Yuvan Shankar Raja
-
యువన్ శంకర్‌రాజా బిగ్ ప్లాన్.. డైరెక్టర్‌గా ఎంట్రీకి లైన్ క్లియర్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అతి కొద్దిమందిలో యువన్ శంకర్‌రాజా ఒకరు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడైన ఈయన ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ మారారు. అందులో నటుడు హరీశ్ కల్యాణ్ కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన గోట్ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో ఆయన పేర్కొంటూ త్వరలో మోగాఫోన్ పట్టనున్నట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో నటుడు శింబును కథానాయకుడిగా నటింపజేస్తానని చెప్పారు. ఈయనకు నటుడు శింబుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి శింబు ఒకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. నటుడు శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ పిలింస్ పతాకంపై నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తరువాత యువన్‌శంకర్‌రాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి. -
యువన్ శంకర్ రాజాపై ఆరోపణలు నిజమే: పోలీసులు
కోలివుడ్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా రూ. 20 లక్షలు ఇంటి అద్దె చెల్లించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ వివాదంలో పోలీసుల విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నిజనిజాలను వారు వెళ్లడించారు. ఇదే క్రమంలో ఇంటి యజమానికి యువన్ శంకర్ రాజా నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం చేకూరేలా ఇంటి యజమాని ఆరోపించాడంటూ లాయర్ ద్వారా రూ. 5కోట్లకు పరువునష్టం దావా వేశారు.కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఇలా చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో యువన్ శంకర్ రాజా అద్దె బకాయిలున్నట్లు తేలింది.అదేవిధంగా యువన్ శంకర్ రాజా ప్రతినెలా అద్దె మొత్తం చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా విజయ్ నటిస్తున్న గోట్ సినిమా పనుల్లో యువన్ బిజీగా ఉండటం వల్ల ఇంటి యజమానికి అందుబాటులో లేరని తెలుస్తోంది. సినిమా ఆడియో విడుదల అనంతరం ఇంటి అద్దె చెల్లిస్తానని యువన్ శంకర్ రాజా తెలియజేసినట్లు సమాచారం. అయితే, యువన్ శంకర్ రాజా ఇల్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. అద్దె చెల్లించకుండా మోసం చేస్తారనే భయంతో ఇంటి యజమాని ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను వివరణ కోరగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇందులో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.అనంతరం యువన్ శంకర్ రాజా తరపున లాయర్ ఇంటి యజమానికి నోటీసులు పంపారు. యువన్‌పై నిరంతరం పరువునష్టం కలిగేలా ఇంటి యజమాని ప్రవర్తిస్తున్నారని లాయర్ తెలిపారు. దీంతో రూ. 5 కోట్లు పరిహారం చెల్లించాలని, లేదంటే ఈ సివిల్ సమస్యను క్రిమినల్ కేసుగా మారుస్తామని నోటీసులో పేర్కొన్నారు. యువన్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసి తీవ్ర మనోవేదనకు గురిచేశారని, దీంతో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. -
ఇంటి అద్దె చెల్లించలేదని యువన్ శంకర్ రాజాపై ఫిర్యాదు
తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ సినీ అభిమానులకు కూడా పరిచయమే.. మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే, తాజాగా యువన్‌పై రూ. 20 లక్షల డబ్బు వ్యవహారంలో పోలీసులుకు ఫిర్యాదు అందింది.సౌత్ ఇండియాలో సుమారు 130 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించడంతో పాటు పలు కచేరీలు నిర్వహిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే యువన్ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే, తాను ఉంటున్న ఇంటి అద్దె రూ. 20 లక్షలు చెల్లించకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేందకు ప్రయత్నిస్తున్నారని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చాలా మందిని షాక్‌కి గురి చేసింది. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివసించే యువన్ శంకర్ రాజాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. అద్దె అడగడానికి ఫోన్ చేస్తే అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని వారు పేర్కొన్నారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కాలి చేస్తున్నాడని, ఈ క్రమంలో కొన్ని వస్తువులు కూడా మరో ఇంటికి షిఫ్ట్ చేశారని యువన్‌పై ఇంటి యజమాని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. అయితే, ఈ విషయం గురించి యువన్ శంకర్ రాజా నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ, భారీ బడ్జెట్ సినిమాలతో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే యువన్ కేవలం రూ.20 లక్షలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యువన్ శంకర్ రాజా సౌత్ ఇండియాలో చాలా సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించారు. విజయ్ సినిమా గోట్, మారి2,లవ్ టుడే,బిల్లా,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,విరూమాన్,మాస్టర్,హ్యాపీ,ఓయ్, పంజా వంటి సినిమాలకు ఆయన పనిచేశారు. -
విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ట్రైలర్ వచ్చేసింది
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల ఎప్పుడు అనేది మేకర్స్ ప్రకటించారు.ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఆగష్టు 17 సాయింత్రం 5గంటలకు గోట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమాలో సాంకేతికతకు పెద్దపీట వేసినట్లు ఇప్పటికే దర్శకుడు వెంకట్ ప్రభు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ హిట్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు విజయ్ గోట్ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాలో విజయ్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజిల్స్ వేసే సాంగ్ వచ్చేసింది
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి విజిలేస్కో తెలుగు వర్షన్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇప్పటికే తమిళ్ వర్షన్లో ఈ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. -
ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్
సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను. ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్‌ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్‌ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్‌ను మరోసారి అభిమానులకు అందించారు యువన్‌శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజయ్ చివరి సాంగ్ విడుదల
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్‌తో పాటు వెంకట్ ప్రభు పాడటం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. పలు సినిమాల్లో విజయ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం చివరగా విజయ్ ఒక పాటను పాడడం విశేషం. కొన్నిరోజుల పాటు తమిళనాట ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో అయేషా ఖాన్ తన అందచందాలతో స్టెప్పులేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రంగస్థలం సినిమాలో 'రంగమ్మా మంగమ్మా' పాటతో మెప్పించిన 'ఎమ్ఎమ్ మానసి' ఇప్పుడు 'మోత మోగిపోద్ది..' అంటూ అదిరిపోయే సాంగ్ పాడింది. ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన కనిపించిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఈ ఐటమ్ సాంగ్‌తో మోత మోగిపోయేలా స్టెప్పులు వేసింది. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
సినిమాలకు దూరం.. చివరిసారి పాట పాడనున్న విజయ్!
దళపతి విజయ్ హీరోగా టాప్ పొజిషన్లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి సినిమాలకు దూరం కాబోతున్నారన్న మాట ఆయన అభిమానులను ఎంతో బాధిస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలా విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో.. ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే యువన్ శంకర్‌రాజా చాలా కాలం క్రితం విజయ్ హీరోగా నటించిన పుదియ గీతై చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. ఇకపోతే విజయ్‌లో మంచి గాయకుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. మరోసారి పాట పాడనున్న విజయ్ పలు సినిమాల్లో ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం విజయ్ ఒక పాటను పాడడం విశేషం. ఈ విషయాన్ని యువన్ శంకర్‌రాజా ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఇది విజయ్ అభిమానులను ఖుషీ పరిచే విషయమే అవుతుంది. చదవండి: పెళ్లి చేసుకుని లక్షలు కాజేసింది.. ఇప్పుడు బెదిరింపులు.. మీడియాను ఆశ్రయించిన భర్త -
ఆ స్టార్ హీరో సూర్యకు క్లాస్ మేట్ అని తెలుసా..?
-
నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. మేస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హెడ్ అప్ హై..’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్, యువన్ శంకర్ రాజా పాడారు. ‘‘హెడ్ అప్ హై..’ పాట పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నాగచైతన్య తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అరవింద్ స్వామి,ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఖతీర్. -
Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్ అంబేడ్కర్‌తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. ఇళయరాజా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్ గర్వించదగ్గ తమిళన్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
19 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్!
కమర్షియల్ చిత్రాల దర్శకుడు సుందర్ సి తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. అవ్నీ సినీమాక్స్, బెంజ్ మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో జీవా, జై, శ్రీకాంత్, మాళవిక శర్మ, రైజా విల్సన్, అమృత అయ్యర్, ఐశ్వర్యదత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. యోగిబాబు, కింగ్స్ లీ, ప్రతాప్ పోతన్, సంయుక్త షణ్ముగం, దివ్యదర్శిని తదితరులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 19 ఏళ్ల తరువాత సుందర్ సి, యువన్ శంకర్ రాజా కాంబోలో చిత్రం రూపొందుతుండడం గమనార్హం. ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వినోదమే ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, ఊటీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
ఇదే తొలిసారి.. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది : రష్మిక
రష్మిక మందన్నా.. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్. ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది. అక్కడ కూడా తన అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి రెడీ అయింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించడం విశేషం. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ ఆల్బమ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో కొత్త అవతారంలో కేక పుట్టిస్తోంది. ‘టాప్ టక్కర్’కు సంబంధించిన పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నారు. కాగా, ‘టాప్ టక్కర్’ ఆల్బమ్ సాంగ్ గురించి చెబుతూ.. ‘మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నను' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక సినిమా విషయాకొస్తే.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. Top top top tucker.. 💃🏻 this is so exciting.. 1st time I’ve done something like this.. 💃🏻 and I’ve got to do it with the best in their respective industries.. yaaaaay!! So exciting.. releasing soon you guys!! 🥳 https://t.co/giiEcXlJJy pic.twitter.com/Q8U3cr6cqC — Rashmika Mandanna (@iamRashmika) February 8, 2021 -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కిస్తా
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్‌ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం. రాజా ది జర్నీ సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు. నటుడు ధనుష్ కరెక్ట్ ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట. -
తిరిగొస్తున్నారు
‘ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, మిస్టర్ అండ్ మిస్ శైలజా కృష్ణమూర్తి’ చిత్రాల ద్వారా హీరోయిన్ లైలా సుపరిచితురాలే. తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో నటించారామె. 2006లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతేడాది తమిళంలో ఓ టీవీ షోలో జడ్జిగా కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ‘అలీసా’ ద్వారా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నారట. యువన్ శంకర్ రాజా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మని చంద్రు అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ సినిమా కాకుండా ‘కండ నాళ్ ముదల్’ సీక్వెల్లో కూడా లైలా యాక్ట్ చేయబోతారనే వార్త ప్రచారంలో ఉంది. మరి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తారా? చూద్దాం. -
మెగాస్టార్ మెచ్చిన ‘ప్యార్ ప్రేమ కాదల్’
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ స్వయంగా సంగీతం అందించారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -‘టీజర్ లాంచ్‌కి అంగీకరించడానికి కారణం . భరద్వాజ, విజయ్, యువన్‌లే. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జనరేషన్ గ్యాప్ ఉన్నా యువన్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు అతడు. 80లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే ఇంత ఇష్టం. తను ఇంత బిజీ షెడ్యూల్లోనూ నిర్మాతగా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేనని భావిస్తున్నా’ అన్నారు. చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...‘యువన్ శంకర్ రాజా తొలి సారి నిర్మాతగా రూపొందించిన ప్యార్ ప్రేమ కాదల్ చిత్రాన్ని బాగా నచ్చి రిలీజ్ చేస్తున్నాం. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు’ అని తెలిపారు. నిర్మాత యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ - ‘మెగాస్టార్ ఆశీస్సులతో ఈ సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా తొలి ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. అందరి ఆదరణ కావాలి’ అన్నారు. మరో నిర్మాత విజయ్ మోర్వనేని మాట్లాడుతూ - ‘తమిళ్‌లోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. చక్కని కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అన్నారు. -
చిరు చేతుల మీదుగా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ట్రైలర్ లాంచ్
-
కాలేజీ ప్రేమకథ!
హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’. ఈ సినిమాను తమిళంలో సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మించారు. కాలేజీ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో యువన్ శంకర్‌రాజా, విజయ్ మోర్వనేని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘‘ఈ సినిమా ప్రేమ కథలో ఉన్న భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్రబృందం. -
కళాశాల నేపథ్యంలో సాగే 'ప్యార్ ప్రేమ కాదల్'
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి 'ప్యార్ ప్రేమ కాదల్' ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి.చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
కొత్త అవతారం
సరిగమలు పలకాల్సిన యువన్ శంకర్ రాజా స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. శృతి మీద వర్క్ చేయాల్సిన ఆయన స్క్రీన్‌ప్లే రెడీ చేస్తూ, బిజీగా ఉన్నారు. విషయమేంటంటే... ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడం కొత్త అనుభవం. ఫ్యాన్స్ నా నుంచి ఊహించని సినిమా ఇవ్వబోతున్నాను’’ అన్నారు యువన్. జర్మన్ సంగీత దర్శకుడు టామ్ టైక్వార్ రూపొందించిన ‘పెర్ఫ్యూమ్’ చిత్రమే యువన్ దర్శకుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ అట. -
ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంపెట్టండి
తమిళసినిమా: ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టండి అని సంగీతజ్ఞాని ఇళయరాజా ఈ తరం సంగీత దర్శకులకు హితవు పలికారు. ఆయన కొడుకు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా వైఎస్ఆర్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. యువ నటుడు హరీశ్, నటి రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్‌రాజానే సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం స్టూడియోలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇళయరాజా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతగా మారిన యువన్ శంకర్‌రాజా మాట్లాడుతూ తన మిత్రుడు ఇర్ఫాన్ ఒకసారి మీ అభిమానుల కోసం ఒక చిత్రం చేయవచ్చుగా అని అన్నాడన్నారు. తన బలమే ప్రేమ గీతాలని, సమీప కాలంలో అలాంటి పాటలు తన చిత్రాల్లో చోటు చేసుకోలేదని అన్నారు. అందుకే ప్రేమ గీతాలతో కూడిన చిత్రం చేయాలన్న ఆలోచనే ఈ ప్యార్ ప్రేమ, కాదల్ చిత్రం అని తెలిపారు. అతిథిగా పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ కళాకారులందరికీ ప్రేమే మానసిక శక్తి అని పేర్కొన్నారు. తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్ చిత్రాల సమయంలో తానూ, అన్నయ్య సెల్వరాఘవన్ కష్టపడుతున్నప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీతమే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అలా తాను ఆయనకు రుణ పడి ఉన్నానని అన్నారు. మరో నటుడు శింబు మాట్లాడుతూ ఇది ఆడియో ఆవిష్కరణ వేడుక మాదిరి కాకుండా సినీ ప్రముఖుల గెట్ టు గెదర్‌లా ఉందన్నారు. యువన్ శంకర్‌రాజా తనకు తండ్రి లాంటి వాడన్నారు. తను శత్రువులు కూడా బాగుండాలని భావించే వ్యక్తి అనీ, ఆయన కోసం వచ్చిన కూటం ఇదనీ శింబు పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన యువన్‌శంకర్‌రాజాను ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఈ తరం సంగీత దర్శకులకు తాను చెప్పేదొక్కటేనని, ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టి, సహజ సంగీత వాయిద్యాలతో భాణీలను కట్టాలని అప్పుడే నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని హితవు పలికారు. కార్యక్రమంలో దర్శకుడు రామ్, శీనూరామసామి, అమీర్, అహ్మద్, నటుడు జయంరవి, విజయ్‌సేతుపతి, ఆర్య, కృష్ణ, శాంతను, నటి రేఖ, బింధుమాదవి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. -
త్వరలో ప్యార్ ప్రేమమ్ కాదల్ గీతాలు
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన రెండవ కొడుకు యువన్ శంకర్‌రాజా అనతికాలంలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పాటల కోసం చెవులు కోసుకునే సంగీత ప్రియులు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఒక ట్రెండ్ సెట్టర్‌గా పేరు సంపాదించుకున్న యువన్ శంకర్‌రాజా తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆయన వైఎస్ఆర్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్, ఇర్ఫాన్ మాలిక్‌లతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే ప్యార్ ప్రేమమ్ కాదల్. హరీష్‌కల్యాణ్, బిగ్‌బాస్ ఫేమ్ రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్శంకర్రాజానే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలోని హై ఆన్ లవ్, డోప్ అనే పల్లవిలతో కూడిన రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోప్ అనే పాట యువతను ఉర్రూతలూగిస్తోందని చెబుతున్నారు. చిత్ర పూర్తి స్థాయి ఆడియోను జూలై మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ప్యార్ ప్రేమమ్ కాదల్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. -
‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : అభిమన్యుడు జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : విశాల్ దర్శకత్వం : పీఎస్ మిత్రన్ కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్, టాలీవుడ్లో మార్కెట్ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..? చూద్దాం కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్ డాక్యుమెంట్స్‌తో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్. వైట్ డెవిల్ పాత్రకు అర్జున్ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్. హీరోయిన్ సమంత రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు. విశ్లేషణ : దర్శకుడు మిత్రన్ నేటి డిజిటల్ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్ శంకర్ రాజా థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్ సీ విలియమ్స్ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ నటన నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : తొలి భాగంలో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అభిమన్యుడు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను
విశాల్, సమంత జంటగా అర్జున్ ముఖ్య పాత్రల్లో పీయస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరంబుదురై’. తెలుగులో ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘ఇరంబుదురై’ నిలించింది. తమిళంలో సక్సెస్ సాధించినట్టే ఇక్కడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా ‘అభిమన్యుడు’. తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మే 11న చాలా తెలుగు సినిమాలు ఉండటంతో రిలీజ్ చేయలేకపోయాం. ► నా సినిమా జీవితం అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ట్ అయింది. ఆయనతో కలిసి యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అర్జున్‌గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి. ► ‘అభిమన్యుడు’ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్మీ వాళ్లకు రేషన్ కార్డ్ ఉండదు. రైతులకు బ్యాంక్ లోన్లు ఇవ్వరు అనే విషయాలు తెలిశాయి. ఇలాంటి విషయాలు సినిమాలో డైలాగుల రూపంలో పెట్టాం. ► అందరూ డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిమాణాలు ఉంటాయి అని ఈ సినిమాలో చూపించాం. డిజిటల్ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ఎండ్ చేశాం. పార్ట్ 2 కూడా రూపొందిస్తాం. ► టీమ్ అంతా బాగా కుదిరింది. సమంతతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. మంచి కో–స్టార్. కెమెరా జార్జ్ సీ విలియమ్స్, సంగీతం యువన్ శంకర్ రాజా అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. అందరం దర్శకుడిని నమ్మాం. ► సినిమా రిలీజ్‌కు ముందు టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. బయటవాళ్ళ అభిప్రాయాలను తీసుకొని నాలుగుసార్లు ఎడిట్ చేశాం. బయటవారి ఒపీనియన్ తీసుకోవడం మంచిదని తెలిసింది. ► క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. సోషల్ అవేర్నెస్ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ► నెక్ట్స్ ‘టెంపర్’ రీమేక్‌లో యాక్ట్ చేస్తున్నాను. కొత్త స్క్రీన్‌ప్లేతో చేయబోతున్నాం. మురగదాస్ అసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ‘అభిమన్యుడు’ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మిత్రన్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్ సినిమా. డిజిటలైజేషన్కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. పాటనో ఫైట్నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్ అందుకున్నాను. ఇన్ఫర్మేషన్ థెప్ట్ గురించిన అవేర్నెస్ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్‌గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్ మేడ్ మూవీ ఇది. మిత్రన్ ఫస్ట్ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో. అలాగే అన్సక్సెస్ఫుల్ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్ఫుల్ హీరో’’ అన్నారు అర్జున్. ఈ సినిమాకు సంగీతం:యువన్ శంకర్ రాజా. -
జూన్ 1న విశాల్ ‘అభిమన్యుడు’
‘ఇరుంబుదురై’ అంటూ ప్రస్తుతం తమిళ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు విశాల్. ఈ సినిమా విడుదలైన రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా ఎప్పుడో రిలీజ్ కావల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. విశాల్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండడం, సమంత హీరోయిన్గా నటించడం వల్ల అభిమన్యుడు సినిమాను పెద్ద ఎత్తులో జూన్ 1న రిలీజ్ చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం విశాల్ ‘పందెంకోడి 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత తెలుగు ‘టెంపర్’ రీమేక్‌లో నటించనున్నారు. -
విజయ్ సేతుపతితో తెలుగమ్మాయి
తమిళసినిమా: నటుడు విజయ్‌సేతుపతితో అంజలి జత కడుతున్న తాజా చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాహుబలి–2 చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన కే.ప్రొడక్షన్స్ ఎస్ఎన్.రాజరాజా, వైఎస్ఆర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి కలయికలో ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా విజయ్‌సేతుపతి, అంజలి జంటగా నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా పణ్ణైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌యూ.అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా లింగా నటిస్తుండగా ఒక ముఖ్య పాత్రలో వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఇతర తారాగణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు వెల్లడించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, విజయ్‌కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ను తెన్కాశి, మలేషియాలో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు ఎస్‌యూ.అరుణ్‌కుమార్ తెలిపారు. -
ఇంట్లోనే కారులో పడుకున్న డ్రైవర్..!
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు చోరీ కేసులో ఆసక్తికరమైన ట్విస్టు వెలుగుచూసింది. యువన్‌శంకర్‌రాజా డైవర్ నవాజ్‌ఖాన్ కారును దొంగలించినట్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలైన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరా దృశ్యాలను తమకు చూపించాలని యువన్ సతీమణి జఫ్రూన్ నిసాను పోలీసులు కోరారు. సీసీటీవీ కెమెరాలు చూడటంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. చోరీకి గురైనట్టు భావిస్తున్న కారు యువన్ నివాసంలోనే లెవల్-2కు బదులు లెవల్ -3లో పార్క్ చేసి ఉంది. వెంటనే కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో డ్రైవర్ నవాజ్ ఖాన్ ఇంకా పడుకొని ఉన్నాడు. ఏమైందని డ్రైవర్‌ను ఆరాతీయగా తాను కారులో నిద్రపోయానని, ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో కాల్స్ రాలేదని అతను చెప్పాడు. దీంతో షాక్ తినడం యువన్ భార్య నిసా, పోలీసుల వంతైంది. పొరబడటం వల్లేనా!? సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్‌ఖాన్ యువన్‌కు చెందిన లగ్జరీ కారు ఆడీ-6ను బయటకు తీసుకువెళ్లాడు. తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చిన జఫ్రూన్ నిసా ఇంట్లోని లెవల్-3లో కారు పార్క్ చేసి లేకపోవడంతో సందేహించింది. యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటివద్ద లేకపోవడంతో కారు చోరీకి గురైందేమోనన్న అనుమానంతో వెంటనే ఎంగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి అయినా కారు తిరిగిరాకపోవడం, డ్రైవర్‌కు ఫోన్ చేస్తే కలువకపోవడం వల్ల ఆమె పొరబడి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోందని స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. తీరా కారు, డ్రైవర్‌తో సహా ఇంట్లోనే ఉండటంతో ఫిర్యాదును వెనుకకు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
యువన్ శంకర్‌రాజా కారు చోరీ
పెరంబూరు:సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు అపహరణకు గురైంది. వివరాల్లోకెళితే ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా కొడుకు, యువ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్థానిక ఎతిరాజ్ రోడ్డులోని ఇంట్లో నివశిస్తున్నారు.ఆయన వద్ద నవాజ్‌ఖాన్ అనే వ్యక్తి కారు డైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్‌ఖాన్ కారును బయటకు తీసుకెళ్లి అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటి వద్ద లేకపోవడంతో కారు దొంగిలించబడిందన్న సందేహంతో ఆయన తరఫున ఎంగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితిలో మంగళవారం వేకువజామున డ్రైవర్ నవాజ్‌ఖాన్ కారుతో యువన్‌శంకర్‌రాజా ఇంటికి తిరిగి వచ్చాడు. అతను కారును ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు. అన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కారు లభించడంతో యువన్‌శంకర్‌రాజా ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
మారిపోయిన శింబు
తమిళసినిమా: కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన శింబులో ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారన్న ఆరోపణలు ఎదుర్కొనే శింబు తాజాగా మణిరత్రం చిత్ర షూటింగ్‌కు చెప్పిన టైమ్ కంటే ముందుగానే వస్తూ చిత్ర యూనిట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారట. ఇక ఆ మధ్య నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్‌తో విబేధించిన శింబు ఇటీవల పైరసీలకు పాల్పడుతున్న వెబ్‌సైట్‌ను పోలీసులు మూసివేయడంతో ఆ ఘనత విశాల్‌దే అంటూ ప్రశంసించి అందరినీ విస్మయపరిచారు. తాజాగా యువ నటుడు మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్శంకర్రాజాలపై అభినందనల వర్షం కురిపించారు. మెట్రో శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం రాజా రంగూస్కీ. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నా యారన్ను తెరియుమా అనే పాటను ఈ నెల 15న విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఇంతగా అలరిస్తున్న ఈ పాటను ఆలపించింది నటుడు శింబునే. దీంతో పాట మంచి సక్సెస్ కావడంతో రాజా రంగూస్కీ చిత్ర హీరో మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజాలను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. దీంతో వీరు యమ ఖుషీ అయ్యిపోయారట. పాట హిట్ అయినట్లే చిత్రం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మెట్రో శిరీష్, యువన్‌శంకర్‌రాజాలను సంతోషపరచారు శింబు. రాజా రంగూస్కీ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబుతోంది. -
గాయకుడిగా మరో స్టార్ హీరో
తమిళసినిమా: యువ నటుడు విజయ్‌సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజా చిత్రం ఒరు నల్లనాళ్ పాత్తు చిత్రం కూడా వసూళ్ల వర్షం కురిపించింది. పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్‌సేతుపతి నిర్మాతగా కూడా మారారు. ఆయని నిర్మిస్తూ నటిస్తున్న జూంగా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఆయన గాయకుడి అవతారమెత్తారు. పేయ్ పసి అనే చిత్రం కోసం యువన్‌శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ఆయన ఒక పాడారు. శ్రీనివాస్ కవినయన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పేయ్ పసి. నవ నటుడు హరికృష్ణ భాస్కర్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రైస్ ఈస్ట్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్నారు. ఇందులో చాలా కీలకమైన ఒక క్లబ్ పాటకు డిఫరెంట్ వాయిస్ అవసరం అయ్యిందని, ఆ పాటను నటుడు విజయ్‌సేతుపతితో పాడిస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరు భావించినట్లు సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా పేర్కొన్నారు. తనదైన సంభాషణల డెలివరీతో అభిమానులను ఆకట్టుకుంటున్న విజయ్‌సేతుపతి పేయ్ పసి చిత్రంలోని క్లబ్ పాటను చాలా బాగా పాడారని అన్నారు. ఈ పాట చిత్రానికి హైలైట్ అవడంతో పాటు, యూత్‌ను విపరీతంగా అలరిస్తుందని యువన్‌శంకర్‌రాజా పేర్కొన్నారు. -
మ్యాస్ట్రో సారథ్యంలో ధనుష్..!
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ధనుష్ గాయకుడిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ధనుష్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మారి 2 సినిమా కోసం మేస్ట్రో ఇళయరాజా ఓ పాట పాడారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అందుకు ప్రతిగా ఇప్పుడు ఇళయరాజా సంగీతమందిస్తున్న ఓ సినిమాలో ధనుష్ పాట పాడనున్నాడు. ఇటీవల ఇళయరాజ సంగీత దర్శకుడిగా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసైజ్ఞాని స్వరపరిచిన పలు సూపర్ హిట్ పాటలను ధనుష్ వేదిక మీద ఆలపించారు. ధనుష్ గానం నచ్చిన మేస్ట్రో తాను సంగీతమందిస్తున్న ఓ మరాఠి సినిమాలో ధనుష్ చేత పాట పాడిస్తున్నారు. -
నేనూ ప్రేమలో పడ్డా!
తమిళసినిమా: సినిమాకు మోడలింగ్ రంగం రాచ మార్గం అనే చెప్పాలి. నేరుగా సినీ రంగప్రవేశం చేయడానికి ముఖ్యంగా హీరోయిన్లకు కష్టతరమే. అదే మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్గా అవకాశం పొందడం సులభతరంగా మారింది. అలా కథానాయకిగా తెరపై మెరవడానికి రెడీ అయిన మోడల్ రైజా. పూర్తి పేరు రైజా విల్సన్. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా మరింత పాపులర్ అయిన ఆ బ్యూటీ తాజాగా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ప్యార్ ప్రేమ కాదల్ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఆమెతో కలిసి మరో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఫేమ్ హరీష్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా రైజా ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. ప్ర: బిగ్‌బాస్ గేమ్ షో అనుభవం గురించి? జ: బిగ్‌బాస్ గేమ్ షో నన్ను చాలా మందికి పరిచయం చేయడం సంతోషాన్ని కలిగించింది. ప్ర: మోడలింగ్ రంగం నుంచి వచ్చినట్లున్నారు? జ: నేను ఆరేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నాను. నా సొంత ఊరు బెంగళూర్ అయినా, దక్షణాది ముఖ్య నగరాల్లో మోడలింగ్ చేశాను.బీకామ్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. ప్ర: సినిమాల్లో నటించడం గురించి? జ: నేనెప్పుడూ సినిమాల్లో నటించడానికి తొందర పడలేదు. యువన్‌శంకర్‌రాజా నిర్మిస్తున్న ప్యార్ ప్రేమ కాదల్ చిత్రంలో హరీష్కల్యాణ్కు జంటగా నటిస్తున్నాను. ఈ చిత్రం విడుదలనంతరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూసి తదుపరి చిత్రాలపై నా నిర్ణయం ఉంటుంది. ప్ర: ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? జ: నేనూ హరీష్‌కల్యాణ్ ఆడిషన్‌కు వెళ్లాం. ఎంపికవుతాననే నమ్మకం నాకుంది. మోడలింగ్ రంగంలో ఉండడం వల్ల ఎలా నటించాలన్నది కొంచెం తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అదే నిజమైంది. ప్ర: అంతకు ముందు వీఐపీ–2 చిత్రంలో నటించినట్లున్నారు? జ: నిజం చెప్పాలంటే అది మోడలింగ్ అసైన్మెంట్. కాజోల్‌తో కలిసి నటించాను. చిత్రం మొత్తం నిలబడే ఉంటాను. నాకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు.అదో వినూత్న అనుభవం. ప్ర:ఎన్ని యాడ్స్‌లో నటించి ఉంటారు? జ: సుమారు 500లకు పైగా చేసి ఉంటాను. 2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నాను.ఆ తరువాతనే మోడలింగ్ రంగంలో అవకాశాలు వచ్చాయి. ప్ర:తమిళంలో మీకు నచ్చిన హీరో? జ: నిజానికి నేను తమిళ చిత్రాలు ఎక్కువగా చూడను. ఇటీవల నేను చూసిన తమిళ చిత్రం విక్రమ్ వేదా.అందులో మాధవన్ నటన అదుర్స్. నా కళ్లు ఆయన్ని మాత్రమే చూశాయి. ఐలవ్యూ మాధవన్. ప్ర: ప్రేమలో పడ్డారా? జ: : కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమ పుట్టింది. సినిమాలు, షికార్లు కూడా చేశాం. అయితే ఆ ప్రేమ విఫలమైంది. ప్ర:పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: కచ్చితంగా ప్రేమ వివాహాన్నే చేసుకుంటాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. -
ట్రిపుల్ ట్రీట్
సంగీతప్రియులకు ఓ శుభవార్త. ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’ అవార్డు వచ్చిందని ఆనందంలో ఉన్న ఈ సంగీత జ్ఞాని అభిమానుల ఆనందాన్ని డబుల్.. కాదు ట్రిపుల్ చేశారు ఆయన తనయులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా. తండ్రి ఇళయరాజాతో కలసి ఈ ఇద్దరూ ఓ సినిమాకి పాటలు సమకూర్చనున్నారు. సోదరుడు కార్తీక్ రాజాతో కలిసి యువన్ శంకర్ రాజా తన సొంత ప్రొడక్షన్ హౌస్ వైయస్సార్ ఫిలింస్‌పై ‘మామనిదన్’ అనే సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకే ముగ్గురూ స్వరాలందిస్తారు. ఇంతకుముందు తండ్రి కంపోజిషన్‌లో తనయులు, తనయుల కంపోజిషన్‌లో తండ్రి పాడినప్పటికీ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పాటలివ్వడం ఇదే తొలిసారి. కచ్చితంగా ట్రిపుల్ ట్రీట్ అనే చెప్పాలి. శ్రీను రామస్వామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. -
ఇళయరాజా, విజయ్‌సేతుపతిల మామనిధన్
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా,విజయ్‌సేతుపతి కలిస్తే మామనిధన్. అర్థమైందను కుంటా. భారతరత్న తరువాత స్థాయి అవార్డు పద్మవిభూషణ్ సత్కారాన్ని అందుకోనున్న మేస్ట్రో ఇళయరాజా తాజాగా సంగీత బాణీలు కడుతున్నది ఎవరి చిత్రానికో తెలుసా? ఆయన కొడుకు యువన్‌శంకర్‌రాజా నిర్మించనున్న చిత్రానికే. ఈ క్రేజీ చిత్రానికి మామనిధన్ అనే పేరును నిర్ణయించారు. ఇందులో సక్సెస్ఫుల్ నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా వార్త. సంగీతజ్ఞాని ఇళయరాజా చాలా కాలం క్రితమే నిర్మాతగా మారి నటుడు కమలహాసన్ హీరోగా సింగారవేలన్ అనే చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఆయన తనయుడు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభించి ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్‌కల్యాణ్, నటి రైజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్నే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. యువన్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. అదే మామనిధన్ (మహామనిషి) చిత్రం. ఇందులో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. శీనురామస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఇతర వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి తన తండ్రి ఇళయరాజాకు సంగీత బాధ్యతలు అప్పగించారు. ఇళయరాజా ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడంతో మునిగిపోయారట. దీని గురించి యువన్‌శంకర్‌రాజా తెలుతూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో తన తండ్రి ఇళయరాజాను సత్కరించనున్న నేపథ్యంలో తమ మామనిధన్ చిత్రానికి పూర్తి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఒక కొడుకుగానే కాకుండా అభిమానిగానూ సంగీతదర్శకుడైన తన తండ్రిని చూసి గర్వపడుతున్నానన్నారు. సంగీతంలో ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు. తన సంగీత పయనంలో తన సోదరుడు కార్తీక్‌రాజా సహాయ సహకారం చాలా ఉందని యువన్‌శంకర్‌రాజా అన్నారు. -
తనయుడి కోసం ఇళయరాజా..!
దేశగర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఈ లెజెండ్, ఆయన సంగీత దర్శకత్వంలో పలు గీతాలను ఆలపించారు. అయితే ఇతర సంగీత దర్శకుల కోసం ఇళయరాజా పాటలు పాడిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన ఇటీవల జరిగింది. ఓ యువ సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటను ఇళయరాజా ఆలపించారు. అయితే ఆ యువ సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజానే కావటం విశేషం. ధనుష్ హీరోగా ఘనవిజయం సాధించిన మారికి సీక్వల్గా అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మారి 2’ కోసం ఇళయరాజా ఓ గీతాన్ని ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని హీరో ధనుష్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు. So happy to announce that the maestro isaignani ilayaraja sir sang a song today for #maari2. What a delightful divine experience. We feel so blessed and super thrilled. @thisisysr @directormbalaji pic.twitter.com/6pNRj09aZ7 — Dhanush (@dhanushkraja) 16 January 2018 -
నిర్మాతగా ప్రముఖ సంగీత దర్శకుడు..!
ప్రేమ కథలతో తెరకెక్కిన సినిమాలు చాలావరకు ఘనవిజయం సాధించాయి. అందుకే ప్రేమకథ సినిమాతో నిర్మాతగా మారబోతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా. ’ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కె.ప్రొడక్షన్స్ అధినేత ఎస్.ఎన్.రాజరాజన్‌తో కలిసి ఆయన తన వైఎస్ఆర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు బాహుబలి-2 చిత్రాన్ని తమిళనాట విడుదల చేశారు. బిగ్‌బాస్ షోతో ఫేమ్ అయిన హరీశ్ కల్యాణ్, రైసా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతం, రాజాభట్టాచార్య ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇళన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్ఫిల్స్మ్ రూపొందించారు. ఒక మంచి ప్రేమ కథ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్నాళ్లకు ఈ కథ లభించిందని యువన్ శంకర్ రాజా చెప్పారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
రెట్రో వీరులు
రెట్రో వీరులు గడియారంలో ముల్లు వెనక్కి తిరుగుతుందా? ఊహూ... గతాన్ని మళ్లీ క్రియేట్ చేయొచ్చా? ఊహూ! రియల్‌గా కుదరదు కానీ... రీల్‌పై కుదురుతుంది. ఎన్నేళ్లయినా ముందుకెళ్లొచ్చు...ఎన్నేళ్లయినా వెనక్కి వెళ్లొచ్చు.ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్లోకొందరు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. ‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’ అనే సామెత తెలుసా?దానర్థం గతమెప్పుడూబాగుంటుందని! అలాగని, భవిష్యత్తు బాగుండదని కాదు.బట్.. ప్రెజెంట్కన్నా ‘పాస్ట్’తెలుసుకోవడంలో ఓ కిక్కుఉంటుంది. మనవాళ్లను రెట్రో వీరులుగా చూడటంలో ఓ మజా ఉంటుంది. అందుకే...కలెక్షన్లను ముందుకుతీసుకెళ్లేందుకు గతంలోకి వెళుతున్నారు కొందరు దర్శక–నిర్మాతలు. 70 ఏళ్లు వెనక్కి రానా! నో.. కాంప్రమైజ్. క్యారెక్టర్స్వైజ్గా రానా రాజీపడరు. అవసరమైతే బరువు తగ్గుతారు. పెరుగుతారు. విలన్‌గానూ నటిస్తారు. అంతెందుకు బాస్.. ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా ఉండే రానా అవసరమైతే పాత కాలం మనిషిలా కనిపించడానికి ‘యస్’ అనేస్తారు. అలా అన్నదే ‘1945’ మూవీ. బర్మాకు వలస వెళ్లిన వారి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం రానాను సుమారు 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు చిత్రదర్శకుడు సత్యశివ. 1945 టైమ్ అది. స్వాతంత్య్రం కూడా రాలేదు. ఆ కాలంలోకి వెళ్లి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రానా. అందుకే, ఆ కాలం నాటి ఆనవాళ్లు స్క్రీన్‌పై కనిపించాలని టీమ్ అంతా చాలా కష్టపడి సెట్లో స్పెషల్ ఎరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో కోసం 1945 నాటి బైక్, వాచ్‌లను తయారు చేయించారు. రానా ఆల్రెడీ గెడ్డం తీసేశారు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరకర్త. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొచ్చి, చెన్నైలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారట. ఫస్ట్ లుక్‌ను నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. నార్త్‌లోనూ బ్యాక్ టు పాస్ట్ బాలీవుడ్‌లోనూ డైరెక్టర్లు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. 1948 టైమ్‌లో ఒలింపిక్స్‌లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్‌సింగ్ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రీమా కగ్తీ. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా 1950 కొరియన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. క్రికెట్లో ఇండియాకు 1983లో ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన కపిల్‌దేవ్ కథతో రూపొందుతోన్న సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. కబీర్‌ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. హీరోయిన్లలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఆలియా భట్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆలియా 1970 కాలానికి చెందిన కాశ్మీరీ అమ్మాయిగా నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్ వాళ్లూ తమ సినిమాల కోసం వెనక్కి వెళుతున్నారు. వేరే దేశంలో 55 ఏళ్లు వెనక్కి! ప్రభాస్... చెప్పేదేముంది? ఎక్సెప్ట్ ‘బాహుబలి’ మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఆల్మోస్ట్ ఎంతటి ట్రెండీ లుక్స్‌లో కనిపించారో... ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ, ప్రభాస్‌ను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దాదాపు 55 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ల నున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. వీరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా 1960 యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. అంటే... దర్శకుడు రాధకృష్ణ నాటి యూరప్ లొకేషన్ల కోసం వేటడాలి. లేకపోతే సెట్స్ వేయించాలి. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు సెట్స్, లొకేషన్స్‌ని ఫైనలైజ్ చేసేస్తారు. మరి.. ప్రభాస్‌ను రాధాకృష్ణ ఆ కాలంలోకి తీసుకెళ్లి యుద్ధం చేయిస్తారో? ప్రేమలో పడేస్తారో? చూడాలి. గళ్ల లుంగీలో రామ్‌చరణ్ తెలుగువాళ్ల ట్రేడ్ మార్క్ అంటే.. ‘గళ్ల లుంగీ’. కాకపోతే సినిమాల్లో మన హీరోలు కనిపించేది ప్యాంటుల్లోనే కదా. అందుకే, మనోళ్లు ‘గళ్ల లుంగీ’ కడితే.. అభిమానులు ఈలలేసి, గోల చేసేస్తారు. రామ్‌చరణ్ ఫ్యాన్స్ అదే చేయబోతున్నారు. ‘ధృవ’ సినిమాలో చరణ్ ఎంత స్టైలిష్‌గా కనిపించారో చూశాం. కానీ, డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా కోసం 1985 కాలంలోకి రామ్‌చరణ్‌ని తీసుకెళ్లారు. స్టైలిష్ హీరోను కాస్తా .. పక్కా విలేజ్ కుర్రాడిలా రెడీ చేశారు. గళ్ల లుంగీ, గెడ్డం, చేతిలో తువ్వాలు... టోటల్‌గా రామ్‌చరణ్ లుక్ అదిరింది. 30 ఏళ్ల క్రితం అమ్మాయిలు వేసుకున్నట్లే బిగుతుగా అల్లిన జడ, ఆ జడకు కట్టిన రిబ్బను, లంగా–ఓణీలో సమంత లుక్ కూడా బాగుంది. 1985ని తలపించేలా సుకుమార్ వేయించిన విలేజ్ సెట్స్ సూపర్. గోలీసోడా, పూరిళ్లు, కుండలు, ఎడ్లకావిడి.. ఇలా ఒకటేంటి ఆల్మోస్ట్ విలేజ్‌లో ఉండే అన్నింటినీ ఎరేంజ్ చేశారు. ఈ మధ్యే సెట్లో ఓ జాతర పాట తీసినట్లు బయటికొచ్చిన ఫొటో స్పష్టం చేసింది. అప్పటికాలంలో ఉండే జాతర, తిరున్నాళ్లను సినిమాలో చూడవచ్చన్న మాట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వస్తుంది. రూట్ మార్చిన పూరి..! ‘బ్యాక్ టు పాస్ట్’ వెళ్లడం ఇది కొత్త కాదు. గడచిన మూడు నాలుగేళ్లల్లో ‘మనం’, ‘24’ వంటి సినిమాలు సౌత్‌లో వచ్చాయి. అయితే, ఒకేసారి ఇటు సౌత్ అటు నార్త్‌లో ఎక్కువ సినిమాలు ‘ఆన్ సెట్స్’లో ఉండటం విశేషం. ప్రెజెంట్ ట్రెండ్ మూవీస్ ఎలానూ వస్తాయి. పాస్ట్‌ని ప్రెజెంట్ చూపించి, ప్రేక్షకులను మెప్పించి, మంచి వసూళ్లు రాబట్టుకోవాలన్నది ఫిల్మ్ మేకర్స్ టార్గెట్ అయ్యుండొచ్చు. ఫారిన్ లొకేషన్లు, పబ్బులు, హాట్ గాళ్స్... మారిన ట్రెండ్‌కి అప్డేటెడ్ వెర్షన్‌లా ఉంటాయి పూరి జగన్నాథ్ సినిమాలు. అయితే పూరి జగన్నాథ్ రూట్ మార్చారు. 1971కి వెళ్లిపోయారు. తనయుడు ఆకాశ్ పూరీ కోసం ‘మెహబూబా’ పేరుతో ఆయన లవ్‌స్టోరీ తీస్తున్నారు. 1971 చెందిన ఓ యువకుడు–యువతి మధ్య సాగే ప్రేమకథ ఇది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. 1971 అంటే పూరి స్టైల్ రిచ్‌నెస్ కనిపించే వీలుండదు. లేటెస్ట్ గన్స్, వెపన్స్‌ను ఫైట్స్‌లో యూజ్ చేయడం పూరి మార్క్. ఇలాంటివి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేం.. 1971 అంటే పిస్తోల్, రైఫిల్.. లాంటివి వాడాలి కదా మరి. అందులోనూ వార్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి చిట్టిపొట్టి కాస్ట్యూమ్స్‌లో హీరోయిన్ నెహా శెట్టిని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా షూట్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో స్టార్ట్ చేశారు. హిమాలయాల్లో 18వేల అడుగుల ఎత్తులో, మైనస్ 7 డిగ్రీస్‌లో సినిమాను షూట్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
లండన్ లో నయనతార
నటి నయనతార లండన్ లో మకాం వేశారు. తమిళంలోనే కాకుండా దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా విరాజిల్లుతున్న తార నయనతార. ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకూ తమ పక్కన హీరోయిన్ గా కోరుకుంటున్న నటి నయనతార. అయితే తనను మాత్రం లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుసగా వరిస్తుండడం విశేషం. లేడీ సూపర్‌స్టార్ పట్టంతో చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్న నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలైయుదీర్ కాలం. హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం లండన్ లో శ్రీకారం చుట్టుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మాతగా మారారు. ఆయన వైఎస్ఆర్ ఫిలింస్ సంస్థను ప్రారంభించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాసు బద్నాని చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఫిలింస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కమలహాసన్ తో ఉన్నైపోల్ ఒరువన్, అజిత్ హీరోగా బిల్లా–2 చిత్రాలను తెరకెక్కించిన చక్రీ తోలేటి ఈ చిత్రానికి దర్శకుడు. కొలైయుదీర్ కాలం చిత్రం ద్వారా నిర్మాతగా మారిన యువన్ శంకర్‌రాజా తన భావాన్ని వ్యక్తం చేస్తూ ఇది మరచిపోలేని సంఘటనగా పేర్కొన్నారు. ఉన్నత విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న తన కోరిక నెరవేరే తరుణం ఇదన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాసు బద్నానితో కలిసి చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇక తన మిత్రుడు, దర్శకుడు చక్రి తోలేటి బ్రహ్మాండమైన కథను హాలీవుడ్ చిత్రాల స్థాయికి దీటుగా తయారు చేశారని చెప్పారు. ఈ కథకు నటి నయనతారనే న్యాయం చేయగలరనే విశ్వాసం తో ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా యువన్ శంకర్‌రాజా తండ్రి ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా కూడా ఇంతకు ముందు నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. అదే విధంగా విజయ్‌ఆంటోని, యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ నిర్మాతలుగా మారారు. త్వరలో సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ కూడా నిర్మాతానుభవాన్ని పొందడానికి సిద్ధం అవుతున్నారు. -
నిర్మాతగా యువన్ శంకర్‌రాజా
ధనార్జన, లాభనష్టాలను పక్కన పెడితే సినిమా ఒక ఫ్యాషన్. ఎవరికైనా ఇది కాదనలేని నిజం. అలాగే ఇల్లు కట్టి చూడు,పెళ్లి చేసి చూడు అన్న సామెతలానే సినిమా నిర్మించి చూడు అని కూడా అంటారు. ఇదీ అంత కష్టమైన కార్యమే. ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఇతర రంగాల్లో రాణించేవారు కూడా చిత్ర నిర్మాణంపై ఆసక్తి చూపడం అన్నది మొదటి నుంచి జరుగుతున్నదే.అలా ఏసీ థియేటర్లలో కూర్చుని రాగాలు దీసే, బాణీలు కట్టే సంగీత దర్శకులు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం గమనార్హం. ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా కూడా కమలహాసన్ హీరోగా సింగారవేలన్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ తరం సంగీత దర్శకుల్లో విజయ్‌ఆంటోని నిర్మాతగానే కాకుండా కథానాయకుడిగానూ రాణిస్తున్నారు.ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ 99 పాటలు పేరుతో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా యువన్ శంకర్‌రాజా నిర్మాతగా అవతారమెత్తనున్నారు. ఇటీవలే తండ్రి అయిన యువన్ చిత్రాలతో పాటు విదేశాల్లో సంగీత విభావరిలతో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నిర్మాతగా ఒక భారీ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నిర్మించనున్న తొలి చిత్రంలో క్రేజీ జంట జయంరవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత ఈ జంట నటించనున్న చిత్రం ఇదే అవుతుంది. మరో విషయం ఏమిటంటే ఇది చారిత్రక కథా చిత్రంగా ఉంటుందట. దీనికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సంచలన చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాతగా ఇళయరాజా చేతులు కాల్చుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. మరి ఆయన వారసుడు యువన్ శంకర్‌రాజా దాన్ని బ్రేక్ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
సినిమా తీస్తానంటున్న యువన్
చెన్నై : మంచి కథ లభిస్తే సినిమా తీస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. సంగీత దర్శకులు నిర్మాతలుగా మారుడం ఇవ్వాళ కొత్తేమీ కాదు. సంగీత జ్ఞాని ఇళయరాజా కూడా నిర్మాతగా చిత్రాలు చేశారు. ఇక ఈ తరం విషయానికి వస్తే సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నిర్మాతగా మారడంతో పాటు కథానాయకుడిగాను విజయాలను అందుకుంటున్నారు. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ కూడా చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. తన చిత్రానికి తనే కథను సిద్ధం చేసుకుంటున్నారు కూడా. తాజాగా మరో ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా నిర్మాతనవుతానంటున్నారు. ఈయన ఇటీవల ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తనకు నటుడవ్వాలనే కోరిక ఇంత వరకూ కలగలేదన్నారు. అయితే నిర్మాతగా చిత్రాలు చేయాలనే ఆశ మాత్రం ఏర్పడిందని అన్నారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి కథ లభిస్తే వెంటనే సినిమా తీస్తానని యువన్ అన్నారు. మరో విషయం ఏమిటంటే తనకు పరిపూర్ణ విజయం లభించిదని భావించడం లేదు. అలాంటి విజయం కోసం నిత్యం భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని యువన్ శంకర్ రాజా అన్నారు. -
హాలీవుడ్లో... యువన్ స్వరాలు
తమిళ, తెలుగు భాషల్లో స్వరకర్తగా యువన్ శంకర్‌రాజాకు స్పెషల్ క్రేజ్ ఉంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వారసునిగా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన యువన్ చాలా త్వరగానే తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. త్వరలో యువన్ ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రభాకరన్ హరిహరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం పేరు ‘ఊల్ఫెల్’. ఇవన్ డ్రాగో అనే రోబో ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు యువన్ మంచి నేపథ్య సంగీతం అందించారు. నవంబర్ ప్రథమార్ధంలో ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సన్డాన్స్ చలన చిత్రోత్సవాల్లో సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు ప్రభాకరన్ తెలిపారు. -
హాలీవుడ్లో యువన్ సంగీతం
సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువన్ శంకర్ రాజా హాలీవుడ్లో తన స్వరాలను వినిపించనున్నాడు. భారతీయ దర్శకుడు హరిహరన్ తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ చిత్రం 'వూల్ఫెల్' సినిమా ద్వారా హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు ఈ యువ సంగీత తరంగం. యానిమేషన్ సినిమాగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా 'వూల్ఫెల్'కు సంగీతం అందిస్తున్నట్టు తన ట్విట్టర్లో ప్రకటించాడు యువన్. దర్శకుడు హరిహరన్‌తో పాటు డిజైనర్ కునాల్ రాజన్‌తో కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో పాటలు ఉండవని, నేపథ్య సంగీతంతో పాటు ఓ ప్రమోషనల్ సాంగ్‌ను మాత్రమే అందిస్తున్నట్టుగా తెలిపాడు. Hi guys I'm really excited to be associated with the team @dhivyadivz @iamspydii @woolfellmovie IT'S TIME TO ROCK 😎😎😎 — Yuvanshankar raja (@thisisysr) October 27, 2015 -
'ముస్లిం యువతిని పెళ్లాడటం నాన్నకు ఇష్టమే'
చెన్నై: తాను ముస్లిం యువతిని పెళ్లాడటం తన తండ్రి, ప్రఖ్యాత తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇష్టమేనని ఆయన కుమారుడు వర్ధమాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పేర్కొన్నారు. యువన్ 2014 లో ఇస్లాం మతం స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జఫరున్నీసా అనే ముస్లిం యువతిని పెళ్లాడారు. ఆయనకిది మూడో పెళ్లి. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇళయరాజా తన పెళ్లికి హాజరుకాలేకపోయారని యువన్ తెలిపారు. అయితే పెళ్లి అనంతరం ఇళయరాజా ఇంటికి వెళ్లినప్పుడు ఆయన తనకు సాదరస్వాగతం పలికారని యువన్ అన్నారు. తాను ఇస్లాంలోకి మారినప్పటికీ యువన్ అనే పేరునే ఇష్టపడతానని అన్నారు. పేరు మార్పుపై స్పందిస్తూ..."యువన్ అనేది నా ఐడెంటిటీ, ఆ పేరును నేను మార్చుకోవాలనుకోవటంలేదు. మతాన్నితప్ప మరేదీ మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. గత కొన్నేళ్లుగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. స్వయంకృతాపరాధంతో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నాను. ప్రస్తుతం నా వృత్తిమీద దృష్టిపెట్టాను. మార్చి 9వ తేదీ కేరళలోని తిరునల్వేలిలో నిర్వహించబోయే ప్రదర్శనకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని యువన్ తెలిపారు. -
మూడో పెళ్లి చేసుకున్న సంగీత దర్శకుడు
రామనాథపురం: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా చిన్న కుమారుడు యువన్ శంకర్ రాజా మూడో వివాహం చేసుకున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని కిజాకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిమ్ యువతి జఫరున్నీసాను గురువారం ఆయన పెళ్లి చేసుకున్నారు. కిజాకరాయ్ సమీపంలోని శంకళ్నీరొదైలో ఓ గార్డెన్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీరి వివాహం జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పెళ్లి కూతురు బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టు తెలిపాయి. 35 ఏళ్ల యువన్ గతంలో సుజయ చంద్రన్, శిల్పా మోహన్ లను పెళ్లాడారు. తర్వాత వారికి విడాకులిచ్చారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో వంద చిత్రాలకు యువన్ సంగీత దర్శకునిగా వ్యవహరించారు. -
తండ్రీ కొడుకుల సమక్షంలో..
తిరునెల్విలి: భారతీయ సినీతెరపై తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా, ఆయన కొడుకు యువన్ శంకర్ రాజాలు కలిసి ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తొలిసారి వారివురి సమక్షంలో జరిగే సంగీత కార్యక్రమానికి సంక్రాంతి పండుగ వేదిక కానుంది. జనవరి 17వ తేదీన తిరున్వెల్లిలో జరిగే సంగీత కార్యక్రమంలో తన తండ్రితో కలిసి ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు యువన్ తెలిపాడు. 'యువన్ మ్యూజికల్ ఎక్స్ ప్రెస్'పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపాడు. ముందుగా చెన్నై లో ఇవ్వనున్న సంగీత కార్యక్రమం అనంతరం మలేషియా, సింగపూర్ లలో ఉంటుందని యువన్ స్పష్టం చేశాడు. పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ లతో తమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దక్షిణ తమిళనాడులోని తిరున్వెలిలో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం మాత్రం తన తొలి సినిమా 'అరవిందన్' ఇక్కడే షూటింగ్ చేసుకోవడమేన్నాడు. -
యువన్‌కి మూడో పెళ్లి!
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు ముగ్గురు పిల్లలు. పెద్ద వాడు కార్తీక్ రాజా, చిన్నవాడు యువన్, అమ్మాయి భవతారిణి-ముగ్గురూ సంగీత దర్శకులే. అయితే, ఇళయరాజా కుమారుడు అనే ఇమేజ్ నుంచి సులువుగానే బయటపడగలిగారు యువన్. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో వంద చిత్రాలకు సంగీత దర్శకునిగా వ్యవహరించిన ఘనత యువన్ది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో కలిపి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అయితే, యువన్ చేస్తున్న చిత్రాలకన్నా ఆయన వ్యక్తిగత జీవితం గురించే ఇప్పుడు వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం ముస్లిమ్ యువతి జఫరున్నీసాను యువన్ పెళ్లి చేసుకోనున్నారు. రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిందట. దుబాయ్‌లో పెళ్లి జరగనుందని తెలిసింది. ఇది ప్రేమ వివాహమట. యువన్‌కి ఇది మూడో పెళ్లి. 2005లో సుజయ చంద్రన్‌తో యువన్ వివాహం జరిగింది. అది లవ్ మ్యారేజే. మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2011లో శిల్పా మోహన్ని యువన్ పెళ్లి చేసుకోవడం, ఆమెనుంచి కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు జఫరున్నీసాతో యువన్‌కి జరగనున్నది మూడో వివాహం. కాగా, ఆయన తన పేరుని కూడా అబ్దుల్ హలీక్ అని మార్చుకున్నారట. తల్లి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలకు ఇస్లామ్ మతం మీద యువన్‌కి విశ్వాసం కలిగింది. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. -
ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్
‘‘ఏడేళ్ల క్రితం హరి దర్శకత్వంలో ‘భరణి’ చిత్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు మంచి కథ కుదరడంతో ఈ సినిమా చేశాం’’ అని విశాల్ చెప్పారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘పూజ’. శ్రుతీ హాసన్ కథానాయిక. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న నితిన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేయగా, ఆడియో సీడీని శ్రుతీహాసన్ ఆవిష్కరించి నితిన్‌కి ఇచ్చారు. విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ చిత్రం గురించి విశాల్ మాట్లాడుతూ -‘‘ఇందులో నాది చాలా మంచి పాత్ర. ఇలాంటి అబ్బాయి తమ కుటుంబంలో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. యువన్ ఇచ్చిన పాటలు, కనల్ కణ్ణన్ సమకూర్చిన ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశానని శ్రుతీ హాసన్ చెప్పారు. ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రమని, పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమని హరి తెలిపారు. -
హరితోనే సంతృప్తి
దర్శకుడు హరి దర్శకత్వంలో నటిస్తే పనిలో సంతృప్తి కలుగుతుందని నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. పాండియనాడు, నాన్‌శిగప్పు మనిదన్ చిత్రాల కథానాయకుడిగా, నిర్మాతగా వరుసగా విజయం సాధించిన నటుడు విశాల్. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు తామరభరణి అనే సక్సెస్ఫుల్ చిత్రం వచ్చింది. తాజాగా పూజై చిత్రం రూపొందింది. నటుడు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈమెకిది తమిళంలో మూడో చిత్రం కాగా నిర్మాతగా విశాల్‌కు మూడో చిత్రం కావడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యాయి. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో దీపావళికి విడుదల చేయనున్నట్లు నటుడు విశాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ పూజై చిత్రం తన కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా పేర్కొన్నారు. ఏడేళ్ల తరువాత హరి దర్శకత్వంలో పూజై చిత్రం చేశానని చెప్పారు. ఎమ్జీఆర్ లాంటి వారు హరి దర్శకుల మధ్య హరి ఎమ్జీఆర్ లాంటివారని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎమ్జీఆర్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారన్నారు. అదే విధంగా దర్శకుడు హరి తన చిత్రాల వల్ల సైకిల్ స్టాండ్‌లో టోకెన్లు ఇచ్చే వారి వరకు అందరు సంతోషంగా ఉండాలని భావిస్తారన్నారు. పూజై చిత్రంలో నటి రాధిక, సితార సూరి తదితర ప్రముఖ నటీనటులు నటించారన్నారు. ముఖ్యంగా సత్యరాజ్‌తో కలిసి నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ కోయంబత్తూర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం పూజై అని తెలిపారు. పూజై లాంటి మంచి కమర్షియల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించారు. -
సినిమా రివ్యూ: గోవిందుడు అందరివాడేలే
నటీనటులు: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలిని ముఖర్జీ, రావు రమేశ్, కోట శ్రీనివాసరావు సంగీతం: యువన్ శంకర్ రాజా కెమెరా: సమీర్ రెడ్డి నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: కృష్ణవంశీ వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్, సరియైన సక్సెస్ కోసం చూస్తున్న దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్ రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం అక్టోబర్ 1 తేదిన (బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేరిందా?, క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి ఈ చిత్రం గత వైభావాన్ని తీసుకువచ్చిందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం! ఊరు బాగుండాలని కోరుకునే బాలరాజు(ప్రకాశ్ రాజ్)కు చంద్రశేఖర్ (రహమాన్) బంగారం(శ్రీకాంత్) ఇద్దరు కొడుకులుంటారు. తన పెద్ద కుమారుడ్ని వైద్యుడిని చేసి తాను కట్టించే ఆస్పత్రి ద్వారా గ్రామానికి సేవలందించాలని బాలరాజు కోరుకుంటారు. అయితే ఊహించని విధంగా పెద్ద కుమారుడు తన కోరికను తిరస్కరిస్కరించడంతో బాలరాజు షాక్ గురువుతాడు. దాంతో బాలరాజు, చంద్రశేఖర్ లు విడిపోతారు. తండ్రికి దూరమై విదేశాల్లో స్థిరపడిన చంద్రశేఖర్ కి అభిరామ్(రామ్ చరణ్), ఓ కూతరు ఉంటుంది. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చంద్రశేఖర్ ఓ కారణంతో కుటుంబానికి దూరమయ్యాని చింతిస్తాడు. తండ్రి బాధను తెలుసుకున్న అభిరామ్ తన తాత బాలరాజు వద్దకు చేరుకుని ఏం చేశాడు? కుటుంబాన్ని కలుపడానికి చేసిన ప్రయత్నంలో ఎలాంటి సమస్యుల ఎదురయ్యాయి? సమస్యల్ని ఎలా అధిగమించాడు. తండ్రిని, తాతను, కుటుంబాన్ని కలుపడానికి అభిరామ్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? ఈ క్రమంలో తన మరదలు సత్య(కాజల్) ప్రేమను ఎలా దక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానమే 'గోవిందుడు అందరివాడేలే' ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీ ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్ ఫోటోగ్రఫి కృష్ణవంశీ డైరెక్షన్ మైనస్ పాయింట్స్: సంగీతం రొటీన్ కథ, క్లైమాక్స్ మాస్, యాక్షన్ చిత్రాల విజయాలతో జోరు మీదున్న రాంచరణ్ ఈ చిత్రంలో కుటుంబాన్ని కలిపే మనవడి పాత్రను పోషించాడు. రామ్ చరణ్ ఇమేజ్ తగినట్టుగా సాంగ్స్, ఫైట్స్ తో అదనంగా భావోద్వేగాలను పలికించే అభిరామ్ పాత్రను పోషించాడు. దసరా పండగ పురస్కరించుకుని వచ్చిన ఈ చిత్రంలో అభిమానుల్ని మెప్పించడానికి అభిరామ్ గా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. మరదలిగా 'సత్య' పాత్రలో కనిపించిన కాజల్, రామ్ చరణ్ ల మధ్య కెమిస్ట్రీ పడింది. రామ్ చరణ్ తో రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలకే పరిమితం కాకుండా, శృంగార సన్నివేశాల్లో కాజల్ కొంత అడ్వాన్స్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కూడా కాజల్ తన వంతుగా ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక ఈ చిత్రంలో బంగారం పాత్రలో శ్రీకాంత్ కొంత నెగిటివ్ షేడ్ ఉన్న కారెక్టర్ ను పోషించాడు. బాధ్యత తెలియని కుమారుడిగా జూదం, మద్యానికి బానిసైన వ్యక్తిగా తన మార్కును ప్రదర్శించాడు. ఇక కమిలిని ముఖర్జి, జయసుధ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. బాలరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్ మరోసారి విజృంభించాడు. కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా అందరి బాగు కోసం తపన పడే పాత్రలో జీవించాడు. ఈ చిత్ర భారాన్నంత తన నటనతో ప్రకాశ్ రాజ్ భుజాన వేసుకున్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. మరోసారి ప్రకాశ్ రాజ్ ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో అప్పుడప్పుడు వచ్చే విలన్ పాత్రల్లో రావు రమేశ్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో వారు చేయాల్సింది ఏమిలేకపోయింది. సాంకేతిక నిపుణుల పనితీరు: జోర్డాన్ తో ఇతర అందమైన లోకేషన్లను తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి రాణించారు. ఈ చిత్రంలో భారీ సంఖ్యలో ఉన్న ఆర్టిస్టుల మూడ్ ను ఫ్రేమ్ లో బంధించడంలో సమీర్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్ర ఆడియోలో ఆకట్టుకోలేకపోయిన పాటల్ని తెరపైన చిత్రీకరించడంలో సమీర్ తన పనితనాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బండ్ల గణేష్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్: ఆడియోలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ చిత్రంలో సిట్వువేషనల్ గా వచ్చే పాటలు తెరపై ఆలరించాయి. పాటలు అంతగా క్యాచీగా లేకపోవడం కొంత ప్రేక్షకుల్ని నిరుత్సహపరిచే అంశమని చెప్పవచ్చు. నీలిరంగు చీరలోన, బావగారి చూపే పాటలు సందర్భోచితంగా బాగున్నాయి. రాంచరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అభిమానులను ఉత్సాహపరిచేవిధంగా తెరకెక్కించారు. కృష్ణవంశీ దర్శకత్వం: చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న కృష్ణవంశీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో కూడా తన మార్కును వదలకుండా... ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపిస్తుంది. సీతారామయ్య మనవరాలు, కలిసుందారాం చిత్ర కథలను దాదాపు పోలివుండే 'గోవిందుడు అందరివాడేలే' తన స్టైల్లో మురారీ, నిన్నే పెళ్లాడుతా లాంటి చిత్రాల శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణవంశీ స్టైల్ భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, విభేదాలు, మనస్పర్ధలు లాంటి అంశాలతో తెరపై మరోసారి తెలుగుదనం ఉట్టిపడేలా రూపొందించడంలో కృష్ణవంశీ సఫలమయ్యారు. ముగింపు: దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' సూపర్, డూపర్ హిట్ అనే టాక్ బయటికి చెప్పలేకపోయినా.. తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే పాత చిత్రాల కథకే మళ్లీ కొత్త రంగులద్దారనే విమర్శలు ఓ వైపు ఉన్నా.. సెలవు దినాల్లో అభిమానులు, ప్రేక్షకులకు పైసా వసూలు చేసే చిత్రంగా 'గోవిందుడ్ని తీర్చి దిద్దారు. -రాజబాబు అనుముల -
అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు?
ప్రముఖ యువ నటుడు ధనుష్‌కు తన అన్నయ్య సెల్వరాఘవన్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగాను, నిర్మాతగాను విజయాల బాటలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించి హీరోగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా సెల్వరాఘవన్‌కు ఈ మధ్య సరైన విజయాలు లేవు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇరండామ్ ఉలగం చాలా నిరాశపరచింది. దీంతో ఆయన దర్శకత్వం వహించాల్సిన ఒకటి, రెండు చిత్రాలు డ్రాప్ అయ్యాయి. ఏదేమైనా ధనుష్ ఇప్పుడు తన అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ఇంతకుముందు కాదల్ కొండేన్, 7జి రెయిన్ బో కాలనీ, పుదుపేట్టై వంటి చిత్రాలకు సెల్వరాఘవన్‌తో పనిచేసిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రాహకుడు అరవింద్ కృష్ణలు ఈ చిత్రానికి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ బృందమే ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ ద్వారా మళ్లీ త్వరలో రానున్నామంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సినిమా రివ్యూ: సికిందర్
నటీనటులు: సూర్య, సమంత, మనోజ్ బాజ్ పాయ్, విద్యుత్ జమ్వాల్, దిలీప్ తాహిల్, రాజ్ పాల్ యాదవ్ ఫోటోగ్రఫి: సంతోష్ శివన్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: ఆంథోని నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్ దర్శకత్వం: లింగుస్వామి రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్ పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ. నటీనటుల, సాంకేతిక వర్గాల పనితీరు: ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ పాత్రలను సూర్య సమర్ధవంతంగా పోషించాడు. రెండు పాత్రల్లోనూ తన మార్కును ప్రదర్శించాడు. గత చిత్రాల్లోని పాత్రలను పోల్చుకుంటే రాజుభాయ్, కృష్ణ పాత్రలు సూర్య కెరీర్ లోనే సాదా సీదా పాత్రలని చెప్పవచ్చు. సూర్య ప్రేయసిగా సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాని.. ఓ అడుగు ముందుకేసి.. పరిమితుల్లేకుండా గ్లామర్ ను ప్రదర్శించింది. సమంత కొన్ని సన్నివేశాల్లో హాట్ హాట్ గా కనిపించింది. విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయ్, బ్రహ్మనందం పాత్రలు అంతంత మాత్రమే. సంతోష్ శివన్ ఫోట్రోగ్రఫి, యువన్ శంకర్ రాజా సంగీతం, ఆంథోని ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సమీక్ష: సూర్య గత చిత్రాలకు కథ, కథనాలే ప్రధానం. అయితే సికిందర్ చిత్ర కథ, కథనాలు గతంలోని సూర్య సినిమాలకు విభిన్నంగా కనిపిస్తుంది. సికిందర్ చిత్రంలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా... కథనంలో దమ్ములేకపోవడం ప్రేక్షకుల్ని అసహనానికి గురిచేస్తుంది. ఇక రెండవ భాగంలో ఈ సాగతీత ఎక్కువగానే అనిపించింది. సుమారు మూడు గంటల సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే సన్నివేశాలు, వినోద సన్నివేశాలూ ఎక్కడా కనిపించవు. ఏదో సినిమా నడుస్తుందనే ధోరణి కనిపిస్తుంటుంది. కథ బలహీనంగా ఉండటమనే అంశం మిగితా విభాగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఓవరాల్ గా సూర్యను సికిందర్ గా చూపించాలని దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకులు ఆదరించడంపైనే సికిందర్ విజయం ఆధారపడి ఉంటుంది. పేలవమైన కథ, కథనాలు సూర్యను సికిందర్ గా నిలబెట్టడం అనేది కష్టమైనదే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
ఇళయరాజాతో సఖ్యత లేదా?
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన కొడుకు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాల మధ్య సఖ్యత కొరవడిందన్న ప్రచారం జరగుతోంది. దీనికి కారణం యువన్ శంకర్‌రాజా మత మార్పిడికి పాల్పడటమేనని సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నా ఆయన వైవాహిక జీవితం మాత్రం సమస్యల మయమే. ఇప్పటికే ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. కారణాలేమయినా యువన్ శంకర్ రాజా ఈ మధ్యనే ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ మత మార్పిడి తన తండ్రి ఇళయ రాజాకు ఇష్టంలేదని ఈ విషయంలో వీరిద్దరి మధ్య సఖ్యత కొరవడిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని యువన్ శంకర్ రాజా ఖండించారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ తాను ఇస్లాం మతం స్వీకరించిన విషయం నిజమేనన్నారు. దీన్ని తాను గొప్పగా భావిస్తున్నానని ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారని చెప్పారు. తన తండ్రి ఇళయరాజాకు తనకు మద్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యువన్ శంకర్ రాజాకు తన తల్లి అంటే ఎనలేని ప్రేమ అని ఆమె మరణం ఆయనకు తీరని లోటు అని యువన్ స్నేహ బృందం అంటోంది. ఆ మధ్య యువన్ ఒక ఆధ్యాత్మిక గురువును కూడా కలుసుకున్నారని అలాంటిది ఇస్లామ్ మతం ఎందుకు స్వీకరించారో అర్థం కావడం లేదని వారన్నారు. యువన్ ఎ.ఆర్.రెహ్మాన్‌ను అనుసరిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి దేమీలేదన్నారు. అయితే త్వరలో తన పేరును కూడా మార్చుకోవడానికి యువన్ రెడీ అవుతున్నారని, రోజు ఐదుసార్లు సమాజ్ చేస్తున్నారని తెలిపారు. -
ఇస్లాంలోకి యువన్ శంకర్ రాజా!
చాలా మంది తమకు నచ్చిన మతంలోకి మారుతుంటారు. ఇం దుకు పలు కారణాలుంటాయి. సెలబ్రెటీలు మతం మారడంపై ఉత్సుకత ఏర్పడడం సహజం. అలాంటి ఆసక్తినే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా విషయంలో నెలకొంది. ఈయన హిం దూ మతం నుంచి ఇస్లామ్ మతంలో కి మారారు. యువన్ శంకర్ రాజా కుటుంబ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీత చక్రవర్తి ఇళయ రాజా ముగ్గురు సంతానంలో యువన్ శంకర్ రాజా ఒకరు. మొదటి కొడుకు కార్తీక్ రాజా. వీరికి చెల్లెలు భవతారిణి. ఈ ముగ్గురు తండ్రి బాటలోనే పయనించడం విశేషం. యువన్ శంకర్ రాజా వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఆయన మొదట సుజయ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో యువన్ ఆ తర్వాత శిల్ప అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇది పెద్దల అనుమతితో తిరుమలలో జరిగింది. తాజాగా అది కలహాల కాపురంగా మారడంతో ఇద్దరూ విడిపోయూరని సమాచారం. ఇప్పుడు ముస్లిం యువతిని మూడో పెళ్లి చేసుకోవడానికి యువన్ ఇస్లాం మతం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంగీత దర్శకుడిప్పుడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తున్నారట. ఖురాన్ చదువుతున్నారట. దీని గురించి యువన్ శంకర్ రాజా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను ఇస్లాం మతంలోకి మారిన విషయం నిజమేనని, మూడవ పెళ్లి కోసం మాత్రం కాదని వివరించారు. -
‘బిరియాని’ యువన్‌కు వందో సినిమా
-
అప్పట్లో నా జీతం 4,300 రూపాయలు
మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు కార్తీ. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులక్కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయాడంటే కారణం అదే. దానికి తోడు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు తను. యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ.. ఈ మూడు సినిమాలు చాలు నటునిగా కార్తీ ఏంటో చెప్పడానికి. చాలా విరామం తర్వాత ఆయన చేసిన సినిమా ‘బిరియాని’. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కె.ఇ. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న డుదలవుతున్న సందర్భంగా కార్తీతో కాసేపు. తెలుగు బాగా మాట్లాడేస్తున్నారు. మరి డెరైక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అందరూ ఇదే అడుగుతున్నారండీ.. త్వరగా తెలుగు సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే... సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. కథలైతే వింటున్నా. త్వరలోనే శుభవార్త చెబుతా. మరి మీ అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు? అన్నయ్య, నేను కలిసి నటించే సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా కథ కుదరాలి. అలాంటి కథ ఎవరు చెబుతారో చూద్దాం. మల్టీస్టారర్ చిత్రాలపై నాకు పెద్దగా ఇంట్రస్ట్ లేదు కానీ, అన్నయ్యతో కలిసి చేయాలని మాత్రం ఉంది. ‘బిరియాని’ సినిమాతో గాయకుని అవతారం ఎత్తినట్టున్నారు? సిట్యుయేషన్ పరంగా ఆ పాట నేను పాడితేనే కరెక్ట్. అందుకే.. అటు దర్శకుడు, ఇటు సంగీత దర్శకుడు ఇద్దరూ పోరాడి మరీ నాతో ఆ పాట పాడించారు. సినిమాలో ఇది డ్రీమ్ సాంగ్ కాదు. లైవ్ సాంగ్. యువన్ శంకర్‌రాజా అద్భుతంగా ట్యూన్ చేశారు. ఎంజాయ్ చేస్తూ ఈ పాట పాడాను. అంతకు ముందు పాడిన అనుభవం ఏమైనా ఉందా? పాడేవాణ్ణి. పాటలంటే ఆసక్తే. అయితే... సినిమాకు పాడతానని అనుకోలేదు. భవిష్యత్తులో కూడా పాడాలని ఉంది. అయితే... అందుకు సంగీత దర్శకుల ప్రోత్సాహం కూడా ఉండాలి కదా. మెలొడీ సాంగ్స్ కాకుండా, ఇలా గమ్మత్తుగా సాగే పాటలైతే బాగుంటుంది. స్టార్‌గా ఎదిగాక కూడా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారట. నిజమేనా? మామూలు మధ్యతరగతివాడిలా మసలడంలోనే ఆనందం ఉంది. నేను చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం అలాంటిది. స్టార్ కొడుకులా ఎప్పుడూ పెరగలేదు. అన్నయ్య బీకాం చదివి ఇక చదవనని చేతులెత్తేశాడు. నేను అలా కాదు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్‌ని. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత న్యూయార్క్‌లో ఎమ్మెస్ చేశాను. ఇక్కడ బిఈ చదువుతున్నన్ని రోజులూ నాకు బైక్ కూడా ఉండేది కాదు. బస్‌లోనే కాలేజ్‌కి వెళ్లేవాణ్ణి. ఎమ్మెస్ అయిపోగానే.. కష్టపడి ఇక్కడే ‘కలర్ ప్లస్’ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నెలకు 4,300 రూపాయల జీతం. రోజుకి 12 గంటలు కష్టపడి పనిచేసేవాణ్ణి. అందుకే నాకు సగటు మనిషి జీవన శైలి బాగా తెలుసు. ‘బిరియాని’ చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు, యువన్‌శంకర్‌రాజా నాకు అప్పట్నుంచే పరిచయం. ఆ రోజుల్లోనే సినిమాల గురించి మేం విపరీతంగా చర్చించుకునేవాళ్లం. ఇప్పుడు కలిసి పనిచేస్తామని అస్సలు అనుకోలేదు. ‘బిరియాని’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? బిందాస్‌గా తిరిగే పాత్ర. ఓ విధంగా చెప్పాలంటే ప్లే బోయ్ తరహా పాత్ర. పెళ్లయిన కొత్తలో ఇలాంటి పాత్ర చేయడం ఇబ్బందిగా అనిపించిందా? ఛాలెంజ్‌గా ఫీలయ్యా. అప్పుడప్పుడు నాన్నతో రెస్టారెంట్‌కి వెళ్లేవాణ్ణి. ఆయన మొహమాటానికి నాకూ డ్రింక్ ఆఫర్ చేసేవారు. కానీ నేను మాత్రం నిర్మొహ మాటంగా వద్దని చెప్పేసేవాణ్ణి. చిన్నప్పట్నుంచీ దుర్వ్యసనాలకు దూరంగా పెరిగాన్నేను. అదేంటో.. కెరీర్ మొదలయ్యాక నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన పాత్రలే నన్ను వరించాయి. కానీ ఛాలెంజ్‌గా తీసుకొని ఆ పాత్రల్ని చేశాను. తొలి సినిమా ‘పరుత్తివీరన్’లోని నా పాత్రను సమర్థవంతంగా పోషించడానికి నాకు మూడేళ్లు పట్టింది. కెరీర్ మొదలైన ఏడేళ్లలో తొమ్మిదే సినిమాలు చేయ గలిగానంటే కారణం అదే. ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉంది? ఇదివరకటికంటే జుట్టు కాస్త పలుచబడిందండీ (నవ్వుతూ) ఇంతకీ ‘బిరియాని’ ఎలా ఉంటుంది? హైదరాబాద్ బిరియానీ రేంజ్లో ఉంటుంది. బిరియాని తినడానికి ఫ్రెండ్‌తో పాటు ఓ రాత్రి బయలుదేరిన ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారం ఈ సినిమా. డిఫరెంట్ జానర్ ఫిలిం. వెంకట్‌ప్రభు చాలా ట్రెండీగా సినిమాను మలిచాడు. హన్సిక ఇందులో చాలా గ్లామరస్‌గా ఉంటుంది. -
మంచి బిరియాని తిన్న అనుభూతినిస్తుంది
‘‘నాకు ‘బిరియాని’ చాలా స్పెషల్ మూవీ. ఇందులో ప్లేబోయ్‌గా నటించాను. తెలుగు ప్రేక్షకులకు మంచి స్పైసీ బిరియాని తిన్న ఫీల్‌ని ఇస్తుందీ సినిమా’’ అన్నారు కార్తీ. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కార్తీ, హన్సిక జంటగా జ్ఞానవేల్‌రాజా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘బిరియానీ’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను చిత్రం యూనిట్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ -‘‘అన్ని అంశాలనూ మేళవించి వెంకట్‌ప్రభు ఈ కథ తయారు చేశారు. యువన్ నా చిన్ననాటి స్నేహితుడు. అతనికి ఇది వందవ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. హన్సిక ఈ సినిమాకోసమే బరువు తగ్గారు. అలాగే మాండి థాకర్ చేసిన ఐటమ్‌సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సినిమా సక్సెస్ సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఇందులో జర్నలిస్ట్ ప్రియగా నటించానని, కార్తీ మంచి టైమ్ సెన్స్ ఉన్న నటుడని హన్సిక చెప్పారు. దాసరిగారి ‘ఒసేయ్ రాములమ్మ’, ‘రౌడీ దర్బార్’ చిత్రాల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని రాంకీ అన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ -‘‘తమిళంలో మేం తీసిన ప్రతి సినిమా తెలుగులో విడుదల చేశాం. వాటిల్లో తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయం సాధించిన సినిమాలున్నాయి. రాబోతున్న ‘బిరియాని’ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు. తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ -‘‘సూర్య కథానాయకునిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనే ఓ సినిమా చేయబోతున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రం మొదలవుతుంది. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఓ టాప్ డెరైక్టర్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా ఉంటుంది’’ అని జ్ఞానవేల్ రాజా తెలిపారు. -
కార్తి స్పెషల్ ‘బిరియానీ’ రెడీ
కార్తి, హన్సిక కలిసి వడ్డించనున్న ‘బిరియాని’ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే అది యువన్‌కు వందో సినిమా. వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిచారు. ఈ వారంలో పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన్‌వేల్‌రాజా మాట్లాడుతూ -‘‘కార్తీ ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రను ఇందులో చేశారు. యాక్షన్, కామెడీల కలబోత ఇది’’ అని చెప్పారు. మెండీ థాకర్ మరో నాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, మాటలు: శశాంక్, వెన్నెలకంటి, సహనిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు. -
సురేష్ చేస్తున్న పదో ప్రయత్నం ‘ప్రేమించాలి!'
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని సురేష్ కొండేటి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ తో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో కొత్తవాళ్ళయిన సంతోష్, మనీషా జంటగా నటించగా, ఈ చిత్రానికి సమన్యరెడ్డి సహనిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథా కథనాలు ప్రధాన బలం. . . ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.