APIIC
-
రండి.. రండి.. దండుకోండి!
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చేతిలో ఉన్న సుమారు 40,000 ఎకరాల విలువైన భూమిని అభివృద్ధి పేరిట తమకు కావాల్సిన ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. ఇంతకాలం ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమలకు అందిస్తుండగా, ఇప్పుడు పాలసీ పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. కనీసం 10 ఎకరాల నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, 100 నుంచి 1,000 ఎకరాలపైన భారీ పారిశ్రామిక పార్కులను ప్రైవేటు రంగంలో నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రపదేశ్ ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ విడుదల చేసింది. పూర్తిగా ప్రైవేటు భూముల్లో లేదా ప్రైవేటు – ప్రభుత్వ భూముల్లో, పూర్తిగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థలు పార్కులను అభివృద్ధి చేస్తే వారికి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సీడీతోపాటు వ్యవసాయ భూ బదాలియింపు చార్జీలు, లేఔట్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల్లో 100 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పార్కుల్లో 35 శాతం వరకు, మెగా పార్కుల్లో అయితే భూమిలో గరిష్టంగా 10 శాతం వరకు ఇతర అవసరాలు అంటే హోటల్స్, నివాస గృహాలు, సర్వీస్ అపార్టమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ వంటి నిర్మాణాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది. పారిశ్రామిక పార్కు నిర్మాణం దశలను బట్టి మొత్తం అయిదు దశల్లో ఈ రాయితీలను విడుదల చేయనుంది. కాగా.. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం సబ్సిడీలను 45 శాతం వరకు ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 35 శాతానికి తగ్గించింది. దీంతో పార్కుల నిర్మాణం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడంతో తమకు భూ కేటాయింపులు ఉండవని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీలో ముఖ్యాంశాలు» వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 2024–29 కాలానికి పారిశ్రామిక పాలసీ 4.0 విడుదల. ఇందులో వాస్తవ రూపంలోకి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు.» ఈ ఐదేళ్లలో రూ.83,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి. » తొలిసారిగా పీఎల్ఐ సబ్సిడీ, ఎంప్లాయిమెంట్ సబ్సిడీ, డీ–కార్బనైజేషన్ సబ్సిడీలు. మొత్తం పెట్టుబడిలో సబ్సీడీలు 75 శాతానికి పరిమితం.» పాలసీ ఐదేళ్ల గడువును మరింత పెంచే అవకాశం. సవరణలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. » కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో పాటు ఇప్పటికే పెట్టుబడులు పెట్టి.. కొత్తగా విస్తరణ చేపట్టే వారికి ఈ పాలసీ వర్తిస్తుంపు. » 2023–27 పాలసీ కింద అనుమతులు పొందిన వారికి పాలసీ కాల పరిమితి తీరే వరకు రాయితీల వర్తింపు. » రూ.50,000 కోట్ల పెట్టుబడి.. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పాలసీ 4.0.వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలివి..» గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సాధించిన విజయాలను పారిశ్రామిక పాలసీలో ప్రముఖంగా పేర్కొన్నారు. » లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్) 2023లో కోస్తా తీర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎచీవర్స్ స్థానంలో నిలిచింది.» నీతీ ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం ఎగుమతుల సన్నద్ధతలో రాష్ట్రం 8వ స్థానానికి ఎగబాకింది.» దేశ వ్యాప్తంగా టాప్ 100 ఎగుమతి జిల్లాల్లో 8 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి.» ఇందులో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.» నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2023–24 నివేదిక ప్రకారం రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. అందుబాటు ధరలో విద్యుత్ సరఫరాలో మొదటి స్థానం, నీటి లభ్యతలో రెండవ స్థానంలో నిలిచింది.» ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ 2023 ప్రకారం రాష్ట్రం ఏడవ స్థానంలో నిలిచింది.రాష్ట్ర ఎగుమతులు రూ.16,600 కోట్లేనట!» ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.16,600 కోట్లని, వీటిని 2028–29 ఆర్థిక సంవత్సరానికి రూ.33,200 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ పాలసీలో పేర్కొనడం పట్ల అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.66 లక్షల కోట్లుగా ఉంటే వాటని కేవలం 16,600 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. » భారీగా పెట్టుబడులను చూపించాలన్న తాపత్రయంలో వాస్తవాలను వదిలివేశారు. ఒకపక్క రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పుతున్నప్పుడు అంత తక్కువగా 5 లక్షల ఉద్యోగాలేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీ ప్రకారం రూ.7 కోట్ల పెట్టుబడికి ఒక్క ఉద్యోగం మాత్రమే వస్తుందా? అని అధికార వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమయ్యాయి. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్‌లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్‌ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్‌ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్‌లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్‌లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్‌సేల్‌గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
విశాఖ సిగలో మరో మణిహారం.. 19 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: మహానగరంగా వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం సిగలో మరో మణిహారం వచ్చి చేరుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్క్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో భారీ బిజినెస్ పార్క్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా మధురవాడ హిల్ నంబర్–3లో 18.93 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సుమారు రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసే కంపెనీ (ఎస్పీవీ)లో ఏపీఐఐసీ 26 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 74 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది. భూమికి అత్యధిక ధరను కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థ ఏపీఐఐసీకి 26 శాతం వాటా కింద రూ.78 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని భాగస్వామ్య కంపెనీ ఈక్విటీగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బహుళజాతి సంస్థలను ఆకర్షించే విధంగా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల సంస్థలు జూన్ 20లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తు్తండటంతో దానికి అనుగుణంగా ఏపీఐఐసీ బిజినెస్ పార్కులను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. డిజైన్ దగ్గర నుంచి నిర్వహణ వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ పార్కును నిర్మించేలా డిజైన్ దగ్గర నుంచి నిధుల సమీకరణ వరకు భాగస్వామ్య కంపెనీనే చూసుకోవాల్సి ఉంటుందని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. అలాగే ఐటీ, ఐటీ ఆధారిత, ఆర్థిక కంపెనీల అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, బిజినెస్ సెంటర్‌తోపాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్విస్ అపార్ట్మెంట్స్, ఎయిర్ థియేటర్, ఫుడ్ బేవరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర మౌలిక వసతులతోపాటు పార్కింగ్ సౌకర్యాలు కూడా భాగస్వామ్య కంపెనీనే కల్పించాల్సి ఉంటుంది. -
త్వరలోనే ‘అదానీ’కి శంకుస్థాపన.. ఏడేళ్లలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లీజు మొత్తం చెల్లించిన అదానీ కోసం హిల్‌పార్క్–4లో 130 ఎకరాలను ఏపీఐఐసీ సిద్ధం చేసి.. సరిహద్దులను కూడా నిర్ణయించింది. త్వరలోనే అదానీ డేటా పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. సంస్థ కార్యకలాపాల కోసం ఈ రహదారిని విస్తరించనున్న అదానీ డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ నిర్మాణాలకు మధురవాడ సర్వే నెంబర్ 409లో ఎకరం రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ప్రభుత్వం అదానీ సంస్థకు కేటాయించింది. భూమి ఇచ్చిన మూడేళ్లలోపు కచ్చితంగా కార్యకలాపాలు ప్రారంభించాలని, ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయనుంది. చదవండి: (రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడిది మానసిక వైకల్యం: కొడాలి నాని) హిల్–4లో అదానీకి స్థలం కేటాయించినట్లు బోర్డు ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ అదానీ కోసం కేటాయించిన స్థలానికి ఎకరానికి రూ. కోటి చొప్పున లీజు మొత్తం నిర్ణయించగా.. మొత్తం రూ.130 కోట్లుని ఇటీవలే సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి చెల్లించారు. అదానీకి అందివ్వాల్సిన భూముల సరిహద్దుల్ని ఏపీఐఐసీ సిద్ధం చేసింది. ఏడేళ్ల కాలం పాటు చెల్లించే స్టేట్ జీఎస్టీ రీయంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు డేటా సెంటర్ పార్కు పూర్తి చేయడంతో పాటు, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థని ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగ కల్పన విషయంలోనూ దశలవారీ పురోగతి చూపించనున్నారు. మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్లకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్ పార్కులో 1240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్ పార్కులో 1200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: (పవన్ కల్యాణ్‌తో ఆ సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తా: మంత్రి అమర్నాథ్) -
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో
పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆవిర్భవించి అర్ధ శతాబ్దం అయింది. ప్రభుత్వ యాజమాన్యంతో ప్రారంభమైన ఈ సంస్థ సుమారు 32 ఏళ్ల పాటు నిర్జీవంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జవసత్వాలు పుంజుకుంది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులకు అండదండగా నిలిచింది. వేలాది పరిశ్రమల స్థాపనకు పునాదులు వేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రగతిని విస్తరిస్తోంది. ఆత్మకూరురూరల్(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): అర్ధ శతాబ్దం క్రితం రెక్కలు తొడిగిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు గత ప్రభుత్వాలు రెక్కలు విరిచేశాయి. నిధులు.. విధులు లేక ఆ సంస్థ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చేతులు ముడుచుకుని కూర్చొంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సంస్థ చేతినిండా పనితో తన కార్యకలాపాలను సమృద్ధిగా విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. 2004 నుంచి 2009 వరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏపీఐఐసీ వైఎస్సార్ మరణం తర్వాత మళ్లీ నిధులు, విధులు లేక చతికిలపడింది. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంస్థకు మళ్లీ రెక్కలొచ్చాయి. పారిశ్రామిక ప్రగతికి తనవంతుగా భూసేకరణ చేయడంతో పాటు అందులో మౌలిక వసతులు కల్పించడంలో అహర్నిశలు శ్రమిస్తోంది. మూడు పారిశ్రామికవాడల నుంచి.. 1973లో ఏపీఐఐసీ ప్రభుత్వ సంస్థగా ఆవిర్భవించింది. అయితే 2004 సంవత్సరానికి ముందు వరకు జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఆటోనగర్, ఉడ్‌కాంప్లెక్స్, వెంకటాచలం పరిధిలోనే మాత్రమే పరిశ్రమల ఏర్పాటు చేయగలింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు, పంటపాళెం, కొడవలూరు ప్రాంతాల్లో పారిశ్రామికవాడల విస్తరణకు ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 27 వేల ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల స్థాపనకు అనువుగా మార్చింది. వేలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. కొత్త పరిశ్రమలకు ఊతంగా.. జిల్లా విభజతో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు తదితర పారిశ్రామికవాడలు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జిల్లాలో ఏపీఐఐసీకి మిగిలిన 4,107.97 ఎకరాల భూములను పారిశ్రామిక పార్కులుగా తీర్చిదిద్ది పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. జిల్లాలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటి వరకు 1883.59 ఎకరాల్లో 925 సంస్థలు రూ.9,422.93 కోట్ల పెట్టుబడితో వివిధ పరిశ్రమలను స్థాపించింది. తద్వారా 11,939 మంది నిరుద్యోగులకు ఆయా సంస్థల్లో ఉపాధి లభించింది. రెండో దశలో 648.64 ఎకరాల్లో 47 సంస్థలు రూ.6,661.02 కోట్ల పెట్టుబడితో స్థాపించబోయే పరిశ్రమల ద్వారా 10,188 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మూడో దశలో 67.16 ఎకరాల్లో రూ.346.92 కోట్ల పెట్టుబడితో 44 సంస్థలు తాము ప్రారంభించబోయే పరిశ్రమల్లో 5,176 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. నారంపేటలో వడివడిగా నిర్మాణాలు దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మానసపుత్రికగా ప్రారంభమైన ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ నిర్మాణాలు ఆయన హఠాణ్మరణం కారణంగా కొంత కాలంగా పనులు మందగించాయి. తన అన్న ఆశయ సాధనే తొలి ప్రాధాన్యంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నారంపేట పారిశ్రామికవాడపై దృష్టి సారించడంతో ఆగిపోయిన పనులు మళ్లీ జోరందుకున్నాయి. తొలి దశలో 2.30 కి.మీ. బీటీ రోడ్లు, 3.22 కి.మీ. సిమెంట్ డ్రెయినేజీ కాలువలు రూ.6.46 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. రెండో దశలో రూ.12.73 కోట్ల వ్యయంతో 6.70 కి.మీ. బీటీ రోడ్లు, 19.40 కి.మీ. సిమెంట్ కాలువలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం 2.30 కి.మీట. బీటీ రోడ్లు, 4.60 కి.మీ. సిమెంటు కాలువలు నిర్మాణాలు పూర్తయ్యాయి. పారిశ్రామికవాడ ప్రత్యేకతలు 173.67 ఎకరాలు విస్తీర్ణంలో చేపట్టిన నారంపేట ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాస్టిక్ పార్కు, ఫర్నీచర్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 337 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ ప్లార్కు ఏర్పాటుకు 36.23 ఎకరాలు, ఫర్నీచర్ పార్కుకు 25.56 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఇప్పటికే పది ఎకరాల విస్తీర్ణాన్ని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశారు. గృహ నిర్మాణాల కోసం 5.49 ఎకరాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం గృహ సముదాయం, మౌలిక వసతుల కోసం ప్రత్యేక భవనాలు, విశాలమైన గ్రీన్ పార్కు, 24 గంటలు అందుబాటులో ఉండేలా విద్యుత్, నీరు, వాహనాల పార్కింగ్ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో భారీగా విస్తరణ దిశగా.. బొడ్డువారిపాళెం పారిశ్రామికవాడలో మిథాని గ్రూపు సంస్థలు ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి రూ.4,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. క్రిబ్కో గ్రూపు సంస్థలు కూడా 289.81 ఎకరాల్లో రూ.560 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించే మరో పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పారిశ్రామికవాడలను విస్తరించిన ఏపీఐఐసీ తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ద్వారా కందుకూరు డివిజన్ సమీపంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో 3,773.47 ఎకరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించాలని నిర్ణయించారు. నెల్లూరురూరల్ మండలం కొత్తూరు, నెల్లూరు బిట్ 1 వద్ద 4 ఎకరాల్లో హెల్త్ హబ్ నిర్మించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ముమ్మరంగా కృషి చేస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో 4 చోట్ల, వెంకటాచలం, కావలి, అనంతవరం, కొత్తపల్లి కౌరుగుంట, బొడ్డువారిపాళెం, ఆమంచర్ల, చెన్నాయపాళెం, ఏపూరు, గుడిపల్లిపాడు, పంటపాళెం, పైనాపురం, రామదాసుకండ్రిక, సర్వేపల్లి, తదితర ప్రాంతాల్లో 3,756.62 ఎకరాల భూమిలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2 వేల ప్లాట్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 738 ప్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఏపీఐఐసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ఏపీఐఐసీ ద్వారా సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లాలోని కొత్తపల్లికౌరుగుంట, నారంపేట, బొడ్డువారిపాళెం, అనంతవరం పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసిన యూనిట్లను ఎస్సీ, ఎస్టీల వారికి 50 శాతం సబ్సిడీపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే డీఐఈపీసీ సమావేశంలో కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 21 శాతం ప్లాట్లు రిజర్వు చేయబడతాయి. ఏపీఐఐసీ వెబ్సైట్లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం చేస్తారు. – జే.చంద్రశేఖర్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ నెల్లూరు -
తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు గుమ్మళ్ళదొడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు. బయో ఇథనాల్‌లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. -
కొప్పర్తిలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్.. 30,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్‌గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు. నిజానికి.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్ రంగాలకు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్‌ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్‌ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 30,000 మందికి ఉపాధి ఇక ఈ తయారీ జోన్ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్‌ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
AP: రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, రొయ్యల కౌంట్ ధరలను తగ్గించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. రొయ్యల ఫీడ్ ధరలు ఇష్టానుసారం పెంచుతున్నారని, కౌంట్ ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన కమిటీ తొలిభేటీలో మంత్రుల ఆదేశాల మేరకు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లతో గురువారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలొద్దు ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టంచేశారు. ప్రభుత్వం, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, కౌంట్ ధరలను పెంచాలని ఆదేశించారు. స్టేక్ హోల్డర్స్, ఎగుమతిదారులు, ప్రాసెసరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లాజిస్టిక్స్ సమస్యలేమైనా ఉంటే చెప్పాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్, ఇతర ముడిసరుకుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయని, ఈ సమయంలో పెంచిన ధరలు ఎందుకు కొనసాగిస్తున్నారని అప్సడా వైస్ చైర్మన్ రఘురాం ప్రశ్నించారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కమిటీ ఆదేశించింది. దీంతో నెల క్రితం టన్నుకి రూ.2,600 చొప్పున పెంచిన ఫీడ్ ధరను ఉపసంహరించుకునేందుకు తయారీదారులు అంగీకరించారు. కౌంట్‌కు రూ.55 వరకు పెంపునకు ప్రాసెసర్లు అంగీకారం రొయ్యల కౌంట్ ధరలు అనూహ్యంగా తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు. రూ.270 నుంచి రూ. 280 ఉన్న 100 కౌంట్ «ధరను రూ.200కు, రూ.420కు పైగా ఉన్న 30 కౌంట్ ధరను రూ.380కు తగ్గించారు. మిగిలిన కౌంట్ ధరలను కూడా రూ.30 నుంచి రూ.80 వరకు తగ్గించారు. ఈ విషయం సీఏం దృష్టికి వెళ్లడం, ఆయన ఆదేశాలతో సాధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కౌంట్‌కు రూ.20 నుంచి రూ.35 వరకు పెంచారు. ఈ ధరలు ఏమాత్రం లాభసాటి కాదని రైతులు స్పష్టంచేసారు. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా తగ్గిస్తారని, తక్షణం పెంచాల్సిందేనని మంత్రి, అప్సడా వైస్ చైర్మన్లు ఆదేశించారు. దీంతో సీఎం జోక్యం చేసుకోడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కౌంట్‌కు రూ.40 నుంచి రూ.55 మేర పెంచేందుకు ప్రాసెసర్లు అంగీకరించారు. ఫీడ్ ధరల తగ్గింపు, కౌంట్ ధరల పెంపును 17వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ ధరల వివరాలను అన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఇవే ధరలు 24వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
క్రిస్ సిటీ నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ(క్రిస్ సిటీ) నిర్మాణానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. తొలి దశలో సుమారు 2,006 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ పనులు చేజిక్కించుకునేందుకు ఎన్సీసీ, నవయుగ, షాపూర్జీపల్లోంజీ సంస్థలు వేసిన బిడ్లు సాంకేతికార్హత సాధించాయి. ఈ మధ్యనే జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో సాంకేతిక అర్హత సాధించిన ఈ మూడు బిడ్లు ఆమోదం పొందాయి. త్వరలోనే ఆర్థిక అంశాలను పరిశీలించాక రివర్స్ టెండరింగ్ విధానంలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్టు ఏపీఐఐసీకి చెందిన ఉన్నతాధికారి చెప్పారు. చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా మొత్తం 11,095.9 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మాణాన్ని చేపడుతుండగా.. అందులో తొలి దశలో 2,000 ఎకరాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీఐఐసీ నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటికే పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులూ మంజూరయ్యాయి. ఈ పారిశ్రామికవాడకు కండలేరు నుంచి నీటిని సరఫరా చేస్తారు. తుది బిడ్ ఎంపిక కాగానే త్వరలోనే పనులు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే 2.96 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. -
మౌలికవసతుల కల్పనలో రికార్డు వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ఇంజనీరింగ్ పనుల్లో రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విధంగా 2021–22లో ఈ పనుల కోసం రూ.348.71 కోట్లు వ్యయం చేసింది. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చుచేస్తే అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ సర్కారు మూడేళ్లలో రూ.1,058 కోట్లు ఖర్చుచేశారు. అంతేకాక.. ఈ సమయంలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కృషిచేస్తున్నామని, అందులో భాగంగా ఇంజనీరింగ్ పనులపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌వల్ల రెండేళ్లుగా అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయామని, ఈ ఏడాది గతేడాది కంటే అత్యధికంగా వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నం వద్ద చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ పేరుతో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ‘రెడీ టు బిల్డ్’పై ప్రత్యేక దృష్టి ఇక తక్షణంఉత్పత్తి ప్రారంభించేలా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ వీటి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి చోట్ల 20కిపైగా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని, వీటివల్ల 4.80 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తోందన్నారు. కేవలం మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో రూ.656 కోట్లు ఆర్జించినట్లు తెలిపారు. 50 ఏళ్ల క్రితం రూ.20 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఏపీఐఐసీ ఇప్పుడు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను చేపడుతోందని.. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధిచేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. -
రాష్ట్ర ఆర్థికాభివృద్థిలో పారిశ్రామికపార్కులే కీలకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక పార్కుల పాత్ర కీలకమని, పారదర్శక విధానాలతో పారిశ్రామిక వాడల ప్రగతికి నిరంతరం కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లోగోను సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రగతిలో ఏపీఐఐసీ కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిపాటు నిర్వహించే ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఏపీఐఐసీ పాత్ర మరువలేనిదని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1.50 లక్షల ఎకరాలను వినియోగించుకుంటూ మరింత పారిశ్రామిక ప్రగతి సాధిస్తామన్నారు. సీఎం జగన్ నాయకత్వలో రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ఏపీఐఐసీలో ఉత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగులకు ఈ సందర్భంగా మంత్రి అవార్డులను అందచేశారు. ఏపీ ఎకనామిక్ బోర్డు (ఏపీఈడీబీ) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఏడాది పాటు ఉత్సవాలు 2023 సంవత్సరాన్ని ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌గా ప్రకటించి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఏపీఐఐసీ ద్వారా 21 లక్షల మందికి ఉపాధి కల్పించడంతోపాటు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పారు. సింగిల్ డెస్క్ విధానంలో భాగంగా ఏపీఐఐసీ ప్రవేశపెట్టిన 14 రకాల ఆన్లైన్ సేవలకు మంచి స్పందన వస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. రూ.20 కోట్లతో మొదలై రూ.5,000 కోట్లకు రూ.20 కోట్లతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ.5,000 కోట్ల స్థాయికి చేరుకుందని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి హాజరై అత్యుత్తమ పనితీరు కనపరచిన ఏపీఐఐసీ ఉద్యోగులకు అవార్డులు అందచేసి అభినందించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో షన్ మోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ ఆన్లైన్ సేవలకు ఆదరణ
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్‌తో ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం ‘సాక్షి’తో చెప్పారు. ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా, మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు చెప్పారు. సేవల విస్తరణ ప్రస్తుతం వెబ్ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్లైన్ ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్‌ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్‌కు సంబంధించిన ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. -
ఒక్క క్లిక్‌తో సమాచారమంతా..
మీరు ఏదైనా పారిశ్రామిక పార్కులో యూనిట్ ఏర్పాటుకోసం స్థలం ఎక్కడ ఉంది? ఎంత విస్తీర్ణం ఉంది? సరిహద్దులు ఏంటి? ప్రధాన రోడ్డుకు ఎంత దూరంలో ఉంది? ఇటువంటి వివరాల కోసం నేరుగా పారిశ్రామిక పార్కుకు వెళ్లాల్సిన అవసరంలేదు.. మొబైల్లో సింగిల్ క్లిక్ చేస్తే చాలు!! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు సమస్త సమాచారాన్ని మొబైల్ యాప్ రూపంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) పోర్టల్ ఆధారిత మొబైల్ యాప్‌ను తయారుచేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిస్థితిని మొబైల్ యాప్‌లో పక్కాగా చూపించేందుకు డ్రోన్ సహాయంతో కూడా సర్వేచేసి.. ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెన్సీని ఎంపికచేసే పనిలో ఏపీఐఐసీ పడింది. మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఇంటి నుంచే పారిశ్రామిక పార్కుల్లో ఎక్కడెక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి? వాటి ధర ఎంత అనే వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. పరిశ్రమల అనుమతుల కోసం ఇప్పటికే సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింత సులభంగా వారికి సమాచారం చేరవేసేందుకు ఈ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ అవకాశంలేదు వాస్తవానికి ఏపీఐఐసీకి చెందిన సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో లభిస్తోంది. పారిశ్రామిక పార్కుల వారీగా ఖాళీ ప్లాట్ల వివరాలు లభించడంతో పాటు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, పక్కాగా ఆ ప్లాటును నేరుగా ఆన్లైన్లోనే చూసేందుకు మాత్రం అవకాశంలేదు. దానిని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాల్సిందే. ఆ ఖాళీ ప్లాటు విస్తీర్ణం ఎంత? ధర ఎంత అనే వివరాలు ఉంటున్నాయి. అయితే, నిర్దిష్టంగా సరిహద్దులు ఏమిటనే వివరాలు అందుబాటులోలేవు. అయితే, కొత్తగా తయారుచేయనున్న యాప్‌లో మాత్రం సమస్త సమాచారం.. కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఏపీఐఐసీ సమాయత్తమవుతోంది. యాప్‌తో ఇవీ ఉపయోగాలు.. ఏపీఐఐసీ తయారుచేస్తున్న మొబైల్ యాప్ ద్వారా సింగిల్ క్లిక్‌లో సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. అవి ఏమిటంటే... ► పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలు. ► ఆయా ప్లాట్ల సరిహద్దులు, విస్తీర్ణం, ధర వగైరా అన్ని అంశాలు. ► సదరు ప్లాటుకు రోడ్డు, రైల్వే మార్గం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. ► ఖాళీ ప్లాటును కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. ► భవిష్యత్తులో ప్లాటు కొనుగోలు ధరను కూడా ఆన్లైన్లో చెల్లించే ఆప్షన్ వచ్చే అవకాశముందని సమాచారం. అన్ని వివరాలు ఒకే యాప్‌లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పారిశ్రామిక పార్కులు ఉన్నాయనే వివరాలతో పాటు వాటి వాస్తవ భౌగోళిక స్థితిని తెలుసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుంది. పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మొబైల్ యాప్ తయారుచేస్తున్నాం ఇప్పటికే ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన సమాచారం వెబ్ ఆధారిత పోర్టల్‌లో లభిస్తోంది. కానీ, ఒక యాప్ రూపంలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందులో పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఖాళీలు.. వాటి ధరల వివరాలతో పాటు దగ్గరలోని రైల్వేస్టేషన్, రోడ్డు మార్గం వివరాలన్నీ లభిస్తాయి. వాటి ఫొటోలు, సరిహద్దులు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. – సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ -
ఏపీఐఐసీ కీలక నిర్ణయం.. పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేలా ఏపీఐఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక యూనిట్లు చెల్లించాల్సిన పన్ను బకాయిలను ఒకేసారి కట్టేస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఐఐసీ ప్రకటించింది. ఏటా ఒకేసారి పన్ను చెల్లించే వారికి కూడా 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీఐఐసీ ఈ ఉత్తర్వులిచ్చింది. రాయితీ మార్గదర్శకాలను సీజీజీ ఆన్లైన్ పోర్టల్‌లో ఏపీఐఐసీ ఉంచింది. 2022–23 సంవత్సరానికి ఆస్తి పన్నును బకాయిలతో కలిపి జూలై 31వ తేదీలోగా చెల్లించిన వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలకు ఇది వర్తిస్తుంది. అర్బన్ ఐలాల్లో మాత్రం జూన్ 30 లోపు చెల్లించిన వారికి పెనాల్టీలో కూడా తగ్గింపు ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.60 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు ఏపీఐఐసీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మార్గదర్శకాలిచ్చారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
సీఎం ఆదేశాలు.. ప్రైవేట్‌కు ధీటుగా వాటి రూపురేఖలు మారనున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్న వీటిని ప్రైవేటు పార్కులకు దీటుగా హరిత పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఏపీఐఐసీ చేపట్టింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే విధంగా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ డ్రైవ్ పేరుతో 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 20న మొదలైన ఈ కార్యక్రమం జులై 5 వరకు జరుగుతుందని.. తొలిదశలో వ్యర్థాల తొలగింపు, వరద కాలువల అభివృద్ధి, అంతర్గత రహదారులకు మరమ్మతులపై దృష్టిసారించామని.. రానున్న రోజుల్లో మురుగు నీరు, వ్యర్థాల శుద్ధి, నీటి సదుపాయం వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించనున్నట్లు ఏపీఐఐసీ వీసీ–ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలోని 168 ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)లను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం రాష్ట్రంలోని 168 ఐలాలకు ఏటా రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా వీటి నిర్వహణపై గత ప్రభుత్వాలు దృష్టిసారించలేదు. ఐలాలకు వచ్చే ఆదాయంలో 35 శాతం స్థానిక పురపాలక, గ్రామ పంచాయతీలకు వెళ్తుంది. పారిశ్రామికవాడల్లో వ్యర్థాల తొలగింపునకు సంబంధించి స్థానిక సంస్థలు, ఐలాల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థలతో కలిసి వ్యర్థాలను తొలగించి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ డ్రైవ్ ప్రారంభించిన మూడ్రోజుల్లోనే 100 కి.మీ పైగా రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించింది. అలాగే.. 14,000 మీటర్ల అంతర్గత రహదారులకు మరమ్మతులు, 33,543 మీటర్ల మేర వరద కాలువల్లో చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని జులై 5కల్లా రాష్ట్ర పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారతాయన్న ఆశాభావాన్ని సుబ్రమణ్యం వ్యక్తంచేశారు. ఐపీఆర్‌ఎస్‌లో చోటే లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణలో ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) కీలకపాత్ర పోషిస్తుంది. ఐపీఆర్‌ఎస్ ర్యాంకింగ్‌లో ప్రభుత్వ రంగ పారిశ్రామిక పార్కులు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు పెంచడం ద్వారా ఐపీఆర్‌ఎస్ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏపీలోని ఏపీఐఐసీ పార్కుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 50వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మౌలిక వసతులు లేకపోవడంతో చాలా చోట్ల యూనిట్లు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చదవండి: మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ -
అక్షర పూదోటలో విహారం
‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్‌లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు. రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది. నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ. ‘మగాడు’ కథ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది. ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్ మీద కాలేజ్‌కి వెళ్లి ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’. ‘‘మల్లిక్ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ. చేయి చాచవద్దు! ‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె. ‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది. అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు. సరైన నిర్ణయమే! గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్పెక్టేషన్లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్‌గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే. నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది. అక్షరాల మడి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కాలమ్స్ రాస్తున్నాను. నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే. మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. – అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి, జనరల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే రంగాల వారీగా రౌండ్ టేబుల్ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గురువారం ఏపీఐఐసీలోని మంత్రి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు, వాటి తదనంతరం శాఖాపరమైన కొనసాగింపు చర్యలపై మంత్రి అమర్నాథ్ దిశానిర్దేశం చేశారు. ప్రధాన పారిశ్రామికవేత్తలు, సంఘాలతో రంగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా వాస్తవరూపం దాల్చడానికి జిల్లాకొక పరిశ్రమల సంబంధాల అధికారిని నియమించాలని చెప్పారు. దావోస్‌లో కలిసిన ప్రతినిధులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆహ్వానిస్తూ పది రోజుల్లోగా లేఖలను రాయాలని ఈడీబీ అధికారులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన వారితో సంప్రదింపులు జరపాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. అదే విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40, అంతర్జాతీయంగా 10 రోడ్‌షోలను నిర్వహించే విధంగా తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు ఏవీ పటేల్, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా దేవి, వీఆర్ నాయక్, ఈడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘క్రిస్ సిటీ’ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఫ్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, వ్యర్థాలను శుద్ధి చేయాలని, భూగర్భ జలాలను, సహజ సిద్ధంగా ఉన్న కాలువలు, చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశ ప్రాజెక్టుకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం కూడా లభించింది. చదవండి: AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ.. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోభాగంగా కృష్ణపట్నం వద్ద మొత్తం 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిక్‌డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ నిక్‌డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. టెక్స్టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2,96,140 మందికి ప్రత్యక్షంగా, 1,71,600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. తొలిదశలో 2,006.09 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. తొలి దశకు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశ నిర్మాణానికి జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి కూడా ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. సుమారు రూ.1,054.63 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తారు. క్రిస్ సిటీ నిర్మాణ సమయంలో రోజుకు 500 కిలో లీటర్లు, ప్రాజెక్టు పూర్తయ్యాక పరిశ్రమలకు రోజుకు 99.7 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నీటిని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా చేయనున్నారు. -
జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్ నిర్ణయం
సాక్షి, అనంతపురం: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. చదవండి: (ఎప్పటికీ వైఎస్ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి) -
రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్ క్లస్టర్లను ట్రాంచ్–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్‌ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా.. ► నక్కపల్లి క్లస్టర్లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్ ఏరియాలో కూడా రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► చిత్తూరు సౌత్ జోన్‌లోని శ్రీకాళహస్తి క్లస్టర్లో 2,770 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్ ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది. -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
తుది దశకు ‘మెగా ఫుడ్‌పార్కు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనసంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్కు పనులు తుదిదశకు చేరాయి. ఏప్రిల్ 15 కల్లా పనులు పూర్తిచేసి.. మామిడి సీజన్ ప్రారంభమయ్యే నాటికి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలను ఫుడ్ పార్కుకు కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మామిడి, బొప్పాయి, జామ వంటి పండ్లతోటలు, టమా టా తదితర కూరగాయలు పెద్ద ఎత్తున సాగు చేస్తుం టారు. దీంతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ కోసం మెగా ఫుడ్‌పార్కులో రూ.86 కోట్లతో 7.48 ఎకరాల్లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను పూర్తిస్థాయి వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో 960 టన్నుల సామర్థ్యంతో పండ్లను మగ్గ బెట్టడంతో పాటు గంటకు ఆరు నుంచి పది టన్నుల గుజ్జు, రసాలు తీయొచ్చు. బియ్యం, జొన్నలు వంటి ఆహార పదార్థాలనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా 4 వేలటన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించారు. పండ్లు, కూరగాయల నిల్వకు కూడా 3 వేల టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగి, ప్యాకింగ్ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరిశీలించేందుకు ఎనలై టికల్ ల్యాబ్ తదితర అన్ని అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.260 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు మెగా ఫుడ్‌పార్కులు అందుబాటు లోకి వస్తే దాదాపు 6 వేలమందికి ఉపాధి లభిస్తుం దని అంచనా వేస్తున్నారు. పనితీరు, ఇక్కడి సౌకర్యా ల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిం చేందుకు ఏపీఐఐసీ త్వరలో రోడ్ షోలు నిర్వహించబోతోంది. నేరుగా ఇక్కడకు సరుకు తీసుకువచ్చిన వారు.. కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకొని, అవసరమైన పరిమాణంలో ప్యాకింగ్ చేసి, తీసుకెళ్లే సదుపాయాలు కల్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. చాలా సంస్థలు వస్తున్నాయ్.. ఏప్రిల్ 15కల్లా మెగా ఫుడ్ పార్కులో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తోంది. ఇప్పటికే ప్రొడక్షన్, మార్కెటింగ్‌కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ఏపీఐఐసీని సంప్రదించాయి. – డి.శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
మల్లవల్లి ఫుడ్ పార్క్ ద్వారా రూ.260 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్ పార్కుల ద్వారా రూ.260 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కును అభివృద్ధి చేయగా, దాని పక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది. మెగా ఫుడ్ పార్కులో రూ.86 కోట్ల తో ఏర్పాటు చేసిన కోర్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ)ను ఈ మామిడి పండ్ల సీజన్‌కు అందుబాటులోకి తెస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, టమాట, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకునేలా సీపీసీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏప్రిల్ మొ దటి వారంలో రోడ్ షోలు నిర్వహిస్తామని ఏపీఐ ఐసీ వీసీ,ఎండీ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. -
దళితులను పారిశ్రామికవేత్తలుగా...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్ డ్యూటీ, రీయింబర్స్మెంట్, ఏపీఎస్ఎఫ్లలో అడ్వాన్స్ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?) 2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి. ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎస్ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు) ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. - వి. భక్తవత్సలం డీఐపీసీ సభ్యులు, ఒంగోలు -
ఆటోనగర్లపై ప్రభుత్వ నిర్ణయం ఓ మంచి అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోనగర్లతో పాటు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు, ఎస్టేట్లలో దివాలా తీసిన పరిశ్రమలు, యూనిట్ల భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. గతంలో నగరాలు, పట్టణాల చివర్ల ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చేశాయి. దీంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్లలోని యూనిట్ల దారుల నుంచి ఆ భూములను రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. నగరం మధ్య యూనిట్లు నడపడం కష్టంగా ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. వీరు భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించాలి, లేదా 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏపీఐఐసీ నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సొంతంగా భూమిని కొనుగోలు చేసుకున్న పారిశ్రామిక యూనిట్ల భూ వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 15 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 50 శాతం ప్రభుత్వానికి చెల్లించినా లాభమే అని పేర్కొంటున్నారు. ఈ జీవోలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, విశాఖ ఆటోనగర్ ఎ, బి, సి బ్లాకుల్లోని యూనిట్లకు చక్కటి అవకాశమని ఏపీఐఐసీ ఐలా ఆటోనగర్ చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు) తెలిపారు. విశాఖ ఆటోనగర్‌లో తన రెండు యూనిట్లు నివాసప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయని, ఇప్పుడు ఈ ఆ యూనిట్లను మార్చుకునే అవకాశం లభించిందని పారిశ్రామికవేత్త సీహెచ్ రవికుమార్ చెప్పారు. మరింత స్పష్టత రావాలి... రాష్ట్ర ఫ్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై మరింత స్పష్టత రావాల్సి ఉందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం కింద ఓ యూనిట్ మూసివేసి అక్కడ గృహ సముదాయాన్ని నిర్మిస్తే ఆ పక్కనే నడుస్తున్న యూనిట్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే మార్కెట్ విలువలో 50 శాతం కట్టమంటే చిన్న యూనిట్ దారులకు భారమవుతుందంటున్నారు. ఇప్పటికే ఈ ఉత్తర్వులపై ఏపీ చాంబర్స్ ప్రతినిధులు ఆటోనగర్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపామని, మరింత స్పష్టత కోసం త్వరలో ఏపీఐఐసీ అధికారులను కలవనున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. -
కాలుష్యం లేకుండా చక్కటి ‘మార్గం’
సాక్షి, అమరావతి: కాకినాడ సమీపంలోని తీరాన్ని కాలుష్య రహితంగా, పర్యావరణాన్ని పరిరక్షించేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాకినాడకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల కాలుష్యం పెరగకుండా, మత్స్య సంపద, ఇతరత్రా జీవరాశికి హాని కలగకుండా కేంద్ర పర్యావరణ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిశ్రమలు సముద్రంలోకి శుద్ధి చేసిన వ్యర్థాలను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ వదలకుండా ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ భాధ్యతను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాకినాడ సెజ్‌లో రాబోయే పరిశ్రమలు, చుట్టుపక్కల ఏర్పాటయ్యే ఫార్మా, పెట్రో కెమికల్స్ యూనిట్ల వల్ల సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించిందని ఆ సంస్ధ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఒకే పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కాకినాడ సమీపంలో దివీస్ ఫార్మా యూనిట్ ఏర్పాటవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌లో భారీ రిఫైనరీని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ రిఫైనరీని ఏ విధంగా లాభదాయకతతో ఏర్పాటు చేయవచ్చన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి వివరించారు. దానిపై అధ్యయనానికి కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని 2023 మే నెలకల్లా ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. కన్సల్టెన్సీ కోసం టెండర్లు ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థ, శుద్ధి చేసిన జలాలను సముద్రంలోకి విడుదల చేయడానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెన్సీని నియమించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ఇందుకోసం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల సంస్థలు ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు బిడ్లు దాఖలు చేయాలని కోరింది. -
మరోసారి అడ్డంగా దొరికిన ‘ఈనాడు’
Yellow media has once again fake news spread On AP CM: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఉన్న అక్కసును టీడీపీ అనుకూల మీడియా మరోసారి చాటుకుంది. టీడీపీ హయాంలో తప్పుగా కానరాని నిర్ణయాలు ఇప్పుడు చట్ట ప్రకారం నడుచుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా గుండెలు బాదుకోవడం ఓ వర్గం మీడియాకు ఆనవాయితీగా మారిపోయింది. గురువారం ఈనాడు దినపత్రిక ప్రచురించిన ‘ఐటీ సెజ్ భూములను కట్టబెట్టేశారు’’ కథనమే దీనికి నిదర్శనం. 2016లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని సీపీ బ్రౌన్ ఐటీ సెజ్ హోదా రద్దు కాకుండా భూముల కోసం అడ్వాన్సు తీసుకున్నప్పుడు తప్పుగా కనిపించని నిర్ణయం.. ఇప్పుడు సెజ్ హోదా రద్దైన తర్వాత కేటాయిస్తే సెజ్ భూములను కట్టబెట్టేశారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఏపీఐఐసీ ఆధారాలతో దీన్ని ఖండించింది. ఏం జరిగిందంటే.. కడపలో ఐటీ సెజ్ అభివృద్ధి చేసేందుకు 2007లో ఏపీఐఐసీ 52.76 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఐటీ కార్యాలయాలను నెలకొల్పేందుకు కె.రహేజా కార్పొరేషన్‌కు 2008 సెప్టెంబర్ 29న ఐదెకరాల భూమిని 30 ఏళ్లు లీజు విధానంలో కేటాయించింది. అయితే అనంతరం రహేజా కంపెనీ తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీంతో అప్పటి నుంచి ఏపీఐఐసీ వెబ్సైట్లో అది ఖాళీ స్థలంగానే ఉంది. ఈ క్రమంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఐటీ సెజ్ హోదా రద్దు చేయాలని 2013 నవంబర్ 5న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. ఐటీ సెజ్ డీ–నోటిఫికేషన్ ప్రాథమిక అనుమతులను 2015 జూలై 8న టీడీపీ హయాంలోనే కేంద్రం జారీ చేసింది. ఐటీ కంపెనీలు రానందున ఇదే విధంగా విశాఖపట్నంలోని మధురవాడ, గంభీరం తదితర చోట్ల ఐటీ సెజ్‌లను డీ–నోటిఫికేషన్ చేశారు. 2016లోనే అడ్వాన్స్ చెల్లించిన షిర్డీసాయి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడపలో రూ.246.5 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించేలా ట్రాన్స్ఫార్మర్ల తయారీ యూనిట్‌కు 2016లో దరఖాస్తు చేసుకుంది. ఐటీ పారిశ్రామిక వాడలో భూమి కేటాయించాలని రూ.2.85 కోట్లు అడ్వాన్స్‌గా డీడీ రూపంలో ఏపీఐఐసీకి 2016 అక్టోబర్ 16న చెల్లించింది. ఆ భూమి కోసం ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో నిబంధనల ప్రకారం ఏపీఐఐసీ వేలం వేయకుండా కేటాయించింది. అయితే అప్పటి నుంచి 2020 వరకు కేంద్రం నుంచి డీనోటిఫికేషన్ గెజిట్ రాకపోవడంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పనులను ప్రారంభించలేదు. ఇప్పుడు డీ–నోటిఫికేషన్ గెజిట్ రావడంతో ఏపీఎస్పీడీసీఎల్ అవసరాల కోసం కొంత భూమిని వదిలి మిగతాది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయించినట్లు ఏపీఐఐసీ పేర్కొంది. ఉపాధి నిమిత్తం పరిశ్రమలకు కేటాయించే భూములను మార్కెట్ ధర, గృహ సముదాయాల లే అవుట్ల ధరలతో పోల్చి చూడటం సరికాదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. -
కోశలనగరం పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద ఏపీఐఐసీ ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు లభించాయి. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనుంది. ఇందులో 1,371.52 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, మిగిలిన స్థలాన్ని మౌలికవసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పారిశ్రామిక పార్కుకు కీలకమైన పర్యావరణ అనుమతులు రావడంతో మౌలికవసతుల అభివృద్ధి కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. -
'హెల్త్ హబ్స్'పై ప్రముఖ వైద్య సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. తాజాగా టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకపక్క నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో మల్టీ/ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఐఐసీ టెండర్లను పిలిచింది. హెల్త్ హబ్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న 13 కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాధాన్యం గురించి ప్రీ బిడ్డింగ్‌లో వివరించారు. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. -
విశాఖలో మరో ఎంఎస్ఎంఈ పార్క్
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సహా పార్కు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన భూమి వరల్డ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వంద ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా.. 20 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ‘భూమి వరల్డ్ గ్రూప్’ ప్రతిపాదనపై చర్చించారు. దీన్ని మరోసారి పరిశీలించి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది పాల్గొన్నారు. ఇండో–జపాన్ ప్రతినిధుల భేటీ మంత్రి గౌతమ్‌రెడ్డితో ఇండో–జపాన్ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై మంత్రి చర్చించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం
కోవిడ్ నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా వైద్య రంగం ఆవశ్యకతను, ఆధునిక వైద్య సేవల అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కి చెప్పింది. కోవిడ్ తీవ్రతను ముందుగానే ఊహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పరంపరలో ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు ద్వారా మెరుగు పరచడంతో పాటు.. ముందు చూపుతో ప్రైవేట్ రంగంలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చేయూతనిస్తోంది. ఇలా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో సగానికి సగం బెడ్లు పేదలకు అందుబాటులో ఉండేలా వడివడిగా అడుగులు వేస్తోంది. సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరమే లేకుండా, స్థానికంగానే అత్యుత్తమ వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో 13 పట్టణాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి నగరాల నడిబొడ్డున ఆస్పత్రుల నిర్మాణానికి ఏపీఐఐసి ఉచితంగా భూమిని ఇవ్వనుంది. ఇప్పటికే అవసరమైన మేరకు స్థలాలను సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అత్యధిక శాతం హైదరాబాద్‌కే పరిమితం కావడంతో కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటి నిర్మాణం చేపట్టినట్లు ఏపీఐఐసీ టెండర్లలో పేర్కొంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమిని సేకరించింది. ఆస్పత్రి నిర్మాణం, దాని నిర్వహణ.. బిడ్ దక్కించుకున్న సంస్థే నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఒక చోట లేదా వివిధ నగరాల్లో ఆస్పత్రులు నిర్మించడానికి బిడ్లను దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 6న మొదలైన బిడ్ల స్వీకరణ నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన బిడ్లను పరిశీలించి డిసెంబర్ 15న బిడ్డర్లను ఎంపిక చేస్తారు. బిడ్డింగ్‌లో ఎంపికైన సంస్థ రెండేళ్లలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అధిక పెట్టుబడి పెట్టేవారికి ప్రాధాన్యత ► అత్యధికంగా ప్రత్యేక వైద్య సేవలు, అధిక పడకలు అందుబాటులోకి వచ్చే విధంగా బిడ్డింగ్‌లో నిబంధనలను పొందుపర్చినట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి చోట కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, కనీసం 100 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంటుంది. ► అయితే బిడ్డింగ్ ఎంపికలో అధిక పెట్టుబడితో అధిక పడకలు నిర్మించడానికి ముందుకు వచ్చే సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఆస్పత్రిలో కనీసం రెండు స్పెషాలిటీ ట్రీట్మెంట్లను కలిగి ఉండాలి. ఈ స్పెషాలిటీ ట్రీట్మెంట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఎంపికలో వాటికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ► క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, బోన్ మారో వంటి చికిత్సలు అందించే వాటికి ఎంపికలో ప్రాధాన్యత అధికంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఆరోగ్యశ్రీకి 50 శాతం పడకలు ► కొత్తగా నిర్మించే ఈ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి తప్పనిసరిగా 50% పడకలను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో 2020లో వివిధ రోగాలకు చికిత్స తీసుకున్న వారి వివరాలను బిడ్‌లో పొందుపర్చారు. తద్వారా బిడ్డింగ్ దాఖలు చేసే సంస్థలు స్పెషాలిటీ చికిత్సలను ఎంపిక చేసుకోవడానికి సులభతరమవుతుంది. ► వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి ఎన్ని పడకలు అధికంగా కేటాయిస్తే బిడ్ ఎంపికలో అంత ప్రాధాన్యత పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేసే వైద్యులు కూడా ఆయా నగరాల్లోనే నివసించాలన్న నిబంధన కూడా విధించారు. ఈ 13 ఆస్పత్రుల నిర్మాణం ద్వారా కనీసం రూ.2,500 కోట్ల పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
‘అనంత’లో 3 ఎంఎస్ఎంఈ పార్క్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా మూడు ఎంఎస్ఎంఈ పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. అనంతపురం జిల్లా కోటిపి, రాప్తాడు, కప్పలబండలో ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మొత్తం రూ.18.11 కోట్లు వ్యయం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రూ.7.46 కోట్లతో కోటిపి ఎంఎస్ఎంఈ పార్కు, రూ.4.83 కోట్లతో రాప్తాడు పార్కు, రూ.5.82 కోట్లతో కప్పలబండ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కులలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందులో ఇప్పటికే కోటిపి పార్కులో అంతర్గత, బహిర్గత రహదారులు, వరద.. మురుగు నీటి కాల్వలు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటి కీలకమైన మౌలిక వసతులను కల్పించడానికి రూ.7.46 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రాప్తాడు, కప్పలబండల ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద పీట వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఇప్పటి వరకు రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఇందులో రూ.1,588 కోట్లు గత ప్రభుత్వ హయాంకు చెందినవి కావడం గమనార్హం. తద్వారా రాష్ట్రంలో సుమారు 98,000 కుపైగా ఎంఎస్ఎంఈల్లో పని చేస్తున్న 12 లక్షల మంది ఉపాధికి భరోసా కల్పించినట్లయ్యింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నెల్లూరు జిల్లాలో రూ.30 కోట్లతో 173.67 ఎకరాల్లో ప్లాస్టిక్, ఫర్నిచర్ పార్కు, చిత్తూరు జిల్లా గంధరాజుపల్లిలో ఎంఎస్ఎంఈ క్లస్టర్ పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్ఈ–సీడీపీ కింద రూ.61 కోట్లతో ఐదు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. -
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ–2021 తీసుకురానున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ తీసుకురాబోతున్నామని వివరించారు. కేంద్ర స్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించి సీఎస్ చైర్మన్‌గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాన్ మేజర్ పోర్టుల్లో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని.. ఏపీఐఐసీ భూముల్లో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ట్రక్ పార్కింగ్ ప్రాంతాలు నిర్మించాలని.. అక్కడ ఇంధన స్టేషన్లు, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఐటీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనలపైన అధికారులతో మంత్రి చర్చించారు. రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ వి గిరి, లంకా శ్రీధర్ పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి నియామకంపై ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. కాగా జూలై 17న ఏపీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అచ్యుతాపురం సెజ్‌లో ఈఎస్ఐ హాస్పిటల్
సాక్షి, అమరావతి: వేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగులకు త్వరలో ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీ స్థానంలో 30 పడకల హాస్పిటల్ నిర్మించాలని ఈఎస్ఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మందికి పైగా ఈఎస్ఐ పథకం ప్రయోజనాలు పొందుతుండగా అందులో ఒక్క అచ్యుతాపురం సెజ్ పరిధిలోనే 60,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి అవసరమైన రెండు ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి ఏపీఐఐసీ బోర్డు ఈ మధ్యనే ఆమోదం తెలిపింది. దీంతో అచ్యుతాపురంలోని ఏపీ సెజ్ ప్లాట్ నెంబర్ 45లోగల రెండు ఎకరాల భూమిని ఈఎస్ఐ కార్పొరేషన్‌కు ఉచితంగా ఇస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
మూడు నెలల్లో వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ.63 కోట్లతో ఏపీఐఐసీ పిలిచిన టెండర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి విడతలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పనిచేసుకునే విధంగా ఒక్కొక్కటి 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే రెండు నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. అంతర్గత రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, ముఖద్వారం నిర్మాణం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు సోమశిల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌కు ఇప్పటికే ఆమోదం లభించింది. అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 540 ఎకరాల్లో రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ ఈఎంసీలో కంపెనీలకు స్థలాలను కేటాయించడానికి 310.12 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు ఈ వైఎస్సార్ ఈఎంసీ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే రూ.1,850 కోట్ల మేర పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈఎంసీ యాంకర్ కంపెనీగా డిక్సన్ టెక్నాలజీ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి దశలో రూ.150 కోట్లతో సెక్యూరిటీ కెమెరాలు, ఐటీ హార్డ్‌వేర్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీని ద్వారా 1,500 మందికి ఉపాధి లభించనుంది. అదే విధంగా కార్బన్ కంపెనీ రూ.200 కోట్లతో ఐటీ హార్డ్‌వేర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. హార్మోని సిటీ రూ.1,500 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీలో మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్)లో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ విగ్రహం ఏర్పాటుకు ఈపీసీ విధానంలో ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయాన్ని రూ.180 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 14 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలి. టెండర్ డాక్యుమెంట్లు శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతిస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 249 కోట్లతో పార్కు అభివృద్ధి స్వరాజ్ మైదాన్‌లో సుమారు 20 ఎకారల విస్తీర్ణంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ అండ్ డెవలప్మెంట్ పార్కును రూ.248.71 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం కింద భాగంలో జీ+1 తరహాలో 2,000 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా కన్వెన్షన్ సెంటర్, ధ్యాన మందిరం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించడంతో ఏపీఐఐసీ విగ్రహ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. -
క్రిస్ సిటీ టెండర్లకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్‌లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో అందుబాటులోకి... క్రిస్ సిటీ పనులు జూన్‌లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్‌లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది. ఎస్పీవీకి భూమి బదలాయింపు.. కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): గోడౌన్ కూల్చివేతపై యాజమాన్యం స్టేటస్కో తెచ్చుకోవడంతో ఏపీఐఐసీ ఐలా అధికారులు తదుపరి చర్యలపై కోర్టు నోటీసులను విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్‌కు అంటించారు. మింది పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఏ–బ్లాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా, పరిశ్రమలు స్థాపించాల్సిన స్థలంలో భారీ గోదాములు ఏర్పాటుచేసి పలు కంపెనీలకు, సంస్థలకు లీజులకు ఇచ్చిన ఏటీఆర్ గోడౌన్లను కూల్చివేసేందుకు ఏపీసీఐఐసీ ఐలా అధికారులు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ గోడౌన్లో గుట్టుచప్పుడు కాకుండా, కనీసం సంస్థ పేరు, వివరాలు తెలిపే బోర్డు లేకుండా ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు సాగుతున్నాయి. చివరకు గోడౌన్ యాజమాన్యం కోర్టు నుంచి స్టేటస్కోను తెచ్చుకోవడంతో ఏపీఐఐసీ ఐలా అధికారులు తదుపరి చర్యల కోసం కోర్టుకు వెళ్లారు. -
‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ..
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకున్న భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన దురాక్రమణలపై ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమిత భూములు ఎవరి చేతుల్లో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు బదులు గోడౌన్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న వాటిపైనా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఆక్రమణల్ని తొలగించారే తప్ప.. ఉద్దేశపూర్వక, కక్షపూరిత వ్యవహారాలేమీ లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ నేతల భూదందాల బాగోతం రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా దురాక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వారి చెర నుంచి విడిపించేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో అధికారులు సర్వేచేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా.. విశాఖ అర్బన్, రూరల్ పరిధిలో రూ.1,800 కోట్ల విలువైన వందల ఎకరాలు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న అక్రమ నిర్మాణంపైనా చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవి ఇవీ.. 2020 నవంబర్‌లో విశాఖ రూరల్ మండలం విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లోని సుమారు రూ.256 కోట్లు విలువైన 64 ఎకరాలు.. గీతం డీమ్డ్ యూనివర్సిటీ చెరలో ఉన్న రూ.1,100 కోట్లు విలువైన సుమారు 40 ఎకరాలు.. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కి చెందిన రూ.300 కోట్లు విలువైన సుమారు 60 ఎకరాల్ని.. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి భార్య పేరిట ఆక్రమించిన రుషికొండలోని సర్వే నం.21లోని సుమారు రూ.2.50 కోట్లు విలువైన 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని.. కొమ్మాదిలోని సర్వే నం.66/2లో ఉన్న సుమారు రూ.98 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సాగర్‌నగర్ సమీపంలో మంత్రి బొత్స సమీప బంధువులకు చెందిన స్థలాన్ని 2020 డిసెంబర్లో స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాజకీయాలకు అతీతంగా.. పార్టీలతో పనిలేకుండా.. ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ.. అక్షరానికి వక్రభాష్యం చెబుతూ అధికారులు తీసుకున్న చర్యల్ని తప్పుబడుతూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి.. ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అమలుచేసిన నిర్ణయాలకు పొంతనలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. మింది పారిశ్రామిక ప్రాంతంలో ఏపీఐఐసీ కేటాయించిన స్థలాల్లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఏటీఆర్ పేరుతో 8 గోడౌన్లు నిర్మించారు. 2007లో 24,249.66 చ.మీకు ప్లాన్ తీసుకున్నారు. దీనికి తోడు 16,534.05 చ.మీటర్ల మేర ఆక్రమించేసి అనధికారికంగా గోడౌన్లు నిర్మించారు. కాగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో అనధికార నిర్మాణాన్ని గుర్తించిన ఐలా అధికారులు షెడ్ యజమానికి 2020 డిసెంబర్ 15న నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న కన్ఫర్మేషన్ నోటీసులు జారీచేశారు. అయినా స్పందించకపోవడంతో ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాల్ని తొలగించే ప్రక్రియని చేపట్టారు. అనధికారికంగా నిర్మించిన షెడ్ నం.5లో ఆమోద పబ్లికేషన్‌కు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు మరో నాలుగు కంపెనీలు అనధికారికంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ షెడ్ నెం.5ను ఉషా ట్యూబ్స్ అండ్ పైప్స్ ప్రై.లిమిటెడ్ పేరుతో స్టీల్ పైపులు, ట్యూబులు నిల్వచేసే గోడౌన్‌గా తీసుకున్నారు. అయితే, ఇందులో ఆమోదా పబ్లికేషన్స్‌తోపాటు హోంటౌన్ ఫర్నిచర్, రాఘవ వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్, హైవ్లూప్ లాజిస్టిక్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన గోడౌన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీలని బుధవారం కూల్చివేశారు. ఐలా నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ని నిర్మించడమే ఒక అక్రమమైతే.. అందులో ప్రింటింగ్ సెక్షన్ ఏర్పాటుచేయడం కూడా మరో అక్రమమని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖకు సంబంధించిన నిబంధనల్ని పాటించకుండా, వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నట్లు ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) అధికారులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకున్నారు తప్ప.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిదనడం పూర్తి సత్యదూరమని చెబుతున్నారు. ఆక్రమణలు వెలుగుచూసింది ఇలా.. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్లో కురిసిన వర్షాలకు షెడ్ నెం.5కు సంబంధించిన ప్రహరీ డ్రెయిన్‌లో కూలిపోయింది. దీంతో అక్కడ మురుగునీరు స్తంభించిపోవడంతో స్థానికుల ఫిర్యాదు చేశారు. ఐలా అధికారులు పరిశీలించగా ఆక్రమణల బాగోతం వెలుగుచూసింది. ఆ తర్వాత నోటీసులు జారీచేశారు. అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం.. అనధికార నిర్మాణం చేపట్టడమే కాకుండా అందులో నిబంధనలకు విరుద్ధంగా సంస్థల్ని నడిపిస్తున్నారంటూ రెండుసార్లు నోటీసులు జారీచేశాం. అయినా గోడౌన్ యజమాని స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్ నం.5 కూల్చివేత ప్రక్రియ చేపట్టాం. అయితే, కోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చారు. మేం అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. ఆక్రమించి నిర్మించిన 5వ నంబర్ షెడ్లోనే ఆమోద పబ్లికేషన్స్ ప్రింటింగ్ ప్రెస్ నడుస్తోంది. అందుకే చర్యలు తీసుకున్నాం. – డా. ఎ.శామ్యూల్, ఐలా కమిషనర్ రాజకీయ ప్రమేయం లేకుండా.. విశాఖ భూ ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం ఏడాదిన్నర కాలంగా చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ విభాగం నిర్వహిస్తున్న సర్వేలో ఆక్రమిత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు సుమారూ 300 ఎకరాల వరకూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ డ్రైవ్ వెనుక రాజకీయ ప్రమేయం ఏమాత్రం లేదు. ఆక్రమణల వెనుక ఎవరున్నా వాటిని విడిచిపెట్టడంలేదు. ఆక్రమణలున్నట్లు గుర్తించి ఆమోద పబ్లికేషన్స్ షెడ్స్‌ని తొలగించామే తప్ప.. దీని వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవు. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖ జిల్లా -
పరిశ్రమలకు సముద్ర జలాలు
సాక్షి, అమరావతి: మంచి నీటిని ఆదా చేయడంలో భాగంగా పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన సముద్ర జలాలను అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డిశాలినేషన్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి నీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, తద్వారా రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయొచ్చని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా ఆ నీటిని పరిశ్రమలకు అందించే ఆలోచన చేయాలన్నారు. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యతను ఏపీఐఐసీ చేపట్టాలని, ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఏపీఐఐసీదే బాధ్యత ► పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదే. పకడ్బందీగా డీశాలినేషన్ చేసి, పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అవసరమైన మేరకు నాణ్యమైన నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా, డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి.. ఎక్కడెక్కడిæ నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు.. ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా నీరు ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి. ► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమలకు పుష్కలంగా నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు తగినంత నీరు అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునే సమయానికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసం సుమారు రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ఏపీ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విశాఖ నగర వాసులతో పాటు అక్కడి పరిశ్రమలకు నీటిని అందించడానికి జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో) సేవలను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా, మరికొన్నింటికి 2022లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని ఏపీఐఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ పారిశ్రామిక పార్కుకు ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలి.. అందుకు అయ్యే వ్యయం ఎంత.. అన్నది లెక్క తెల్చారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు సోమశిల నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా.. కృష్ణపట్నం, నాయుడుపేట, చిత్తూరు జిల్లాలోని పార్కులకు కండలేరు నుంచి.. విశాఖకు గోదావరి జలాలను.. అనంతపురానికి హంద్రీ–నీవా నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని వినియోగంచుకునే విధంగా కృష్ణపట్నం వద్ద పైలెట్ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చౌకగా నీటిని అందిస్తాం రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని కంపెనీలకు నీటిని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా నీటిని పుష్కలంగా అందిస్తే కిలో లీటరుకు ఎంత ధరైనా చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చౌకగా నీటిని అందించే విధంగా ఏపీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. – కే.రవీన్ కుమార్ రెడ్డి, వీసీ, ఎండీ, ఏపీఐఐసీ -
మార్చికి మల్లవల్లి ఫుడ్‌పార్క్
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను ఏర్పాటుచేసింది. మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో సుమారు రూ.16 కోట్లతో సీపీసీని ఏర్పాటుచేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారు. దీని పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మార్చి నెలాఖరు నాటికి ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫుడ్‌పార్క్ పనులను ఏపీఐఐసీ బృందం శనివారం తనిఖీ చేసింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో స్టేట్ ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ.260 కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీపీసీ నిర్వహణకు టెండర్లు ఈ సీపీసీ నిర్వహణను మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే ఈ బిడ్ల దాఖలు కార్యక్రమం మార్చి 1తో పూర్తవుతుంది. గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్సెంట్రేషన్ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్‌లు సీపీసీ పరిధిలోకి వస్తాయి. ఏటా 5 శాతం చొప్పున అద్దె పెంచనున్నట్లు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నామని ప్రసాద్ తెలిపారు. త్వరలో రోడ్ షో ఈ మెగా ఫుడ్‌పార్క్‌లోని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో సౌకర్యాలు కల్పించామన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్లొచ్చన్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీసీలో వసతులివీ.. – గంటకు ఆరు టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్ పల్ప్‌లైన్.. – 200 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జ్యూస్ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్ ఫిల్లింగ్, ప్యాకింగ్ లైన్.. – జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి.. – పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి.. – మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్‌సీ రైపెనింగ్ చాంబర్స్.. – సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్‌ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్ చేసే యూనిట్లు.. – చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్.. – ఈ అహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్ ల్యాబ్. -
రాబడి పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’, సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థల అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. వీటితోపాటు అభివృద్ధి పనులకు కూడా నిధులు అవసరమైనందున ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. బొగ్గు, మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా కైవసం చేసుకున్న బ్రహదిహ, సులియారీ, మదన్‌పూర్ సౌత్ బొగ్గు బ్లాకుల్లో నిర్ణీత సమయంలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలను వేగవంతం చేయాలి. – రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత అధికంగా దృష్టి నిలపాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఇతర విభాగాలను సమన్వయం చేసుకుని త్వరితగతిన సిలికా శాండ్ కార్యకలాపాలు ప్రారంభించాలి. పారదర్శకంగా ఎర్రచందనం విక్రయం – రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎర్రచందనం విక్రయించాలి. – ఇందుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి. – ఆదాయం వచ్చే అంశాలపై అధ్యయనం చేసి, మరింత శ్రద్ధతో పని చేయాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలి. – గత ఆర్థిక ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,800 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ, ఆగస్టు నుంచి ఆదాయం పెరిగిందన్నారు. రెండు మూడు నెలల్లో లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని చెప్పారు. – ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది కోవిడ్ కారణంగా రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం తగ్గింది. మరో వైపు వివిధ పథకాల అమలు వల్ల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం వేయకుండానే రాబడి పెరిగేలా మార్గాలన్నింటినీ అన్వేషించాలి. దిశ చట్టం విప్లవాత్మక పరిణామం: సీఎం జగన్ విశాఖ ఉక్కుపై ప్రధానికి సీఎం జగన్ లేఖ -
రూ.1,200 కోట్లతో కృష్ణపట్నం నోడ్ పనులు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్ (కృష్ణపట్నం పారిశ్రామికవాడ)కు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించడానికి ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,134 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కింద రూ.2,139.44 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నోడ్‌లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడానికి ఏపీఐఐసీ రంగం సిద్ధం చేసింది. రహదారుల నిర్మాణం, నీటి వసతి, మురుగు నీటి శుద్ధి, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,200 కోట్ల విలువైన పనులకు ఈ నెలాఖరులో ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.432 కోట్లు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.420 కోట్లు, నీటి వసతి కల్పన, మురుగునీటి శుద్ధి వంటి పనులకు రూ.348 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూలై మొదటి వారంలో కృష్ణపట్నం నోడ్ పనులు ప్రారంభించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నివాసయోగ్యంగానూ అభివృద్ధి: కేవలం పారిశ్రామిక యూనిట్లే కాకుండా నివాస యోగ్యంగా కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా నగరాల మాదిరిగానే పరిశ్రమలతో పాటు నివాస యోగ్యంగా కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఉద్యోగులు అక్కడే నివసించే విధంగా గృహ సముదాయాలు నిరి్మంచడానికి 13.9 శాతం వినియోగించనున్నారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయించి, పర్యావరణ పరిరక్షణ కోసం 10.9 శాతం ఖాళీగా ఉంచుతారు. తొలి దశలో అభివృద్ధి చేసే ఈ నోడ్ ద్వారా సుమారు 18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రధానంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్, ఆప్టికల్ వంటి తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. -
42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పించే విధంగా అయిదు భారీ పారిశ్రామిక పార్కులను ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో అయిదు మల్టీ ప్రొడక్ట్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు పారిశ్రామిక కారిడార్లలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ–చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ)లో ఏడీబీ రుణంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అదనంగా మూడు పార్కులు, చెన్నై–బెంగళూరు కారిడార్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ఒక్కొక్కటి వంతున అభివృద్ధి చేస్తున్నారు. విసీఐసీలో నక్కపల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం, హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను 42,313 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో తొలిదశగా 13,292 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు నిక్‌డిట్ సూత్రప్రాయం అంగీకారం తెలిపింది. కృష్ణపట్నం పార్కులో 2,500 ఎకరాల్లో అభివృద్ధికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,314 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే కృష్ణపట్నం పార్కు పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2,500 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో, నక్కపల్లిలో 3,196 ఎకరాల్లో పార్కులను అభివృద్ధి చేయడానికి నిక్‌డిట్ నిధులతో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు, ఓర్వకల్లుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. 24 గంటలూ నీరు నాణ్యమైన విద్యుత్, నీరు అందిస్తే ఎంత ధరైనా చెల్లించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. రాయితీల కంటే మౌలికవసతులు ప్రధానమని సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యుత్, నీరు నిరంతరాయంగా అందించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పర్తి, శ్రీకాళహస్తి పారిశ్రామిక పార్కులకు సోమశిల జలాశయం నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి, విశాఖపట్నంలోని పరిశ్రమలకు పోలవరం ద్వారా నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పారిశ్రామిక పార్కులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల అభివృద్ధి, ఉమ్మడి మురుగునీటి శుద్ధి వంటి ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి, తిరుపతి: శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీఐఐసీ కమిషనర్ సుబ్రమణ్యం, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి సోమవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. ‘పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం ఆనందదాయకంగా ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో బయట దేశాల్లో ఉన్న చాలా మంది ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురయ్యారు. గత ఐదు నెలల వ్యవధిలో 40 వేలకి పైగా మన వాళ్లని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇండియా తీసుకొచ్చాం. ప్రవాస భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏపీఎన్ఆర్టీకి కాల్ చేస్తే ఖచ్చితంగా వారికి మా పూర్తి సహకారం అందిస్తాం’ అని తెలిపారు. (చదవండి: ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు) -
బల్క్ డ్రగ్ పార్క్ భాగస్వామి ఎంపికకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ మౌలికవసతుల కల్పనాభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లను పిలిచింది. ఈ పార్కును కనీసం 2,000 ఎకరాల్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్(డీబీఎఫ్‌వో) విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగస్వామ్య సంస్థలు, వ్యక్తిగత డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టెండర్లను ఆహ్వానించింది. ఔషధాల తయారీలో స్వయం సంవృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఈ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన దరఖాస్తును సాధ్యమైనంత త్వరగా దాఖలు చేసేందుకు గానూ భాగస్వామి కోసం టెండర్లు పిలిచినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18 తేదీ సాయంత్రం 5లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ.59,000 రుసుము చెల్లించడం ద్వారా తమ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చని ఏపీఐఐసీ పేర్కొంది. చదవండి: ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు -
రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
సాక్షి, అమరావతి : 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉ.11 గంటలకు పాలసీ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు..ఉపాధి కల్పించే పరిశ్రమలను బట్టే ప్రోత్సాహం అందనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చే చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ల సమ్మిళితం కానున్నాయి. -
పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020–23కు రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా ఆవిష్కరించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంలో ప్రధానాంశాలు.. ► వెనుకబడిన వర్గాల మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. ► ఇప్పటికే బాగా విస్తరించిన ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతోపాటు 10 కొత్త రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి. ► బొమ్మల తయారీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్–లెదర్, మెషినరీ, ఎయిరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు. ► పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ అందించేలా చర్యలు. అనేక రాయితీలు.. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు. ► కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికవేత్తలకు సగం ధరకే భూమి, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు. ► సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపుతోపాటు వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ, నాలా చార్జీలో కొంత మినహాయింపు. ► 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు 100%, వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75%, 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ మినహాయింపు. ► మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకనుగుణంగా అదనపు రాయితీలు. ► పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ► నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజ్. -
‘అమరరాజా’కు షాక్; 253.61 ఎకరాలు వెనక్కి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్ఫ్రా టెక్కు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరరాజ్ ఇన్ఫ్రా టెక్కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్ కేటాయించింది. ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్ఫ్రా టెక్ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. (రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి) -
నేను.. మీ రోజా
-
దొనకొండలో ప్రత్యేక సెజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ, ఇతర పరిశ్రమల కోసం కొత్తగా 30 లక్షల చదరపు అడుగులు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె. రోజా, ఏపీఐఐసీ ఎండీ రజత్ భార్గవ, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, విమానయాన రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రజత్ భార్గవ వివరించారు. దొనకొండలో ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి విమానాశ్రయం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా మడకశిరలో ఆటో మొబైల్, దాని అనుబంధ పరికరాల తయారీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిన్న మధ్య తరహా కంపెనీలు నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్లగ్ అండ్ ప్లే కేంద్రాలను ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా హిందూపురం, విశాఖ జిల్లా అచ్యుతాపురం, నెల్లూరు జిల్లా నాయుడుపేట, చిత్తూరు జిల్లా ఈఎంఎసీ–2, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో మరిన్ని ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ బోర్డు తీర్మానించింది. -
ఉందిలే కరువు నేల 'అనంత'కు మంచికాలం
పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరువు జిల్లాలో మానవ వనరులకు కొదవ లేకపోవడం.. సాంకేతిక చేయూతకు యూనివర్సిటీలు సిద్ధంగా ఉండటం.. మెరుగైన రవాణా సౌకర్యం.. అన్నింటికీ మించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి.. వెరసి కంపెనీల ఏర్పాటుకు ‘అనంత’ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్ల కాలంలో 13వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సాక్షి, అనంతపురం: జిల్లాలో కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి ప్రజానీకం జీవనం సాగిస్తున్నారు. అయితే, పొలాలకు కూడా వర్షాలే దిక్కు. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తేనే పేదరికాన్ని పారదోలే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశంలో కూడా జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2020–25 సంవత్సరాలకు నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రకటించనుంది. ఇందులో వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా పరిశ్రమ జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వెంటనే అనువైన భూమిని చూపించేందుకు భారీ భూ బ్యాంకును సిద్ధం చేస్తుండటం విశేషం. మౌలిక సదుపాయాల్లో మేటి రాష్ట్ర విభజన తర్వాత మొత్తం 13 జిల్లాలో భారీగా భూమి లభ్యమయ్యే జిల్లాల్లో అనంత రెండో స్థానంలో ఉంది. కర్నూలులో ఇప్పటికే 30వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఎక్కువ భూమి లభించే ప్రాంతం అనంతనే. అందువల్ల ఏదైనా పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకు వస్తే.. అవసరమైన భూమిని చూపించేందుకు ఈ భూ బ్యాంకు దోహదపడనుంది. ఇక పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్‌తో పాటు బెంగళూరు విమానాశ్రయం కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొత్తగా అనంతపురం నుంచి అమరావతికి రహదారి నిర్మాణం జరగనుంది. తద్వారా రాష్ట్ర రాజధానికి కూడా కనెక్టివిటీ ఏర్పడనుంది. పుట్టపర్తి విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలనే యోచనలో ఉంది. తద్వారా ఆయా కంపెనీల ఉద్యోగుల రాకపోకలకు మరింత అనువుగా ఉండనుంది. ఇప్పటికే హిందూపురంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక మానవ వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. యూనివర్సిటీలు కూడా ఉన్న నేపథ్యంలో సాంకేతిక నిపుణుల కొరత కూడా ఇబ్బంది కూడా లేదు. మొత్తమ్మీద జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి అనువైన మౌలిక సదుపాయాలున్న నేపథ్యంలో భూమిని కూడా సిద్ధం చేయడం ద్వారా యువతకు మరింత ఉపాధి లభించే అవకాశం ఏర్పడనుంది. జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో వీరా వాహన ఉద్యోగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. యూనిట్ ద్వారా ఏడాదికి 3వేల బస్సులు జిల్లాలో తయారు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థకు ఏపీఐఐసీ ద్వారా 120 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భూ బ్యాంకును సిద్ధం చేస్తున్న తరుణంలో ఓ కంపెనీ తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామం. ఏడాదిలో భూసేకరణ లక్ష్యం మండలం భూ విస్తీర్ణం (ఎ‘‘ల్లో) కనగానపల్లి 3606.26 ధర్మవరం 533.52 కళ్యాణదుర్గం 106.07 గుంతకల్లు 103.97 అనంతపురం 33.38 కదిరి 93.11 ఉరవకొండ 26.21 మడకశిర 1648.82 పెనుకొండ 21.17 పుట్టపర్తి 522.39 -
ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి రిలయన్స్, అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకొని వెళ్లిపోతున్నాయంటూ వివిధ పత్రికల (సాక్షి కాదు)లో వచ్చిన వార్తలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఖండించారు. పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి విభిన్న విధానాలుంటాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. వివాదాస్పద భూములిచ్చిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం వివాదస్పదమైన భూములను రిలయన్స్ గ్రూపునకు కేటాయించడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములను ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. గతంలో కేటాయించిన 136 ఎకరాల భూమిపై 15 మంది రైతులు కోర్టులో కేసులు దాఖలు చేయడంతో ఆ భూములను రిలయన్స్ వినియోగించుకోలేక పోతోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వివాద రహిత భూములను కేటాయించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలోనే రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదాని ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఐటీ శాఖ అదాని గ్రూపు ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తోందన్నారు. ఈ విషయాలను దృష్టిలోపెట్టుకొని అవాస్తవ కథనాలను ప్రచారం చేయవద్దని కోరారు. -
సెజ్ కోసం భూములిస్తే తాకట్టుపెట్టారు
సాక్షి, అమరావతి: బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు నిమిత్తం 2009లో కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు, కోట మండలాల్లో వేల ఎకరాల భూములు కేటాయించామని, ఆ సంస్థ ఆ భూములను తాకట్టుపెట్టి రూ.1,935 కోట్ల మేర రుణం తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకుందని ఏపీఐఐసీ హైకోర్టుకు నివేదించింది. పదేళ్ల క్రితం భూములు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంది. సెజ్ కింద భూములు పొందిన శ్రీసిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, అక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారని వివరించింది. కాని 4,731 ఎకరాల భూములు పొందిన కేఐపీఎల్ మాత్రం, ఐదంతస్తుల భవనం తప్ప ఏమీ కట్టనందున భూ కేటాయింపులను రద్దు చేశామని తెలిపింది. భూ కేటాయింపుల రద్దును సవాల్ చేస్తూ కేఐపీఎల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారం రోజుల పాటు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏపీఐఐసీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. అక్టోబర్ 25న ఇచ్చిన యథాతథస్థితి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోర్టును అభ్యర్దించింది. -
దోపిడీలో ‘నవయుగం’
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు, చెన్నై పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీ సెజ్ 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్ 60కి పైగా భారీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 6,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరి ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐఎల్) ప్రతిపాదించిన ‘మల్టీ ప్రొడక్ట్ సెజ్’ ఎన్ని పెట్టుబడులను ఆకర్షించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ఊహించగలరా? ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని పదేళ్లు దాటింది. అయినా ఈ సెజ్‌లో ఇప్పటిదాకా పనులే ప్రారంభం కాలేదంటే నమ్మగలరా? సెజ్ పేరిట తీసుకున్న భూములను కేఐపీఎల్ సంస్థ వేరే కంపెనీల పేరిట బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పటికే తీసుకున్న భూమిలో కనీసం ఒక్క శాతం కూడా వినియోగించుకోలేకపోయినా ఇంకా 6,000 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు చేసుకుందంటే ఈ కంపెనీ భూ దాహాన్ని అర్థం చేసుకోవచ్చు. మల్టీ ప్రొడక్ట్ సెజ్ పేరిట నవయుగ గ్రూప్ విచ్చలవిడిగా సాగించిన భూ దందా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) విచారణలో బట్టబయలయ్యింది. ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేటాయింపు సుబ్బారావు పేరిట ఉన్న భూములను అప్పారావు బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని రుణం పొందడానికి వీలవుతుందా? ఒక కంపెనీ పేరిట ఉన్న భూములను వేరే కంపెనీలు తనఖా పెట్టుకొని రుణం తీసుకోగలవా? ఇది సాధ్యమేనని నిరూపించింది నవయుగ గ్రూపు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న భూములను నవయుగ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది. భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల పొందినట్లు ఏపీఐఐసీ పరిశీలనలో తేలింది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్, కాటలిస్ట్ ట్రస్టీషిప్ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది. భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్వోసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చేశాయి. ఒక్క ఐఎఫ్సీఐ మాత్రమే ఎన్ఓసీ కావాలని పట్టుపట్టడం, ఏపీఐఐసీ ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో రూ.250 కోట్ల రుణం ఆగిపోయింది. వేరే కంపెనీ పేరిట ఉన్న భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు ఎన్వోసీ లేకున్నా ఎలా రుణాలు ఇచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రెండేళ్లలోగా ‘సెజ్’ను అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగేళ్ల తర్వాత పనులను పరిశీలిస్తే కేవలం 4–5 ఎకరాల పరిధిలో కేవలం మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక పాఠశాల, తాత్కాలిక క్యాంటీన్‌ను మాత్రమే నిర్మించారు. అంటే తీసుకున్న 4,731.15 ఎకరాల్లో ఒక శాతం భూమిని కూడా వినియోగించుకోలేదు. ఒప్పందం కుదుర్చుకున్న 2008 ఆగస్టు 1న ఉన్న కేపీఐఎల్ వాటాదారులు 2013 సెప్టెంబర్ 16 మారిపోయారు. నవయుగ గ్రూపే కేఐపీఎల్‌ను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న విషయం ఫర్పార్మెన్స్ ఆడిటింగ్‌లో బయటపడింది. అంతేకాదు కేఐపీఎల్ పేరిట తీసుకున్న రుణాలను నవయుగ సొంత అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమైంది. సెజ్ పనులు మొదలు పెట్టకుండానే మరో 6,200 ఎకరాలు కావాలంటూ నవయుగ సంస్థ దరఖాస్తు చేసుకుంది. రద్దును అడ్డుకుంటూ వచ్చిన బాబు నవయుగ సంస్థ సెజ్ పనులను ప్రారంభించకపోవడంతో భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ పలుమార్లు నోటీసులు పంపినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటూ వచ్చారు. ఒకసారి ఫైనాన్స్ విభాగం కొర్రి వేసి పంపితే దానికి ఏపీఐఐసీ సమాధానం ఇచ్చింది. దానితో ఫైల్ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఈ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మరో సందేహం లేవనెత్తి పరిశ్రమల శాఖకు వెనక్కి పంపించారు. ఇలా అప్పటి సీఎం చంద్రబాబు నవయుగకు ఇతోధికంగా సాయం చేశారు. చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. సెజ్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. -
మాదిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వైస్ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్‌నకు తృటిలో ప్రమాదం తప్పింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం నగరం నుంచి అచ్యుతపురం వరకు ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీ కొనసాగుతుండగా.. వడ్లపూడి వంతెనపై ప్రతాప్ సైకిల్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన చేతికి బలమైన గాయమైంది. దీంతో పోలీసులు ఆయనను గాజువాక లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం వైద్యులు విమ్స్‌కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. -
పారిశ్రామిక రంగానికి పెద్దపీట
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నా రు. విజయవాడలో నిర్మించిన జవహర్ ఆటోనగర్ హౌసింగ్ కార్పొరేషన్ భవన సముదాయాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిజంగా పరిశ్రమలు పెట్టుకునే వారికి మాత్రమే తమ ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం బినామీలకు భూములిచ్చిందని, పారిశ్రామిక వేత్తలకు భూమిని కేటా యించే విషయంలో అనేక అవకతవకలు జరిగా యని వివరించారు. అప్పట్లో ఒకరికి రూ.10 లక్షలకు భూమిని కేటాయిస్తే మరొకరికి రూ.20 లక్షలకు కేటాయించేవారని విమర్శించారు. అందరికీ ఒకే ధరకు భూమి కేటాయించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పెంచుతామని రోజా వివరించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్న కార్మికుల కల నేటికి నెరవేరిందని, ఈ భవన నిర్మాణం చూస్తుంటే మనం ఆటోనగర్ ఉన్నామా లేక అమెరికాలో ఉన్నా మా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలన కేవలం వంద రోజుల్లో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. వచ్చే సంవత్సరం ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లను ఇస్తున్నామన్నారు. గత 5 సంత్సరాల్లో చంద్రబాబు మాయమాటలు చెప్పి పేదవారిని అన్ని విధాలనట్టేట ముంచారన్నారు. కార్యక్రమంలో ఉదయభాను, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్, కమిషనర్ పి.నాగేశ్వరరావు, యార్లగడ్డ సుబ్బారావు, బత్తుల ప్రసాద్‌రెడి, కమ్మిలి సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
విద్యాసాయమే నాకు సన్మానం : రోజా
సాక్షి, విజయపురం(చిత్తూరు) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. బుధవారం నగరి రూరల్ మండలం దామరపాకంలో రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం దామరపాకం దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దామరపాకం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని, ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇచ్చే విద్యాసామగ్రి పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమలరెడ్డి, వేలాయుధం, ధర్మలింగం, చంద్రారెడ్డి, గణపతిశెట్టి, విజయబాబు, సోమశేఖర్, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు. -
ఇక పారిశ్రామికాభివృద్ధి పరుగులు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నూతన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టించనున్నారని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా చెప్పారు. రాష్ట్రంలో 320 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం నెల్లూరులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రోజా మాట్లాడారు. ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 31 ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేశామని, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలకు అనుమతులు పొందడానికి ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న రూ 2,500 కోట్లను రాయితీలను ఎగ్గొట్టారని, అందువల్లే కొంతమంది పరిశ్రమలు స్థాపించకుండా వెనక్కి వెళ్లిపోయారని రోజా తెలిపారు. పరిపాలనలో పారదర్శకతకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. నూతన ఇండ్రస్టియల్ పాలసీతో ప్రతి జిల్లాను అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై మంత్రి గౌతంరెడ్డి, రోజా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య , కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌భార్గవ, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పడవ అడ్డు పెడితే ఇళ్లు మునిగిపోతాయా? రాష్ట్రంలో వరద రాజకీయాలు చేస్తూ టీడీపీ తమ ఉనికిని చాటుకుంటోందని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి, రిజర్వాయర్లు నిండి రైతన్నలు సంబరపడుతున్నారని చెప్పారు. -
పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు వెళుతోందని, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేశారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమే. మా బలహీనతలు మాకు మీకు తెలుసు. కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి. సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం. సుస్థిర ప్రభుత్వం మాది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తున్నాం. ఇటీవల చట్ట సభలోను చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలను కూడా తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలు మీకు చెప్పదల్చుకున్నా. మాకు 970 కిలోమీటర్ల కోస్టల్ లైన్, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మా బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 86శాతం సీట్లు గెలుచుకున్నాం. పార్లమెంట్ సీట్ల పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా మాకున్నాయి. పారదర్శకమైన విధానాలు, అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉన్నాం. అన్ని స్థాయిల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. పెట్టుబడులు పెట్టేవారికి ధైర్యం కల్పించే బాధ్యత మాది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యుత్ డిస్కంల పరిస్థితి దారుణంగా ఉంది. 20వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిస్కంలు సంక్షోభంలో ఉన్నాయి. రెవెన్యూ తక్కువ ఉండి, వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవు. అందుకే విద్యుత్ ఒప్పందాలపై (పీపీఏ) పునఃసమీక్షిస్తున్నాం. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చు. కానీ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలి అంటే ఇది తప్పదు. వినియోగదారుల, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరు నష్ట పోకూడదు అన్నదే మా విధానం. ఇవన్నీ మీకు తెలియాలి. అంతిమంగా పరిశ్రమలే ధరలు చెల్లించాలి. అందుకే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తప్పదు. మీకు వాస్తవాలు తెలియాలి అలానే మాపై విశ్వసనీయత పెరగాలి. ఆ బాధ్యత మాదే... పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనే మరో నిర్ణయం తీసుకున్నాం. ఇదీ వివాదాస్పద మే. కాలుష్యం ఇచ్చే పరిశ్రమలు అక్కడి స్ధానిక యువత కు ఉపాధి కల్పించకపోతే ఎలా. అమెరికాలో కూడా స్థానిక ఉద్యోగాలపై చర్చ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు లేకపోతే పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎలా ఇస్తారు. ప్రజలకు నమ్మకం కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం స్థానికంగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో నైపుణ్యం శిక్షణ ఇప్పిస్తాం. పరిశ్రమకు కావాల్సిన అర్హతలు తెలుసుకుని శిక్షణ ఇస్తాం. ఎలాంటి నైపుణ్యం ఉన్నవారు కోరుకుంటుందో...అలాంటి యువతను మేం అందిస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు లేకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక వనరుల విషయానికి వస్తే బ్లూ ఎకానమీలో మేము పటిష్టంగా ఉన్నాం. 13 జిల్లాలకుగానూ 6 జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అయిదేళ్లలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. ఇక ఆక్వా ఉత్తత్తుల్లో మేమెంతో ముందున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేలా మీ సహకారం కావాలి. ఆక్వా రంగం, వ్యవసాయ రంగాల్లో ఇది అవసరం. ఉత్పత్తిని పెంచే వినూత్న పద్ధతులను అవిష్కరించాలని కోరుకుంటున్నా. కానీ మేము ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి ప్రపంచ స్థాయిలో ఉండటం లేదు. వీటిని ఆ స్థాయికి తీసుకు వచ్చేందుకు మీ సహకారం కావాలి. అవినీతి రహిత పరిపాలన అందిస్తాం కాఫీ, ఆక్వా ఉత్పత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఎగుమతులు పెరగాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రవాణా రంగాలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. పాఠశాలలు, కళాశాలల్లో ఏపీలో చేరిక శాతం 25 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీ సహకారాన్ని కోరుతున్నాం. నిజాయితీ గల ప్రభుత్వం అలాగే , పారదర్శక విధానాలు, మంచి బృందం అందుబాటులో ఉంది. ఇక్కడ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అందుకే విద్య, వైద్య, వ్యవసాయం కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నాం. మేం పారదర్శక, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఖచ్చితంగా చెప్తున్నా. మీ సహకారం కోరుతున్నాం పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. నదుల అనుసంధానానికి కట్టుబడి ఉన్నాం. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి సహకారం కావాలి. డీజిల్ బస్సులను తీసేసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాం. విశాఖపట్నంకు మెట్రో రాబోతుంది. విజయవాడ, గుంటూరుకు కూడా మెట్రో వస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని తీర్పును ప్రజలు మాకు ఇచ్చారు. మాపై ప్రజల్లో భారీ నమ్మకాలు ఉన్నాయి. భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. పెట్టుబడులకు మీ సహకారం కావాలి. ఢిల్లీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది దౌత్యవేత్తలు సమావేశం కావటం ఇదే తొలిసారి అనుకుంటున్నా. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
పరిశ్రమల స్వర్గధామం ఏపీ
యూనివర్సిటీ క్యాంపస్: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం. లంచాలకు తావు లేకుండా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో ముందుకొస్తే అవసరమైన అనుమతులను వెంటనే ఇస్తాం’ అని రాష్ట్ర మంత్రులు, ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశంపై చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక చట్టం సవరణలో భాగంగా మరికొన్ని సంబంధిత శాఖలను సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి తీసుకొస్తామన్నారు. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సామాజిక బాధ్యతతో పారిశ్రామిక రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు ప్రతినెలా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీఐఐసీ కింద జిల్లాలో నాలుగువేల ఎకరాల భూమి ఉందని, వచ్చే ఏడాది కల్లా పరిశ్రమల పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్.కె.రోజా అధికారులకు సూచించారు. చెన్నై పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై ఎయిర్‌పోర్టు జిల్లాకు సమీపంలో ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగాల విప్లవం తీసుకురావచ్చన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఏఏ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందో ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలం, వెంకటేగౌడ, శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. విద్యుత్ బిల్లులు తగ్గించి, పరిశ్రమలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కగా ప్రయత్నిస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. -
బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ పక్షపాతి. బడ్జెట్ చూసి, నవరత్నాలు చూసిన ఆ విషయం అర్థమవుతుంది. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. పారిశ్రామికీకరణకు బడ్జెట్లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పారదర్వకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుంది.’ అని రోజా తెలిపారు. -
ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియమితులు కావడంతో జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇదివరకే జిల్లా మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామికి పదవులు దక్కాయి. తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవి ఎమ్మెల్యే రోజాను వరించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులు కావడంతో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా సత్యవేడు శ్రీసిటీ ఉన్న నేపథ్యంలో ఏపీఐఐసీ తరఫున పారిశ్రామిక క్లస్టర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. -
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన రోజా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వుల జారీ చేసింది. ఆమె రెండేళ్ల పాటు ఆ పదవికిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల నగరి నియోజకవర్గం ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతల భూ మాయ..!
కడప రూరల్ : రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ పంచాయతీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఏపీ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తమ్ముడు రాజేష్ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయింరని, దీనిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి నందా బాల సుబ్రమణ్యం, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇనమాల మహేష్ డిమాండ్ చేశారు. స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1976లో మైసూరివారిపల్లెలోని ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ప్రభుత్వం సర్వే నంబరు 1627/4లో డిటర్జెంట్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వారికి 34 ఎకరాలు కేటాయించిందన్నారు. ఈ ఫ్యాక్టరీ దాదాపు 25 సంవత్సరాల పాటు సబ్బులను ఉత్పత్తి చేసిందన్నారు. అనంతరం కొన్ని కారణాలతో ఆ ఫ్యాక్టరీ మూతపడిందని వారు పేర్కొన్నారు. 2006 మార్చి 31న ఆ 34 ఎకరాల స్ధలాన్ని సబ్ డివిజన్ చేయడంతో సర్వే నంబరు 2085/1లో 17.46 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ సోదరుడు రాజేష్ తమ రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరు మీద రూ.70 లక్షలకు కొనుగోలు చేశారన్నారు. తర్వాత గడిచిన 2019 మార్చి 18న ఆ 17.64 ఎకరాల స్థలాన్ని నాలుగు భాగాలుగా విభజించి, అందులో నాలుగు ఎకరాల ఒక భాగాన్ని మొత్తం రూ.40 లక్షల చొప్పున స్థానిక శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్టనర్స్ వీరంరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, షేక్ జైలాబ్దిన్, బొక్కసం వెంకటా చలపతికి విక్రయించారని ఆరోపించారు. అగ్రిమెంట్ రాయించి ఇచ్చిన వారిలో సీఎం రాజేష్‌తో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ఉందని వారు రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించారు. ఈ వ్యవహరమంతా పుల్లంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగిందని వివరించారు. సీఎం రాజేష్ నుంచి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన బాలాజీ ఇండస్ట్రీస్ పార్టనర్స్ ఒక సెంటు స్థలాన్ని రూ.6 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. మిగతా స్థలాన్ని కూడా విక్రయించే దానికి పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి మొత్తం 17.46 ఎకరాల భూమి రూ.100 కోట్లకు పైగా ఉంటుందన్నారు. కాగా బాలాజీ ఇండస్ట్రీస్ పార్టనర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తెలిపారు. ఇదంతా సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులతో నడిపిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఏపీ ఐసీసీ భూములను అమ్మకూడదన్నారు. అలాంటి భూములను టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్ముకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా స్ధానికంగా నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు. ఆ భూముల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీలను నిర్మించి ఉపాధి మార్గాలను చూపాలన్నారు. లేదంటే ఆ స్థలాలను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. (వైఎస్సార్సీపీలోకి జోరుగా చేరికలు) -
వైఎస్సార్సీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్
-
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరునుంది. సచివాలయంలో సాయంత్రం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ భేటీలో అగ్రిగోల్డ్‌లో చిన్న మొత్తంలో డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీనిపై హైకోర్టులో ఏ విధంగా ప్రభుత్వ తరపున నివేదిక సమర్పించాలనే అంశంపై చర్చించనున్నారు. ఇక నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపీఐఐసీ)కి వివిధ జిల్లాలలో భూకేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. -
మార్కెట్ ధరకే ఏపీఐఐసీకి భూమి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలకు భూములను అమ్ముకునే ఏపీఐఐసీకి ప్రభుత్వం భూములను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సోమవారం సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ శాఖకు చెందిన భూమిని ఉచితంగా ఏపీఐఐసీకి ఎందుకు కేటాయించాలి? ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది? అని దినేష్‌కుమార్ వాకబు చేశారు. గతంలో మార్కెట్ ధరకు కేటాయించే విధానం ఉండేదని, ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కేటాయించే పద్ధతి తర్వాత వచ్చిందని అధికారులు వివరించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కాకుండా ఉచితంగానే కేటాయించాలని ఏపీఐఐసీ కోరింది. దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని’ రెవెన్యూ అధికారులు వివరించారు. నివేదిక సిద్ధం చేయండి ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు గతంలో ఉన్న జీవోలు, తర్వాత వచ్చిన జీవోలు, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఏవిధానం మంచిది? ఇందుకు ప్రామాణికాలేమిటి? అనే వివరాలతో పాటు జీవో కాపీలను కూడా జత చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దీనిపై సమీక్షించి ఏపీఐఐసీకి మార్కెట్ ధరకే భూములు కేటాయించడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అయితే ఆయన తీసుకునే నిర్ణయం అంతిమం కాదు. సీఎస్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేబినెట్‌దే అవుతుందని ఒక అధికారి తెలిపారు. -
భాగస్వామ్య సదస్సుకు ముస్తాబు
విశాఖలో శనివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు బీచ్‌రోడ్డులోనిఏపీఐఐసీ మైదానం సిద్ధమవుతోంది. రూ.కోట్ల ఖర్చుతో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లిపురం(విశాఖ దక్షిణ): సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరుసగా మూడో సారి జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఇప్పటికే బీచ్‌రోడ్డులో ఏపీఐఐసీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. సమావేశ మందిరం, గెస్ట్ హాల్, డైనింగ్ హాల్ ఇలా అన్ని రకాల హంగులతో సదస్సు ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంలో కార్మికులు తలమునకలై ఉన్నారు. దేశ విదేశాల నుంచి అతిథులు నగరానికి రానుండటతో అధికారులంతా వారి సేవకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పెట్టుబడులు ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేయనుంది. -
పరి'శ్రమేనా'..?
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా రైతాంగానికి అండగా ఓ వెలుగు వెలిగిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారానికి మూతవేసి రూ.6.20 కోట్లకు ప్రైవేట్‌పరం చేసేసిందీ ఒకప్పటి టీడీపీ ప్రభుత్వమే. రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే ప్రైవేట్ సంస్థకు రూ.22 కోట్ల ప్రజాధనం చెల్లించి వెనక్కు తీసుకొన్నా పరిశ్రమను పునఃప్రారంభించలేదు. కోట్లాది విలువైన 75 ఎకరాల భూములను ‘పారిశ్రామిక అవసరాల’ ముసుగులో ఏపీఐఐసీకి బదలాయించేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆమదాలవలస చక్కెర పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చంద్రబాబు, కూన రవికుమార్ సహా టీడీపీ నాయకులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాకు కొత్త పరిశ్రమల రాకపోయినా ప్రభుత్వం నిరాదరణ ఫలితంగా పాత పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయి. ఆమదాలవలస పరిసరాల్లోని కాన్‌కాస్ట్ ఐఎన్‌సీ ప్రైవేట్ లిమిటెడ్, వెంకటబాలాజీ జూట్ మిల్లు కూడా మూతపడ్డాయి. దీంతో సుమారు వెయ్యి మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇక ఆ పరిసరాల్లో చొప్పుకోదగిన పెద్ద పరిశ్రమలు మరేవీ లేవు. ఆమదాలవలసలో 19 ఎకరాల విస్తీర్ణంలోనున్న ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కటే అన్నట్లుగా ఉంది. ఇక్కడ చిన్నపాటి మూడు వాటర్ ప్లాంట్లు, పశుదాణా పరిశ్రమ మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్థలాన్ని స్క్రాప్ వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. మంత్రి అచ్చెన్న ఇలాకాలో చీకట్లే... రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ చీకట్లు కమ్ముకున్నాయి. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రావివలసలోని మెట్కోర్ ఫెర్రోఅల్లాయిస్ కంపెనీ మూతపడింది. సుమారు 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సంతబొమ్మాళి మండలంలో ఏపీఐఐసీకి 3,333 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో అప్పగించింది. దీనిలో 2,050 ఎకరాలను ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు ఏపీఐఐసీ కేటాయించింది. ఇది 40 శాతం సివిల్ పనులు జరిగినా 2016 జనవరి నుంచి నిలిచిపోయాయి. ఈ సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఏపీజెన్కో పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినా అధికారుల అభ్యంతరంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీని పరిసరాల్లో ఇంకా 51,50,616 చదరపు మీటర్ల స్థలం పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్నా మరే ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ‘కళా’ మంత్రిగా ఉన్నా అంతే... టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో, అలాగే సొంత ప్రాంతమైన రాజాం నియోజకవర్గంలో పారిశ్రామికీకరణ ఒక్క పైడిభీమవరం పారిశ్రామికవాడలో మినహా మరెక్కడా ముందుకుసాగట్లేదు. చివరకు రణస్థలంలో ఆయన కుమారుడికి ప్రభుత్వం కేటాయించిన భూమిలో కూడా ఇప్పటివరకూ పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. ఒక్క రాజాం ప్రాంతంలోనే నాలుగు జూట్‌మిల్లులు, వాసవి సిమెంట్ కంపెనీ, సరితా స్టీల్ పరిశ్రమ, సరిత సింథటిక్ పరిశ్రమ, సైకిల్ రిమ్‌లు తయారీ పరిశ్రమ వాసవి రిమ్స్ మూతపడ్డాయి. పొందూరు మండలంలో మరో రెండు జూట్ మిల్లులు మూతపడ్డాయి. రణస్థలం మండలంలోని స్వర్ణాంధ్ర జూట్‌మిల్లు కూడా ఈ రెండేళ్ల కాలంలోనే మూతపడింది. ఒకప్పుడు రాజాం పరిసరాల్లోనే 29 వరకు పరిశ్రమలు పనిచేసేవి. ఇప్పుడు ఏడు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో సుమారు 5 వేల మంది కార్మికులు వీధినపడ్డారు. రేగిడి మండలంలో రెండు జ్యూట్‌మిల్లులు, ఫ్యారీస్ చక్కెర కర్మాగారంతోపాటు కేవీఆర్ పేపర్‌మిల్లులు కూడా నష్టాలతోనే నడుస్తున్నాయి. పలాస పారిశ్రామికవాడలోనూ అంతంతే... పలాస పరిసర ప్రాంతంలో జీడిపరిశ్రమలు 250 వరకూ ఉన్నాయి. పలాస పారిశ్రామిక ప్రాంతంలో 40 పరిశ్రమలు ఉన్నాయి. గతంలో ఈ పరిశ్రమలకు 32 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రామకృష్ణా్ణపురం వద్ద పారిశ్రామికవాడకు 50 ఎకరాలు కేటాయింపు ప్రక్రియ కొలిక్కిరాలేదు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పనాసంస్థ (ఏపీఐఐసీ)కి జిల్లాలో వివిధ ప్రాంతాల్లోనున్న పారిశ్రామికవాడల్లో 785 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. ల్యాండ్ బ్యాంకులో 3,708.29 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇవిగాక వివిధ పారిశ్రామిక అవసరాల పేరుతో మిళియాపుట్టిలో 40 ఎకరాలు, సీతంపేటలో 15 ఎకరాలు, కంచిలిలో 42 ఎకరాలు, రణస్థలంలో 60 ఎకరాలు సేకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కానీ వాటిలో ఎక్కడా కొత్త పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. ప్రభుత్వ విధానాలే గుదిబండ... ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు, ఆదరణ కొరవడటంతో జిల్లాలో గత మూడేళ్ల కాలంలో రెండొందలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. రాయితీలు కల్పించడానికీ పలు ఆంక్షలు విధించడం, అలాగే మార్కెట్ ఎగుడుదిగుడుల వల్ల నష్టాలపాలైన పరిశ్రమలను ఆదుకోవడానికి నిర్దిష్టమైన విధానం లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. విశాఖలో ఏటా నిర్వహిస్తోన్న భాగస్వామ్య సదస్సుల ద్వారా జిల్లాకు పెద్దగా పరిశ్రమలు వస్తాయని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చివరకు గత రెండు సదస్సుల్లో 16 యూనిట్లు వస్తాయని చెప్పగా, వాటిలో కేవలం ఐదు యూనిట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. కానీ వాటిలో మూడు యూనిట్లు ఇప్పటికే జిల్లాలో ఉన్న పరిశ్రమల విస్తరణ ప్రాజెక్టులు కావడం గమనార్హం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మూడు విస్తరణ ప్రాజెక్టులు, యునైటెడ్ బేవరీస్ ఎక్స్టెన్షన్ యూనిట్ ఇందులో ఉన్నాయి. మిగతావన్నీ ప్రతిపాదన దశల్లోనే మిగిలిపోయాయి. అలాగే ఇప్పటికే పనులు నిలిచిపోయిన ఈస్ట్‌కోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మూతపడిన ట్రైమేక్స్ సాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను కూడా కొత్తగా వస్తున్న పరిశ్రమల జాబితాలో చూపించడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్‌లో ‘వీర’ బస్ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బాడీ బిల్డింగ్ కంపెనీ వీర వాహన ఉద్యోగ్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద 120 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఏపీఐఐసీ నుంచి కంపెనీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. చెల్లింపులు పూర్తయ్యాయని, అధికారికంగా స్థలం చేతిలోకి రాగానే నిర్మాణం ప్రారంభిస్తామని వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 18 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెడతామన్నారు. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో యూనిట్ ఉంది. వీర బ్రాండ్‌తో స్లీపర్, లగ్జరీ కోచ్‌లు, స్కూల్, సిటీ బస్‌లను రూపొందిస్తోంది. రెండు దశల్లో పెట్టుబడి..: అనంతపురం ప్లాంటుకు తొలి దశలో రూ.350 కోట్లు పెట్టుబడి పెడతారు. ఏటా 8,000 పెద్ద బస్‌లను రూపొందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంజన్, గేర్‌బాక్స్, యాక్సిల్‌ను ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసి, చాసిస్తోసహా మిగిలిన భాగాలన్నీ ప్లాంటులోనే తయారు చేస్తారు. రెండో దశలో రూ.300 కోట్ల దాకా పెట్టుబడికి అవకాశం ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘రెండో దశలో ఏటా 15–18 వేల చిన్న బస్‌ల తయారీకి ప్రణాళిక చేస్తున్నాం. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 4వేల మందికి ఉపాధి లభిస్తుంది. 25 వరకూ అనుబంధ పరిశ్రమలు వస్తాయి’’ అని వివరించారు. ఎలక్ట్రిక్ బస్‌లు సైతం..: కంపెనీ ఎలక్ట్రిక్ బస్‌ల విభాగంలోకీ ప్రవేశిస్తోంది. ప్రోటోటైప్ తయారీలో ప్రస్తుతం నిమగ్నమైంది. ఆరు నెలల్లో ప్రోటోటైప్ సిద్ధం కానుంది. అనుమతులు రాగానే ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ ప్రారంభిస్తారు. దేశంలో పలు రోడ్డు రవాణా సంస్థలు ఇపుడిపుడే ఈ బస్‌లను ప్రోత్సహిస్తున్నాయి. టార్మాక్ కోచ్‌ల తయారీలోకి కంపెనీ ఇప్పటికే అడుగుపెట్టింది కూడా. ఎయిర్‌పోర్టుల్లో ఈ కోచ్‌లే పరుగెడుతున్నాయి. ఇక బెంగళూరు ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,000 యూనిట్లు. ఇక్కడ 800 మంది పనిచేస్తున్నారు. వీర వాహన ఉద్యోగ్ ఇప్పటి వరకు ఈ యూనిట్‌కు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 10,000లకుపైగా బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లకు సరఫరా చేసింది. -
ఐటీ మంత్రిని కలిస్తే అర కోటి తగ్గించారు
►విశాఖ ఐటీ సెజ్‌లో భూ కేటాయింపుల వ్యవహారం ►ఏపీఐఐసీతో సహా ఆర్థిక శాఖ, సీఎస్ వ్యతిరేకించినా ఆగలేదు ►ఐటీ మంత్రి ఆదేశంతో ఇటీవల కేబినెట్‌కు ప్రతిపాదనలు ►ఖజానాకు అరకోటి నష్టం కలిగిస్తూ కేబినెట్ ఆమోదం సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రజలు చెల్లించే విద్యుత్ చార్జీలను గానీ, పన్నులను గానీ ఏ ప్రభుత్వమైనా పెంచడమే గానీ తగ్గించడం జరగదు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలను, భూముల మార్కెట్ విలువను ప్రతీ ఏడాది పెంచుతూ వస్తోంది. కానీ విచిత్రంగా ఒక ఐటీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రిని కలవగానే భూమి ధర రూ.50 లక్షలకు పైగా తగ్గిపోయింది. అదీ కూడా కేటాయించిన రెండేళ్ల అనంతరం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల కార్పొరేషన్ (ఏపీఐఐసీ) సాధ్యం కాదన్నా, ఆర్థికశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుపట్టినా మంత్రి మాటే నెగ్గింది. ధర తగ్గిస్తూ రాష్ట్ర ఖజానాకు రూ.అర కోటికి పైగా నష్టం కలిగిస్తూ ఆ కంపెనీ కోరిన విధంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే... అందరూ వద్దన్నా... కేబినెట్ ఆమోదం విశాఖపట్టణం నగర సమీపంలోని మధురవాడలో ఐటీ సెజ్‌లో ‘ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్’ దరఖాస్తు మేరకు ఏపీఐఐసీ 2015 ఏప్రిల్ 30వ తేదీన రెండు ఎకరాల భూమిని చదరపు మీటర్ రూ.5,600 చొప్పున కేటాయించింది. ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) కింద చెల్లించిన పది శాతం మినహాయించి మిగతా రూ.4,53,26,400 వెంటనే చెల్లించాల్సిందిగా ఏపీఐఐసీ సూచించింది. అయితే ఇన్నోమైండ్స్ డబ్బులు చెల్లించకపోగా ధరను తగ్గించాల్సిందిగా ఏపీఐఐసీకి దరఖాస్తు చేసింది. ఒకసారి ధర నిర్ణయించి కేటాయించిన భూమి ధరను తగ్గించే అధికారం ఏపీఐఐసీకి లేదు. ధీంతో ఏపీఐఐసీ 2015 సెప్టెంబర్ 8వ తేదీన ఆ కేటాయింపును రద్దు చేయడమే కాకుండా పది శాతం ఈఎండీని తిరిగి చెల్లించింది. అనంతరం ఆ రెండు ఎకరాలను చదరపు మీటర్‌కు రూ.5,600 చొప్పున ఫ్యాబ్ ల్యాబ్‌కు కేటాయించింది. అయితే ఫ్యాబ్ ల్యాబ్ కూడా ఐటీ కంపెనీని ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇన్నోమైండ్స్ కంపెనీ 2016 మే 24వ తేదీన ఆ రెండు ఎకరాలను తిరిగి తమకు కేటాయించాల్సిందిగా ఏపీఐఐసీని కోరింది. అయితే 30 మంది ఉద్యోగులతో తక్షణం స్టార్టప్ విలేజ్‌ను ప్రారంభించాలని షరతు విధిస్తూ ఏపీఐఐసీ ఆ రెండు ఎకరాల భూమిని చదరపు మీటర్‌కు రూ.6,280 చొప్పున 2016 జూలై 26వ తేదీన రూ.5,08,30,320కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కేటాయించిన ధరకే భూమిని కేటాయించాలని ఇన్నోమైండ్స్ కోరింది. ధర తగ్గించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఏపీఐఐసీ మరోసారి కేటాయింపులను రద్దు చేసింది. దీంతో ఇన్నోమైండ్స్ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి ధర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాత ధరకే కేటాయించాలంటూ ఐటీ శాఖ మంత్రి ఏపీఐఐసీని కోరారు. ఒకసారి ధర నిర్ణయించి కేటాయింపులు చేసిన తరువాత ధర తగ్గించడం సాధ్యం కాదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప తమ పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే మంత్రి ఆదేశాల మేరకు చదరపు మీటర్‌కు రూ.5,600 చొప్పున కేటాయించే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను కేబినెట్‌కు పంపేందుకు ముందే ఆర్థిక శాఖ పరిశీలించి వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రతిపాదనలను పరిశీలించడం తప్పుడు సంప్రదాయం అవుతుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా స్పష్టం చేశారు. అయినా సరే ఇటీవల జరిగిన కేబినెట్లో ఖజానాకు రూ.55,03,920కు పైగా నష్టం కలిగిస్తూ కంపెనీకి ఆ మేర ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.10 కోట్లు పైగా ధర పలుకుతోందని తెలుస్తోంది. -
సుగర్స్ జీవోపై ఆందోళన
► ఫ్యాక్టరీని ఎపీఐఐసీకి అప్పగించడం దారుణం ►సహకార రంగంలో నడిపించాలి.. ► జీవో 162ను వెంటనే రద్దు చేయాలి ► సీపీఎం నాయకుల నిరసన ఆమదాలవలస :జిల్లాలోని ఏకై క సహకార రంగంలో ఉండే ఆమదావలస సుగర్స్‌ను ఏపీఐఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 162ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేశారు. ఇందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద జీవోను తగులబెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో 162ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పర్యటించిన చంద్రబాబునాయుడు సుగర్స్‌ను తెరిపిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తూ జీవోను తేవడం తగదన్నారు. ఏపీఐఐసీకి సుగర్స్ స్థలాలు ఇవ్వడం వెనుక సుట్కేసులు మారాయని ఆరోపించారు. కోర్టు తీర్పు కూడా సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరవాలని పేర్కొందన్నారు. కోర్టు తీర్పు తన ఘనతేనని డప్పు కొట్టిన విప్ కూన రవికుమార్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం లేదా? అని నిలదీశారు. ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి అప్పగింతలో విప్ రవికుమార్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటనలో ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్టు వెల్లడించినట్టు వివరించారు. ఫ్యాక్టరీని నడిపించేందుకు చర్యలు చేపట్టకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సీపీఎం నాయకు లు కె.నాగమణి, కోనాడ మోహనరావు, మెట్ట కొండయ్య, పంచాది కృష్ణారావు, బొడ్డేపల్లి మోహనరావు, బి.జనార్ధనరావు, వడ్డాది ఆదినారాయణ, బి.రాజారావు, కార్మి కులు, రైతులు పాల్గొన్నారు. -
'ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారు..?'
శ్రీకాకుళం : సీఎం చంద్రబాబు సర్కార్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను లాక్కొని శ్రీకాకుళం ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆముదాలవలస కో ఆపరేటివ్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను ఏపీఐఐసీకి కేటాయించడం సరికాదన్నారు. ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు...భూములను ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారని..? తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.