
గల్లా అరుణకు చేదు అనుభవం
గుంటూరు : గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి శనివారం గల్లా అరుణకుమారి విచ్చేశారు. ఆమె రాకను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎందుకొచ్చారని ఆమెపై మండిపడ్డారు. సొంత ఇమేజ్ కోసం గ్రూప్లను ప్రోత్సహిస్తే తాము సహించేది లేదని సదరు కార్యకర్తలు గల్లా అరుణకుమారిని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక గల్లా అరుణకుమారి వచ్చిన దారినే వెనక్కి తిరిగారు.