి కాల్వపై వంతెన నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చొరవతో ఈ వంతెన మంజూరైంది. శంకుస్థాపన జరిగిన వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హాయాంలో ఐదేళ్ళలో వంతెన పనులు పూర్తిచేయలేకపోయారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో చిన్న వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు సాగదీశాడు. వంతెనపై పచ్చ రాజకీయం 2019 ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఓడిపోయి పార్థసారథి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో తాను శంకుస్థాపన చేసిన వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో వంతెన నిర్మాణంపై పార్ధసారధి ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్ శాఖ అడ్డంకులన్నీ తొలగించి వంతెన నిర్మాణం పూర్తిచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాంట్రాక్టర్ తో కోర్టులో కేసు వేయించాడు. అప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదని.. అవి చెల్లించాలంటూ కాంట్రాక్టర్ కోర్టుకెళ్లాడు. గత రెండేళ్లుగా కోర్టులో పోరాడి, కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనను పూర్తిచేసేందుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో పనులు తిరిగి మొదలు కానున్నాయి. విషయం తెలిసిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తన వల్లే పనులు మొదలవుతున్నాయని చెప్పుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిల్లర రాజకీయాలకు తెరతీసాడు. ఇదేం ఖర్మరా బాబూ..! తన ఐదేళ్ళ పదవీ కాలంలో పూర్తి చేయకపోగా.. ఇప్పుడు వంతెన పూర్తి చేసిన క్రెడిట్ అధికార పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధికి వెళ్తుందనే అక్కసుతో బోడే ప్రసాద్ ఇదేం ఖర్మరా బాబూ అంటూ వంతెన వద్ద ఆందోళన చేపట్టాడు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడటంతో పోలీసులు మోహరించారు. ఇదే అదనుగా భావించిన బోడే ప్రసాద్.. మహిళలను అడ్డం పెట్టకుని వైసీపీ శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వంతెన వద్ద నిరసన పేరుతో బోడే ప్రసాద్ చాలా సేపు డ్రామా నడిపించాడు. బోడే చేపట్టిన నిరసన డ్రామాపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన వంతెనను ఐదేళ్లలో పూర్తిచేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి డబ్బు దండుకుని.. అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడాన్ని సహించబోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. - హితైషి, పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
యనమలకుదురులో కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ
సాక్షి, విజయవాడ: యనమలకుదురు కేంద్రంగా టీడీపీ డ్రామాలకు తెరతీసింది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో యనమలకుదురు వంతెన పనులు నిలిచిపోయాయి. కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా టీడీపీ డ్రామా ఆడటం మొదలుపెట్టింది. ఈ డ్రామాలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ హయాంలో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన జరగగా, తర్వాత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు వంతెన పనులను టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి వంతెన పనులు పూర్తయ్యేందుకు చొరవ చూపిస్తున్నా టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతుండటం గమనార్హం. చదవండి: (ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం) -
దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరిక కోసం అంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమరావతిలోని 29 గ్రామాలకు ఏం మేలు జరిగింది?. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని పార్థసారథి సవాల్ విసిరారు. చదవండి: ‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’ ‘‘చంద్రబాబుకి సీఎం జగన్ పాలన చూసి దిక్కు తోచడం లేదు. తమకు త్వరలో రాజకీయ సమాధి తప్పదని తెలిసి విద్వేష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. భవిష్యత్తులో ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలు రాకూడదని సీఎం జగన్ ఆలోచించారు. అమరావతి ఏర్పాటు చేయాలంటే లక్షన్నర కోట్లు కావాలి. ఇతర ప్రాంతాల అభివృద్ధిని తాకట్టు పెట్టే అమరావతి నిర్మాణం సాధ్యమా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘‘విజయవాడ, గుంటూరు వాసులకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నప్పుడు ఈ మద్దతు పలుకుతున్న పార్టీలు ఏమయ్యాయి?. రాజధాని నిర్మాణం కోసం మీలా జోలె పట్టుకుని అడుక్కునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్లదు. ఇది చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్ చేసిన రాజధాని మాత్రమే. తనకు కావాల్సిన రియల్టర్స్ కోసం ఏర్పాటు చేసిన రాజధాని అది. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలన్నీ చర్చించండి. పారిపోయి బయట విద్వేష పూరిత రాజకీయాలు తగదు’’ అంటూ పార్థసారథి దుయ్యబట్టారు. ‘‘మీరు పాదయాత్ర రాయలసీమ, ఉత్తరాంధ్ర వారికి వ్యతిరేకంగా చేస్తున్నారా.?. నిజంగా మీకు ప్రజల నుంచి స్పందన ఉంటే మీరు బౌన్సర్లను పెట్టుకుని చేయాల్సిన కర్మ ఏమిటి?. మా పార్టీ లక్ష్యం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. మీరు స్నేహం చేసిన బీజేపీ మేనిఫెస్టో కూడా కర్నూలు హైకోర్టు అని పెట్టారు. రాజధానిలో పేదలకు కూడా స్థానం ఉందని సీఆర్డీఏ చట్టాన్ని కూడా మార్పు చేసిన వ్యక్తి సీఎం జగన్’’ అని పార్థసారథి అన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే పార్థసారథి కృతజ్ఞతలు
-
అవన్నీ బీ బ్రాండ్లు.. సీ బ్రాండ్లే: ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రసుగా మారిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా మద్యంపై చంద్రబాబు, టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సోమిరెడ్డి, బోండా ఉమా, అనిత నోటి నుంచి వస్తున్న మద్యం బ్రాండ్లన్నీ బీ–బ్రాండ్లు, సీ–బ్రాండ్లేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన చంద్రబాబుకు ‘శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి’, ‘మద్య మహా సామ్రాట్’ అనే బిరుదులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ మెడల్స్ అన్నీ చంద్రబాబు మెడలోనే వేయాలన్నారు. గోబెల్స్ కంటే ఘోరంగా అబద్ధాలను ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. అధికారం, దోచుకోవడం, తనవాళ్లకు అంతులేకుండా దోచిపెట్టడం తప్పితే.. ప్రజలకు సాయం చేయాలనే భావన ఆయనకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. పార్థసారథి ఇంకా ఏమన్నారంటే.. ఈ డిస్టిలరీలు ఎవరివి? ► విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా? పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణా డిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా? ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ వారు కాదా? వీటన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు కాదా? ► రాష్ట్రంలో చీప్ లిక్కర్ వల్ల ఎటువంటి మరణాలూ సంభవించలేదు. అవన్నీ టీడీపీ, ఎల్లో మీడియా వండి వార్చిన మరణాలు మాత్రమే. పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. మద్యం సేవించడం కూడా అంతే హానికరం అన్నది గుర్తెరగాలి. ► ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్.. ఇలా గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకూ చంద్రబాబు ఎవరినైనా వాడేస్తారు. ఈ పేర్లతో ఉన్నవన్నీ బాబు బ్రాండ్లు కాబట్టి బీ బ్రాండ్లు అనో, లేదా చంద్రబాబు బ్రాండ్లు కాబట్టి, సీ బ్రాండు అనో అనాలి. ఇంతకాలం జె బ్రాండ్లని తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ► 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక బ్రూవరీకి సీఎం జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. బాబు హయాంలోనే అనుమతులు ► ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న అనుమతి లభించింది. గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్‌కు 2018 నవంబరు 5న, హైదరాబాద్ విస్కీ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు. ► గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు.. వీటన్నింటికీ ఏపీ స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018 అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది. ఈ బాటిల్స్‌ను బాబు మెడలో, సోమిరెడ్డి మెడలో, అనిత మెడలో వేయాలి. అయ్యన్నపాత్రుడి మెడలో మాత్రం వేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన గంజాయి మాత్రమే తాగుతారు. ► విరా, బ్లాండే లాంటి బ్రాండ్లతో పాటు బూమ్ బీరు తీసుకు వచ్చింది చంద్రబాబే. 2019 మే 14న బూమ్ బీరుకు అనుమతి ఇచ్చారు. ► హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ 2017 జూన్ 7న. రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ 14 బ్రాండ్లు, సైనవుట్ బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది 2018 నవంబరు 9న. వీటన్నింటిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారు? -
బడుగు వర్గాల అభివృద్ధికి అద్దం పట్టే బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అద్దం పడుతోందని ఎమ్మెల్యేలు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం వెనుకబడిన వర్గాలు, గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖల పద్దులపై పలువురు మాట్లాడారు. జగన్ పేరును గిన్నిస్ బుక్‌లో లిఖించాలి ఒకే రోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన సాహసోపేత నాయకుడు ప్రపంచంలో సీఎం వైఎస్ జగన్ తప్ప మరెవరూ లేరు. అందుకే ఆయన పేరును గిన్నిస్ బుక్‌లో లిఖించేలా సభ తీర్మానం చేసి పంపాలి. వేల ఎకరాల భూమిని పరిశ్రమలకు కారు చౌకగా కేటాయించిన చంద్రబాబు.. కనీసం పేదలకు వంద ఎకరాలు కూడా ఇవ్వలేకపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బీసీల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. 139 బలహీన వర్గాల కులాలను గుర్తించి సామాజిక, రాజకీయ న్యాయం దిశగా నడిపిస్తున్న ఏకైక నాయకుడు జగన్. అమ్మ ఒడి కింద రూ.13 వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ.5,900 కోట్లు బీసీ తల్లులకే కేటాయించారని గర్వంగా చెబుతున్నా. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు బీసీల సొంతింటి బిడ్డ జగన్ సీఎం వైఎస్ జగన్‌ను బీసీలు తమ సొంతింటి బిడ్డగా భావిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏ సీఎం చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేశారు. సంచార జాతులను గుర్తించి సమాజంలో గౌరవాన్ని కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అందుకే బీసీ సంక్షేమంలో దేశం ఏపీ వైపు చూస్తోంది. బీసీల కోసమే తమ పార్టీ ఉందని గొప్పలు చెప్పే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీ సబ్‌ప్లాన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఐదేళ్లలో రూ.17వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. మా ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి.. మూడేళ్లలో రూ.63,327 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది. – కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు గిరిజన ఆరోగ్య ప్రదాత పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ గిరిజన ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్నారు. సుస్తి చేస్తే వైద్యం అందక చనిపోయే రోజులు గిరిజనులకు రాకూడదనే ఉద్దేశంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించి పోడు వ్యవసాయం చేసుకుంటున్న లక్షల మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. పేద గిరిజనులపై ఓటీఎస్ భారం పడకుండా ఇంటి హక్కులు కల్పించాలని కోరిన వెంటనే ఉదార స్వభావంతో షెడ్యూల్ 5లోని అన్ని నియోజకవర్గాల్లో ఓటీఎస్ రద్దు చేసిన మహనీయుడు మా జగనన్న. గిరిజన మనోభావాలను గౌరవిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖనిజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేశారు. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు మహిళా సాధికారతతో ముందడుగు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలను కేంద్ర బిందువుగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు సంకల్పించారు. అందుకే మహిళా సాధికారత, మహిళా సంక్షేమంలో మన రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోంది. ప్రతి మహిళకు అమ్మఒడి, జగనన్న ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం వంటి పథకాలతో ఏడాదికి రూ.60 వేల వరకు లబ్ధి చేకూరుతోంది. దీనివల్ల మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీనికి తోడు పేదలందరికీ ఇళ్ల పథకంలో ప్రతి పేద మహిళకు సుమారు రూ.7 లక్షలు విలువైన ఆస్తిని ఇస్తున్నారు. మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాలు సైతం ఏపీని అనుసరించేలా పాలన కొనసాగుతోంది. – విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట దేశం చూపు.. ఏపీ వైపు దేశం మొత్తం తలెత్తుకుని చూసేలా రాష్ట్రంలో మహిళా సాధికారత అమలవుతోంది. మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ.. ఆర్థికంగా నిలబడే ధైర్యాన్ని సీఎం జగన్ కల్పించారు. సంక్షేమ పథకాల ద్వారా వారు సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఇచ్చారు. మహిళలు తమకంటూ ఆస్తిని సమకూర్చుకునేందుకు చేయూతనిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాడానికి చాలా ప్రభుత్వాలు కష్టపడ్డాయి. ఇంకా కష్టపడుతున్నాయి. కానీ, సీఎం జగన్ 50 శాతం రిజర్వేషన్లు పారదర్శకంగా అమలు చేస్తూ మహిళలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి చరిత్ర సృష్టించారు. – కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే, మార్కాపురం -
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
టీడీపీవి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే పార్థసారధి
సాక్షి, అమరావతి: గౌతమ్‌రెడ్డి మరణంతో ప్రజలు విషాదంలో ఉన్నారని.. ఈ సమయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చదవండి: ‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’ ‘‘టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటు. సుజనా చౌదరి ఆడించిన నాటకంలో తోలు బొమ్మల్లా ఆడుతున్నారు. విభజనతో జరిగిన అన్యాయంపై జీవీఎల్ ఎందుకు మాట్లాడటం లేదు. కరోనాను రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మ ఒడి, చేయూత వంటి కార్యక్రమాలు ఉన్నాయా అంటూ పార్థసారథి ప్రశ్నించారు. నాడు-నేడు కార్యక్రమం కోసం ఏపీకి ఏమైనా ఆర్థిక చేస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం చేయాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఉందా?. బాధ్యతల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిపోతోందని పార్థసారధి మండిపడ్డారు. -
పార్థసారధి కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కుమారుడి వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కానూరు వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడు నితిన్ కృష్ణ, వధువు అమృత భార్గవి (ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కుమార్తె)లను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
కంకిపాడు: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పాలన సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామ పాలనపై ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులను బుధవారం కృష్ణా జిల్లా కంకిపాడులో మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. స్థానిక సంస్థలకు 2019కి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా చంద్రబాబు వాయిదాలు వేస్తూ వచ్చారన్నారు. ఎన్నికలు జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడతాయని భయపడ్డాడని, వైఎస్సార్సీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని అనేక కుట్రలు పన్నాడని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అడ్డంకుల్ని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. మెరుగైన పాలన అందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించి పాలనపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అన్నివర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించటంతో పాటుగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారి ఉన్నతికి పెద్దపీట వేసిన దార్శనికుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రతి గుమ్మం ముంగిటకూ పథకాలు దేశ చరిత్రలోనే తొలిసారి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రతి గుమ్మం వద్దకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. చంద్రబాబుకు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి తెలీదని మంత్రి పేర్కొన్నారు. వార్డు, సర్పంచ్ స్థానాల్లో ఓడిపోయిన వాళ్లను జన్మభూమి కమిటీలలో పెట్టి సంక్షేమ పథకాలు వాళ్ల పార్టీకి, డబ్బులు ఇచ్చిన వాళ్లకు కట్టబెట్టి పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. సంక్షేమానికి చిరునామా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నారు. పథకాలు అర్హులకు అందేలా వివక్షకు తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, ఏపీఎస్ఐఆర్డీ డైరెక్టర్ మురళి, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు. -
పిచ్చి పరాకాష్టకు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టానుసారంగా, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఇంత దిగజారి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండరన్నారు. స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ ప్రజాస్వామ్యంలో ఉండదగిన వ్యక్తేనా? అన్న సందేహం కలుగుతోందన్నారు. గంటకు పైగా మాట్లాడిన పవన్ ప్రసంగంలో ప్రశ్నలేమీ లేవని ప్రజలకు అర్థమైందన్నారు. స్టోరీ రైటర్ వచ్చి సినిమా కథ చెబితే ఏవిధంగా ఉంటుందో అలా ఉంది తప్పించి, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఒక్క ప్రశ్న వేయలేదనే విషయం పవన్‌కు అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్థసారథి ఇంకా ఏమన్నారంటే.. కనీస అవగాహన కరువు ► పవన్‌కు రాష్ట్ర పరిస్థితుల మీద కనీస అవగాహన లేదు. పక్కరాష్ట్రంలో ఉంటున్నాడు. చిరంజీవి వల్ల పైకొచ్చి పవన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఎట్టిపరిస్థితుల్లో వైఎస్సార్సీపీకి వర్గ శత్రువు కానే కాదు. రాష్ట్రంలో లేని వర్గ శత్రువులను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు. కొడాలి నాని, తలశిల రఘురాం లాంటి ఎందరో తన వెన్నంటే ఉన్నారని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వర్గ శత్రువులను చూసి సీఎం జగన్‌కు 151 సీట్లు రాలేదు. అధిక వర్షాలు, గత ప్రభుత్వ పనితీరు వల్ల రోడ్లు పాడయ్యాయి. కేంద్రంలోని బీజేపీ నాయకత్వమే జగన్ పరిపాలనను మెచ్చుకుంటోంది. బీజేపీవి పాచిపోయిన లడ్డూలు అంటాడు.. ఢిల్లీ వెళ్లి ఆ లడ్డూలే మళ్లీ తింటాడు. చదవండి: ఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత పవన్ ది ఫ్లాప్ షో ► అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో పవన్ ది ఫ్లాప్ షో. జన సైనికులు పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్లే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ► దేశంలో కరోనా కకావికలం చేస్తుంటే, ఏపీలో మాత్రం పేదలకు రూ.లక్ష కోట్లు పైబడి ఫలాలు అందాయి. పవన్‌కు ఈ విషయం కనిపించలేదా? తుని ఘటనపై మాట్లాడటానికి పవన్‌కు సిగ్గుండాలి. అప్పటి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. ఆయన ఏం చేస్తున్నట్లు? ఓ పక్క కులం లేదంటాడు.. మళ్లీ కాపులు నా కులం అంటాడు. రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సినిమాల్లో తన స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకుని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సినిమా రంగం వల్ల ఆయనకు లాభం కలిగింది కానీ, ఆ రంగానికి ఏమీ ఒరగలేదు. -
సంస్కారం లేని వ్యక్తి అయ్యన్న పాత్రుడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి హేయమైన చర్య అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయ్యన్న పాత్రుడికి పిచ్చి మరింత ముదిరిందని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి ప్రజలే గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తిరుపతి: దళితులను కించపరచటం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని.. నిన్నటి ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ పెయిడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. అనంతపురం: మైనారిటీల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ అని.. ఆయన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. కోడెల శివ ప్రసాద్‌రావు మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాస్వామ్యం గురించి మట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం -
మీ పాపాలే శాపాలై మిమ్మల్ని ఓడించాయి
సాక్షి, అమరావతి: చంద్రబాబు చేసిన పాపాలే శాపాలై ఆయన్ను ఓడించాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘18 నెలలైనా ఇంకా నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావా చంద్రబాబూ..’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు, అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం అర్థరహితమని అన్నారు. భోగి మంటల సాక్షిగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబుకు సంప్రదాయాలు, దేవుడిపై ఏమాత్రం విశ్వాసం లేదని రూఢీ అయిందన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్థసారథి ఏమన్నారంటే... నిన్ను ఓడించింది ఇందుకే బాబూ ‘అధికారం పోయినప్పుడు మారిన మనిషినని, రైతుల కోసం పోరాటం చేస్తానని, దళితులు, మైనార్టీలు, బలహీనుల కోసం శ్రమిస్తానని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వాళ్లనే రాష్ట్రానికి గుదిబండలన్నందుకు, పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నందుకు అంతా నిన్ను ఓడించారు. హామీలిచ్చి, మోసం చేసినందుకు, బీసీలను అవమానించి, హక్కులు కాలరాసినందుకు ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు. రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వ్యవసాయం దండగ అంది నువ్వే. ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడు రైతుల గురించి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది. రూ.86 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళల్లో కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా రైతులకిచ్చే సున్నావడ్డీ రూ.74 వేల కోట్లు ఎగ్గొట్టి. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడితే, వారి పంటలను అతి తక్కువ ధరకు కొని, మీ హెరిటేజ్ ద్వారా ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముకుంది వాస్తవం కాదా? రైతులకు రూ.2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలకే సబ్సిడీలు ఇవ్వడం అన్యాయం కాదా బాబూ? మేం రైతుకు చేస్తున్న మేలు కన్పించడం లేదా? మా ప్రభుత్వం రైతుకు ఏం అన్యాయం చేస్తోందో చంద్రబాబు చెప్పాలి. రైతుకు ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్ళలో రూ.50 వేల వ్యవసాయ పెట్టుబడి ఇస్తానని చెప్పిన వైఎస్ జగన్.. ఇప్పుడు ఏడాదికి రూ.13,500 చొప్పున, ఐదేళ్ళలో రూ.67,500 ఇస్తుంటే రైతులకు అన్యాయం చేసినట్టు కన్పిస్తోందా? విత్తు నాటిన రోజే పంటకు గిట్టుబాటు ధర ప్రకటించిన ప్రభుత్వం మాది తప్ప దేశంలో ఇంకెక్కడైనా ఉందా? ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోనే పరిహారం చెల్లించి చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది కాదా? రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతుకు మేలు చేయాలని నిబంధనలు కూడా పక్కన పెట్టిందీ ప్రభుత్వం. డిసెంబర్ 24 వరకు కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లిస్తే... చెల్లించలేదని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేయడం దారుణం. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా లోకేష్... ఇప్పుడు బాలకృష్ణ స్క్రిప్టు రాస్తున్నారా అన్పిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం హిందూ మతాన్ని గౌరవిస్తోంది. గుడికో గోవు పథకం, కొన్ని వందల గుడులు నిర్మించడం, రూ.70 కోట్లతో దుర్గమ్మ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు నిదర్శనం..’’ -
‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’
సాక్షి, విజయవాడ: పేదలకు మేలు చేయాలన్న సీఎం జగన్ సంకల్పం ముందు కరోనా కూడా తలొంచిందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గత ఐదేళ్లలో చంద్రబాబు పేదలను పట్టించుకోలేదు. కేవలం ఉపన్యాసాలతో పేదలను కడుపు నింపుకోమనేవాడు. కానీ సీఎం జగన్ అలా కాదు. ఎన్నికల మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది. చదవండి: (జనవరి 20 వరకు నిర్వహిస్తాం: సీఎం జగన్) ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైఎస్సార్ తనకు మించిన దార్శనికుడిని రాష్ట్రానికి ఇచ్చి వెళ్లారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లు రాష్ట్రానికి చంద్రబాబు రూపంలో దరిద్రం వెంటాడుతూనే ఉంది. పేదల ఇళ్ల పట్టాలు అడ్డుకున్న దౌర్బాగ్యపు బుద్ధి చంద్రబాబుది అంటూ ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (దేశంలో నంబర్‌వన్‌గా నిలుపుతాం: మంత్రి సురేష్) -
చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి..
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన చేస్తుంటే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: ‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’) ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్నారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రథం నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందన్నారు. ‘‘రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. లోకేష్ మాటలకు రాష్ట్రంలో విలువలేదని’’ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..) -
బాబూ.. ‘నారా–హమారా’ గుర్తుందిగా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసమర్థ, రాక్షస పాలన సాగుతోందని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఐదేళ్ల నిర్వాకాలను ప్రజలు ఇంకా మరచిపోలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై చోటు చేసుకున్న దాడులను ఎవరూ మరిచిపోలేదన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి నెల నుంచే ప్రజలపై, అధికారులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. అమరావతిలో ఓ వీఆర్వోని టీడీపీ నేతలు దుస్తులు విప్పి చితకబాదారని, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారని చెప్పారు. ఓ ఐపీఎస్ అధికారిపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దాడి చేస్తే చంద్రబాబు కూర్చోబెట్టి రాజీ చేయడం రాక్షస పాలన కాదా? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని కొట్టడాన్ని రాక్షస పాలన అనరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మాదిరిగా టీడీపీ ప్రజాప్రతినిధులు బరితెగించి దాడులకు పాల్పడి నేరాలు, ఘోరాలను ప్రోత్సహించిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవన్నారు. అసమర్థ పాలన అంటే ఇదీ బాబూ.. ‘అసమర్థ పాలన అంటే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులను ఎలా వేధించాలి? ఎలా దొంగ కేసులు పెట్టాలి? సంక్షేమ కార్యక్రమాలకు ఎలా కోతలు పెట్టాలి? ఇసుక నుంచి మట్టి, మద్యం, నీరు–చెట్టు పేరుతో చెరువులను ఎలా ఖాళీ చేయాలి?’ లాంటిదని పార్ధసారథి పేర్కొన్నారు. అసమర్థ పాలన అంటే ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు చరిత్రని చెప్పారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా ఆయన పీడ రాష్ట్రానికి విరుగడ కాలేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్‌లు, ట్వీట్లు చేస్తూ రాజకీయంగా బతికే ఉన్నామని చెప్పుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. (ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు) రాజీనామా చేస్తే పచ్చ రంగు మారుతుందా? నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని పార్ధసారథి మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను జైలుకు తరలించిందని, కాపాడాలని చూడలేదని గుర్తు చేశారు. ‘అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణం సీఐ, హెడ్ కానిస్టేబుల్ అన్నది మరణ వాంగ్మూలం ప్రకారం అందరికీ తెలుసు. మరి సీఐని చంద్రబాబు ఎందుకు సమర్థిస్తున్నారు? ప్రభుత్వమే బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఏమిటి? నిందితులకు బెయిల్ ఇప్పించిన మీ పార్టీ నాయకుడితో రాజీనామా చేయిస్తే పచ్చరంగు మారుతుందా? మీ డ్రామాలన్నీ నిజాలైపోతాయా? సీఐ మీద 306 సెక్షన్ కింద కేసు ఉన్న విషయం తెలిసి కూడా టీడీపీ న్యాయవాదిని బెయిల్ కోసం ఎందుకు పంపారు? ముస్లింల సంక్షేమానికి ఐదేళ్లలో ఏమాత్రం కృషి చేయని చంద్రబాబు ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. 17 నెలల్లో రూ.3,428 కోట్లు.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది కాగా ఇప్పుడు వారికి మేలు జరిగేలా సీఎం జగన్ అన్ని చర్యలు చేపట్టారని, 17 నెలల పాలనలో ముస్లింలకు రూ.3,428 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించారని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే విదిల్చారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక పథకాలను అడ్డుకోవడానికి కుట్రలు, కుల మత రాజకీయాలు చేయడాన్ని బాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. (నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ) నారా–హమారా’ గుర్తుందిగా? చంద్రబాబు అధికారంలో ఉండగా గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా’ సభలో హామీలను నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను ఆయన సమక్షంలోనే ఎలా హింసించారో ప్రజలు మర్చిపోలేదని పార్థసారథి తెలిపారు. ముస్లిం బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తే దేశ ద్రోహం కేసు పెట్టింది మీరు కాదా? అని ప్రశ్నించారు. నీతి వాక్యాలు వల్లించే చంద్రబాబు చేసేదంతా అవినీతి, అరాచకం, అన్యాయమని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో తొలి నాలుగున్నరేళ్లు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు. పెట్టుబడిదారుడైన నారాయణను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారన్నారు. అసమర్థ తనయుడిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు. -
చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని, దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీలా మారిపోయిందని.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని అక్రమాలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.(చదవండి: అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) కాగా అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చట్టాలను సైతం ఉల్లంఘించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. చంద్రబాబు, లోకేష్ తమ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సహకరించాలని చాలెంజ్ విసిరారు. ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై విచారణ జరగాలి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో రాజధాని అక్రమాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే రోశయ్య స్పష్టం చేశారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదైందని, తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోట్లు కొల్లగొట్టారు అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంటే కక్షసాధింపు అంటున్నారని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో లోకేష్ తన బినామీలతో కోట్లు కొల్లగొట్టారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిపించాలి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, చంద్రబాబు, టీడీపీ నేతలు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’
సాక్షి, కృష్ణా : అనేక సంక్షేమ పథకాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని పెనమలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. నేడు వైఎస్సార్ తమ మధ్య లేకపోవడం ప్రతి పేదవాడికి తీరనిలోటు అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అందరూ వైఎస్సార్‌కు ఘనమైన నివాళులు ఆర్పిస్తున్నారని తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్రంలో లబ్ధి పొందని ఇంటి గడప లేదని వ్యాఖ్యానించారు. (ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది) కుల,మత,పార్టీలు చూడకుండా పేదవారందరికి పధకాల ద్వారా మేలు చేశారని పార్థసారధి గుర్తు చేసుకున్నారు. పేదవాడి చదువుకై విప్లవాత్మక ఆలోచన చేసి..పేద పిల్లలు చదివితే ఆ కుటుంబాల అభివృద్ధి చెందుతాయని ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారన్నారు. పేదలందరికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి, మొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికోసం ఆరోగ్య శ్రీ తీసుకు వచ్చారని, దీని వల్ల పేదోడు కూడా కోటేశ్వరుడితో సమానంగా వైద్యం పొందేలా చేశారని కొనియాడారు.(‘పశ్చిమ’ తీరం.. అభివృద్ధి సమీరం) ‘మన అదృష్టం కొద్ది ఆయన తనయుడు మన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఆశయాలు నెరవేర్చుతున్నారు. నాన్న ఒక్క అడుగు వేస్తే రెండడుగులు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. చెప్పిన రీతిలోనే తండ్రి రీయింబర్స్మెంట్ తీసుకు వస్తే తనయుడు అమ్మ ఒడితో పేదలకు అండగా నిలబడ్డారు. తండ్రి 45 లక్షల ఇళ్లు కడితే విభజిత రాష్టంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. పేదల పాలిట నిజమైన దేవుడు జగన్మోహన్రెడ్డి’ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. (రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు) -
ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాతికేళ్ల వెన్నుపోటుకు, తెలుగు తమ్ముళ్లు స్విలర్ జూబ్లీ పేరుతో పండుగ చేసుకోవటంతో దివంగత ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పాతికేళ్ల వెన్నుపోటు సందర్భంగా పండగ చేసుకుంటున్న చంద్రబాబును చూసి సభ్య సమాజం తలదించుకుంటుందని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీని, ఎన్టీఆర్ ఎన్నికల గుర్తుని, ఎన్టీఆర్ ట్రస్టును, ఎన్టీఆర్ సీఎం పదవిని లాక్కుని చరిత్ర హీనుడుగా చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలిలా ఉన్నాయి. ► వైఎస్ జగన్ కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి దమ్ము, ధైర్యంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంత జెండా, అజెండాతో, సొంత గుర్తుతో పార్టీ పెట్టారు. 151 సీట్లు సాధించి సీఎంగా ఏడాదిలోనే హీరోగా ప్రజల హృదయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ► చంద్రబాబు.. ఎన్టీఆర్ వెనక గోతులు తవ్వి, కుట్రలు పన్ని ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేశారు. అత్యంత నీచంగా చెప్పులతో కొట్టించే కార్యక్రమం చేశారు. ఇదే రోజు ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న చంద్రబాబు ప్రజల హృదయాల్లో విలన్‌గా మిగిలిపోయారు. చరిత్రకారుడు కాదు.. చరిత్ర హీనుడు ► 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజు ఆయన సమాధి వద్దకు వెళ్లి ప్రేమ ఒలకబోస్తూ నివాళులర్పిస్తారు. కానీ ఈ 14 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన పేరు భారతరత్న బిరుదుకు సిఫార్సు చేయలేదంటే చంద్రబాబు నైజం ఏంటో తెలుగు తమ్ముళ్లు ఆలోచించాలి. ► తెలుగుదేశం పార్టీని బాబు ఆక్రమించుకుని, కబ్జా చేసి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ పాతికేళ్లలో 14 ఏళ్లు సీఎంగా, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా బాబు ఒక్క మంచి కార్యక్రమం అయినా చేశారా? ► మీడియా మేనేజ్మెంట్లో ప్రపంచ స్థాయికి ఎదిగారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలకు విలువ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచారు. -
‘వెన్నుపోటుకు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం సిగ్గు చేటు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై కుట్రలు పన్ని ఆయనను పదవి నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారు. టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. ఆయన నుంచి అన్యాయంగా పార్టీతో పాటు సింబల్‌ని కూడా లాక్కున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డ్‌కు సిఫార్సు చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా బలంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చారు. 25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తుకు వచ్చేలా పెట్టలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే) అంతేకాక ‘మీడియా మేనేజ్మెంట్తో చంద్రబాబు బతుకుతున్నారు. వ్యవసాయం దండగన్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం ఎత్తివేసిన ఘనత చంద్రబాబుది. ఆయన ఇచ్చిన లేఖతో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక హోదకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిచి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హీరోనా...151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరోనా’ అంటూ పార్థసారథి ప్రశ్నించారు. -
‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’
సాక్షి,అమరావతి: తోకలు కత్తిరిస్తా, తాట తీస్తా అని బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు అదే వర్గాలపై మహానాడు వేదికగా మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. అధికారం కోల్పోయాక ఈ వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బలహీనవర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే వారిని అవమానించే రీతిలో ప్రవర్తించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం రూ.5 వేల కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. -
‘మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే’
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందేనని, దశలవారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్.. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఉయ్యురుకు పట్టిన కరోనా వైరస్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాని ఎదురుకుంటూనే ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అని కొనియాడారు. రాష్ట్రంలో వాలంటీర్ల పనితీరు భేష్ అంటూ పొగిడారు. రైతులు నష్ట పోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల దాతృత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: కష్టకాలంలోనూ పేదలకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు స్ఫూర్తి కలిగించేలా ఉన్నాయని పెనమలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆరు లక్షల రూపాయల వ్యయంతో పదివేల కూరగాయల కిట్లు, 30 వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీటిని కంకిపాడు మండలం ఉప్పులూరు నుంచి పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో అయిదు రోజులకు సరిపడా కూరగాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్ల రేషన్, బియ్యం కార్డులేని ప్రతీ పేదవాడికి ఆర్థిక భరోసాకు ఉచిత బియ్యం సీఎం ఆదేశించారని తెలిపారు. (లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం.. ) పశ్చిమగోదావరి జిల్లా: తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలువురి వాలంటీర్లకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. యలమంచిలి మండలం చించినాడ, నెరేడుమిల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు.. లాక్డౌన్ కారణంగా వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. (‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ ) అనంతపురం: పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయుడికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ పిండి తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమాచారం ప్రజలకు చేరవేయడంలో మీడియా సోదరుల పాత్ర కీలకమైందన్నారు. విపత్కర సమయంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరోవైపు గుంటూరులోని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. 250 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రకాశంలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పల్లెపాలెం గ్రామాలలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య సుమారుగా 3లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులు అందజేశారు. (నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా: టైగర్) -
టీడీపీకి అభ్యర్థులే లేరు: పార్థసారథి
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సహా అన్ని మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. టీడీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముందు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికల్లో గెలుస్తామని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’ -
టీడీపీకి ఓటమి తప్పదు: పార్థసారథి
సాక్షి, విజయవాడ: పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దివ్యాంగుడిని కారుతో ఢీకొట్టి టీడీపీ నేతలు పారిపోయే ప్రయత్నం చేశారని.. టీడీపీ నేతల వైఖరిపై స్థానికులు కోపోద్రిక్తులయ్యారని పేర్కొన్నారు. (‘ఆ స్థితికి టీడీపీ దిగజారిపోయింది’) గతంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా ఐఏఎస్ అధికారిపై దాడి చేశారని పార్థసారథి గుర్తు చేశారు. గొడవలు సృష్టించడానికే 10 కార్లలో టీడీపీ నేతలు వచ్చారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు ఇష్టారీతిన దాడులకు దిగారని దుయ్యబట్టారు. దౌర్జన్యం చేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బు,మద్యం పంపిణీ ఉండకూడదని చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. భయానక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని పార్థసారథి పేర్కొన్నారు. -
‘అభ్యర్థులు దొరకడం లేదని చంద్రబాబే చెప్పారు’
సాక్షి, అమరావతి : చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ద్వజమెత్తారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనితీరు చూసి బాబు మైండ్‌బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని , టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చంద్రబాబే చెప్పారని అన్నారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే బలహీన వర్గాలు నష్టపోయాయన్నారు. సీఎం జగన్ పనితీరు చూసే డొక్కా, రెహమాన్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. (వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు దీక్ష) సీఎం జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకు మతి భ్రమిస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి బాబు లబ్ది పొందాలని చూస్తున్నాడని మండిపడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఆ నెపాన్ని వైస్సార్సీపీ మీద నెట్టాలని చూస్తున్నారన్నారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని, తమకు చంద్రబాబు చేసిన మోసాన్ని బీసీలు గమనించారని పేర్కొన్నారు. (అవినీతి బయటపడితే బీసీలపై దాడి జరిగినట్టా?) సీఎం వైఎస్ జగన్ బీసీల పక్షపాతి అని పార్థసారథి అన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొలేకే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని వాడుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తాము దైర్యంగా వైఎస్ జగన్ సైనికులమని చెప్పి ఓట్లు అడుగుతామన్నారు. ('బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం') -
అవినీతి బయటపడితే బీసీలపై దాడి జరిగినట్టా?
సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాల పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు, టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించడం శోచనీయమని అన్నారు. పార్థసారథి శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడితే బీసీలపై దాడి అంటూ టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నినాదం ఎత్తుకున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ తన కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బయటకొచ్చిందని తెలిపారు. అచ్చెన్నాయుడు ఇరుక్కునే సరికి బీసీలపై కక్ష సాధింపు, దాడి అని అంటున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి సొమ్మంతా చంద్రబాబు వద్దకే చేరిందని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయ్యాక రైతులకు న్యాయం రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలనా వికేంద్రీకరణ అని కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో పారిశ్రామిక, వ్యవసాయపరమైన అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రైతులను, రైతు కూలీలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాతే రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి బయటకు వస్తోందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు వారి జీవితాల్లో నిప్పులు పోశారని ధ్వజమెత్తారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి చంద్రబాబు నుంచి రూ.400 కోట్లు పంపించారనే ఆధారాలు బయటకు వచ్చాయన్నారు. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల అనినీతికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని పార్థసారథి తెలిపారు. -
'బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం'
సాక్షి, తాడేపల్లి : రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల నుంచి ప్రజల దృష్టిని మరల్చటం కోసం కొన్ని పచ్చ పత్రికలు రియల ఎస్టేట్ వ్యాపారం పడిపోతున్నట్లు కథనాలు రాస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వడానికి ముందే ఉండవల్లి, తాడేపల్లిలోని భూములకు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల ధరలున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధానికి భూములు ఇవ్వలేదని మంగళగిరి పరిధి గ్రామాలో ధరలు పడిపోయేలా చంద్రబాబే చేశారంటూ పార్థసారథి ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ధరలు పడిపోవడానికి బాబు తీరే కారణమని, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు మురళీమోహన్ వంటి వారు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేయలేదని ఎద్దేవా చేశారు. సీఎం దగ్గర పీఎస్‌గా పనిచేసిన వ్యక్తితో కాంట్రాక్టర్లు ఎటువంటి లావాదేవీలు పెట్టుకోరన్నారు. సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే రియల్ ఎస్టేట్ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేశారని, దానిని కూడా టీడీపీ నేతలు రాజకీయాలుగా చూడడాన్ని పార్థసారథి తప్పుబట్టారు.(న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్) -
వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు దీక్ష
-
వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు దీక్ష
సాక్షి, తాడేపల్లి : వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే ఇప్పుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన గురువారం పార్టీ ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, కైలే అనిల్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో ప్రసుత్తం లక్షా 50 వేల టన్నుల సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భరోసా కోసమే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బ్లూ ప్రాగ్ సంస్థ యజమాని, చంద్రబాబు సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే ఛాపర్లో తిరిగేవారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలు చంద్రబాబుకు పిల్ల కాలువలుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. బాబు విడుదల చేసింది దొంగ చార్జీషీట్ అని దమ్ముంటే ఇసుక ఆరోపణలపై ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమానే ! చంద్రబాబుకు మతి భ్రమించి దీక్షలు చేస్తున్నారని , ఇసుకపై ఆయన చేస్తున్న దీక్ష దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమామహేశ్వరరావు అని, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని దీక్ష చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. టీడీపీ వేసిన దొంగ చార్జీషీట్‌ను ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని , ఎన్నికల ద్వారా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పినా చంద్రబాబులో ఏ మార్పు రాలేదని తెలిపారు. ఉమా విధానం నచ్చకనే ఆయన తమ్ముడు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. తెలంగాణలో కనుమరుగైనట్లే ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే గురువారం బాబు దీక్ష నిర్వహిస్తుండగానే దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన విషయాన్ని కూడా కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. టీడీపీ నాయకులు గత ఐదేళ్ల పాలనలో అడ్డుగోలుగా ఇసుకను తిని అరిగించుకున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దుయ్యబట్టారు. గత ఐదేళ్ళలో ఇసుక దోచుకోవడంపై పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒకవేళ తమ పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే స్వయంగా చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. -
హామీల అమలులో వెనుకడుగు వేసేదిలేదు
పెనమలూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుక అడుగు వేయదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆటో కార్మికులకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం మంజూరు పత్రాలను కంకిపాడు మార్కెట్ కమిటీ యార్డులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. 'ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆటో కార్మికుల గురించి గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆటో కార్మికులకు రూ. 10,000 అందించన ఘనత జగన్మోహన్ రెడ్డిదే' అని అన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వారు రూ.లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కున్నారని అవమానిస్తున్నారా అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలను చంద్రబాబు అభినందించాలే తప్ప అవమానించ కూడదని హితవు పలికారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు అనిల్ కుమార్, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
'మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం'
సాక్షి, ఉయ్యూరు(కృష్ణా) : ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రెడ్డీస్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 200 స్కూళ్లలో స్కాలర్షిప్లు అందజేయడమే గాక, మౌళిక వసతులు లేని స్కూళ్లను ఏంచుకొని వాటి అభివృద్ధికి రెడ్డీస్ ఫౌండేషన్ కృషి చేయడం మంచి పరిణామమని తెలిపారు. అదే విధంగా 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ రెడ్డీస్ ఫౌండేషన్ తమ వంతు ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15వేలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అధిక ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న వ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో విద్యా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేశారు. దీంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందని పార్థసారధి పేర్కొన్నారు. -
అసత్యారోపణలు మానకుంటే నాలుక కోస్తా...
-
‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి చేతకాని దద్దమ్మను తాను ఎక్కడా చూడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. అసత్యారోపణలు మానకుంటే మాజీ మంత్రి నాలుక కోస్తానంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీకొడుకులిద్దరూ దివాళా తీయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా ఆ ఇద్దరిలో మార్పు రావటం లేదన్నారు. అర్ధం లేని ట్వీట్లతో లోకేష్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలారిష్టాలని అధిగమించి ప్రజాసంక్షేమాన్ని చూస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అభివృద్ధికి సహకరించకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవినీతి రహిత రాష్ట్రం కోసం వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తుంటే నీతిలేని బాబు అవాకులు చవాకులు పేలుతున్నారని కోప్పడ్డారు. నిబంధనలకు విరుద్దంగా నవయుగకి పనులు కేటాయించి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన ఆర్ధిక సమస్యలనుంచి రాష్టాన్ని గాడిలో పెట్టేపనిలో ప్రభుత్వం ఉందన్నారు. లోకేష్ ఓ మాలోకంలా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. అవకాశం ఉన్నచోటల్లా టీడీపీ పెద్దలు దోచేశారని, ఆఖరికి పేదవాడి కోసం ఏర్పాటుచేసిన క్యాంటీన్ల పథకంలోనూ కాసులకక్కుర్తిని వదలలేదన్నారు. మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీర్చే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. -
టీడీపీ నేతలకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు
-
ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలన్నదే జగన్ ఆకాంక్ష
విజయవాడ సిటీ: ప్రజలకు మేలైన పరిపాలన అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పెనమలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజలిచ్చిన తీర్పు చంద్రబాబు అహంకారానికి చెంపదెబ్బగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే జీవితాల్లో మార్పు వస్తుందని ప్రగాఢంగా నమ్మారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఎన్నో దీక్షలు, పోరాటాలు చేసిన నేతగా వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కైలే అనిల్‌కుమార్ (పామర్రు), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్‌తో కలిసి ఆయన మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మా కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేశారు చంద్రబాబు పాలనను తరిమికొట్టాలనే లక్ష్యంతో వైఎస్సాసీపీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా 50 శాతం ఓట్లు సాధించిన దాఖలాలు లేవన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, దుష్టపాలనను కప్పిపుచ్చిన ఎల్లో మీడియా నేటికీ బుద్ధి తెచ్చుకోకుండా వైఎస్ జగన్ మాటలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ‘గెలిచిన మరుక్షణం రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నదీజలాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించి సాయం కోరారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు కేంద్రంతో యుద్ధం ప్రకటించాలని ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్ చేస్తాం.. అని ప్రకటిస్తే అడుక్కోవడం అని వక్రీకరించారు. వైఎస్ జగన్ పోరాట పటిమ ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఆయన చిత్తశుద్ధితో ఉంటారన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా వైఎస్ జగన్ ఈ నెల 30న (గురువారం) మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపారు. లోకేష్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు.. లోకేష్‌కు కూడా చంద్రబాబులాగా ఏరుదాటక తెప్ప తగలేసే అలవాటు ఉన్నట్లుగా కనబడుతోందన్నారు. 2014లో విజయం సాధిస్తే అది చంద్రబాబు గొప్పతనం, అనుభవం, దూర దృష్టి అంటూ ఆకాశానికి ఎత్తేశారని, నేడు ఓడిపోతే 90 శాతం కార్యకర్తలు, నాయకులదే బాధ్యత అని చెప్పే స్థాయికి లోకేష్ దిగజారిపోయారని విమర్శించారు. ఓడిపోయిన చోటే తిరిగి గెలిచే సత్తా ఉందని లోకేష్ వ్యాఖ్యలను ఉత్తరకుమార ప్రగల్భాలుగా అభివర్ణించారు. -
‘వివేకా మరణంపై లోకేశ్ వ్యాఖ్యలు దారుణం’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆ పార్టీ నాయకులు పార్థసారథి అన్నారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో తాము బాధలో ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు వెటకారపు నవ్వులతో మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబుది నీచ మనస్తత్వం అని ఆయన విమర్శించారు. మానవత్వం ఉన్న మనషులెవరు ఇలా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. ఓటమి తప్పదనే భయంతో టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలా ఇరికించాలనే ఆలోచన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.(వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’) ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వ ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారు. వైఎస్ జగన్ ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని.. కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరారని గర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రచార సభల్లో ఎదుటివారిపై దుష్ప్రచారమే చేయడమే తప్ప.. తన పరిపాలన ఎలా సాగిందో చెప్పుకోలేనీ దీన స్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన భూ కబ్జాలు ఆంద్రప్రదేశ్ చరిత్రలో లేవని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రశ్నలకు జవాబు చెప్పలేక బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న నారా లోకేశ్ ఆదివారం రోడ్ షోలో మాట్లాడుతూ ‘పాపం వివేకానందరెడ్డి చనిపోయారు. ఆ విషయం తెలిసి పరవశించాం’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. -
సంక్షేమ పాలనే వైసీపీ లక్ష్యం
సాక్షి, మంతెన(కంకిపాడు): సంక్షేమ పాలన కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆపార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తిచేశారు. మండలంలోని మంతెన గ్రామంలో గురువారం రాత్రి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్రచార వాహనంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథితో కలిసి పర్యటించారు. స్థానిక బోసు బొమ్మ, ఎస్సీ కాలనీ సెంటర్లలో జరిగిన సభల్లో బాలశౌరి ప్రసంగించారు. నీతికి, నిజాయతీకి మారుపేరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీకి మధ్యనే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. టీడీపీ నేతలు అన్ని వర్గాల ప్రజలనూ వంచించారన్నారు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావా లన్నా, బందరు పోర్టును సాధించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనాకాలంలో మాదిరిగా రెండు పంటలకూ డెల్టాలో నీరిచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ కాలేదన్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తు ప్రజల్ని మోసం చేయాలని టీడీపీ చూస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పాలకులను, ఓట్లు అడిగేందుకు వచ్చేటీడీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకూ పథకాలు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంతెన గ్రామంలో ఇళ్లస్థలాలు పంపిణీకి కృషి చేస్తామని, వసతులు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బలహీనవర్గాల ప్రజలపై కనీస గౌరవం లేని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సారథి తనయుడు నితిన్‌కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, రాష్ట్ర నేతలు తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), నక్కా శ్రీనివాసరావు, రామినేని రమాదేవి, వల్లె నర్సింహారావు, జిల్లా నాయకులు బండి నాంచారయ్య, మాదు వసంతరావు, బాకీ బాబు, నెరుసు సతీష్, అన్నే చంటిబాబు, మాగంటి శ్రీను, మంతెన గ్రామ నేతలు బండి శ్రీను, పటాకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కె. వెంకటేశ్వరరావు, వీరంకి రమణ, భావన్నారాయణ, కొండేటి నాని, రాజులపాటి శివబ్రహ్మేశ్వరరావు, కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కంకిపాడు ప్రధాన సెంటరు నుంచి పార్టీ రాష్ట్ర నేతలు కొండవీటి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో యువత మోటరు బైక్ ర్యాలీ చేశారు. మంతెన ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని కొనసాగించారు. -
ఊసరవెల్లి సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారు
-
గర్జన సభతో మిగిలిన బాక్సులూ బద్దలైపోతాయి
సాక్షి, ఏలూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో బాబుల బాక్సులు బద్దలైపోయాయని, ఇంకేమైనా మిగిలి ఉంటే బీసీ గర్జన సభతో అవి కూడా పగిలిపోతాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏలూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో పార్థసారథి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రత్యేక హోదా రాకుండా మోసాలు చేశారని, ఆ మోసాల నుంచి తప్పించుకునేందుకు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీల అభివృద్ధి కోసమే బీసీ గర్జన సభను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఎంతోమంది బీసీలు అభివృద్ధి చెందారని, వైఎస్సార్ వల్ల బీసీల్లోనూ ప్రతి ఇంట్లో డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని గుర్తు చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బీసీలు తలెత్తుకొని బతకగలరని, బీసీల హక్కులు కాపాడాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ పాలనను మళ్లీ రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ పాలనలో ప్రజలు ఆత్మాభిమానంతో జీవించారన్నారు. ప్రజలందరూ సామాజిక గౌరవాన్ని పొందేవిధంగా వైఎస్ఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారన్నారు. ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? చంద్రబాబు పాలనలో ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. చంద్రబాబు బీసీలను దూషించారని గుర్తు చేశారు. ఏలూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ధర్మాన స్పష్టం చేశారు. గ్రామగ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకం గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ధర్మాన సూచించారు. బీసీలంతా వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. -
చంద్రబాబు బీసీలు మోసం చేస్తున్నారు
-
బీసీలను బానిసలుగా మార్చింది చంద్రబాబే
విజయవాడ సిటీ: బీసీలు ఎక్కడ, ఏ స్థితిగతుల్లో ఉన్నారో?... అక్కడే ఉండేలా ఆదరణ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. బీసీ కుటుంబాల్లోని పిల్లల అభ్యున్నతికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బలహీనవర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోనీయకుండా ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ స్కాలర్ షిప్, విదేశీ విద్య ఇలా అన్నిటికీ గండికొట్టి అన్యాయం చేశారని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను చంద్రబాబు బానిసలుగా మార్చారన్నారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. చట్టబద్ధత, విలువలు లేని జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, వాటి దగ్గర బీసీలు చేతులు కట్టుకొని నిలబడే దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చాడని మండిపడ్డారు. బీసీలను అవమానించి, అన్యాయం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని బీసీ గర్జన సభ పెట్టాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరాలు ప్రకటించి ప్రజలను మోసగించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో అన్నపూర్ణమ్మపేట గ్రామంలో డ్వాక్రా మహిళలు గర్జన సభకు రాకపోతే సెల్‌ఫోన్ ఇవ్వం, రూ. పది వేలు ఇవ్వమని బెదిరించారని, దీంతో మహిళలు ధర్నాకు దిగారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో బలహీనవర్గాలకు దాదాపు 125 హామీలు ఇచ్చారని, వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటైనా అమలు చేసిందేమో.. స్పష్టంగా చెప్పాలన్నారు. బలహీనవర్గాలకు మైనింగ్ మీద హక్కులు, ఇసుక క్వారీలు అన్నారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ అని అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారు. ఇక చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారి కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. చేనేతలకు వర్షాకాలంలో నెలకు రూ.4 వేలు ఇస్తామని ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చి బలహీనవర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. టీడీపీ వచ్చిన తరువాత ఫీజురియింబర్స్మెంట్ను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రూ.2వేలు విలువ ఉన్న పనిముట్టు రూ.20వేలట... ఆదరణ పేరుతో ప్రభుత్వం రూ.2 వేల విలువచేసే పనిముట్టును రూ.18 వేల నుంచి రూ.20 వేలతో కొనుగోలు చేసి అందులో కూడా కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. ఆదరణ పథకాలు బలహీనవర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికా..? టీడీపీ నాయకులు జేబులు నింపుకోవడం కోసమా? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ 2017–18కి బడ్జెట్లో రూ. 274.5 కోట్లు కేటాయిస్తే విడుదల చేసింది రూ.124 కోట్లు మాత్రమేనన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు 2017–18 బడ్జెట్లో రూ.1042 కోట్లు కేటాయించి కేవలం రూ. 517.27 కోట్లు మాత్రమే ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. -
చంద్రబాబువి స్వార్థ రాజకీయాలు
విజయవాడ సిటీ: రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి గానీ మాట్లాడే దమ్మూ, ధైర్యం లేని పిరికిపంద, అసమర్థుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. సీబీఐ, ఈడీ, కక్షలంటూ మాట్లాడుతున్నారు గానీ ఒక్కసారి కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరువిప్పట్లేదని ధ్వజమెత్తారు. మరోవైపు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్.. కేటీఆర్‌తో జరిగిన ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా ముఖ్యమని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అదే చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు మధ్యనున్న తేడా అని పార్థసారథి పేర్కొన్నారు. దోపిడీ, అవినీతి, ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోడానికే చంద్రబాబు రాష్ట్రాలు పట్టుకు తిరుగుతూ.. అన్ని రాజకీయ పార్టీల కాళ్లు పట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్‌తో కేటీఆర్ చర్చలు జరపడాన్ని ఫిడేల్ ఫ్రంట్ అంటూ టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మరి కోల్‌కతాలో జరిగింది తోడేళ్ల ఫ్రంటా? అంటూ పార్థసారథి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ లోటస్‌పాండ్‌లో దాక్కున్నారంటూ మంత్రి దేవినేని ఉమా కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నెలల తరబడి ప్రజల మధ్య ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నావో చెప్పాలంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ కుతంత్రాలు మొదలుపెట్టారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో పింఛన్ పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదో.. ఎన్నికలనగానే హఠాత్తుగా ఎందుకొచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్ తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామంటే చంద్రబాబు కూడా ఇప్పుడు అదే బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఉన్న పథకాలను గాలికొదిలేసి ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.రెండున్నర లక్షల ఆరోగ్యశ్రీ పరిధిని రూ.ఐదు లక్షలకు పెంచుతానంటూ చంద్రబాబు చెబుతున్నారని.. ఇంతకంటే మోసం ఏమైనా ఉందా? అని నిలదీశారు. రూ.రెండున్నర లక్షల పథకమే ఏ ఆస్పత్రుల్లోనూ అమలు కావట్లేదని, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రూ.500 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేకపోతూ.. మరోవైపు ఆరోగ్య శ్రీ పరిధిని రూ.ఐదు లక్షలకు ఎలా పెంచుతారో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
వ్యవసాయంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో బాబు ఏం మాట్లాడుతారు?
-
వ్యవసాయంపై చంద్రబాబు ఏం మాట్లాడుతారు?
సాక్షి, హైదరాబాద్ : ‘వ్యవసాయం దండగ.. వరి సోమరి పంట’ అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితి సదస్సులో అదే అంశంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఎద్దేవా చేశారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించని చంద్రబాబు వ్యవసాయంపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంత్రులపై నమ్మకం సన్నగిల్లిందా అని ప్రశ్నించారు. విధానపరమైన అంశాలపై మంత్రులు సమాధానం చెప్పాలి, కానీ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పడమేంటని మండిపడ్డారు. సీఆర్డీఏ 10.75 శాతంకు రెండు వేల కోట్ల రూపాయలు సేకరించి గొప్పలు చెబుతుందని విమర్శించారు. 10.50 శాతం కన్నా తక్కువ వడ్డీకి అప్పులు తేగలరా అని కుటుంబరావు సవాల్ చేస్తున్నారని, ఈ సవాల్‌కు తాము సిద్దమని పార్థసారథి స్పష్టం చేశారు. కుటుంబరావు స్థాయి మరిచిపోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కుటుంబరావు ఉన్నాడని అనుమానం కలుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. -
ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో ఎందుకలా?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాకు ముఖం చాటేశారని గుర్తుచేశారు. ప్రతి తెలుగువాడు తలదించుకునేలా ప్రధాని మోదీకి వంగి వంగి చంద్రబాబు దండాలు పెట్టారంటూ మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణమన్నారు. హామీల గురించి అడిగితే వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగుతారా.. ? దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు గతంలో మత్స్యకారులపై కూడా ఇలానే ప్రవర్తించారని చెప్పారు. హక్కుల కోసం పోరాడితే తోలు తీస్తాం, తోక కట్ చేస్తాం అనడం సమంజసమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై పుస్తకం వేసి దేశంలోని అన్ని పార్టీలకు, నేతలకు అందజేస్తామని పార్థసారధి తెలిపారు. -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణం
-
ఇంత దౌర్భాగ్యమైన పాలనా?
సాక్షి, విజయవాడ : దేవీపట్నంలో జరిగిన లాంచీ ప్రమాదం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి విచారం వ్యక్తం చేశారు. దేవిపట్నం సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 8 నెలల కిందట కృష్ణా జిల్లాలో ఇటువంటి ప్రమాదమే జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతులు లేని బోటు యజమానుల నుంచి ముడుపులు తీసుకుని మరిన్ని ప్రమదాలకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవీకాలం ముగిసిపోతుందనే ఆందోళనలో ఉండిపోయి.. ప్రజలకు రక్షణ కల్పించవలసిన వ్యక్తిగా తన బాధ్యతలు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను కాపాడండి, నా ప్రభుత్వాన్ని కాపాడండి అంటూ నిస్సహాయంగా ప్రజలను బాబు అర్ధించడం హాస్యాస్పదమ’ని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఆదేశించారని తెలిపారు. ఆడవాళ్లకు రక్షణ ఏది..? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపుల కోసం తెలుగుదేశం పార్టీ ఇటువంటి అమానవీయ ఘటనలకు తావిస్తోందని ఆరోపించారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనల ద్వారా ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలన తానెక్కడా చూడలేదని ఆయన విమర్శించారు. ఒక్క రంగమైనా అభివృద్ధి చెందిందా..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఏ ఒక్క రంగమైనా అభివృద్ధి చెందిందా అని పార్థసారధి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడడం మాత్రమే బాబుకు తెలుసునని మండిపడ్డారు. -
హోదా విషయంలో చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
-
‘ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు’
సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ మొదటినుంచీ పోరాడుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నారు. సదస్సులు నిర్వహించి ఏపీకి హోదా అక్కర్లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పడానికి సీఎం చంద్రబాబు విఫలయత్నాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మేలును అనేక పోరాటాల ద్వారా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమల్లో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జననేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చివరివరకూ పోరాడుతామని వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు అన్నారు. -
‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు
పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ కృషి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని సారథి అన్నారు. -
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు
చంద్రబాబుపై పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి రాలేమన్న దుర్బుద్ధితో తన కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నేతలకు రాష్ట్ర ఆదాయ వనరులను అప్పజెప్పాలన్న కుతంత్రంతో చంద్రబాబు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం కన్నా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందామని చంద్రబాబు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే చేసిన ఐదు సంతకాలకు వెన్నుపోట్లు పొడిచారన్నారు. బెల్టుషాపులను నిర్మూలిస్తానని రెండో సంతకం చేసిన చంద్రబాబు దాన్ని గాలికి వదిలేసి టీడీపీ కార్యకర్తలకు వాటిని అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. -
మూడేళ్ల పాలనలో బడుగులకు ఏం చేశారు?
శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలు తన మూడేళ్ల పాలనలో ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతిని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. పూలే జయంతిని ఘనంగా నిర్వహించామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే చాలదని, అసలు బలహీన, బడుగు వర్గాల సంక్షే మానికి చేసిందేమిటో చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో బలహీనవర్గాలకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకునే వాళ్లమని, ఎన్నికల తరువాత అది కాస్తా ‘బాబు గారి క్లాస్’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. -
వేతన బకాయిలు సత్వరమే చెల్లించాలి
► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ► ఏపీఎస్ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలేదీక్షలకు సంఘీభావం గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అలంకార్‌సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఏపీఎస్ఏసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనబకాయిలు చెల్లించాలని, విధుల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతూ ఐదు రోజులుగా ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్థసారధి మాట్లాడుతూ ఏపీఎస్ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర పరిపాలన దిశా నిర్దేశం చేసే సంస్థ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఎన్నో సేవలు అందించిందన్నారు. సంస్థలో పనిచేస్తున్న 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వ లోపమన్నారు. సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తూ, ఉత్తరాది రాష్ట్రాల వారికి అధికంగా చెల్లిస్తున్నారన్నారు. ఉద్యోగులును సత్వరమే విధుల్లోకి తీసుకుని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు దోనేపూడి శంకర్, సీహెచ్ బాబూరావు, వైఎస్సార్సీపీ నాయకులు పైలా సోమినాయుడు, గౌస్‌మొహిద్దీన్, మాదు శివరామకృష్ణ, సీఐటీయూ నాయకులు ఎంవీ సుధాకర్, అసోసియేషన్ నాయకులు ఎఎం రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా బాణా సంచా పేల్చేందుకు ఎలాంటి అనుమతులు నిర్వాహకులు తీసుకోలేదు.ఇందుకు కారకులైనవారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వై.అంకినీడు ప్రసాద్,గుడివాడ డీఎస్పీ -
మా బిడ్డను చంపేశారు...
విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన శ్రీ చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత బాధితులకు మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి రామవరప్పాడు (గన్నవరం): శ్రీ చైతన్య కళాశాలలో మృతి చెందిన విద్యార్థి సుబ్బారెడ్డి బంధువులు మంగళవారం ఆందోళన చేశారు. మా బిడ్డ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని కళాశాలకు చెందిన రామన్ భవన్–4లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆనం సుబ్బారెడ్డి మృతి సోమవారం మృతి చెందిన విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా నుంచి సుమారు 30 మంది మృతుడి బంధువులు కళాశాల వద్దకు చేరుకుని తొలుత ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే సుబ్బారెడ్డిని కళాశాల నిర్వాహకులు వెనుకంజలో ఉన్నాడనటం అవాస్తమంటూ సాధించిన మార్కుల లిస్టులను మృతుడి తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, రాధమ్మలు విలేకరులకు చూపించారు. తోటి విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ మా బిడ్డ చనిపోవడానికి కారణమంటూ ఆరోపించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే తలను గోడకేసి కొట్టి, భవనంపై నుంచి తోసేసినట్లుగా ఉందని తమ అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పటమట సీఐ కెనడి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి కొలుసు పార్థసారథి విద్యార్థి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించి, కళాశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు. మార్కులు తక్కువ వస్తాయంటూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని యాజమాన్యం చెబుతుందని, మృతుడి బంధువులు మాత్రం సుబ్బారెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తబరుస్తున్నారన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అనుమానాలకు తావిస్తుందని పోలీసు ఉన్నాతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఈ ఘటనను పోలీసు కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లతానని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి కైలే అనీల్ కుమార్, నిడమానూరు గ్రామ యువజన నాయకుడు చేకూరి చక్రి ఉన్నారు. -
'హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు'
-
'హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు'
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసి రావాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను పదేపదే మోసం చేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. -
కామినేనీ.. నోరు అదుపులో పెట్టుకో
కొలుసు పార్థసారథి, కొడాలి నాని కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సూచించారు. చంద్రబాబు మెప్పు కోసం తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఇష్టానుసారం విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సమాయత్తం కోసం సారథి, కొడాలి నాని బుధవారం కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిపై నోరు పారేసుకుంటే మంత్రి కామినేని కంటే వయసులో చిన్నవాడినైన తాను కైకలూరు నడిరోడ్డుపై నిలబడి ఆయన్ను తిడతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కామినేని మళ్లీ సీటు తెచ్చుకుంటారని, అయితే కైకలూరులో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టంచేశారు. కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అనారోగ్యంతో మరణించే శిశువులను చూశామని, ఈ రాష్ట్రంలో మాత్రం చీమలు, ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఎక్కడైన ఉందా? అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి కామినేని పాలన తీరే కారణమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను మాట్లాడుతూ గత ఎన్నికల్లో గాలివాటున కామినేని గెలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ స్థానిక ప్రజలు తాగునీటి కోసం అల్లాడటానికి మంత్రి కామినేని శ్రీనివాస్ కారణమని విమర్శించారు. ముదినేపల్లిలో ఆయన అనుచరుల చేపల చెరువులకు నీటిని మళ్లించడం వల్లే తాగునీటి ఇబ్బందులు దాపురించాయని వివరించారు. అధికారంతో ప్రశ్నించే వారిని అణగదొక్కలని చూస్తే కార్యకర్తలందరం ఒక్కటై పోరాడతామని హెచ్చరించారు. -
ఖబడ్దార్!
రైతు, డ్వాక్రా రుణమాఫీకి షరతులొద్దు హామీ మేరకు పూర్తిస్థాయిలో రద్దు చేయాలి ఎన్నికల హామీలు అమలయ్యేవరకు నిత్య పోరాటాలే ధర్నాలో వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక విజయవాడ : ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు ఎలాంటి షరతులూ లేకుండా.. పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పార్థసారథి మాట్లాడుతూ రైతులు, మహిళల కంట కన్నీరు కార్చేలా వ్యవహరిస్తే ప్రభుత్వ నాశనమవుతుందన్నారు. రుణమాఫీ సక్రమంగా చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ నాయకులు సిగ్గుపడాల్సిందిపోయి స్వీట్లు పంచుకోవడం విడ్డూరంగాఉందని చెప్పారు. అధికారంలోకొచ్చి ఆరునెలలు అవుతున్నా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 20 శాతం మొదటి విడతగా జమ చేస్తామని, రైతు పేరున బాండ్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంట సాగు కోసం రైతులు రుణాలు తీసుకుంటే.. వారి ఆధార్, రేషన్ కార్డులు ఇతర వివరాలు సేకరించి టీడీపీ ప్రభుత్వం అన్నదాతలను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. దాళ్వా నీటిపై నేటికీ స్పష్టత లేదు.: జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి దాళ్వా పంటకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారో ఇంతవరకు ప్రకటించలేద సారథి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయంపై ఉద్యమాలు నడిపిన దేవినేని ఉమామహేశ్వరరావు నేడు చేతగాని దద్దమ్మలా మారారని ఎద్దేవా చేశారు. గత ఏడాది బస్తా ధాన్యం రూ.1,400 అమ్మితే నేడు రూ.1,050కి కూడా కొనే దిక్కులేదన్నారు. పత్తి, సుబాబుల్ తక్కువ ధరకే కొంటున్నా టీడీపీ పాలకులు రైతుల పక్షాన ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. సుబాబుల్ రైతులకు ఒక కంపెనీ రూ.12 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా రైతుల పక్షాన మాట్లాడి ఇప్పించడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. కౌలు రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదన్నారు. రాజధాని రైతులను ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు... తమకు జీవనాధారంగా ఉన్న భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేది లేదని చెబుతున్న రైతులను స్వయంగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారని సారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో స్పష్టం చేయకుండా టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే వైఎస్సార్సీపీ నేతలు అంతకన్నా అధికంగా స్పందిస్తారని ఆయన హెచ్చరించారు. జనాన్ని మోసపుచ్చలేకే.. జగన్ సీఎం పదవిని వదులుకున్నారు... ఎన్నికల సమయంలో చిత్తూరు పర్యటనలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నప్పుడు తామంతా వెళ్లి చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడని, మీరు కూడా ఆ హామీ ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల పంట రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ రుణాలను మాఫీ చేయడం జరిగే పని కాదని చెప్పారన్నారు. ప్రజలను దగా చేయలేనని, చంద్రబాబు మాదిరిగా పచ్చి అబద్ధాలు ఆడలేనని, ముఖ్యమంత్రి పదవి వచ్చినా, రాకున్నా ప్రజలను మోసం చేయలేనని స్పష్టం చేశారని వివరించారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట నేడు నిజమైందన్నారు. ప్రజలను మోసపుచ్చలేక ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని గుర్తుచేశారు. కొందరు టీడీపీ నాయకులు చంద్రబాబుకు, జగన్‌కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారని, ఈ విషయం నిజమేనని, నక్క చంద్రబాబునాయుడు అయితే నాగలోకం జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామన్నారు... ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులూ లేకుండానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చాక అనేక అడ్డంకులు సృష్టించిందని ధర్నా పరిశీలకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే రైతులు, డ్వాక్రా మహిళలు నమ్మి ఆయనకు ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత రుణాలు రద్దు చేయకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీ కోసం ఇచ్చిన రూ.5 వేల కోట్లు వడ్డీకి కూడా చాలవన్నారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని, టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకాని నేపథ్యంలో, సమయం వచ్చినప్పుడు జుట్టు పట్టుకుంటారని హెచ్చరించారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అదే ధోరణిలో పచ్చని పొలాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకుని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలు వంచేది జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని, ఈ ధర్నా కార్యక్రమం ఆరంభం మాత్రమేనని మోపిదేవి వెంకటరమణ చెప్పారు. తాళం వేసిన తలుపునకే వినతిపత్రం... ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చాంబర్‌కు వెళ్లే దారిలో తాళం వేసిన తలుపునకే వినతిపత్రం అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను, పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, మైలవరం, పెడన, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, బూరగడ్డ వేదవ్యాస్, సింహాద్రి రమేష్, దుట్టా రామచంద్రరావు, పార్టీ నాయకులు దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఆయా నియోజకవర్గాల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పార్టీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఉమాది అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం కాలువ పనులు జరుగుతుంటే ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ పథకంపై దుష్ర్పచారం చేశారని చెప్పారు. మంత్రి పదవి చేపట్టాక.. పోలవరం కాలువ పనులు పూర్తయ్యాయని, ఈ కాలువ ద్వారానే కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేస్తామని నేడు చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, డ్వాక్రా, రైతు రుణమాఫీ జరిగే వరకు ముఖ్యమంత్రి మెడలు వంచి పనిచేయిస్తామన్నారు. పచ్చి మోసకారి.. చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసపుచ్చుతూ దేశంలో పచ్చి మోసకారిగా మారారని వైఎస్సార్ సీపీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణమాఫీపై ధర్నా నిర్వహిస్తామని చెప్పిన తరువాతే ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించి మాఫీ వివరాలు ప్రకటించారని చెప్పారు. ధర్నాలో మాట్లాడుతున్న కొడాలి నాని, చిత్రంలో నేతలు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, రక్షణనిధి, మేకా ప్రతాప్, కల్పన, ఉదయభాను, జోగి రమేష్, వేదవ్యాస్, గౌతంరెడ్డి, సింహాద్రి, దుట్టా, దూలం నాగేశ్వరరావు తదితరులు (ఇన్సెట్) చిలకలపూడి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న కొలుసు పార్థసారథి -
ఫ్లెక్సీ వివాదంలో పార్థసారథిపై దాడి
రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో టీడీపీ కార్యకర్తల వీరంగం వైఎస్సార్ సీపీ మహాధర్నాకి ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం పెనమలూరు : పెనమలూరు మండలం పోరంకి సెంటర్లో బ్యానర్‌పై తలెత్తిన వివాదాన్ని పరిశీలించటానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో సారథి కారు డ్రైవర్ గురువిందపల్లి నవీన్‌పై టీడీపీ ఈ కార్యకర్తలు దాడి చేసి, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ప్రేక్షకపాత్ర విహ ంచారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సారథికి అండగా నిలువగా పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్లు పోరంకి సెంటర్లో పార్టీ నాయకుడు గుడికందుల శివకోటి పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీని పోరంకి సెంటర్లో కడుతున్నారు. టీడీపీ నేతలు దానిని బుధవారం రాత్రి తొలగించారు. దాని స్థానంలో టీడీపీ బ్యానర్ కట్టారు. ఈ విషయం పార్థసారథి దృష్టికి నేతలు తీసుకు వెళ్లారు. ఆయన పోరంకి సెంటర్‌కు వచ్చి వైసీపీ బ్యానర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి సారథిపై దౌర్జాన్యానికి దిగారు. నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. సారథి కారు అద్దాలు రాళ్లతో పగులగొట్టి డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. సారథి వెంటనే వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలో సారథిపై దాడి జరుగగా పోలీసులు దాడి చేసిన వారిని వదిలేసి సారథిని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలు, చూడటానికి వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మా బ్యానర్ తొలగించి దౌర్జన్యం చేశారు : సారథి వైఎస్సార్ కాంగ్రెస్ బ్యానర్ తొలగించి తనపై దాడి చేశారని పార్థసారథి ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ బ్యానర్లు కట్టినా ఇలానే చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు సీపీ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. తన కారు అద్దాలు పగుల కొట్టి దళితుడైన తన కారు డ్రైవర్ నవీన్‌పై దాడి చేశారన్నారు. ఈ దాడికి పాల్పడినవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల రాస్తారోకో కంకిపాడు : కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కి సారథిని తరలించడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసనగా స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. -
దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పామర్రు : దాళ్వా సాగుపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని దక్షిణ కృష్ణా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాళ్వా సాగుపై ఆధారపడి అనేక మండలాలు ఉన్నాయని, వాటి కి సకాలంలో సాగునీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సాగుకు నీరివ్వని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. రైతులకు తగు న్యాయం జరిగేంతవరకూ వారి పక్షాన పోరాడతామన్నారు. హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు... ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందని సారథి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తూ వ్యవసాయ రుణాలు కాదు.. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ రుణాల్లో ట్రాక్టరు, మోటారు తదితరాల కోసం తీసుకున్న రుణాలు కూడా ఉంటాయని, వాటినీ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెలలో చేస్తాం, వచ్చే నెలలో చేస్తాం అంటూ ఆరు నెలల పాటు కాలం గడుపుతోందన్నారు. ఈ నెల ఐదున వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల నాలుగున రైతు రుణాల విధి విధానాలపై చర్యలు తీసుకుంటామని మాయ మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ చేపట్టిన కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకే ఈ విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ప్రజలు దీనిని అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. రైతు సాధికారత ద్వారా ఇచ్చే 20 శాతం నిధులు రైతు రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలను చైతన్యవంతుల్ని చేసి ధర్నాలో పాల్గొనేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్‌లకు వచ్చిన జాబితాలను చూసి రైతులు భయాందోళనలు చెందుతున్నారన్నారు. ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవనే నెపంతో రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పేద వర్గాలకు ఇవ్వాల్సిన పింఛన్లను అన్యాయంగా తొలగించారని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల పింఛన్లను, 23 లక్షల రేషన్ కార్డులను తొలగించి వారి ఉసురుపోసుకుందన్నారు. రాజకీయ కక్షలతో ఈ విధంగా తొలగించటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నష్టపోయిన వారి తరఫున తాము పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరేవరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేసి వారి తరఫున పోరాడతామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చే విధంగా పార్టీ కృషి చేస్తుందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినవారు, నిధులు మంజూరు కాని ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ ధర్నాకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానంపై ఈ నెల ఐదో తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు అందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మందా శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ మొబిన్, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి -
అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళనే
' రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ సీపీ హక్కుల కమిటీ పర్యటన ' శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు పర్యటనలో రైతులు, కూలీలు, కౌలు రైతులకు భరోసా ఇచ్చిన నేతలు ' రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు.. రైతులకు సర్కారు అన్యాయం చేస్తే సహించం ' రాజధాని పేరుతో భూ దందాను అంగీకరించం ' చివరి వరకు రైతులకు అండగా ఉంటాం ' అధికార పార్టీ నేతల అసత్య ప్రచారాలను నమ్మొద్దు ' ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి ' అన్నదాతను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబుపై మండిపాటు గుంటూరు: రాజధాని భూసేకరణ విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేత కొలుసు పార్థసారథి హెచ్చరించారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ఆయూ ప్రాంతాల వారికి అన్యాయం చేయూలని చూస్తే సహించబోమని స్పష్టంచేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నియమించిన ఈ కమిటీ సభ్యులు మూడో విడత పర్యటనలో భాగంగా బుధవారం తుళ్ళూరు మండలంలోని శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో రైతులు, కూలీలు, కౌలు రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాజధాని పేరిట జరుగుతున్న భూ దందాను అంగీకరించబోమన్నారు. స్థానికులు బెంగ పడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని చెప్పారు. భూములివ్వడానికి రైతులు సంతోషంగా ముందుకొస్తున్నారంటూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలన్నీ వాస్తవ విరుద్ధమేనని తమ పర్యటన ద్వారా స్పష్టమైందని తెలిపారు. భూమికీ రైతుకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎవరూ డబ్బులతో తూచలేరని చెప్పారు. అనుభవజ్ఞుడివని నీకు ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పచ్చటి పంటలతో అలరారే నేలను తీసుకుని.. నీరు, పైరు లేని సింగపూరులా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలకడమంత సిగ్గుచేటు ఇంకోటి లేదని అన్నారు. కేవలం రెండు బస్సుల్లో హైదరాబాద్ వెళ్ళిన రైతులు చెప్పిందే వేదం కాదని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రైతు భూమినే పెట్టుబడిగా పెట్టి రాజధాని నిర్మించే యత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని పార్థసారథి హెచ్చరించారు. పొలాలపై ఆధారపడే రైతులు, కూలీలు, కౌలు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నదే తమ ఆవేదన అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో అందరి అభిప్రాయాలను తీసుకొని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అవసరమైతే పార్లమెంట్ వరకు దీనిపై పోరుబాట పడతామన్నారు. చివరి వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. రైతులందరి అభిప్రాయాలను క్రోడీకరించి, కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. బాబు చెప్తున్న దానికి చట్టబద్ధత లేదు... రాజధాని విషయంలో చంద్రబాబు చెప్తున్న ఏ అంశానికీ చట్టబద్ధత లేదని వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర నేత నాగిరెడ్డి చెప్పారు. ప్రజలను తరలించాలంటే భూసేకరణ చట్టం ఒక్కటే సరిపోదని చెప్పారు. పునరావాసం, పునర్నిర్మా ణం చట్టాన్ని కూడా అమలు చేయాలని తెలి పారు. బాబు మొండిపట్టు విడనాడాలనీ, జరీ బు భూముల జోలికి రాకూడదని హితవు పలి కారు. దీనిపై అసెంబ్లీలోనే కాక అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల సమక్షంలో బహిరంగంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ముందు అనుమానాలు నివృత్తి చేయాలి.. రాజధాని గ్రామాల రైతుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే భూ సమీకరణ గురించి బాబు మాట్లాడాలని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర క్రిస్టీనా సూచించారు. ఈ పర్యటనలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, కొత్త చిన్నపరెడ్డి, సయ్యద్ మహబూబ్, మేరిగ విజయలక్ష్మి, సయ్యద్ హబీబుల్లా, కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు, పురుషోత్తం, తుమ్మూరు వరప్రసాద్‌రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదువేల కోట్లు ఎలా సరిపోతాయి?
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విజయవాడ: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి రూ.1.2 లక్షల కోట్లు అవసరంకాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు సాధికార సంస్థ పేరుతో ఐదువేల కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రూ. 1.2 లక్షల కోట్ల అప్పుపై రూ. 25 వేల కోట్లు వడ్డీ ఉందని.. కనీసం చంద్రబాబు ఇచ్చిన రూ. 5 వేల కోట్లు వడ్డీకి కూడా సరిపోదని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే రుణమాఫీ హామీ నుంచి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఆరు నెలలు కాలక్షేపం చేశారని విమర్శించారు. విజయవాడలో శనివారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు రాగా సమీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరయ్యారు. సమీక్ష అనంతరం పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుపై మండిపడ్డారు. గమనిక ‘నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ నేతల పర్యటన’ శీర్షికతో శనివారం నాడు ప్రచురితమైన వార్తలో పొరపాటున సాగి ప్రసాదరాజు ఫొటో బదులుగా వేరే ఫొటో ప్రచురితమైంది. గమనించగలరు. -
ప్రజలను మభ్యపెట్టొద్దు
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, కె.పి.సారథి విజయవాడ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా టీడీపీ నేతలు కొందరు అనవసర ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీమంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత కేసును ఉదహరిస్తూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నాయకులు దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కోర్టులో పెండింగులో ఉన్న కేసు విషయంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాబోయే తీర్పు తమకు ముందుగా తెలిసినట్లుగా, లేదా తాము తీర్పును ప్రభావితం చేయగలమనే ధైర్యంతో వారు మాట్లాడడం శోచనీయమన్నారు. ఓ మంత్రి జగన్‌కు 6 వేల సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని, మరో మంత్రి వేల కోట్లు జరిమానా వేస్తారని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో జరుగుతుందనే భావన ప్రజల్లో కల్పించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కోర్టు కేసులన్నింటిలో ఒకే తరహాలో శిక్షలు పడవని పార్థసారథి అన్నారు. ఒక కేసుకు.. మరో కేసుకు సంబంధం ఉండదని, ఆయా కేసుల్లో సాక్ష్యాధారాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు వస్తుంటాయన్నారు. వాస్తవాన్ని వక్రీకరించి చట్టం, న్యాయం అంతా తమకే తెలిసినట్లుగా కొందరు టీడీపీ నేతలు జగన్‌పై బురదజల్లే విధంగా దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా జగన్మోహన్రెడ్డి ఇప్పటివరకు రాజ్యాంగబద్ధమెన పదవిని నిర్వహించలేదన్నారు. చంద్రబాబునాయుడు దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవించారన్నారు. చంద్రబాబు తన పాలనలో వ్యక్తిగతంగా వచ్చిన ఏలేరు స్కాం, మద్యం స్కాం, ఐఎంజీ భూముల కుంభకోణం వంటి కేసుల్లో వచ్చిన ఫిర్యాదులపై సుప్రీం కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన కేసులపై చంద్రబాబు ఎందుకు విచారణకు సిద్ధం కాలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా మరే దర్యాప్తు సంస్థతోనూ చంద్రబాబు విచారణ జరిపించుకోకుండా, కనీసం కోర్టులలో కూడా విచారణ జరుగకుండా చేసుకున్నారని చెప్పారు. ఎవరైనా తమ నాయకుడిపై కేసులు తిరగదోడుతారనే ఆందోళన వారిలో కనపడుతోందని సారథి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌నే చెప్పులతో కొట్టించిన ఘనత ఉన్న బాబు సినీ నటుడు బాలకృష్ణ తన అల్లుడి సాయంతో అదే పని చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అసత్య ప్రచారాన్ని మానుకోవాలని సారథి హితవు పలికారు. -
టీడీపీవి మోసపూరిత ప్రకటనలు
కొలుసు పార్థసారథి శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించి రైతులకు న్యాయం చేస్తామంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా కన్వీనర్ కొలుసు పార్థసారథి విమర్శించారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం లో జెడ్పీటీసీ కైలే జ్ఞానమణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణలో కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలను అమలు చేస్తే రైతులకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని.. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. రైతులకు రంగుల కలలు చూపిస్తున్నారు... సింగపూర్, మలేషియా తరహాలో అభివృద్ధి చేస్తామంటూ రైతుకు రంగుల కలలు చూపిస్తోందని సారథి విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో 4500 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఉందని, నూతన రాజధాని ఏర్పాటుకు లక్ష ఎకరాలు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రకటనలు ఇవ్వడం వారికి ఎలాంటి ప్రణాళికా లేదని తెలియజేస్తోందన్నారు. రాజధాని ఏర్పాటుకు, ఏ శాఖకు ఎంత భూమి కావాలనేదానిపై ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 18,500 ఎకరాల రెవెన్యూ, అటవీ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి రాజధాని ఏర్పాటుకు కేటాయిస్తే భూసేకరణ అవసరం లేదని సారథి అన్నారు. టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను ఏమారుస్తూ ఎన్నికల హామీలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఓట్లు దండుకుని.. రోడ్డున పడేశారు రైతు, డ్వాక్రా రుణాలు చెల్లించొద్దని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకుని, ఇప్పుడు రుణాలు రద్దు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారని సారథి మండిపడ్డారు. గతేడాది ఖరీఫ్ రైతులకు బ్యాంకర్లు రూ.1,350 కోట్ల వ్యవసాయ రుణాలివ్వగా, ఈ ఏడాది ఇప్పటికి రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది రూ.1,050 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. పార్టీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే ప్రజల పక్షాన నవంబర్ 16న మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ జ్ఞానమణి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వెనకటి రోజులకు..
సామాజిక పింఛన్లు ఇష్టానుసారం తొలగిస్తున్నారు వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి ఆగ్రహం సాక్షి ప్రతినిధి, విజయవాడ : సామాజిక పింఛన్ల సర్వే పేరుతో దారుణాలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పింఛనుదారుల పేర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పింఛను తీసుకుంటున్న వారు మరణిస్తేనే, ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేవారని, ఇప్పుడు అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుం టున్న వారి పేర్లు అకారణంగా తొలగిస్తున్నారని విమర్శించారు. ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో అర్హులైన 30 మంది పింఛన్లను తొలగించారని తెలిపారు. వీరందరికీ పింఛన్లు తొలగించినట్లు సంతకం పెట్టకపోతే ఊర్లో ఉన్న లబ్ధిదారులందరికీ పింఛన్లు రావని గ్రామ సర్పంచిని ఎంపీడీవో బెదిరిస్తున్నాని చెప్పారు. ఈ విషయంపై తాను ఎంపీడీవోను ప్రశ్నించగా... ‘మాకు సంబంధం లేదని, కమిటీ వారు మాత్రమే తొలగిస్తున్నారు..’ అని బదులిచ్చారని సారథి వివరించారు. సర్పంచిని ఎందుకు బెదిరిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. పింఛన్లు తొలగించిన అందరికీ రెండున్నర ఎకరాల పొలం ఉందని సర్వే కమిటీ సభ్యులు నిర్ధారించినట్లు ఎంపీడీవో చెబుతున్నారని, నిజంగా పొలం ఉందా.. ఉంటే పండుతుందా.. అనే వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించాలని ఆయన కోరారు. ప్రయివేటు ఉద్యోగుల కుటుంబాల్లో లబ్ధిదారులను తొలగించవద్దని సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమిస్తామని సారథి చెప్పారు. -
నిస్వార్థ నాయకుడు కాటమరాజు : సారథి
చందర్లపాడు : ఆళ్ల కాటమరాజును ఆదర్శంగా తీసుకుని నేటితరం నాయకులు ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ కృష్ణా అధ్య క్షుడు కొలుసు పార్థసారథి సూచించారు. లక్ష్మీపురంలో సోమవారం కాటమరాజు సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన పార్థసారథి మాట్లాడుతూ కాటమరాజు దమ్ము ధైర్యం కలగలసిన నాయకుడని కొని యాడారు. తాను ఉయ్యూరు శాసన సభ్యునిగా పనిచేస్తున్న సమయంలో శాసన సభ్యుని కోటాలో గుడిమెట్ల పంచాయతీకి కాలనీ ఇళ్లను మంజూరు చేయించిన ఘనత కాటమరాజుదేనన్నారు. మంత్రి పదవికన్నా, ఎమ్మెల్యే పదవికన్నా సర్పంచి పదవి ఎంతో గొప్పదన్నారు. అందుకు కాటమరాజే నిదర్శనమన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్లపాటు గ్రామ సర్పంచిగా పనిచేయడం మామూలు విషయం కాదన్నారు. కాగా అంతకుముందు కాటమరాజు విగ్రహాన్ని మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య ఆవిష్క రించారు. పార్థసారథి, రఘువీరారెడ్డి కాటమరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, మొండితోక అరుణ్, బొగ్గవరపు శ్రీశైలవాసు, బొబ్బిళ్లపాటి గోపాలకృష్ణ సాయి, డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, యాదవ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు లాకా వెగళరావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి చింకా వీరాంజనేయులు, నందిగామ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బోడపాటి బాబూరావు, మాజీ ఎమ్మెల్య్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, నందిగామ ఏఎంసీ మాజీ చైర్మన్ పాలేటి సతీష్, తెలుగుదేశం నాయకులు కోట వీరబాబు, చందర్లపాడు జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్, బీసీ నాయకులు దొంతి బోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పొదుపును నిర్వీర్యం చేశారు : సారథి
నందిగామ : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీని అమలు చేయకపోవడంతో పొదుపు వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మాట తప్పిన ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటతప్పడంతో మహిళలు కొత్త రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు రూ.200 కోట్ల రుణాలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. టీడీపీ ఎన్నికల హామీ మేరకు వ్యవసాయ అనుబంధ రుణాలన్నీ రద్దు చేయాలని సారథి డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో కార్యాలయ ఇన్చార్జి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎన్.శివనాగేశ్వరరావు, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాసాచారి పాల్గొన్నారు.