బ్యాంకాక్‌లో కుబేర | Nagarjuna Akkineni and Dhanush begins shooting for Kubera in Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో కుబేర

Published Thu, Mar 14 2024 5:08 AM | Last Updated on Thu, Mar 14 2024 5:08 AM

Nagarjuna Akkineni and Dhanush begins shooting for Kubera in Bangkok - Sakshi

ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌  షూటింగ్‌ని బ్యాంకాక్‌లో ్ర΄ారంభించారు.

‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్‌లో ్ర΄ారంభించిన షెడ్యూల్‌లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్‌ ΄ార్ట్‌లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్‌ బొమ్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement