'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' నుంచి విజిల్స్‌ వేసే సాంగ్‌ వచ్చేసింది | Vijay The Greatest Of All Time Whistle Sesko Song Out Now | Sakshi

'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' నుంచి విజిల్స్‌ వేసే సాంగ్‌ వచ్చేసింది

Jul 12 2024 8:40 PM | Updated on Jul 13 2024 8:57 AM

Vijay The Greatest Of All Time Whistle Sesko Song Out Now

విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం'. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుందని  మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి విజిలేస్కో తెలుగు వర్షన్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఇప్పటికే తమిళ్‌ వర్షన్‌లో ఈ సాంగ్‌  విడుదలైన విషయం తెలిసిందే. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్  నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement