ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్‌మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది.
ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment