భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..? | Kubera Movie Will Be Released Date locked | Sakshi
Sakshi News home page

భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?

Published Tue, Nov 26 2024 6:44 AM | Last Updated on Tue, Nov 26 2024 6:45 AM

Kubera Movie Will Be Released Date locked

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్‌ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement