jonnalagadda
-
నువ్వు ఇంస్ట్రుమెంట్ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్!
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం నీ దారే నీ కథ. ఈ చిత్రానికి వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా ఉంటూ దర్శకత్వం వహిస్తున్నారు. జేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ.. 'ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. 'సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే నిర్మించాం. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. మీడియా, ప్రేక్షకులు మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..'నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ గురించి చదువుకుని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ని తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆల్బర్టో గురియోలి సంగీతమందిస్తున్నారు. -
పాన్ మల్కాజ్గిరి స్టోరీ తో టిల్లు
-
నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలే తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7లో బుల్లితెర నటి శోభా శెట్టి! ఎంట్రీ ఇస్తే..) అయితే విడాకుల తర్వాత నిహారిక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత జొన్నలగడ్డ చైతన్య ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటారు. తాజాగా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విడాకుల తర్వాత తొలిసారి తన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటు 'ఆల్ త్రీస్ ఇన్ స్టైల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ప్రకృతిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో పక్కనే సముద్రం, చెట్లు ఉండగా.. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చైతన్య కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం 'బిగినింగ్ న్యూ లైఫ్ బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఇది జరిగి పదిరోజులు దాటినా ఇప్పటికీ పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో వీరిద్దరి టాపిక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్‌మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలయదు. వారి కుటుంబ సభ్యలు కూడా బహిరంగంగా ఎక్కడా మాట్లాడనూ లేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరగుతుంది. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) 'నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను' అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారట. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) ఈ స్టేట్మెంట్లోని మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు తెలుపుతున్నా మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగటివ్‌గా మాట్లాడటం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు కూడా. విడాకుల మూడ్ నుంచి తను ఇప్పుడిప్పేడే సినిమా షూటింగ్లపైపు వెలుతుంది అని చెప్పవచ్చు. తాజాగా నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. అందులో మహాతల్లి యూట్యూబ్ ఫేమ్ కూడా ఉంది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) వీడియోతో పాటు అమ్మాయిలు ఇలా ఉంటారు అంటూ వాయిస్ వస్తుంది. అందులో ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని చెప్పుకొస్తూ... మొదట నిహారిక తనని తాను ఉద్దేశిస్తూ ఇలా చెప్పింది. ఒకరు ఎల్లప్పుడూ బెటర్ డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఇష్టపడుతుంటారని చెప్పింది. మరోకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గానే ఉంటారని చెప్పింది. మరొకరు.. కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఆసక్తి చూపించరు అంటూ... చివరిగా ఓ 'మహాతల్లి' ఉంటుంది కానీ తనెప్పుడు కనిపించదని ఒక పన్నీ ఎమోజీని చూపుతుంది. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి ఫన్నీ వీడియో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఇప్పుడిప్పుడే విడాకుల మూడ్ నుంచి బయటపడుతున్నారని నెటిజన్లు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) (ఇదీ చదవండి: ‘డబుల్’ కిక్ ఇస్తున్న స్టార్ హీరోలు) -
అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరి విడాకుల అంశంపై పలువురు నుంచి నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో అఫిషియల్‌గా నిహారిక స్పందించింది. (ఇదీ చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) 'విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఇంతటి ఇబ్బంది సమయంలో నా వెంట ఫ్యామిలీ, స్నేహితులు పిల్లర్స్‌లా నిలబడ్డారు. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయకండి. ఇలాంటి సమయంలో తమను దకయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..
సినిమా రంగంలోని సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంది. నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా వారిద్దరి అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి 'నీల్' అని పేరు పెట్టాం: కాజల్) అయితే నిహారిక విడాకుల విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత.. తను ఏమైనా నోరు విప్పుతుందా? అని అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన కొద్దిసేపటికి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికి పుట్టిన రోజు విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ విడాకుల వార్తల గురించి పలు రకాలుగా వార్తలు వస్తున్నా.. ఆమె స్పందించకపోవడంతో వీటిన లైట్ తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తాజాగా వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు..? నిహారిక తరుపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?) ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరుగానే ఉన్నారు కూడా. దీంతో మొదటగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆపై నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. అతను నాగబాబుకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టే విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డ - నిహారికల వివాహం జరిగింది. వీరిద్దరి అంగీకారం మేరకు జూన్ 5న కోర్టు విడాకుల ఉత్తర్వులు జారీ చేసింది. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే. -
నిహారిక- చైతన్య విడాకులు.. అసలు కారణం అదేనా?
మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లోనూ చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు. దీంతో వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు కన్ఫార్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పటికి వరకు తెలియరాలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు. పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్దఎత్తున వైరలైంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) -
అఫీషియల్: నిహారిక- చైతన్య డైవర్స్.. కోర్టు మెట్లెక్కిన మెగా డాటర్!
నాగబాబు కుమార్తె మెగాడాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని గత కొంతకాలంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక.. ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు ఒంటరిగానే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిహారిక విడాకులపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కింది. తాజాగా ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. హిందూ వివాహా చట్ట ప్రకారం మెగా డాటర్ కోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) కాగా.. గత కొంతకాలంగా జొన్నలగడ్డ చైతన్య, నిహారిక విడివిడిగానే ఉంటున్నారు. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు రూమర్స్ ఊపందుకున్నాయి. అంతేకాకుండా చైతన్య ఇటీవలే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కాాగ.. 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. చైతన్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్? ఇటీవలే జొన్నలగడ్డ చైతన్య ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. ఈ పోస్ట్ తర్వాత విడాకులు ఖాయమేనంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. (ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?) -
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
ఇప్పుడు ఎకరాకు 30–35 బస్తాల ధాన్యం దిగుబడి.. ఆదర్శంగా జొన్నలగడ్డ
ఎలాగైనా తమ గ్రామంలోని తన మెట్ట పొలంలోనే పుట్టెడు వడ్లు పండించుకోవాలన్న రైతన్నల తపనే ఆ గ్రామ రైతులను మూడు దశాబ్దాల క్రితం కొత్త దారిలో నడిపించింది. కాలువ సౌకర్యం లేనందున ఆరు తడులతోనైనా వరి పండించాలనే వారి ఆకాంక్ష వర్షాధారంగా వెద వరి సాగుకు పురికొల్పింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో రైతులకు వారి కృషి ఆదర్శంగా మారింది. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ నుంచి ప్రారంభమైన వెద పద్ధతిలో వరి సాగు పద్ధతి రైతులకు అనేక విధాలుగా ఉపయోగంగా ఉంది. పొలంలో నీరు నిల్వకట్టకుండా, దమ్ము చేయకుండా, నారు పోయకుండా వరి సాగు చేస్తున్నారు. ఆరు తడులతోనే డెల్టాతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రారంభమైన ఈ పద్ధతి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తోడ్పాటుతో నేడు అనేక రాష్ట్రాలకు విస్తరించింది. జొన్నలగడ్డ గ్రామానికి నీటి పారుదల కాలువ సౌకర్యం లేదు. గ్రామంలో ఉన్న చిన్నపాటి చెరువులోని నీటిని తాగునీరు, సాగు నీరుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఐనప్పటికీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రైతులు ముందుగానే వరి నాట్లు వేసుకునేవారు. వర్షాభావ పరిస్థితుల్లో వరి పంట ఎండిపోయి పశువుల మేతగా మారేది. దీన్ని అధిగమించేందుకు ఆ గ్రామ రైతుల ఆలోచనల్లో నుంచి పుట్టిన వెద పద్ధతిలో వరి సాగు శాస్త్రవేత్తల మెప్పు పొంది సర్వవ్యాప్తమవటం విశేషం. గ్రామంలో రైతులు వెద పద్ధతిలో వరి సాగుచేస్తూ వర్షాలు కురిసిన సమయంలో పడిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని ఎకరాకు సుమారు 35 బస్తాల ధాన్యం పండిస్తున్నారు. మొదట్లో ఎద్దుల అరకలతో మొదలైన వెద పద్ధతిలో రైతులే అరకలతో వెద పద్ధతిని పాటించేవారు. అప్పట్లో ఎకరాకు 20 కిలోల వడ్లు విత్తుకునేవారు. కాల క్రమేణా ఆధునిక యాజమాన్య పద్దతులను అలవాటు చేసుకోవటం విశేషం. ట్రాక్టర్లకు అనుసంధానం చేసిన విత్తన గొర్రులతో వెద పద్ధతిలో ఎకరాకు 12–15 కిలోల వరి విత్తనాలు విత్తుకుంటున్నారు. నారు నాటే విధానంలో కంటే వెద పద్ధతిలో సాగు చేయటం ద్వారా కూలీల ఖర్చులు, నారు ఖర్చులు, దమ్ము ఖర్చులు మొత్తం రూ. 10 వేల వరకూ పెట్టుబడి తగ్గుతుందని తెలిపారు. ఎరువులు, పురుగుమందుల ఖర్చు కూడా చాలా వరకూ తగ్గుతోంది. మరోవైపు నీరు ఎక్కువ అందుబాటులో లేకపోయినా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మిగిలిన యాజమాన్య పద్ధతులు నాట్ల పద్ధతిలో మాదిరిగానే ఉంటాయని తెలిపారు. వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు పదేళ్ళ క్రితం జొన్నలగడ్డ గ్రామానికి వచ్చి ఇక్కడ రైతులు సాగు చేస్తున్న వెద పద్ధతిని చూసి మెచ్చుకున్నారు. ఒకటికి నాలుగు సార్లు పరిశోధించి, మెరుగుదలకు సూచనలిచ్చారు. ఈ పద్ధతి వర్షాధారంగా సాగు చేసే రైతులకే కాకుండా, సాగు నీరు ఉన్న డెల్టా ప్రాంతాల రైతులకూ ప్రయోజనకరమని గుర్తించడమే కాదు, ఇక్కడి రైతులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి వెద పద్ధతిలో సాగు చేయాలో అక్కడి రైతులకు శిక్షణ ఇప్పించారు. ఆ విధంగా జొన్నలగడ్డ రైతులు వెద వరి సాగుకు మార్గదర్శకులయ్యారు. సాధారణంగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల మిథేన్ వాయువు విడుదలై పర్యావరణానికి హాని జరుగుతోంది. వెద వరి పద్ధతి వల్ల ఆ సమస్య ఉండదు. 3 ట్రాక్టర్లు.. రోజుకు 30 ఎకరాలు.. జొన్నలగడ్డ రైతులు సుమారు 15 ఏళ్లుగా సీడ్ డ్రిల్‌ను ట్రాక్టర్‌కు జోడించి వెద వరి విత్తుకుంటున్నారు. సీజన్లో మా వూరి నుంచి ట్రాక్టర్లు వెళ్లి ఇతర ప్రాంతాల్లో వెద వరి విత్తి వస్తూ వుంటాయి. మూడు ట్రాక్టర్లను ఒక దాని వెంట మరొకటి నడుపుతూ పొలాల్లో వరి, తదితర పంటలు విత్తుతారు. మొదటి ట్రాక్టర్ సీడ్ డ్రిల్‌తో సాళ్ల మధ్య 9 అంగుళాల దూరంలో వరి విత్తనాలు వేస్తుంది. రెండో ట్రాక్టర్ గుంటకతో లెవల్ చేస్తుంది. మూడో ట్రాక్టర్ కలుపు మందును పిచికారీ చేస్తుంది. మొత్తంగా ఎకరానికి రూ. వెయ్యి ఖర్చు. రోజులో 25–30 ఎకరాల్లో పని పూర్తవుతుంది. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు వెద వరి విత్తక ముందే పిలిపెసర, జనుము తదితర రకాల విత్తనాలు 10 కిలోలు ఎకరానికి చల్లి, కొద్ది రోజులు పెరిగాక కలియ దున్నేస్తారు. ఆ తర్వాత వెద వరి విత్తుకుంటారు. 30–35 బస్తాల ధాన్యం దిగుబడి పండిన తర్వాత చేతి మిషన్లు (పాడీ రీపర్ల) తో పంట కోసి కుప్ప వేసి.. రెండు నెలలు మాగిన తర్వాత కుప్పలు కొడతారు. ఈ ఏడాది ఎకరానికి 30 బస్తాల వరకు ధాన్యం పండిందని జొన్నలగడ్డ కౌలు రైతు నవీన్‌రెడ్డి వివరించారు. హార్వెస్టర్లతో కోసి వెంటనే కాటా వేస్తే తేమ ఉంటుంది కాబట్టి ఎకరానికి 35 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. గ్రామంలోని రైతులంతా వెద పద్ధతిలోనే వరి సాగు చేసుకుంటున్నారు. సొంత పొలం ఉన్న రైతులు కొందరు ఒక్కో ఎకరం వాళ్లు తినటానికి వెద వరిని సేంద్రియ విధానంలో సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే చాలా గ్రామాల్లో రైతులు తమ పద్ధతి నేర్చుకొని ఇప్పుడు వాళ్లే చేసుకుంటున్నారని జొన్నలగడ్డ రైతులు సంతోషంగా చెబుతున్నారు. కాలువ నీరు ఉన్న ప్రాంతాల్లో రైతులు కూడా నీటిని నిల్వగట్ట కుండా వెద ప్ధతిలోనే వరి సాగు చేసుకుంటున్నారు. బెట్ట తగిలినప్పుడు నీళ్లు కట్టుకుంటూ ఉంటే తెగుళ్ల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. – దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఫొటోలు : గజ్జల రామ్‌గోపాల్, మల్లి చిన్నప్పటి నుంచే వెద వరి సాగు నాకు ఊహ తెలిసిన నాటి నుంచి మా గ్రామంలో వెద పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల కౌలు పొలంలో వర్షాధారంగానే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్నాను. ఈ విధానంలో దమ్ము, నాటు కూలీల ఖర్చులు తగ్గుతున్నాయి. ఎకరానికి రూ. పది వేల వరకు ఖర్చు తగ్గుతుంది. నాట్లు వేసి పండించిన పంటతో పాటుగా దిగుబడి వస్తుంది. కోతలు అవ్వగానే అదే తేమ మీద రెండో పంటగా గడ్డి జొన్న/ తెల్లజొన్న/ పెసర/ మినుము.. ఎవరికి వీలైన పంట వాళ్లు విత్తుకుంటాం. ఏ పంటైనా సరే విత్తుకునేది సీడ్ డ్రిల్తోనే. – వంగా నవీన్‌రెడ్డి (99631 81999), వెద వరి రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా సాళ్ల మధ్య 9 అంగుళాలు వెద పద్ధతిలో సాగు ద్వారా దుక్కి దున్నుకుని విత్తనం విత్తుకుంటే కలుపు రాకుండా చూసుకోవటమే పని. ఎరువుల యాజమాన్యం, పురుగు మందులు సకాలంలో తక్కువ స్థాయిలో పిచికారీ చేసినా సరిపోతుంది. నేను 10 ఎకరాలు సాగు చేస్తాను. ఈ విధానంలో ఒకవేళ వరదలు ముంపులు వచ్చినపుడు వరి దుబ్బులు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల పంట పడిపోకుండా ఉంటుంది. పైనాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. విత్తనం విత్తుకునే సమయంలో రెండు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలుకు సాలుకు 9 అంగుళాల దూరం ఉండాలి. మిగిలిన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడి సాధించవచ్చు. – వింతా కోటిరెడ్డి (73826 07210), వెద వరి రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా ఏటా పది గ్రామాల రైతులకు నేర్పిస్తున్నా వెద పద్ధతిలో సాగు చేయటం వల్ల అరకలతో కలుపు నివారణ చేసుకోవచ్చు. సాలు సాలుకు గ్యాప్ తక్కువగా ఉండటంతో కలుపు తక్కువగా ఉంటుంది. విత్తుకున్న తర్వాత ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించగలిగితే చాలు. నేను సాగు చేస్తున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏడాది కొత్తగా పది గ్రామాల్లో వెద పద్ధతిలో వరి వేసేందుకు రైతులు నన్ను తీసుకెళుతుంటారు. ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతులకు సాగు విధానం తెలిపి వస్తుంటాం. – పులగం కృష్ణా రెడ్డి (97011 32691), సీనియర్ రైతు, వెద వరి రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా అధునాతన యంత్రాలతో పని సులువు లాం ఫాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు, రైతుల సొంత ఆలోచనలతో మొదటి నుంచి వెద పద్దతిలోనే సాగు చేస్తున్నాం. శాస్త్రవేత్తల సలహాలు ఎంతో మేలు చేశాయి. ఈ విధానం చూసి రైతులకు అవసరమైన అధునాతన ట్రక్టర్లు, గొర్రులు, విత్తనాలు విత్తుకునే యంత్రాలు శాస్త్రవేత్తలు తెలియజేశారు. వాటితో ప్రస్తుతం సులువుగా తక్కువ ఖర్చుతో, సులువుగా విత్తుకొని సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. – లంకిరెడ్డి రంగారెడ్డి (99086 62386), సీనియర్ రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా అంతా ఆరుతడులతోనే.. నెలకు ఒకసారి వర్షం కురిసినా వెద పద్దతిలో వరి సాగుకు అనుకూలంగానే ఉంటుంది. ఎక్కువ వర్షం కురిసినా పంటలోని నీరును బయటకు వెళ్ళబెట్టుకోవాల్సిందే. ఆరుతడులతో పంట మంచి దిగుబడి వస్తుంది. యాజమాన్య పద్దతులు సక్రమంగా పాటించినట్టయితే చీడపీడలు తక్కువగానే ఉంటాయి. ఎరువులు, పురుగు మందులుసైతం రెండు మూడు సార్లు మాత్రమే వినియోగిస్తుంటాం. మామూలుగా నాట్లు వేసిన పంటలతోపాటుగానే కోతకు వస్తుంది. అదేవిధంగా దిగుబడి ఉంటుంది. – ఆళ్ళ కృష్ణారెడ్డి (99489 27692), సీనియర్ రైతు, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
-
ఆటో రజిని హిట్ అవ్వాలి
‘‘ఆటో రజిని’ సినిమా మంచి విజయం సాధించి, మా జొన్నలగడ్డ శ్రీను కుటుంబానికి మంచి లాభాలు రావాలి. చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి పేరు రావాలి. హీరో, హీరోయిన్‌తో పాటు నటీనటులు పదికాలాలపాటు ఇండస్ట్రీలో వెలుగొందాలి’’ అని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ర్పైజెస్ పతాకాలపై జొన్నలగడ్డ సావిత్రి నిర్మిస్తున్న ‘ఆటో రజిని’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేయగా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్లాప్ కొట్టారు. మధుసూదన్ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, గౌతమ్ రెడ్డిలు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ హరికృష్ణని మంచి హీరోగా నిలబెట్టే చిత్రం అవుతుంది’’ అన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ సినిమాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 15 నుంచి విజయవాడలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ‘‘మంచి సందేశంతో ‘ఆటో రజిని’ రూపొందుతోంది’’ అన్నారు సావిత్రి.జె. ‘‘నా మొదటి చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ ఆడియోకి వైఎస్ జగనన్న ఆశీస్సులు తీసుకున్నాను. ‘ఆటో రజిని’ ఒక మాస్ సినిమా’’ అన్నారు హరికృష్ణ. ‘‘నా మొదటి చిత్రాన్ని తెలుగులో చేయడం సంతోషం’’ అన్నారు ప్రీతి సేన్ గుప్తా. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి. -
ముందు జాగ్రత్తే మందు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నివారణకు ముందు జాగ్రత్తే మందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (ఆపి) ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు మందు లేనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని చెప్పారు. లాక్డౌన్ విధింపు, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తికి ఎంతో కొంత అడ్డుకట్ట పడిందని బుధవారం ఆయన ‘సాక్షి’తో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ► ఆహారంలో విటమిన్ సీ, డీ, జింక్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ► అమెరికాలోని భారతీయులు, ఇతర దేశాలవారిని కరోనా నుంచి రక్షించేందుకు ఆపి తరఫున అనేక చర్యలు చేపట్టాం. ► వైద్యపరమైన సాయం, సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ► భారతీయ విద్యార్థులు, భారత సంతతి ప్రజలకు, వారి కుటుంబాలకు హెల్ప్‌లైన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ► హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఔషధం కోవిడ్ –19 రోగులకు ఇవ్వడం ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఆశాజనకంగా లేదని తమ సంస్థ వైద్యుల పరిశీలనలో తేలింది. ► రెమిడెస్విర్ వంటి యాంటీ వైరల్ మందులు పనిచేస్తున్నట్టుగా మా పరిశీలనలో తేలింది. ► కోవిడ్–19 బారినపడి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా మార్పిడి ఆశాజనకంగా ఉన్నట్టు తేలింది. -
నందిగామలో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు ఖమ్మం జిల్లా మధిరకు పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న టాక్టర్.. ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అతివేగం వల్లే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. -
గ్రహణం
చాలా సేపట్నుంచి బస్టాపులో నిలబడి ఉంది మీనాక్షి. సిటీ బస్సులు రాలేదు. ఎందువల్లనో తెలీదు. తను కాలేజీ నుంచి రావటానికి ముందుగానే బస్సులన్నీ వెళ్లిపోయాయా? అలా జరిగివుండదు. అలాగే అనుకున్నా వేరే రూట్లో వెళ్లే బస్సులయినా రావాలిగా. ఒక్క బస్సు కూడా రాలేదు!రోడ్డుమీద ఆటోలు జోరుగా వెళ్లిపోతున్నాయి. కొంతమంది నడిచి వెళ్తున్నారు. సిటీ బస్సులు ఎందువల్ల తిరగడంలేదో మీనాక్షికి అర్థం కాలేదు.సరిగ్గా అప్పుడే రోడ్డుకు అవతలివైపు వున్న హోటలు పక్క పాన్ షాప్ యజమాని యాభైయేళ్ల మనిషి రోడ్డుదాటి మీనాక్షి దగ్గరగా వచ్చి.. ‘‘అమ్మాయ్.. నీకు తెలీదేమో ఇవాళ సిటీ బస్సులు తిరగవు. ఆటోలో ఇంటికి వెళ్లు’’ అన్నాడు.‘‘ఎందుకండీ?’’ మీనాక్షి అడిగింది.‘‘సిటీ బస్సుడ్రైవర్ల మధ్య ఏదో గొడవ జరిగి కొట్టుకున్నారట. అప్పటి నుంచీ బస్సులు తిరగడంలేదు. ఈ విషయం నీకు తెలీదు అనుకుంటాను. రోజులాగే కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డావు. ఎంత సేపు నిలబడినా సిటీ బస్సులు రావు. ఆటోలో ఇల్లు చేరు’’ అని వెళ్లిపోయాడు.మీనాక్షికి ఏమీ పాలుబోలేదు. ఆటోలో ఇంటికి వెళ్లవచ్చు. కానీ ఆటోకి సరిపడా డబ్బులు లేవు. సిటీ బస్సుకే డబ్బులున్నాయి. ఆటోలో ఇంటికి వెళ్లినా తన మేనత్త ఆటోవాడికి డబ్బులు ఇవ్వదు. తనని తిట్టిపోస్తుంది. ఆమె వట్టి డబ్బు మనిషి. పరమ గయ్యాళి. నీతి నియమాలు లేవు. డబ్బే ప్రధానం ఆమెకు. డబ్బుకోసం ఎంత నీచానికైనా సిద్ధపడుతుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మీనాక్షి తల్లి అనారోగ్యంతో చనిపోయింది. మీనాక్షి తండ్రి శ్రీపాదం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మీనాక్షి ఒక్కతే కూతురు కావడంతో మీనాక్షిని చెల్లెలు సూర్యలక్షి ఇంట్లో వుంచాడు. మీనాక్షి పెంపకానికి చెల్లెలికి కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకుని.. శ్రీపాదం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కూతురి మీద చాలా ప్రేమ. అందుకే శక్తికి మించిన పని అయినా మీనాక్షిని కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. మీనాక్షి ఇంటర్ చదువుతోంది. ఇంటర్ చదువుతున్నా డిగ్రీ పూర్తి చేసిన దానిలా కనబడుతుంది. వయసునుమించిన ఎదుగుదల. మీనాక్షికి తల్లి పోలిక వచ్చింది. తల్లి అందంతో పాటూ.. తల్లి భారీతనం కూడా వచ్చింది.ఆలోచనలో వుండగానే మీనాక్షి ముందు అంబాసిడర్ కారు ఆగింది.అందులో మీనాక్షితో పాటు.. కాలేజీలో చదివే అమ్మాయి వకుళ కనపడింది.‘‘మీనాక్షీ... వచ్చి కారెక్కు. ఈ రోజు సిటీ బస్సులు తిరగవట.’’ అని మీనాక్షిని పిలిచింది వకుళ.డ్రైవర్ సీటులో కూర్చున్న లావుపాటి మనిషి కూడా మీనాక్షిని పిలిచాడు.‘‘నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు’’ అన్నది వకుళ మీనాక్షి సంశయాన్ని చూసి. మరోకప్పుడయితే మీనాక్షి కారు ఎక్కేది కాదు. కానీ వకుళ పిలవడంతో వెళ్లి కారెక్కి వకుళ పక్కన కూర్చుంది. కారు బయల్దేరింది. సిటీబస్సు డ్రైవర్ల గొడవ గురించి వకుళ చెబుతున్నప్పుడే వకుళ ఇల్లు వచ్చేసింది. కారు దిగి మీనాక్షికి చెప్పి వకుళ వెళ్లిపోయింది.‘‘మీ ఇల్లు ఎక్కడ?’’ కారు నడుపుతున్న మనిషి అడిగాడు.మీనాక్షి చెప్పింది.కారు బయల్దేరింది. కొంత దూరం వెళ్లి ఊరి బయటవున్న కాలనీలో ఒక మేడ ముందు ఆగింది.‘‘ఇక్కడ ఆపారేం?’’ అనుమానంగా అడిగింది మీనాక్షి.‘‘ఈ ఇంట్లో నా భార్య అనారోగ్యంతో ఉంది. ఒక ముఖ్యమైన మందు సీసా ఇవ్వాలి. నువ్వు కూడా దిగిరా’’ అన్నాడు.‘‘నేనెందుకు?’’‘‘చెబుతాను. ఈ మధ్య నీ వయసులో అచ్చం నీలాగే ఉండే మా కూతురు జబ్బు చేసి చనిపోయింది. ఆ దిగులుతో నా భార్య మంచం పట్టింది. నా భార్య మనసు తేలికపడుతుందని రమ్మంటున్నాను ప్లీజ్. కాదనకు’’ అర్థింపుగా అన్నాడు.మీనాక్షిది జాలిగుండె. ఇంకేమీ ఆలోచించకుండా కారుదిగి అతని వెనకే వెళ్లింది. అతను మేడమీద ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్లాడు. మీనాక్షి ఆ గదిలో అతను చెప్పిన అతని భార్య కోసం చూస్తున్నప్పుడు తలుపు మూసి బోల్టు వేశాడు. ఆ గదిలో ఎవరూ లేరు.తలుపు ముయ్యటం చూసి మీనాక్షి భయపడి ‘‘ఏమిటీ మోసం? నేను వెళ్లాలి. తలుపు తెరవండి.’’ అన్నది ఆందోళనగా.అతను నవ్వి ‘‘నువ్వు వెళ్లలేవు. నిన్ను మీ అత్త నాకు అమ్మేసింది. డబ్బు కూడా ఇచ్చేశాను. అందుకే తీసుకొచ్చాను’’ అన్నాడు.‘‘ఎవరు నువ్వు? నన్నేం చెయ్యబోతున్నావు?’’‘‘నిజం చెప్పినా సరే..! నువ్వు నన్నేం చెయ్యలేవు. నేను అమ్మాయిల బ్రోకర్ని. నీలాంటి అందమైన అమ్మాయిలను పట్టుకుని చెన్నై, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న బ్రోతల్ కంపెనీలకు అమ్ముతూ వుంటాను. అది నా వృత్తి. నీ మేనత్త సూర్యలక్ష్మి నిన్ను నాకు అమ్మింది. డబ్బు కూడా ఇచ్చాను. అవకాశం కోసం చూస్తున్నాను. ఇవాళ వచ్చింది. నువ్వు చిక్కావు. అక్కడ నీకు ఏ లోటూ వుండదు. ఖరీదయిన బట్టలు, నగలు, నీకు మంచి ఫ్యూచర్ వుంటుంది. డబ్బుకు లోటు వుండదు. దిగులుపడకు. నవ్వుతూ వుండు.’’ అన్నాడు. మీనాక్షికి ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో ‘‘నేను నీ కూతురులాంటి దాన్ని. నన్ను వదిలిపెట్టు’’ అన్నది చేతులు జోడించి.‘‘అమ్మాయిల వ్యాపారం చేసే నాకు సెంటిమెంట్లు వుండవు. నాకు డబ్బే ముఖ్యం. నేను నా తమ్ముడి కూతుర్నే చెన్నై కంపెనీకి అమ్మాను’’ అన్నాడు నవ్వుతూ.‘‘అరిచి గోల చేస్తాను’’ బెదిరించింది మీనాక్షి.‘‘నువ్వు అరిచినా ప్రయోజనం వుండదు. నీ అరుపులు ఎవరికీ వినపడవు’’ అని పెద్దగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి ఎవరో తలుపును గట్టిగా నెట్టారు. బోల్టువూడి కింద పడింది. తలుపు తెరుచుకోగానే మీనాక్షి తండ్రి శ్రీపాదంతో పాటు నలుగురు పోలీసులు లోపలికి వచ్చారు.వాళ్లను చూసి అతడు పరిగెత్తబోయాడు. పోలీసులు అతడిని గట్టిగా పట్టుకున్నారు.తండ్రిని చూసి మీనాక్షి సంతోషంతో.. ‘‘నాన్నా నేను ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది?’’ అన్నది.‘‘నేను బస్టాపు ముందు నుంచి కార్లో వెళుతూ, నువ్వు వీడి కారులో ఎక్కడం చూశాను. వీడి గురించి నాకు తెలుసు. వీడి పేరు జగదీష్. అమ్మాయిల బ్రోకర్‌గా ఈ సిటీలో వీడికి మహాగొప్ప పేరుంది. వీడి కారును ఫాలో అయ్యాను. ఇంట్లోకి తీసుకెళ్లడం చూశాను. నిన్ను మోసంతో తీసుకువచ్చాడని అర్థమైంది. దాంతో పోలీసులను తీసుకొచ్చాను’’ చెప్పాడు శ్రీపాదం.జగదీష్ గింజుకుంటున్నాడు పోలీసుల చేతుల్లో..‘‘లక్ష్మి అత్తే నన్ను వీడికి అమ్మిందట’’ మీనాక్షి చెప్పింది.శ్రీపాదం పోలీసు ఇన్స్పెక్టర్తో అదే చెప్పాడు.‘‘ఎవర్నీ వదిలేది లేదు. ఆమెకీ శిక్ష తప్పదు. పదండి ఆమెను కూడా పట్టుకుందాం’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అమ్మాయిల బ్రోకర్ జగదీష్‌ను ఎక్కించుకున్న పోలీసు జీపు సూర్యలక్ష్మి కోసం బయల్దేరింది. జొన్నలగడ్డ అరుణ -
గల్లా అరుణకు చేదు అనుభవం
గుంటూరు : గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి శనివారం గల్లా అరుణకుమారి విచ్చేశారు. ఆమె రాకను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎందుకొచ్చారని ఆమెపై మండిపడ్డారు. సొంత ఇమేజ్ కోసం గ్రూప్‌లను ప్రోత్సహిస్తే తాము సహించేది లేదని సదరు కార్యకర్తలు గల్లా అరుణకుమారిని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక గల్లా అరుణకుమారి వచ్చిన దారినే వెనక్కి తిరిగారు.