
‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు
పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు.
ఈ సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ కృషి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని సారథి అన్నారు.