నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం | Ap Cabinet Meeting On 19th June | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

Published Tue, Jun 19 2018 10:40 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

Ap Cabinet Meeting On 19th June - Sakshi

ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ (ఫైలో ఫోటో)

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం మంగళవారం జరునుంది. సచివాలయంలో సాయంత్రం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ భేటీలో అగ్రిగోల్డ్‌లో చిన్న మొత్తంలో డిపాజిట్‌ చేసిన డిపాజిటర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీనిపై హైకోర్టులో ఏ విధంగా ప్రభుత్వ తరపున​ నివేదిక సమర్పించాలనే అంశంపై చర్చించనున్నారు.

ఇక నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపీఐఐసీ)కి వివిధ జిల్లాలలో భూకేటాయింపులకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement