new schedule
-
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
రెడీ... యాక్షన్
యాక్షన్ మోడ్‌లోకి వెళ్లనున్నారు హీరో నాని. ‘అంటే.. సుందరానికీ..’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు నాని అండ్ కో రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో కనిపిస్తారు నాని. ఈ చిత్రంలో వారంలో మిగతా ఆరు రోజులు శాంతంగా ఉండి, ఆ రోజుల్లో జరిగే ఘటనలను పేపర్ మీద రాసు కుని, శనివారం మాత్రమే శత్రువులను వేటాడే సూర్య పాత్రలో నాని కనిపిస్తారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
బ్యాంకాక్‌లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌ని బ్యాంకాక్‌లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్‌లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
AP: డిఎస్సీ-2024 షెడ్యూల్లో మార్పులు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
శ్రీలంకలో సైంధవ్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ కొత్త షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ కీలక షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోంది. ‘‘వెంకటేష్ కెరీర్లో 75వ మైలురాయిగా ‘సైంధవ్’ రూపొందుతోంది. శ్రీలంక షెడ్యూల్లో భాగంగా ముఖ్యమైన టాకీ భాగంతో పాటు ఇంటె¯Œ ్స యాక్షన్ బ్లాక్, ఒక పాట కోసం కొన్ని మాంటేజ్‌లు చిత్రీకరిస్తున్నాం. వెంకటేష్‌తో పాటు ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాశ్.. ఇలా ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘సైంధవ్’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న విడుదల చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం(వెంకట్). -
ముంబై టు కూనూర్
గోవా టు కూనూర్ వయా ముంబై... ఇది నాని కొత్త సినిమా రూట్ మ్యాప్. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీ రోల్ చేస్తున్నారు. తొలుత గోవాలో ఓ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇటీవల ముంబైలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం కూనూర్ వెళ్లనున్నారు. ఇక్కడి లొకేషన్స్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్. -
హైదరాబాద్‌లో కోల్‌కతా! బోళా శంకర్ కొత్త షెడ్యూల్
హైదరాబాద్‌లో కోల్‌కతా ఏంటీ అనుకుంటున్నారా! చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్ వేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన కోల్‌కతా సెట్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ సెట్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బోళా శంకర్’. చిరంజీవిని స్టైలిష్, మాస్ క్యారెక్టర్లో అద్భుతంగా చూపిస్తున్నారు మోహర్ రమేశ్. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్, తమన్నా కథానాయికగా నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
రవితేజ 'ధమాకా' కొత్త షెడ్యూల్.. భారీ బడ్జెట్‌తో సెట్
Ravi Teja Dhamaka New Schedule Started With Action Scenes: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్ జోష్‌తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. ఫిబ్రవరి '11న ఖిలాడీ' సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించగా ఇటీవలే 'రావణాసుర' సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు రవితేజ. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' అనేది క్యాప్షన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. అయితే ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం (ఫిబ్రవరి 25) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ధమాకా సినిమా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో రవితేజతో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారథ్యంలో జరుగుతున్నాయి. వినోదాత్మకంగా ఉంటూనే మాస్ అంశాలు ఉన్న ఈ సినిమాలో కీలకమైన పోరాటమిది అని నిర్మాత తెలిపారు. అందుకే భారీ బడ్జెట్‌తో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. Mass Maharaja @RaviTeja_offl😎#Dhamaka Shoot going on at a rapid pace🔥 An high voltage action scene underway at a Massively Erected set choreographed by Ram-Laxman Masters👊@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @peoplemediafcy @AAArtsOfficial @vivekkuchibotla pic.twitter.com/EeRWPQsfJU — People Media Factory (@peoplemediafcy) February 25, 2022 -
ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం శనివారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్త షెడ్యూల్ మార్చి 31-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 ఏప్రిల్ 1-ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 3- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఏప్రిల్ 4- ఇంగ్లీష్ పేపర్-1 ఏప్రిల్ 6-ఇంగ్లీష్ పేపర్-2 ఏప్రిల్ 7-మ్యాథమేటిక్స్ పేపర్-1 ఏప్రిల్ 8-మ్యాథమేటిక్స్ పేపర్-2 ఏప్రిల్ 9-జనరల్ సైన్స్ పేపర్-1 ఏప్రిల్ 11-జనరల్ సైన్స్ పేపర్-2 ఏప్రిల్ 13-సోషల్ స్టడీస్ పేపర్-1 ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్ పేపర్-2 ఏప్రిల్ 16- ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 17-SSC ఒకేషనల్ కోర్స్ థియరీ -
ఆధునిక పద్ధతులతో నర్సరీల అభివృద్ధి
కడియం : ఎప్పటికప్పుడు సాగు విధానాల్లో చోటు చేసుకుంటున్న ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా నర్సరీలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని ఇండియ¯ŒS నర్సరీమె¯ŒS అసోసియేష¯ŒS (ఐఎ¯ŒSఏ) అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. పశ్చిమబెంగాల్ నర్సరీ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో హౌరాలోని పాల్ గార్డె¯ŒSలో నేషనల్ ఇ¯ŒSస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్స్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎ¯ŒSపీహెచ్‌యం) సహకారంతో రైతులకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన 300 మందికిపైగా రైతులకు మొక్కల సంరక్షణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మొక్కల సాగుకు పూర్తి స్థాయిలో శాస్త్రవేత్తల సహకారం అందే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఐఎ¯ŒSఏ, ఎ¯ŒSఐపీహెచ్‌ఎంల సంయుక్త ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎ¯ŒSఐపీహెచ్‌ఎం శాస్త్రవేత్తలు డాక్టర్ సుశీల, డాక్టర్ గిరీష్, డాక్టర్ నర్సారెడ్డి, పశ్చిమబెంగాల్ నర్సరీ మె¯ŒS అసోసియేష¯ŒS అధ్యక్షుడు కమల్ చక్రవర్తి, ఐఎ¯ŒSఏ ఉపాధ్యక్షుడు ప్రాణ్‌కుమార్‌దత్తా, కార్యదర్శి చిన్మయి సాహు, ఈసీ మెంబర్ తప¯ŒSజానా తదితరులు పాల్గొన్నారు. -
జగన్ సమీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నియోజకవర్గాల సమీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 24వ తేదీ ఉదయం 9 గంటలకు వినుకొండ, నరసరావుపేట, 12 గంటలకు సత్తెనపల్లి, పెదకూరపాడు, మధ్యాహ్నం 2 గంటలకు మాచర్ల, గురజాల నియోజకవర్గాలపై సమీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, మధ్యాహ్నం 12 గంటలకు పొన్నూరు, ప్రత్తిపాడు, మధ్యాహ్నం 2 గంటలకు తాడికొండ, మంగళగిరి, 5 గంటలకు తెనాలి, చిలకలూరిపేట, 7 గంటలకు రేపల్లె నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతుందని వెల్లడించారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు బాపట్ల, వేమూరు నియోజకవర్గాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈ మార్పులను పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
అంగన్వాడీలకు కొత్త షెడ్యూల్
రాయవరం, న్యూస్‌లైన్ : పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలు కూడా పక్కాగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు అంగన్వాడీ కేంద్రాలు ఎలా నిర్వహించాలో రూపొందించిన టైమ్‌టేబుల్ అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయాలకు చేరుకుంది. అందులో చిన్నారుల మానసిక వికాసానికి ఆటపాటలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 9 నుంచి 9.20 గంటల వరకు అంగన్వాడీ టీచర్, చిన్నారులు, చిన్నారుల మధ్య పరస్పర సంభాషణలు. 9.20గంటల నుంచి 9.40 వరకు ప్రార్థన అనంతరం స్నాక్స్ అందజేత. 10 నుంచి 10.30 వరకు మూడేళ్లు నిండిన చిన్నారులకు ఆటలు, నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు పాఠశాల కార్యక్రమాలకు సంసిద్దులను చేయడం. 10.30 నుంచి 10.50 వరకు కేంద్రం లోపల, బయట ఆటపాటలు. 10.50 నుంచి 11 గంటల వరకు చిన్నారులు ఆటలు ఆడాక చేతులు ఎలా శుభ్రపర్చుకోవాలో తెలియపర్చడం. ఉదయం 11 నుంచి 11.20 వరకు ఆటవస్తువులు, చార్టులు, పరికరాల ద్వారా చిన్నారులకు కథలు చెప్పడం. చిన్నారులు తమకు తాముగా సంఘటనలు చెప్పుకునేలా అలవాటు చేయడం. ఉదయం 11.20 నుంచి 11.30 వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వడం. ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు పుస్తకాలతో కూడిన కార్యకలాపాల నిర్వహణ. మధ్యాహ్నం 12 నుంచి 12.15 గంటల వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు అవకాశం, మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేయడం. 12.15 నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజనం. ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు చిన్నారులను నిద్రపుచ్చడం. మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 వరకు ఆటలతో కూడిన పాటలు నేర్పడం. 2.50 నుంచి 3 గంటల వరకు విద్యార్థులకు అల్పాహారం అందజేయడం. 3 నుంచి 3.30 వరకు చిన్నారులకు పాఠశాలకు అలవాటయ్యేలా బోధనా కార్యక్రమాలు నిర్వహించడం. 3.30 నుంచి 4 గంటల వరకు చిన్నారులను అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఆటలు ఆడించిన అనంతరం ఇళ్లకు పంపడం. ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఆరు గిరిజన ప్రాంతాలైన అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగిలలో ఉన్నాయి. మిగిలినవి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని, రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాలో 4,830 అంగన్వాడీ కేంద్రాలు, 270 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 2.57 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా, 2.39 లక్షల మంది వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. సక్రమంగా అమలయ్యేలా చూస్తా కొత్తగా వచ్చిన టైంటేబుల్ అమలు చేస్తే చిన్నారులకు ఎంతో మంచిది. దీన్ని సక్రమంగా, సమర్ధవంతంగా కార్యకర్తలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటాను. టైంటేబుల్ నిర్వహణపై త్వరలో డివిజన్, ప్రాజెక్టు స్థాయిలో వర్క్షాపులుంటాయి. - వై.సుశీలాకుమారి, పీవో, ఐసీడీఎస్, రాయవరం.