జూన్‌లో కుబేర? | Dhanush and Nagarjuna Kubera Movie Release On June 2025 | Sakshi
Sakshi News home page

జూన్‌లో కుబేర?

Published Sun, Jan 5 2025 10:20 PM | Last Updated on Sun, Jan 5 2025 10:20 PM

Dhanush and Nagarjuna Kubera Movie Release On June 2025

జూన్‌లో థియేటర్స్‌లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్‌–ఇండియన్‌ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ  భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement