Agrigold case
-
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్ చేసినట్లు కోర్టు గుర్తించింది. రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.ఇక.. ఇప్పటికే అగ్రిగోల్డ్ కేసులో 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఇది చదవండి: బినామీ దందా.. భారీ ముడుపులుచదవండి: కాకి లెక్కలు కుదరవ్! -
జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా ఉన్న జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం (ఆగస్ట్23) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగిందిరాజీవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజీవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జోగి రాజీవ్‌తో పాటు, సర్వేయర్ రమేష్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జోగి రాజీవ్ కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను ఈ నెల 13న ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కాకి లెక్కలు కుదరవ్!
సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్‌దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్ 30 నాటికి 1,247 మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో అక్రమంగా డిపాజిట్ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్‌దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్‌దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్‌దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్‌దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. -
ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీ జప్తుచేసి ఉండగా, తిరిగి అవే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జప్తుచేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్ట ఉద్దేశాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. పైగా డిపాజిటర్లకు కష్టం కలిగించేలా కూడా ఉన్నాయని స్పష్టంచేసింది. అందువల్ల ఈడీ ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అదే సమయంలో సీఐడీ జప్తు ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉన్నాయని తేల్చిచెప్పింది. అలాగే.. ‘డిపాజిటర్లందరూ ప్రధానంగా ఏపీకి చెందిన వారే. జప్తు ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. తమ కష్టార్జితాన్ని వారు డిపాజిట్ల రూపంలో కంపెనీలో పెట్టారు. తాము చెల్లించిన ఈ డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మనీలాండరింగ్ చట్టం కింద అడ్జుడికేటింగ్ అథారిటీ వద్దకు వెళ్లి తేల్చుకోవడం డిపాజిటర్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ఏలూరులోని ప్రత్యేక కోర్టే ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చడం డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది. అందువల్ల ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కొట్టెస్తున్నాం’.. అని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాక.. అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ జప్తుచేయడాన్ని ప్రత్యేక న్యాయస్థానం కూడా సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. డిపాజిటర్లను మోసంచేసి కూడబెట్టిన భారీ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాలను తిరిగి డిపాజిటర్లకు చెల్లించడమే డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశమన్న ప్రభుత్వ వాదనతో కూడా ఏకీభవించింది. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ఈడీకి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పునిచ్చారు. ఈడీ జప్తు ఉత్తర్వులపై పిటిషన్లు.. మరోవైపు.. అగ్రిగోల్డ్ నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన వారూ అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయా ఫ్లాట్ల యజమానులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. రుణం ఇచ్చాం కాబట్టి, ఆస్తులను వేలంవేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు సైతం కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున పీఎస్పీ సురేష్‌కుమార్, పూజారి నరహరి, సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న కోర్టు గతేడాది ఆగస్టులో తీర్పు రిజర్వ్ చేశారు. ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రవి ఈ వ్యాజ్యాలన్నింటిపై తన తీర్పును వెలువరించారు. ఆస్తి జప్తు ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు.. ‘జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లందరికీ సమానంగా పంచే అధికారాన్ని ప్రత్యేక కోర్టుకు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కల్పిస్తోంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్–6లో ఉన్న ఏ నిబంధన కూడా మనీలాండరింగ్ చట్టం సెక్షన్–5లో లేదు. జప్తుచేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు సమానంగా పంపిణీ చేయాలన్న నిబంధన ఏదీ కూడా మనీలాండరింగ్ చట్టంలో లేదు. ఈ విషయంలో అడ్వొకేట్ జనరల్ వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. కేవలం ఆస్తి జప్తు చేయడం ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు. ఆస్తి జప్తు బాధితులను రక్షించలేదు. ఈ కారణాలరీత్యా 2015లో సీఐడీ జప్తుచేసిన ఆస్తులను తిరిగి 2020లో ఈడీ జప్తుచేస్తూ జారీచేసిన ప్రాథమిక ఉత్తర్వులను కొట్టెస్తున్నా’.. అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. ఆస్తుల జప్తునకు సంబంధించిన అన్నీ అంశాలను ఏలూరులోని ప్రత్యేక కోర్టు ముందే తేల్చుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
ధర్మాసనం ఆదేశాలుండగా.. అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఎలా?
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారానికి సంబంధించిన వివాదాలన్నింటిపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అలాంటప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు వ్యవహారాన్ని అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఎలా పంపగలమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో తాము కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేగాక అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం జప్తుచేస్తూ సీఐడీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రుణం ఇచ్చాం కాబట్టి.. ఆస్తులను వేలం వేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారిస్తున్నారు. జప్తుచేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు ఉందని రాష్ట్ర ప్రభుత్వం గత వారం హైకోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది భాస్కరరావు వాదనలు వినిపిస్తూ.. తాము సుమారు రూ.2 వేలకోట్ల విలువైన ఆస్తులను జప్తుచేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీచేశామన్నారు. తమ జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే చట్ట ప్రకారం అడ్జ్యుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించాలే తప్ప హైకోర్టును కాదన్నారు. ఏపీ సీఐడీ జారీచేసిన జప్తు ఉత్తర్వుల కంటే ఈడీ జారీచేసిన జప్తు ఉత్తర్వులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు అన్ని వివాదాలపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం గతంలోనే ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ధర్మాసనం ఆదేశాలకు విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి వెళ్లాలని తామెలా ఆదేశాలివ్వగలమని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని భాస్కరరావును ఆదేశించారు. విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. -
కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు..
సాక్షి, అమరావతి: ‘కేంద్ర చిట్‌ఫండ్ చట్టం పాటించం.. రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం మాకసలు వర్తించదు.. కంపెనీల చట్టం పేరిట చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తున్నాం.. రశీదుల రూపంలో డిపాజిట్లు సేకరిస్తాం.. మేం ఏం చేసినా ప్రభుత్వం ప్రశ్నించకూడదు.. చట్టం అడ్డురాకూడదు.. చందాదారులు నిలువునా మోసపోయే పరిస్థితి ఉన్నా ఎవరూ అడగకూడదు.. ఎందుకంటే రామోజీరావు ఏం చేసినా సరే ప్రశ్నించకూడదన్న అలిఖిత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతోంది’ .. ఇదీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ అడ్డగోలు వాదన. ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతోసహా దొరికిపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చందాదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆ సంస్థకు చెందిన రూ.793.50 కోట్ల చరాస్తులను సీఐడీ అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని వక్రీకరిస్తూ మొసలి కన్నీరు కారుస్తోంది. తమ చందాదారులను బెదిరించేందుకే ఇలా చేస్తున్నారంటూ రామోజీరావు ఈనాడు పత్రికలో దుష్ప్రచారానికి తెరతీశారు. అందులో కూడా తాము చట్టానికి అతీతమన్నట్టుగానే వాదించడం విస్మయపరుస్తోంది. కేంద్ర చట్టాన్ని ఎందుకు పాటించరు..? రాష్ట్ర చట్టం ఎందుకు వర్తించదు...? మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రామోజీరావు చేస్తోంది చిట్‌ఫండ్ వ్యాపారమన్నది అందరికీ తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం చిట్‌ఫండ్ సంస్థల చందాదారుల హక్కుల ప్రయోజనం కోసం 1982లో చేసిన కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని తాము పాటించబోమని రామోజీరావు, ఆయన కోడలు శైలజ చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు ఆ చట్టాన్ని పాటించబోమని చెప్పడంలోనే ఈ దేశంలో చట్టాలపట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదన్నది స్పష్టమైపోయింది. ఇక ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు అన్ని రాష్ట్రాలు డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాలను చేశాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వమే 1999లో రాష్టడిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేసింది. కానీ ఆ చట్టం కూడా తమకు వర్తించదని మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాదిస్తోంది. ఎందుకంటే తాము డిపాజిట్లను సేకరించడంలేదంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. కానీ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఆ సంస్థ అనధికారికంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్టు నిగ్గు తేలింది. చిట్టీలు పాడినవారికి ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా కొంత మొత్తాన్ని తమ వద్దే అట్టిపెడుతోంది. అందుకు ఓ రశీదు ఇస్తోంది. ఆ రశీదులో పేర్కొన్న మొత్తంపై 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే రశీదు రూపంలో అనధికారికంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం. కానీ రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పలువురు చందాదారులు కూడా సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. అంటే రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు కచ్చితంగా వర్తిస్తుందని న్యాయ నిపుణులు తేల్చి చెప్పారు. అక్రమంగా నిధుల మళ్లింపు.. సొంత పెట్టుబడులు తాము నిధులను మళ్లించలేదని చెబుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రజల్ని మరోసారి మోసగించేందుకు యత్నించింది. కానీ చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా బ్రాంచి కార్యాలయాల్లోని నిధులను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించినట్టు సీఐడీ సోదాల్లో వెల్లడైంది. చట్ట ప్రకారం బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేనే లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. చందాదారులను భయపెట్టేందుకు కాదు.. వారి హక్కుల పరిరక్షణకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చరాస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతిఇవ్వడంపైన కూడా ఆ సంస్థ గగ్గోలు పెడుతోంది. తమ చందాదారులను బెదిరించేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని వాదించడం విస్మయపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణకు ముందస్తు చర్యగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీలు వేయడంలేదు. కేంద్ర చట్టాన్ని పాటించాలని రాష్ట్ర చిట్స్ రిజిస్ట్రార్ చెప్పారు. అందుకు సమ్మతించకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం నిలిపివేసింది. దాంతో ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ కోల్పోయింది. అప్పటికే కొనసాగుతున్న చిట్టీలను పాడినవారికి చిట్టీల మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేకపోతోంది. పలువురు చందాదారులు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం ఉండటంలేదు. వారిలో పలువురు ఇప్పటికే సీఐడీ అధికారులను కూడా ఆశ్రయించారు. దాంతో పరిస్థితిని విశ్లేషించిన సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ మున్ముందు చందాదారుల చిట్టీల మొత్తం మరింతగా ఎగవేసే అవకాశాలున్నాయని గుర్తించింది. ఆ సంస్థ హఠాత్తుగా బోర్డు తిప్పేసినా, కార్యకలాపాలు నిలిపివేసినా చందాదారులు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించింది. దాంతో చందాదారుల హక్కుల పరిరక్షణ కోసమే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన చరాస్తులు రూ.793.50 కోట్లను జప్తు చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతినిచి్చంది. ఇందులో చందాదారుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశమే తప్ప వారిని బెదిరించాలనే తలంపే ప్రభుత్వానికి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అగ్రి గోల్డ్ అయితే అలా.. మార్గదర్శి అయితే ఇలానా..!? చందాదారులు ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ తమ చరాస్తులను జప్తు చేశారంటూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ గతంలో అగ్రిగోల్డ్ సంస్థపై కూడా ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. కానీ అగ్రిగోల్డ్ సంస్థ అక్రమ డిపాజిట్ల సేకరణ, వాటిపై వడ్డీలు సక్రమంగా చెల్లించకపోవడం, డిపాజిట్ల నిధులను అక్రమ పెట్టుబడులుగా తరలించడం మొదలైన వాటిని ప్రభుత్వమే గుర్తించింది. ఆ అంశాలను చూపిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేయడం గమనార్హం. ఏకంగా అమరావతిలో ఉన్న హాయ్‌ల్యాండ్ భూములను తమ పేరిట బదిలీ చేయాలని టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత బెదిరించడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. అందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సమ్మతించలేదు. దాంతో డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ కోసం కేసు నమోదు చేసి అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. దీనిపై అప్పట్లో ఈనాడు పత్రిక ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ వార్తలు రాసింది కూడా. అదే రీతిలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ తమ చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేని పరిస్థితి ఉన్నందునే ప్రభుత్వం ఆ సంస్థ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతిచ్చింది. నాడు అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తును సమర్థించిన ఈనాడు పత్రిక.. ఇప్పుడు మాత్రం మార్గదర్శి ఆస్తుల జప్తును వ్యతిరేకిస్తుండటం గమనార్హం. అంటే.. అగ్రిగోల్డ్ వ్యవహారంలో అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, తమ దాకా వచ్చేసరికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకూడదన్నది రామోజీరావు విధానమన్నది స్పష్టంగా అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు. అగ్రిగోల్డ్‌కు వర్తించిన చట్టాలు మార్గదర్శికి వర్తించవా? ‘చందాదార్లను భయపెట్టే యత్నం’ అంటూ ఈనాడు ప్రచురించిన వార్తలోని అంశాలను ఎవరూ చెప్పలేదు. ఈనాడే ఓన్ చేసుకుంది. అగ్రిగోల్డ్‌పై చర్యలు కూడా ఇలాగే మొదలయ్యాయి. అగ్రిగోల్డ్‌పై ఏ ఫిర్యాదులూ లేకుండానే కేసులు, అరెస్టులు జరిగాయి. అప్పుడు ఇదే పత్రిక మొదటి పేజీలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసింది. అప్పుడు అగ్రిగోల్డ్‌ను కాపాడేందుకు ఇలాంటి వార్తే ఎందుకు రాయలేదు? అగ్రిగోల్డ్‌కు వర్తించిన చట్టాలు, సూత్రాలు ఇప్పుడు మార్గదర్శికి వర్తించవా? మార్గదర్శిదే వ్యాపారం కానీ, అగ్రిగోల్డుది వ్యాపారం కాదా? – సీనియర్ జర్నలిస్టు దారా గోపి. ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు -
‘అవ్వా’ వెనకున్న అదృశ్యశక్తులెవరు?
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో తెర వెనుక కొన్ని అదృశ్యశక్తులు సీఐడీ దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. 2016 నుంచి 2019 మధ్య బినామీ ఆస్తుల వ్యవహారంలో అప్పటి దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కాగా, తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు సీఐడీపై ఒత్తిడి తేవడం మళ్లీ వివాదాస్పదమైంది. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు వెనకున్న అదృశ్యశక్తులు ఎవరనేది సీఐడీ అధికారులను కలవరపెడుతోంది. బినామీ ఆస్తులు, వాటి సర్వే నంబర్లు, బినామీ కంపెనీల డైరెక్టర్లు.. ఇలా అనేక విషయాలపై క్లారిటీ ఇవ్వాలని సీఐడీ నోటీసులిచ్చి విచారిస్తున్న తరుణంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు పోలీస్ పెద్దలను కలసి ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసు పునర్విచారణ ఎటు వెళ్తుంది? ఏం జరుగుతుంది?అన్నదానిపైఅయోమయం నెలకొంది. అసలు ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులకు అవ్వా వెంకటరామారావుకు ఉన్న సంబం ధం ఏంటన్నదానిపై సీఐడీలో చర్చ సాగుతోంది. బినామీ ఆస్తులకోసమేనా?.. బినామీ ఆస్తుల కొనుగోలు కోసమే సదరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. మహబూబ్‌నగర్‌లో 156 ఎకరాలు, మరో 76 ఎకరాల వ్యవహారంలో ఓ మాజీ కానిస్టేబుల్ బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనకోసం కూడా ఆ ప్రజాప్రతినిధులు పోలీస్ పెద్దలను ప్రభావితం చేయాలని చూశారని సమాచారం. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకు అటాచ్మెంట్ కానీ వందల ఎకరాల భూమిని వీరు బినామీ పేర్ల మీద కొనుగోలు చేస్తున్నారని సీఐడీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆస్తుల కోసమే ప్రజాప్రతినిధులు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవునని, లేదని... అగ్రిగోల్డ్ ఆస్తులు, బినామీ కంపెనీల పేరిట కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై ఆ సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను సీఐడీ రెండుసార్లు ప్రశ్నించింది. బినామీ భూములను ఇతర రాష్ట్రాల పోలీసులు అటాచ్ చేశారా అని ప్రశ్నించగా, అవునని ఒకసారి.. లేదని రెండోసారి చెప్పినట్లు సీఐడీ వెల్లడించింది. బినామీ ఆస్తుల విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కొన్నిచోట్ల అటాచ్మెంట్ చేయకుండా అగ్రిగోల్డ్ పెద్దలే లాబీయింగ్ జరిపినట్లు సీఐడీ తాజా విచారణలో బయటపడినట్లు తెలిసింది. అవ్వా.. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దర్యాప్తు విభాగాలకు సీఐడీ లేఖలు రాసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులు, బినామీ కంపెనీల పేర్ల మీద ఉన్న భూములను అటాచ్ చేస్తే వాటి జీవోలు పంపాలని కోరింది. మూడేళ్లు పట్టించుకోలేదు.. అగ్రిగోల్డ్ బినామీ కంపెనీల భూములను అటాచ్మెంట్ చేయకుండా వ్యవహరించిన గత దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. పోలీస్ పెద్దలు స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. బినామీ ఆస్తులను గుర్తించకుండా మూడేళ్లు వృథా చేయడం.. తీరా ఆస్తులు బదిలీ అయిన తర్వాత నోటీసులివ్వడం, హడావుడి చేయడంపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. -
రంగంలోకి సీనియర్ ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో నిందితులు, గత దర్యాప్తు అధికారులు కలిసి చేసిన కుట్రను మరింత కొనసాగించేందుకు కొందరు పెద్దలు సిద్ధం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. బినామీ ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ పెద్దలు మధ్యవర్తులతో మళ్లీ వాటిని చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిలా పాపం తలా పిడికెడు లెక్కన కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన్ను కాపాడేందుకు కంకణం... అగ్రిగోల్డ్ కేసులో బినామీ ఆస్తులను గుర్తించకపోవడం, అటాచ్మెంట్ చేయకుండా ఉండేందుకు గత దర్యాప్తు అధికారికి చేరిన రూ. కోటి వ్యవహారంలో ఇప్పుడు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణకు ఆదేశాలివ్వాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బినామీ ఆస్తులు కొనుగోలు వ్యక్తికి...: అగ్రిగోల్డ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఏడాది తిరగకుండానే 200 శాతం ఎక్కువ ధరకు అమ్మకం సాగించిన ఓ మాజీ కానిస్టేబుల్‌ను కాపాడేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగడం ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. ఆయనతోపాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సైతం రంగంలోకి దిగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బినామీ ఆస్తులు రిజిస్ట్రేషన్‌తోపాటు చేతులు మారకుండా ఉండేందుకు ఐజీ (స్టాంపులు–రిజిస్ట్రేషన్)కి సీఐడీ రాసిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సైతం ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాజీ కానిస్టేబుల్‌కు బడా రాజకీయ నాయకులతో సంబంధం ఏమిటన్న దా నిపై ఇప్పుడు పోలీస్ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలి సింది. బినామీ ఆస్తుల బదలాయింపులకు, వారికి సంబంధం ఏమిటన్న అంశాలపై కూపీలాగే పనిలో పోలీస్ పెద్దలున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తుల పేరిట అగ్రిగోల్డ్ పెద్దలు... అగ్రిగోల్డ్ సంస్థ నుంచి డబ్బులు పెట్టుబడిగా పెట్టించి బినామీ కంపెనీలపై భారీగా భూములు కూడబెట్టిన అగ్రిగోల్డ్ పెద్దలు వాటిని తిరిగి చేతికి వచ్చేలా చేసుకోవడంలో మధ్యవర్తులను ఉపయోగించుకున్నట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. తక్కువ ధరకే బినామీ కంపెనీల పేరిట ఉన్న భూములను అమ్మకం జరిపించి, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో మధ్యవర్తి కంపెనీకి ఆ భూములను రేటు పెంచి కొనుగోలు చేసేలా ఇటు గత దర్యాప్తు అధికారులను, అటు ప్రజాప్రతినిధులను అగ్రిగోల్డ్ పెద్దలు ఉపయోగించుకుంటున్నట్టు సీఐడీ పునర్విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. -
అగ్రిగోల్డ్ కేసు: తాజాగా వెలుగులోకి సంచలనాత్మక అంశాలు
సాక్షి, హైదరాబాద్: అనేక రాష్ట్రాల్లో బినామీ పేర్ల మీద భూములు, ఇతరత్రా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక సంచలనాత్మక అం శాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్ పెద్దలు అనేక సంస్థల పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేసి వాటిని మూడోకంటికి తెలియకుండా అమ్మకం సాగిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తుతం సీఐడీ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా బినామీ కంపెనీల ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గతంలో దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన వారితోపాటు సీనియర్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి సైతం నివేదిక చేరినట్టు తెలుస్తోంది. 76 ఎకరాలు అటాచ్ చేయకుండా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 76 ఎకరాల అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అటాచ్ చేయకుండా ఉం డటంతోపాటు మరో 156 ఎకరాల బదలాయింపు పై అగ్రిగోల్డ్ నిందితులు, మ«ధ్యవర్తులు, సీఐడీ అధికారుల మధ్య రూ.3 కోట్ల డీల్ కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సీఐడీలోని కీలక అధికారులకు కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ముట్టినట్టుగా తాజా దర్యాప్తులో బయటపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన రూ.2 కోట్ల వ్యవహారంలో మధ్యవర్తులు, అగ్రిగోల్డ్ పెద్దల నడుమ తేడాలు రావడంతో సంబంధిత అధికారులకు ఆ డబ్బు చేరలేదన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీస్ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారుల మార్పు ఇందుకే..! తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు అధికారుల మార్పిడికి కారణం ఏమిటో తెలిసిందని అంటున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చే యాల్సింది పోయి, కొంతమంది అధికారులు ము డుపులకు కక్కుర్తి పడి నిందితులతో చేతులు కలిపినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ కారణంగానే దర్యాప్తు అధికారులను మార్చి తాజాగా కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లు! బినామీ ఆస్తులను మూడో కంటికి తెలియకుండా చేతులు మార్చిన వ్యవహారంలో అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లుగా ఉన్నారని సీఐడీ గుర్తించింది. బినామీ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సీఐడీ అధికారులు నిందితులను ఇటీవల విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. బినామీ ఆస్తుల అమ్మకానికి.. కంపెనీలకు ఎలాంటి సంబంధం లేని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో పాటు మాజీ పోలీస్ కానిస్టేబుల్‌ను మధ్యవర్తులుగా పెట్టుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఆయా భూములు అమ్మేందుకు సంబంధిత బినామీ కంపెనీల డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈ క్రమంలో 2016లో 76 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మాజీ కానిస్టేబుల్‌కు సంబంధిత బ్రోకర్ అమ్మేశాడు. ఈ వ్యవహారంపై విచారణ సాగించాల్సిన, ఆ భూములను అటాచ్ చేయాల్సిన అప్పటి సీఐడీ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు తాజా విచారణలో బయటపడింది. అగ్రిగోల్డ్ పెద్దలు జైలు నుంచే సంబంధిత కంపెనీల డైరెక్టర్ల ద్వారా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మంతనాలు సాగించి 76 ఎకరాల భూమిని అమ్మించినట్టు గుర్తించారు. ఇలాంటి లావాదేవీలు బయటకురాకుండా చేయడంతో పాటు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అప్పటి అధికారులు తొక్కిపెట్టినట్టు ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. -
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. -
భూముల కోసం బినామీలు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో వెలుగులోకి రాని అనేక వ్యవహారాలున్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇన్నాళ్లు సాగిన దర్యాప్తులో కేవలం 40శాతం మాత్రమే ఆస్తులను గుర్తించినట్టు భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ కోసం అగ్రిగోల్డ్ బాధ్యులు 80కి పైగా బినామీ కంపెనీలను సృష్టించినట్టు అనుమానిస్తోంది. సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు విచారణలో ఒక్కొక్కటిగా కంపెనీల గుట్టుతోపాటు ఆ కంపెనీల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులు వెలుగులోకి వస్తున్నట్టు తెలిసింది. భారీస్థాయిలో భూములు కూడబెట్టేందుకు అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలను సృష్టించడంతోపాటు కొన్ని కంపెనీలను ఉపయోగించుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒక్కో కంపెనీకి దాని ఆదాయ పరిమితిని బట్టి భూములు కొనొచ్చు. అయితే అగ్రిగోల్డ్‌లోని చాలా కంపెనీలు 53 ఎకరాల వరకు కొనుగోలు చేసి వాటిని ట్రేడింగ్ చేసే అవకాశం ఉన్నట్టు సీఐడీ గుర్తించింది. ఇలా దేశవ్యాప్తంగా 25వేల ఎకరాలకు పైగా కొనుగోలుచేసి ఉంటుందని సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బినామీ కంపెనీల గుర్తింపులో... తెలంగాణ సీఐడీ చేస్తున్న దర్యాప్తులో మొన్నటి వరకు బినామీ కంపెనీలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో వేల ఎకరాలు చేతులు మారినట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. బినామీ కంపెనీల్లో ఉన్న డైరెక్టర్లను గుర్తించకపోవడం, ఆ కంపెనీల పేర్ల మీద ఉన్న ఆస్తులను అటాచ్ చేయకపోవడం అగ్రిగోల్డ్ పెద్దలకు కలిసి వచ్చినట్టు భావిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చాయి. అటాచ్ చేసిన భూములు, ఇళ్ల సర్వే నంబర్లను రిజిస్ట్రేషన్ విభాగానికి పంపించి సంబంధిత ఆస్తులను నిషేధిత జాబితాలో పొందుపరిచారు. ఎవరైనా ఈ ఆస్తుల క్రయవిక్రయాలు చేస్తే ఆయా సబ్ రిజిస్ట్రార్ల సర్వర్‌లో నిషేధిత భూములని కనిపిస్తుంది. దీంతో అమ్మకానికి అవకాశం ఉండదు. కానీ బినామీ కంపెనీల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించకపోవడంతో అటాచ్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో అగ్రిగోల్డ్ బాధ్యుల్లో కొందరు ప్రభుత్వంలో పలుకుబడి కల్గిన వ్యక్తులతో చేతులు కలిపి బినామీ భూముల క్రయవిక్రయాలు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. అందులో ప్రధానంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన 76 ఎకరాల భూమి అమ్మకం బయటకు రావడంతో ఇప్పుడు బినామీ కంపెనీలను గుర్తించే పనిలో సీఐడీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరి పాత్ర ఎంత? అగ్రిగోల్డ్‌లో కీలక బాధ్యులుగా ఉన్న నలుగురిని సీఐడీ అనుమానిస్తోంది. బినామీ ఆస్తులను బయట వ్యక్తుల ద్వారా తక్కువ ధరకు కొనిపించి, మళ్లీ ఆ భూములను మార్కెట్ రేట్ లెక్కన తమ సంబంధీకులకు అమ్మేలా కుట్రపన్నినట్టు గుర్తించింది. అయితే బినామీ కంపెనీల్లో డైరెక్టర్లతో పాటు అగ్రిగోల్డ్ కీలక వ్యక్తుల పాత్రపై ఇప్పుడు లోతుగా విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. భూములమ్మిన, కొనుగోలు చేసిన వారికి ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో నిరూపించే పనిలో సీఐడీ ఉన్నట్టు సమాచారం. -
ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. ఆర్బీఐ నిబంధనలకి విరుద్ధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో అగ్రి గోల్డ్‌ను ప్రారంభించారని తెలిపారు. అగ్రి గోల్డ్ యాజమాన్యంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి అన్యాయం చేశారాని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు. చదవండి:రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు కానీ, అగ్రి గోల్డ్ బాధితుల కష్డాలని నేరుగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వం తరపున న్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 20 వేల రూపాయిల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ జగన్ చంద్రబాబుని డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 24న 20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు రూ.240 కోట్లు చెల్లించామని, 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేశామని ఆయన వెల్లడించారు. చదవండి:వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ -
అగ్రిగోల్డ్ కేసు: నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులోనిందితులకు ఈడీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను అధికారులు ఈడీ కోర్టులో మంగళవారం హాజరుపర్చారు. అనంతరం ఈ కేసులో నిందితులైన అవ్వాస్ వెంకట రామారావు, శేషు నారాయణ, వరప్రసాద్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు) కాగా.. ఏపీ, తెలంగాణ, కర్నాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. గతంలో జరిపిన సోదాల్లో రూ.22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు) -
రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌కు చెందిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది. గురువారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలోని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఏపీలో 56 ఎకరాల హాయ్‌లాండ్ ఆస్తులు.. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను అటాచ్ చేసింది. కాగా, బుధవారం అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్ రావును ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. (ఏటీఎం చోరీలు..నిందితుల హిస్టరీ చూస్తే..) వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మంది వద్ద 6,380 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. 942 కోట్ల రూపాయల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించారు. -
అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్‌పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్రావును ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏపీ, తెలంగాణ, కర్నాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు పేన్నారు. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మల్లించినట్టు ఈడీ అధికారలు గుర్తించారు. గతంలో జరిపిన సోదాల్లో రూ.22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్ చేసిన వారికి ఆ మొత్తాలను చెల్లించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ చెప్పారు. చదవండి: (జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం) -
సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి అగ్రిగోల్డ్ విచారణ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన అగ్రిగోల్ట్ కేసును మరోసారి విచారించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హై కోర్టు అగ్రిగోల్డ్ కేసు విచారణకు అంగీకరించింది. విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ మెన్షన్ చేశారు. సోమవారం నుంచి మళ్ళీ వాదనలు జరగనున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ ఏజీ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, హైకోర్టు ఆధీనంలో ఉన్న నిధులు పంపిణీ చెయ్యాలని కోరుతూ రమేష్ బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం నుంచి అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో కొనసాగనుంది. (చదవండి: అగ్రిగోల్డ్ బాధితుల కన్నీరు తుడిచేలా..) ‘మల్లన్న’ పై చర్యలు తీసుకోవాలి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై చర్యలు తీసుకోవాలిని కోరుతూ ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమాన్ని మూసేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్యూ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారం, హద్దులు దాటుతుందని పిటిషన్‌దారు కోర్టుకు తెపారు. క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంగిస్తున్న నవీన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమం ద్వారా విషప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న హై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 6న చేపట్టనున్నట్లు తెలిపింది. -
‘ఆయన తిన్నది అరక్క దీక్ష చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1150 కోట్లు కేటాయించడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డీనేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులు చెల్లించిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. కానీ సీఎం జగన్ మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాధితులకు చెక్కులు ఇప్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చంద్రబాబు హయంలోనే ఇసుకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిన్నది అరక్క లోకేష్ రేపు గుంటూరులో దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ను విచారిస్తే ఏయే నదుల్లో ఎంత కుంభకోణం జరిగిందో బయటపడుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో గత ఐదేళ్లలో వేలకోట్ల రూపాయల ఇసుక దోపిడి జరిగిందని ఆరోపించారు. -
‘వైఎస్ జగన్ మాటిస్తే.. గుర్తు చేయాల్సిన పనిలేదు’
సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ సమస్య సృష్టించి జనాన్ని మోసం చేశారని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో బాధితులను ఆదుకున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. 7 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ 6500 కోట్లు వసూళ్లు చేసింది. అగ్రిగోల్డ్ సంస్థలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. బాధితులను ఆదుకోవాలని చంద్రబాబుకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు. ఆయన మనిషి కాదు మరమనిషి. బాధితుల కష్టాలు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ‘నేను ఉన్నాను నేను విన్నాను’ అంటూ హామీ ఇచ్చారు. తొలి కేబినెట్ భేటీలోనే బాధితులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కులం మతం చూడకుండా బాధితులకు సీఎం న్యాయం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1150 కోట్లు కేటాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణ జరుగుతుంది’అన్నారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. రూ.1150 కోట్లు మంజూరు చేసి సీఎ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ ఢిల్లీ వచ్చి చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయలని చూశారు. సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి, బాధితులకు స్వయంగా చెక్కులు ఇవ్వాలని కోరుతాం’అన్నారు. కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు మీద టీడీపీ నాయకుల కన్ను పడిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వందల మంది చనిపోయినా.. లక్షల మంది బాధపడుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. శవాలు మీద చిల్లర దండుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాట ఇచ్చి తప్పడం అలవాటు లేదని అన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే మళ్లీ పని చేయండని గుర్తు చేయాల్సిన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని, బాధితులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు. -
‘సీఎం గొప్ప మనసుతో ఒకరోజు ముందే దీపావళి’
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో.. మూడు లక్షల 70 వేల మంది బాధితుల కోసం రూ.264 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.886 కోట్లు విడుదల చేశారు. వైఎస్ జగన్‌పై బాధితులు నమ్మకం ఉంచారు. వారి నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి రూ.1150 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు ఖాళీ ఖాజానాను సీఎం జగన్ చేతికి ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబుది కోతల ప్రభుత్వం. వైఎస్ జగన్‌ది చేతల ప్రభుత్వం. ఈ నెల 29వ తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అగ్రిగోల్డ్ స్కామ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకుండా కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేశారు. చంద్రబాబు లోకేష్ సిగ్గుండే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా’ అని అన్నారు. -
‘వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం’
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను అమలుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకున్నారని, కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి విడత డబ్బులు విడుదల చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల రూపాలను కేటాయించిన సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హమీని తాజాగా అమలు చేయడంతో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదని నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఐదునెలల్లోనే ఇచ్చిన మాటలను వైఎస్ జగన్ అమలు చేశారని అగ్రిగోల్డ్ బాధితులు అంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సంబరాలు ప్రజాసంకల్పయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయడంతో అగ్రిగోల్డ్ బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు హయాంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని.. కానీ సీఎం జగన్ అధికారంలోకి రావడంతోనే తమ సమస్యల పట్ల దృష్టి సారించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి అగ్రిగోల్డ్ బాధితులు పాలాభిషేకం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకేపటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. అధికారం చేపట్టిన వెంటనే జగన్ బాధితుల కోసం రూ. 1,150 కోట్లు కేటాయించారని.. అందులో మొదటి విడతగా రూ. 265 కోట్లు విడుదల చేశారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాధితుల కోసం 265 కోట్లు కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇదే నిజమైన పండగ రోజని.. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ సర్కిల్ లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ కు విశాఖలో మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల హామీ అమలులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో రూ.270 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 3లక్షల 70వేలమందికి లబ్ది చేకూరుతుంది. చంద్రబాబు నాయుడుకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన రాలేదు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం కమిటీలు వేసి కాలక్షేపం చేసింది. చంద్రబాబు తీరు వల్ల 300మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా చిన్న చిన్న కుటుంబాలకు చెందినవారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం చేయాలని సీఎం ముందుకు వచ్చారు. రూ.10 వేల నుంచి రూ.20వేలు లోపు డబ్బులు కట్టిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు అందరికీ డబ్బులు చెల్లిస్తాం. దీనివల్ల మరో పది లక్షల మంది బాధితులకు లబ్ధి చేకూరుతుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నాయకులు దోచుకున్నారు. ఆస్తులను దోచుకున్నవారికి శిక్ష తప్పదు.అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌లాండ్‌ను నారా లోకేశ్ కాజేయాలని చూశారు. ఇంకా టీడీపీ నేతల చేతుల్లోనే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం. చదవండి: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల -
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రూ.264,99,00,983 విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయింపు చంద్రబాబు అధికారంలో ఉండగా అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెల్సిందే. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కోరినా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసి నష్టపోయారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల అగ్రిగోల్డ్ బాధితులు తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ ద్వారా వైఎస్ జగన్ వారికి బాసటగా నిలిచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు. తాజాగా తొలిదశలో రూ.264,99,00,983 రాష్ట్రంలోని 3,69,655 మంది డిపాజిటర్లకు పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది. -
32 లక్షల మంది వంచనకు గురయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: పోంజి స్కీం స్కామ్‌ల నుంచి పేద మదుపర్లకు రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధం బిల్లు-2019’పై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ తరహా స్కామ్‌లను అరికట్టేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా రూ.7వేల కోట్ల రూపాయల మేర అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 32లక్షల మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు అగ్రిగోల్డ్ వంచనకు గురయ్యాయని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ దేశంలోని 9మంది డిపాజిట్ రెగ్యులేటర్లలో ఏ ఒక్కరి నుంచి కూడా అనుమతి పొందలేదని తెలిపారు. అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌ల బాధితుల్లో అత్యధికులు నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే అన్నారు. వారు ఇలాంటి స్కీమ్‌లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్కీముల బారిన పడి మోసపోయిన వారికి సత్వర న్యాయం చేసేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పించడం ప్రశంసనీయం అన్నారు. పోంజి స్కీము ద్వారా మోసాలకు పాల్పడే వారికి 2-7ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 3-10లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఈ బిల్లు కల్పింస్తుందని తెలిపారు. ఈ బిల్లును మరింత కట్టుదిట్టంగా రూపొందించడానికి వీలుగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. అనియంత్రిత డిపాజిట్ల సేకరణ జరగకుండా పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి కార్యదర్శి అధ్యక్షత వహిస్తారని బిల్లులో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి కంటే కూడా ఆ స్థానంలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడు లేదా బ్యాంకర్‌ను నియమిస్తే ఈ తరహా డిపాజిట్ల సేకరణను ఆదిలోనే నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అక్రమంగా సేకరించే డిపాజిట్ల సొమ్ము ద్వారా కొనుగోలు చేసే ఆస్తులను సైతం జప్తు చేసి డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలను బిల్లులో చేర్చాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని పోంజి స్కీములు రాష్ట్ర సరహద్దులు కూడా దాటి జరుగుతున్నందున అలాంటి వాటిని కూడా ఆయా రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు నిర్ణీత కోర్టుల పరిధిలోకి తేవాలని విజయసాయి రెడ్డి కోరారు. -
అగ్రిగోల్డ్‌పై సీఐడీ కీలక సమావేశం
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు పరిష్కారం చూపేందుకు సీఐడీ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురువారం ఈ సమావేశం జరిగింది. బ్యాంకర్స్, అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితుల సంఘం, పిటిషనర్లు, అడ్వొకేట్లతో సీఐడీ అధికారులు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకోవడం, ఆస్తుల అమ్మకం, డిపాజిట్‌దారులకు పంపిణీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యం, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. -
ఆ ఆస్తులపైనా దృష్టి సారించాలి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేలా సీఎం వైఎస్ జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బినామీలుగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
వైఎస్ జగన్ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 9 లక్షల మంది 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు ఇవ్వాలని కాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బాధితుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిరంతర పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీ లెవెల్ స్కీంల వల్ల అమాయకులు మోసపోయి, ఆర్ధికంగా నష్టపోతున్నారు. గతంలో 250 కోట్లు ఇస్తున్నామని దీక్ష విరమింపజేశారు, కానీ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం 1150 కోట్లు ఇస్తామనడం చిన్న విషయం కాదు. ఇప్పుడున్న మంత్రులు ఎదో ఒక దశలో మా ఉద్యమంలో పాల్గొన్న వారే. బినామీ ఆస్తులను కూడా వెంటనే అటాచ్ చేయాలి. ఈ తరహా మార్కెటింగ్ కంపెనీలను పూర్తిగా రద్దు చేయాలి’’ అని అన్నారు. -
అవినీతి రహిత పాలనకు సహకరించాలి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే అవినీతి రహిత పాలనకు అందరూ సహకరించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ. 1150 కోట్ల నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఐదేళ్ల పాలనతో చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను కష్టాల పాలు చేశారని మండి పడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జనగ్ తీసుకునే నిర్ణయాల పట్ల రాజకీయ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయ పాలన ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలను జనగ్‌మోహన్‌రెడ్డి నిజం చేశారని ప్రసాద్ రెడ్డి ప్రశంసించారు. -
‘తొమ్మిది లక్షల మందికి ఒకేసారి న్యాయం’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. బినామీలుగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అగ్రిగోల్డ్ మోసం సాక్షిగా..
-
దగాపడ్డ జీవితాలు
-
అగ్రిగోల్డ్ బాధితుల బాధలు సర్కారుకు పట్టదా?
-
ఆగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేయాలని చూస్తున్నారు
-
మనస్థాపానికి గురై అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
-
వారిని లోకేషే కాపాడుతున్నారు : గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ రాష్ట్ర కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం చేయమని ధర్నా చేస్తే చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనవసర ఆర్భాటాలకు చేసే ఖర్చును బాధితులకు ఇస్తే వారి సమస్యలు కొన్నైనా తీరేవన్నారు. అగ్రిగోల్డ్ యజమానులను మంత్రి లోకేష్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే..140 మందికి మాత్రమే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి : వైఎస్సార్సీపీ
-
అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి : వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు శుక్రవారం మంగళగిరిలోని సీబీసీఐడీ అడిషనల్ డీజీ అమిత్‌గర్గ్‌ను కలిసి వినతి పత్రం అందేజేశారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో సీఐడీ అనుసరిస్తున్న వైఖరిలో అనేక అనుమానాలున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. సీబీసీఐడీ తన నివేదికలో బాధితుల సంఖ్య 19.50 లక్షలు అని చెప్పిందని, ప్రభుత్వ సలహాదారుడు కుటుంబరావు మాత్రం ఈ సంఖ్యను 10 లక్షల లోపే ఉంటుందని ప్రకటించారన్నారు. కోర్టుకు చూపించని ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, బాధితులకు రూ.300 కోట్లు ఇస్తుందని కుటుంబరావు ప్రకటించారని తెలిపారు. సీబీసీఐడీ దర్యాప్తులో కోర్ట్‌కు చూపిన ఆస్తులు ఎన్ని, చూపని ఆస్తులు ఎన్నో బహిర్గతం చేయాలని, అగ్రిగోల్డ్ యాజమాన్యంకు బినామీగా ఉన్న 156 కంపెనీల ఆస్తులపై వివరణ ఇవ్వాలన్నారు. చెక్ పవర్ ఉన్న డైరెక్టర్లను కేసుల్లో ఎందుకు పెట్టలేదో స్పష్టం చేయాలన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల గర్జన
నాలుగున్నరేళ్లుగా తమ గోడును పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి భగ్గుమన్నారు. సర్కార్ పెద్దలు కల్లబొల్లి మాటలతో మాయ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద భైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారి ఆందోళనలో వెన్నంటి ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎంతో మంది బాధితులు అసువులు బాసినా... మరెందరో ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదంటే ఇది రాక్షస ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. సాక్షి నెట్వర్క్: మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు తమ ఆవేదన వినిపించేలా అగ్రిగోల్డ్ బాధితులు గర్జించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద బైఠాయించారు. వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బాధితులు గుంటూరు కలెక్టరేట్ ముట్టడించారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి వేల కోట్ల ఆస్తుల్లో అధిక శాతం అనధికారికంగా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఎవరైనా అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని చూసినా, అక్రమ క్రయ విక్రయాలు నిర్వహించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. వి జయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి కె.పార్థసారధి, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తదితరులు పాల్గొన్నారు. 19.70 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు విలవిలలాడిపోతున్నా.. సర్కార్‌లో కనీస చలనం లేకపోవడం సిగ్గుచేటని వారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ధర్నా అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా శవాలపై చిల్లర ఏరుకున్నట్లు ఆ సంస్థ కీలక ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తోందని, ఇది రాక్షస ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక్క నెలలోనే రూ.1,150కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహ పార్కులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి. అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ధర్నాకు ముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం తదితరుల ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని బాధితులకు భరోసా ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ స్కాం రూ.10 వేల కోట్లు పైనే ఉందన్నారు. ధర్నాలో ఇంకా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వం వహించారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని కుట్ర: ఆళ్ల నాని
ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వ పెద్దలు కాజేయాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాలో ఆళ్లనానితో పాటు ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం కన్వీనర్ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మీ, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధిత సంఘం కన్వీనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుకతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.1100 కోట్లు వెంటనే విడుదల చేసి బాధితులను ఆదుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. -
‘చెప్పేది చేయడు.. చేసేది చెప్పడు’
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కేసీఆర్ కేసు పెట్టలేదని, ఇద్దరూ లోపల అండర్ స్టాండింగ్‌తో ఉన్నారని, బయటికి మాత్రమే ఆరోపణలు చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు జూనియర్ రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, చంద్రబాబుని డర్టీ పొలిటీషియన్ అంటే కూడా చంద్రబాబు నేరుగా స్పందించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు మొన్న మోదీతో, ఇప్పుడు రాహుల్‌తో..ఎప్పుడు ఎవరితో ఉంటారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ లెటర్ ఇస్తే ఆహ్వానించాలి కానీ ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు హుందాతనం కోల్పోయారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులను చంద్రబాబు అసెంబ్లీలో పిల్లకుంకలు అన్న విషయాన్ని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే నువ్వెందుకు ముసిముసిగా నవ్వుకున్నావ్..అప్పుడు నీ సంస్కారం ఏమైందని బాబుని అడిగారు. ప్రత్యేక హోదా కోసం జగన్ అనేకసార్లు పోరాడితే వెకిలిగా మాట్లాడిన సంగతి గుర్తు లేదా అన్నారు. హైకోర్టు విభజన కోసం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఎందుకు వేశారని ప్రశ్న సంధించారు. చంద్రబాబు లాంటి పచ్చి మోసకారి సీఎంగా ఉండటం రాష్ట్రానికి శని పట్టిందన్నారు. బాబు చేసిన మోసాలు ప్రజలందరికీ తెలుసునని, బాబు గురించి మాట్లాడాలంటేనే జుగుప్సాకరంగా ఉందని అన్నారు. చంద్రబాబూ నువ్వు ఎవరితోనైనా కలువు కానీ.. మేము మాత్రం ఒంటరిగా పోటీ చేసి 135 నుంచి 140 స్థానాలు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన కోసం వాదించిన అడ్వొకేట్‌కి రూ.66 లక్షల ఫీజు చెల్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ డొంక తిరుగుడు మాటలే..చెప్పేది చేయడు, చేసేది చెప్పడని అన్నారు. బాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరు: అప్పిరెడ్డి చంద్రబాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 20 లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదన్నారు. 240 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 143 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకోవాలన్నదే టీడీపీ నాయకుల లక్ష్యమని చెప్పారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా అనగానే టీడీపీ నాయకులు హడావిడి చేస్తున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు విలువ ఉన్నా బాధితులకు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు. తాము అడ్డుకుంటున్నామనేది వట్టి మాటని, బాధితులకు న్యాయం చేయాలన్నదే మా డిమాండ్ అని అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో ధర్నా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందిచకపోతే స్తంభింపచేస్తామని హెచ్చరించారు. బాధితులకు చివరి రూపాయి అందేవరకు మా పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి అన్నారు. -
సాయంత్రంలోపు ప్రభుత్వం స్పందించకపోతే..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. మాటలగారడీతో చంద్రబాబు నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా.. ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవరసరం ఏముందని ప్రశ్నించారు. కరెంట్ తీసేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడమేంటని నిలదీశారు. ఈ రోజు సాయంత్రంలోపు అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా.. బకాయిలు ఎందుకు చెల్లించకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను నాలుగేళ్లుగా ప్రభుత్వం నాన్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భాదితులు తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
మా కన్నీళ్లు చంద్రబాబుకు కన్పిస్తలేవా?
-
అగ్లీగోల్డ్
-
అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన
-
అగ్రిగోల్డ్ బధితులకు ఊరట
-
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం హాయ్‌లాండ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హాయ్‌లాండ్ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. సీల్డ్ కవర్లో బిడ్డర్స్‌ను ఆహ్వానించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్లోనే ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హాయిలాండ్ వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా రిలే దీక్షలు
ఏలూరు: రాష్ట్రంలో ఉన్న 19 లక్షల 20 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ కమిటీ వేసిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ రావూరి ప్రసాద రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పార్టీ కార్యాలయంలో రావూరి విలేకరులతో మాట్లాడారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షా 16 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ ఆస్తులపై ఉన్న ఆసక్తి బాధితులకు న్యాయం చేసే విషయంలో లేదన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు మరణిస్తే 143 మందికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రస్తుతం రూ.30 వేల కోట్ల ధర పలుకుతున్నా ప్రభుత్వం న్యాయం చేయడంలో అశ్రద్ధ వహిస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల ఆసరా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే 30వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తామన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ‘అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ’ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల పేర్లను తెలియజేస్తూ పార్టీ కేంద్రకార్యాలయం సోమవారం ఓ పత్రికాప్రకటనను విడుదల చేసింది. పార్లమెంట్ నియోజవకవర్గాలు.. ఇంచార్జ్‌లు 1. శ్రీకాకుళం- దువ్వాడ శ్రీకాంత్ 2. విజయనగరం- మజ్జి సుర్రప్పుడు 3. విశాఖపట్నం- ఎం. కృష్ణం రాజు 4. అనకాపల్లి- జెర్రిపోతుల దుర్గరావు 5. అరకు - పెండ రమణ 6. కాకినాడ- పాపారాయుడు 7. అమలాపురం- కామేశ్వరరావు 8. రాజమండ్రి- బొంత శ్రీహరి 9. నరసాపురం- మేడపాటి సాయి చంద్రమౌళిశ్వర్ రెడ్డి 10. ఏలూరు- రావూరి వీర వెంకట సత్యదుర్గ ప్రసాద్ 11. మచిలీపట్నం- కొఠారి శ్రీనివాస్ 12. విజయవాడ- అడపా శేషు 13. నరసరావుపేట- మర్రిసుబ్బారెడ్డి 14. గుంటూరు- వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) 15. బాపట్ల- చేజార్ల నారయణ రెడ్డి 16. ఒంగోలు- సింగరాజు వెంకటరావు 17. నంద్యాల- కర్రా హర్షవర్దన్ రెడ్డి 18. కర్నూలు -రుద్ర గౌడ్ 19. అనంతపురం- కొర్రపాడు హుస్సేన్ పీరా 20. హిందూపురం- పి. శంకర్ రెడ్డి 21. కడప- విజయ ప్రతాప్ రెడ్డి 22. నెల్లూరు-వేలూరు మహేష్ 23. తిరుపతి- పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి 24. రాజంపేట- ఎ.గోవింద్ 25. చిత్తూరు- టీవీ. శ్రీనివాసులు -
‘శారదా స్కాం కంటే పెద్ద కుంభకోణం’
సాక్షి, విజయవాడ: పశ్చిమ బెంగాల్లో శారదా కుంభకోణం జరిగితే కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించిందని, అగ్రిగోల్డ్‌పై ఎందుకు విచారణ జరిపించడం లేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ కుంభకోణం శారద స్కాం కంటే రెండింతలు పెద్దదని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ కీలక సమావేశాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు బాధితులను పట్టించుకోలేదని, ప్రభుత్వ తీరుతో బాధితుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. కేంద్ర సంస్థతో విచారణ జరిపిస్తే ప్రజలకు న్యాయం జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కాంలో పెద్దల జోక్యం లేకపోతే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైవీ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు రూ.1182 కోట్లు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుంభకోణంలో ఉన్న పాత్రధారులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటంను ఉధృతం చేస్తాం: సజ్జల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బాధితులకు అండగా టీడీపీపై పోరాటం చేసేందుకు బాసట కమిటీ రిలే దీక్షలను నిర్వహిస్తుందని, జిల్లా, మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటంను ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర: బొత్స ఇంతవరకూ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన జాబితాను ఎందుకు బయటపెట్టలేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర జరుగుతుందని బొత్స.. బాధితులకు బాసటగా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 22, 23 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఈ నెల 30వ తేదీన కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వందకు వంద శాతం అగ్రిగోల్డ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ వేదికగా వంచనపై గర్జన దీక్ష నిర్వహించబోతున్నామని బొత్స తెలిపారు. దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు చెందిన నాయకులు, నియోజవర్గ సమన్వయకర్తలు హాజరవుతారన్నారు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశామని, వైఎస్ జగన్ ఆమరణ దీక్ష కూడా నిర్వహించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతామన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని అని బొత్స పేర్కొన్నారు. -
హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర
-
‘బాధితుల జాబితాను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు?’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. 16 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. చంద్రబాబు సర్కార్‌కు ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. హాయ్‌లాండ్ విషయంలో బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1100 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర వైఎఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 206 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వంలో కదలిక లేదని మండిపడ్డారు. సీబీసీఐడీ ద్వారా బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎంతమందికి నష్ట పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. హాయ్‌లాండ్ ఆస్తులను దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. బాధితుల జాబితాను బహిర్గతం చేయాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వారితో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బాధితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బాధితుల ఆర్తనాదాలు కనిపించడం లేదా? వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్గిగా విఫలమైందని మండిపడ్డారు. బాధితుల ఆత్మహత్యలు, ఆర్తనాదాలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. -
బాధితుడి చెంపమీద కొట్టిన చంద్రబాబు
-
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఈ శుక్రవారం అగ్రిగోల్డ్ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. హాయ్‌ల్యాండ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఏపీ పోలీసులు కోర్టుకు తెలిపారు. హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశామని వారు కోర్టుకు వెల్లడించారు. హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీపై అగ్రిగోల్డ్ యాజమాన్యం వైఖరిని హైకోర్టు ప్రశ్నించింది. వారం లోపు హాయ్‌ల్యాండ్ ఆస్తులపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య గుంటూరు : అగ్రిగోల్డ్ ఏజెంట్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వినుకొండలో చోటుచేసుకుంది. ధనరాజ్ అనే అగ్రిగోల్డ్ ఏజెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
హైకోర్టు ఆదేశాలతో సీఐడీలో చలనం
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ అస్తులు, నిందితుల అరెస్టుల విషయంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా వ్యవహరించిన నేర పరిశోధన సంస్థ(సీఐడీ) ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు ముందుకు కదిలింది. హాయ్‌ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ ఈ నెల 16న అగ్రిగోల్డ్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపైనా న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణ బాధ్యతను దానికి అప్పగిస్తామని తేల్చిచెప్పింది. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. ఉదయ్ దినకర్‌ను వదిలేసిన అధికారులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావుకు గురువారం గుంటూరు ఆరో అదనపు కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఉదయ్ దినకర్‌లను గుంటూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో విచారించారు. అనంతరం ఉదయ్ దినకర్‌ను వదిలేసి అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వరరావు అరెస్టును చూపించారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి హాయ్‌ల్యాండ్ విషయంలో కుట్ర చేశాడనే అభియోగంపై డిపాజిట్ల యాక్ట్ 402, 403, 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 27కు చేరిన అగ్రిగోల్డ్ నిందితుల సంఖ్య ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(హాయ్‌ల్యాండ్) ఎండీగా 2005 ఆగస్టు 29న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఆయన అరెస్టుతో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. వెంకటేశ్వరరావు ఆర్కా లీజర్స్తోపాటు మరో 18 కంపెనీల్లో అదనపు డైరెక్టర్, డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. ఇవన్నీ అగ్రిగోల్డ్ గ్రూపునకు సంబంధించిన డొల్ల కంపెనీలే. వీటిలో 14 కంపెనీల్లో అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులైనఅవ్వా వెంకటశేషునారాయణరావు, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, అవ్వా సీతారామారావు, సవడం శ్రీనివాస్, ఇమ్మడి సదాశివ వరప్రసాద్, అవ్వా హేమసుందర వరప్రసాద్, పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్ తదితరులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట సేకరించిన డిపాజిట్ల సొమ్మును మొత్తం 156 డొల్ల సంస్థల్లోకి అగ్రిగోల్డ్ యాజమాన్యం మళ్లించడంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సీఐడీ దర్యాప్తు చేపడితేనే తమకు న్యాయం జరుగుతుందని డిపాజిటర్లు, ఏజెంట్లు కోరుతున్నారు. సీఐడీకి నిబద్ధత లేదు డీజీపీకి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ వినతి సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల విషయంపై సీఐడీ దర్యాప్తులో నిబద్ధత లేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ మేరకు వారు గురువారం డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం, సీఐడీ దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల 211 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని చెప్పారు. అగ్రిగోల్డ్ సిస్టర్స్ కంపెనీలుగా ఉన్న 156 సంస్థల డైరెక్టర్లను సీఐడీ కçస్టడీలోకి తీసుకొని విచారించాలని, వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్లు, వారికుటుంబ సభ్యుల పేరిట ఉన్నబినామీ ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీ ఏనాడూ తగిన శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షులు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామరావుతో కలిసి హాయల్యాండ్‌పై కుట్ర చేశాడనే అభియోగంపై అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు గతంలో అగ్రిగోల్డ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. అతడు 2005 ఆగస్టు 29న హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్ కాలేజ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్వరరావు అరెస్ట్‌తో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. గురువారం వెంకటేశ్వరరావును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
‘అక్రమ కేసులు పెట్టినా ఉద్యమం ఆగదు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకం సన్నగిల్లిందని, అందుకే అగ్రిగోల్డ్ బాధితులు ధర్నాలకు దిగుతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హాయ్‌ల్యాండ్‌ను కొట్టేయటానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాయ్‌ల్యాండ్‌ను కాపాడుకుంటామని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం పెడతామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. చదవండి : ‘ఛలో హాయ్‌ల్యాండ్’: కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం.. -
‘వారి చేతుల్లో టీడీపీ ఓటమి ఖాయం’
సాక్షి, విజయవాడ : హాయ్‌ల్యాండ్‌ను పోలీస్‌లతో అడ్డుకుని.. అరెస్టులు చేయడం అప్రజాస్వామికం.. అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నయాన్ని ముందుకు తీసుకు రావడానికి విపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించాయని తెలిపారు. వచ్చే నెల 20న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చే పార్టీలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. హాయల్యాండ్ అంశంలో ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను కనీసం ఖండిచడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై చిత్త శుద్ధితో పని చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయించి చిన్న మొత్తాల డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై విద్యార్థి యువజన సంఘాలు చేపట్టబోయే కార్యక్రమానికి తమ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలే తమ ప్రధాన అజెండా అంటూ రామకృష్ణ ప్రకటించారు. కరువుపై ఆందోళన కార్యక్రమాలు : మధు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కరువుతో రైతులు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై రాబోయే పార్లమెంట్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
‘ఛలో హాయ్‌ల్యాండ్’: కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం..
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం చేపడుతుండటంతో.. గుంటూరు అర్బన్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరుతుండగా.. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను ప్రయోగిస్తోంది. ముట్టడిలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘ఛలో హాయ్‌ల్యాండ్’ అప్డేట్స్ ఇవి.. అరెస్టులు, ఉద్రిక్తత అగ్రిగోల్డ్ బాధితులు తలపెట్టిన ఛలో హాయ్‌ల్యాండ్‌కు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హాయ్‌ల్యాండ్ సమీపంలో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగలు పట్టుకోవడం చేతకాని పోలీసులు.. తమను అరెస్ట్ చేస్తున్నారని వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా మొత్తం 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముట్టడికి వచ్చే అగ్రిగోల్డ్ బాధితులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కాజా టోల్‌గేటు వద్ద పలువురు బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళగిరి వై జంక్షన్ వద్ద కూడా బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ప్రతిఘటిస్తుండం పరిస్థితి ఉద్రిక్తం అనుమతి లేదు ‘‘ఛలో హాయ్‌ల్యాండ్’కు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పర్మిషన్ కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వారికి అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతలు విఘాతం కలిగించకుండా అందరూ సహకరించాలి. ఈ క్రమంలో ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేశాం’ అని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు విలేకరులు తెలిపారు. బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పిలుపునివ్వడంతో ప్లేట్ ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్ ఫిరాయించారని పేర్కొంటున్నారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగమేనని, తమకు వెంటనే న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు కోరుతున్నారు. -
అగ్రిగోల్డ్ చైర్మన్‌ను కలిసిన అవ్వా సోదరులు
-
పచ్చ కుట్ర
-
గళమెత్తిన అగ్రిగోల్డ్ బాధితులు
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: కోర్టు, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న అగ్రిగోల్డ్ యాజమానులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి విచారణను వేగవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. హాయ్‌లాండ్ తమకు సంబంధం లేదంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం న్యాయస్థానంలో చెప్పడాన్ని నిరసిస్తూ ఆదివారం సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్లో అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల చైర్మన్ అవ్వా వెంకట రామారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ 20 లక్షల కుటుంబాల నుంచి రూ.3,800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి తమ స్వార్థంతో సంస్థను సంక్షోభంలోకి నెట్టేసి చోద్యం చూస్తున్న యాజమాన్యంపై కోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకురాలు వై.నాగలక్ష్మి, తణుకు శాఖ అధ్యక్షుడు నల్లాకుల గణపతి, ఎన్.రామశ్రీను, జి.కొండయ్య, సాదే సామ్యూల్ రాజు, కె.సత్యనారాయణ, సీహెచ్‌వీ రమణ, జె.సత్యనారాయణ, పీజే దానం, జి.అనంతలక్ష్మి పాల్గొన్నారు. -
‘అగ్రిగోల్డ్’ ఆశలకు సమాధి.. హాయ్‌ల్యాండ్ ఆరగింపు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విలువైన ఆస్తిని కొల్లగొట్టడానికి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు. అగ్రిగోల్డ్ మోసంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన పరిధిలోని సీఐడీకి ఈ కేసును హడావుడిగా అప్పగించి చేతులు దులుపుకుంది. హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం తాజాగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హాయ్‌ల్యాండ్ తమదేనని ఇన్నాళ్లూ చెప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వంలోని బడాబాబుల హస్తం ఉందని బాధితులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరు వెంకటేశ్వరరావు హైకోర్టుకు చెప్పడాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తప్పుపడుతోంది. దీనిపై ఆందోళనకు సిద్ధమని ప్రకటించింది. హాయ్‌ల్యాండ్‌పై తొలుత దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ కన్నేసింది. బేరం కుదరకపోవడంతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే దాదాపు 86 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్ విస్తరించింది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్, 18 ఎకరాల్లో కల్యాణ మండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే దాదాపు 10 ఎకరాల్లో గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పడుతుందని ఒకసారి, గుంటూరు–విజయవాడ మధ్య వస్తుందని ఇంకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీకులిచ్చిన సంగతి తెలిసిందే. చివరకు అమరావతిని రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ వ్యవహారాలన్నీ ముందుగానే పక్కాగా తెలిసిన ఓ పత్రికాధిపతి హాయ్‌ల్యాండ్‌ను దక్కించుకోవడానికి స్కెచ్ వేశారు. ఇందుకోసం అప్పట్లో రూ.400 వందల కోట్ల దాకా బేరసారాలు జరిగాయని సమాచారం. అనంతరం ఆ పత్రికాధిపతి అనూహ్యంగా ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. తర్వాత గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అగ్రిగోల్డ్ యాజమాన్యం అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర ముఖ్యనేత కుమారుడు, ఆయనకు సన్నిహితుడైన ఓ మంత్రి కలిసి హాయ్‌ల్యాండ్‌పై కన్నేశారు. అగ్రిగోల్డ్ బాగోతాలపై ఎలాంటి కేసులు రాకుండా చూస్తామని, హాయ్‌ల్యాండ్‌ను తమకు ఉచితంగా ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో చివరకు రూ.200 కోట్లు ఇస్తామని ప్రతిపాదించారు. చినబాబు–అగ్రిగోల్డ్ డీల్‌కు అప్పటి విజయవాడ పోలీసు ఉన్నతాధికారి మధ్యవర్తిగా వ్యవహరించారు. చినబాబుకు సన్నిహితుడైన మంత్రి అప్పట్లో ఆరేడు నెలల పాటు హాయ్‌ల్యాండ్‌లోనే మకాం వేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యనేతకు భాగస్వామిగా ఉన్న అధికార పార్టీ ఎంపీ కూడా హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సెల్ గ్రూప్ కూడా రంగ ప్రవేశం చేసింది. విజయవాడ ఏలూరు రోడ్డులో అగ్రిగోల్డ్‌కు చెందిన మిల్క్ భవన్లో ఎస్సెల్ గ్రూప్ తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. రసవత్తరంగా టేకోవర్ డ్రామా అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేస్తామంటూ ఎస్సెల్ గ్రూప్‌నకు(జీ గ్రూప్) చెందిన సుభాష్‌చంద్ర పౌండేషన్ ముందుకు రావడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రచారం జరిగింది. రూ.వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగ్రిగోల్డ్ ఆస్తులను నామమాత్రపు ధరకు టేకోవర్ చేసుకునే ప్రతిపాదన వెనుక చాలా తతంగం నడిచింది. ఇందుకు విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన పలువురు మధ్యవర్తిత్వం నెరిపారు. ఎస్సెల్ గ్రూప్ ఎండీ సుభాష్‌చంద్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందే రెండు పర్యాయాలు వేర్వేరు ప్రాంతాల్లో వీరి భేటీ రహస్యంగా జరిగినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎస్సెల్ గ్రూప్‌నకు అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పగించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తూ రావడంతో ఈ వ్యవహారం పక్కకు పోయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాయబేరం సాగించారు. బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్లు వాస్తవానికి అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్ల పైమాటే. అగ్రిగోల్డ్ సంస్థ 32,02,630 మంది నుంచి రూ.6,380.52 కోట్ల డిపాజిట్లను సేకరించింది. ఈ డిపాజిట్లకు రూ.3,150 కోట్లకు పైగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ముతో అనుబంధ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్ యాజమాన్యం అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, విల్లాలు, పవర్ ప్రాజెక్టులు, టింబర్ డిపోలు, డెయిరీఫామ్, రిసార్టులు, కార్యాలయ భవంతులను సమకూర్చుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ యజమాన్యం 18,395.74 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.35 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల పేరిట 16,857.81 ఎకరాల భూములున్నాయి. తొలినుంచీ అడ్డగోలు వ్యవహారాలే... అగ్రిగోల్డ్ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బేరసారాలు జరిపారు. ప్రభుత్వాధినేతకు, అధికార పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడనే గుర్తింపు కలిగిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల వ్యవహారాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఒకదశలో హాయ్‌ల్యాండ్‌తోపాటు విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్, కీసరలోని పొలాలను తమకు కట్టబెడితే కేసుల నుంచి బయటపడేస్తామనే ప్రతిపాదనను అధికార పార్టీ పెద్దల తరఫున ఆ అధికారి తెచ్చారు. చివరకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి బిడ్డర్లు రాకుండా అధికార పక్షం అడ్డుకున్నట్టు విమర్శలు వచ్చాయి. బిడ్లు వేసేందుకు వచ్చిన ఔత్సాహికులను కొందరు అధికార పక్షం నేతలు భయపెట్టి వెనక్కి పంపినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్తులను దక్కించుకునేందుకు ఇతరులు బిడ్లు వేయకుండా తమ మనుషులనే రంగంలోకి దించినట్లు కూడా ప్రచారం జరిగింది. తక్కువ ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు హాయ్‌ల్యాండ్‌ను తక్కువ ధరకే ఇచ్చేయాలని కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారని, అయినా తాము లొంగలేదని అగ్రిగోల్డ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పణంగా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చారు. పోలీసు అ«ధికారులను ప్రయోగించారు. బెదిరించారు. మేం ఏమాత్రం అంగీకరించలేదు. ముందుగా డిపాజిటర్లు, ఏజెంట్లకు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయండి. ఆ తరువాత మాట్లాడుకుని నిర్ణయానికి వద్దామని చెప్పాం. వారికి హాయ్‌ల్యాండ్ నచ్చిందట. ముందుగా ఇవ్వాలట. ఆ తరువాత మాట్లాడుతామన్నారు. మేం దానికి అంగీకరించలేదు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పాం. అందుకే మమ్మల్ని జైలుకు పంపారు’’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. డిపాజిటర్లకు సర్కారు అన్యాయం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నాలుగన్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారు. వీరంతా మొత్తం రూ.491.99 కోట్లు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేశారు. ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు ఇచ్చినా ఇలాంటి చిన్న డిపాజిటర్లను న్యాయం జరుగుతుంది. కానీ, ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఏజెంట్లే ఉన్నారని అంచనా. ఒక్కో బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని దశలవారీగా చెల్లిస్తోంది. హాయ్‌ల్యాండ్ విలువ గరిష్టంగా రూ.2,200 కోట్లు - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకోవడానికి అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం సన్నద్ధమైంది. ఈ నెల 21వ తేదీలోగా ప్రజాప్రతినిధులు సైతం స్పందించాలని అల్టిమేటం ఇచ్చింది. తాము నోరు తెరిస్తే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించింది. ఈ నెల 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి పిలుపిచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. హాయ్‌ల్యాండ్ కచ్చితంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని, ఇందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున వాదిస్తున్న న్యాయవాది సైతం పలు సందర్భాల్లో కోర్టుకు కూడా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. హాయ్‌ల్యాండ్ తమదంటూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరి వెంకటేశ్వరరావు చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావును అగ్రిగోల్డ్ యాజమాన్యం తన మేనేజర్‌గా నియమించుకుంటే ఇప్పుడాయన ఏకంగా బినామీగా మారి హాయ్‌ల్యాండ్ భూమి తనదనేదాకా ఎదిగారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో శిక్ష తప్పదు 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్నిగోల్డ్ యాజమాన్యం కుట్ర పన్నుతోందని, దీని వెనుక రెండు రాజకీయ పార్టీల నేతలు, కొందరు అనధికార ప్రముఖులు ఉన్నారని ముప్పాళ్ల నాగేశ్వరరావు, తిరుపతిరావు ఆరోపించారు. రాజకీయ నేతల అండదండలు లేకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇంత బరితెగింపునకు ఒడిగట్టలేదన్నారు. కోర్టులో తప్పించుకున్నా ప్రజాకోర్టులో వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆర్కా తరఫున వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 200 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంకటేశ్వరరావు పిటిషన్‌తో బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కూడా నాటకాలు ఆడుతున్నారని, అగ్రిగోల్డ్‌లో దాదాపు 160 బినామీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్ భూమి తనదేనంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున హాజరవుతున్న న్యాయవాది సైతం పలుమార్లు కోర్టుకు విన్నవించారని తెలిపారు. హాయ్‌ల్యాండ్ తమ కలల సౌధమని, దాని జోలికి రావొద్దని ఆ న్యాయవాది చెప్పారని గుర్తుచేశారు. దీనితో సంబంధం లేకుండానే బాధితులకు చెల్లించదగిన ఆస్తులు ఉన్నాయని ఆ న్యాయవాది గతంలో చెప్పారన్నారు. కోర్టునే మోసగించడానికి ప్రయత్నించిన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి తగిన శిక్ష తప్పదన్నారు. ఈ నెల 21న హాయ్‌ల్యాండ్ ముట్టడికి పిలుపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దని, బందోబస్తు అవసరం లేదని ప్రభుత్వాన్ని కోరారు. 22వ తేదీ నుంచి గ్రామగ్రామాన సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై 21వ తేదీలోగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆస్తులు దోచుకోవడానికి కుట్ర ‘‘అగ్రిగోల్డ్ వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. హాయ్‌ల్యాండ్‌తో అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని కోర్టుకు చెప్పడం వెనుక బడాబాబులున్నారు. కేసును విచారిస్తున్న సీఐడీ, మంత్రులు, అధికారులు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పకపోవడం గమనార్హం. విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు, లోకేశ్ కుట్ర పన్నారు. లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లను మోసగిస్తున్నారు.బాధితులెవరూ అధైర్యపడొద్దు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల వ్యవధిలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారు’’ – ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, లేళ్ల అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్, న్యాయస్థానానికి ఎవరేం చెప్పారంటే.. - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. – సాక్షి, హైదరాబాద్ -
‘కోర్టు తీర్పే.. ఈ పరిస్థితికి కారణం’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదనీ, ఈ నెల 21 హాయ్‌లాండ్‌ను ముట్టడిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. అక్టోబర్ 31 నాటికి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయకపోతే ఆందోళన చేస్తామని గతంలోనే హెచ్చరించామని అన్నారు. హాయ్ ల్యాండ్ ముమ్మాటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందినదేనని అన్నారు. హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీ కాదని తీర్పు చెప్పి హైకోర్టు ఈ చిత్రమైన పరిస్థితి కారణమైందని వాపోయారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించేందుకు అగ్రిగోల్డ్ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన కొంతమంది ప్రయత్నిస్తున్నారనీ, వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు. హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీ వివరాలను కోర్టు సమక్షంలో అగ్రిగోల్డ్ యజమాన్యం చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ ఆస్తి అగ్రిగోల్డ్‌ది కాదని ప్లేట్ ఫిరాయిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ఆడుతున్న గేమ్‌లో భాగంగానే హాయ్‌ల్యాండ్ విషయంలో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాయ్ ల్యాండ్ ఆస్తి వందశాతం అగ్రిగోల్డ్దే అని పునరుద్ఘాటించారు. హాయ్‌లాండ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్‌కి చెదినది కాదని చెప్పడంతో ఆందోళనకు గురైన కొంతమంది బాధితులు గుండె పోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కు తగ్గబోమనీ, ప్రాణాలైనా వదులుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే నెల 15 తర్వాత ఆమరణ నిరాహారదీక్ష తేదీలను ప్రకటిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. -
గుండెపోటుతో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ మదపాటి జోజి కుమారి(35) గుండె పోటుతో మృతి చెందారు. హయ్‌లాండ్ ఆస్తులు అగ్రిగోల్డ్‌ది కాదని వచ్చిన వార్తలతో మనస్తాపానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు పెద్దఎత్తున కుమారి ఇంటికి తరలివచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును కలిసి కుమారి మరణ వార్తను వివరించారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. హాయ్ల్యాండ్కూ, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇదే సమయంలో హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. మరోపక్క హాయ్‌ల్యాండ్ యాజమాన్యం కూడా తమని అగ్రిగోల్డ్‌కి చెందిన కంపెనీగా భావిస్తూ, తమ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద ఇప్పటికే జప్తు చేశారని, అందువల్ల సర్ఫేసీ చట్టం కింద వాటిని వేలం వేసే అధికారం బ్యాంకులకు లేదని హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేసింది. హాయ్‌ల్యాండ్ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మాటమార్చడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇప్పటి వరకు హాయ్‌ల్యాండ్ తమదేనని చెప్పుకుంటూ ఆ మేర అఫిడవిట్ చేసి, ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. దీనికి అగ్రి గోల్డ్ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా మాట మార్చకుండా గట్టి గుణపాఠం నేర్పుతామంది. అప్పుడు డిపాజిటర్లతో, ఇప్పుడు న్యాయస్థానంతో ఆటలాడుకుంటున్నారని, ఇందుకు ఎదుర్కోబోయే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాయ్‌ల్యాండ్ ఎంఓయూను పరిశీలిస్తే అందులో ఈ కంపెనీ యాజమాన్యం వివరాలుంటాయని, వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ యాజమానులకు, హాయ్‌ల్యాండ్ యాజమానులకు ఉన్న సంబంధం తెలిసి ఉండేదని, ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏముందని నిలదీసింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ యాజమాన్యం విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోనున్నారో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. పర్యవసానాలు ఎదుర్కొంటారు విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్, రిజిస్టర్ విలువను ధర్మాసనం ముందుంచారు. అటు తరువాత హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ వాదనలు వినిపిస్తూ, హాయ్ల్యాండ్కూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తమ పూర్తి వాదనలను వినాలని కోరారు. దీనిపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం వివరణ కోరింది. ఆయన కూడా సంబంధం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. హాయ్‌ల్యాండ్ విషయంలో మాట మార్చినందుకు వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానాలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తామని, వారు మోసం చేసింది కోర్టునే కాదు.. 32 లక్షల మంది డిపాజిటర్లను కూడా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్ పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారా? అని సీఐడీ అధికారులను ధర్మాసనం ప్రశ్నించగా, అతడు ఈ కేసులో నిందితుడు కాదని, అందుకే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధాలను తప్పక తెలుసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల వేలం ప్రక్రియను సవాలు చేస్తూ హాయ్‌ల్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఎస్బీఐ, కర్ణాటక, ఓబీసీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి, వారికి కూడా నోటీసులిచ్చింది. అవ్వా సీతారామారావు, అల్లూరి వెంకటేశ్వరరావుల మధ్య ఉన్న సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే హాయ్‌ల్యాండ్ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. -
అగ్రిగోల్డ్ చైర్మన్ కొడుకుపై హత్యాయత్నం
-
బెజవాడలో కత్తుల స్వైర విహారం..!
సాక్షి, విజయవాడ: కిరాయి హంతకుల ముఠా పట్టపగలే కత్తులతో స్వైర విహారం చేయడంతో నగర ప్రజలు భయందోళనలకు గురయ్యారు. వివరాలు.. దుర్గాపురంలోని అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సదాశివ ప్రసాద్ ఇంట్లోకి గురువారం దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాల కనెక్షన్లని తొలగించారు. ఆయన కుమారుడు సాగర్‌పై కత్తులతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కత్తులతో బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. దేహశుధ్ది.. దాడి చేసి పారిపోతున్న దుండగుల్ని తీవ్రంగా ప్రతిఘటించిన స్థానికులు చివరకు ముఠాలోని ఇద్దరిని పట్టుకోగలిగారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఘటనలో సాగర్ గాయపడ్డారు. దాడి ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు నిరాకరించడం గమనార్హం. ఇక అగ్రిగోల్డ్ మోసం కేసులో సదాశివ ప్రసాద్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సంస్థకు భూముల కొనుగోళ్లలో ప్రసాద్ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. -
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై ఈ శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన హాయ్‌లాండ్ విలువను రూ. 550కోట్లుగా కోర్టు నిర్ణయించింది. 2022 వరకు గడువు ఇస్తే రూ. 8.500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతి పాదనను హైకోర్టు తోసి పుచ్చింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ భవనాన్ని విక్రయించగా వచ్చిన 11 కోట్ల రూపాయలను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు. ఎపీ సీఐడీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించగా, తెలంగాణ సీఐడి తెలంగాణలోని 195 అగ్రిగోల్డ్ అస్తుల విలువను కోర్టుకు సమర్పించింది. హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.3,861 కోట్లు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా రూ.3,861 కోట్ల 76 లక్షలని సీఐడీ ఎస్పీ ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలోను, డిపాజిటర్లకు న్యాయం చేయడంలోను రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ మొత్తం ఆస్తుల వివరాలు హైకోర్టుకు సమర్పించామన్నారు. వాటిలో 366 ఆస్తులకు సంబంధించి వేలానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందులో కొన్నిటిని ఇప్పటికే రూ.47 కోట్లకు వేలం వేశామన్నారు. మిగిలిన అన్ని ఆస్తులను హైకోర్టు ఆదేశాలు ఇవ్వగానే వేలం వేస్తామన్నారు. మూడు బ్యాంకుల్లో రూ.428 కోట్లకు హాయ్‌ల్యాండ్ మార్టిగేజ్ చేశారని, స్టేట్‌బ్యాంక్ ద్వారా రూ.95 కోట్లు ఇచ్చారని తెలిపారు. హాయ్‌ల్యాండ్ వేలానికి ఎస్బీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చిందని, వేలం అనంతరం వివరాలు తమకు తెలిపి తుది అనుమతి తీసుకోవాలని ఆదేశించినట్టు ఉదయ్‌భాస్కర్ చెప్పారు. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన మోసాలపై మొత్తం 29 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఏపీలో 15 కేసులు, తెలంగాణాలో 3, కర్ణాటకలో 9, అండమాన్ నికోబర్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయని చెప్పారు. ఎండీ అవ్వా వెంకటరామారావుతోపాటు డైరెక్టర్లను అరెస్టు చేసి జ్యూడీషీయల్ కస్టడీకి పంపించామన్నారు. మొత్తం 19,18,865 డిపాజిటర్ల (32,02,632ఖాతాలు)లో ఏపీకి చెందిన 11,57,497 మంది(19,43,121ఖాతాలు) ఉన్నారన్నారు. మొత్తం రూ.6,380 కోట్ల 31 లక్షల డిపాజిట్లలో ఏపీకి చెందిన రూ.3,944 కోట్ల 70 లక్షల డిపాజిట్లు ఉన్నాయన్నారు. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు చెందిన కుటుంబాలలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7 కోట్లు పరిహారం అందించినట్టు చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపు, వేలం, డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న సీఐడీ జిల్లా వారీగా కమిటీలు వేసినట్టు చెప్పారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ దీక్ష
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం దీక్షలను ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దీక్షలు పాల్గోన్నారు. ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని బీజేపీ విమర్శించింది. చంద్రబాబు అత్యాశ కారణంగా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన 32 లక్షల కుంటుబాలు రోడ్డున పడ్డాయని. అగ్రిగోల్డ్ కుంభకోణంపై తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోవడంతో బాధితులు అత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని నేతలు మండిపడ్డారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కన్నేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు రోజురోజుకు ఎందుకు కరిగిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో పేదల భుములు కబ్జా చేసినట్లు, పేదల డబ్బులు కూడా తినేయాలని వారు చూస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలకు పాలన కంటే కాంట్రాక్టులపైనే మక్కువ ఎక్కువ. ఏపీలో లాలూచీ పాలన నడుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. న్యాయం జరగక 35 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారు. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి రారని తెలిసి దోచుకుంటున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన నిధులపై లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తుపాను బాధితులకు ఎంత ఖర్చు చేశారు?’’ అని వ్యాఖ్యానించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ దీక్ష
-
అగ్రిగోల్డ్‌కో దండం!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్ట్ కేసులో తాజాగా మరో మలుపు చోటుచేసుకుంది. ఆ సంస్థ ఆస్తుల టేకోవర్ విషయంలో ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు దాగుడుమూతలు ఆడిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ తాజాగా మళ్లీ అదే పంథాను అనుసరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ ప్రతిపాదన నుంచి తాము వెనక్కి వెళ్లిపోతున్నామని హైకోర్టుకు లిఖితపూర్వంగా నివేదించింది. ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తాము ఇలా వెనక్కి వెళ్లిపోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్ యాజమాన్యం, బ్యాంకులు కూడా కారణమని వివరించింది. సంస్థ ఆస్తి, అప్పుల మదింపు కోసం తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినివ్వాలని హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఫౌండేషన్ అధీకృత ప్రతినిధి పియూష్ రజ్‌గరియా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనూ ఇలాగే వెనక్కి.. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలువురు డిపాజిటర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ విషయంలో జీ గ్రూప్‌నకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తి, అప్పుల మదింపు కూడా చేపట్టింది. అయితే, అకస్మాత్తుగా తాము టేకోవర్ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని హైకోర్టుకు చెప్పింది. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకునేలోపే, లేదు లేదు తాము టేకోవర్ రేసులో ఉన్నామని చెప్పింది. ఇలా ఇప్పటికే రెండుసార్లు దాగుడుమూతలు ఆడింది. ఇటీవల అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ రూ.4 వేల కోట్లకు తీసుకుంటామంటూ ఫౌండేషన్ హైకోర్టు ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, వచ్చే నాలుగేళ్లలో అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.4 వేల కోట్లకు పెరుగుతాయన్న అంచనాతో సుభాష్‌చంద్ర ఫౌండేషన్ లెక్కలు వేస్తోందని, ఈ లెక్కలను తాము ఇప్పుడు ఆమోదిస్తే, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని.. అందుకు తాము సిద్ధంగాలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఫౌండేషన్ ప్రతిస్పందనను కోరింది. దీంతో ఫౌండేషన్ తన నిర్ణయాన్ని ఓ అఫిడవిట్ రూపంలో ధర్మాసనం ముందు ఉంచింది. ఏ ఒక్కరూ సహకరించడంలేదు.. ‘అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్‌కు శక్తివంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. అయితే, కొన్ని కారణాలవల్ల వెనక్కి వెళ్లిపోతున్నాం. రూ.4వేల కోట్లకు ఆస్తులను టేకోవర్ చేస్తామన్న మా ప్రతిపాదనను అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం నిర్ద్వందంగా తోసిపుచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందడంలేదు. అంతేకాక.. అగ్రి యాజమాన్యం నుంచి పూర్తి సహకారం లేకుండా ఆస్తుల టేకోవర్ సాధ్యం కానేకాదు. ఆస్తులకు సంబంధించి వారి లెక్కలకు, మా లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. వారి లెక్క ప్రకారం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.25వేల కోట్లు ఉంటే మా లెక్కల ప్రకారం గరిష్టంగా రూ.2,200కోట్లు ఉంటుంది. బ్యాంకులు కూడా తమకు రావాల్సిన బకాయిలు ఇస్తే మా ప్రతిపాదనకు అంగీకరిస్తామని చెప్పాయి. ఎంత చెల్లించాలో మాత్రం స్పష్టంగా చెప్పడంలేదు. అగ్రిగోల్డ్ చెల్లించాల్సిన పన్నుల విషయంలోనూ చాలా అస్పష్టత ఉంది. ఈ అనిశ్చితి వైఖరి మాకు ఇబ్బందికరం. ఈ కారణాలన్నింటి వల్ల మేం వెనక్కి వెళ్లిపోతున్నాం’.. అని సుభాష్ చంద్ర ఫౌండేషన్ కోర్టుకు నివేదించింది. -
అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ
-
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌కు చెందిన మొత్తం ఆస్తులను 4వేల కోట్లరూపాయలకు తీసుకుంటామని జీఎస్ఎల్ గ్రూప్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా 4వేల కోట్ల రూపాయలు చెల్లించటానికి నాలుగేళ్ల గడువు ఇవ్వాలని జీఎస్ఎల్ గ్రూపు కోరింది. దీనిపై పిటిషనర్, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వేళ ఆస్తులను కొనుగోలు చేస్తే మొదట 500కోట్లరూపాయలు డిపాజిట్ చేయాలని వారు కోరారు. ఏడాదిలోపు మొత్తం కోనుగోలు ప్రక్రియను జీఎస్ఎల్ గ్రూపు పూర్తి చేయాలన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. -
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరునుంది. సచివాలయంలో సాయంత్రం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ భేటీలో అగ్రిగోల్డ్‌లో చిన్న మొత్తంలో డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీనిపై హైకోర్టులో ఏ విధంగా ప్రభుత్వ తరపున నివేదిక సమర్పించాలనే అంశంపై చర్చించనున్నారు. ఇక నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపీఐఐసీ)కి వివిధ జిల్లాలలో భూకేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. -
‘తెలంగాణలో అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయండి’
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఉదాసీన వైఖరి సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘంతో కలిసి ఆయన బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 2 లక్షల 65 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ఆ సంస్థ చైర్మన్, డెరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కుంభకోణంలో రూ. 500 కోట్లకు పైగా మోసపోయిన డిపాజిటర్ల పక్షాన నిలవాలని సుధాకర్ రెడ్డి తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారు. సంస్థ నిర్వాహకులపై కేసులు పెట్టాలనీ, ఏపీ ప్రభుత్వం తరహాలో కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో గల ఆ సంస్థ ఆస్తులను జప్తు చేయాలన్నారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఏపీ సర్కార్ జప్తు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ తక్షణమే ఈ వ్యవహారంపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సుధాకర్ రెడ్డి అన్నారు. -
అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్
సాక్షి, కృష్ణా : అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు మంగళవారం మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) విఫలమైంది ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, నిందితులు మరికాసేపట్లో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
‘అగ్రిగోల్డ్ బాధితుల కోసం కార్పస్‌ఫండ్ పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయా లని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 3లక్షల మంది కి పైగా బాధితులు రూ.465 కోట్ల వరకు ఆ సంస్థలో డిపాజిట్లు చేశారన్నారు. డిపాజిట్లు రాక 70మంది చనిపోయారని వారి కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
సుభాష్‌చంద్ర ఫౌండేషన్ యూటర్న్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థ టేకోవర్ తమకు లాభదాయకం కాదని, ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లు తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన జీఎస్సెల్ గ్రూపుకు చెందిన డాక్టర్ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ 24 గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని మంగళవారం హైకోర్టుకు మౌఖికంగా తెలిపింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలను మాత్రం వెల్లడించలేదు. సుభాష్‌చంద్ర గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం చేసిన ఈ అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో అగ్రిగోల్డ్ టేకోవర్ బరిలో సుభాష్‌చంద్ర ఫౌండేషన్ నిలిచినట్లయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటుకు హైకోర్టు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి రిజిష్ట్రార్, వాల్యుయర్, రియాల్టర్లు సమర్పించిన ధరలు తక్కువగా ఉన్నాయంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అస్తుల అసలు విలువలను తాము కోర్టు ముందుంచుతామని, అందుకు గడువు కావాలని ఆయన కోరడంతో, కోర్టు అందుకు అంగీకరిస్తూ కోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్ కేసులో కొత్త మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.రూ.10 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలన్న అభ్యర్థనను జీఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. కోర్టు సమయాన్ని వృథా చేసిన జీఎస్‌ఎల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్, న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జీఎస్ఎల్ గ్రూప్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో 10 ఆస్తులను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన 10 ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని హైకోర్టు, ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఆస్తుల విక్రయానికి త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. కార్పస్ ఫండ్‌ను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసుపై తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కేసుపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ..20 వేల ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరు. రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం అడ్వాన్స్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలల్లో బాధితులకు డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ ద్వారా ఇప్పటివరకూ జమ అయిన నగదును జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని చెప్పారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర
-
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సీతారాం అరెస్ట్
-
అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అవ్వా సీతారాం (సీతా రామారావు)ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు గుర్గావ్లో అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాం అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు సోదరుడు. 2011 వరకూ అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన పథకం ప్రకారం బోర్డు నుంచి తప్పకున్నారు. ఇక ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టులో నిరాకరించడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులను ఎస్సెల్ గ్రూప్ కొనుగోలు చేయకుండా సీతారాం తెర వెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
మీ అత్యాశకు బాధ్యత చంద్రబాబుదా?
కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ‘‘అత్యాశకు పోయింది మీరు. రూ.1,000 చెల్లిస్తే రూ.50,000 వచ్చేస్తాయని ఆశపడి అగ్రిగోల్డ్‌లో ప్రీమియంలు చెల్లించారు. దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది?’’ అని రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘ది ఆర్యాపురం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్’ ప్రధాన కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడారు. ‘‘అగ్రిగోల్డ్‌కు సొమ్ము చెల్లించిన వారంతా మమ్మల్ని అడిగి చెల్లించారా? ఆ సంస్థలో సొమ్ము చెల్లించిన వారంతా అత్యాశకు పోయినవారే. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి దండిగా సొమ్ము వసూలు చేసి, చివరకు బోర్డు తిప్పేసింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా బాధ్యత వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని అన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల సీపీఐ నేతలు యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ... అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని సర్ది చెప్పారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) గురించి మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... మహిళలు చీరలు, జాకెట్లు, ఆఖరికి లో దుస్తులు కూడా కొనుగోలు చేయలేని విధంగా జీఎస్టీ ఉందని ఎద్దేవా చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్న ఆగ్రహం
సాక్షి, తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు శనివారం మంత్రులు అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పలను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ బాధలను మంత్రులకు చెప్పుకున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడు వారిపై విరుచుకుపడ్డారు. అంతేకాక మమ్మల్ని అడిగి డబ్బులు కట్టారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ డబ్బు మొత్తం చంద్రబాబు ఇవాలా అని ఆయన అన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేవారు. వెంటనే అక్కడే ఉన్న హోంమంత్రి చిన్నరాజప్ప జోక్యం చేసుకున్నారు. అంతేకాక బాధితులు ఆగ్రహించడంతో వారికి చినరాజప్ప సర్ది చెప్పారు. దీంతో సమస్య కొంత వరకూ తగ్గుముఖం పట్టంది. గత కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని అధికార పార్టీని కోరుతున్న విషయం తెలిసిందే. -
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నారా లోకేశ్
-
మరోసారి నోరు పారేసుకున్న మంత్రి లోకేష్
-
ఆర్థిక పరిస్థితి బాగాలేదు..
సాక్షి, హైదరాబాద్: జీ ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసే ఉద్దేశం కూడా ఏదీ తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు తాము ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నామని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఎలా చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నామని తెలిపింది. డిపాజిటర్లకు ఏం చేయాలో ఓ నిర్ణయం తీసుకుని, వేసవి సెలవులు పూర్తయిన తరువాత ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేస్తామంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, సుభాష్ చంద్ర ఫౌండేషన్‌తో జాయింట్ వెంచర్‌గా అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. టేకోవర్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, వేసవి సెలవుల అనంతరం చేపట్టే విచారణ నాటికి ఓ స్పష్టత వస్తుందని, అప్పటి వరకు కొంత ఓపిక పట్టాలని అగ్రిగోల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ విజ్ఞప్తి చేశారు. ఏదో జరుగుతుందని డిపాజిట్ల మదిలో ఆశ కల్పించాం. అక్టోబర్ నుంచి సుభాష్ చంద్ర ఫౌండేషన్ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఎంత కాలం ఇలా? ఈ వ్యవహారాన్ని ఐసీయూలో రోగిలా చూడలేం. తప్పుడు సంకేతాలు వెళతాయి’అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అత్యధిక మొత్తాలు కనీసం రూ.100 కోట్లు రాబట్టగలిగే ఆస్తులను గుర్తించి, వేలానికి చర్యలు తీసుకోవాలని సీఐడీని ఆదేశించింది. విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్షయగోల్డ్ ఆస్తులను వేలం వేయండి... అక్షయగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు బుధవారం సీఐడీకి అనుమతినిచ్చింది. సీఐడీ అధికారులు 10 ఆస్తుల వివరాలను కోర్టు ముందుంచారు. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాలోని నాలుగు ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతినిచ్చింది. -
ఆస్తుల విక్రయాన్ని సులభతరం చేయాలి
బేస్తవారిపేట: ప్రభుత్వం అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను విక్రయించడానికి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసి ఆస్తుల విక్రయాన్ని సులభతరం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఎజెంట్ వేల్ఫేర్ అసోషియోషన్ కంభం బ్రాంచ్ అధ్యక్షుడు బీ.బాలిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు ఎజెంట్లు, ఖాతాదారులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన రూ. 3,965 కోట్లను ప్రభుత్వం అడ్వాన్సుగా బాధితుల పిల్లల చదువులకు, వైద్య, వివాహ అవసరాలకు తక్షణమే చెల్లించాలని, కంపెనీ ఫౌండర్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరున, కంపెనీ బినామీలుగా ఉన్న ఆస్తులన్నీంటిని తక్షణమే అటాచ్మెంట్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇన్ఛార్జీ తహశీల్దార్ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కొండా రఘునాధరెడ్డి, పెరుమారెడ్డి శివారెడ్డి, అగ్రిగోల్డ్ ఎజెంట్లు, బాధితులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ కంభం : అగ్రిగోల్డ్‌లో నష్టపోయిన బాధితులందరికి వెంటనే న్యాయం చేయాలని సీపీఐ నియోజకవర్గ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కందులాపురం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ జితేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం అనంతరం ప్రభుత్వం అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్మును జమచేసుకొని మిగిలిన మొత్తాన్ని ఇచ్చిన వాగ్దానాల మేరకు బాధితులకు చెల్లించాలని, అవ్వా శీతారామరావుతో పాటు అరెస్టు కాకుండా బయట ఉన్న డైరక్టర్లను అరెస్టు చేయాలని, డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కార్యక్రమంలో కంభం బ్రాంచి అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు. -
తీరని అగ్రిగోల్డ్ బాధితుల వ్యధ
-
అది ‘బాబు’ గోల్డ్: బొత్స
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గోల్డ్‌గా మారుతున్నాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ముసుగులో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు అక్కడ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఎవరికీ తెలియకుండా మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ను కలిసి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు.బాబు సింగపూర్ పర్యటనకు ఎందుకు వెళ్లారో రెండు రోజుల్లో బయటపెడతామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. -
బాధితుల్లో అసహనం పెరుగుతోంది
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల్లో నానాటికి సహనం సన్నగిల్లుతోందని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడేళ్లగా అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర కష్టాలను భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎస్సెల్ గ్రూప్ అఫిడవిట్ తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లాలో కోటేశ్వరరావు అనే కస్టమర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వెల్లడించారు. రేపు (శనివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతున్నట్లు చెప్పారు. బాధితల కోసం తక్షణమే రూ.3965 కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు. ఈ నెల 25న కోర్టులో సమర్పించే అఫిడవిట్లో, కోర్టు అనుమతించిన విధానంలోనే ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఆస్తుల విక్రయ బాద్యతను ప్రభుత్వమే స్వీకరిస్తామని అఫిడవిట్ వేయాలంటూ సూచించారు. హైకోర్టు సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి సత్వర న్యాయం జరిగేలా చూడాలంటూ కోరారు. పరివార్, టేకు చెట్ల పథకాల్లోని ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. నేటికి కూడా చాలా మంది బాధితులు ఇంకా ఆన్లైన్ చేయించుకోలేదని వారికోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లక్షల కుటుంబాలకు అన్యాయం చేసి అరెస్టుకాకుండా బయట తిరుగుతున్న అవ్వా కుటుంబ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల న్యాయం కోసం 16నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న ఎమ్మార్వోలకు వినతిపత్రాలు, 23న ధర్నాలు, ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 25న కోర్టులో బాధితులకు అనుకూలంగా అఫిడవిట్ వేయాలని, లేని పక్షంలో మే మొదటి వారంలో ఛలో సెక్రటేరియట్ చేపడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకూ శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపామని చెప్పిన ఆయన, న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందంటూ హెచ్చరించారు. ఎస్సెల్ గ్రూప్ చైర్మెన్‌పై వత్తడి తెచ్చి వెనక్కి వెళ్లేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అప్పుల కన్నా ఆస్తులు తక్కువ అనేది అవాస్తవమని నాగేశ్వరరావు అన్నారు. -
అగ్రిగోల్డ్‌తో అగ్లీ గేమ్స్!
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు డిపాజిటర్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లూ అగ్రిగోల్డ్ సంస్థను స్వాధీనం చేసుకుని (టేకోవర్ చేసి) డిపాజిటర్లకు న్యాయం చేస్తామని నమ్మబలుకుతూ వచ్చిన ఎస్సెల్ గ్రూప్.. ఒక్కసారిగా మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.4,262 కోట్లకు మించదని.. డిపాజిటర్లకు రూ.పది వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థను టేకోవర్ చేయడం తమకు గిట్టుబాటు కాదని ఎస్సెల్ గ్రూప్ తేల్చిచెప్పింది. ఇదే క్రమంలో అగ్రిగోల్డ్ సంస్థ భూములను అభివృద్ది చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయంచేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాజీ ఎంపీ అమర్ సింగ్ చర్చలు జరుపుతున్నారని.. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని ఎస్సెల్ గ్రూప్ హైకోర్టును కోరింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటిలో విలువైన ఆస్తులను కాజేయడం, ఇప్పటికీ స్వాధీనం చేసుకోని వేలాది కోట్ల విలువ చేసే ఆస్తులను అప్పనంగా కొట్టేసే ఎత్తుగడలో భాగంగానే ఎస్సెల్ గ్రూప్‌తో కొత్త నాటకానికి తెరతీయించారనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ముసుగులో ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన చంద్ర బాబు.. తాను బసచేసిన ఏపీ భవన్‌లోనే అమర్‌సింగ్, ఎస్సెల్ గ్రూప్ సంస్థ ప్రతినిధులతో రహస్యంగా చర్చలు జరపడం వీటికి బలం చేకూర్చుతోంది. ముఖ్యనేత గుప్పెట్లో..: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందిస్తూ.. రిటైర్డు జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి, ఆ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులను వేలం వేసి, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా సీఐడీ విభాగాన్ని నిలువరించిన ప్రభుత్వ పెద్దలు.. ఉద్దేశపూర్వకంగా విలువైన ఆస్తులను, జప్తు చేయని వేలాది ఎకరాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 85.13 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడ సముద్రతీరంలో 106.44 ఎకరాల్లో నిర్మించిన రిసార్టుపై ముఖ్యనేత కన్నేశారు. అందుకే వేలం వేసే ఆస్తుల జాబితా నుంచి వాటిని తప్పించారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. అలాగే.. హైకోర్టు నేతృత్వంలో నిర్వహించే వేలం ప్రక్రియకు సహకరించకుండా సర్కార్ పెద్దలు చక్రం తిప్పారు. దీంతో చంద్రబాబు దన్నుతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలూ చెలరేగిపోయారు. ఆ సంస్థల ఆస్తులపై కన్నేశారు. కేసు నమోదై 21 నెలలు గడుస్తున్నా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు తప్పుబట్టడంతో గత్యంతరంలేక ఐదుగురిని అరెస్టుచేశారు. కీలకమైన అవ్వా సీతారాంతోపాటూ 24 మంది డైరెక్టర్లను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. బిగ్‌బాస్..అదిరిపోయే ప్లాన్: ఆస్తుల వేలం ప్రక్రియను హైకోర్టు కొనసాగిస్తున్న క్రమం లో.. విలువైన ఆస్తులు చేజారిపోతాయని గ్రహించిన ముఖ్యనేత పావులు కదిపారు. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకుని డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చిందంటూ ఓ వర్గం మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సెల్ గ్రూప్ తరపున మాజీ ఎంపీ అమర్‌సింగ్ సీఎం చంద్రబాబుతో రాయ‘బేరాలు’ జరిపారు. అనంతరం అగ్రిగోల్డ్ సంస్థను తాము టేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. డిపాజిటర్లకు చెల్లించేందుకు రూ.రెండు వేల కోట్లను డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సెల్ గ్రూప్ హైకోర్టుకు విన్నవించింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు 18,395.74 ఎకరాల భూమి, 95,157.07 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాలు ఉన్నట్లు సీఐడీ తేల్చింది. ఈ ఆస్తుల విలువ పది వేల కోట్లకుపైగా ఉంటుందని లెక్కకట్టింది. కానీ.. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాగా, అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు వడ్డీతో సహా చెల్లించాల్సింది రూ.పది వేల కోట్లలోపే ఉంటుందని సీఐడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసిన సంస్థకు భారీఎత్తున లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు స్పష్టీకరించారు. కానీ.. ఎస్సెల్ గ్రూప్ కొత్త పల్లవి అందుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదంటూ హైకోర్టుకు ఇటీవల నివేదించింది. ఆస్తుల విలువ అంటే రూ.4,262 కోట్లలో కేవలం 40 శాతం నిధులను డిపాజిటర్లకు ఇచ్చేందుకు డిపాజిట్ చేయగలమని ఓవైపు చెప్పిన ఎస్సెల్ గ్రూప్.. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రతిపాదనపై మాజీ ఎంపీ అమర్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని హైకోర్టును కోరడం గమనార్హం. రహస్య ఒప్పందంలో భాగంగానే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఎస్సెల్ గ్రూప్ కొద్ది నెలల్లోనే రూ.4,262 కోట్లకు తగ్గించి చూపడంపై సీఐడీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సీఎంతో కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ విలువను ఎస్సెల్ గ్రూప్ తగ్గించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను తక్కువ ధరకు పొందేందుకు వాటి విలువను తక్కువగా చూపించారనే విమర్శలున్నాయి. కృష్ణా జిల్లా కీసరలో 324.06 ఎకరాల భూమిని ఓ మంత్రి, నూజివీడు మండలం రామన్నగూడెంలో 110.65 ఎకరాల విలువైన భూమిని మరో కీలక మంత్రి, వీరుపాలడు మండలం చింతవరంలో 54.67 ఎకరాల భూమిని కేంద్ర మాజీమంత్రి ఒకరు తక్కువ ధరకు కాజేసేందుకే వేలం ప్రక్రియను అడ్డుకున్నారని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. చంద్రబాబు హయాంలోనే ప్రారంభం రాష్ట్రంలో 1995లో అగ్రిగోల్డ్ సంస్థ పురుడుపోసుకుంది. దీని అక్రమాలను ఆదిలోనే పసిగట్టిన సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తక్షణమే లావాదేవీలు నిలిపేయాలంటూ మార్చి 31, 1998న నోటీసులిచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వాన్నీ అప్రమత్తం చేసింది. అప్పటికి అగ్రిగోల్డ్ సేకరించిన డిపాజిట్లు రూ.13.50 కోట్లే. సెబీ మార్గదర్శకాల మేరకు చంద్రబాబు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి దన్నుగా నిలిచారు. 83 అనుబంధ సంస్థల పేర్లతో 2004 నాటికే రూ.6,500 కోట్లకుపైగా డిపాజిట్లను సేకరించింది. 2014 నాటికి డిపాజిట్లు 6,850 కోట్లకు చేరుకున్నాయి. డిపాజిటర్లకు గడువు మీరినా చెల్లింపులు చేయకపోవడంతో అలజడి మొదలైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్లు చెల్లించడంలేదని ఓ డిపాజిటర్ ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 24, 2014న నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీంతో అగ్రిగోల్డ్ ఆస్తులు తమ చెప్పుచేతల్లో నుంచి వెళ్లకుండా ఉండేందుకు జనవరి 5, 2015న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అనంతరం రాష్ట్ర పరిధిలోని 16,857.81 ఎకరాల భూమిని మాత్రమే జప్తుచేస్తూ ఫిబ్రవరి 20, 2015న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంతోపాటూ కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలు, ఆ సంస్థల డైరెక్టర్లు డిపాజిటర్ల నుంచి సేకరించిన నిధులతో వ్యక్తిగత పేర్లపై కొన్న ఆస్తులను జప్తు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. 1998లో సెబీ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకుని ఉంటే అక్రమాల పర్వం రూ.13.50 కోట్లకే పరిమితమయ్యేది. కానీ, చర్యలు తీసుకోకుండా ఆ సంస్థకు అండగా నిలబడటంవల్లే లక్షలాది మంది డిపాజిటర్లకు అన్యాయం జరిగింది. -
నేడు విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం
-
ఉద్యమ బాట పట్టనున్న అగ్రి బాధితులు
సాక్షి, విజయవాడ : న్యాయం కోసం అగ్రిగోల్డ్ బాధితులు ఉద్యమ బాట పట్టనున్నారు. గురువారం విజయవాడలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి రావు బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యవర్గ సమావేశం అనంతరం, ఈ నెల 13న దాసరి భవన్లో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అందులో ప్రభుత్వ వైఖరిపై, తాజా పరిణామాల నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు. -
‘తెరచాటు వ్యక్తుల’తో బాబు రహస్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఊహించిందే జరుగుతోంది. లక్షల మంది డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే దిశగా తెర వెనుక పావులు కదులుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలోనే ఇది జరుగుతుండటం గమనార్హం. ప్రత్యేక హోదా సాధన పేరుతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ సంగతి పక్కనపెట్టి అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో తీరికలేకుండా గడిపారు. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చైర్మన్ సుభాష్ చందర్జీ, ప్రముఖ రాజకీయ నేత అమర్ సింగ్‌లతో చంద్రబాబు తను బస చేసిన చోట రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా తాజాగా వెలుగు చూశాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా దక్కించుకోవాలన్న అంశంపై మంతనాలు సాగించినట్లు సమాచారం. వెనక్కి తగ్గింది అందుకే.. తాము అనుకున్న పథకాన్ని అమలు చేసేందుకు అమర్‌సింగ్, సుభాష్‌లతో చంద్రబాబు భేటీ తరువాత సుభాష్ చంద్ర ఫౌండేషన్ కొత్త డ్రామాకు తెరలేపింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేస్తామంటూ హైకోర్టు సాక్షిగా చెప్పిన ఆ సంస్థ అందులో భాగంగానే అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు, అది చెల్లించాల్సిన అప్పులకు పొంతనే లేదని, అగ్రిగోల్డ్ టేకోవర్ తమకు ఆర్థికంగా ఎంతమాత్రం లాభసాటి కాదంటూ చేతులెత్తేసింది. ఇదే సమయంలో డిపాజిటర్ల పేరు చెప్పి అమర్‌సింగ్‌ను తెరపైకి తెచ్చింది. అమర్‌సింగ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని కోర్టుకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–తమ ఫౌండేషన్ సంయుక్తంగా అగ్రిగోల్డ్ స్థిరాస్తులను అభివృద్ధి చేసేలా అమర్‌సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి అగ్రిగోల్డ్ గ్రూపులో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామంది. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ అమర్‌సింగ్ పేరును తెరపైకి తేవడంపై న్యాయమూర్తులు సైతం ఒకింత విస్మయానికి గురయ్యారు. కోర్టులో ఉన్న డిపాజిటర్లు ఖంగుతిన్నారు. ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన హైకోర్టు... తెర వెనుక వ్యక్తులతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలను నిర్ధారించుకునేందుకు వివరణ కోరింది. -
తెరవెనుక వ్యక్తులతో మాకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో పదివారాల గడువు కోరిన ఎస్సెల్ జీ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో తమ గ్రూప్ చర్చలు జరపాల్సి ఉందని.. ఈ విషయంలో ప్రముఖ రాజకీయనేత అమర్‌సింగ్ కూడా ప్రభుత్వంతో సమావేశం కావాల్సి ఉన్నందున మరింత సమయం కోరుతూ ఫౌండేషన్ చేసిన వినతిని హైకోర్టు ధర్మాసనం సోమవారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేస్తూ తెరవెనుక వ్యక్తులతో తమకు సంబంధంలేదని తేల్చిచెప్పింది. అంతేకాక, టేకోవర్ విషయంలో తన వైఖరి ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువకు, చెల్లించాల్సిన అప్పులకు పొంతన లేదంటూ టేకోవర్ నుంచి ఫౌండేషన్ ఇప్పటికే తప్పుకుంది. కానీ, తాజాగా ప్రభుత్వంతో చర్చ పేరుతో గడువు కోరడం.. అమర్‌సింగ్ పేరును ప్రస్తావించడంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆస్తులకూ, అప్పులకూ వ్యత్యాసం విచారణలో భాగంగా సోమవారం సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి. శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను మదింపు చేయించామన్నారు. ఆస్తుల విలువ రూ.4,262 కోట్లు ఉండగా అప్పులు రూ.10వేల కోట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో టేకోవర్ నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో తమ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమర్‌సింగ్ తమకు తెలిపారని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి స్పష్టత కోసం 8–10 వారాల గడువునివ్వాలని కోరారు. ప్రభుత్వమే ఎందుకు తీసుకోదు..? దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేసుకోవడం ఆర్థికంగా మీకు సాధ్యం కానప్పుడు, ఇక వాయిదా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. తప్పుకుంటామని చెబుతూనే తెర వెనుక ఉన్న ఎవరో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని, వాటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. గడువునిచ్చినంత మాత్రాన రూ.7,500 కోట్ల వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతుందా? అంటూ ప్రశ్నించింది. తెర వెనుక వ్యక్తి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తే డిపాజిటర్లను ప్రభుత్వమే కాపాడాల్సి ఉంటుంది. అయినా, సంయుక్తంగా ఎందుకు? ప్రభుత్వమే స్వయంగా ఎందుకు తీసుకోరాదు.?’ అని ప్రశ్నించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ.. ప్రభుత్వమే టేకోవర్ చేస్తామంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ వివరణ కోరింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రెండు వారాల గడువు కావాలని ఆయన కోరగా ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అక్షయ గోల్డ్ కేసుల విచారణ సైతం 25వ తేదీకి వాయిదా పడింది. గుర్తించిన ఆస్తుల వేలం డ్రాఫ్ట్ నోటీసును తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
దాచుకున్న సొమ్ము చేతికందకుండానే..
కొలిమిగుండ్ల: కూలీకి వెళ్తే కానీ ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి ఆమెది. అలాంటి దీనస్థితిలో కూడా బిడ్డ పెళ్లి కోసం తినీ తినక నెలకింత అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకుంది. అవసరానికి ఆ డబ్బు చేతికందలేదు. అప్పు చేసి కార్యం పూర్తి చేసింది. రోజులు గడిచాయి.. అయినా దాచుకున్న సొమ్ము తిరిగి వస్తోందో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో మానసికంగా కుంగిపోయి చివరకు ప్రాణం వదిలింది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితురాలు ఓబులమ్మ(50) సోమవారం మృతి చెందింది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆమెకు ఓ కుమార్తె ఉంది. 15 ఏళ్ల క్రితమే భర్త ఏసుదాసు ఆమెను వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి కూలీకి వెళ్తూ బిడ్డను పోషించుకుంది. బిడ్డతోపాటు ఒంటరిగా ఉన్న ఆమె తల్లి మార్తమ్మను కూడా చెంతకు చేర్చుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్ములో రూ. 50 వేలు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసింది. బిడ్డ పెళ్లికి కూడా డబ్బు చేతికి అందక పోవడంతో అప్పు చేసింది. ఈ క్రమంలో సంస్థ బోర్డు తిప్పేయడంతో మానసికంగా కుంగిపోయింది. అనారోగ్యంతో మంచం పట్టి.. దాచుకున్న సొమ్ము చేతికందకుండానే మృత్యుఒడికి చేరింది. ఓబులమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు అందజేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తుల పత్రాలన్నింటినీ ఎస్సెల్ గ్రూప్‌నకు అందజేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఎస్సెల్ గ్రూపు కోరిన మేరకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రిగోల్డ్ సీనియర్ న్యాయవాది ఎల్.రవిచంద్ర తెలిపారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు తాకట్టులో ఉంటే సంబంధిత పత్రాలను బ్యాంకులు ఎస్సెల్ గ్రూపునకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు–అప్పుల పత్రాలు అందుబాటులో లేకుంటే సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా సేకరించి అందజేయాలని అగ్రిగోల్డ్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ
విజయనగరం మున్సిపాలిటీ: అగ్రిగోల్డ్ మోసపూరిత వైఖరితో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు బాసటగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సభ్యుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో కమిటీ కో ఆర్డినేటర్ లేళ్లఅప్పిరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో బాధితులుగా అండగా పోరాటం చేయాలని 11 మంది సభ్యులు తీర్మానించారన్నారు. పోరాటాలకు ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం సాగించాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అథిగాగా హాజరయ్యారని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై కమిటీ సభ్యులకు బొత్స దిశా నిర్దేశం చేశారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ మోసంలో అధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే బాధితులుగా ఉన్నారని, ఒక్క విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖ లెక్కల ప్రకారం వెబ్సైట్లో లక్షా ఒక వెయ్యి 341 మంది బాధితులు నమోదయ్యారన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి న్యాయం జరగకపోవడంతో పలువురు ఎజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం సాగించాలని సూచిం చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ప్రసాదరామకృష్ణ, గౌరు.వెంకటరెడ్డి, కన్నబాబు, అధికార ప్రతినిధి టి.జె.సుధాకర్‌బాబు, సురేష్‌బాబు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారన్నారు. -
‘అగ్రిగోల్డ్ బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలి’
సాక్షి విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నా, బాధితులకు ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదేశాలతో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందరర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏజెంట్లు, డిపాజిట్‌దారుల ఆత్మహత్యలు తదితర అంశాలపై ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ‘బాధితులు, ప్రతినిధుల మనోభావాలను కూడా తెలుసుకున్నాం. దేశవ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలు అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు అసెంబ్లీ సమావేశాలకు ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వైఎస్ జగన్ కూడా బాధితులకు అండగా నిలిచారు. ఇప్పటికే 170మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల మేరకు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలి. జీవో ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కేవలం రెండు కుటుంబాలకే పరిహారం ఇవ్వడం బాధాకరం. మిగిలిన కుటుంబాల గోడు ప్రభుత్వానికి పట్టదా?. చెల్లింపుల కన్నా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువ అని సీఐడీ ప్రకటించింది. చెల్లింపులు రూ.7వేల కోట్లు ఉంటే, ఆస్తులు 35వేల కోట్లు అని సీఐడీ ప్రకటించింది. ప్రభుత్వం ఆస్తులను గ్యారెంటీగా తీసుకుని ముందస్తు చెల్లింపులు చేయాలి. కోర్టులు కూడా అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులకు అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్ను ఉండటం వల్లే ఆస్తుల వేలం ప్రక్రియ వేగంగా జరగడం లేదు. రాష్ట్రంలోని 20 లక్షలమందికి న్యాయం జరగాలి. ప్రతి జిల్లాకు వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి బృందం వెళుతుంది. అందరినీ కలుస్తాం. ధైర్యం చెబుతాం. ప్రభుత్వం మెడలు వంచి న్యాయం చేసే వరకూ పోరాడతాం. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు పోస్ట్‌మార్టం నివేదిక కావాలని వేధిస్తున్నారు. డబ్బు కోసం ఎవరైనా తమ వారి చావును తప్పుగా చెబుతారా? ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. అగ్రిగోల్డ్ ఆస్తులను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను పరిష్కరిస్తుంది. న్యాయస్థానం పరిధిలో జరుగుతున్న ఆస్తుల వేలంతో పాటు దర్యాప్తును కూడా కోర్టు పరిధిలోకి తేవాలి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం. అవసరం అయితే కోర్టులో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం పనిచేసే అన్ని సంఘాలతో కలిసి పోరాడతాం.’ అని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి, సభ్యులు కె.పార్థసారధి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, కొట్టముడి సురేష్ బాబు, గౌరు వెంకటరెడ్డి, కురసాల కన్నబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, ముదునూరు ప్రసాదరాజు, మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా బొత్స సత్యనారాయణ, వెన్నపూస వేణుగోపాలరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
‘అగ్రిగోల్డ్’పై ప్రభుత్వ ఉదాశీనతను సహించం: లేళ్ల
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ వంచితులైన 20లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారని, ఈ విషయంలో ప్రభుత్వ ఉదాశీనతను సహించేది లేదని స్పష్టం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలోను పలువురు బాధితులు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసు కుంటున్నారన్నారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని విజయవాడలో ఈనెల 20న(శనివారం) నిర్వహిస్తున్నామని చెప్పారు. బాధితుల కోసం పనిచేసే అందరినీ కలుపుకుని వారికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. బాధితుల్లో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఏడు నెలల కిందట జి.ఓ జారీ చేసినా నేటికీ పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం రూ.1200 కోట్లు చెల్లించి 14లక్షల మందికి ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అప్పిరెడ్డి అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్సీపీ కమిటీ
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ తొలి నుంచీ పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా వారికి అండగా నిలబడేందుకు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 11 మంది పార్టీ నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ కమిటీ ఆయా ప్రాంతాల వారీగా బాధితుల సమాచారం సేకరించడంతో పాటు వారికి అండగా నిలుస్తూ.. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీలో కొలుసు పార్థసారథి (కృష్ణా జిల్లా), ఆదిమూలపు సురేష్ (ప్రకాశం), పి.అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు), కురసాల కన్నబాబు (తూర్పు గోదావరి), ముదునూరి ప్రసాదరాజు (ప.గోదావరి), జోగి రమేశ్ (కృష్ణా), కొట్టమూడి సురేష్‌బాబు (వైఎస్సార్ జిల్లా), గౌరు వెంకటరెడ్డి (కర్నూలు), టీజేఆర్ సుధాకర్‌బాబు (గుంటూరు), మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు) ఉన్నారు. కమిటీ కోఆర్డినేటర్‌గా అప్పిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ప్రకటనలో వివరించారు. -
8 మంది అగ్రి గోల్డ్ డైరెక్టర్ల అరెస్ట్
లీగల్ (కడప అర్బన్) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో ఆ సంస్థకు సంబంధించిన 8 మంది డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి వైఎస్సార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు కేంద్రకారాగారానికి తరలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో ఉన్న 8 మంది డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పరిచారని తెలిపారు. అరెస్టయిన అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో శివనారాయణ, వెంకటసుబ్రమణ్యం, శర్మ, ఉదయభాస్కర్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, ఉమతో పాటు మరొకరు ఉన్నారన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వారి తరపున న్యాయపోరాటంలో కూడా భాగస్వాములం అవుతామని పార్టీ నేతలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల కుటుంబాలతో ముడిపడి ఉన్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సింది పోయి ఇంకా జటిలం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయిస్తే 20 లక్షల బాధిత కుటుంబాల్లో ముందుగా 14 లక్షల కుటుంబాల సమస్య తీరిపోతుందన్నారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీ తరపున పోరాడుతామన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా కమిటీ వేస్తామన్నారు. -
పరిహారమా? పరిహాసమా?
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల్ని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రభుత్వ పెద్దల హామీలు ఆ సంస్థ చేసిన మోసంలాగే ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థలో సొమ్ము తిరిగి వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూసినా అది రాకపోవడంతో చాలా మంది మనోవ్యథకు గురై మృతి చెందుతున్న సంగతి తెల్సిందే. వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు పరిహాసం చేస్తోందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో 19.52 మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. తమను ఆదుకోవాలంటూ మూడున్నరేళ్లుగా డిపాజిటర్లు, ఏజెంట్లు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనే తదితర అనేక డిమాండ్స్‌పై ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంటూ ఈ ఏడాది మార్చి 23న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం సెప్టెంబర్ నెలలో రూ. 5 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మూడు నెలలు గడిచినా బాధిత కుటుబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ పూర్తికాలేదు. ఎప్ఐఆర్, పోస్టుమార్టం మెలిక.. పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ ఉన్న వారికి పరిహారం ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 80 జారీ చేయడం వివాదాస్పమైంది. వాస్తవానికి కేవలం 11 మంది మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్లు మాత్రమే ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వెంటనే వివరాలను పోలీసులకు తెలియజేయకపోవడంతో చాలా మంది మృతులకు సంబంధించిన ఆ రిపోర్టులు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. దీనిపై బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు నిర్ధారించిన అనంతరం అందరికీ న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా సర్కారు హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదికలు కావాలంటూ అధికారులు మెలికపెడుతున్నారు. నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో పరిహాసమే ఎదురవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇచ్చింది ఇద్దరికే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 మంది అగ్రి బాధితులు మృతి చెందారు. వీరిలో 90 మందిని మాత్రమే పోలీసులు ధ్రువీకరించారు. వీరికి కూడా రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడంలేదు. విజయనగరం జిల్లాకు చెందిన కేవలం ఇద్దరికి మాత్రమే రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. బాధిత కుటుంబాల వారు పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రభుత్వం విడుదల చేసిన జీఓలకే విలువ లేకపోతే ఎలాగని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, ఆత్యహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం 30 గంటల సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. తొలుత అగ్రిగోల్డ్ బాధితులు సీపీఐ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడిన అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు విలువ లేకుండా పోయిందన్నారు. జీఓ విడుదల చేసి మూడునెలలు అవుతున్నా పరిహారం అందలేదని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరికని స్పష్టంచేశారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడించేందుకు వెనుకాడబోమన్నారు. -
వేధింపులే ప్రాణం తీశాయి!
సాక్షి, గుంటూరు: అవినీతిని వెలికి తీసి వార్తలు రాశాడని కక్ష గట్టారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. తన ఇంటిలో జరిగిన దొంగతనాన్ని సైతం రాజకీయంగా వాడుకుని సొమ్ము రికవరీ కాకుండా చేశారు. చివరకు భౌతిక దాడులకూ తెగబడ్డారు. జర్నలిజం నుంచి పక్కకు తప్పుకున్నా వారి కసి తీరలేదు. అతని బంధువులకు చెందిన ఎనిమిది ఎకరాల పొలంలో తమ అనుచరుల చేత దౌర్జన్యంగా గ్రావెల్ క్వారీ తవ్వించారు. ఇదీ సోమవారం చిలకలూరిపేటలో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్‌పై కొనసాగిన వేధింపుల పర్వం. చచ్చే వరకూ వెంటాడి వేధించారని విలేకరి కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఆయన భార్య వేధింపుల వల్లే మాజీ విలేకరి బలయ్యాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పురుగు మందు తాగి మాజీ విలేకరి ఆత్మహత్య మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్ (40) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన సురేంద్రనాథ్ సోమవారం చిలకలూరిపేటలోని ఓ లాడ్జి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి గదిలో కూల్‌డ్రింక్ సీసా, పురుగుమందు డబ్బాను గుర్తించారు. సురేంద్రనాథ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, సురేంద్రనాథ్ భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అక్రమాలు వెలికితీశాడనే సురేంద్రనాథ్ రెండేళ్ల క్రితం సాక్షి, అంతకు ముందు ఆంధ్రజ్యోతి, ఇతర పత్రికల్లో విలేకరిగా పనిచేశాడు. చిలకలూరిపేట, యడ్లపాడులో విధులు నిర్వర్తించాడు. ఓ మంత్రి భార్య కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతోపాటు వారి దౌర్జన్యాలు, అవినీతి వ్యవహారాలపై వార్తలు రాశాడు. విలేకరిగా పనిచేస్తున్నప్పుడు ఆయన యడ్లపాడు వంతెన వద్ద రాత్రి సమయంలో ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. సురేంద్రనాథ్ ఆర్థిక వనరులపై మంత్రి అనుచరులు దృష్టి సారించడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలిసింది. యడ్లపాడు మండలంలో తన బంధువుల పేరిట కొనుగోలు చేసిన ఎనిమిది ఎకరాల భూమిలో ఇటీవల మంత్రి అనుచరులు గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఇదే భూమిని ఇతరులకు విక్రయించేందుకు సురేంద్ర అడ్వాన్స్‌లు తీసుకున్నట్లు సమాచారం. ఈ భూమిని మంత్రి అనుచరులు తవ్వేయడంతో చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని భూమి కొన్నవారు ఒత్తిడి చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రౌడీషీట్ వెనుక మంత్రి హస్తం గతంలో విలేకరిగా పనిచేస్తున్న సమయంలోనే యడ్లపాడులో చికెన్ స్టాల్ వద్ద జరిగిన చిన్నపాటి వివాదంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి సురేంద్రనాథ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమెదు చేయించారు. ఇదే కేసులో సాక్షులను బెదిరించినట్లు మరో కేసు బనాయించారు. ఈ రెండు కేసుల ఆధారంగా యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ తెరిపించారు. ఎలాంటి నేరచరిత్ర లేకున్నా రౌడీషీట్ తెరవడం వెనుక మంత్రి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేంద్రనాథ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారు తర్వాత పట్టుబడినా పోలీసులు ఎలాంటి రికవరీ చేయలేదు. వ్యభిచారంపై వార్త రాయడంతో మంత్రి సన్నిహితురాలైన ఓ మహిళా ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో సురేంద్రనాథ్ ఇంటి వద్ద ఆందోళన చేయించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. -
అగ్రిగోల్డ్ తీరుపై హైకోర్టు అసహనం
-
టేకోవర్‌పై తేల్చుకోండి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపు తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు అసలు టేకోవర్‌పై ముందుకు వెళతారా లేదా పక్కకు తప్పుకుంటారో తేల్చి చెప్పాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల యాజమాన్యపు హక్కులపై అభ్యంతరాలు తెలపటంపై పత్రికా ప్రకటనల జారీకి అనుమతినివ్వాలన్న ఎస్సెల్ గ్రూప్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. ఈ దశలో ప్రకటనల జారీకి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. అభ్యంతరాలను కోరితే పరిస్థితి జటిలమై కేసు పురోగతికి తీవ్ర అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. కంపెనీ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియ తరువాత కావాలంటే పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవచ్చునని తెలిపింది. పత్రికా ప్రకటన జారీకి అనుమతినివ్వని పక్షంలో ముందుకెళ్లడం కష్టసాధ్యమని ఎస్సెల్ గ్రూపు పేర్కొనటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. టేకోవర్‌పై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని సూచించింది. ఒకవేళ తప్పుకోవాలని భావిస్తే తదుపరి విచారణ కంటే ముందే మెమో రూపంలో తెలియచేయాలని ఆదేశించింది. దాని ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఆస్తుల వేలం ప్రక్రియను కొనసాగిస్తామంది. అగ్రిగోల్డ్ ఆస్తులు మాత్రమే తీసుకుంటారా? లేక కంపెనీలు మాత్రమే టేకోవర్ చేస్తారా? లేక అన్నీ కలిపి తీసుకుంటారా? అనే విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వాలని ఎస్సెల్ గ్రూపును ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 18వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఎస్సెల్ గ్రూపు తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వినతిని ఈ సందర్భంగా ధర్మాసనం ఆమోదించింది. అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు సీఏలకు అనుమతి మరోవైపు ఏలూరు జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్లను అనుమతించాలని జైలు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా అక్షయ గోల్డ్ కేసు జనవరి 18కి వాయిదా పడింది. డిపాజిటర్లకు ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? తదితర వివరాలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని అక్షయ గోల్డ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. -
హైకోర్టులో అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు విచారణ..
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఈ సంస్థల్లో ప్రజలు రూ. లక్షల్లో డిపాజిట్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్ దారులకు నగదు చెల్లించకుండా చేతులెత్తిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైకోర్డులో అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు విచారణ జరుగుతోంది. అగ్రిగోల్ ఆస్తుల పూర్తి వివరాలు ఇంకా మాకు అందలేదని జీఎస్ఎల్ గ్రూప్ హైకోర్డుకు తెలిపింది. అంతేకాక మూడు నెలల సమయం కావాలని జీఎస్ఎల్ గ్రూప్ కోర్టును కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు తెలుసుకోనేందుకు ఆ సంస్థకు జనవరి 18 వరకూ సమయం ఇచ్చింది. ఆలోపు 70 శాతం ఆస్తుల వివరాలు ఇవ్వాలని సంస్థకు హైకోర్టు సూచించింది. పిటిషనర్ మాట్లాడుతూ.. రూ. వెయ్యికోట్లు డిపాజిట్ చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు జనవరి 18కి వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్ కంపెనీల టేకోవర్‌పై ఎస్సెల్ గ్రూప్ వెనక్కి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీలతో పాటు మొత్తం ఆస్తులను టేకోవర్ చేస్తామని గతంలో చెప్పిన ఎస్సెల్ గ్రూపునకు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. కంపెనీలను కాకుండా తాము వాటి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. టేకోవర్ కాకుండా కేవలం ఆస్తులను తీసుకుంటామనడం ఎంత వరకు సాధ్యమో చెప్పాలంది. ఆస్తులకు ఇంకా ఎక్కువ చెల్లిస్తామని ఎవరైనా ముందుకు వస్తే ఏం చేయాలని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఆస్తుల స్వాధీన ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసేందుకు మూడు నెలల గడువు కావాలని ఎస్సెల్ గ్రూపు తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం కోర్టును కోరారు. తాకట్టులో ఉన్న ఆస్తుల విషయంలో స్వీయ ఖర్చుతో ప్రకటనలు జారీ చేయడానికి అనుమతినివ్వాలని కూడా అభ్యర్థించారు. ఈ అభ్యర్థనలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని రాతపూర్వకంగా తమ ముందుంచాలని అటు పిటిషనర్, ఇటు రెండు రాష్ట్రాల సీఐడీ తరఫు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
పోలీస్‌స్టేషన్ సాక్షిగా.. వసూళ్ల దందా
అగ్రిగోల్డ్ బాధితులకు కష్టాలు వెంటాడుతున్నాయి. అవసరాలు తీరుతాయని రూపాయి..రూపాయి కూడగట్టి అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయిన బాధితులను కొంతమంది వ్యక్తులు మరో రకంగా దోచుకుంటున్నారు. బాండ్ల పరిశీలన కోసం పోలీసుస్టేషన్లకు వస్తున్న వారి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. దాచుకున్న సొమ్ము వస్తుందనే ఆశతో బాధితులు కాదనలేక డబ్బులను చెల్లిస్తున్నారు. టెక్కలి పోలీసుస్టేషన్ సాక్షిగా బుధవారం ఈ దందా వెలుగుచూసింది. టెక్కలి: అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెందిన వివిధ రకాల పత్రాలను ఆన్లైన్ నమోదు పరిశీలన చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం డివిజన్ కేంద్రమైన టెక్కలి పోలీస్‌స్టేషన్ సాక్షిగా కొంత మంది వ్యక్తులు అక్రమ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయలు వసూలు చేసి పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయడం కనిపించింది. పోలీస్‌స్టేషన్‌లోనే దందా జరగడంపై బాధితులు నివ్వెరపోయారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఆన్లైన్ నమోదు ప్రక్రియ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులంతా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.అగ్రిగోల్డ్ పత్రాల ఆన్లైన్ నమోదుకు గురువారంతో గడువు ముగిసే క్రమంలో టెక్కలి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసుస్టేషన్‌కు బుధవారం చె?రుకున్నారు. అయితే స్టేషన్ లోపల అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని డిపాజిట్‌దారుల పత్రాలను ఆన్లైన్ నమోదు చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక్కో బాధితుడి వద్ద రూ. 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఆన్లైన్ నమోదు చేయడం కనిపించింది. ఇప్పటికే విసిగిపోయిన బాధితులు ప్రైవేట్ వ్యక్తులు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చి పత్రాలను ఆన్లైన్ నమోదు చేయించుకున్నారు. సాక్షాత్తు న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్‌స్టేషన్‌లో ఇటువంటి వసూళ్ల పర్వం జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరో వైపు ముందుగా ఆన్లైన్ నమోదు కోసం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన పత్రాలు గల్లంతు కావడంతో బాధితులు లబోదిబోమన్నారు. -
జైల్లో ‘అగ్రిగోల్డ్’ దర్జా..!
-
జైల్లో ‘అగ్రిగోల్డ్’ దర్జా..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేతులు కట్టుకుని మరీ సేవలందించే సిబ్బంది, కోరుకున్న భోజనం, తాగేందుకు మినరల్ వాటర్, మెత్తటి పరుపులపై పడక, కాలక్షేపానికి దినపత్రికలు. ఒక్కటేమిటి ఏది కోరుకుంటే అది నిమిషాల్లో సిద్ధం. ఇవన్నీ.. దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా ప్రజలకు రూ.6 వేల కోట్లకు పైగా టోకరా వేసిప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు పొందుతున్న రాచమర్యాదలంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. కానీ పచ్చి నిజం. కోర్టు కాదన్నా.. జైల్లో సైతం ఇలా విలాసవంతంగా గడిపేందుకు ఒక్కొక్కరు నెలకు రూ.50 వేల చొప్పున జైలు అధికారులకు ముట్టజెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ డైరెక్టర్లు జామీను చూపించకుండా జైల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో 8 మంది డైరెక్టర్లు రెండేళ్లుగా ఏలూరు సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ తెరపైకి వచ్చినందున వేరే జైలులో ఉన్న మరో ఇద్దరిని కూడా ఏలూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఉన్న చైర్మన్ సహా అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సకల సౌకర్యాలూ అనుభవిస్తున్నారని, అధికారులు సాధారణ బ్యారక్‌ను వీఐపీ బ్యారక్లా మార్చేశారనే సమాచారం నేపథ్యంలో.. ‘సాక్షి’ బృందం గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై నిఘా వేసింది. ఈ క్రమంలో పలు వీడియోలు సాక్షికి చిక్కాయి. కోర్టు కుదరదన్నా..ప్రత్యేక ఏర్పాట్లు అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు జైల్లోని నాలుగో నంబర్ బ్యారక్‌ను కేటాయించారు. ఇది మిగతా అందరు రిమాండ్ ఖైదీలు ఉండే సాధారణ బ్యారక్ లాంటిదే. కానీ దాన్నిప్పుడు మిగతా ఖైదీలందరూ వీఐపీ బ్యారక్ అంటున్నారు. తమకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ డైరెక్టర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు జైలు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో మిగతా అందరు ఖైదీల్లా వీరు ఏ పనీ చేయరు. ఉదయాన్నే జైలు ఆవరణలో కుర్చీలు వేసుకుని కూర్చుని దినపత్రికలు చదువుతుంటారు. వార్డర్లు వారి ముందు చేతులు కట్టుకు నుంచుని వారు చెప్పేది వింటుంటారు. వారు ఏది అడిగితే అది క్షణాల్లో సమకూరుస్తారు. ఇక బ్యారక్‌లో వారికి కావాల్సిన అన్నిరకాల సామగ్రి అందుబాటులో ఉంది. కిచెన్ వార్డర్ వీరి కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైన వంట పాత్రల్లో ప్రత్యేకమైన మెనూతో వంటకాలు వండి వడ్డిస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం వండుతున్నారు. ప్రత్యేకంగా వాటర్బబుల్స్ (20 లీటర్ల క్యాన్లు) ద్వారా మంచి నీటిని అందజేస్తున్నారు. ఆదివారం మాత్రం ఇంటి భోజనం వస్తుంది. అందుబాటులో అగ్రిగోల్డ్ ఉద్యోగి వీరికి కావాల్సినవి బయట నుంచి తెచ్చి ఇచ్చేందుకు, వారికి కావాల్సిన సేవలు అందించేందుకు శేషగిరిరావు అనే అగ్రిగోల్డ్ ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు ప్రాంగణంలోనే ఉంటున్నారు. జైలు సిబ్బందికి అతను ప్రత్యేక అతిథి. కిచెన్ వార్డర్ డ్యూటీ జైలులో ఉన్న సిబ్బందికి షిఫ్ట్‌లలో వేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఒకే వ్యక్తి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం జైలులో ఎవరికీ ప్రత్యేక ఇంటర్వ్యూలు, ములాఖాత్‌లు ఉండవు. అయితే అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు మాత్రం ఇక్కడ ప్రత్యేకం. డైరెక్టర్ల బంధువులు ఆదివారం మధ్యాహ్నం వాహనాల్లో జైలుకు వస్తారు. వీరితోపాటు వారు తెచ్చే లగేజీ, భోజనాలు అన్నింటినీ లోపలికి అనుమతిస్తున్నారు. రికార్డుల్లో ఎక్కడా ములాఖాత్‌కు అనుమతించినట్టు ఉండదు. ఇక వీరికి రోజూ రాత్రి పూట పడుకునేందుకు పరుపులు అందజేస్తున్నారు. జైలు సిబ్బంది ఇచ్చిన దుప్పట్లు కాకుండా సొంతంగా ఇంటి నుంచి తెచ్చిన దుప్పట్లు వినియోగిస్తున్నారు. సూపరింటెండెంట్ ఫోన్ నుంచే వ్యవహారాలు జిల్లా జైలు సూపరింటెండెంట్ బి.చంద్రశేఖర్ ఫోన్ నుంచే అగ్రిగోల్డ్ డైరెక్టర్లు అన్ని కార్యాలూ చక్కబెట్టుకుంటున్నారు. అవసరమైన వారితో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారు. జైలులో ఉండే రిమాండ్ ఖైదీల కోసం వొడాఫోన్ బాక్స్ ఒకదానిని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ ఫోన్ నుంచే బయట వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ ఫోన్‌ను అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాల్లేవు. కార్యాలయమే బెడ్రూమ్ నాలుగు నెలల క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్‌కు అనారోగ్యం కారణంగా నిమ్స్‌లో చికిత్స అందజేశారు. అక్కడ గుండెకు ఒక స్టంట్ వేసినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత సుమారు వారం రోజులపాటు ఆయనకు జైలు సూపరింటెండెంట్ గది (ఏసీ గది)లోనే రాత్రి పూట నిద్రపోయే ఏర్పాట్లు చేశారంటే అక్కడ ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ జైలర్, కిచెన్ వార్డర్, గేట్ కీపర్, సూపరింటెండెంట్ డ్రైవర్ తదితరులు అగ్రిగోల్డ్ డైరెక్టర్ల సేవలో తరిస్తున్నట్టు సమాచారం. సూపరింటెండెంట్ డ్రైవర్ విజయవాడ వెళ్లి డబ్బులు వసూలు చేసుకురావడం వంటి కార్యక్రమాలు సైతం చేస్తున్నట్టు తెలిసింది. -
ఆ చెక్కులూ అనుమతిస్తాం
ఒంగోలు క్రైం: అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులుకు యాజమాన్యం 2015 సంవత్సరంలో ఇచ్చిన చెక్కులను కూడా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్దకు తీసుకురావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో డిపాజిట్‌దారులకు స్పష్టత నిచ్చారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో శుక్రవారం ‘అగ్రిగోల్డ్ బాధితులను వీడని కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎస్పీ చెక్కుల విషయంలో డిపాజిట్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 2015లో తేదీల వారీగా ఇచ్చిన చెక్కులు కూడా అనుమతిస్తారని చెప్పారు. వాటిని జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కేంద్రాలకు తీసుకొచ్చి పరిశీలింపజేసుకోవాలని, ఆన్‌లౌన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ వెబ్సైట్లో ఇంకా నమోదు చేసుకోకుండా ఉన్న వారు, గతంలో నమోదు చేసుకొని పోలీస్ స్టేషన్లలో వెరిఫికేషన్‌కు వెళ్లని వారు ఇప్పటికైనా కేంద్రాలకు వెళ్లి వారి పత్రాలను వెరిఫై చేయించుకోవాలన్నారు. డిపాజిట్‌దారులు తమ వద్ద ఉన్న బాండ్లు, రసీదులు, చెక్కులు వంటి ఆధారాలతో వెళ్లి నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. -
అగ్రిగోల్డ్ బాధితులను వీడని కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ ఖాతాదారులు వారి వివరాలను పోలీస్స్టేషన్లలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం గతనెల 12వ తేదీన ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు చూపించిన ఆధారాలను పూర్తి స్థాయిలో నమోదు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో పాటు ఆయా జిల్లాల ఎస్పీలు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించి అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఇచ్చిన చెక్కులు, 2012లో ఇచ్చిన పరివార్ బాండ్ల వివరాలను పోలీసులు నమోదు చేయడం లేదు. 2014 డిసెంబర్‌లోపు తేదీలతో ఉన్న వివరాలను మాత్రమే నమోదు చేస్తామంటూ పోలీసులు తిరకాసు పెడుతున్నారు. అయితే అగ్రిగోల్డ్ సంస్థ 2014 డిసెంబర్లో ఖాతాదారులకు మెచ్యురిటీ బాండ్లకు సంబంధించిన చెక్కులు, పరివార్ బాండ్లును ఇచ్చింది. ఈ బాండ్లు, చెక్కులు 2015 జనవరి నుంచి మార్చి లోపు మార్చుకోవాలని తేదీలు వేసి సూచించింది. ఇదే విషయాన్ని పోలీస్స్టేషన్లలో ఖాతాదారులు వివరించి చెప్పడంతో పాటు సంబంధిత చెక్కులు, బాండ్లు చూపించినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోతున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 6 వేల మంది ఖాతాదారులకు సంబంధించి రూ.90 కోట్ల విలువ చేసే చెక్కులున్నాయి. ఇక 2012లో అగ్రిగోల్డ్ సంస్థ 2 వేల మంది ఖాతాదారులకు ఇచ్చిన పరివార్ బాండ్లున్నాయి. అప్పట్లో లక్ష డిపాజిట్ చేస్తే 12 శాతం వడ్డీతో నెల నెలా వడ్డీ చెల్లించేలా అగ్రిగోల్డ్ ఈ పథకాన్ని నెలకొల్పింది. ఇందులో కూడా వేల మంది రూ.కోట్లు డిపాజిట్ చేశారు. 3 లక్షల మంది సమస్య ఇక ఏపీ, తెలంగాణ పరిధిలో 3 లక్షల మంది ఖాతాదారుల వద్ద రూ.700 కోట్ల మేర చెక్కులు, రూ.600 కోట్ల మేర పరివార్ బాండ్లు ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో పెద్ద మొత్తంలో బాండ్లు, చెక్కులున్నట్లు సమాచారం. సీఐడీ ఇచ్చిన నివేదిక మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిధిలో 32 లక్షల మంది ఖాతాదారులకు రూ.6,350 కోట్లు అగ్రిగోల్డ్ చెల్లించాలని కోర్టుకు వివరించింది. వీటికి సంబంధించిన ఖాతాదారుల వివరాలన్నింటినీ ఆన్లైన్లో పెట్టాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేస్తోంది. సదరు వివరాలతో అగ్రిగోల్డ్ బాధితులు చూపిస్తున్న చెక్కులు, పరివార్ బాండ్ల వివరాలను సరి చూసుకుంటే సరిపోతుందని ఖాతాదారులు పేర్కొంటున్నారు. కానీ పోలీసులు అవేమీ పట్టించుకోకుండా 2014 డిసెంబర్ లోపు ఉన్న బాండ్లు, చెక్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అడ్డం తిరుగుతున్నారు. చెక్కులు, పరివార్ బాండ్ల వివరాలు పరిగణనలోకి తీసుకోవాలి అగ్రిగోల్డ్ ఖాతాదారులకు మెచ్యూరిటీ బాండ్లకు సంబంధించిన చెక్కులు, పరివార్ బాండ్లను 2014 డిసెంబర్ లోపే ఇచ్చింది. అయితే 2015 జనవరి నుంచి మార్చి వరకు పోస్ట్డేట్ వేసి చెక్కులు మార్చుకోవాలని స్పష్టంగా చెప్పింది. సంస్థ ఇచ్చిన చెక్కులు చూస్తే ఈ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పోలీస్స్టేషన్లలో అధికారులు ఈ వివరాలు నమోదు చేయడం లేదు. తక్షణం ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. – వి.మోజెస్ అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ -
అగ్రి డైరెక్టర్లందరినీ ఏలూరు జైలులోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపునకు తగిన సహాయ, సహకారాలు అందించేందుకు వివిధ జైళ్లలో ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు, ఇతర అధికారులందరినీ ఏలూరు జైలులోనే ఉంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నెలరోజుల పాటు అందరినీ ఒకే చోట ఉంచాలని అధికారులకు స్పష్టం చేసింది. డాక్యుమెంట్ల పరిశీలన మొదలు మిగిలిన అన్ని వ్యవహారాల్లోనూ ఎస్సెల్ గ్రూపు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డెలాయిట్ కంపెనీకి అన్ని ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఐటీ అధికారులు సహకరించాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో వేలం నిమిత్తం అగ్రిగోల్డ్ యాజమాన్యం సమర్పించిన ఆస్తుల్లో కొన్ని ఆస్తుల పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఆస్తులు ఎప్పటికీ అమ్ముడుపోయేటట్లు కనిపించడం లేదని పేర్కొంది. మంచి ఆస్తులు అలానే ఉండేటట్లు చేయడం ద్వారా ఎస్సెల్ గ్రూపునకు లబ్ధి చేకూర్చాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ముందుంచిన ఆస్తులను ఈ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి స్వాధీన ప్రక్రియ ప్రారంభమైనట్లు పరిగణిస్తామని ఈ సందర్భంగా డెలాయిట్‌కు తేల్చి చెప్పింది. తదుపరి విచారణకు డిసెంబర్ 4కి వాయిదా వేస్తూ, ఆ రోజున ఆస్తుల వేలం ప్రక్రియలో పురోగతిని వివరించాలని సీఐడీని ఆదేశించింది. -
అమర్‌సింగ్ నోట అగ్రిగోల్డ్ మాట!
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. శనివారం విజయవాడ విచ్చేసిన ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాలని ఆయన అభిలషించారు. సోదరుడు సుభాష్ చంద్ర తన ఫౌండేషన్ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. లాభాపేక్షతో ఈ కార్యక్రమం చేపట్టలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చటానికే ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబుతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావు, కుటుంబరావు తదితర అధికారులు అందిస్తోన్న సహకారం మరువలేనిదన్నారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని హామీయిచ్చారు. రాజకీయాలు మాట్లాడటానికి దేవాలయం వేదిక కాదని, మరోసారి వచ్చినపుడు రాజకీయాల గురించి మాట్లాడతానని అమర్‌సింగ్ అన్నారు. -
పొదుపు డబ్బు కోసం..అష్టకష్టాలు!
బిడ్డల చదువు కోసమో... ఆడబిడ్డ పెళ్లి ఖర్చుకోసమో... అత్యవసర సమయంలో ఆసుపత్రి ఖర్చు కోసమో... అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన సిక్కోలు ప్రజలకు మూడేళ్లుగా చిక్కులు మొదలయ్యాయి! గుంటూరులో హాయ్‌ల్యాండ్, వైజాగ్‌లో వేల ఎకరాల భూములు, టేకు తోటలు అంటూ సంస్థ భరోసా ఇవ్వడంతో తాము కష్టపడి సంపాదించినదంతా పెట్టుబడి పెట్టారు! కొంతమంది అప్పులు చేసిమరీ నెలవారీ వాయిదాలు కట్టారు! రెండు దశాబ్దాల పాటు నమ్మకంగా సాగిన వ్యవహారం కాస్త మూడేళ్ల క్రితం నుంచి తిరగబడింది! కొన్ని దుష్టశక్తులు, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థచింతనతో సంస్థ ఆస్తులపై కన్నేయడమే బాధితుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు లాభం వద్దు... తాము పొదుపు చేసిన సొమ్ము అణాపైసలతోనైనా చెల్లించాలని బాధితులు నిరసనలతో రోడ్డెక్కినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం కూడా కొరడా ఝుళిపించింది. కానీ బాండ్ల పరిశీలన పేరుతో ప్రభుత్వం ప్రక్రియను సాగదీసే కార్యక్రమం చేపట్టిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 1,43,643 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని అధికారుల అంచనా. కానీ శుక్రవారానికి కేవలం 33,500 మంది మాత్రమే ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోగలిగారు. తొలుత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు సీఐడీ అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పుడు మండలాల్లో పోలీసుస్టేషన్లవారీగా పరిశీలన కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడు వాటి చుట్టూ జిల్లాలోని ప్రజలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది చివరి నెల వాయిదా చెల్లింపు రసీదులు లేకపోవడం, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు పాలసీదారుడు కూడా తప్పనిసరిగా హాజరుకావాలనే నిబంధనలు పెట్ట డంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గంటల తరబడి వరుసలో నిలుచున్నా సర్వర్లు తరచుగా మొరాయిస్తుండటంతో పనిపూర్తి కావట్లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో తమ పాలసీలను నమోదు చేయించుకునేందుకు మూడు నాలుగు రోజుల పనిమానుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ బాండ్ల వివరాలన్నీ అగ్రిగోల్డ్ సంస్థ వద్ద ఉన్నప్పుడు మళ్లీ ఈ పరిశీలన కార్యక్రమం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఏదోలా కాలం గడిపేయడానికే తప్ప తమకు మేలు జరిగే అవకాశం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినా... ప్చ్! ప్రతి మండలంలోనూ పోలీసుస్టేషన్ల పరధిలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన, డిపాజిట్‌దారుల వివరాల నమోదు ప్రక్రియను సీఐడీ అధికారులు చేపట్టారు. ఏయే తేదీల్లో ఏయే గ్రామాల నుంచి అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు రావాలో ముందుగా ప్రకటించారు. జిల్లాలో డిపాజిట్‌దారులు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే. వారిలో నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉండటం, తాము ఎప్పుడు హాజరుకావాలనేదీ సమాచారం లేక స్పష్టత కొరవడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా తహసిల్దారు కార్యాలయాల వద్ద, పోలీసుస్టేషన్ల వద్ద అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల జాబితా అతికించామని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ ఆ వివరాలు అర్థం కాకపోతే బాధితులకు వివరించేవారే కరువయ్యారు. తీరా ఎలాగో తెలుసుకొని వచ్చినా ముందు రోజుల్లో ప్రకటించిన గ్రామాల వారి బాండ్ల పరిశీలనే పూర్తికావట్లేదు. సాంకేతిక సమస్యలతో బాధితులు బారులు తీరుతున్నారు. పోలీసుస్టేషన్ల ఆవరణలోనే చెట్ల కింద, షెడ్లలో నీరసంతో కూలబడిపోతున్నారు. చాలాచోట్ల వారిక మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవు. నిబంధనలతో ఇక్కట్లు బాండ్ల పరిశీలనకు కూడా పలు నిబంధనలు విధించడంతో బాధితులకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ చుక్కలను చూపిస్తోంది. డిపాజిట్‌దారుడి ఆధార్‌కార్డులో చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే పరిశీలన చేయించుకోవాలని కొన్ని సెంటర్లలో తిప్పి పంపించేస్తున్నారు. మరికొన్నిచోట్ల అగ్రిగోల్డ్‌కు చెందిన ఏ బ్రాంచిలోనైతే సొమ్ము డిపాజిట్ చేశారో దాని పరిధిలో ఉన్న మండలంలోనే పరిశీలన చేయించుకోవాలని చెప్పడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. తాము ఏజెంట్లకు సొమ్ములు ఇచ్చామే తప్ప బ్రాంచి ఎక్కడో తమకు తెలియదని వాపోతున్నారు. వలసలకు పేరొందిన ఈ జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి ఈ నిబంధనలేనన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామాకు, తమ సొమ్ము సొమ్ము డిపాజిట్ చేసిన బ్రాంచి చిరునామాకు పొంతన లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. దీనికితోడు బాండ్ల పరిశీలనకు డిపాజిట్దారుడే స్వయంగా హాజరుకావాలన్న నిబంధన కూడా ఇబ్బందిగా మారింది. దీంతో పదేపదే తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. రసీదులు లేనివారికి కష్టాలే బాండ్‌తో పాటు వాయిదా చెల్లింపు చివరి నెల రసీదు కూడా పోలీసులు అడుగుతుండటంతో బాధితులు సమర్పించలేకపోతున్నారు. వారిలో చాలామంది రూ.20 నుంచి రూ.50, రూ.100 వరకూ నెలవారీ వాయిదాలు చెల్లించినవారే ఎక్కువ మంది ఉన్నారు. అదీ చెల్లింపులు జరిగి ఏళ్ల కాలం గడిచిపోవడంతో ఇప్పుడవి తెమ్మంటే ఎలాగని పోలీసుల వద్ద ప్రాథేయపడుతున్నారు. దీనికితోడు ఆ రసీదులు పోగొట్టుకున్నవారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొంతమంది వద్ద బాండ్లు కూడా ఉండట్లేదు. మరికొంతమంది వాయిదాలు ముగియడంతో బాండ్లను ఏజెంట్లకు అప్పగించేశారు. అవన్నీ అగ్రిగోల్డ్ బ్రాంచిల్లో ఉన్నాయి. వారంతా అసలు బాండ్లను పరిశీలనకు ఇవ్వలేని పరిస్థితి. ఆయా బాండ్ల కోసం ఏజెంట్లను కొంతమంది నిలదీస్తున్నా వారుకూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో తమ వివరాలు ఎలా నమోదు చేయించుకోవాలనీ తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు తాము కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు తమకివ్వడానికి ఇన్ని ఆంక్షలు అవసరమా అని వాపోతున్నారు. -
బారులుతీరిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు
నెల్లూరు(క్రైమ్): ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు కేంద్రాల వద్ద సోమవారం బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో జిల్లాలో ఏర్పాటు చేసిన 52 కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. డిపాజిట్‌దారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసులు కేంద్రాల వద్ద మైక్సెట్లలో వారికి అవసరమైన సమాచారం అందించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో నెల్లూరు నగరం, రూరల్ పరి«ధిలోని డిపాజిట్‌దారుల వివరాలు నమోదు కార్యక్రమం నోడల్ అధికారి, ఎస్సీ,ఎïస్టీ సెల్ డీఎస్పీ–1 శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించారు. తొలి మూడురోజు లు రోజుకు 500 మంది చొప్పున డిపాజిట్‌దారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సోమవారం ఆ సంఖ్యను రెట్టింపు చేయడంతో పోలీసు కవాతుమైదానం కిక్కిరిసింది. డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు పోటీపడ్డారు. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సరిపడే సిబ్బంది లేకపోవడంతో సాధ్యమైనంత మేర డిపాజిట్‌దారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా 2,392మంది వివరాలను నమోదు చేశారు. -
ఎన్నో ఆశలు..
రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే అన్ని ఖర్చులూ పోను మిగిలిన రెండు లక్షలు బ్యాంకులో వేద్దామనుకున్నంతలో ఎవరో ఒత్తిడి చేశారని అగ్రిగోల్డులో డిపాజిట్ చేసిన ఓ కుటుంబం ఇప్పటివరకూ కలవరపడుతూనే ఉంది. కష్టపడి పనిచేసి... పైసా.. పైసా కూడబెట్టి పోగు చేసుకున్న సొమ్ము కాస్తా అందులో డిపాజిట్ చేసి ఇన్నాళ్లూ కన్నీటితో గడిపారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 43వేల మంది కోట్లాదిరూపాయలు డిపాజిట్ చేశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో వీరందరిలోనూ అలజడి రేగింది.తమ కష్టం ఊరికే పోదనీ... చెమటోడ్చి కూడబెట్టినది వృథా కాదనీ... ఎప్పటికైనా తమకు న్యాయం జరగకపోతుందా... అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని గడిపారు. బొబ్బిలి:పిల్లల చదువుల కోసం... వారి పెళ్లిళ్లకోసం... వృద్ధాప్యంలో వైద్యం కోసం... రిటైర్ అయ్యాక కాసింత గూడు కట్టుకుందామనీ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో లక్ష్యంతో అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. వారందరికీ శఠగోపం పెట్టి ఆ సంస్థ కాస్తా బోర్డు తిప్పేసింది. ఏళ్ల తరబడి పోరాడితే ఎట్టకేలకు సీఐడీ ద ర్యాప్తు చేపట్టి బాధితుల నుంచి ఆధారాలు సేకరించేందుకు జి ల్లాలోని పలు పోలీసు స్టేషన్ల వద్ద ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేంద్రాలకు బాధితులు క్యూ కడుతున్నారు. ఆయా ఆన్లైన్ కేంద్రాల వద్ద ఎవరి కష్టాలు వారు చెప్పుకుంటున్నారు. తామెంత పెట్టుబడులు ఏ విధంగా పెట్టి మోసపోయామన్నదీ తెలియజేసుకుని పరస్పరం ఓదార్చుకుంటున్నారు. తాము చెల్లించిన మొత్తానికి ఇచ్చిన రసీదులను, సొమ్ము డిపాజిట్ చేసినట్టు ఇచ్చిన బాండ్లనూ ఇన్నాళ్లూ చూసుకుంటూ గడిపినవాళ్లు కాస్తా తమ సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశతో ఎక్కడి పనులక్కడ వదిలేసి కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పెట్టుబడులు రూ. వెయ్యికోట్లకు పైమాటే... జిల్లా వ్యాప్తంగా 1.43,030 మంది వివిధ రకాల పొదుపు ఖాతాలు, చీటీలు, పెట్టుబడుల విభాగాల్లో డబ్బు దాచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సుమారు 25వేల మంది ఏజెంట్లే ఉన్నారు. కూలీ నాలీ చేసుకున్న వారి దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు, రైతులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, దినసరి కూలీలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. జిల్లా వ్యాప్తంగా 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కోసం రూ.5కోట్లు విడుదల చేసినా నేటికీ వారి కుటుంబాలకు ఆ డబ్బు అందలేదు. సుమారు మూడు నెలలుగా ఆయా కుటుంబాలు పరిహారం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాయి. చనిపోయిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారంగా అందజేస్తామని కుటుంబాలను వీధిన పడకుండా చూస్తామని అసెంబ్లీలో ప్రకటించినా ఆయా కుటుంబాలకు ఎదురు చూపులే మిగిలాయి. ఎప్పుడో చనిపోయిన బాధితుల పోస్ట్‌మార్టం సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్లు తెమ్మంటూ షరతులు విధిస్తున్నారు. వీటి వల్ల బాధిత కుటుంబాలు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలా అడుగుతారని అప్పుడు మాకు తెలియదు కదా ఇప్పుడెలా తేగలమని వారు నిస్సహాయంగా ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఆశల మోసులు అగ్రిగోల్డ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు కాస్త ఆశతో ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందు కు ముందుకు వచ్చిన సంస్థ డిపాజిట్ చెల్లించడం, అప్పులను లెక్కించేందుకు సీబీఐ ఆధ్వర్యంలో పోలీసులు కూడా ఆన్లైన్ చే స్తుండటంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరుకుంటున్నారు. ఆన్లైన్ మొరాయించినప్పుడల్లా నిరాశ అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల బాండ్ల గుర్తింపు, రసీదుల లెక్కిం పు వంటి కార్యక్రమాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్లు, వివిధ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో సారి ఆన్లైన్ మొరాయిస్తున్నప్పుడు బాధితులు నిరాశ చెందుతున్నారు. అప్పటికప్పుడే మళ్లీ పనిచేస్తుందంటూ సమాచారం వస్తుండటంతో ఊరట చెందుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎంత తొందరగా తేల్చేస్తే బాగుండునన్న భావన బాధితుల్లో కనిపిస్తోంది. వీటి సంగతేంటి? అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను, రసీదులను నమోదు చేస్తున్న యంత్రాంగం కొన్నింటిపై స్పష్టత లేదని వదిలేస్తోంది. కంపెనీ ఇచ్చిన బాండ్లు మెచ్యూరిటీకి వచ్చినవి రెండు నెలల ముందుగా తీసుకుంటారు. వాటికి జిరాక్స్ కాపీలిచ్చి స్టాంప్ వేసి కస్టమర్లకు ఇస్తారు. అయితే ఇప్పుడవి ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. ఇటువంటివి బ్రాంచ్‌కు నెలకు రూ.కోటి వరకూ ఉంటాయి. జిల్లాలో ఆరు బ్రాంచిలున్నాయి. ఈ ఆరు బ్రాంచిల్లో కలిపి 2014 నవంబర్, డిసెంబర్ నెలల్లో కంపెనీ తీసుకున్న మెచ్యూరిటీ బాండ్ల విలువ రూ.12 కోట్లు ఉంటుంది. దీనికి సంబం ధించి 5వేల మంది బాధితులున్నారని వాటిని నమోదు చే యడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. అలాగే మెంటాడ తదితర ప్రాంతాల్లో కంపెనీ పేరిట వెంచర్లు వేసి క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో గజం వెయ్యి రూపాయల చొప్పున వందల్లో ప్లాట్లు విక్రయించేందుకు కొనుగోలు దారుల నుంచి రూ.50వేలు, లక్ష చొప్పున అడ్వాన్సులు తీసుకున్నారు. వాటికి రసీదులు ఉన్నాయి. కానీ వాటిని నమోదు చేయడం లేదు. వీటితో పాటు కంపెనీ మూత పడేముందు సాధారణ పెట్టుబడులకు కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లో రసీదులు ఇవ్వలేదు. ఏజెంట్ల వద్ద మంత్లీ, డైలీ స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిని కూడా నమోదు చేయడం లేదు. వీటి విలువ జిల్లాలో సుమారు రూ.10 కోట్లు ఉండొచ్చని ఏజెంట్లు చెబుతున్నారు. నమ్మకమైతే ఉంది. ఏమవుతుందో చూడాలి: కంపెనీ ఇప్పటికే పలుమార్లు ఇటువంటి వివరాల సేకరణ చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేస్తుండటంతో నమ్మకం కుదిరింది. బాధితులంతా ఆశలు పెంచుకుంటున్నారు. కానీ దీనికి సమయం ఎక్కువ పడుతుంది. ఎన్నికలు సమీపించేసరికి ఎలా మారుతుందో చూడాలి. పోలీసు స్టేషన్లకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారి బాధలు వర్ణనాతీతం, మా ఉద్యమ ఫలితంగానే కదలిక వచ్చింది. రోజూ రెండు మూడు పోలీసు స్టేషన్లు తిరుగుతున్నాం. – పి కామేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్. కొన్నింటికే పరిమితం చేస్తున్నారు జిల్లాలో చేపడుతున్న ఆన్లైన్ ప్రక్రియలో మెచ్యూరిటీ బాండ్లు, రియ ల్ వెంచర్లు, రసీదులివ్వని చెల్లింపులకు సంబంధించి ఆధారాలున్నా నమోదు చేయడం లేదు. సంబం ధిత స్టేట్మెంట్లు,మెచ్యూరిటీ బాం డ్ల జిరాక్స్‌లు, రసీదులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఆయా బాధితులు మాకో న్యాయం, మిగతా వారికో న్యాయ మా అం టున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మరింత మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముంది. – మజ్జి సూరప్పడు, జిల్లా అధ్యక్షుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ -
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు కార్యక్రమం
-
మేం చెప్పిందేమిటి.. మీరు చేసిందేమిటి?
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, అనుబంధ కంపెనీల టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న డెల్లాయిట్ తీరుపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు అనుగుణంగా వ్యవహరించకపోవడంపై డెల్లాయిట్ను నిలదీసింది. ఇలాగైతే ఈ కేసులో ముందుకెళ్లడం కష్టమని వ్యాఖ్యానించింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి రోజువారీ పద్ధతిలో మంగళగిరి సీఐడీ ఆఫీసులో అగ్రిగోల్డ్ ఆస్తుల డాక్యుమెంట్ల పరిశీలన చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకుండా, ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు జైలుకెళ్లి స్వయంగా అగ్రిగోల్డ్ యజమానులతో చర్చించాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. సీఐడీ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలనకు ఓ బృందాన్ని, జైలులో అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు మరో బృందాన్ని, అగ్రిగోల్డ్ కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు వేరే బృందాన్ని ఏర్పాటు చేయాలని డెల్లాయిట్కు తేల్చి చెప్పింది. కేసు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు మినహా మిగిలిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలన నిమిత్తం సదరు బృందానికి అందుబాటులో ఉంచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. జైలులో అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు ఇంకో బృందానికి అనుమతినివ్వాలని జైలు అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మూడు బృందాలు ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఏకకాలంలో పని మొదలుపెట్టి పూర్తయ్యే వరకు కొనసాగించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్లు పరిశీలించమంటే ప్రత్యుత్తరాలు ఏమిటి? అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా డెల్లాయిట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పరిశీలన నిమిత్తం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని ఓ లేఖ ద్వారా సీఐడీ అధికారులను కోరామన్నారు. అయితే నిర్ధిష్టంగా ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పాలని సీఐడీ అధికారులు ప్రత్యుత్తరం ఇచ్చారని ఆయన వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ డాక్యుమెంట్ల పరిశీలనకు తాము స్పష్టమైన ఆదేశాలిస్తే, ఇలా ప్రత్యుత్తరాలు జరపడం ఏమిటంటూ డెల్లాయిట్ న్యాయవాదిని నిలదీసింది. అంతకు ముందు సీఐడీ అధికారులు వేలం వేయడానికి సిద్ధంగా ఉంచిన ఆస్తులకు సంబంధించిన విలువలను పిటిషనర్ ధర్మాసనం ముందుం చారు. ఈ వివరాలను సమర్పించేందుకు అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్ చైర్మన్‌కు మూడేళ్ల జైలు
అట్లూరు(బద్వేలు): అగ్రిగోల్డ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకటరామారావుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ వైఎస్సార్ జిల్లా బద్వేలు కోర్టు తీర్పు వెలువరించింది. జిల్లాలోని పోరుమా మిళ్ల, సిద్ధవరం భూముల వ్యవహారంలో మోసానికి పాల్పడ్డారన్న కేసులో ఈ శిక్ష విధిం చింది. అంతేగాక రూ.6వేల జరిమానా విధించింది. ఈ మేరకు బద్వేలు జూనియర్ సివిల్ జడ్జి ఆర్.ఎం.శుభవల్లి మంగళవారం తీర్పు చెప్పారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పోరుమామిళ్ల మండలం లోని పోరుమామిళ్ల, సిద్ధవరం గ్రామాలకు చెందిన 300 ఎకరాల భూమిని పండ్లతోటల సాగు నిమిత్తం మ్యాక్స్వర్త్ ఆర్చెడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తమ ఏజంట్లు వెంకటేశ్వరప్రసాద్, రవిబాబులద్వారా పవర్ ఆఫ్ పట్టా పొంది రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే 2001లో ఆ కంపెనీకి తెలియకుండా.. ఏజెంట్లుగా ఉన్న వెంకటేశ్వర ప్రసాద్, రవిబాబుల తో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు కుమ్మక్కై అడ్డగోలుగా అగ్రిగోల్డ్ కంపెనీకి 300 ఎకరాల్ని కేవలం రూ.15 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ముగ్గురిపై మ్యాక్స్వర్త్ ఆర్చెడ్స్ కంపెనీ 2001లో పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 409, 419, 420, 421, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఏలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అవ్వా వెంకటరామారావును పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం బద్వేలు కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు జడ్జి మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ చైర్మన్‌ను కడప సెంట్రల్‌జైలుకు తరలించారు. మాక్స్వర్త్ ఏజెంట్లుగా ఉంటూ అగ్రిగోల్డ్ కంపెనీకి భూమిని అమ్మినవారిలో వెంకటేశ్వర ప్రసాద్ మృతిచెందగా, రవిబాబు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితుల బాధలు పట్టవా?
అనంతపురం అర్బన్: అగ్రిగోల్ సంస్థ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన దాని కంటే ఆ సంస్థ ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సంస్థ ఆస్తులను రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు తక్కువ ధరకే ఎగరేసుకు పోయేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలనే డిమాండ్‌తో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చేపట్టిన బస్సుయాత్ర గురువారం అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. -
అగ్రిగోల్డ్ ఆస్తులు ఎస్సెల్ గ్రూప్‌కు ఇచ్చేద్దామా!
మంత్రివర్గ భేటీలో సీఎం మంతనాలు సాక్షి, అమరావతి: లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రకు (జీ మీడియా గ్రూపు మాజీ చైర్మన్) కట్టబెట్టేందుకు చంద్రబాబుమంతనాలు సాగిస్తున్నారు. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసు పురోగతికి సంబం ధించిన వివరాలను ఏసీబీ అధికారులు మంత్రివర్గం ముందుంచిన తర్వాత సంస్థకు సంబంధించిన ఆస్తులు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో ఆస్తులన్నింటినీ ఒకే సంస్థ లేదా వ్యక్తికి అమ్మేస్తే ఇబ్బందులుండవని ముఖ్యమంత్రి చెప్పారు. పెద్ద మొత్తం వెచ్చించి ఎవరు కొంటారనే ప్రశ్న రాగా.. ఎస్సెల్ గ్రూప్ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారని తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఆయన తన వద్దకు వచ్చి ఈ ఆస్తుల కొనుగోలు అంశంపై చర్చించారని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
అనుబంధ కంపెనీల్లోకి రూ.600 కోట్లు
అగ్రిగోల్డ్ కేసులో నిగ్గుదేల్చిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరం అత్యంత ప్రమాదకరమైందని, కుటుంబాల ఉసురు తీస్తాయని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ.600 కోట్లను తన అనుబంధ కంపెనీలకు బదలాయించిందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దురుద్దేశపూర్వకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఈ మళ్లింపు జరిగిందని తేల్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి డిపాజిట్ల రూపంలో రూ.కోట్లు చెల్లించిన మధ్య, దిగువ తరగతి ప్రజలు అనుభవిస్తున్న క్షోభను న్యాయస్థానాలు విస్మరించబోవని స్పష్టం చేసింది. కార్పొరేట్ చట్టాలను అడ్డం పెట్టుకుని అమాయకుల నుంచి డబ్బు వసూలు చేసిన వ్యక్తులు.. సీఆర్పీసీ సెక్షన్ 438(బెయిల్) కింద రక్షణ పొందుదామనుకుంటే అది కుదరని తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లో నేరం జరిగిన తీరు తెన్నులు తెలుసుకునేందుకు నిందితుడిని విచారించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీలకు డైరెక్టర్‌గా, వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎం.బానోజీరావుకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి ఇటీవల తీర్పు వెలువరించారు. ఏపీ, తెలంగాణలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బానోజీరావు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సునీల్ చౌదరి ఇటీవల విచారించారు. -
మనస్థాపంతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
-
దోచుకునేందుకే రెయిన్గన్ల ప్రయోగం
అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం కన్ను – యాజమాన్యానికి ప్రభుత్వం వత్తాసు – 40లక్షల మంది బాధితుల జీవితాలతో ఆటలు – పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి మడకశిర : అధికార పార్టీ నేతలు రూ.వేల కోట్లు దోచుకునేందుకు మరోసారి రక్షకతడుల పేరిట రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గత ఏడాది రెయిన్గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్ని వేల ఎకరాలకు రక్షక తడులు ఇచ్చి వేరుశనగ పంటను కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజీవ్‌గాంధీ సర్కిల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ నేతల కన్ను పడిందన్నారు. 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికే వత్తాసు పలుకుతోందన్నారు. సీబీఐ విచారణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ త్వరలోనే డీసీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే..
♦ డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ♦ వైఎస్సార్ జిల్లాలో మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు ♦ మీరే బ్యాంకులకు కట్టొదన్నారు.. ఇప్పుడు వడ్డీ భారంగా మారింది ♦ కూలీనాలీ చేసి కట్టాల్సి వస్తోందని ఆవేదన.. దాటవేసిన లోకేశ్ ♦ మైదుకూరులో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన మంత్రి లోకేశ్ బుధవారం కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి అడుగుతూ వస్తున్న లోకేశ్‌కు డ్వాక్రా మహిళల రూపంలో చేదు అనుభవం ఎదురైంది. వల్లూరు మండలం తప్పెట్ల, పెద్దపుత్త గ్రామాల్లో మహిళలు.. డ్వాక్రా రుణాలు మాఫీ కాక వడ్డీ భారం పెరిగిందని.. భారంగా కడుతున్నామని, చివరకు వడ్డీలేని రుణాలూ అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. రుణ మాఫీ చేయకపోగా, రూ.10 వేల అప్పు నిధి సరిగా ఇవ్వలేదని నిలదీశారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడుతానంటూ మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు మండలాల్లో మంత్రి లోకేశ్‌కు అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఖాజీపేటలో కాన్వాయ్‌ని అడుకోగా, మైదుకూరు నాలుగు రోడ్లు కూడలిలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మాఫీ ఎప్పుడు చేస్తారు?: మంత్రి లోకేశ్ బుధవారం రాత్రి 7 గంటలకు మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చేరుకుని రోడ్డుపై ఉన్న పలువురిని పలుకరించారు. ఈ సందర్భంగా బీసీకాలనీకి చెందిన కొండమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలపై ప్రశ్నించారు. ‘మీరేమో మా అప్పు మాఫీ చేస్తామని ఇంతవరకు పట్టించుకోలేదు. బ్యాంకు సార్లు నెలనెల కడితేనే సరి..లేకపోతే నోటీసులు ఇచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నా మీరేమో పట్టించుకోలేదు. ఎన్నిరోజులు ఇలా అగచాట్లు పడాలో తెలియదు. మాఫీ అన్నారు.. ఏమి చేశారో తెలియ లేదు’ అని నిలదీయడంతో ఏం చేయాలో పాలుపోని లోకేశ్.. గ్రూపులో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున ఇచ్చాం కదా అని సర్ధి చెప్పబోయారు. ‘అది కాదు.. నేను అడుగుతున్నది రుణ మాఫీ’ అని అమె మరోమారు రెట్టించి అడిగింది. సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే మాఫీ చేస్తారని.. నా పేరు కొండమ్మ. మా ఆయన పేరు చిన్నహుస్సేన్. మాకు ఎకరా పొలం ఉంది. కూలి పనులు చేసుకుంటున్నాం. మా పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపించాం. కొద్దిరోజులకు చనిపోయాడు. ప్రస్తుతం చిన్నకొడుకు బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2008 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నాం. 2013లో మదీన గ్రూపు పేరుతో రూ.2.50 లక్షలు అప్పు తీసుకున్నాం. తర్వాత 2015లో కూడా రూ.5 లక్షల రుణం ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో తెచ్చుకుని కంతులను చెల్లిస్తున్నాం. నెలకు రూ.1,500 చొప్పున గ్రూపులో ఒక్కొక్కరం కడుతున్నాం. డ్వాక్రా సొమ్మొంతా మాఫీ అవుతుందిలే అనుకున్నాం. ఇంతవరకు మాఫీ కాలేదు. పైగా నెలనెలా వడ్డీతో కలుపుకొని కంతులు కట్టడం కష్టంగా మారింది. సీఎం కొడుకు వస్తున్నాడని తెలియడంతో మా గోడును ఆయనకైనా చెబితే మాఫీ చేస్తారేమోనని ఇక్కడికి వచ్చాం. పెద్దోళ్లు కదా.. మాఫీ చేస్తారేమోనని ఆశతో అడిగాను. -
‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు
పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ కృషి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని సారథి అన్నారు. -
అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేయాలి
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ భూములను బహిరంగంగా వేలం వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. భూ దోపిడీ, మద్యంపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్‌పై లేదు. చిన్న చిన్న ఫ్లాట్లు చేసి అగ్రిగోల్డ్ భూములను అమ్మాలి. ప్రభుత్వం తమవారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్‌ను కలిస్తే ఆయనకు కూడా ముప్పు ఉంటుందేమో. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు సర్కార్ భయపడుతోంది.’ అని అన్నారు. -
అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేయాలి
-
అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ముగాస్తున్నారు
► సీఎం చంద్రబాబుపై సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ధ్వజం ఒంగోలు టౌన్ : అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముగాస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ధ్వజమెత్తారు. ఒక పథకం ప్రకారం కేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసు పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం కారణంగా అనేకమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో చంద్రబాబు మాటలు కోటలు దాటతాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని వ్యాఖ్యానించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సీపీఎం అండగా ఉండి పోరాడుతుందన్నారు. బాధితుల సంఘ రాష్ట్ర కన్వీనర్ వీ మోజస్ మాట్లాడుతూ మార్చి నెలలో బాధితులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. వంద రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ బాధితులను నయవంచనకు గురిచేస్తున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా మాటలతో కాలయాపన చేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో పోరాట సంఘ నాయకులు అద్దంకి కోటేశ్వరరావు, ఏ నర్సయ్య, కే వెంకట్రావు, ఎన్వీ శ్రీను, కే ప్రసాద్, ఐ.శివ, సత్యనారాయణ, ఉమాకుమారి, సుబ్బలక్ష్మి, విశాలాక్షి, ఎన్.లక్ష్మి, శోభాదేవి పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలం
కర్నూలు: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తులను ఈ.వేలం పాట ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ, సీఐడీ ఎస్పీ గజారావు భూపాల్ బుధవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలోని సర్వేనెం.176, 177/ఈ, 177/ఈ2, 185, 183, 184, 190లోని 24.23 ఎకరాల వ్యవసాయ భూమి. అక్షయ గోల్డ్ ఆస్తులు ఎమ్మిగనూరు పట్టణంలోని శివ సర్కిల్లో సర్వే నెం.282/బీలోని నివాస స్థలాన్ని(ప్లాట్ నెం.45,46లో 528.30 చదరపు గజాలు). ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక ధరావత్తు చెల్లించవచ్చు. బిడ్డింగ్ ఇతర విషయాలకు ఈ.యాక్షన్ పోర్టల్ వెబ్సైట్లలో https://konugolu.ap.gov.in (OR) www.cidap.gov.in చూసుకోవాలి. లేదా 94931 74045నెంబరును సంప్రదించవచ్చని ఎస్పీలు పేర్కొన్నారు. -
'అగ్రీగోల్డ్' వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌కు చెందిన 12 ఆస్తులను, అక్షయగోల్డ్ చెందిన 5 ఆస్తులను ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసే విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, వేలం పురోగతికి సంబంధించిన వివరాలతో ఒక నివేదికను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఏపీ సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్లు హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, వేలానికి పోర్టల్‌ను సిద్ధం చేశామన్నారు. వేలంలో పాల్గొనేందుకు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, వేలం పురోగతికి సంబంధించిన వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అగ్రిగోల్డ్ ఎండీ వెంకట శేషు నారాయణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
ఈ–పోర్టల్ ద్వారా అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తుల వేలం
- ప్రాథమిక నిర్ణయం తీసుకున్న హైకోర్టు - నేడు వెలువడనున్న పూర్తిస్థాయి ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సీఐడీ తమ ముందుంచిన అగ్రిగోల్డ్ 12 ఆస్తులను, అక్షయగోల్డ్ 5 ఆస్తులను ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు ఉమ్మడి హైకోర్టు ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శుక్రవారం పూర్తిస్థాయిలో ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్లు హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారానే 17 ఆస్తుల వేలం జరుగుతుందని స్పష్టం చేసింది. వేలం విధివిధానాలను, ప్రచారం తదితర విషయాలపై శుక్రవారం ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. -
వేలం ఆస్తులను కోర్టు ముందుంచిన సీఐడీ
జాబితాలో పది అగ్రిగోల్డ్ , 5 అక్షయ గోల్డ్ ఆస్తులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు గుర్తించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టు ముందుంచారు. ఇందులో 10 అగ్రిగోల్డ్ ఆస్తులు, 5 అక్షయ గోల్డ్ ఆస్తులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం సైతం 35 ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించింది. వీటిలో విశాఖపట్నంలో రూ.360 కోట్ల విలువైన ఆస్తులు, నెల్లూరులో రూ.360 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తదుపరి విచారణ సమయంలో ఈ ఆస్తుల వేలానికి ఆటంకాలు ఉండవని భావిస్తున్నామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ రోజున వేలం విధివిధానాలు, ప్రచారం తదితర విషయాలపై ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. కాగా తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ పూర్వ డైరెక్టర్ అవ్వా సీతారామారావు వేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
‘అగ్రి’ బాధితులకు అండగా ఉద్యమ కార్యాచరణ
- వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు - మేలోగా పరిహారం ఇవ్వకుంటే ఆందోళన సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. వచ్చే నెలాఖరులోగా దీన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మే లోగా పరిహారం ఇవ్వని పక్షంలో జూన్ లో మరో కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబీకుల ఇళ్లకు తమ పార్టీ జిల్లా నేతలు వెళ్లి పరామర్శించి, వారికి మనోధైర్యం కలిగిస్తారని అంబటి చెప్పారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితురాలు నీరాబి ఆత్మహత్య, వెంకటనర్సమ్మల మృతి పట్ల అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ అంశంపై తమ పార్టీ ఉద్యమించడంతో శాసనసభలో చంద్రబాబు స్పందించారని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ముందుగా రూ. 3 లక్షలు ఇస్తామని ప్రకటించారని, రూ.10 లక్షలు ఇస్తే గానీ న్యాయం జరగదని తమ పార్టీ డిమాండ్ చేయడంతో, రూ.ఐదు లక్షలకు పరిహారం పెంచారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని, టీడీపీ సర్కార్ మెడలు వంచైనా సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుం దని భరోసా ఇచ్చారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్ఆర్ సీపీ
-
ఈ పోర్టల్ ద్వారా ఆస్తుల వేలం
అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తులపై సీఐడీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ పోర్టల్ పనితీరును ఉమ్మడి హైకోర్టు గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా తమకున్న పలు సందేహాలను నివృత్తి చేసుకుంది. అనంతరం పోర్టల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ ఆస్తులను ఈ పోర్టల్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆస్తుల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, వాటి తాలూకు ఫొటోలు తదితర వివరాలను సిద్ధం చేసి తమ ముందుంచాలని ఏపీసీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారాలపై హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై పలుమార్లు విచారణ చేపట్టిన రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అధికార ఈ పోర్టల్ పనితీరు గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్ డైరెక్టర్లు
ఏలూరు అర్బన్: మదుపుదారులకు సొమ్ములు ఎగవేసిన కేసులో ఏ–11, ఏ–12 నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సవడం శ్రీనివాసరావు, డొప్పా రామ్మోహనరావులను సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. వీరిద్దరినీ సీఐడీ అదనపు డైరెక్టర్ టి.హరికృష్ణ విజయవాడలో అరెస్ట్ చేసి ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. నిందితులకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించగా, ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఇద్దరు డైరెక్టర్లను తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ సీఐడీ విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.సునీత వారిని 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించారు. దీంతో రాజమండ్రి సీఐడీ కార్యాలయం నుంచి ఎస్సైలు వీరబాబు, ఏవీ రమణ ఏలూరులో జిల్లా జైలుకు చేరుకుని వారిరువురినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్న జైలర్ చంద్రశేఖరరావు నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు చేయించి సీఐడీకి అప్పగించారు. అనంతరం వారిని విజయవాడలోని సీఐడీ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. -
సీఐడీ అదుపులో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు
-
హాయ్‌లాండ్ విలువ 600 కోట్లు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను సీఐడీ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన మొత్తం 229 ఆస్తుల వివరాలు ఈ సందర్భంగా హైకోర్టుకు అందాయి. ఇందులో అత్యంత విలువైన 9 ఆస్తుల విలువ రూ. 1200 కోట్లు, 90 ఎకరాల హాయ్‌లాండ్ విలువ రూ. 600 కోట్లు అని సీఐడీ కోర్టుకు తెలిపింది. మొత్తం రూ. 2000 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. అగ్రీగోల్డ్ ఆస్తులన్నీ ఆన్లైన్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. -
‘అగ్రిగోల్డ్ ప్రత్యేక వెబ్సైట్’ సాధ్యమవుతుందా?
వివరాలు తెలపాలని ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఆ వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేతపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం కూడా విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ న్యాయవాది కృష్ణప్రకాశ్ స్పందిస్తూ, గతంలో ధర్మాసనం చేసిన ప్రతిపాదనను పరిశీలించామని, అయితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆస్తుల వేలం సాధ్యం కాదని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన విషయంలో సాధ్యాసాధ్యాలను టెక్నాలజీ సర్వీసెస్ విభాగాలను సంప్రదించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది. -
రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్’ కదలిక!
- ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోరాటంతో ఇక్కడ కేసులపై సమీక్ష - డీజీపీ అనురాగ్ శర్మతో ఏపీ సీఐడీ చీఫ్ భేటీ - తెలంగాణలోని ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ ఆస్తులు, వేలం పాటకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పోరాటంతో.. తెలంగాణలోనూ ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి సీఐడీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరిగింది. ప్రస్తుతం ఏపీలో అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం, వేలం పాటపై డీజీపీ అనురాగ్ శర్మ వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణలో అగ్రిగోల్డ్ సంస్థపై ఉన్న కేసులు, డిపాజిట్ దారులు, స్వాధీనం చేసుకోవాల్సి ఆస్తులు, చెల్లించిన మొత్తాన్ని ఏ విధంగా అందజేయాలన్న అంశాలపై సమీక్షించినట్టు తెలిసింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి శనివారం రెండు రాష్ట్రాల డీజీపీలు, రెండు రాష్ట్రాల సీఐడీ ఉన్నతాధికారులు భేటీ కావాలని నిర్ణయించారు. రెండు కేసులు.. నాలుగేళ్లుగా పెండింగ్ అగ్రిగోల్డ్‌కు సంబంధించి తెలంగాణలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని సీఐడీ అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్‌స్టేషన్‌లో 2013లో ఒక కేసు నమోదు కాగా, 2015లో సీఐడీ విభాగంలో మరో కేసు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా.. సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2.5 లక్షల మంది డిపాజిట్‌దారులు రాష్ట్రంలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. వీరంతా సుమారు రూ.460 కోట్ల వరకు డిపాజిట్లు చేశారని తేల్చారు. ఈ మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించాలని.. ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకోకుండా మిగిలిన ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తే డిపాజిట్ దారులకు న్యాయం జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌కు సంబంధించి మహబూబ్‌నగర్ (పాత) జిల్లాలోని బాల్నగర్, గద్వాల, జడ్చర్ల, నల్లగొండ(పాత) జిల్లాలోని చౌటుప్పల్, మిర్యాలగూడ, ఖమ్మం, రంగారెడ్డిలోని గచ్చిబౌలిలలో ఆస్తులున్నాయని సీఐడీకి ఫిర్యాదు చేసిన బాధితులు పేర్కొన్నారు. దీంతో ఆ ఆస్తుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎంత వరకు స్వాధీనం చేసుకోవచ్చనే అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు రెండు రాష్ట్రాల్లో సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండాల్ రమేష్‌బాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని, డైరెక్టర్లు ఇంకా పరారీలోనే ఉన్నట్టు సీఐడీ చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆస్తులను కూడా జప్తు చేసి వేలం పాటలో చూపాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. రోజుకో ఏజెంటు, బాధితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారానే తెలంగాణలో అగ్రిగోల్డ్ కేసులను విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాక్షి, అమరావతి బ్యూరో: అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థ ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తే వామపక్షాలతో కలసి ఉద్యమిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం నుంచి వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ప్రయత్నించకూడదని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శవాల మీద చిల్లర ఏరుకునేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించకూడదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన విజయవాడలో గురువారం ముఖాముఖి జరిపారు. మొదట అగ్రిగోల్డ్ బాధితులు కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. చట్టం బలవంతులపట్ల బలహీనంగానూ బలహీనుల పట్ల బలంగానూ పనిచేస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ఆర్థిక నిపుణులతో ఓ కమిటీ నియమించాలని సూచించారు.