
ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ వివాధంలో చిక్కుకుంది.

కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్‌కు కాపీ చేసుకుని టైటిల్‌కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment