సీబీఐ ఉచ్చులో ‘గల్లా’ | case filed on galla aruna kumari | Sakshi
Sakshi News home page

సీబీఐ ఉచ్చులో ‘గల్లా’

Published Sat, Apr 12 2014 3:09 AM | Last Updated on Fri, Jul 12 2019 6:08 PM

case filed on galla aruna kumari

సాక్షి ప్రతినిధి, తిరుపతి; మాజీ మంత్రి, చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. త్వరలోనే గల్లా అరుణకుమారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి విచారణచేయాలన్న ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మా ర్ టౌన్‌షిప్‌కు డబ్బు తీసుకుని ఏపీఐఐసీ అప్పగించిన భూమిని గల్లా అరుణకుమారి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
 
వీటిని పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న సీబీఐ ప్రత్యేకంగా దర్యాప్తు చేయనుంది. మంత్రిగా గల్లా పలు ప్రాంతాల్లో ఏపీఐఐసీ ద్వారా పలు నోటిఫికేషన్లు ఇప్పించి కొద్దిరోజుల తరువాత ఆ భూములను తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా దర్యాప్తు చేయనున్నారు.
 
అవార్డీ భూములను ఎలా కొంటారు ?..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లెలో ఎమ్మార్‌కు 258.36 ఎకరాల ప్రభుత్వ భూమి ని ఏపీఐఐసీ ద్వారా నారా చంద్రబాబునాయుడు ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అవార్డీ కూడా ఇచ్చింది. అంటే ఎమ్మార్‌కు భూమిని అప్పగించిన తరువాత ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏపీఐఐసీ వారు తీసుకున్నారు. కాగా ఈ భూమిలో సర్వే నెంబరు 27/4లో 2.20 ఎకరాలు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, ఆమె కుమార్తె రమాదేవి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారు. అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడికి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారు స్వాధీనం చేశారు.
 
ఈ స్థలంలో అపార్ట్‌మెంట్ కట్టేందుకు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అధికారుల నుంచి అనుమతులు వచ్చాయి. ఇందులో మూడంతస్తుల భవన నిర్మాణం సైతం జరిగింది. ఒక సంస్థకు అవార్డీ అయిన భూములను మరొకరు ఎలా కొనుగోలు చేస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పరిశీలన లేకుండానే రికార్డుల్లో పేర్ల మార్పు.. 1995లో ఎస్.అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జీ.బలరామిరెడ్డి అనే వ్యక్తుల వద్ద ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ కాపీలు చూపించారు. అంతకుముందే ఈ భూమిని ఏపీఐఐసీ వారు ఎమ్మార్‌కు అమ్మడం ద్వారా అవార్డ్ అయింది.
 
అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు ఎమ్మార్ నుంచి డబ్బు తీసుకుని స్వాధీనం చేశారు. ప్రభుత్వం సంస్థ వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఎమ్మార్‌కు ఇవ్వదనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఆ భూములు తమవేనని మంత్రి చెబితే అధికారులు నమ్మారు. మంత్రి తన పలుకుబడిని ఉపయోగించి అప్పటి శేరిలింగంపల్లె తహశీల్దార్ జి.సుబ్బారావు ద్వారా 2008 ఫిబ్రవరిలో మ్యుటేషన్(రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పులు)కు ఉత్తర్వులు ఇచ్చారు.
 
 ఇందులోనూ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి.విచారించకుండానే నిర్మాణానికి ఉత్తర్వులు.. 2009లో అపార్ట్‌మెంట్ కట్టుకునేం దుకు గల్లా రామచంద్రనాయుడు దరఖాస్తు చేయగా, ఎటువంటి విచారణ చేయకుం డానే నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మూడు అంతస్తుల నిర్మాణం పూర్తయింది.
 
భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయంలో సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ, జీహెచ్‌ఎంసీ అధికారులు దోషులు కాబోతున్నారు. ఎమ్మార్ కేసులో విచారణ చేసిన సమయంలో సీబీఐ గల్లా కుటుంబ సభ్యులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
 
 ప్రభుత్వ భూముల ఆక్రమణలో గల్లా
 మంత్రిగా గల్లా అరుణకుమారి అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించారని, వీటిపై విచారణ చేయాలంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని నల్లగట్లపల్లెకు చెందిన గల్లా పురుషోత్తం నాయుడు ప్రజాప్రయోజనం కింద సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విచారించాల్సిందిగా సీబీఐని ఆదేశించడంతో ఎమ్మార్ భూముల  వ్యవహారంలో గల్లా పాత్ర వెలుగులోకి వచ్చింది.

కాగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన అక్రమాలు, భూ ఆక్రమణలు, అన్యాయంగా పలువురి నుంచి బలవంతంగా లాక్కున్న భూముల వ్యవహారం కూడా ఈ విచారణ ద్వారా బయటకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గల్లా అరుణకుమారి మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కొన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించారని, కొన్ని చోట్ల ఎంతో మందిని బెదిరించి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
ఆమె కంపెనీలకు సంబంధించిన ప్రదేశాల్లో వేల ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆధారాలు కూడా కొందరు బయటకు తీస్తున్నారు. అక్రమంగా వేల ఎకరాల భూములు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైందని, త్వరలోనే విచారణకు వస్తుందని గాలి పురుషోత్తం నాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement