వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు.
సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా
మదురై: వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం మదురై అన్నాడీఎంకే నార్త్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మేయర్ రాజన్ చెల్లప్పకు మద్దతుగా శరత్‌కుమార్ మదురై పుదూర్, సెల్లూర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
డీఎంకే కోశాధికారికి గణాంకాలు కూడా సరిగ్గా తెలియవన్నారు. కచ్చదీవిని ధారాదత్తం చేసిన ఘనత డీఎంకేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధించడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.