
ఇళయరాజా.. ఈ పేరు సంగీతానికి చిరునామా. చాలా భాషల్లో పనిచేసిన సంగీతజ్ఞాని. ఈయనలో అద్భుత గాయకుడు, గీతరచయిత ఉన్నారు. మాస్ట్రో ఇళయరాజాది సంగీతంలో సింపోని చేసిన ఘనత. ఇప్పటికే 1400 చిత్రాలకు పైగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అలాంటిది ఈయన జీవిత చరిత్రని సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడీ ఈ ఆలోచన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి వచ్చింది.
(ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)
హిందీలో పలు చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న డైరెక్టర్ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్‌తో 'షమితాబ్' సినిమా తీశారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కూడా నటించారు. అలానే బాల్కీతో నటుడు ధనుష్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్‌ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు.
ఇళయరాజా బయోపిక్ తీయాలనుకుంటున్నా, ఇది తన డ్రీమ్ అని రీసెంట్‌గా ఓ మీటింగ్‌లో చెప్పుకొచ్చారు. ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్‌తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ధనుష్ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం తెలిసిందే. అలానే ఇళయరాజాగా నటించేందుకు ధనుష్ ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)