ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు? | Ilaiyaraaja Biopic Temporarily Stop Due To These Reasons, Deets Inside | Sakshi
Sakshi News home page

ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు?

Published Mon, Oct 28 2024 2:18 PM | Last Updated on Mon, Oct 28 2024 2:40 PM

Ilayaraja Biopic Temporarily Stop

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్‌ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.  

సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్‌.. ఆయన బయోపిక్‌లో నటుడు ధనుష్‌ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం ఫేమ్‌ అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్‌ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. 

అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్‌ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్‌పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ సెట్‌ కాదని అభిప్రాయాన్ని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్‌ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement