రెడీ... యాక్షన్‌  | Saripodhaa Sanivaaram Next Schedule Begins on March 18th in hyderabad | Sakshi
Sakshi News home page

రెడీ... యాక్షన్‌ 

Published Sun, Mar 17 2024 12:00 AM | Last Updated on Sun, Mar 17 2024 12:00 AM

Saripodhaa Sanivaaram Next Schedule Begins on March 18th in hyderabad - Sakshi

నాని

యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లనున్నారు హీరో నాని. ‘అంటే.. సుందరానికీ..’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు నాని అండ్‌ కో రెడీ అవుతున్నారు.

ఈ చిత్రంలో సూర్య పాత్రలో కనిపిస్తారు నాని. ఈ చిత్రంలో వారంలో మిగతా ఆరు రోజులు శాంతంగా ఉండి, ఆ రోజుల్లో జరిగే ఘటనలను పేపర్‌ మీద రాసు కుని, శనివారం మాత్రమే శత్రువులను వేటాడే సూర్య పాత్రలో నాని కనిపిస్తారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement