ఫుల్‌ మాస్‌... | Kuberaa First Single Poster Featuring Dhanush Unveiled and Full Song To Release On april 20 | Sakshi
Sakshi News home page

ఫుల్‌ మాస్‌...

Published Wed, Apr 16 2025 3:11 AM | Last Updated on Wed, Apr 16 2025 3:11 AM

Kuberaa First Single Poster Featuring Dhanush Unveiled and Full Song To Release On april 20

అక్కినేని నాగార్జున, ధనుష్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, జిమ్‌ సర్భ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 20న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విజిల్‌ వేస్తూ డ్యాన్స్‌ చేస్తున్నారు ధనుష్‌. ఫుల్‌ మాస్‌గా ఈ పాట ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement