
ప్యార్ ప్రేమమ్ కాదల్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన రెండవ కొడుకు యువన్ శంకర్‌రాజా అనతికాలంలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పాటల కోసం చెవులు కోసుకునే సంగీత ప్రియులు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఒక ట్రెండ్ సెట్టర్‌గా పేరు సంపాదించుకున్న యువన్ శంకర్‌రాజా తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆయన వైఎస్‌ఆర్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్, ఇర్ఫాన్ మాలిక్‌లతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే ప్యార్ ప్రేమమ్ కాదల్. హరీష్‌కల్యాణ్, బిగ్‌బాస్ ఫేమ్ రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు.
యువన్‌శంకర్‌రాజానే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలోని హై ఆన్ లవ్, డోప్ అనే పల్లవిలతో కూడిన రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోప్ అనే పాట యువతను ఉర్రూతలూగిస్తోందని చెబుతున్నారు. చిత్ర పూర్తి స్థాయి ఆడియోను జూలై మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ప్యార్ ప్రేమమ్ కాదల్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment