ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తాజాగా వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు..? నిహారిక తరుపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు.
(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?)
ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరుగానే ఉన్నారు కూడా. దీంతో మొదటగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆపై నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. అతను నాగబాబుకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టే విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డ - నిహారికల వివాహం జరిగింది. వీరిద్దరి అంగీకారం మేరకు జూన్ 5న కోర్టు విడాకుల ఉత్తర్వులు జారీ చేసింది. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment