అర్థాలే వేరులే! | Nagarjuna Special Poster Released from Kubera movie | Sakshi
Sakshi News home page

అర్థాలే వేరులే!

Published Mon, Sep 9 2024 12:17 AM | Last Updated on Mon, Sep 9 2024 12:17 AM

Nagarjuna Special Poster Released from Kubera movie

ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్‌ని విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌లో ధనుష్‌ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్‌ బొమ్మి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement