Galla Aruna kumari
-
రాజకీయ జీవితంపై గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు జిల్లా: రాజకీయ జీవితంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడారు. 'నా రాజకీయ జీవితం ముగిసింది. నేను చేయని పదవి లేదు.. చూడాని రాజకీయం లేదు. నా సంకల్పమే నా భవిష్యత్తు. నా అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చు. టీడీపీకి మేము పెద్ద దిక్కు కాదు. చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కు అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ వద్దనుకున్నాను. అందుకే సైలెంట్‌గా ఉన్నానని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చదవండి: (అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్) -
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా రాజీనామా
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె గురువారం చంద్రబాబుకు లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నా అరుణ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు. ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కూడా టీడీపీలో గతంలో మాదిరిగా చురుగ్గా ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. -
అరుణమ్మ కన్నీటికి కారకులెవరు?
రాయలసీమ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. ఇలా రాణించిన వారిలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఒకరు. జిల్లాలో ఒంటి చెత్తో రాజకీయాలను నడిపిన ఆమె చివరకు ఉబికి వస్తున్న కన్నీటిని బిగపట్టుకుని బయలుదేరాల్సిన దుస్థితి ఏర్పడింది. కనుసైగలతోనే ఆదేశాలు... కనుచూపులతోనే శాసించగల సత్తా కలిగిన నాయకురాలు తనను నమ్ముకున్న వారి ఎదుటే దోషిగా ఎందుకు నిలవాల్సి వచ్చింది. మూడు దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన అరుణమ్మ మనస్సును గాయపరిచినవారెవరు? తిరుపతి రూరల్: జిల్లా రాజకీయాల్లో గల్లా అరుణకుమారి మాటంటే మాటే. పదేళ్లపాటు మంత్రిగా తిరుగులేని నేతగా చెలాయించిన ఆమె టీడీపీలో తీరని అవమానాలు ఎదుర్కొన్న విషయం జగమెరిగిన సత్యం. ఇవన్నీ చాలా కాలం తరువాత ఆమె నోటి వెంటే బయటకు వచ్చాయి. తిరుపతి రూరల్ మండలంలో ఆది వారం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో అరుణమ్మ తన ఆవేదనను, అం దోళనను వెళ్లగక్కడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకురాలుగా చెలా మణి అవుతున్న అరుణమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు భవిష్యత్తు కోసం తానెప్పుడూ గడప కూడా తొక్కని టీడీపీలోకి అడుగుపెట్టక తప్పలేదు. అప్పటి నుంచే ఆమె టీడీపీలో ఇమడలేకపోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయనే విషయం అక్కడా, ఇక్కడా వినిపిస్తూనే ఉంది. వాటిపై మాజీ మంత్రే కుండబద్ధలు కొట్టారు. తన వెంటే ఉంటూ తన కారులోనే తిరుగుతూ కుట్రలు చేసిన వారు, ద్రోహానికి పాల్పడిన వారు ఉన్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి అరుణమ్మ టీడీపీలో నిలదొక్కుకోవడానికి తన సహజ సిద్ధ స్వభావాన్ని పక్కనపెట్టి సర్దుకుపోయే ధోరణితో కూడా వ్యవహరించారు. రాజకీయాల నుంచి చాలా గౌరవంగా తప్పుకోవాలని, పార్టీలో ఇమడలేకపోతున్నానని, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని అప్పటికే సీఎం చంద్రబాబుకు అరుణకుమారి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని అంతర్గతంగా విన్నవించుకున్నారు. సీఎంను ఒప్పించాక కార్యకర్తలకు నచ్చజెప్పి ఇన్చార్జ్ బాధ్యతల నుంచి హుందాగా తప్పుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని సీఎంకు పలుమార్లు చెప్పారు. రెండేళ్ల కాలంలో అది ఏదీ కూడా బయటకు పొక్కలేదు. అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్న ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మంత్రి అమరనాథరెడ్డితో కలసి సీఎంతో భేటీ అయ్యారు. ఇదే భేటీలో అరుణమ్మ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని మరోమారు కోరారు. తర్వాత విజయవాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగే గంట వ్యవధిలోనే అరుణమ్మ రాజకీయాల నుంచి నిష్క్రమించనున్నట్లు టీవీ ఛానల్స్‌లో కథనాలు వచ్చాయి. ఇదే అంశాన్ని అరుణమ్మ కార్యకర్తల సమన్వయ సమావేశంలో గుర్తు చేశారు. రెండేళ్ల నుంచి బయటకు రాని విషయం గంటలోనే ఎలా లీకు అయిందని వేదికపైన ఉన్న పులివర్తి నానిని పరోక్షంగా ప్రశ్నిం చారు. దీంతో నమ్ముకున్న వారి ఎదుట, తను నమ్మిన వారి ఎదుట దోషిగా నిలబడాల్సి వచ్చిందని అరుణమ్మ కన్నీటిని రెప్పచాటునే అదిమి పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె అనుచరులు చలించిపోయారు. చంద్రగిరిలో టీడీపీకి ఊతమిచ్చిందెవరు? చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మొదటి నుంచి అరువు నాయకుల మీదే ఆధారపడుతోంది. ఎన్నికల సమయానికి ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావటం పోటీ చేయిం చడం, ఆపై వారు అందుబాటులో లేకుండా పోవటం జరుగుతోంది. ఈ కారణంగా కార్యకర్తలు కాస్తంత నిస్తేజంగా ఉండిపోయారు. కానీ 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అరుణమ్మ పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేశారు. హుదూద్ వరద బాధితులను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున విరాళాలను రాష్ట్రంలోనే అత్యధికంగా సేకరించారు. అదే సమయంలో పార్టీ సభ్యత్వం కూడా పెద్ద ఎత్తున చేసి గుర్తింపు పొందారు. వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ అరుణమ్మ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలను నాయకుల స్థాయికి తీసుకువచ్చానని, పార్టీని జీరో స్థాయి నుంచి ప్రతిష్టంగా నిలబెట్టానని చెప్పటంలో కూడా నిగూఢ అర్థముంది. అయితే నాడు పార్టీ కోసం పనిచేయని వారే...నేడు తెల్లచొక్కాలు వేసుకుని ముందు వరసలో కూర్చున్నారని చెప్పటంతో ప్రస్తుత పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావించారు. టీడీపీలోని ఆ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్ ఎవరు? పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇదే సమయంలో కీలక వ్యాఖ్య లు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తన వెంట పేద, బడుగు, బలహీన వర్గాలు మాత్రమే ఉండేవారని, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, క్రిమినల్స్ లేరని వ్యాఖ్యనించడం కలకలం రేపింది. తనవెంట లేరంటే ఇప్పుడు టీడీపీలో క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యాపారస్తులెవరు? వారి వెనుక ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు? క్రిమినల్స్ ఎవరనే గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో అక్కడున్న నాయకులు కా స్తంత ఉలికిపాటుకు గురయ్యారు. ప్రశాంతంగా, సౌమ్యంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాల్లోకి వ్యాపారులు, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్ ప్రవేశిస్తున్నారనే అంశాన్ని ఆమె నేరుగానే ప్రస్తా్తవించారు. దీంతో వేదికపైనే ఉన్న నాయకులు కూడా ఖంగుతినాల్సి వచ్చింది. చంద్రగిరి రాజకీయం రంగు మారుతోందని, ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదనే విషయాన్ని ఆమె సూచా యగా చెప్పారు. చెప్పుకోలేని ఆవేదనతో నిశ్శబ్దంగా అరుణమ్మ వెళ్లిపోవటంతో అనుచరుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు కన్పించాయి. -
చంద్రగిరిలో పోటీ చేయను !
తిరుపతి రూరల్: తాను ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని, రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మరోసారి స్పష్టం చేశారు. తాను చంద్రగిరి నుంచి పోటీ చేస్తాననే ఆశలు వదులుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా చంద్రగిరిలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆమెను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రగిరి నుంచి తాను పోటీ చేయనని గతంలో ముఖ్యమంత్రికి తేల్చి చెప్పానని మరోసారి గుర్తు చేశారు. రోడ్డుపైన ప్రసంగంతో భారీగా ట్రాఫిక్‌జామ్.. గల్లా అరుణకుమారి ర్యాలీగా వచ్చి కల్యాణమండపంలో ప్రసంగించాల్సి ఉన్నా, పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపైనే వాహనం నిలిపి రోడ్డునే బహిరంగ సభ వేదికగా మార్చుకున్నారు. దీంతో వందలాది వాహనాలు బైపాస్ రోడ్డుపై ఆగిపోయాయి. రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పట్టించుకోవాల్సిన పోలీసులు గల్లా అరుణ చుట్టూ చేరి భజనలు చేయడానికే పరిమితం అయ్యారని, ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు మండిపడ్డారు. ఓ దశలో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆమె ప్రసంగం సాగుతుండగానే భారీ వాహనాలను ఓ వైపు వదిలారు. సన్మాన వేదిక వద్ద తోపులాటలతో నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరంగా సీనియర్లు.. పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా గల్లా అరుణకుమారికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రగిరికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమేష్‌రెడ్డి, శ్రీహరినాయుడు, మాజీ ఎంపీపీ లోకయ్యనాయుడు, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జెడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఆమె భర్త రమణమూర్తి, వలపల దశరథనాయుడు తదితరులు హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, చంద్రప్రకాష్, పుష్పవతి, సుబ్రమణ్యంనాయుడు, జనార్దన్‌యాదవ్, కుర్రకాల్వ సుభాషిణి, సుధాకర్, బడి సుధాయాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రగిరి వద్దు బాబూ..!
చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చంద్రగిరి నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలిసిన ఆమె తన మనసులోని మాటను వెల్లడించిన ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సరైన నాయకుడికి బాధ్యతలు అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి చంద్రగిరి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆ తరువాత వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్న అరుణకుమారి దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండుసార్లు మంత్రిగా కొనసాగిన గల్లా అరుణకుమారి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలై ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆమె పార్టీ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలో ఏర్పడ్డ గ్రూపు రాజకీయాలు గల్లాను ఇబ్బంది పెట్టాయి. ఒకవైపు మంత్రి నారా లోకేష్, మరో వైపు ఎంపీ శివప్రసాద్ తమదైన శైలిలో రాజకీయాన్ని మొదలు పెట్ట డంతో గల్లాకు రాజకీయంగా కేడర్‌లో ప్రాధాన్యత తగ్గింది. ప్రతి పనికీ మండల స్థాయి పార్టీ నాయకులు నేరుగా లోకేష్ దగ్గరకు వెళ్లడం పనులు చేయించుకోవడం మొదలైంది. అభివృద్ధి పనులు, జన్మభూమి కమిటీలు, బదిలీలకు సంబంధించిన పనుల కోసం ఎక్కువమంది పార్టీ నాయకులు ఎంపీ శివప్రసాద్నో, మంత్రి లోకేష్‌ను కలుస్తున్నారు. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తుండడంతో వివిధ గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను చంద్రగిరి నుంచి పోటీ చేయడం మంచిది కాదన్న ఆలోచనతో ఇన్చార్జి బాధ్యతలకు గల్లా గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. దీనికితోడు ఆమె నేడో రేపో అమెరికా వెళ్లి అక్కడ కొన్నాళ్ల పాటు ఉండాలని యోచిస్తోన్నట్లు తెల్సింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరుణకుమారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన కుమార్తె రమాదేవి కూడా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరన్న విషయాన్ని గల్లా అరుణ సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంపీ గల్లా జయదేవ్ యథావిధిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని, మళ్లీ ఇంతమంది ఎందుకన్న భావనలో ఆమె ఉన్నారని కొందరు చెబుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ 2019లో చంద్రగిరి నుంచి గల్లా అరుణ పోటీ ఉండదని మాత్రం సుస్పష్టమైంది. పులివర్తి నానికి ఇన్చార్జి బాధ్యతలు...? ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పులివర్తి నానికి చంద్రగిరి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నాని ఏడాది కాలంగా మంత్రి లోకేష్‌తో సన్నిహితంగా మెలుగుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా చంద్రగిరి బాధ్యతలు చేపట్టే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
గల్లా అరుణకు చేదు అనుభవం
గుంటూరు : గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి శనివారం గల్లా అరుణకుమారి విచ్చేశారు. ఆమె రాకను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎందుకొచ్చారని ఆమెపై మండిపడ్డారు. సొంత ఇమేజ్ కోసం గ్రూప్‌లను ప్రోత్సహిస్తే తాము సహించేది లేదని సదరు కార్యకర్తలు గల్లా అరుణకుమారిని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక గల్లా అరుణకుమారి వచ్చిన దారినే వెనక్కి తిరిగారు. -
గల్లా ‘భూ’దందాపైహైకోర్టు కన్నెర్ర
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూ అక్రమాలపై హైకోర్టులో పిల్ వేసిన గల్లా పురుషోత్తంనాయుడు అక్రమాలకు పాల్పడిన గల్లా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని ఏప్రిల్ 5న సీబీఐని ఆదేశించిన హైకోర్టు ఐదు నెలలు గడిచినా గల్లా కుటుంబీకులపై కేసు నమోదు చేయకపోవడం సీబీఐకి అక్షింతలు.. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యుల భూ అక్రమాలపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలన్న ఆదేశాలను సీబీఐ పట్టించుకోకపోవడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఐదు నెలలు గడిచినా కేసు ఎందు కు నమోదు చేయలేదో లిఖితపూర్వకంగా వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సీబీఐ ని బుధవారం హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు గల్లా కుటుంబీకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: గల్లా అరుణకుమా రి ప్రభుత్వ భూములను ఆక్రమించడంపై విచారణ చేయాలంటూ పూతలపట్టు మం డలం నల్లగట్లపల్లెకు చెందిన గల్లా పురుషోత్తంనాయుడు ప్రజా ప్రయోజన వ్యా జ్యం(పిల్) వేశారు. రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లెలో సర్వే నెంబర్ 27/4లో 2.20 ఎకరాల భూమిని అక్రమంగా గల్లా అరుణకుమారి కుటుంబసభ్యులు పొందడంపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని సీబీఐని ఆదేశిస్తూ ఏప్రిల్ 5న హైకోర్టు తీర్పును ఇచ్చింది. మాజీమంత్రి గల్లా అ రుణకుమారి, భర్త గల్లా రామచంద్రనాయుడు, కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కుమార్తె రమాదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగభూషణంరెడ్డి తదితరులపై కేసు నమోదు చేయాల్సిన సీబీఐ.. ఐదు నెలలు గడిచినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. ఇదే అం శంపై బుధవారం హైకోర్టు మండిపడింది. కేసు విచారణలో సీబీఐ తీరును తూర్పారబట్టింది. గల్లా కుటుంబీకులపై కేసు ఎం దుకు నమోదు చేయలేదో వారం రోజు ల్లోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇ వ్వాలని సీబీఐని ఆదేశించడం సంచలనం రేపింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో గల్లా కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా భూమార్పిడి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఎమ్మార్‌కు 258.36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా 1995లో అప్పటి సీఎం ఎన్.చంద్రబాబునాయుడు ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అవార్డు కూడా జారీచేసింది. భూమిని అప్పగించిన తర్వాత.. అందుకు సంబంధించిన పైకాన్ని కూడా ఎమ్మార్ నుంచి ఏపీఐఐసీ రాబట్టుకుంది. కానీ.. ఎమ్మార్‌కు కేటాయించిన భూమిలో సర్వే నెంబర్ 27/4లో 2.20 ఎకరాలు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, కు మార్తె రమాదేవి కొనుగోలు చేసినట్లు రెవె న్యూ రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారు. ఆ భూమిని గల్లా అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారు స్వాధీనం చేశారు. ఈ స్థలం లో అపార్ట్మెంట్ కట్టేందుకు జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కు దరఖాస్తు చేసుకోవడంతో.. అందుకు సంబంధిత అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. దాంతో ఆ భూమి లో మూడంతస్తుల భవనాన్ని కూడా నిర్మించేశారు. ఒక సంస్థకు కేటాయించిన భూమిని మరొకరు ఎలా కొనుగోలు చేస్తారన్నది వివాదంగా మారింది. అడ్డగోలుగా భూమార్పిడి.. 1995లో ఎస్.అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జి.బలరామిరెడ్డి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు గల్లా అరుణకుమారి కుటుంబీ కులు రిజిస్ట్రేషన్ కాపీలు చూపించారు. కానీ.. అంతకు ముందే ఆ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఎమ్మార్‌కు కేటాయించడం గమనార్హం. ఇది రెవెన్యూ అధికారులకు తెలియంది కాదు. కానీ.. 2008లో అప్పటి మంత్రి గల్లా అరుణకుమారి తన అధికారాన్ని ఉపయోగించి అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్ జి.సుబ్బారావుపై ఒత్తిడి తెచ్చి ఆ భూమిని తమ కుటుంబసభ్యులపై మార్పిడి చేయించారు. ఆ మేరకు రెవె న్యూ రికార్డులను తిరగరాయించారు. ఇదే భూమిలో అపార్ట్మెంట్ నిర్మాణానికి గల్లా రామచంద్రనాయుడు దరఖాస్తు చేయగా.. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండానే అనుమతులు ఇచ్చేశారు. ఇదే అంశంపై హైకోర్టు ఆగ్రహించింది. తక్షణమే గల్లా అరుణకుమారితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగభూషణంరెడ్డి, అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కానీ.. ఐదు నెలలుగా గల్లా అరుణకుమారి కుటుంబీకుల వైపు సీబీఐ కన్నెత్తి కూడా చూడలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉండటం.. రాజధాని కమిటీలో సభ్యుడిగా ఉన్న నేపథ్యంతో సీబీఐ కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభు త్వ ఒత్తిళ్లకు తలొగ్గే సీబీఐ కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
కక్ష సాధింపులు
మాజీ ఎమ్మెల్యేలు భూమన, సీకే బాబుకుభద్రత ఉపసంహరణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రత కుదింపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ, గల్లా అరుణకుమారికి భద్రత కల్పించిన సర్కారు టీడీపీకి ఓట్లేయలేదనే నెపంతో ప్రజలను వేధిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న తెలుగుతమ్ముళ్లతో ఆపార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పోటీపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు తెరతీసి, భద్రత కుదించారు. ప్రజాప్రతినిధులు కానివారికి భద్రత కల్పించి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను ఉపసంహరించారు. ఎవరి హిట్ లిస్ట్‌లోనూ లేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుకు భద్రత కల్పించారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఏడు సార్లు దాడులనుంచి బయటపడిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రతను పూర్తిగా ఉపసంహరించడం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా పోలీసువర్గాలు అభివర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించగానే ఆపార్టీ శ్రేణులు దమనకాండకు తెరతీశాయి. టీడీపీకి ఓట్లేయని ప్రజలను వేధింపులకు గురిచేశాయి. తాగునీటి సౌకర్యం నుంచి కరెంట్ సరఫరా వరకూ అంతరాయం కల్పించి వేధించాయి. ప్రత్యర్థి పార్టీలకు ఓట్లేశారనే నెపంతో గ్రామాలపై తెలుగుతమ్ముళ్లు పడి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే టీడీపీ శ్రేణుల దాడులు మరింత పెరిగిపోయాయి. వైఎస్సార్సీపీ నేతలు లక్ష్యంగా దాడులను టీడీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దూకుడును సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. విపక్ష నేతలు.. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రతరం చేశారు. అందులో భాగంగా కొందరికి భద్రతను కుదిస్తే.. మరికొందరికి భద్రతను పూర్తిగా ఉపసంహరించారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రాణ హాని ఉన్న నేతలకు రక్షణ కల్పించడం సర్కారు బాధ్యత. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా నేతలకు భద్రత కల్పించాలి. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి.. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా భద్రతను ఉపసంహరిస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి 2005లో మావోయిస్టులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. చర్చలు ముగిశాక.. ‘ఈ చర్చలు విఫలమైతే మా తొలి టార్గెట్ మీరే అవుతారు’ అంటూ మావోయిస్టు అగ్రనేత ఒకరు భూమన కరుణాకరరెడ్డిని హెచ్చరించారు. ఇది చర్చల్లో పాల్గొన్న అప్పటి హోం మంత్రి జానారెడ్డి, డీజీపీ స్వరణ్‌జిత్ సేన్ తదితరుల దృష్టికి వెళ్లింది. గతంలో భూమన కరుణాకరరెడ్డి విప్లవోద్యమాల్లో పాల్గొన్నారు.. ఎమర్జెన్సీలో ఆయనను అప్పటి ప్రభుత్వం నిర్బంధించింది కూడా. విప్లవోద్యమాల్లో పాల్గొని.. జనజీవన స్రవంతిలో కలిసిన వారిపై తరచుగా మావోయిస్టులు దాడులు చేస్తోండటం మనం చూస్తూనే ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకునే 2005లో భూమన కరుణాకరరెడ్డికి 4+4 భద్రత(ఏకే-47) కల్పించారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్రాలు ఆ భద్రతను 2+2కు కుదించాయే తప్ప.. ఉపసంహరించలేదు. భూమనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. సీఎం ఒత్తిడి మేరకు భూమనకు భద్రతను ఉపసంహరించారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై ఇప్పటికే ఏడు సార్లు హత్యాయత్నం చేశారు. ఈ దాడుల వెనక టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఆ దాడుల నుంచి సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణహాని ఉన్న సీకే బాబుకు రోశయ్య, కిరణ్ సర్కారు 4+4 భద్రత కల్పించారు. ఇప్పటికీ సీకే బాబుకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. కానీ.. ఆ నివేదికను సీఎం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తుంగలో తొక్కి భద్రతను ఉపసంహరించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ నేత. సంఘ విద్రోహక శక్తుల నుంచి ఆయనకు ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఆయన భద్రతను 1+1కు కుదించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో దాడులకు దిగారు. ఆ నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లర్ల అవతారం ఎత్తిన టీడీపీ నేతల నుంచి బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 2+2 భద్రతను కొనసాగించాలన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికను బుట్టదాఖలు చేశారు. ఆయనకు భద్రతను 1+1కు కుదించారు. దీన్నేమంటారు బాబూ... మాజీ ఎమ్మెల్యేకు భద్రత కల్పించకూడదని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. గతంలో జిల్లాలో 48 మందికి భద్రత కల్పిస్తే.. ఇప్పుడు 21 మందికే కల్పిస్తున్నామని సమర్థించుకుంటోంది. కానీ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారిలకు 1+1 భద్రత కల్పించారు. అటు గాలికిగానీ.. ఇటు గల్లాకుగానీ ఎవరి నుంచి ముప్పు లేదు. వారిద్దరికీ భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా నివేదిక కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ఆ ఇద్దరూ టీడీపీ నేతలు కావడంతో భద్రత కల్పించారు. ఇక డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డికి కూడా భద్రతను ఉపసంహరించడం గమనార్హం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందో విశదం చేసుకోవచ్చు. -
ఎమ్మెల్సీ నువ్వా...నేనా !
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారు, సీటు ఆశించి భంగపడిన వారు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో చిత్తూరులో ఖాళీగా ఉన్న ఒక స్థానం కోసం మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, అశోక్‌రాజు రాజధాని బాట పట్టారు. సాక్షి, చిత్తూరు:ఈ ఏడాది రాష్ట్రంలో ఒకేసారి పుర, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవుల భర్తీ పూర్తయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తమ్ముళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్, దేవాదాయ శాఖల పాలక మండళ్లను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో వాటిపై ఆశలు వదులుకున్నారు. దీంతో మరో ఐదే ళ్లు ఏ స్థాయి నాయకుడు ఏ పదవి కోసం చూసే పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కోటాలో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయింది. అలాగే కడపకు చెందిన ఎమ్మెల్సీ షేక్‌హుస్సేన్ రాజీనామాతోమరో స్థానం ఖాళీ అయింది. గవర్నర్ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఉండడం, ప్రస్తుతం ఏడుగురు కొనసాగుతుండడంతో ‘గవర్నర్‌కోటా’పై ఇన్నాళ్లు గందరగోళం నెలకొంది. షేక్ హుస్సేన్ రాజీనామాతో గవర్నర్ కోటా లెక్క సరిపోయింది. ఎమ్మెల్యే కోటాలోని స్థానంలో మంత్రి నారాయణ ఎన్నిక కావడం లాంఛనమే! ఈ ఎన్నికకు ఈ నెల 4న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇక స్థానిక సంస్థల ఖాళీల నిర్వహణపై దృష్టి స్థానిక సంస్థల కోటాలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానం, గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈ పాటికే ఎన్నికల నిర్వహణ పూర్తి కావల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లులో జరిగిన పొరపాటు వల్ల ఆలస్యమైంది. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మండలి స్థానాలు 20 ఉంటే బిల్లులో 17 అని చూపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పేర్కొన్నప్పుడు 20 అని పేర్కొన్నారు. ఈ తప్పిదంతో ఎన్నికల నిర్వహణ కాస్త ఆలస్యమైంది. దీనికితోడు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్సీ స్థానాలను 50 ఉన్నట్లు చూపించారు. విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన మరో 8 స్థానాలు పెంచుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంది. ఈ విషయమై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. మరో 8 మండలి స్థానాలను పెంచుకునే అవకాశం రాష్ట్రానికి ఉందని, ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే కోటా ఎన్నిక పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల కోటా నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే జరిగితే చిత్తూరులో ఉన్న ఒక స్థానం కోసం టీడీపీలో మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారితో పాటు నగరికి చెందిన మరో నేత అశోక్‌రాజు పోటీ పడుతున్నారు. వీరిలో ఎమ్మెల్సీ పదవిపై గాలి బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక దశలో టీటీడీ చైర్మన్ రేసులో నిలిచిన గాలి ముద్దుకృష్ణమ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అభయహస్తం’తో తప్పుకున్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. తన సొంత జిల్లాలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రభావం చూపడంతో పార్టీ బలోపేతంపై బాబు దృష్టి సారించారు. సీఎంగా తాను ఉన్నప్పటికీ రాజధానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, ఈ క్రమంలో బొజ్జలతో పాటు మరో మంత్రి జిల్లాకు ఉండాలని బాబు భావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో గాలిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా డబ్బు ఖర్చుపెట్టానని, తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మహిళా కోటాలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గల్లా అరుణకుమారి కూడా బాబు వద్ద గట్టిగానే వాణి వినిపించేందుకు సిద్ధమయ్యూరు. ఇదే క్రమంలో మర్రిచెట్టు నీడలో పెరిగినట్లుగా గాలి నియోజకవర్గంలో ఉన్నందున ప్రతీసారి తనకు టికెట్టు దూరమవుతోందని, తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తేచాలని, అంతకు మించి వేరే పదవులు వద్దని అశోక్‌రాజు కూడా చంద్రబాబుతో చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. చంద్రగిరి, నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందడం, రెండూ చిత్తూరు పార్లమెంట్ పరిధిలోనివే కావడం, ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న ముగ్గురూ ఇదే పార్లమెంట్ పరిధిలోనే వారు కావడంతో ఎవరికి సీటు ఇస్తారోనని టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది. మరి బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
చెవిరెడ్డి కట్టడికి ‘అధికార’ కుట్ర!
చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులను ఉసిగొల్పుతున్న గల్లా టీడీపీ నేతల ఆజ్ఞలకు జీ హుజూర్ అంటున్న ఎస్పీ చెవిరెడ్డిపై కేసుల వివరాలను అందించాలంటూ పోలీసులకు హుకుం ఒక్క క్రిమినల్ కేసూ లేకపోవడంపై ఆశ్చర్యం అయినా రౌడీషీట్ తెరవాలంటూ ఎస్పీపై టీడీపీ కీలకనేతల ఒత్తిడి సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది టీడీపీ నేతల తీరు..! చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలు దొడ్డిదారిని ఎంచుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి.. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని.. కీలకమైన పోస్టింగ్ పొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేయ డం పోలీసు వర్గాలనే నివ్వెరపరిచింది. వివరాలిలా.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సొంతూర్లు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి అప్పట్లో కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చి చెవిరెడ్డిపై పదుల సంఖ్యలో కేసులు అక్రమంగా బనాయించారనే విమర్శలు బలంగా విన్పించాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ప్రజలకు దన్నుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటాలు చేశారు.. ఇప్పుడు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనప్పుడు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు చేసినపుడు చెవిరెడ్డిపై వివిధ పోలీసుస్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశా రు. విద్యుత్ స్తంభాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు రాయించినందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నింటి వెనుక గల్లా అరుణకుమారి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో కలయదిరుగుతూ ప్రజలకు దన్నుగా నిలుస్తున్నారు. ఇది గల్లా అరుణకుమారి, టీడీపీ కీలకనేతలకు కంటగింపుగా మారింది. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, నక్సల్స్, ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పర్యటించకుండా చేసేందుకే ఇటీవల భద్రతను కుదించేలా టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా చెవిరెడ్డికి ఉన్న 2+2 భద్రతను 1+1కు కుదించారు. టీడీపీ నేతలు అంతటితో ఆగలేదు.. చెవిరెడ్డిపై రౌడీషీటర్ ముద్రవేసి అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపన్నారు. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ ఓపెన్ చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబుపై గల్లా అరుణకుమారితో పాటు టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిపై దాడి, హత్యాయత్నం వంటి వా టికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదైన వారిపై మా త్రమే రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నది నిబంధన. కనీ సం మూడు క్రిమినల్ కేసులు ఉన్న వారిపై మాత్రమే రౌడీషీట్ తెరవవచ్చు. కానీ.. చెవిరెడ్డిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు చెవిరెడ్డిపై నమోదైన కేసుల వివరాలను తక్షణమే అందించాలంటూ బుధవారం పోలీసులను ఆదేశించారు. పోలీసులు అందించిన కేసుల్లో ఒక్కటీ క్రిమినల్ కేసు లేకపోవడంతో ఏదో ఒక కేసు బనాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చెవిరెడ్డిపై ఎలాగైనా రౌడీషీట్ తెరిచి.. టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుని, కీలకమైన పోస్టింగ్ పొందాలని ఎస్పీ వ్యూహం రచించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చెవిరెడ్డిని కట్టడి చేసేందుకు టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. అక్రమ కేసులు బనాయించే యత్నంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సమీక్షిస్తే ఒట్టు
టీడీపీ ఆదేశాలు పట్టని నేతలు తూతూమంత్రంగా కొన్నిచోట్ల సమావేశాలు గెలుపోటములను విశ్లేషించని వైనం నేడు చిత్తూరులో జిల్లా కార్యవర్గ సమావేశం సాక్షి, తిరుపతి : జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీమాంధ్ర రాష్ట్రంలో అధికారం దక్కిందన్న జోష్‌లో ఉన్నాయి. ఈ ఆనందంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపోటములను విశ్లేషించాలని పార్టీ ఆదేశించింది. ఆ మేరకు అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించారు. సమీక్షించిన అంశాలను జిల్లా కార్యవర్గసమావేశంలో అందజేయాలని సూచిం చారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలు, సూచనలను జిల్లా నాయకులు చెవికెక్కించుకోలేదు. సగానికి పైగా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించలేదు. జిల్లా కేంద్రం చిత్తూరులో శనివారం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమీక్ష సమావేశాల నివేదికను అందజేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో సమీక్షలు జరగకపోవడంతో ఈ సమావేశం రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషిని అభినందించేందుకు మాత్రమే పరిమితం కానుంది. జిల్లాలో పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు నియోజకవర్గాల్లో మాత్రమే సమీక్షలు జరిగాయి. ఈ సమావేశాల్లోనూ పూతలపట్టు మినహాయిస్తే మిగిలిన చోట్ల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విశ్లేషించిన దాఖలాలు లేవు. శ్రీకాళహస్తి, తిరుపతి,కుప్పం నియోజకవర్గాల్లో మంచి ఆధిక్యం రావడంతో ఆ పార్టీ నేతలు సమీక్షల కంటే కార్యకర్తలను అభినందించుకునే పనిలో ఉన్నారు. సీనియర్ నేతలు గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ పోటీ చేసిన చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటమికి కొందరు ముఖ్యనేతల వెన్నుపోట్లు కూడా కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ సమీక్షలు జరపలేదు. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు ఓట్ల లెక్కింపు తరువాత కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీతో కుమ్మక్కు ప్రధాన కారణమని తెలిసినప్పటికీ అక్కడ కూడా సమీక్ష చేసే సాహసం చేయలేదు. పలమనేరులో ఓడిపోయిన అభ్యర్థి సుభాష్‌చంద్రబోస్ మండలాలవారీగా నేతలను పిలిపించుకుని బూత్‌లవారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయలేదు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఓటమికి ఎవరినీ నిందించడం లేదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినందున కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి సమావేశం ముగిం చారు. పొత్తులో భాగంగా మదనపల్లెను బీజేపీకి కేటాయించడమే ఓటమికి దారితీసిందని ఆ నియోజకవర్గ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ బీజేపీ బలం నాలుగు వేల ఓట్లకు మించదని, ఈ ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు రావడం వెనుక కార్యకర్తల కృషి ఉందని విశ్లేషించారు. తంబళ్లపల్లెలో సమీక్షపేరుతో సమావేశం ఏర్పాటు చేసి అభినందన సభగా మార్చారు. పుంగనూరులో అసలు సమీక్ష జరపలేదు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ నాయకులు రాజధానికి వెళ్లడంతో ఇక్కడ కూడా సమీక్ష జరగలేదు. -
దిగ్గజాలకు శృంగభంగం
చివరి ఎన్నికలు అనుకుంటే.. ఓటమి భారం పరాజయం పాలైన ముద్దుకృష్ణమ,అరుణకుమారి, కుతూహలమ్మ వారసులను రాజకీయాల్లోకి తెచ్చే యత్నంలో ముద్దు, కుతూహలమ్మను కుంగదీసిన ఓటమి అరుణమ్మకు ఊరటనిచ్చిన జయదేవ్ గెలుపు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు రాజకీయ దిగ్గజాలకు శృంగభంగం జరిగింది. వయసురీత్యా పోటీ చేసేందుకు ఇవే చివరి ఎన్నికలు అనుకుంటున్న సమయంలో ఆ ముగ్గురిని ఓటమి భారం కుంగదీసింది. సాక్షి, తిరుపతి: జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ముగ్గురి ఓటమి తీవ్రం గా కలచివేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముద్దుకృష్ణమ నాయుడు ఆరు దఫాలు, కుతూహలమ్మ, అరుణకుమారి నాలుగు దఫాలు శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయ ప్రవేశం నుంచి కాంగ్రెస్ వాదులుగా ఉంటూ వచ్చిన కుతూహలమ్మ, అరుణమ్మ ప్రత్యేక పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ముద్దుకృష్ణమ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ మధ్యలో రెండు దఫాలు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. వయస్సు పైబడుతుండటంతో వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఈ ముగ్గు రు నేతలు ఎన్నికల ముందు విశ్వప్రయత్నాలు చేశారు. అదృష్టం కలిసిరావడంతో గల్లా అరుణకుమారి తన కుమారుడు జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అక్కడ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ముద్దుకృష్ణమ నాయుడు, కుతూహలమ్మ కూడా తమ కుమారులకు ఈ ఎన్నికల్లో టికెట్టు ఇప్పించేందుకు చంద్రబాబును పలు దఫాలు కలసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రయోగాలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో చివరకు వారే రంగంలోకి దిగారు. వారికి పరాభవం తప్పలేదు. దశాబ్దం తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో తన ఓటమి ముద్దుకృష్ణమను మరింత బాధించినట్టు చెబుతున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితుల్లో వారసుల రాజకీయ భవిష్యత్తుపై వారిలో ఆందోళన నెలకొన్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ ముద్దుకృష్ణమ, కుతూహలమ్మ కోసం వారి కుమారులే ఎక్కువ శ్రమించారు. ఎనిమిది సార్లు పోటీ..ఆరుసార్లు ఎన్నిక ఎన్టీ.రామారావు చొరవతో 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం కొంతకాలం లక్ష్మీపార్వతి పార్టీలో కొనసాగారు. ఆ తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1983 నుంచి 94 వరకు జరిగిన నాలుగు శాసనసభ ఎన్నికల్లోనూ పుత్తూరు నుంచి ఆయన వరుసగా విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దయింది. అనూహ్య పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో టీడీపీ లో చేరి నగరి నుంచి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో తన వారసులను రంగంలోకి తీసుకురావాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక తానే పోటీ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు మాత్రం పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ వారసత్వాన్ని వదులుకుని.. మట్టికరచిన గల్లా కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పాటూరు రాజగోపాల్‌నాయుడు వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన గల్లా అరుణకుమారికి ఈ ఎన్నికలు కొంత మోదాన్ని కొంత ఖేదాన్ని కలిగించాయి. దశాబ్దాల అనుబంధం తెంచుకుని కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవే చివరివన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోవడం ఆవేదన కలిగించినప్పటికీ కుమారుడు జయదేవ్ గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం ఊరటనిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తండ్రి రాజగోపాల్‌నాయుడు చేసిన సేవలు గుర్తించి 1989లో అరుణకుమారికి చంద్రగిరి టికెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె స్వల్ప ఆధిక్యతతో శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. 1994లో ఒక్కసారి ఓడిపోయారు. అయితే రాష్ట్ర విభజన పరిణామాల్లో 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమె పలు మంత్రి పదవులను అలంకరించారు. రాజకీయాల నుంచి తప్పుకునే సమయంలో.. శాసనసభకు ఐదుసార్లు ఎన్నికైన గుమ్మడి కుతూహలమ్మకూ ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను రంగంలోకి తేవాలని భావిస్తున్న తరుణంలో ఆమెకు ఈ ఓటమి ఇబ్బందికరంగా మారింది. 1985లో తొలిసారి వేపంజేరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆమెను వరుస విజయాలు వరించాయి. 1994లో ఒక్కసారి ఆమెకు టికెట్టు దక్కలేదు. ఆ ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో వేపంజేరి నియోజకవర్గం రద్దయింది. కొత్తగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన గంగాధరనెల్లూరు నుంచి 2009లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. చివరి ఎన్నికలు అనుకుంటున్న తరుణంలో ఆమెను ఓటమి భారం కుంగదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా కూడా కొంతకాలం ఉన్నారు. -
సామాన్యుడి విజయం!
గల్లాను మట్టి కరిపించిన చెవిరెడ్డి పనిచేయని అరుణమ్మ ఎత్తుగడలు చంద్రగిరి, న్యూస్‌లైన్: రాజకీయ అనుభవం లేని వ్య క్తి.. ధన బలమూ లేని వ్యక్తి.. తాను నమ్మిన సి ద్ధాంతం కోసం ఎంత వరకైనా పోరాటం చేయగల యోధుడు... సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదురులేని విజయాలను సొంతం చేసుకుంటున్నాడు ఓ సామాన్య వ్యక్తి. రాజకీయ కురువృద్ధురాలు, సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం, అశేష ధన బలం ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో ఢీకొని మట్టి కరిపిం చాడు ఓ సామాన్య వ్యక్తి. వరుస విజయాలతో దూసుకెళుతున్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడిం చిన ఆ సామాన్యుడు చంద్రగిరిలో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సామాన్యుడే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. సేవ చేయాలనే తపన, నమ్ముకున్న వారి కోసం ప్రాణాలైనా ఇచ్చి కాపాడుకోవాలనుకునే తత్వంతో పాటు, విశ్వసనీయతను వైఎస్ కుటుంబం నుంచి సొంతం చేసుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ బలోపేతానికి చెవిరెడ్డి చేసిన కృషి మరువలేనిది. రాజకీయంగా, వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆయన వెనకడుగు వేయలేదు. నమ్ముకున్న కార్యకర్తల కోసం అండగా నిలబడ్డారు. ఢిల్లీలో రాజకీయ దిగ్గజం షీలాదీక్షిత్‌పై పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించిన సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్‌తో నియోజకవర్గ ప్రజలు చెవిరెడ్డిని పోలుస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం, మూడు పర్యాయాలు వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారిపై విజయం అంటే అంత ఆషామాషీ కాదు. అయినా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయాన్ని నమోదు చేసుకున్న చెవిరెడ్డిని నియోజకవర్గ ప్రజలు మరో ‘సామాన్యుడు’ అని మెచ్చుకుంటున్నారు. పనిచేయని ‘గల్లా’ ఎత్తుగడలు... సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని గల్లా అరుణకుమారి వేసిన రాజకీయ ఎత్తుగడలు ఓటర్ల ముందు బెడిసికొట్టాయి. తనతో పాటు కాంగ్రెస్ క్యాడర్ వెంట వస్తుందని, వారి ఓట్లన్నీ తనకే పడతాయని, ఇక టీడీపీ ఓట్లూ తనకేనని భావించిన గల్లా చంద్రగిరి ఎమ్మెల్యే బరిలోకి మరోసారి దిగారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తనతో పాటే వస్తుందని ఆశపడి పోటీకి దిగిన గల్లాకు చుక్కెదురైంది. ఆమెకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు రెండు పార్టీల ఓట్లు కలసినా ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాయి. ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆమెకు చెవిరెడ్డి చేతిలో ఓటమి తప్పలేదు. -
ఎన్నికకు ముందే టీడీపీ కార్యాలయం ఖాళీ!
-
ఆగని గల్లా గూండాల ఆగడాలు
నలుగురి కిడ్నాప్ చోద్యం చూస్తున్న అధికారులు చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి దౌర్జన్యాలు మితి మీరుతున్నాయి. శెట్టిపల్లిలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై స్వైరవిహారం చేసి గాయపరిచిన సంఘటన మరవకముందే మళ్లీ గల్లా గూం డాలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. చంద్రగిరి మండలం పనబాకం పంచాయతీ ఇరుగురంగయ్యగారిపల్లెలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై సోమవారం సాయంత్రం దాడులు చేశారు. కర్రలు, ఇనుపరాడ్లతో ఆటోను ధ్వంసం చేశారు. అందులో వెళుతున్న ఇద్దరిని చితకబాదారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సాయంత్రం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరుగురు గ్రామశివార్లలో మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఓ సుమోలో వచ్చిన గ్రామానికి చెందిన గల్లా అనుచరులు మురళి, ప్రేమ్‌కుమార్‌తోపాటు మరికొందరు ఆ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. మిగిలిన నలుగురిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాయపరిచి వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పక్కకు తీసుకెళ్లిన ఆ ఇద్దరు లోకేష్, చంద్రబాబులను కర్రలతో చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అక్కడే వదలి పరుగెత్తుకుంటూ అమరరాజా స్టిక్కర్ ఉన్న సుమోలో పారిపోయారు. బాధితులు ఆటోలో రుయాకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఆ నలుగురిని ఏంచేశారు? బాధితుల వివరాల మేరకు ఐ.రంగయ్యగారిపల్లికి చెందిన గల్లా అనుచరులు, వైఎస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ఉమాపతి, వెంకటేశ్, మునికృష్ణ, భానును టాటా సుమో లో కిడ్నాప్ చేశారు. వారిని అమరరాజ ఫ్యాక్టరీకే తరలించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకులను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీలో పనిచేస్తున్నారనే కారణంతో యువకులను కిడ్నాప్ చేసి, బంధించారని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. పాకాలలో ప్రచార రథంపై దాడి పాకాల మండలం కంబాలమిట్టలో ప్రచారం చేస్తున్న ప్రచార రథంపై గల్లా అనుచరులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ ఆమె అనుచరులు ప్రచార రథం డ్రైవర్ భవన్‌ను చితకబాదారు. అనుమతులు ఉన్న ప్రచార రథంలో పాటలు వేయవద్దంటూ, రథానికి ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దీనిపై పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టించుకోని అధికారులు మూడు రోజలుగా గల్లా అనుచరులు, అమరరాజ ఫ్యాక్టరీ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రచార రథాలు, కళాకారులపై దాడులు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలకు వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులపై గల్లా అరుణకుమారి తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు. అమరరాజ కంపెనీకి చెందిన వాహనాల్లో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీటిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు. -
గల్లా గూండాల ఫ్యాక్టరీని మూసేయాలి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బ్యాటరీల తయారీ మానేసి గూండాలను తయారు చేస్తున్న గల్లా అరుణకుమారి అమరరాజ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని శెట్టిపల్లె పంచాయతీ వైఎస్ఆర్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీ, బీటీఆర్ కాలనీ, మంగళం క్వార్టర్స్ ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరులు చెవిరెడ్డి హనుమంతరెడ్డి, చెవిరెడ్డి రఘు, పార్టీ నాయకులు రుద్రగోపి, లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రగోపి, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధికారంలో ఉండి వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీశాఖ భూములను గల్లా అరుణకుమారి దౌర్జన్యంగా ఆక్రమించారన్నారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవడం కోసం పార్టీ మారారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభంజనాన్ని తగ్గించి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో పార్టీ నాయకులు, కార్యకర్తలపై మంగళంలోని టీడీపీ నాయకులు, అమరరాజ ఉద్యోగులతో దాడులు చేయిస్తోందన్నారు. చంద్రగిరి ని యోజకవర్గంలో భాస్కర్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలుకుతుండడాన్ని చూసి ఓర్వలేక ఫ్యాక్టరీ ఉద్యోగులను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన పంచాయతీ మాజీ సర్పంచ్ మునికృష్ణ, వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడి గెలవాలని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు వి.గోపి, గాజుల రమణ, జయప్రకాష్, మహ్మద్‌కాశీం, ఓబుల్‌రెడ్డి, దాము, రమేష్, బ్రహ్మయ్య, శకుంతలమ్మ పాల్గొన్నారు. -
చంద్రగిరిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మాజీమంత్రి గల్లా అరుణ కుమారి అనుచరులు ఈ దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి రూరల్ మండలం లక్ష్మిగణపతి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ప్రచారం చేస్తున్న గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. ఇనుప రాడ్లు, మారణాయుధాలతో దాడి చేయడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఉమాపతి, రుద్రగోపి, శంకర్, లత తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. గల్లా అరుణ కుమారి అనుచరుల వల్ల తమకు ప్రాణ భయం వుందని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పొలీసులు సైతం గల్లా అరుణకుమారికే మద్దతుగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బొజ్జల, గల్లాకు చుక్కెదురు
ఈ ఇద్దరూ జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు. మంత్రిపదవులూ వెలగబెట్టారు. ఎన్నికలవగానే నియోజకవర్గాల ముఖం చూడడం మానేశారు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. తాజాగా ఎన్నికలు రావడంతో ఆ ఇద్దరు నేతలకు నియోజకవర్గాలు మళ్లీ గుర్తొచ్చాయి. ఓట్ల వేటలో భాగంగా ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిని నిలదీశారు. రేణిగుంట/చంద్రగిరి న్యూస్‌లైన్: ‘‘ఐదేళ్ల ముందు వచ్చావు..బోరు వేయిస్తానన్నావు..బాలబడి, గుడి, మురుగునీటి కాల్వలు నిర్మిస్తానన్నావు..అవేమీ చేయకుండా ఇప్పుడు వచ్చావు.. ఏమి మాట్లాడాలి నీతో.’’ అంటూ మాజీ మంత్రి, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మహిళలు నిలదీశా రు. బొజ్జల శనివారం రేణిగుంట మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కృష్ణాపురం నుంచి ఆయన ప్రచారం మొదలెట్టారు. ఆయన గ్రామంలో ఒకచోట కూర్చుని అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లవరం సమీపంలోని ఎల్ఎన్ కండ్రిగకు చేరుకున్న బొజ్జలను మహిళలు నిలదీశారు. గత ఎన్నికలప్పుడు గ్రామానికి వచ్చి బోలెడన్ని హామీలిచ్చారని, అప్పటి నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత గ్రామానికి ఓట్ల కోసం వచ్చారని నిలదీశారు. గ్రామానికి చెందిన జయంతి, ఏకదంతం, వాసంతి గ్రూపులకు చెందిన రాణెమ్మ, మునిలక్ష్మి, గౌరి, లక్ష్మమ్మలతోపాటు మరికొంత మంది మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. మహిళలు అడిగిన దానికి ఆయన సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని, ఏ పని కావాలన్నా జరిగిపోతుందని చెబుతూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. బొజ్జల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దిగువ మల్లవరం వెళ్లిన ఆయనకు పార్టీ నాయకులే సమస్యలు ఏకరువు పెట్టారు. ఇరవై ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకున్నారు. ఎన్నికలైన తర్వాత చూద్దాంలే అంటూ వెళ్లిపోయారు. అనంతరం ఆయన మల్లవరం, కుమ్మరపల్లె, సుబ్బయ్యగుంట, వెదళ్లచెరువు గ్రామాల్లో పర్యటించారు. గల్లాతో గ్రామస్తుల గలాట మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి తన సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం ఆమె పాకాల మండలం సామిరెడ్డిపల్లెకు వెళ్లారు. ఊహించని విధంగా గ్రామస్తులు ఎదురు తిరిగారు. ‘‘మేము వైఎస్ అభిమానులం, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాం. ఇప్పుడు నీదారి నువ్వు చూసుకున్నావు.. మేం ఎవరినైతే ఓడిం చామో వారితోనే చేతులు కలిపావు.. మా గ్రామంలోకి రావద్దు’’ అంటూ అడ్డుకున్నారు. గ్రామస్తుల వైఖరితో గల్లా కంగుతిన్నారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని భావించారు. తన వాహన శ్రేణిలో ఉన్న అనుచరులను, తమ ఫ్యాక్టరీ ఉద్యోగులను గ్రామస్తులపైకి ఉసిగొలిపారు. దీంతో వారు రెచ్చిపోయారు. గ్రామంలో సభ ఏర్పాటు చేయించారు. తమ అనుచరులు, తమ ఫ్యాక్టరీ సిబ్బందితో పెద్దఎత్తున నినాదాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయించారు. టపాకాయలు పేల్చి, గ్రామమంతా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తులు స్పందించారు. ఇలా చేయడం సరికాదని నిలదీశారు. దీంతో గల్లా గ్రామస్తులపై కన్నెర్రచేశారు. ‘‘మీరెవ్వరు నన్ను రావద్దనడానికి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆపై తిట్ల పురాణం అందుకున్నారు. ఈ నేపధ్యంలో గల్లా అనుచరులకు, గ్రామస్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో గల్లా వాహనం వెనుక అద్దం పగిలిపోయింది. దీంతో చిర్రెత్తిన గల్లా అనుచరులు గ్రామస్తులపై రాళ్లదాడికి దిగారు. కాసేపటికి గొడవ సద్దుమణగడంతో గల్లా అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంట తర్వాత గల్లా అనుచరులు, ఆమె ఫ్యాక్టరీ సిబ్బంది 300 మంది వరకు మళ్లీ గ్రామస్తులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తోటపల్లె రహదారిపై గల్లా, ఆమె అనుచరులు ధర్నా చేశారు. గంట పాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తుమ్మలగుంటలోనే ఎత్తుగడ తనను తుమ్మలగుంటలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీనాయకులు అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని చేసేందుకు గల్లా ఎత్తుగడ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రెండు రోజుల క్రితం తుమ్మలగుంటకు వచ్చారు. గ్రామ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టించారు. దీన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తారని, తద్వారా తనను తుమ్మలగుంట గ్రామంలో అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుట్రపన్నారు. ఈ విషయంపై గ్రామస్తులు స్పందించకపోవడంతో ఆమె వ్యూహం బెడిసికొట్టింది. -
అరుణమ్మా.. మజాకా!
‘దేశం’ కల్యాణ మండపంలో 27న పోస్టల్ బ్యాలెట్! చంద్రగిరి, న్యూస్‌లైన్ : చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వారి పోస్టల్ బ్యాలెట్‌ను ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా తెలుగుదేశం నేత కల్యాణమండపంలో నిర్వహించేలా చూసుకున్నారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు, ఇతర ఉద్యోగులకు సంబంధించి 600 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఓటూ కీలకంగా మారిన తరుణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈ ఓట్లపై కన్నేశారు. గుంపగుత్తగా ఈ ఓట్లన్నీ తనకే పడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేతకు చెందిన టీఎల్ఆర్ కల్యాణ మండపంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించేలా మంత్రాంగం నడిపారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 27న టీడీపీ నేత పీ.లవ్లీ రెడ్డి కల్యాణ మండపంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. గతంలోనూ పీవోల శిక్షణ తరగతులు ఇక్కడే నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్‌ను సైతం ఇదే కల్యాణ మండపంలో నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం వెనుక పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోనున్న 600 మంది ఉద్యోగుల వివరాలు శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రికి చేరాయని తెలిసింది. ఆమె ఫ్యాక్టరీ సిబ్బంది పోస్టల్ బ్యాలె ట్లోని ఉద్యోగులకు ఫోన్ చేసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నారు. ‘‘ఓటు కల్యాణ మండపంలో వేయండి.. పక్కనే ఉన్న పీఎల్ఆర్ క్యాండీ హోటల్లో భోజనం ఏర్పాటు చేశాం.. తినండి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో మీ కోసం కవర్ ఉంటుంది తీసుకెళ్లండి’’ అంటూ ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిపై కొందరు ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా చంద్రగిరిలో పెద్ద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం అందుబాటులో ఉన్నాయి. అయినా అధికారులు పోస్టల్ బ్యాలెట్ కోసం టీడీపీ వారి కల్యాణమండపం ఎంపిక చేయడం మాజీ మంత్రి కోసమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గల్లా అవినీతి డబ్బును కరిగించండి
అవకాశ రాజకీయవాదులను తరిమికొట్టండి స్థానికుడైన నాకు ఒక్క అవవాశం ఇవ్వండి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి, న్యూస్‌లైన్: గల్లా అరుణకుమారి అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని, ఆ అవినీతి డబ్బును ప్రజలే కరిగించాలని ప్రజలకు వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అగరాల, ఐతేపల్లె, ముంగిలిపట్టు, కల్రోడ్డుపల్లెల్లో టీటీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గల్లా అరుణకుమారి మన ఓట్లతో గెలిచి ప్రభుత్వ భూములు, చెరువులు, ఫారెస్ట్ భూములు, రైతుల పొలాలు, రోడ్లు, కాలువలను సైతం ఆక్రమించి ఫ్యాక్టరీలు పెట్టిందని గుర్తుచేశారు. కబ్జాలతో కోట్లు సంపాదించిన గల్లా ఆ డబ్బు ఎరచూపి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలో ఒక్క ఓవర్ బ్రిడ్జి లేకపోయినా కరకంబాడిలో ఫ్యాక్టరీ కోసం రూ.35 కోట్ల ప్రజాధనంతో ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించుకున్నారని మండిపడ్డారు. గల్లాను 3 పర్యాయాలు గెలిపిస్తే ప్రజల సమస్యలను విస్మరించి అక్రమంగా ఆస్తులను సంపాదించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్థానికుడైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా తాను తుడా చైర్మన్‌గా గ్రామాలను ఉన్నతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. ఓట్ల కోసం రాకముందే రూ.75 కోట్లతో సీసీ రోడ్లు, వైఎస్ఆర్ మహిళా భవనాలు నిర్మించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమేంద్రకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఏవీ రమణమూర్తి, ఐతేపల్లె సర్పంచ్ ఏసీ.శేఖర్, దేవారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కోటీశ్వర్‌రెడ్డి, మస్తాన్, అగరాల సర్పంచ్ సుభాన్, ఉప సర్పంచ్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు యశ్వంత్ చౌదరి, హేమాంబరనాయుడు, దేవరాజులనాయుడు, మాజీ సర్పంచ్ రవి, లాజర్, జయచంద్ర, దీనదయాల్ నాయుడు, రాజేంద్రనాయుడు, కల్రోడ్డు పల్లె ఉపసర్పంచ్ షణ్ముగం, టి. జయచంద్రారెడ్డి, టి. కృష్ణారెడ్డి, టి.రెడ్డెప్పరెడ్డి, పెద్ద ఎల్లప్పరెడ్డి, ఓ.జయచంద్రాశెట్టి, సుబ్రమణ్యంశెట్టి, మణికంఠ, సోమశేఖర్‌రెడ్డి, ఓ.యుగంధర్ తదితరులు ఉన్నారు. -
గల్లా హామీలన్నీ నీటి మూటలే
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పదేళ్లు మంత్రిగా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించి ఆ తర్వాత వాటిగురించి మరచిపోయారు. ప్రధానంగా మామిడి రైతులు ఉన్నారు. మ్యాంగోనగర్గా ఉన్న దామలచెరువు అభివృద్ధిని మరిచారు. మెరుగైన వైద్యం ప్రజలకు కలగా మారిపోయింది. కళ్యాణీ డ్యాంకు నీళ్లు తెప్పించి తీరుతానని హామీ ఇచ్చి పదేళ్లు అయినా నెరవేరలేదు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకున్నపాపాన పోలేదు. కలగా 100 పడకల ఆస్పత్రి చంద్రగిరి ప్రజలకు మెరుగైన వైద్యం కలగానే మిగిలిపోయింది. 2009 ఎన్నిక ల ప్రచారంలో భాగంగా పీఎల్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మూడు రోజుల్లో చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా ఆమె హామీని నెరవేర్చలేదు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా 100 పడకల ఆస్పత్రిగా మార్చలేదు. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదు. దామలచెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో 6 సంవత్సరాలుగా వైద్యులు లేరు. ఓట్లేసి గెలిపించండి, గెలిచిన వారంలోపు డాక్టర్‌ను నియమిస్తానని 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి హామీ ఇచ్చారు. గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు. బీడీ కార్మికులకు అండ ఇలాగేనా... చంద్రగిరిలో బీడీ కార్మికులకు గల్లా అరుణకుమారి పెద్ద ఎన్నికల వరం ప్రకటించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వం చేత బీడీలను కొనుగోలు చేసి లాభాల బాట పట్టిస్తానని చెప్పారు. గెలిచాక వారిని పట్టించుకోనేలేదు. అలాగే ఏనుగుల దాడుల్లో రైతులు పంటలు నష్టపోకుండా రంగంపేట, ఎర్రావారిపాళెం ప్రాంతాల్లో నెల రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని గతంలో చెప్పారు. దీనినీ ఇంతవరకు నెరవేర్చలేదు. కొయ్యబొమ్మలకు లెసైన్స్.. చంద్రగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో కొయ్యబొమ్మలు తయారు చేసేవారు ఉన్నారు. తనను గెలిపిస్తే టీటీడీ చైర్మన్‌తో మాట్లాడి కొయ్యబొమ్మలను విక్రయించేందుకు తిరుమలలో లెసైన్స్ ఇప్పిస్తానని 2004లోనే చెప్పారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు. డిగ్రీ కళాశాల పరిస్థితీ అంతే చంద్రగిరిలో డిగ్రీ కళాశాల ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని గల్లా అరుణకుమారి హామీ ఇచ్చి 10 ఏళ్లు అవుతున్నా నెరవేరలేదు. ‘కల్యాణీ’ నీళ్లు మనకే..? ‘మన కల్యాణి డ్యాం నీళ్లు మనేకే సొంతం... మనకు ఇచ్చిన తరువాతే తిరుమలకు, తిరుపతికి’ అంటూ మూడు పర్యాయాల ఎన్నికల్లో గల్లా గట్టిగా చెప్పారు. కల్యాణీ డ్యాం నీళ్లు తెప్పించి తీరుతానని శపథం చేశారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పట్టించుకోలేదు. అలాగే చంద్రగిరి నుంచి శ్రీనివాస మంగాపురానికి వెళ్లే రోడ్డును నాలుగు లేన్లుగా తీర్చి దిద్దుతానని ఇచ్చిన ఎన్నికల హామీ నేటికీ అమలు కాలేదు. మ్యాంగోనగర్ను మరిచారు దామలచెరువు మ్యాంగోనగర్లో అగ్నిప్రమాదం జరిగి మండీలన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన గల్లా అరుణకుమారి రైతులకు హామీల వర్షం కురిపించారు. శాశ్వత మండీలు కట్టిస్తానని చెప్పారు. ఇది కూడా నెరవేర్చలేదు. ఇలా ఆమె ఇచ్చిన హామీలు లెక్కలేననన్ని. అందుకే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు గల్లా అరుణకుమారి మాటలను నమ్మడం లేదు. అధ్వానంగా బస్టాండ్ చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లలేక పోతున్నారు. కుక్కలకు, పశువులకు నిలయంగా మారింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల హామీలో భాగం గా మాట ఇచ్చారు. నైట్ హాల్ట్ బస్సులు ఉంటాయన్నారు. ప్రతి బస్సు బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. టూరిజంహబ్చేస్తా చంద్రగిరి కోటను టూరిజం హబ్‌గా మారుస్తానని గల్లా అరుణకుమారి మంత్రి హోదాలో రెండుసార్లు ప్రజలకు హామీ ఇచ్చారు. కోటలో ఆడిటోరియం నిర్మిస్తానన్నారు. నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇవేవీ జరగలేదు. అలాగే కాణిపాకం వెళ్లే ప్రతి బస్సునూ పాకాలలో వెలసిన సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి తీసుకొస్తానని హామీ ఇచ్చి విస్మరించారు. పారిశుద్ధ్యం అధ్వానం ఈ సారి గెలిపిస్తే చంద్రగిరిని ఆదర్శంగా తీరిచదిద్దుతానంటూ 2004, 2009 ఎన్నికల ముందు నుంచి గల్లా అరుణకుమారి వాగ్దానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రగిరిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగునీటి కాలువలు సరిగా లేవు. మూడుసార్లు మంత్రిగా ఉన్న గల్లా మురుగు కాలువుల నిర్మాణం, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదు. -
మాజీ మంత్రిగారి భూ మాయ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూ మాయ లు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని బహుళ అంతస్తుల భవనం నిర్మించడం పై సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాలు గల్లా అరుణకుమారి కుటుంబం పరమయ్యా యి. కేవలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ వ్యవహారాలు నడిపినట్లు సమాచారం. ప్రధానంగా వీరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై కన్నేశారు. ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ అవసరాలకోసం కొనుగోలు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయించడం, ఆ తరువాత ఆ భూముల్లో గల్లా అనుచరులు, బంధువులు పాగావేసి అక్కడి రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు పూర్తిస్థాయిలో సహకరించాయని చెప్పవచ్చు. పూతలపట్టు పంచాయతీలోని సర్వే నెంబరు 328/1లో 2.51 ఎకరాలు పట్నం బాలసుబ్రమణ్యం అనే వ్యక్తికి బతుకుదెరువుకోసం ప్రభుత్వం పట్టా ఇచ్చింది. డీకేటీ పట్టా లు కేవలం అనుభవించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ చేసేందుకు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేస్తారు. భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి ప్రభుత్వ పరంగా సొమ్ము చెల్లిస్తారు. ఈ విషయంలో పేదలకు ఇచ్చిన భూములైనా సరే, ప్రభుత్వ అవసరాల కోసం ఇవ్వక తప్పదు. అందులో భాగంగా అప్పటి కలెక్టర్ 2005 డిసెంబర్ 9న ఈ ప్రాంతంలోని కొందరి భూములు ఏపీఐఐసీకి కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి వారి భూములకు పరిహారం ఇచ్చారు. బాలసుబ్రమణ్యంకు చెం దిన భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి, 2006 మార్చి 14న డబ్బు ఇచ్చివేసింది. అయితే అంతకు ముందే అంటే 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడు బాలసుబ్రమణ్యం వద్ద ఈ భూమిని కొనుగోలు చేసి పాకాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేదు. గతంలో అసైన్మెంట్ చట్టం ప్రకారం పట్టా పొందిన వ్యక్తి 20 ఏళ్ల తరువాత తహశీల్దార్ వద్ద ఎన్వోసీ తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆ చట్టాన్ని పదేళ్ల క్రితం ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములకు ఎన్వోసీలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం లేదు. అయితే గల్లా అరుణకుమారి మంత్రి కావడంతో ఆమె చెప్పినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తలూపారు. సుబ్రమణ్యం వద్ద నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. సుబ్రమణ్యానికి అవార్డ్ ఎలా పాసైంది? సుబ్రమణ్యం తన భూమిని (డీకేటీ) 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇదే భూమికి 2006 మార్చి 14న 6/2005-06 నెంబరుతో అవార్డ్ పాస్ చేశారు. అంటే గల్లా రామచంద్రనాయుడు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం పరిశీలించకుండా సుబ్రమణ్యానికి డబ్బు చెల్లించింది. ప్రభుత్వం ఎలా చేసింది? ఎందుకు చేసింది? ఎవరు ఇలా చేయమన్నారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కలెక్టర్ వీటిపై సమగ్రమైన విచారణ కు ఆదేశించాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాలు గా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్న వారు లేరు. కొనడానికి వారెవరు? అమ్మడానికి వీరెవరు? ప్రభుత్వం పేదలకు సాగుకోసం భూములు ఇస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ హక్కులేదు. ఒక వేళ ఏ పేదవాడైనా ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మితే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా లేదు. అయితే మాజీ మంత్రి కుటుంబం వరకు వచ్చే సరికి అన్నీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని.. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని గల్లా అరుణకుమారి వందల ఎకరాల భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారికి అనుకూలంగా ఉన్నాయనుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకోసం కావాలంటూ ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆ తరువాత ఏపీఐఐసీ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఏపీఐఐసీకి ఇచ్చే బదులు తమకు ఇస్తే వారికంటే ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామంటూ పేదలను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. ఒకసారి ఏపీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చి, అవార్డ్ పాస్ చేసిన భూములను కూడా స్వాధీనం చేసుకున్నారంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
సీబీఐ ఉచ్చులో ‘గల్లా’
సాక్షి ప్రతినిధి, తిరుపతి; మాజీ మంత్రి, చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. త్వరలోనే గల్లా అరుణకుమారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి విచారణచేయాలన్న ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మా ర్ టౌన్‌షిప్‌కు డబ్బు తీసుకుని ఏపీఐఐసీ అప్పగించిన భూమిని గల్లా అరుణకుమారి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న సీబీఐ ప్రత్యేకంగా దర్యాప్తు చేయనుంది. మంత్రిగా గల్లా పలు ప్రాంతాల్లో ఏపీఐఐసీ ద్వారా పలు నోటిఫికేషన్లు ఇప్పించి కొద్దిరోజుల తరువాత ఆ భూములను తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా దర్యాప్తు చేయనున్నారు. అవార్డీ భూములను ఎలా కొంటారు ?.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లెలో ఎమ్మార్‌కు 258.36 ఎకరాల ప్రభుత్వ భూమి ని ఏపీఐఐసీ ద్వారా నారా చంద్రబాబునాయుడు ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అవార్డీ కూడా ఇచ్చింది. అంటే ఎమ్మార్‌కు భూమిని అప్పగించిన తరువాత ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏపీఐఐసీ వారు తీసుకున్నారు. కాగా ఈ భూమిలో సర్వే నెంబరు 27/4లో 2.20 ఎకరాలు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, ఆమె కుమార్తె రమాదేవి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారు. అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడికి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారు స్వాధీనం చేశారు. ఈ స్థలంలో అపార్ట్మెంట్ కట్టేందుకు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అధికారుల నుంచి అనుమతులు వచ్చాయి. ఇందులో మూడంతస్తుల భవన నిర్మాణం సైతం జరిగింది. ఒక సంస్థకు అవార్డీ అయిన భూములను మరొకరు ఎలా కొనుగోలు చేస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పరిశీలన లేకుండానే రికార్డుల్లో పేర్ల మార్పు.. 1995లో ఎస్.అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జీ.బలరామిరెడ్డి అనే వ్యక్తుల వద్ద ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ కాపీలు చూపించారు. అంతకుముందే ఈ భూమిని ఏపీఐఐసీ వారు ఎమ్మార్‌కు అమ్మడం ద్వారా అవార్డ్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు ఎమ్మార్ నుంచి డబ్బు తీసుకుని స్వాధీనం చేశారు. ప్రభుత్వం సంస్థ వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఎమ్మార్‌కు ఇవ్వదనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఆ భూములు తమవేనని మంత్రి చెబితే అధికారులు నమ్మారు. మంత్రి తన పలుకుబడిని ఉపయోగించి అప్పటి శేరిలింగంపల్లె తహశీల్దార్ జి.సుబ్బారావు ద్వారా 2008 ఫిబ్రవరిలో మ్యుటేషన్(రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పులు)కు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులోనూ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి.విచారించకుండానే నిర్మాణానికి ఉత్తర్వులు.. 2009లో అపార్ట్మెంట్ కట్టుకునేం దుకు గల్లా రామచంద్రనాయుడు దరఖాస్తు చేయగా, ఎటువంటి విచారణ చేయకుం డానే నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మూడు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, జీహెచ్ఎంసీ అధికారులు దోషులు కాబోతున్నారు. ఎమ్మార్ కేసులో విచారణ చేసిన సమయంలో సీబీఐ గల్లా కుటుంబ సభ్యులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలో గల్లా మంత్రిగా గల్లా అరుణకుమారి అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించారని, వీటిపై విచారణ చేయాలంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని నల్లగట్లపల్లెకు చెందిన గల్లా పురుషోత్తం నాయుడు ప్రజాప్రయోజనం కింద సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విచారించాల్సిందిగా సీబీఐని ఆదేశించడంతో ఎమ్మార్ భూముల వ్యవహారంలో గల్లా పాత్ర వెలుగులోకి వచ్చింది. కాగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన అక్రమాలు, భూ ఆక్రమణలు, అన్యాయంగా పలువురి నుంచి బలవంతంగా లాక్కున్న భూముల వ్యవహారం కూడా ఈ విచారణ ద్వారా బయటకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గల్లా అరుణకుమారి మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కొన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించారని, కొన్ని చోట్ల ఎంతో మందిని బెదిరించి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె కంపెనీలకు సంబంధించిన ప్రదేశాల్లో వేల ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆధారాలు కూడా కొందరు బయటకు తీస్తున్నారు. అక్రమంగా వేల ఎకరాల భూములు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైందని, త్వరలోనే విచారణకు వస్తుందని గాలి పురుషోత్తం నాయుడు తెలిపారు. -
పేదల ఇళ్లపై గల్లా డేగ!
కూల్చిన ఇళ్ల మీదుగా ఫ్యాక్టరీకి దారి చుట్టుపక్కల పొలాలు,డీకేటీ భూముల ఆక్రమణ చస్తూ బతుకుతున్న లక్ష్మీపురం గ్రామస్తులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాపం పుణ్యం, మంచీ చెడ్డ మాజీ మంత్రికి పట్టవు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను అనుకున్నది జరగాల్సిందే. ఏ అధికారి అయినా, ఏ పేదవాడైనా తన మాటకు ఓకే అనాల్సిందే. పేదలకు బతుకునిస్తున్న డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములను ఆక్రమించడమో, నయానో భయానో స్వాధీనం చేసుకోవడమే కాదు.. పేదలు తలదాచుకునే ఇళ్లను సైతం కూలగొట్టించి తమ ఫ్యాక్టరీకి దారి వేసుకున్నారు. ఒక పక్క డబ్బు, మరోపక్క అధికార బలం ఉన్న మాజీ మంత్రిని ఎదిరించలేక తొమ్మిది కుటుం బాలు ఊరొదిలి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ జీవిస్తున్న వారు సైతం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గూండా లు తమ ఇళ్లు ఎప్పుడు కూల్చేస్తారోనని భయంతో కాలం గడుపుతున్నారు. ఇదంతా పూతలపట్టు మండలం లక్ష్మీపురంలో జరుగుతోంది. క్ష్మీపురం గ్రామంలోని 42 మంది పేదలకు వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కొందరు ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. గ్రామానికి సమీపంలో తమకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో లలితమ్మ, ఈశ్వరి, లక్ష్మి, జమున, గౌరమ్మ, చంద్రమ్మ, కాంతమ్మ, దేవమ్మ, జమున 2009-10లో ఇళ్లు నిర్మించుకున్నారు. లక్ష్మీపురానికి పక్కనే ఉన్న కొన్ని భూములను గల్లా అరుణకుమారి తమ గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీ కోసం అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. నయానో భయానో అక్కడున్న డీకేటీ భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీకి రోడ్డు మార్గం లేదా? ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ఏ వైపు నుంచి అయినా రోడ్డు వేసుకునే అవకాశం ఉంది. అయితే, కాలనీ మీదుగా రోడ్డు నిర్మిస్తే వారంతా దూరంగా వెళతారని, ఇక ఫ్యాక్టరీకి ఎటువంటి అడ్డంకులు ఉండవనేది గల్లా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో గల్లా వర్గీయులు తొమ్మిది మంది పేదల ఇళ్లు కూల్చివేశారు. తరువాత లలితమ్మకు రూ.7లక్షలు, ఈశ్వరికి రూ. 2.5 లక్షలు, లక్ష్మికి లక్ష చొప్పున డబ్బు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వలేదు. ఇక్కడున్న కొంతమంది వడ్డెర్ల గుడారాలను ఖాళీ చేయించారు. గూండాల భయంతో దొరస్వామి అనే వ్యక్తి ఇల్లు నిర్మించేందుకు వేసుకున్న పునాదులను వదిలి తిరుపతికి వెళ్లి పోయాడు. లలితమ్మ, ఈశ్వరి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ రోడ్డును ఆక్రమించారు చిత్తూరు- కడప జాతీయ రహదారి నుంచి గల్లాఫుడ్స్ ఫ్యాక్టరీ మీదుగా లక్ష్మీపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది. 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును ఫ్యాక్టరీలోకి కలుపుకున్నారు. దీని పక్కన మరో 20 అడుగుల కొత్తరోడ్డు వేసేందుకు స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో కొత్తరోడ్డు వేస్తూ పాతరోడ్డును తవ్వేసే కార్యక్రమాన్ని 2011 మే 23 రాత్రి చేపట్టారు. దీనిని లక్ష్మీపురం గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టడంతో తాత్కాలికంగా కొత్తరోడ్డు నిర్మాణాన్ని ఆపివేశారు. తరువాత రోడ్డువేయడంపై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే పేదోళ్ల గుడిసెలు కూల్చిన ప్రాంతంలో మాత్రం రోడ్డు వేశారు. రైతుల భూములు స్వాహా... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 299/1ఎలో 1.65 ఎకరాలు, 1బిలో 2.02 ఎకరాలు, 227/1ఎలో 32 సెంట్లు, 1బీలో 52 సెంట్లు, 2ఎ1లో 68సెంట్లు, 2ఎ2లో 68సెంట్లు, 2బిలో 1.3 ఎకరాలు, 2సీలో 3.74ఎకరాలు, 327/3లో 1.5 ఎకరాలు, 327/4లో 1.07 ఎకరాలు, 1240/1లో 4.75 ఎకరాలు, 1241లో 4.68 ఎకరాలు, 1246/1లో 4.09 ఎకరాలు, 1246/2డీలో 1.11 ఎకరాలు, 1246/2బీలో 0.6 ఎకరాలు, 1247/2ఐలో 0.94ఎకరాలు, 1247/2జేలో 1.45 ఎకరాలు, 2264లో 4.20 ఎకరాలు, 1238లో 2.01ఎకరాలు, 1239లో 4.24 ఎకరాలు, 1265/2లో 1.16 ఎకరాలు, 1265/3ఏలో 0.58 ఎకరాల రైతుల భూములను గల్లా రామచంద్ర నాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రైతులు ఆరోపించారు. తమ భూములను ఏపీఐఐసీ కి అమ్మినట్లు, వారు గల్లా ఫుడ్స్‌కు విక్రయించినట్లు రికార్డులు సృష్టించారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ కోసం రైతుల్లో కొందరు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిం ది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లోని అడంగళ్లలో పైన ఉదహరించిన సర్వే నెంబర్లలోని భూముల అనుభవదారులుగా రైతుల పేర్లు ఉన్నాయి. మొత్తం 44.87 ఎకరాల ప్రైవేట్ భూమిని అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలు గల్లా ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇంకా కోర్టు నిర్ణయం వెల్లడికాలేదు. ఈ భూములను ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారుకాగానే 2010 సెప్టెంబర్ 7న వ్యవసాయ పొలాలు ఇండస్ట్రీ కిందకు కన్వర్షన్ అయ్యాయి. పశువుల బీళ్లను, శ్మశానాన్నీ వదల్లేదు... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని 323 సర్వే నెంబరులో 4.10 ఎకరాల రోడ్డు, 3.25 ఎకరాల శ్మశాన స్థలం, పశువుల బీడుగా ఉన్న 2.03 ఎకరాలను కూడా ఆక్రమించారు. ఈ భూములన్నింటినీ సక్రమంగానే కొనుగోలు చేశామనే విధంగా డాక్యుమెంట్లు సృష్టించారు. అటవీ భూములనే లాక్కున్న వారికి సాధారణ భూములు లాక్కోవడం లెక్కలోది కాదనే విషయం సుస్పష్టమే. ఏపీఐఐసీ వారు ఇచ్చిన భూమి 521 ఎకరాలు ఫ్యాక్టరీ అవసరాల పేరు చెప్పి పలువురి నుంచి అక్రమంగా లాక్కున్న భూముల్లో ఏపీఐఐసీ వారు గల్లా ఫ్యాక్టరీకి 521 ఎకరాల భూమిని ఇచ్చారు. ఏపీఐఐసీ రికార్డులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో 341.22ఎకరాలు డీకేటీ భూములు ఉండగా 180.54 ఎకరాల ప్రభుత్వ సాధారణ భూములున్నాయి. -
మాజీ మంత్రిగారి భూమాయ!
తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న గల్లా భూదందాలు ఏపీఐఐసీని అడ్డం పెట్టుకుని డీకేటీ భూముల స్వాహా సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూమాయలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని బహుళ అంతస్తుల భవనం నిర్మించడం పై సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాలు గల్లా అరుణకుమారి కుటుంబం పరమయ్యా యి. కేవలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ వ్యవహారాలు నడిపినట్లు సమాచారం. ప్రధానంగా వీరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై కన్నేశారు. ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ అవసరాలకోసం కొనుగోలు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయించడం, ఆ తరువాత ఆ భూముల్లో గల్లా అనుచరులు, బంధువులు పాగావేసి అక్కడి రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు పూర్తిస్థాయిలో సహకరించాయని చెప్పవచ్చు. పూతలపట్టు పంచాయతీలోని సర్వే నెంబరు 328/1లో 2.51 ఎకరాలు పట్నం బాలసుబ్రమణ్యం అనే వ్యక్తికి బతుకుదెరువుకోసం ప్రభుత్వం పట్టా ఇచ్చింది. డీకేటీ పట్టా లు కేవలం అనుభవించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ చేసేందుకు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేస్తారు. భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి ప్రభుత్వ పరంగా సొమ్ము చెల్లిస్తారు. ఈ విషయంలో పేదలకు ఇచ్చిన భూములైనా సరే, ప్రభుత్వ అవసరాలకోసం ఇవ్వక తప్పదు. అందులో భాగంగా అప్ప టి కలెక్టర్ 2005 డిసెంబర్ 9న ఈ ప్రాంతంలోని కొందరి భూములు ఏపీఐఐసీకి కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి వారి భూములకు పరిహారం ఇచ్చారు. బాలసుబ్రమణ్యంకు చెందిన భూమినికూడా ప్రభుత్వం కొ నుగోలుచేసి, 2006 మార్చి 14న డబ్బు ఇచ్చింది. అయితే అంతకు ముందే అంటే 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడు బాలసుబ్రమణ్యం వద్ద ఈ భూమిని కొనుగోలు చేసి పాకాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేదు. గతంలో అసైన్మెంట్ చట్టం ప్రకారం పట్టా పొందిన వ్యక్తి 20 ఏళ్ల తరువాత తహశీల్దార్ వద్ద ఎన్వోసీ తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆ చట్టాన్ని పదేళ్ల క్రితం ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములకు ఎన్వోసీలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం లేదు. అయితే గల్లా అరుణకుమారి మంత్రి కావడంతో ఆమె చెప్పినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తలూపారు. సుబ్రమణ్యం వద్ద నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. సుబ్రమణ్యానికి అవార్డ్ ఎలా పాసైంది? సుబ్రమణ్యం తన భూమిని (డీకేటీ) 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇదే భూమికి 2006 మార్చి 14న 6/2005-06 నెంబరుతో అవార్డ్ పాస్ చేశారు. అంటే గల్లా రామచంద్రనాయుడు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం పరిశీలించకుండా సుబ్రమణ్యానికి డబ్బు చెల్లించింది. ప్రభుత్వం ఎలా చేసింది? ఎందుకు చేసింది? ఎవరు ఇలా చేయమన్నారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కలెక్టర్ వీటిపై సమగ్రమైన విచారణకు ఆదేశించాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్న వారు లేరు. కొనడానికి వారెవరు? అమ్మడానికి వీరెవరు? ప్రభుత్వం పేదలకు సాగుకోసం భూములు ఇస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ హక్కులేదు. ఒక వేళ ఏ పేదవాడైనా ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మితే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా లేదు. అయితే మాజీ మంత్రి కుటుంబం వరకు వచ్చే సరికి అన్నీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని.. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని గల్లా అరుణకుమారి వందల ఎకరాల భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారికి అనుకూలంగా ఉన్నాయనుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకోసం కావాలంటూ ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆ తరువాత ఏపీఐఐసీ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఏపీఐఐసీకి ఇచ్చే బదులు తమకు ఇస్తే వారికంటే ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామంటూ పేదలను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. ఒకసారి ఏపీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చి, అవార్డ్ పాస్ చేసిన భూములను కూడా స్వాధీనం చేసుకున్నారంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
సీబీఐ ఉచ్చులో గల్లా
ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ మాజీ మంత్రి గల్లా కుటుంబసభ్యులపై విచారణ చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశంతో కలకలం కుటుంబసభ్యులందరూ ఈ భూదందాలో భాగస్వాములే : గాలి పురుషోత్తం నాయుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ మంత్రి, చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణకుమారి సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. త్వరలోనే గల్లా అరుణకుమారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి విచారణచేయాలన్న ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మా ర్ టౌన్‌షిప్‌కు డబ్బు తీసుకుని ఏపీఐఐసీ అప్పగించిన భూమిని గల్లా అరుణకుమారి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న సీబీఐ ప్రత్యేకంగా దర్యాప్తు చేయనుంది. మంత్రిగా గల్లా పలు ప్రాంతాల్లో ఏపీఐఐసీ ద్వారా పలు నోటిఫికేషన్లు ఇప్పించి కొద్దిరోజుల తరువాత ఆ భూములను తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా దర్యాప్తు చేయనున్నారు. అవార్డీ భూములను ఎలా కొంటారు ? రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లెలో ఎమ్మార్‌కు 258.36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా నారా చంద్రబాబునాయుడు ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అవార్డీ కూడా ఇచ్చింది. అంటే ఎమ్మార్‌కు భూమిని అప్పగించిన తరువాత ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏపీఐఐసీ వారు తీసుకున్నారు. కాగా ఈ భూమిలో సర్వే నంబరు 27/4లో 2.20 ఎకరాలు గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్, ఆమె కుమార్తె రమాదేవి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారు. అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడికి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారు స్వాధీనం చేశారు. ఈ స్థలంలో అపార్ట్మెంట్ కట్టేందుకు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అధికారుల నుంచి అనుమతులు వచ్చాయి. ఇందులో మూడంతస్తుల భవన నిర్మాణం సైతం జరిగింది. ఒక సంస్థకు అవార్డీ అయిన భూములను మరొకరు ఎలా కొనుగోలు చేస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పరిశీలన లేకుండానే రికార్డుల్లో పేర్ల మార్పు 1995లో ఎస్.అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జీ.బలరామిరెడ్డి అనే వ్యక్తుల వద్ద ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ కాపీలు చూపించారు. అంతకుముందే ఈ భూమిని ఏపీఐఐసీ వారు ఎమ్మార్‌కు అమ్మడం ద్వారా అవార్డ్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు ఎమ్మార్ నుంచి డబ్బు తీసుకుని స్వాధీనంచేశారు. ప్రభుత్వం సంస్థవద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఎ మ్మార్కు ఇవ్వదనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఆ భూములు తమవేనని మంత్రి చెబితే అధికారులు నమ్మారు. మంత్రి తన పలుకుబడిని ఉపయోగించి అప్పటి శేరిలింగంపల్లె తహశీల్దార్ జి.సుబ్బారావు ద్వారా 2008 ఫిబ్రవరిలో మ్యుటేషన్(రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పులు)కు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులోనూ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలో గల్లా మంత్రిగా గల్లా అరుణకుమారి అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించారని, వీటిపై విచారణ చేయాలంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని నల్లగట్లపల్లెకు చెందిన గల్లా పురుషోత్తం నాయుడు ప్రజాప్రయోజనం కింద సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విచారించాల్సిందిగా సీబీఐని ఆదేశించడంతో ఎమ్మార్ భూముల వ్యవహారంలో గల్లా పాత్ర వెలుగులోకి వచ్చింది. కాగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన అక్రమాలు, భూ ఆక్రమణలు, అన్యాయంగా పలువురి నుంచి బలవంతంగా లాక్కున్న భూముల వ్యవహారం కూడా ఈ విచారణ ద్వారా బయటకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గల్లా అరుణకుమారి మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కొన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించారని, కొన్ని చోట్ల ఎంతో మం దిని బెదిరించి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె కంపెనీలకు సంబంధించిన ప్రదేశాల్లో వేల ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా స్వాధీ నం చేసుకున్న ఆధారాలు కూడా కొందరు బయటకు తీస్తున్నారు. అక్రమంగా వేల ఎకరాల భూము లు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైందని, త్వరలోనే విచారణకు వస్తుందని గాలి పురుషోత్తం నాయుడు తెలిపారు. విచారించకుండానే నిర్మాణానికి ఉత్తర్వులు 2009లో అపార్ట్మెంట్ కట్టుకునేందుకు గల్లా రామచంద్రనాయుడు దరఖాస్తు చేయగా, ఎటువంటి విచారణ చేయకుండానే నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం మూడు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, జీహెచ్ఎంసీ అధికారులు దోషులు కాబోతున్నారు. ఎమ్మార్ కేసులో విచారణ చేసిన సమయంలో సీబీఐ గల్లా కుటుంబ సభ్యులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. -
గల్లాపై ఆరోపణలు: దర్యాప్తునకు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమి నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చెందిన భూమిని మినహాయించడంతో పాటు మ్యూటేషన్ ప్రక్రియలో అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సీబీఐ ఎస్పీని మంగళవారం ఆదేశించారు. గల్లా అరుణకుమారితో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని హైదరాబాద్‌కు చెందిన గాలి పురుషోత్తమనాయుడు కోర్టులో పిటిషన్ వేశారు. అరుణ భర్త రామచంద్రనాయుడు, కుమారుడు జయదేవ్ కుమార్తె రమాదేవి సహా అప్పటి ఏపీఐఐసీ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
అరుణమ్మపై సీనియర్ల గుర్రు
సాక్షి, తిరుపతి: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఆ పార్టీ సీనియర్ల జంట గుర్రుగా ఉంది. సొంత నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలో తప్పితే జిల్లా లో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ ఒకటిగా వెళ్లే ఈ సీనియర్లు పార్టీలో అరుణమ్మ చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో గల్లా కుటుం బానికి అంతోఇంతో పేరుంది. దీంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. నిన్నటి వరకు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో భవిష్యత్తులో అధినేత చంద్రబాబు దగ్గర తమ ప్రాధాన్యం తగ్గుతుంద నేది సీనియర్లయిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల ఆందోళనగా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఆ వర్గాలు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ మేర కు అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మనసు మార్చుకుని గుంటూరు నుం చి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కుమారుని రాజకీ య భవిష్యత్తు దృష్ట్యా గల్లా అరుణకుమారి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏడాది కాలంగా నడుస్తున్నప్పటికీ బొజ్జల గాని ముద్దుకృష్ణమ గాని గల్లా చేరికపై పెదవి విప్పలేదు. రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు అరుణకుమారి ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు సీనియర్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా వారి చేరిక సమయంలోనూ జిల్లా పార్టీలో కీలకం గా వ్యవహరిస్తున్న బొజ్జల, ముద్దుకృష్ణమ లేరు. ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిసింది. అరుణకుమారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు విమర్శించిన నోటితోనే ఆమెను ప్రశంసిస్తూ ఆహ్వానం పలకడమంటే ప్రజల్లో చులనభావం ఏర్పడే ప్రమాదం ఉన్నందునే తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని సీనియర్లు అక్కడక్కడ మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి వారి గైర్హాజరు వెనుక ఉన్న అసలు విషయం వీలైనం త వరకు అరుణమ్మకు దూరంగా ఉండాలన్న అభిప్రాయమని తెలిసిం ది. టీడీపీలో చేరిన తర్వాత కూడా ముగ్గురు మాజీ మంత్రులు ఒక వేదికపైకి వచ్చిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అంతర్గతంగా రగిలిపోతున్నట్టు సమాచారం. ఒకే సామాజికవర్గం కావడంతో తన అవకాశాలను అరుణమ్మ ఎక్కడ ఎగరేసుకుపోతారోనన్న ఆందోళన ఆయనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఒకటిగా ఉంటూ వస్తున్న ముద్దుకృష్ణమ, గోపాలకృష్ణారెడ్డి ఇదే ఐక్యత కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది. ఎవరి అవకాశాలకు అరుణమ్మ గండికొట్టే ప్రయత్నం చేసినా ఇద్దరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని వారు భావిస్తున్నారు. చంద్రగిరిలో అరుణమ్మకు పొగబెట్టే ప్రయత్నం? చంద్రగిరి నియోజకవర్గంలో అరుణకుమారికి పొగబెట్టేప్రయత్నం జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముద్దుకృష్ణమనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు అరుణమ్మకు ఏ మాత్రం సహకరించడంలేదు. ఈ నియోజకవర్గ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న పేరం హరిబాబు, వలపల దశరథనాయుడు తదితరులను తెరవెనుక నుంచి ముద్దుకృష్ణమ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అరుణమ్మ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు రావడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఎంపీ శివప్రసాద్పైనా సీనియర్ల ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి పూర్థిస్థాయిలో సహకారం అందిస్తున్న చిత్తూరు లోక్‌సభ సభ్యులు ఎన్.శివప్రసాద్‌పై కూడా శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు దగ్గర సొంత ఇమేజ్ పెంచుకునేందుకు అవసరానికి మించి శివప్రసాద్ వ్యవహరిస్తున్నారనే భావన ఇద్దరు సీనియర్లలో ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో అరుణమ్మ చేరిక వ్యవహారం ఒక వర్గానికి ఇబ్బందికరంగా ఉందనేది మాత్రం స్పష్టం అవుతోంది. -
'కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్'
గుంటూరు: తనను ఆదరించిన టీడీపీ కార్యకర్తలకు, అభిమానిస్తున్న ప్రజలకు పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. నందమూరి, కృష్ణ, మహేష్ అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు లోక్‌సభ స్థానానికి సంబంధించిన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపకల్పన చేశానని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీయిచ్చారు. మిర్చి, పత్తి దిగుబడి మరింత పెరిగేందుకు, రైతులకు గిట్టుధర కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బృందావన్ గార్డెన్స్‌లో ఓ ఇల్లు కూడా తీసుకున్నారు. జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. -
చంద్రగిరి మండలంలో గల్లా ఖాళీ
చంద్రగిరి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రగిరి మండలంలోని ఆమె అనుచరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో చంద్రగిరిలో అరుణకుమారి వర్గం ఖాళీ అయింది. ఆదివారం మండల కాంగ్రెస్ యువత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. దీంతో పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో మండలాన్ని శాసించిన హేమా హేమీలంతా వైఎస్ఆర్సీపీలో చేరడంతో పార్టీ నూతనోత్సాహంతో కదం తొక్కుతోంది. దాంతో తనకు టికెట్టు ఇస్తే కాంగ్రెస్ క్యాడర్ అంతా తన వెంటే వస్తుందని చెప్పుకుంటున్న గల్లాకు చుక్కెదురైంది. గల్లాను వ్యతిరేకిస్తున్న టీడీపీలోని ఒకరిద్దరు నాయకులు సైతం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఎక్కువ. అందుకే టీడీపీలోకి రావాలని గల్లా ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. గల్లా అరుణకుమారి టీడీపీలోకి వస్తే ఆమె అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీ కేడర్అంతా తమ పార్టీలోకి వస్తుందని భావించిన చంద్రబాబుకు చుక్కెదురైంది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు కాంగ్రెస్ క్యాడర్‌ను వైఎస్ఆర్సీపీలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ ఎత్తుగడల్లో భాగం గానే గల్లాకే చంద్రగిరి టీడీపీ టికెట్టు అని తమ నాయకులతో అందరికి చెప్పించా రు. అయినా ఫలితం లేదు. -
కాంగ్రెస్ ఖాళీ !
చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఇతర పార్టీలకు వలసపోతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధం తెంచుకుంటున్నారు. ఎంతోమందికి రాజకీయభిక్ష పెట్టిన ఈ పార్టీ ఉనికి ఇప్పుడు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిందంటే ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. నిన్నటివరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీని ఆవిర్భావించబోతుండగా, మంత్రిగా వ్యవహరించిన గల్లా అరుణకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ ఉద్ధండులుగా పేరొంది మూడు నుంచి నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికైన రెడ్డివారి చెంగారెడ్డి, సీకే బాబు, గుమ్మడి కుతూహలమ్మ తోపాటు కిందటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎన్నికైన డాక్టర్ రవి, షాజహాన్ బాషా వంటి నాయకులు కూడా పెట్టేబేడా సర్దుకుంటున్నారు. జనతా, తెలుగుదేశం పార్టీ ప్రభంజనాలను కూడా తట్టుకుని జిల్లాలో పట్టు నిలుపుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రస్తుతం రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో నేతలు ఇతర పార్టీలకు వరుసగా వలసబాట పడుతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా పేరున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా దొరికే పరిస్థితి లేదు. అత్యధిక మండలాల్లో ఆ పార్టీకి కార్యకర్తలు కూడా లేరు. ఇప్పుడున్న పరిస్థితులు పరిశీలిస్తే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో తిరుపతి లోక్‌సభ సభ్యులు చింతా మోహన్ పెద్ద దిక్కు కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవలనే అమాస రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని ఎర్రావారిపాళెం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు కంచన వేణుగోపాల్‌రెడ్డితో భర్తీ చేయాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి పట్టిందంటే జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు అభ్యర్థులు కరువు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం మొదలు కుప్పం వరకు 14 అసెంబ్లీ స్థానాలకు ఒక్కచోట కూడా కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేసి ప్రథమశ్రేణి నాయకులుగా గుర్తింపు పొందిన వారు కనిపించడం లేదు. ఆ పార్టీ ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ను ఛీ కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగితే రాజకీయంగా మనుగడ ఉండదని ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదం తరువాత చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు మొగ్గు చూపిన ప్పటికీ ఖాళీ లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తన దారి తాను చూసుకునేలా ఉన్నారు. సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి మూడేళ్ల కిందటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయింది. నగరిలో రెడ్డివారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ పార్టీ మారే యోచనలో ఉన్నారు. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ జెడ్పీ చైర్పర్సన్, రాష్ట్ర మంత్రి, శాసనసభ డెప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. చిత్తూరులో నాలుగు దఫాలు (ఒకసారి ఇండిపెండెంట్, అప్పట్లో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి లేరు) ఎమ్మెల్యేగా ఎన్నికైన సీకే.జయచంద్రారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఎటు వెళ్లాలో ఇంకా తేల్చుకోలేదు. పూతలపట్టు, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో స్పష్టమవుతోంది. -
టీడీపీలో చేరిన గల్లా అరుణ
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడైన పారిశ్రామికవేత్త గల్లా జయదే వ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఏ రహ్మాన్ (విశాఖ), దేవిశెట్టి మల్లికార్జునరావు (రేపల్లె), మాజీ ఎంపీ గునిపాటి రామయ్య (రాజంపేట), టీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు నేతలు శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు. తరతరాలుగా ఆ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. ఏడున్నర దశాబ్దాలుగా తాము సొంత ఇమేజ్‌తోనే రాజకీయం చేశామని, సినీ గ్లామర్‌ను నమ్ముకోలేదని గల్లా అరుణకుమారి చెప్పారు. సినీ నటుడు కృష్ణ కుటుంబంతో బంధుత్వం ఉన్నప్పటికీ ప్రచారం చేయాల్సిందిగా వారిపై ఒత్తిడి చేయదలచుకోలేదన్నారు. కాగా, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఆర్.గాంధీ ఇటీవల వైఎస్సార్సీపీలో చేరటంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు కుతూహలమ్మను పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. -
ఇద్దరిలో ఒక్కరే
సాక్షి, గుంటూరు :చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు అమరరాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ గల్లా జయదేవ్ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ‘దేశం’ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, తెనాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆయన మామ ఘట్టమనేని ఆదిశేషగిరిరావుఎన్నికల బరిలో ఉంటారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆదిశేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, గల్లా జయదేవ్‌కు గుంటూ రు పార్లమెంట్ నియోజకవర్గం కేటాయించే విధంగా చంద్రబాబుతో మొదట్లోనే ఒప్పం దం జరిగినట్టు పార్టీ వర్గాల కథనం. అందుకు అనుగుణంగానే ఇరువురు రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. గల్లా జయదేవ్ ఒక అడుగు ముందుకేసి అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదిశేషగిరిరావు కూడా తెనాలి నియోజకవర్గానికి చెందిన ముఖ్యులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ఇదిలావుంటే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన నియోజకవర్గమైన తెనాలి సీటును తనకే కేటాయించాలని, అలా కాని పక్షంలో పరిస్థితులు మరో విధంగా ఉంటాయని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో అధినేత ఇంత వరకు ఈ సీటుపై నిర్ణయం తీసుకోలేదు. మామ, అల్లుడు ఒకేసారి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ తెనాలిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో గల్లా జయదేవ్ మాత్రమే పార్టీలో చేరారు. ఆయన మామ ఘట్టమనేని చేరిక నిలిచిపోయింది. ఇక తెనా లి సీటు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు దక్కే అవకాశా లు ఉన్నాయని ఆ వర్గం చెబుతోంది. గల్లా జయదేవ్, దేవినేని మల్లికార్జునరావులు పార్టీలో చేరిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. -
కొత్త రాజకీయం
ప్రజాగ్రహానికి గురికాకుండా కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన జిల్లా ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో కొంత అయోమయం చోటుచేసుకుంది. కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ జిల్లాలో పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది. దీంతో వారు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. నిన్నటి వరకు అధికార పార్టీ పేరు చెప్పుకున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెబితేనే ఈసడించుకుంటున్నారు. ప్రత్యామ్నాయం కనిపించక అంతే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె ఆశించినట్టుగా పెద్ద సంఖ్యలో ఆమె వెంట కాంగ్రెస్ శ్రేణులు వెళ్లలేదు. చంద్రగిరి నియోజకవర్గం నాయకులతో పాటు ఇద్దరుముగ్గురు పడమటి మండలాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్ఫోన్లో కూడా అందుబాటులో లేరు. కిరణ్‌ను కలిసిన కుతూహలమ్మ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శుక్రవారం భేటీ అయ్యారు. మధ్యాహ్నంగా కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడంతో అనుమానాలకు తెరతీస్తోంది. భేటీ వివరాలు తెలియరానప్పటికీ ఏ పార్టీలో చేరాలన్న విషయమై డోలాయమానంలో ఉన్నట్టు సమాచారం. కుతూహలమ్మను కిరణ్ ఇంటికి రప్పించడంలో ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. కాగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం. నియోజకవర్గ నాయకులతో ఆయన టచ్‌లో లేరు. షాజహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం చినబాబు టీడీపీలో చేరేందుకు అరుణమ్మతో హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న షాజహాన్, అరుణమ్మపై ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్ చేరుకుంటారని చెబుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిరణ్ పార్టీలోకి రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజశేఖర్‌రెడ్డి సతీమణి భార్గవిని పోటీ చేయించే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
అరుణమ్మకు ఝలక్
* ఆమె వెంట టీడీపీలోకి రావాలని కాంగ్రెస్ నేతలకు గాలం * వెళ్లాలనుకుంటే మేమే వెళ్తాం, మీవెంట రామంటున్న నేతలు సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో తన అనుచరులను ఇప్పటికే మానసికంగా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గ పార్టీ టికెట్టు ఆమెకే ఇవ్వాలని అనుచరవర్గం చేత డిమాండ్ చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీలో ప్రవేశం ఘనంగా ఉండాలని భావించి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పెద్ద సంఖ్యలో తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు మినహా పడమటి మండలాల నాయకులకు గాలం వేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే, మీ వెంటే ఎందుకు చేరాలని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా మాజీ మంత్రి స్వయంగా కొందరు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మేజర్ పంచాయతీల సర్పంచ్‌లతో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోల్పోయామని, అందరం కలసికట్టుగా తెలుగుదేశం పార్టీలో చేరితే భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానంటూ ఆమె వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెబుతుండగా, మరికొందరు మాత్రం తాము చేరాలనుకుంటే మీతోనే ఎందుకు చేరాలని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఒకరి నుంచి ఇటువంటి సమాధానం ఎదురైనట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉన్న సమయంలో తమకు ప్రత్యేకంగా ఆమె చేసింది ఏమీ లేదని, ఇప్పుడు టీడీపీలోకి రావాలని ఏ ప్రాతిపదికన అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఒక నేత వాపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్‌రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించడం వెనుక తనను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు ప్రతిగా కాంగ్రెస్‌కు కూడా తన తడాఖా చూపించాలని అరుణమ్మ పట్టుదలతో ఉన్నారు. అయితే ఆమె ఏ మేరకు సఫలీకృతం అవుతారో చూడాల్సి ఉంది. పీలేరు నియోజకవర్గంపై మాత్రం ఆమె దృష్టిసారించలేదని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం కావడం గమనార్హం. ఆయన కేబినెట్లో తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగానో, ఆహ్వానించినా ఆ నియోజకవర్గ నేతలు రాకపోవచ్చన్న అనుమానం ఆమెలో ఉండవచ్చని అంటున్నారు. -
దోస్తీ కట్టిన గురుశిష్యులు
ఉత్సవాల వేదికగా ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు 30 నిమిషాలు ముచ్చట్లు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మంత్రి గల్లా అరుణకుమారి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు బుధవారం నాటి ఘటనలు బలం చేకూర్చాయి. అదే సమయంలో ఒకనాటి గురుశిష్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీవీ నాయుడు ఒకే వేదికపై కనిపించడం మరో విశేషం. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రథమ శిష్యుడి గా ఎస్సీవీనాయుడు పేరుపొందారు. అయితే ఎస్సీవీ నాయయుడు 2004లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరి తన రాజకీయ గురువైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై పోటీకి దిగారు. విజయమూ అందుకున్నారు. మరోసారి 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్సీవీ తలపడ్డారు. ఈ సారి విజయం బొజ్జల వైపు నిలచింది. అయితే కొంతకాలంగా ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఉత్సవాల వేదికగా ఒక్కటైన నేతలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ నుంచి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి (కాంగ్రెస్) ఒకే వేదికపై పలకరించుకుంటూ ప్రత్యేకతను చాటారు. అంతేకాదు శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న పొగడచెట్టు కింద కూర్చుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంత్రితో స హా ఈ నేతలంతా చెట్టు కింద కూర్చుని 30 నిమిషాలు ముచ్చటలాడారు. కాంగ్రె స్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి, సీనియర్ నాయకులు శాంతారాం జె పవార్, చెలికం కృష్ణారెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వయ్యాల సుధాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తది తర నేతలు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చెంచయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శి జగన్నాథం నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు గురవయ్యనాయుడు, పాపిరెడ్డి, మునిరాజనాయుడు, పార్థసారథి తదితరులు సందడి చేశారు. గల్లా అరుణకుమారి, ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరడం ఇక లాంఛనమేనని ద్వితీయశ్రేణి నాయకులు చర్చించుకోవడం కనిపించింది. ఇప్పుడే చెప్పలేను తన రాజకీయ కార్యాచరణను భవిష్యత్తులో ప్రకటిస్తానని, టీడీపీలోకి చేరే విషయం ఇప్పుడే ప్రకటించలేనని మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. -
కాంగ్రెస్ కు, మంత్రి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో గల్లా అరుణా కుమారి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ కు, సోనియాకు పంపినట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాజీనామా సమర్పించారు. పురందేశ్వరి, గంటా శ్రీనివాసరావు, డొక్కా మాణిక్క వరప్రసాద్ లు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. -
గుసగుసలు
పలమనేరు టీడీపీ అభ్యర్థిగా మంత్రి గల్లా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ బోసు వర్గంలో భయం పలమనేరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించలేదు. తానుఇంకా టీడీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంత్రి గల్లా అరుణకుమారి గత ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుతో గల్లా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇటీవల జయదేవ్ తమ ఫ్యాక్టరీ వద్ద సహచరులు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ‘‘మా అమ్మకు ఎలాగైనా టీడీపీలో సీటు సంపాదించాలి. మా అమ్మను అభిమానించే కాంగ్రెస్, టీడీపీ వారంతా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు రావాలి’’ అని కోరారు. దీంతో మంత్రి గల్లా అనుయాయుల నుంచి కూడా చంద్రబాబుపై వత్తిడి పెరిగినట్లు సమాచారం. చంద్రగిరిలో కష్టమనే... చంద్రగిరి నుంచి పోటీచేస్తే గెలుపు కష్టమని, వైఎస్ఆర్ సీపీ నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఉంటుందనే భావనతోనే చంద్రగిరి కాకుండా పలమనేరును ఎంచుకున్నట్లు సమాచారం. పలమనేరు నియోజకవర్గంలోకి పునర్విభజన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వీ.కోట మండలం రావడంతో ఈ మండలం నుంచి వచ్చే ఓట్లు చంద్రబాబు నాయుడి అభిమానులవేనని ఆమె నమ్ముతున్నారు. పైగా ఆమె తండ్రి రాజగోపాల్‌నాయుడు కూడా పార్లమెంటుకు గతంలో ప్రాతినిథ్యం వహించడంతో ఇదీ తనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆమె పలమనేరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలిసింది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలి. త్వరలో గుంటూరులో జరిగే టీడీపీ మీటింగ్‌లో గల్లా అరుణకుమారితో పాటు ఆమె తనయుడు జయదేవ్కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. బోస్ వర్గంలో భయం పలమనేరు టీడీపీ టికెట్ కోరుకుంటున్న సుభాష్‌చంద్రబోస్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గల్లాకు టిక్కెట్ ఇస్తారనే విషయం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో ఈమెకు టికెట్ ఇస్తారో లేదో గానీ బోస్ వర్గానికి మాత్రం ఈ విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.రేసులో బోస్‌తో పాటు మరో ఆరుగురు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బోస్ మాత్రమే అన్ని మండలాల్లోనూ ఇప్పటికే ప్రచారం సైతం చేసుకెళ్తున్నారు. -
టీడీపీతో అంటకాగుతున్న గల్లా కుటుంబం
-
గల్లా సాక్షిగా బాబు విమర్శలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. బంగారుపాళెం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్పీ.చెంగల్రాయనాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గల్లా కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి మంత్రి స్వయంగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసిన ప్రాంగణంలోని వేదికపై చంద్రబాబు, అరుణకుమారి పక్కపక్కనే కూర్చున్నారు. దశబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న ఈ నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కూర్చోవడం చర్చకు దారితీసింది. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్పమొయిలీలను ప్రతిపక్షనేత తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు విమర్శలు చేస్తున్న సమయంలో అరుణకుమారి కొంత ఇబ్బందిపడినట్టు కనిపించారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బాబు తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో చిదంబరం భారీ మెజారిటీతో ఓడిపోవడం ఖాయమన్నారు. అంతకుముందు గల్లా అరుణకుమారి తన ప్రసంగంలో ఎన్పీ. చెంగల్రాయనాయుడు సేవలను కీర్తించారు. కాగా చంద్రబాబు బంగారుపాళెం చేరుకోవడానికి గంట ముందుగానే అరుణకుమారి అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాబు చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఉదయం పది గంటల సమయంలో బంగారుపాళెం చేరుకుని చెంగల్రాయనాయుడు విగ్ర హానికి నివాళులు అర్పించి వెళ్లారు. -
ఒకే వేదికపై చంద్రబాబు, గల్లా అరుణ
-
నెలాఖరులోగా నిర్ణయం: గల్లా జయదేవ్
కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలని లేదు కదా?: గల్లా జయదేవ్ చిత్తూరు, న్యూస్‌లైన్: తన రాజకీయ అరంగేట్రంపై ఈ నెలాఖరులోగా నిర్ణయం ప్రకటిస్తానని మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోరదానపల్లెలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తిరుపతి, చిత్తూరు ఎంపీ స్థానాలు రిజర్వుడ్ కావడంతో గుంటూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, ఈ మేరకు టీడీపీ నేతలతో సంప్రదిం పులు జరుపుతున్నానని తెలిపారు. మీ తల్లి వేరే పార్టీ లో ఉన్నారు కదా అని అడగ్గా ‘ ఫ్యామిలీ సభ్యులంతా ఒకే పార్టీలో ఉండాలని లేదు కదా? ఉదాహరణకు గాంధీ కుటుంబమేన’ని అన్నారు. కాగా, మంత్రి అరుణకుమారి స్పందిస్తూ జయదేవ్ ఏ పార్టీలో చేరినా తన సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అని ప్రశ్నించగా ‘ఇంకా సమయం ఉంది. చూద్దాం’ అనిఅన్నారు. -
త్వరలో మరో రెండు ప్లాంట్లు
యాదమరి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని మోరదానపల్లె వద్ద గల్లా డిజిటల్ వరల్డ్‌లో కొత్తగా రెండు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమరరాజ సంస్థ ఎండీ గల్లా జయదేవ్ తెలిపారు. డిజిటల్ వరల్డ్‌లో అమరరాజ యూపీఎస్ బ్యాటరీ ప్లాంట్‌ను మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్ర నాయుడు, జయదేవ్ ఆదివారం ప్రారంభించారు. రూ. 350 కోట్లతో ఈ యూపీఎస్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు జయదేవ్ తెలిపారు. మరో నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవుతుందని, ఏడాదికి 4 మిలియన్ యూ నిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని వివరించారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.350 కోట్లతో ఆటోమోటివ్ బ్యాటరీస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ నుంచి ఉత్పత్తి మొదలవుతుందని, ఏడాదికి 2.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. అలాగే ప్లాస్టిక్, ట్యూబ్లర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం ఫ్యాక్టరీలు ఏర్పాటైతే సుమారు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మార్కెట్లో తమ సంస్థ బ్యాటరీలకు మంచి డిమాండ్ ఉందన్నారు. లెడ్ రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన యూపీఎస్ బ్యాటరీల ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్దదని చెప్పా. మరో ఎండీ గల్లా రామచంద్రనాయుడు మాట్లాడుతూ.. కొత్త ఫ్యాక్టరీల వల్ల జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఉద్యోగస్తుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా
-
గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....ఈ నెలాఖరున తన రాజకీయ నిర్ణయం ఉంటుందని జయదేవ్ తెలిపారు. భవిష్యత్తులో జయదేవ్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని గల్లా అరుణ కుమారి ఈ సందర్బంగా తెలిపారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఏలాంటి నిర్ణయం తీసుకున్న మిగతా అందరి మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే జయదేవ్ గల్లా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఇటీవల కాలంలో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. -
గుంటూరులో ‘గల్లా’ట:
-
అరుణమ్మ డబుల్ గేమ్
సాక్షి, తిరుపతి:రాష్ట్ర కేబినెట్లో కొనసాగుతున్న మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశంతో దోస్తీ కడుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. మంత్రి పదవిలో ఉంటూనే ప్రతి పక్ష టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తుండడం అటు అధికారపార్టీ నేతలతో పాటు తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకున్నారు. కుమారుడు గల్లా జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్టు దాదాపుగా ఖాయం చేసుకున్న అరుణమ్మ ఇప్పుడు చంద్రగిరిపై కూడా కన్నేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే భర్త గల్లా రామచంద్రనాయుడును చంద్రగిరి నుంచి బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్టు దేశం వర్గాల్లో విస్తృతంగా ప్రచారంజరుగుతోంది. ఇప్పటివరకు జయదేవ్‌ను మాత్రమే రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న మంత్రి తాజా పరిణామాల్లో భర్తను కూడా అసెంబ్లీ బరిలోకి తెచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశంతో ప్రత్యక్ష పోరాటం చేసిన తాను ఒక్కసారిగా ఆ పార్టీ తరుపున పోటీ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావచ్చన్న కారణంతో రామచంద్రనాయుడును తెరపైకి తెస్తున్నట్టు దేశం వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లాలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంగా గల్లా కుటుంబానికి పేరుంది. అయితే ఆ ముద్ర చెరిగిపోకుండా ఉండేందుకు భర్తను రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ఎన్నికల సమయంలో భార్య గెలుపు కోసం తెరవెనుక పాత్ర పోషిస్తూ వచ్చిన రామచంద్రనాయుడు ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతున్న వారు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే చంద్రగిరి టికెట్టు గల్లా కుటుంబానికి ఇచ్చే విషయంలో మంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనే విషయంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా అధికారం కోల్పోయి కష్టకాలంలో పార్టీ జెండాలు భుజనావేసుకున్న వారి అవకాశాలను చివరి నిమిషంలో మంత్రి గండికొడుతోందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉంది. మొత్తానికి మంత్రి డబుల్‌గేమ్ రాజకీయవర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. నారా గిరీష్‌తో చెక్... మంత్రి గల్లా అరుణకుమారి చేస్తున్న ప్రయత్నాలకు నారా గిరీష్‌తో చెక్ పెట్టేందుకు తెలుగుదేశంలోని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలంగా చంద్రగిరిలో గల్లా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు వారితో కలసి పనిచేయడమంటే ఇబ్బందికరంగా వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కుమారుడు గిరీష్‌ను రంగంలోకి తెస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గిరీష్ పేరు పరిశీలనకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రామ్మూర్తినాయుడును పార్టీ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలకు ఫుల్స్టాప్ పడడంతో పాటు గల్లా ప్రయత్నాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని మంత్రి వ్యతిరేకుల ఎత్తుగడగా కనిపిస్తోంది. -
గుంటూరులో ‘గల్లా’ట
‘దేశం’ నేతలతో మంతనాలు కొడుకు రాజకీయ అరంగేట్రానికి వేదికగా అధికారిక పర్యటన మంత్రి అరుణ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గల్లా అరుణకుమారి ఇక్కడ నెరపిన రాజకీయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ గా టీడీపీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె వ్యవహారశైలి విమర్శలకు దారి తీసింది. అసలేం జరిగింది..: రూ.30కోట్లతో రూపుదిద్దుకున్న గుంటూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. గల్లా అరుణ ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరగడంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టిన గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం(జింకానా) ఆమెను ఆహ్వానించింది. ఆస్పత్రి నిర్మాణానికి విరాళాలిచ్చిన 250మంది ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ తన కుమారుడు జయదేవ్‌ను పలువురు ప్రముఖులకు పరిచయం చేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఎక్కువ మంది వైద్యులు ఈ గెట్ టు గెదర్‌లో ఉండటం కూడా విమర్శలకు దారి తీసింది. ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ మంత్రి వైఖరి విమర్శలకు దారి తీసింది. వేదికపైనే ఆమె విపక్షానికి చెందిన టీడీపీ నేతలతో, ఆ పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డితో సన్నిహితంగా ఉండటం చర్చనీయాంశ మైంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపూ మోదుగలతో గుసగుసలాడారు. ఏఐసీసీకి ఫిర్యాదుల వెల్లువ గుంటూరులో టీడీపీ నేతలతో మంత్రి నెరపిన రాజకీయంపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు పంపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీసెల్ చైర్మన్ షేక్ ఖాజావలి, డీసీసీ అధికార ప్రతినిధి జల్ది రాజమోహన్ మంత్రి తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న గల్లా అరుణ కుమారి తన కుమారుడు జయదేవ్‌కు టీడీపీ ఎంపీ సీటు ఇప్పించేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆమెపై సీఎం, పీసీసీ అధ్యక్షులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సేవా దృక్పథంతోనే వైద్యులకు గుర్తింపు : గవర్నర్ నరసింహన్ వైద్యులందరికీ సేవా దృక్ఫథం ఎంతో అవసరమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ఇక్కడ మిలీనియమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారం భించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ ఆస్పత్రులు పేద, మధ్య తరగతి ప్రజలకు విలువైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయన్నారు. ఆస్పత్రుల యజమానులంతా సమావేశమై ‘కామన్ మినిమమ్ ఫీ’ నిర్ణయించాలని సూచించారు. -
కాంగ్రెస్‌కు మంత్రి గల్లా వెన్నుపోటు
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :తన కుమారుడికి టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా గెలిపించేందుకు రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూడటం బాధాకరమని పలువురు కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు అనుభవించిన మంత్రి గల్లా అరుణ కుమారి గుంటూరులో ఎన్నారై వైద్యులతో సమావేశం నిర్వహించి తన కుమారుడు జయదేవ్‌ను రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా బలపర్చమని కోరటం చాలా విచారకరమన్నారు. క్యాబినెట్లో కొనసాగుతున్న ఆమె శనివారం జీజీహెచ్‌లో జరిగిన సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డితో చాలా సన్నిహితంగా ఉండటం బాధాకారమని వాపోయారు. ఒక పార్టీలో కొనసాగుతూ మరో పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వటం పార్టీని వెన్నుపోటు పొడవటంతో సమానమని పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్‌పార్టీని బలహీన పర్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి బయటకు వెళ్లి, కొడుకు కోసం టీడీపీ సభ్యత్వం తీసుకొని ప్రచారం చేసుకోవాలని ఆమెకు సూచించారు. జిల్లాలో పార్టీని బలహీన పర్చేవిధంగా మంత్రి గల్లా ప్రవర్తించడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు స్థిరంగానే ఉన్నారని, నాయకులే పదవుల కోసం, డబ్బుకోసం ఇతర పార్టీలకు వెళ్తున్నారని వాపోయారు. నాయకులు హుందాగా ప్రవర్తించాలని, వివాదాస్పద ప్రకటనలు చేయటం సరికాదని హితవుపలికారు. డీసీసీ అధికార ప్రతినిధి జెల్థి రాజమోహన్ మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లు మంత్రి గల్లా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజులు గుంటూరులో ఉండి టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి, తన కుమారుడికి టీడీపీ సీటు ఇప్పించే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఆమె వల్ల కాంగ్రెస్‌పార్టీకి చెడ్డపేరు వస్తోందని, తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ లీగల్‌సెల్ చైర్మన్ జి.రవికుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మొగిలి శివకుమార్, కోనేటి గోవిందరావు, షేక్ బాజి, ఫరీద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
'టీడీపీలో సీటు కోసం మంత్రి గల్లా యత్నిస్తోంది'
గుంటూరు: మంత్రి గల్లా అరుణ కుమారిపై నగర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆమె కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ సీటు కోసం యత్నింస్తోందంటూ వారు విమర్శలకు దిగారు. తన కుమారుడితో కలిసి గుంటూరులో తిష్ట వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ నాయకులతో కలిసి ఆమె మీటింగ్ పెట్టడం నీచ సంస్కృతి నిదర్శమంటున్నారు. టీడీపీపై మోజు ఉంటే కాంగ్రెస్ కు గల్లా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా కాంగ్రెస్ ను బలహీన పరచాలని చూడొద్దని నగర పార్టీ నేతలు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవద్దని ఆమెకు విజ్ఞప్తి చేశారు. -
టీడీపీలో ‘గల్లా’ ముసలం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు భారీ ప్యాకేజీలతో కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి సొంత పార్టీ సీనియర్లే చెక్ పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న తమనొదిలి ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో కొత్తవారికి ఎన్నికల్లో అవకాశం కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. ఆ విషయంలో అధినేతకు ఎదురు చెప్పేందుకు వారు వెనకాడటం లేదు. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారితో పాటు ఆమె కుమారుడు జయదేవ్, ఆయన బంధువులను పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో.. జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ, గల్లా అరుణకు చంద్రగిరి అసెంబ్లీ, జయదేవ్ మామ ఆది శేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారన్న సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెనాలి నుంచి ఆది శేషగిరిరావుకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం అయిపోయినందున, గుంటూరు (పశ్చిమ) లేదా మంగళగిరి నుంచి పోటీ చేయాలని గతంలో తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఒప్పించే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గరికపాటి మోహన్‌రావు ఆలపాటితో చర్చలు జరిపారు. తాజా పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆలపాటి.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తే తనదారి తాను చూసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో గరికపాటి వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్‌కు పోటీగా చంద్రశేఖర్ అలాగే, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జిల్లాకు కొత్తవాడైన జయదేవ్‌ను నిలపాలనుకోవడంతో ఆయనకు పోటీగా ఆర్థికంగా బలమైన, తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరును జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజాలతో పాటు మరికొందరు నేతలు తెరపైకి తెచ్చారు. చంద్రశేఖర్ పార్టీకి రూ. 50 లక్షల విరాళం కూడా ఇచ్చారని, చంద్రశేఖర్‌కు గుంటూరు వీలుకాని పక్షంలో నర్సరావుపేట లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. ఈ ప్రతిపాదనపై సూటిగా చెప్పకుండా చంద్రబాబు చూద్దాం అని మాత్రమే చెప్పి పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్ పార్టీలోకి రావడాన్ని కోడెల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గం ఆహ్వానిస్తోంది. కాగా, తెనాలి, బుర్రిపాలెం మధ్య ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని కూడా జయదేవ్ నిర్మిస్తుండటం గమనార్హం. -
పరిశోధన కేంద్రానికి విభజన సెగ!
=పెండింగ్‌లో హర్సిలీహిల్స్ నివేదిక =హిందూపురం నుంచే పరిశోధనలు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: పట్టుగూళ్ల ఉత్పత్తిలో కొత్త వంగడాలను సృష్టిం చేందుకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఏర్పాటు కానున్న పరిశోధన కేంద్రానికి విభజన సెగ తగిలింది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత నివేదిక పెండింగ్ పడింది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ కొండపై వాతావరణం ప్రత్యేకమైంది. సాధారణ ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. ఇప్పటికే మౌళిక పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం నడిచి మూతపడింది. దీంతో ఇక్కడి భవనాలను స్వాధీనం చేసుకుని కొత్త వంగడాల సృష్టికి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పట్టు పరిశోధన కేంద్రం (ఏపీఎస్ఎస్ఆర్డీఐ) ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులను పరిశీలించాక నిర్ణయానికి వచ్చారు. మల్బరీఆకు ఉత్పత్తి, గుడ్ల తయారీ, ప్రధానంగా పట్టులో కొంత వంగడాలను సృష్టించేందుకు అనువైందిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డుకు పరిశోధన నివేదికను పంపారు. దీనికి ఆమోదం లభించింది. హర్సిలీహిల్స్లో ఇంతవరకు బైవోల్టిన్ పట్టుగుడ్ల ఉత్పత్తి జరిగిం ది. ఇకపై అధిక ఆదాయం, ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్తరకం పట్టుగుడ్ల ఉత్పత్తికి కృషి చేసే కేంద్రంగా మారబోతుండగా రాష్ట్ర విభజన చర్యలతో దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది. దీని కారణంగా ఇక్కడ చేపట్టదలచిన పరిశోధనలను ప్రస్తుతం హిందూపురంలోనే చేస్తున్నారు. దీనిపై పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ బీజే.శర్మ మాట్లాడుతూ కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతోందన్నారు. అయితే ఏర్పాటు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. -
ప్రభుత్వ పాలన భేష్: గల్లా
పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను తెలుగుదేశం ఎంపీ శివప్రసాదే మెచ్చుకుంటున్నారంటే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతగా కృషి చేస్తోందో ఇట్టే తెలుసుకోవచ్చని రాష్ట్ర భూగర్భ గనులు,వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ సభలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పథకాలను పొగడడం కంటే విమర్శించడమే ఎక్కువన్నారు. అందుకు భిన్నంగా జిల్లా ఎంపీ తమ ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్జీ రంగా లాంటి నాయకులు మాత్రమే ఇలా అందరినీ సమానంగా చూసేవారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రచ్చబండ అవసరమా అని ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. అయితే ప్రజా సమస్యలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం గొప్పవిషయమన్నారు. ప్రతి ఇంట్లో తలుపు తడితే ప్రభుత్వ పథకాలు పలుకరిస్తాయని మంత్రి తెలిపారు. రచ్చబండలో అపశ్రుతి వి.కోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా వీ.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒకరు మృతిచెందగా, తొక్కిసలాటలో ఒకరు, అధికారుల కాన్వాయ్ ఢీకొని మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. వి.కోట మండలం చింతవూకులపల్లెకు చెందిన గుణశేఖర్(40) ఆదివారం వుధ్యాహ్నం రచ్చబండలో అర్జీ ఇచ్చేందుకు వి.కోటకు వచ్చాడు. ప్రభుత్వ కళాశాలలోని సభా మైదానానికి నడిచివస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురయ్యూడు. దారిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు. తోడున్న వారు 108కు సవూచారవుందించారు. సిబ్బంది చేరుకునేటప్పటికే బాధితుడు మృతి చెందాడు. మృతితునికి భార్య, పిల్లలు సోనియూ(18), పవిత్ర(16), సంధ్య(13) ఉన్నారు. సొంతింటి కల సాకారం చేసుకొని ఇంటికివస్తాడనుకున్న తండ్రి విగతజీవిగా తిరిగి రావడంతో వారి శోకానికి అంతులేకుండా పోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రావుస్తులు సీఎంకు అర్జీ ఇచ్చారు. సభానంతరం వర్షం ప్రారంభం కావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో నాయుకనేరి కొత్తూరుకు చెందిన సుజాతకు కాలు విరిగింది. ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేజీఎఫ్ రోడ్లో ద్విచక్రవాహనంపై వెళుతున్న కర్ణాటకలోని వున్నాయునపల్లెకు చెందిన వుణికంఠను అధికారుల కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయుపడ్డాడు. -
సమైక్యాంధ్ర మద్దతుగా గల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మంత్రి గల్లా అరుణకుమారి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో నిర్వహించిన భారీ ర్యాలీలో గల్లా అరుణ పాల్గొన్నారు. రుయా ఆస్పత్రి వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉందని.. విభజన వాదులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని గల్లా అరుణ సూచించారు. హింసకు తావివ్వకుండా శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహలను ధ్వంసం చేయడం సరైన చర్యకాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ ర్యాలీకి మద్దతుగా అధిక సంఖ్యలో జిల్లా వాసులు పాల్లొన్నారు. రాష్ట విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లావాసులు యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. -
చంద్రగిరిలో మంత్రి గల్లా అరుణకుమారి హల్చల్