విజయ్‌ అభిమానం.. విజయకాంత్‌ ఇంట్లో గోట్‌ టీమ్‌ | The Greatest of All Time Movie Team In Vijayakanth Home | Sakshi
Sakshi News home page

విజయ్‌ అభిమానం.. విజయకాంత్‌ ఇంట్లో గోట్‌ టీమ్‌

Published Tue, Aug 20 2024 8:08 AM | Last Updated on Tue, Aug 20 2024 8:54 AM

The Greatest of All Time Movie Team In Vijayakanth Home

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌- దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో  తెరకెక్కిన సినిమా (ది గోట్‌) ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’. తాజాగా ఈ సినిమాకు చెందిన యూనిట్‌ దివంగత నటుడు విజయకాంత్‌ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారి కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట షేర్‌ చేశారు.  త్వరలో సినిమా విడుదల కానున్నడంతో చిత్ర యూనిట్‌ వేగంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అంతగా మెప్పించలేదనే విమర్శలు వస్తున్నప్పటికీ మార్కెట్‌ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది.

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాలో  ఏఐ సాయంతో దివంగత నటుడు విజయకాంత్‌ను వెంకట్‌ ప్రభు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సెప్టెంబరు 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విజయకాంత్‌కు వెంకట్‌ ప్రభు, విజయ్‌  నివాళులర్పించారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి, విజయకాంత్‌ సతీమణి ప్రేమలతతో వారు కొంతసమయం పాటు మాట్లాడారు.

విజయ్‌, అయన తండ్రి ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ అంటే విజయకాంత్‌కు చాలా ఇష్టం. అదేవిధంగా  విజయకాంత్‌ అంటే కూడా విజయ్‌కు చాలా గౌరవం. అలా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. గతంలో వెట్రి, సెంతూరపండి తదితర చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు. విజయకాంత్‌ మరణం తర్వాత తన రూపాన్ని సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న డైరెక్టర్‌. ఈమేరకు పలుమార్లు ప్రేమలతను విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అలా గోట్‌ సినిమాలో   ఏఐ టెక్నాలజీ సాయంతో విజయకాంత్‌ను వెండితెరపై చూపించబోతున్నారు. 

ఈ చిత్రంలో విజయ్‌ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన్ను కుర్రాడిగా చూపించేందుకు  'డీ- ఏజింగ్‌' టెక్నాలజీ వినియోగించారు. సెప్టెంబరు 5న 6వేల థియేటర్‌లలో ఈ సినిమా విడుదల కానుంది. చెన్నైలో ప్రతి థియేటర్‌లో మొదటిరోజు ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమానే ఉండేలా ప్లాన్‌ చేశారు. మీనాక్షీ చౌదరి,  స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా వంటి స్టార్స్‌ ఈ సినిమాలో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement