
ఇళయరాజా , ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్‌ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది.
అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment