
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్‌ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్‌లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం.
రాజా ది జర్నీ
సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు.
నటుడు ధనుష్ కరెక్ట్
ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment