sarathkumar
-
మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్‌కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫైర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానళ్లలో చెడుగా మాట్లాడటం, ట్రోల్ చేయడం చాలా తప్పు అంటూ ఆయన మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్లో కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు సుమారు 20కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు మీనా కూడా మంచు విష్ణును అభినందించారు.మీనాపై దుష్ప్రచారం చాలా తప్పు: శరత్ కుమార్ సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన మీనా గురించి కూడా పలు యూట్యూబ్ ఛానళ్లు తప్పుగా వీడియోలు చేశాయి. ఆమె మరో పెళ్లి చేసుకోనుందంటూ తీవ్రంగా ప్రచారం చేశాయి. దీంతో ఆమె పలుమార్లు మండిపడ్డారు కూడా. తాజాగా శరత్‌కుమార్ ఈ అంశం గురించి మాట్లాడారు. నటి మీనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. ఒక ఆడబిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. మీనా గురించి తప్పుగా మాట్లాడే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని అలా మాట్లాడేవారి దగ్గర ఏదైనా రుజువు ఉందా..? ఏది కావాలంటే అది మాట్లాడటం చాలా నీచమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు తలచుకుంటే రాత్రికి రాత్రే ఇలాంటి వాటిని అదుపు చేయవచ్చని శరత్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు.వాళ్లు పురుగులతో సమానం: రాధికయూట్యూబ్ ఛానళ్లలో సినీ సెలబ్రిటీల గురించి హీనంగా మాట్లాడే వారు పురుగులతో సమానమని రాధికా శరత్‌కుమార్ అన్నారు. కోలీవుడ్‌లో కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినంటూ చెప్పుకుంటున్న బైల్వాన్ రంగనాథన్ లాంటి వారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా తప్పని అన్నారు. -
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్
నటి రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటి ఆమె. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు, సీరియళ్లు నిర్మించారు. ఆరుపదుల వసంతాలను దాటిన ఈమె ఇప్పటికీ నాట్ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు. (ఇదీ చదవండి: హన్సిక సంగతేంటి నెల్సన్..?) 1978లో దర్శకుడు భారతీ రాజా కిళక్కే పోగుమ్ రయిల్ అనే తమిళ చిత్రం ద్వారా రాధికను కథానాయకిగా పరిచయం చేశారు. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పూవరసంపు పూత్తాచ్చు అనే పాట ఇప్పటికీ తమిళనాడులో వాడ వాడలా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ తెలుగు, హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటారు రాధిక శరత్ కుమార్. సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరుకాదల్ కథై చిత్ర దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు వరించింది. కాగా ఈమె నటిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తన భర్త శరత్ కుమార్‌తో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) -
నాన్న వల్ల వచ్చిన అవకాశాలు పోయాయి : వరలక్ష్మీ శరత్‌కుమార్
చాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా? ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు. దర్శకుడు శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. -
అజిత్ వర్సెస్ విజయ్.. సూపర్‌స్టార్ ఎవరు? కోలీవుడ్‌లో ఫ్యాన్స్ రచ్చ
తమిళసినిమా: సూపర్‌స్టార్ ఎవరన్న విషయంపై కోలీవుడ్‌లో పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ కథానాయకుడిగా వారిసు చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు విజయ్‌కు అజిత్ కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉందని, ఆయనే నంబర్‌వన్ అని ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. అదే వేదికపై నటుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తు సూపర్‌స్టార్ విజయ్ అని తాను సూర్యవంశం విజయోత్సవ వేదికపైనే చెప్పానని.. అది నిజమైందని పేర్కొన్నారు. అది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో డిబేటింగ్ వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నంత వరకు ఆయనే సూపర్‌స్టార్ అని సీనియర్ నటుడు, నిర్మాత కె.రాజన్ పేర్కొన్నారు. నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మాత్రం నేటి సూపర్‌స్టార్ విజయ్ అని తెలిపారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయమై నటుడు శరత్‌కుమార్ ఒక చానల్లో మాట్లాడుతూ.. తాను విజయ్ సూపర్‌స్టార్ అని సంబోధించానే కాని రజనీకాంత్, అజిత్ సూపర్స్టార్లు కాదని చెప్పలేదన్నారు. రజనీకాంత్‌తో పాటు అజిత్, అమితాబచ్చన్, షారూక్‌ఖాన్ వీళ్లంతా సూపర్స్టార్లేనని శరత్‌కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా సూపర్‌స్టార్ అన్నది ఒక టైటిల్ కాదని పేర్కొన్నారు. దీని గురించి ఇకపై వివాదం చేయాలన్న ఆలోచన లేదని, దీనిని వివరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అదే విధంగా తాను విజయ్ ముఖ్యమంత్రి అవుతారనో, మంత్రి అవుతారనో చెప్పలేదని, సూపర్‌స్టార్ అవుతారని చెప్పానని అన్నారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా సూపర్‌స్టార్లే అని పేర్కొన్నారు. సూర్యవంశం చిత్ర వేడుకలలో చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నానని, రియల్ సూపర్‌స్టార్ అంటే ఎప్పటికీ ఎంజీఆర్నే అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ఆన్లైన్ రమ్మీ.. నాలెడ్జ్ గేమ్ అని సమత్తువ మక్కల్ కట్చి నేత, సినీ నటుడు శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్ గేమ్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్ భవన్ వర్గాలు పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించాలని అన్ని వైపుల నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఒత్తిడి వస్తోంది. అయితే ఆన్లైన్ రమ్మీకి ప్రచారకర్తగా సినీ నటుడు శరత్‌కుమార్ వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ గేమ్‌ను ప్రోత్సహించే విధంగా శరత్ ప్రకటనలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్నాయి. దీనిపై మీడియా మంగళవారం శరత్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ రమ్మీ నాలెడ్జ్ గేమ్ అని వ్యాఖ్యనించారు. అయితే, తాను చెప్పినందు ఈ గేమ్‌లను ఆడే వాళ్లు రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను నిజాయితీగా ఓట్లు వేయమని అడిగితేనే వేయని వాళ్లు, తాను చెప్పినట్లుగా వింటారా?.. అని అన్నారు. కాగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు రెండేళ్ల ముందుగానే ఈ ప్రకటన (యాడ్)ను చిత్రీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనిని ఆ సంస్థ ఇప్పుడు తెర మీదకు తెచ్చినట్లుందని పేర్కొన్నారు. అయితే, రమ్మీ మేథా సంపత్తిని పెంచుతుందంటూ శరత్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎక్కువయ్యాయి. sunnewstamil: #Watch | “2 வருஷத்துக்கு முன்பே, ரம்மி தடை சட்டம் வந்திருந்தால் விளம்பரத்தில் நடித்திருக்க மாட்டேன்” - சமத்துவ மக்கள் கட்சித் தலைவர் சரத்குமார் #SunNews | #Sarathkumar | #OnlineRummy | @realsarathkumar pic.twitter.com/BBrMpEyBG3 — Parundhu News (@Parundhu_News) December 13, 2022 -
నటుడు శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు.. పీఆర్ టీం క్లారిటీ
ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్‌తో శరత్‌కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్‌మీడియాలోనూ శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్‌కుమార్ పీఆర్ టీం స్పందించింది. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం తెలిపింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శరత్‌కుమార్‌కు ప్రస్తుతం వారీసు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్ధత
ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్‌కుమార్ సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్‌కుమార్ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. -
Puneeth Rajkumar: తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు శరత్‌కుమార్
Sarathkumar Emotional Words About puneeth Rajkkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వాగానికి లోనయ్యారు. -
ఉక్కు మనిషికి హ్యాపీ బర్త్‌డే: రాధికా శరత్‌కుమార్
Sarathkumar Birthday: తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ నేడు(జూలై 14న) 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, నటి రాధిక సోషల్ మీడియా వేదికగా భర్తకు బర్త్‌డే విషెస్ తెలిపింది. 'ఉక్కు మనిషి, బంగారం లాంటి మంచి మనసున్న శరత్‌కుమార్‌కు హ్యాపీ బర్త్‌డే' అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు రాధిక శరత్‌తో కలిసి దిగిన ఫొటోలను మనం చూడొచ్చు. పనిలో పనిగా తన ఫోన్ వాల్‌పేపర్‌ను కూడా రివీల్ చేసిందీ నటి. అలాగే శరత్ తనలోని పాకశాస్త్ర నిపుణుడికి పని చెప్తూ కిచెన్‌లో వంట చేయడం కూడా కనిపిస్తోంది. కాగా శరత్‌కుమార్ 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నెగెటివ్ రోల్స్ చేసిన ఆయన తర్వాత సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. 2007లో సొంతంగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పొలిటికల్ రంగంలోనూ శరత్ విజయాన్ని సాధించడం విశేషం. Man of steel , heart of gold @realsarathkumar Happy birthday pic.twitter.com/bhLvRo1d3O — Radikaa Sarathkumar (@realradikaa) July 14, 2021 Happppppppyyyyyyyy birthdayyyyyyyy daddyyyyy..... you are the strongest person I know..love you to the mooonnnnn n backkkkkkkkk times infinity..😘😘😘😘 thank you for being you..have a fantastic day daddy...!! @realsarathkumar pic.twitter.com/ITBUxQIUbj— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 14, 2021 -
ఓటీటీలోకి శరత్‌కుమార్ ఎంట్రీ, నిర్మాతగా రాధిక
నటుడు శరత్‌కుమార్ ఓటీటీ ఎంట్రీ షురూ అయింది. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో కథానాయకుడిగా నటించి సుప్రీం హీరోగా పేరు గాంచిన నటుడు శరత్‌కుమార్ తాజాగా 'ఇరై' అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ అవుతున్నారు. ఈ సిరీస్ ఆయన సతీమణి, నటి రాధిక శరత్‌కుమార్ తన రాడాన్ సంస్థలో నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు తూంగావనం, కడారం, కొండాన్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజేస్ ఎం.సెల్వ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సిరీస్ గురించి నిర్మాత రాధిక శరత్‌కుమార్ మాట్లాడారు. ఇరై వెబ్ సిరీస్ ద్వారా తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రంగం ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. -
ఆ విషయంపై కోర్టుకు వెళ్తా: రాధిక
నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్ బౌన్స్ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్ బౌన్స్ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నటుడు శరత్ కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. Thanks everyone for the love and affection, I am not down with corona virus, just body ache after second vaccine. On line press are just filing rubbish about health and case.We will fight it in higher courts. I am back at work, have a good day ❤️❤️❤️ — Radikaa Sarathkumar (@realradikaa) April 9, 2021 చదవండి: రాధిక, శరత్‌కుమార్ దంపతులకు షాక్ కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన -
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం
సాక్షి, చెన్నై: ఎస్ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్, మహిళా నేత, నటి రాధికా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ మేరకు ఎస్ఎంకే వర్గాలు మంగళవారం ప్రకటించాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యంతో కలిసి ఎస్ఎంకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఎస్ఎంకే 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల జాబితాను శరత్‌కుమార్ ప్రకటించారు. ప్రతి ఎన్నికల్లోనూ శరత్‌కుమార్ పోటీ చేస్తూ వచ్చారు. ఈ సారి రాధిక కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా ఇది వరకే శరత్‌కుమార్ ప్రకటించారు. ఈ జాబితాలో ఆ ఇద్దరి పేర్లు లేవు. ఆ ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎస్ఎంకే ప్రకటించింది. అయితే కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇద్దరు ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. చదవండి: బెంగాల్ గెలుపు బీజేపీకి కీలకం -
కరోనాకి భయపడాలి
నటుడు శరత్‌కుమార్ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయనకు నెగిటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నాన్నను మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కరోనా అనేది ఎంత ప్రమాదమో కుటుంబంలో ఎవరికైనా పాజిటవ్ అని నిర్ధారణ అయినప్పుడే తెలుస్తుంది. అది ఎంత ఘోరమైన వైరస్సో తెలిసింది. అందుకే కరోనాకి భయపడాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన తండ్రికి వైద్యం చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారామె. -
తమిళ నటుడికి కరోనా పాజిటివ్
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి రాధిక సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు. లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్ ట్వీట్ చేశారు. (చదవండి: థియేటర్లలో చంపడానికి రాబోతుంది: ఆర్జీవీ) కాగా శరత్ ప్రస్తుతం "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆడంగత్తె' సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఆయన కూతురు వరలక్ష్మి విషయానికి వస్తే.. పలు సినిమాల్లో నటించిన ఆమె 'కన్నామూచ్చి' అనే తమిళ సినిమాతో దర్శకురాలిగా మారబోతున్నారు. కన్నామూచ్చి అంటే తెలుగు దాగుడుమూతలు అని అర్థం. అలాగే తెలుసులో రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. (చదవండి: ఒకరికొకరు నిలబడదాం: వరలక్ష్మి శరత్‌కుమార్) Today Sarath tested positive for Coronavirus in Hyderabad. He’s asymptomatic and in the hands of extremely good doctors! I will keep you updated about his health in the days to come. @realsarathkumar @rayane_mithun @imAmithun_264 @varusarath5 — Radikaa Sarathkumar (@realradikaa) December 8, 2020 -
నటుడు శరత్‌కుమార్‌పై కేసు నమోదు
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) భూముల విక్రయం కేసులో నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు నటుడు రాధారవితో సహా నలుగురిపై కాంచీపురం క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నడిగర్ భూముల విక్రయంపై తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేగిన విషయం తెలిసిందే. భూములను అక్రమంగా అమ్మారనేది ప్రధాన ఆరోపణ. ఈ భూముల అమ్మకంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా విక్రయం జరిగిందని తేలడంతో పలువురిపై కేసు నమోదు చేశారు. -
తమిళనాడులో మరో కూటమి
సాక్షి, చెన్నై: తమిళనాడులో మరో రాజకీయ కూటమి ఏర్పాటైంది. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మదురై విమానాశ్రయంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని, రాష్ట్ర సంక్షేమం కోసం తాము కలిసి పోరాడతామని వారు తెలిపారు. అంశాలవారీగా పోరు కొనసాగిస్తామని ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన శరత్‌కుమార్, సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది. రజనీ-కమల్‌కు వ్యతిరేకంగా వీరు గళం విన్పిస్తున్నారు. మరోవైపు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ కూడా రజనీ-కమల్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. -
విశాల్‌కు హైకోర్టు ఆదేశం..
సాక్షి, పెరంబూరు: ఈ నెల 22న హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ హైకోర్టుకు తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. 2015లో జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల్లో విశాల్ బృందం గెలుపొందిన విషయం తెలిసిందే. అప్పట్లో గత కార్యవర్గం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలతో సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి తదితరులపై చర్యలు తీసుకోనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై రాధారవి చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. కేసు స్వీకరించిన న్యాయస్థానం విచారణ పూర్తయ్యే వరకూ రాధారవి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. విశాల్ తరపున కూడా ఎలాంటి చర్యలు చేపట్టబోమని వెల్లడించారు. అయితే కొన్నిరోజుల తరువాత రాధారవితో పాటు కొందరు మాజీ సభ్యులను సంఘం నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో విశాల్ వర్గం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాధారవి హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై 19వ తేదీన కోర్టుకు హాజరై బదులివ్వాల్సిందిగా విశాల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ 19వ తేదీన విచారణకు విశాల్ గైర్హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది హాజరై విశాల్ ఆనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని వివరించారు. దీంతో ఆ నెల 22న విశాల్ తప్పని సరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించి విచారణను వాయిదా వేసింది. -
హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌కు శరత్‌కుమార్
నటుడు శరత్‌కుమార్ కథానాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం అయ్యారు. ఇటీవల తెలుగు, మలయాళ వంటి ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న శరత్‌కుమార్ తమిళంలో కథానాయకుడిగా చిత్రం చేసి చాలా కాలమైందనే చెప్పాలి. ఇంతకు ముందు ఆయన నటించిన చెన్నైయిల్ ఒరునాళ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా చెన్నైయిల్ ఒరునాళ్–2 చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. కల్పతరు పిక్చర్స్ పతాకంపై రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జేపీఆర్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ నవలా రచయిత రాజేశ్‌కుమార్ రాసిన ఒక క్రైమ్ థ్రిల్లర్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చెన్నైయిల్ ఒరునాళ్. ఈ రచయిత రాసిన నవలతో తెరకెక్కిన కుట్రం–23 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుందన్నది గమనార్హం. శరత్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ తాజా చిత్రంలో మునీశ్కాంత్, అంజనా ప్రేమ్, రాజసిమ్మన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. నిశ్శబ్దం చిత్రం ఫేమ్ బేబీ సాతన్య ప్రధాన పాత్రలో నటించనుంది. దీపక్ ఛాయాగ్రహణం, రాణా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోవైలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అన్నారు. ఇందులో శరత్‌కుమార్ అండర్ కవర్ ఏజెంట్‌గా నటిస్తున్నారని చెప్పారు. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను కోవైలో 30 రోజుల పాటు ఏకాధాటిగా నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
శరత్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకో
తమిళసినిమా: శరత్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకో? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రజనీకాంత్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అని రజనీకాంత్ అభిమానులు హెచ్చరించారు. రజనీకాంత్ ఇటీవల ఓ కార్యక్రమంలో జయలలిత మరణానంతరం తమిళనాడులో ఆసాధారణ పరిస్థితి నెలకొంది అన్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సమత్తువ మక్కళ్ కచ్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ స్పందిస్తూ రజనీకాంత్ రాజకీయాల్లోకొస్తే ఆయన్ని ఎదుర్కొనే మొదటి వ్యక్తిని తానే అవుతానని అన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇక రజనీ అభిమానులైతే శరత్‌కుమార్‌పై విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం రజనీ అభిమానులు స్థానిక నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రజనీకాంత్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ స్థాయి ఏమిటో గుర్తెరిగి ప్రవర్తించు. నోరు అదుపులో పెట్టుకో. రజనీకాంత్ రాజకీయాల్లోకొస్తే నీ పార్టీ మట్టికొట్టుకుపోతుంది లాంటి హెచ్చరికలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ విషయం తెలుసుకున్న నందంబాక్కం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రజనీ అభిమానులను శాంతపరచి అక్కడనుంచి పంపివేశారు. కాగా చెన్నైలోని వడపళని వంటి ప్రాంతాల్లో శరత్‌కుమార్ అభిమానులు రజనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని పరిస్థితులను చక్కదిద్దారు. -
ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. చెన్నై : గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సంఘ అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకలను, దివంగత ప్రముఖ కథాకారుల పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు. బి.సరోజాదేవికి మక్కల్ తిలకం అవార్డు కాగా ప్రఖ్యాత నటి సరోజాదేవిని మక్కల్ తిలకం అవార్డుతో సత్కరించారు, అదే విధంగా నడిగర్ తిలకం అవార్డును నటి కాంచనకు, భానుమతి అవార్డును నటి ఊర్వశీ శారదకు, అంజలిదేవి అవార్డును, నటి వాణిశ్రీకి, ఎంఆర్.రాధ, తంగవేల్ల పేరుతో అవార్డును నటుడు వెన్నిరాడై మూర్తికి, టీపీ.రాజ్యలక్ష్మి అవార్డును ఎంఎస్.రాజ్యంకు, మనోరమ అవార్డును ఎస్.పార్వతికి, సహస్రనామ అవార్డును ఎన్ఎస్కే.థామ్‌కు, ఎస్ఎస్.రాజేంద్రన్ అవార్డును వినూచక్రవర్తికి అందించి ఘనంగా సత్కరించారు. తమిళసినిమా శతాబ్ది అవార్డుల ప్రదానం అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు. ఆందోళన, ముష్టి యుద్ధాలు: సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. విశాల్ కార్యాలయం పై దాడి: అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు. వేటును సమర్థించుకున్న నిర్వాహకులు కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు శఅనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపారు. నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. -
శరత్‌కుమార్, రాధారవి సస్పెన్షన్
చెన్నై: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నుంచి ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు సంఘ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లే సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందులో భాగంగా తాము నిర్వహించిన శోధనల్లో గత సంఘం నిర్వాహకం చేసిన పలు అవకతవకలు, అవినీతి వెలుగులోకి వచ్చాయని, వీటి గురించి పలు మార్లు కార్యవర్గ సమావేవంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు నడిగర్ సంఘం పేర్కొంది. అందులో భాగంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని, సంఘ విధి విధానాల పరంగా జరిగిన అవకతవకలపై విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపింది. అంత వరకూ మాజీ సంఘం నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగా చంద్రశేఖర్‌ల సంఘ సభ్యత్వంను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలపింది. -
కుమార్తె సంగీత్ వేడుకలో ఇరగదీసిన రాధిక
తమిళసినిమా(చెన్నై): సినీనటి రాధిక కూతురు రెయాన, మిథున్ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్హోటల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. లతారజనీకాంత్, భాగ్యరాజ్ పూర్ణిమ, సుహాసిని, త్రిష, రమ్యకృష్ణ, శోభన, మధుబాల, స్నేహ, ప్రసన్న, నమిత, ఐశ్వర్యాధనుష్, దర్శకుడు సుందర్.సి, కుష్బు, జయం రవి, లక్ష్మి మంచు, వెంకటేశ్, శ్రీకాంత్, వందన, శాంత కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సినీతారలు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ముఖ్యంగా పెళ్లికూతురి తల్లి రాధిక చేసిన నృత్యాలు అలరించాయి. -
నటుడు శరత్‌కుమార్‌కు అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, అఖిల భారత సమత్తువ కచ్చి నేత శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు తీవ్రంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబు సభ్యులు ఆయన్ని థౌజండ్ లైట్స్ సమీపంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు. అనంతరం శరత్‌కుమార్ సాయంత్రమే ఇంటికి వెళ్లిపోయినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు. ఇటీవల శరత్ కుమార్ రాజకీయ పరంగానూ, వ్యక్తిగతంగానూ తీవ్ర అశాంతికి గురయ్యారని సమాచారం. ఆ మధ్య జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయన నటనకు దూరంగా ఉంటూ వచ్చారు.అదే విధంగా ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ఆయన పరాజయం పాలైయ్యారు. ఇటీవల విహారయాత్రకు విదేశాలు వెళ్లిన శరత్‌కుమార్ గత వారం చెన్నై నగరానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ కన్నడ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు కూడా. -
ఉపన్యాసాలకు విజయకాంత్ తగడు
సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా మదురై: వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం మదురై అన్నాడీఎంకే నార్త్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మేయర్ రాజన్ చెల్లప్పకు మద్దతుగా శరత్‌కుమార్ మదురై పుదూర్, సెల్లూర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కోశాధికారికి గణాంకాలు కూడా సరిగ్గా తెలియవన్నారు. కచ్చదీవిని ధారాదత్తం చేసిన ఘనత డీఎంకేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధించడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. -
జయలలితతో శరత్ కుమార్ భేటీ
చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత, నటుడు శరత్ కుమార్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితతో భేటీ అయ్యారు. పోయిస్ గార్డెన్లో సీఎం నివాసంలో వీరి భేటీ జరిగింది. సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకే కూటమికి తమ మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరత్ కుమార్ మళ్లీ అన్నాడీఎంకే కూటమికి చేరువయ్యారు. మరోవైపు నిన్న మొన్నటివరకూ పొత్తులపై ఉత్కంఠకు తెరలేపిన డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే, బీజేపీలకు ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఇవాళ పీడబ్ల్యూఎఫ్, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో పొత్తు కుదుర్చుకున్నారు. కెప్టెన్ చర్యకు డీఎంకేతో పాటు బీజేపీకి షాక్ తగిలినట్లు అయింది. పదేళ్ల క్రితం 2005లో పార్టీని స్థాపించిన విజయకాంత్...తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆయన మినహా అందరూ ఓడిపోయారు. డీఎండీకే ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగారు. 2011 ఎన్నికల్లో అతిపెద్ద రెండవపార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. -
చీలిన ఎస్ఎంకే
* మరో ఎంఎస్కే ఆవిర్భావం * కమిటీ ప్రకటించిన ఎర్నావూర్ * అమ్మకు మద్దతుగా ప్రచారం * శరత్‌కు ప్రత్యర్థిగా బరిలోకి సాక్షి, చెన్నై : అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి చీలింది. కొత్తగా శుక్రవారం సమత్తువ మక్కల్ కళగం ఆవిర్భవించింది. శరత్‌కుమార్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు తాను సిద్ధం అని ఎర్నావూర్ నారాయణన్ ప్రకటించారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో నాడార్ సామాజిక వర్గ అభ్యున్నతి లక్ష్యంగా అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) ఆవిర్భవించి ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే చిహ్నంతో ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎర్నావూర్ నారాయణన్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తాజాగా, శరత్‌కుమార్, నారాయణన్‌ల మధ్య బయలు దేరిన వివాదంతో ఆపార్టీ చీలిక దిశగా పయనం సాగింది. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు శరత్‌కుమార్ ప్రకటించడంతో, ఇక తాను మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ విధేయుడ్నే అని నారాయణన్ స్పష్టం చేశారు. అలాగే, ఎస్‌ఎంకేను కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, సాధ్య పడకపోవడంతో చివరకు ఎస్‌ఎంకేను చీల్చడంతో పాటుగా శరత్‌కుమార్‌ను ఇరకాటంలో పెట్టే విధంగా ఎస్ఎంకే నినాదంతో కొత్త పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ : సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)ని ఇరకాటంలో పెట్టే విధంగా సమత్తువ మక్కల్ కళగం(ఎస్ఎంకే) నినాదంతో ఎర్నావూర్ నారాయణన్ తన పార్టీని ప్రకటించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీ ప్రకటనతో పాటుగా హిందూ, ముస్లీం, క్రైస్తవ ఐక్యతను చాటే రీతిలో జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు, మధ్యలో తెలుపు వర్ణంతో వలయాకారం, మధ్యలో పిరమిడ్‌ను తలపించే గుర్తును పొందు పరిచారు. అనంతరం ఎర్నావూర్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, కొత్త కమిటీని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా ఎర్నావూర్ నారాయణన్, ప్రధాన కార్యదర్శిగా సూలూరు టీఆర్ చంద్ర శేఖరన్, కోశాధికారిగా కన్నన్, ఉపాధ్యక్షుడిగా ధనుస్కోడి, సంయుక్త కార్యదర్శిగా టీ.వినాయక మూర్తి, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా తంగముత్తు, రాజకీయ సలహాదారుగా ఎస్ గణేషన్ వ్యవహరించనున్నారు. అలాగే, రాష్ట్రంలోని 32 జిల్లాలకు కార్యదర్శుల్ని ప్రకటించారు. యువజన కార్యదర్శిగా ఎస్ రవి, కార్మిక కార్యదర్శిగా ఎస్ జబరాజ్లను నియమించారు. కొత్త పార్టీ ప్రకటనతో ఒకటి రెండు రోజుల్లో అమ్మ జయలలితను కలవనున్నాట్టు తెలిపారు. వాస్తవం, శ్రమ తారక మంత్రంగా నినాదాన్ని అందుకుని ముందుకు సాగనున్నామని పేర్కొన్నారు. అన్నాడిఎంకేకు శరత్‌కుమార్ తీవ్ర ద్రోహం చేశారని, ఎస్‌ఎంకేను అడ్డం పెట్టుకుని ఆయన సాగించిన అవినీతికి హద్దేలేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ చిట్టా విప్పారు. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్ ఎక్కడ పోటీ చేసినా సరే , ప్రత్యర్థిగా అమ్మ ఆజ్ఞతో బరిలో దిగడానికి తాను సిద్ధమని ప్రకటించారు. -
శరత్‌కుమార్‌కు షాక్
పలువురు నేతల టాటా ఎమ్మెల్యే నారాయణన్ కూడా చీలికకు కుట్ర పన్నారని అధినేత ఆవేదన సాక్షి, చెన్నై: సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)లో విభేదాలు బయట పడ్డాయి. ఆ పార్టీ అధినేత శరత్‌కుమార్‌కు షాక్ ఇచ్చే రీతిలో పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు.ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ కూడా హ్యాండ్ ఇచ్చారు. తన పార్టీలో చీలికకు కుట్ర జరుగుతున్నదని శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో 2007లో ఎస్ఎంకే ఆవిర్భవించింది. నాడర్ సామాజికవర్గంతో నిండి ఉన్న ఈ పార్టీ గత అసెంబ్లీ ఎ న్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించింది. నాడర్ పేరవై ఎస్ఎంకేలోకి చేరడంతో ఆ పేరవై నేత ఎర్నావూర్ నారాయణన్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కింది. నాంగునేరి నుంచి నారాయణన్, తెన్కాశి నుంచి శరత్‌కుమార్ ఎన్నికల బరిలో నిలబడి అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల మీద గెలిచారు. పేరుకు ఎస్ఎంకేలో ఉన్నా, ఇద్దరు అసెంబ్లీలో అన్నాడీఎంకే సభ్యులుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల దక్షిణ భారత సినీ నటీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ మరోమారు పోటీ చేసి కంగు తిన్నారు. తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేకు శరత్‌కుమార్ దూరంగానే ఉంటూ వస్తున్నారని చెప్పవచ్చు. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంగా శరత్‌కుమార్ వ్యవహార శైలి మారి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ సమయంలో శరత్‌కుమార్‌కు షాక్ ఇస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఐస్ హౌస్ త్యాగులతోపాటుగా పలువురు నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎంకే నుంచి బయటకు రావడమే కాదు, బీజేపీ గూట్లోకి చేరారు. అలాగే ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ సైతం శరత్‌కుమార్‌కు హ్యాండ్ ఇచ్చారు. శరత్‌కుమార్ వ్యవహార శైలిని విమర్శిస్తూ, గురువారం ఏకంగా మీడియా ముందుకు వచ్చారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో శరత్‌కుమార్ వ్యవహరించేందుకు సిద్ధం అవుతున్నారని, ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ఒత్తిడి తెచ్చారని, అందుకే తానూ వ్యతిరేకంగా వ్యవహరిచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అన్నాడీఎంకే చిహ్నం మీద గెలిచిన దృష్ట్యా, తాను మాత్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యేనే అని పేర్కొన్నారు. తనను అన్నాడీఎంకే ఆదరించిందని, రానున్న ఎన్నికల్లోనూ ఆ పార్టీతోనే కలిసి తన పయనం సాగుతుందన్నారు. ఇక ఎస్ఎంకే వ్యవహారంగా మున్ముందు తీసుకోబోయే చర్యలన్నీ చట్టపూర్వకంగానే ఉంటాయంటూ, ఆ పార్టీని చీల్చే దిశగా ముందుకు సాగుతోన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక, పార్టీ విబేధాలు రచ్చకెక్కడంతో శరత్‌కుమార్ మేల్కొన్నారు. చీలికకు కుట్ర: టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శరత్‌కుమార్ ఆగమేఘాలపై జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పార్టీ కమిటీ భేటీ అనంతంరం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారందరనీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతున్నదని మీడియా ముందు శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లు నాంగునేరి ప్రజలకు ఎర్నావూర్ నారాయణన్ ఏమి చేశారో అందరికీ తెలుసునని మండి పడ్డారు. ఇప్పుడు కూడా అన్నాడీఎంకేతో కలిసి ఎస్ఎంకే పయనం సాగిస్తున్నదని, రానున్న ఎన్నికల సమయంలో తదుపరి పార్టీ కార్యవర్గం తీర్మానాలకు మేరకు నిర్ణయాలు ఉంటాయని, ప్రస్తుతం మాత్రం అన్నాడీఎంకేలోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
హీరో విశాల్‌పై క్రిమినల్ కేసు
చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు చిలికి చిలికి గాలీవానగా మారాయి. పోటీపడుతున్న ప్రధాన జట్లు ఆగ్రహావేశాలను దాటిపోతుండగా, నటుడు శరత్‌కుమార్ హీరో విశాల్‌పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తానూ కేసు పెట్టబోతున్నట్లు విశాల్ ప్రకటించారు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్, విశాల్ జట్లు ప్రధానంగా తలపడుతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న శరత్‌కుమార్ జట్టుపై విశాల్ జట్టు గట్టి పోటీనే ఇస్తోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరువర్గాలు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీస్తోంది. రెండు రోజుల క్రితం శరత్‌కుమార్ మద్దతుదారులు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శింబు చేసిన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. సామరస్య ధోరణిలో రాజీకి సిద్ధమంటూ శరత్‌కుమార్ జట్టు చేసిన ప్రకటనను విశాల్ జట్టు స్వీకరించలేదు. పోటీకి వెళ్లడం ఖాయమని తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల తేదీ వెలువడిన నాటి నుంచి విశాల్ తనపై అవినీతి, అక్రమాలు అంటూ అనేక ఆరోపణలలో పరువునష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్‌కుమార్ శుక్రవారం ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ సమాచారం అందుకున్న విశాల్ తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా త్వరలో శరత్‌కుమార్‌పై కేసును పెడతానని ప్రకటించారు. కుటుంబాల్లో చిచ్చు నడిగర్ సంఘం ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒకే కుటుంబంలోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయారు. రెండు రోజుల క్రితం శరత్‌కుమార్ జట్టు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు భాగ్యరాజ్ పాల్గొనగా, ఆయన కుమారుడు శంతను.. విశాల్ జట్టుకు చేరాడు. అలాగే దివంగత విలక్షణ నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్ కుమారులు రాజేంద్రకుమార్, కలైవాసన్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలోనే సవాళ్లు విసురుకున్నారు. తన తండ్రికి నిర్మించదలుచుకున్న మణిమండపం కోసం రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నా నడిగర్ సంఘం స్పందించలేదని, ఇదే సమయంలో విశాల్ తనకు అండగా నిలిచి సహకరించాడని రాజేంద్రకుమార్ తెలిపారు. విశాల్ నేతృత్వంలో మధురై సమీపం చెట్టిపట్టిలో ఈనెల 12వ తేదీన తన తండ్రి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే పక్కనే ఉన్న కలైవాన్ తన సోదరుడి ప్రసంగాన్ని అడ్డుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో నిర్మాతలు తలదూర్చరాదని ఆక్షేపిస్తూ ఏఎల్ అళగప్పన్ అనే నిర్మాత కలైపులి థానుపై విమర్శలు గుప్పించాడు. నడిగర్ సంఘం ఎన్నికలకు మరో ఎనిమిది రోజులు ఉండగా ఇంకా ఎన్నిమలుపులకు దారితీస్తోందని కోలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. -
కమలహాసన్పై విరుచుకుపడ్డ శరత్‌కుమార్
చెన్నై : నటుడు కమలహాసన్ కృతజ్ఞత లేని వారు. చేసిన మేలు మరచిన కృతఘ్నుడు అని నటుడు శరత్‌కుమార్ దుయ్యబట్టారు. నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 18న జరగనున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో నటుడు శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్లు ఢీకొంటున్న సంగతి విదితమే. ఇరు జట్లు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశారు. కాగా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టుకు 64 శాతం, శరత్‌కుమార్ జట్టుకు 26 శాతం ఓట్లు పడతాయని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో నటుడు శరత్‌కుమార్ కమలహాసన్ పై ఫైర్ అయ్యారు. ఆయన చేసిన మేలు మరచే కృతఘ్నుడుని దుయ్యబట్టారు. కమలహాసన్ నటించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో సమస్యలు ఎదురైప్పుడు తాను సాయం చేశానన్నారు. అదేవిధంగా ఉత్తమవిలన్ చిత్ర విడుదలప్పుడూ తన భార్య రాధికా సాయం చేశారన్నారు. అలాంటిది నడిగర్‌సంఘం ఎలాంటి సాయం చేయలేదని కమల్ అనడం కృతజ్ఞతా హీనంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కమలహాసన్ పోటీ జట్టుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని శరత్‌కుమార్ ఆరోపించారు. -
రసవత్తరంగా మారిన చెన్నై నడిగర్ ఎన్నికలు
-
నా పేరుతో నకిలీ ఫేస్బుక్
చెన్నై : నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారని నటుడు, సమత్తువ కచ్చి నేత, శాసనసభ్యుడు శరత్‌కుమార్ ఆరోపించారు. దీని గురించి ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రెండు రోజు క్రితం తన పేరుతో ఎవరో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారన్నారు. ఇది తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారెవరైనా సరే వెంటనే తొలగించాలన్నారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అదే విధంగా తాను నిత్యం రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తానని తెలిపారు. శరీరం దృఢంగా ఉంటేనే మనసు, చర్యలు బాగుంటాయని పేర్కొన్నారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసవ్వకూడదని అందరికి హితవు చెబుతుంటానని అలాంటిది వృత్తిపరమైన, చిత్రం నుంచి తొలగించిన ఒక ఫొటోను సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేస్తూ తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపై తన ఫొటో గానీ, తనకు సంబందించిన న్యూస్‌ను గానీ ఏ సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేయరాదని మనవి చేస్తున్నానని శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
జయను ప్రధానమంత్రిని చేద్దాం
టీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని 40 పార్లమెంట్ స్థాలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రి జయలలితను ప్రధానిగా చేసేందుకు కృషి చేద్దామని తిరునల్వేలిలో జరిగిన సమత్తువ మక్కల్ కట్చి మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ పిలుపునిచ్చారు. సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) రెండవ రాష్ట్ర మహానాడు ఆదివారం సాయంత్రం నెలై్లలో ప్రారంభమైంది. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మాట్లాడారు. తమది కులానికి చెందిన పార్టీ కాదన్నారు. కామరాజర్ బాటలో జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడటమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పతిపక్ష పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు వహిస్తున్న డీఎండీకే నేత విజయకాంత్ బాధ్యతాయుతంగా నడుచుకోవడంలో విఫలమయ్యారన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న సమయంలో శ్రీలంక తమిళులను కాపాడేందుకు ప్రయత్నించకుండా ప్రస్తుతం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు డీఎంకే వ్యవహరిస్తోందన్నారు. కట్చి దీవిని కోల్పోయి ప్రస్తుతం జాలర్లు అలమటించేందుకు ఆ పార్టీయే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అన్నాడీఎంకే కూటమి 40 స్థానాలను కైవసం చేసుకుంటుందని, దీని ద్వారా జయలలిత ప్రధాని అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఆమె ప్రధాని పీఠాన్ని అధిష్టించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని అన్నారు. ఇదే సమయంలో మహానాడులో తీర్మానాలను ప్రవేశ పెట్టారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మూడవ కేంద్రాన్ని తూత్తుకుడి జిల్లా కులశేఖరన్ పట్టిలో ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు అటవీ భద్రత చట్టం అమలును నిలిపివేయాలి. రాష్ట్ర జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ వ్యాపారాన్ని నిషేధించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే కూటమి 40 స్థానాల్లో గెలుపొందేందుకు ఎస్ఎంకే పాటు పడుతుంది. నెలై్ల జిల్లాను రెండుగా విభజించి తెన్ కాశి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఎస్ఎంకే మహిళ విభాగం కార్యదర్శిగా రాధికను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు రాధికకు శుభాకాంక్షలు తెలిపారు. సిరాజ, సెంట్రల్ చెన్నై వెస్ట్ జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాద్, ఎబిఎస్ పొన్నరసన్ పాల్గొన్నారు. -
అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం
టీనగర్, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా 40 నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నట్లు అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ తెలిపారు. రిపోర్టర్స్ గిల్డ్‌లో బుధవారం ఉదయం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరునల్వేలిలో ఫిబ్రవరి 16వ తేదీ సమత్తువ మక్కల్ కట్చి రెండవ రాష్ట్ర మహానాడు జరగనుందన్నారు. ఇందులో ఐదు లక్షల మంది పాల్గొంటారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయం, ఎన్నికల వ్యూహం గురించి ఇందులో చర్చిస్తామన్నా రు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 స్థానాలలో గెలుపొందుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే గెలుపునకు 40 స్థానాలలో తీవ్ర ప్రచారం చేపడుతామన్నారు. సమత్తువ మక్కల్ కట్చికి అన్నాడీఎంకే కూటమిలో సీటు కోరే ఉద్దేశం ప్రస్తుతానికి లేదన్నారు. ముఖ్య మంత్రి ఏ విధంగా ఆలోచిస్తున్నారో, దానికి అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో రెండు స్థానాలను తమకు కేటాయించారన్నారు. ఇంత వరకు తాము కూటమి ధర్మాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఎం.కె.అళగిరిని డీఎంకే నుంచి సస్పెండ్ చేయడం వారి పార్టీ వ్యవహా రం అన్నారు. అది వారి అంతర్గత సమస్యగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన మంత్రి కావడం తథ్యమన్నారు. నరేంద్ర మోడి ప్రధాని అయ్యేందుకు మద్దతు లభించదని, ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని అవుతారని తెలిపారు. ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుపొందలేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగరాజన్, ఉపాధ్యక్షుడు ఎర్నావూరు నారాయణన్ పాల్గొన్నారు. -
‘ట్రాఫిక్’లో ఏం జరిగింది?
గులాబ్‌జామ్ రుచి చూడని వారెవరైనా ఉంటారేమో కానీ, ట్రాఫిక్ జామ్ గురించి తెలీనివారు ఎవ్వరూ ఉండరు. ఈ ట్రాఫిక్ కారణంగా ఓ అమ్మాయి జీవితం ఎలా అల్లకల్లోలమైందనే నేపథ్యంలో మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించారు. ఆ చిత్రాన్ని తమిళంలో ‘చెన్నయిల్ ఒరునాల్’ పేరుతో రాడాన్ మూవీస్ పతాకంపై రాధిక రీమేక్ చేశారు. ప్రకాశ్‌రాజ్, రాధిక, శరత్‌కుమార్, చేరన్ ఇందులోముఖ్య పాత్రలు పోషించారు. షాహిద్ ఖాదర్ దర్శకుడు. హీరో సూర్య ఇందులో ప్రత్యేక పాత్ర చేయడం విశేషం. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘ట్రాఫిక్’ పేరుతో అనువాదమవుతోంది. గోల్డ్ స్టార్ సినీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మెజో జోసెఫ్, పాటలు-మాటలు: సాహితి. -
నేనలా అనలేదు
నేను అలా అనలేదని, నా మాటలను వక్రీకరించారని అంటున్నారు భారీ అందాల భామ నమిత. నటిగా దక్షిణాదిన సంచలనం రేపిన ఈ బ్యూటీ ఇకపై రాజకీయాల్లో కలకలం పుట్టించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మే స్వయంగా ప్రకటించి రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించారు. త్వరలోనే తన రాజకీయ అరంగేట్రం ఉంటుందని వెల్లడించారు. అంతటితో ఆగకుండా నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అని ప్రకటన ఇచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే తాను అలా అనలేదని తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె ఇలా పేర్కొన్నారు. నేను ఇటీవల తిరుచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలో పత్రికలవారు రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నించారు. అందుకు నేను రాజకీయాలపై ఆసక్తి ఉందని బదులిచ్చాను. ఏ పార్టీలో చేరబోతున్నారన్న ప్రశ్నకు ఈ నెలాఖరు వరకు వేచి చూడండి అని చెప్పాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయం సాధించడంపై స్పందన ఏంటి అని అడిగారు. ఆమ్ఆద్మీ అంటే సాధారణ ప్రజలు అని అర్థం. సాధారణ ప్రజలు రాజకీయాల్లోకి రావచ్చు అని నిరూపించారు. వారికి నా శుభాకాంక్షలు అన్నాను. అంతేగానీ నేను ఆమ్ఆద్మీ పార్టీలో చేరుతానని అనలేదు. ఒక విలేకరి శరత్‌కుమార్‌తో కలుస్తారా? అని అడిగారు. అందుకు నేను మంచి విజయవంతమైన కూటమిలో చేరుతానన్నాను. నేనడిగింది రాజకీయ కూటమి గురించేనని స్పష్టం చేశారు. అయితే నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అంటూ నేను ప్రశ్నించి నట్లు నా మాటలను వక్రీకరించారు. నేను చిత్ర రంగం లో చాలా కాలంగా ఉంటున్నాను. శరత్‌కుమార్ నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంఘాన్ని ఒక కుటుంబంలాగా తీర్చిదిద్దారు. నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగానే ఉన్నాను. అలాంటిది శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా లేదా అనే విషయం కూడా తెలియకుండా ఉన్నానా? అంటూ నమిత ప్రశ్నించారు. -
‘జెండాపై కపిరాజు’ స్టిల్స్
-
‘జెండాపై కపిరాజు’ స్టిల్స్
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘జెండాపై కపిరాజు’ షూటింగ్ కార్యక్రామాలు పూర్తి చేసుకొని ,పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నాని సరసన అమాలపాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై సముద్రఖని దర్శకత్వంలో...కె.యస్.శ్రీనివాసన్- కె.యస్.శివరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో శరత్‌కుమార్ ఈ చిత్రంలో సి.బి.ఐ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.