Kubera Movie
-
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
'కుబేర' రిలీజ్ విషయంలో రిస్క్ చేస్తున్న మేకర్స్..
-
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్‌గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
వినాయక చవితి నాడు విడుదలైన కొత్త పోస్టర్స్.. నెట్టింట వైరల్
ఏదైనా శుభకార్యం మొదలుపెడితే విఘ్నాలను తొలగిపోవాలని అందరూ వినాయకుడిని పూజిస్తారు. చిత్ర పరిశ్రమలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటే.. విఘ్నేశ్వరుడి పూజతోనే మొదలపెడుతారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా తాజాగా చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త సినిమా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. దేవర,కుబేరా,వేట్టయాన్ వంటి సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న మీ అభిమాన హీరోల పోస్టర్లను చూసేయండి. -
సరికొత్త కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.ఆదివారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కుబేర’ సినిమా నుంచి ధనుష్ కొత్తపోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్‌సర్భ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
డబ్బు ఎవరిది?
ఇక్కడ రష్మికా మందన్నా చేతిలో ఉన్న పెద్ద సూట్ కేసును చూశారుగా! ఈ సూట్‌కేసు నిండా డబ్బు కట్టలే. ఈ సూట్‌కేసును రాత్రి వేళ తవ్వి బయటకు తీశారు రష్మిక. మరి... ఈ డబ్బు ఎవరిది? రష్మికా మందన్నా ఇంత రహస్యంగా డబ్బును ఎందుకు తవ్వి తీశారు? అనే విషయాలు ‘కుబేర’ సినిమాలో తెలుస్తాయి.నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా, జిమ్ సర్ఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సోషల్ డ్రామాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం రష్మికా మందన్నా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. -
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన 'యానిమల్'తో నటిగా తానేంటో నిరూపించింది. ఇప్పుడు 'కుబేర'తో మరోసారి సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..)శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లుగా కాగా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్, నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేశారు. ఇప్పటివరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేసినట్లు అనిపిస్తుంది.ఈ వీడియోలో రష్మిక.. ఓ గునపం తీసుకుని పాతిపెట్టిన సూట్ కేసుని బయటకు తీస్తుంది. అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) -
క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?
కింగ్ నాగార్జున ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. తన బాడీగార్డ్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? నాగ్ ఎందుకు సారీ చెప్పాడు?(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)నాగార్జున స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమైపోయింది. సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం 'కుబేర' అనే మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ షెడ్యుల్ కోసం నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా, అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసమని నాగ్ దగ్గరకు వచ్చాడు.కానీ నాగ్ సెక్యురిటీ గార్డ్ మాత్రం పెద్దాయన అని కూడా చూడకుండా గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆ పెద్దాయన తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ (ఎక్స్)లో నాగ్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)This just came to my notice … this shouldn’t have happened!! I apologise to the gentleman 🙏and will take necessary precautions that it will not happen in the future !! https://t.co/d8bsIgxfI8— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024 -
దీపావళికి కుబేర?
ఈ దీపావళికి థియేటర్స్‌లోకి రానున్నాడట ‘కుబేర’. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగార్జున–ధనుష్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
యాక్షన్ కుబేర
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్‌తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
డంప్‌యార్డ్‌లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్‌యార్డ్‌లో ధనుష్‌తో ఒక సీన్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ డంప్ యార్డ్‌ను సెట్టింగ్స్‌తో క్రియేట్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్‌ను సహజంగా రావడం కోసం డంప్ యార్డ్‌లోనే షూటింగ్ చేద్దామని ధనుష్ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్‌యార్డ్‌లో ధనుష్ నటించారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ధనుష్‌ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో కూడా ధనుష్ డీగ్లామరైజ్‌గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్ లుక్‌ను కూడా మీకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది. -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్‌లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్‌గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్‌లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర..
-
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్‌గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్‌కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్‌లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
బ్యాంకాక్‌లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌ని బ్యాంకాక్‌లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్‌లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి.