
కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్‌గా టాప్ స్టార్ ఇమేజ్ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది.
కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్ సచ్‌దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్‌ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్ వినగానే తనకు డాన్స్ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది.

దీంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి రోడ్డుపైనే డాన్స్ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్‌లో డాన్స్ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment