Saripodhaa Sanivaaram Movie
-
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'దేవర' రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు 'దేవర' చూడటం కుదరకపోతే ఓటీటీలో ఈ మూవీస్ చూసేయండి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ విషయానికొస్తే డీమోంటీ కాలనీ 2, ప్రతినిధి 2 అనే తెలుగు సినిమాలు ఉండగా ఉలాఝ్, లవ్ సితార అనే హిందీ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాదన్నట్లు ఇప్పటికే సరిపోదా శనివారం, స్త్రీ 2 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యాయనేది చూద్దాం.శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 27)నెట్ఫ్లిక్స్డూ యూ సీ వాట్ ఏ సీ - ఇండోనేసియన్ మూవీగ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 - కొరియన్ సిరీస్రెజ్ బాల్ - ఇంగ్లీష్ సినిమావిల్ & హార్పర్ - ఇంగ్లీష్ మూవీఉలాఝ్ - హిందీ సినిమాసరిపోదా శనివారం - తెలుగు మూవీహాట్స్టార్డాక్టర్ ఒడిస్సీ - ఇంగ్లీష్ సిరీస్గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్9-1-1 లోన్ స్టార్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్అయిలా & ద మిర్రర్స్ - స్పానిష్ సిరీస్తాజా ఖబర్ సీజన్ 2 - హిందీ సిరీస్జీ5డీమోంటీ కాలనీ 2 - తెలుగు సినిమాలవ్ సితార - హిందీ మూవీజియో సినిమాహానీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్ఔరోన్ మైన్ దమ్ థా - హిందీ సినిమాకొట్టుక్కళి - తమిళ మూవీఓటీ 2023 ద అవర్ - స్పానిష్ చిత్రంప్రీవియస్లీ సేవ్డ్ వెర్షన్ - జపనీస్ మూవీస్త్రీ 2 - హిందీ సినిమామనోరమభరతనాట్యం - మలయాళ మూవీఆహాప్రతినిధి 2 - తెలుగు సినిమాఆపిల్ ప్లస్ టీవీఊల్ఫ్స్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్) -
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్
ఈ వారం థియేటర్లలోకి 'దేవర' రాబోతున్నాడు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు 'హిట్లర్' సినిమా, తర్వాతి రోజు 'సత్యం సుందరం' అనే డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ బోలెడన్ని క్రేజీ మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్.. ఇక అది కష్టమే)ఓటీటీల్లో వచ్చే సినిమాల విషయానికొస్తే 'సరిపోదా శనివారం', 'స్త్రీ 2', 'డీమోంటీ కాలనీ 2', 'లవ్ సితార' కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలానే పలు ఇంగ్లీష్-హిందీ మూవీస్ కూడా పర్లేదనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 23-29 వరకు)నెట్ఫ్లిక్స్పెనెలోప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ సినిమా) - సెప్టెంబరు 26నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26సరిపోదా శనివారం (తెలుగు మూవీ) - సెప్టెంబరు 26గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 27రెజ్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27విల్ & హార్పర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 27అమెజాన్ ప్రైమ్స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 25స్త్రీ 2 (హిందీ మూవీ) - సెప్టెంబరు 27 (రూమర్ డేట్)హాట్స్టార్వాళా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 239-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 25గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27ఆహాబ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 25జీ5డీమోంటీ కాలనీ 2 (తెలుగు సినిమా) - సెప్టెంబరు 27లవ్ సితార (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 27ఆపిల్ ప్లస్ టీవీమిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 25జియో సినిమాహానీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్) -
నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్
అనుకున్నట్లుగానే జరిగింది. నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా 'పేకమేడలు')నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'సరిపోదా శనివారం'. వారంలో శనివారం మాత్రమే కోపాన్ని చూపించే వ్యక్తిగా నాని నటించాడు. కథ పరంగా ఓ మాదిరి కొత్తదనం ఉన్నప్పటికీ నాని-ఎస్జే సూర్య అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు.ఆగస్టు 29న థియేటర్లలోకి ఈ సినిమాకు వర్షాలు అడ్డంకిగా మారాయి. రిలీజైన రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో నెలలోపో అంటే సెప్టెంబరు 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)Ippati dhaaka @NameisNani rendu kaalle choosaru… moodo kannu choodataniki meeru ready ah?#SaripodhaaSanivaaram is coming to Netflix on 26th September in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi!#SaripodhaaSanivaaramOnNetflix pic.twitter.com/b0CrfvMb94— Netflix India South (@Netflix_INSouth) September 21, 2024 -
నాని 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ డేట్ లాక్?
నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
'సరిపోదా' అయిపోయింది.. కొత్తది మొదలుపెట్టిన నాని
'సరిపోదా శనివారం' సినిమాతో మొన్నీ మధ్యే హీరో నాని.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇది ఇంకా థియేటర్లలో ఉండగానే కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'హిట్ 3' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైపోయింది. నానిపై సన్నివేశాల్ని చిత్రీకరించారు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)విశ్వక్ సేన్, అడివి శేష్.. తొలి రెండు భాగాల్లో హీరోలుగా నటించారు. ఇక మూడో పార్ట్‌లో అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్‌గా నాని కనిపించబోతున్నాడు. రీసెంట్గా నాని పాత్ర ఎలా ఉంటుందో తెలియజెప్పేలా చిన్న వీడియో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత నాని.. తనతో 'దసరా' సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. ఇది ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉండబోతుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో అజిత్) -
ఈ కలెక్షన్స్ సరిపోవు ఇంకా పెంచాలి..
-
గేమ్ ఛేంజర్ గురించి ఎవరు ఊహించని అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
-
నాని సినిమా.. పిల్లలకు నో ఎంట్రీ!
హీరో నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్సే మెయిన్ టార్గెట్. కానీ మెల్లమెల్లగా పంథా మార్చుకుంటున్న నాని.. యాక్షన్ మూవీస్ చేస్తూ మిగతా ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నాడు. అలా ఇప్పుడు తన తర్వాత మూవీ గురించి హింట్ ఇచ్చేశాడు. వయలెన్స్ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలని థియేటర్లలోకి అనుమతించడం కుదరదని చెప్పాడు.(ఇదీ చదవండి: వరదలతో ఇబ్బందులు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)నాని చెప్పిన దానిబట్టి చూస్తే హిట్ 3 గురించే అయ్యింటుందని అనిపిస్తుంది. ఎందుకంటే 'హిట్' ఫ్రాంచైజీలో ఇదివరకే వచ్చిన రెండు సినిమాల్లో హీరో పోలీస్‌గా చేస్తే సైకో పాత్రలు విలన్. ఇందులోని మూడో భాగంగా సైకో పాత్ర ఎంత కృూరంగా ఉంటుందో.. నాని చేయబోయే అర్జున్ సర్కార్ పాత్ర అంతకు మించి అనేలా ఉంటుందట. దీని గురించే నాని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడా అనిపిస్తుంది.ఇది కాకుండా 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నడిచే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇదని తెలుస్తోంది. ఇందులో కూడా యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతుంది. దీనిబట్టి చూస్తుంటే ఇప్పటివరకు తనకు బలమైన ఫ్యామిలీ ఆడియెన్స్‌ని నాని ఏమైనా దూరం చేసుకుంటున్నాడా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?) -
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వీకెండ్లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పోస్టర్ ద్వారా పంచుుకంది. కాదా.. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.Bhaga Bhaga Bhaga..Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024 -
సరిపోదా శనివారం టీమ్‌కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
తెర వెనక 'సరిపోదా శనివారం'.. నాని-ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
సరిపోదా శనివారం బాక్సాఫీస్.. నాని మూవీకి ఊహించని కలెక్షన్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు. -
ఆ ఓటీటీకి సరిపోదా శనివారం.. భారీ ధరకు రైట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధరకు ఓటీటీ రైట్స్?అయితే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ గురించి చర్చ మొదలైంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ రైట్స్‌ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఓటీటీకి అప్పుడేనా??ఈ మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని క్రేజీ టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని సమాచారం. అదే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఎస్జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..?
‘అంటే సుందరానికి’తర్వాత నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సరిపోదా శనివారం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘సరిపోదా శనివారం కథేంటి?, నాని-వివేక్ ఆత్రేయ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. నాని, ఎస్జే సూర్య తమ నటనతో అదరగొట్టేశారని, వారి కోసమే ఈ సినిమా చూడాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రొటీన్ స్టోరీయే అయినా.. వివేక్ తెరపై డిఫరెంట్‌గా చూపించాడని అంటున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే ఫేలవంగా ఉందని, సెకండాఫ్ కాస్త సాగదీతగా ఉందని అంటున్నారు. చాలా మంది జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజీఎం అదరగొట్టేశాడని.. సినిమాకు అదే ప్లస్ అని కామెంట్ చేస్తున్నారు. Review : Screenplay🕵️♂️ VivekAthreya Not upto The Mark ..1st Half - SJ Surya & Nani Don't Miss it Theatre Interval 🥵🥵🥵 🔥🔥🔥🔥Potharu Motham Potharu2nd Half Bit booring bit lengthy & a Mass entertainment .BGM 🥵🔥🥵🔥🥵🔥 Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@_NaveenReddy_14) August 28, 2024 వివేక్ ఆత్రేయ స్క్రీన్‌ప్లే గొప్పగా ఏమీ లేదు. కానీ ఫస్టాఫ్ ఎస్జే సూర్య, నానిల యాక్టింగ్ అదుర్స్. వారి కోసమే సినిమా చూడాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. పోతారు.. మొత్తం పోతారు. ఇక సెకండాఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్. బీజీఎం అదిరిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.#SaripodhaaSanivaaram is a satisfactory action drama that had moments of excellence but at the same time had moments where the film was too dragged out and predictable. The introduction block, interval block, climax block, and few confrontation scenes between Nani and SJ Surya…— Venky Reviews (@venkyreviews) August 28, 2024 #SaripodhaaSanivaaram@JxBe yem taagi kottav bro ah BGM mad antey mad mind lo nundi povatle #SaripodhaasanivaaramMovie nundi bayata ochinapati nundi vintune unna movie hittuuuu 💯 @NameisNani Recent ga chusina movies lo satisfying ga unna movie ede @DVVMovies pic.twitter.com/TU2f5aZqaS— Subbu (@allam700423) August 28, 2024Interval To Climax okate RaMp 🔥🔥🔥🔥🔥🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🔥🔥🔥🔥Biggest Blockbuster on Cards 🎴 🎯💪Congratulations to the Natural Star @NameisNani gaaru 🙏🔥😍and @DVVMovies 🙏🤝🥳#SaripodhaaSanivaaram #Nanipic.twitter.com/88WtCAy6hQ— JACK 𝕏 (@JACK_2K02) August 29, 2024#SaripodhaaSanivaaram : “Block-Buster”👉Rating : 3.5/5 ⭐️ ⭐️Positives:👉 #Nani👉 #SjSurya Performance👉BGM👉ScreenplayNegatives:👉 Lengthy👉Bit Routine Story#SaripodhaSanivaaram— CRICKET & CINEMA (@CRICKETCINEMAA) August 29, 2024Hat trick kottesamu 🔥🔥🥁Dasara 🥇hi Nanna 🥈Saripodhaasanivaaram🥉❤️ @NameisNani Anna nee story selection ki 🫡😍🔥🔥🔥 @iam_SJSuryah @priyankaamohan @SVR4446 @DVVMovies 💐💐#SaripodhaaSanivaaram #Nani pic.twitter.com/2iloeFm1H9— KADAPA SREENU (@SREENU_24) August 29, 2024#SaripodhaaSanivaaram First Half:- One of the most unique intros in TFI that only #Nani can pull off ❤️- Followed by an engaging screenplay with good moments and fun elements 👌- Then comes the interval – Potharu Mottham Potharu 🥵❤️🔥- #JakesBejoy on steroids 🥵🔥Yes, it… pic.twitter.com/6FWRllhusO— Movies4u Official (@Movies4u_Officl) August 28, 2024#SaripodhaaSanivaaramReview:Positives:- Vivek Athreya's writing with well-placed moments 💥- Jakes Bejoy's BGM 🔥- Interval 💥🔥- SJ Suryah's kickass acting 🙌- Nani's natural performance 💥- Characterizations 👌- A few repetitive setup scenes in the first half. pic.twitter.com/xGwG5YEOwi— Vikram_90 (@CiritSanthosh) August 29, 2024 -
అప్పుడు రాజమౌళి ఒక్కరికే పని ఉంటుంది – నాని
‘‘నా సినిమా రిలీజైన వెంటనే బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ అని చెబుతుంటారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ టాక్ కనిపిస్తుంది. కానీ వీటిని నేను సక్సెస్‌గా భావించను. నా సినిమాలో భాగస్వామ్యులైన అందరూ సంతోషంగా ఉండాలి. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా సినిమా సక్సెస్ ఇవ్వాలి. అప్పుడు నేను సక్సెస్ అని భావిస్తాను. చెప్పాలంటే.. మన నిజమైన సక్సెస్ మనకు మాత్రమే తెలుస్తుంది’’ అని నాని అన్నారు. ‘అంటే.. సుందరానికీ!’ తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నాని చెప్పిన సంగతులు.» ఓ సినిమా కథ నన్ను ఎగ్జైట్ చేసి, నాకో చాలెంజ్ విసిరి, ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుందని నాకనిపిస్తే ఆ స్క్రిప్ట్‌కు ఓకే చెబుతాను. ప్రతి సినిమాకు కొత్తదనాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ ‘సరిపోదా శనివారం’ చేశాను. ఇందులో నేను ఎల్ఐసీ ఏజెంట్ సూర్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో యాక్షన్ ఇరవై శాతమే ఉంటుంది. కానీ యాక్షన్ మోడ్‌తో కథ ముందుకెళ్తుంటుంది. ఈ సినిమాలోని దయా పాత్రను ఎస్జే సూర్యగారే చేయగలరు. ఈ క్యారెక్టర్‌తో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గర కావాలని ఆయన ఏడు రోజులు తెలుగులోనే డబ్బింగ్ చెప్పారు. కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక నటన అలరిస్తుంది. అలాగే ఈ సినిమాలో అదితీ బాలన్ నాకు సిస్టర్‌గా నటించారు. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక సోకులపాలెంతో సూర్య, దయాల కనెక్షన్ ఏంటో సినిమాలో చూడండి. » ‘అంటే.. సుందరానికీ!’ సినిమా పేరు విన్నన్నసార్లు నా హిట్ సినిమాల పేర్లు కూడా వినలేదు. మనం ఓసారి చరిత్రను గమనిస్తే మంచి సినిమాలన్నీ ఆడాయి.. చెడ్డ సినిమాలన్నీ ఆడలేదు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. మనం ఓ చెడ్డ సినిమా చేసి సక్సెస్ కాలేకపోయామంటే ఈసారి సక్సెస్ చేసి హిట్ సాధించాలని అనుకుంటాం. మేం గతంలో మంచి సినిమానే (‘అంటే.. సుందరానికీ!’ని ఉద్దేశించి) చేశాం. మళ్లీ మంచి సినిమా చేశాం. కాకపోతే ‘అంటే.. సుందరానికీ!’ ఓ జానర్ వాళ్లకు మాత్రమే నచ్చింది. ఆ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. ‘సరిపోదా శనివారం’ది కూడా దాదాపు మూడు గంటల నిడివి. కానీ ఈ సినిమా కథ, జానర్ వేరు. » ఓ హీరోకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ నో చాన్స్ అనే లాజిక్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా అనుకుంటే ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ, ఏ హీరోకీ సినిమాలు ఉండకూడదు. మన ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు ఫ్లాప్స్ ఉన్నాయి. ఈ లాజిక్ అప్లై అయితే ఇండస్ట్రీలో ఎవరికీ పని ఉండకూడదు... ఒక్క రాజమౌళికి తప్ప. నిజం చెప్పాలంటే వరుస సక్సెస్‌లు వచ్చినప్పుడు కాస్త ఉదాసీనంగా ఉంటారు. అప్పుడప్పుడూ వైఫల్యాలు చూసినవాడే మరింత కష్టపడతాడు. ఈ సినిమాలో వివేక్ మంచి రేసీ స్క్రీన్‌ప్లే రెడీ చేశాడు... సినిమా పరిగెడుతుంటుంది. నా ప్రతి సినిమా నిర్మాత బాగుండాలని కోరుకుంటాను. అందుకే దానయ్యగారు నా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లోపాజిటివ్గా మాట్లాడారు. » కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదనే చర్చలు జరుగుతున్నాయి. చెప్పాలంటే... కోవిడ్‌కు ముందు వెయ్యి కోట్ల రూ΄ాయల కలెక్షన్స్ సాధించిన సినిమా ఒకటే ఉంది. కోవిడ్ తర్వాత మూడు సినిమాలు ఉన్నాయి. అయితే గతంలో పది సినిమాలు వస్తే ఐదారు సినిమాలు ఆడియన్స్‌కు ఫర్వాలేదనిపించేవి. కానీ ఇప్పుడు పదిలో ఒకట్రెండు సినిమాలే ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. మంచి కథలతో వస్తే... ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు. » లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్స్ అంటే సినిమాల పరంగా చాలానే ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా మాత్రం నా కొడుకు అర్జున్ పుట్టిన క్షణం నా ఫేవరెట్ మెమొరబుల్ మూమెంట్. -
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. అంతే కాకుండా అలాగే కోల్‌కతా వైద్యవిద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన తనను కలిచివేసిందన్నారు.నాని మాట్లాడుతూ..' ఢిల్లీ నిర్భయ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలు నిరంతరం కలవరపెడుతున్నాయి. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. మొబైల్‌ను స్క్రోలింగ్ చేయాలంటే భయంగా ఉంది. సోషల్ మీడియాలో ఎలాంటి వార్త చూడాల్సి వస్తుందో అన్న భయమేస్తోంది. హేమకమిటీ నివేదిక చూసి నేను షాకయ్యా. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నామో అర్థమవుతోంది. తన సెట్స్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పటి పరిస్థితులు తలచుకుంటేనే చాలా దారుణంగా ఉందనిపిస్తోంది' అని అన్నారు. కాగా..నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
నాని ఈ సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు..
-
'పోతారు.. మొత్తం పోతారు..' హీరో నాని ఆసక్తికర కామెంట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరోసారి వీరిద్దరు జతకట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాని మాట్లాడుతూ.. 'కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమానే సరిపోదా శనివారం. ఇది చాలా నమ్మకంగా చెబుతున్నా. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని చాలామంది అంటున్నారు. కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు. వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడూ మిస్ అవ్వరు. మనమే అప్పుడప్పుడు మిస్సవుతుంటాం. పోతారు.. మొత్తం పోతారు.. ఆగస్టు 29 అందరూ థియేటర్లకే పోతారు. వివేక్ ఆత్రేయ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. -
ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు: హీరో నాని
‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్‌కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్‌కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్‌లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు. ‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
హీరో నాని 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాని సినిమా 'సరిపోదా శనివారం' రన్‌టైమ్ ఇదే
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగష్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే, తాజాగా ‘సరిపోదా శనివారం’ సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా సెన్సార్ వచ్చేసిందని ఒక వీడియో ద్వారా నాని, ఎస్జే సూర్య,ప్రియాంక మోహన్ కాస్త డిఫరెంట్‌గా తెలిపారు. సెన్సార్ బోర్డ్ U/A సర్టీఫికెట్ ఇచ్చిందని వారు చెప్పారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లు నాని ప్రకటించారు. అయితే, వెంటనే తెరపైకి ఎస్జే సూర్య ఎంట్రీ వచ్చి ప్లస్ 15 మినిట్స్ అంటాడు. దీంతో సినిమా మొత్తం 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు ప్రకటించారు. అంటే సుందరానికి.. కూడా ఇదే రన్ టైం కదా అంటూ ఎస్జే సూర్య గుర్తు చేసే ప్రయత్నం చేస్తుండగా.. అంటే కాదు ‘సరిపోదా శనివారం’ యాక్షన్ ఫిల్మ్ అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వెంటనే ప్రియాంక ఎంట్రీ ఇచ్చి లవ్‌స్టోరీ కూడా అంటూ కామెంట్ చేస్తుంది. ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్ ఆత్రేయ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.🥶#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/lsfX1uQevb— Nani (@NameisNani) August 23, 2024 -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని
టాలీవుడ్ హీరో నాని.. కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇతడి కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్న నాని కుటుంబం.. అలిపిరి మెట్ల మార్గాన తిరుమల చేరుకున్నారు. కొండపైన రాత్రి బస చేసి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు రాగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
చిరంజీవి గారితో నన్ను పోల్చడం.. కల్కి 2 లో నాని..?
-
గేమ్ ఛేంజర్ సెట్లో ఈ సినిమా గురించే చర్చ: దిల్ రాజు కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జే సూర్య గురించి ప్రస్తావించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గేమ్ ఛేంజర్ షూటింగ్లో ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. గ్యాప్ వచ్చినప్పుడల్లా నానికి, ఎస్జే సూర్య మధ్య సీన్స్ గురించి చెప్పేవారు. నానికి కూడా విలన్‌గా ఎస్జే సూర్య దొరకడం చూస్తుంటే ఫుల్ మజా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తున్నందుకు ఎస్జే సూర్యకు థ్యాంక్స్. సరిపోదా శనివారం చిత్రంలో నాని, ఎస్జే సూర్య, ట్రైలర్ చాలు. ఈ మూవీ దసరాను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.' అని అన్నారు. "Aug 29th na #Nani garu malli #Dasara records anni badhalu kodtaru ani korukuntunna"💥Producer #DilRaju garu at the #SaripodhaaSanivaaram Press Meet ❤️🔥 #NaturalStarNani #SJSuryah #YouWeMedia pic.twitter.com/YsmDl6nxtL— YouWe Media (@MediaYouwe) August 21, 2024 -
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..
ఆగస్టు 15 లాంటి లాంగ్ వీకెండ్‌ని తెలుగు సినిమా సరిగా ఉపయోగించుకోలేకపోయింది. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలు ఫెయిలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన 'ఆయ్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ షోలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ఎప్పటిలానే ఓ మాదిరి వసూళ్లతో సర్దుకోవాల్సి వస్తుంది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)సంక్రాంతికి 'హనుమాన్'.. మార్చిలో 'టిల్లు'.. జూన్‌లో 'కల్కి' తప్పితే టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా ఉంది. చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ గట్టిగా నిలబడలేకపోతున్నాయి. కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ థియేటర్లకి ఇవి జనాల్ని తీసుకురాలేకపోతున్నాయి. దీంతో నెక్స్ట్ పెద్ద మూవీ ఏంటా అని చూస్తే నాని 'సరిపోదా శనివారం' కాస్త గట్టిగా కనిపిస్తోంది.యాక్షన్ ప్లస్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమా ఆగస్టు 29న రానుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉంది. దీంతో టాలీవుడ్ ప్రస్తుతం దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది హిట్ కావడం నానితో పాటు ఇండస్ట్రీకి కూడా ముఖ్యమే. ఆపై నెలల్లో 'దేవర', 'పుష్ప', 'గేమ్ ఛేంజర్' తదితర సినిమాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ..ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోలు) -
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
'నాకు కోపం వచ్చిందంటే.. ఇది నా సమస్య'.. 'సరిపోదా శనివారం' ట్రైలర్ వచ్చేసింది!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు చేయని పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే నాని యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఎస్జే సూర్య పోలీస్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. -
'సరిపోదా శనివారం ట్రైలర్ ఈవెంట్' .. స్పెషల్ అట్రాక్షన్‌గా 70 ఏళ్ల బామ్మ!
హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు కనిపించని పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 70 ఏళ్ల భామ తన అభిమాన హీరో నాని చూసేందుకు వచ్చింది. ఆమెను గమనించిన హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ బామ్మను హీరో నాని పలకరించాడు. ఈ ఈవెంట్లో మీరు ఎంతో స్పెషల్ అని ఆయన అన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. 70 years old lady cheers got #Nani at #SaripodhaaSanivaaram Grand Trailer Launch Event💥 #NaturalStarNani #SaripodhaaSanivaaramTrailer pic.twitter.com/jouQRl0L1L— YouWe Media (@MediaYouwe) August 13, 2024 -
సరితూగే సమరమే...
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్జే సూర్య, సాయికుమార్ లీడ్ రోల్స్‌లో నటించారు.శనివారం (జూలై 20) ఎస్జే సూర్య బర్త్ డే సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ‘సరితూగే సమరమే... సంహారం తథ్యమే’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు నాని. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. -
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్‌గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?) -
మనకే మనమే ఎవరో..!
‘అరె ఏమైయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాళే... అలవాటే లేని ఏవో ఆనందాలే..’ అంటూ మొదలవుతుంది ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట. నాని, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ సినిమాలోని ‘ఉల్లాసం’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఉల్లాసం ఉరికే ఎదలో... ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో... ఉప్పుంగే ఊహల జడిలో... మనకే మనమే ఎవరో...’ అంటూ సాగే ‘ఉల్లాసం’ పాటను సినరే రాయగా, సంజిత్ హెగ్డే–ముత్యాల కృష్ణ లాస్య పాడారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హింసకు బీమా!
సూర్య కోపంగా ఉంటే ఎలా ఉంటాడో చూశాం. కానీ కూల్‌గా ఉంటే ఇలా ఉంటారంటూ చూపిస్తున్నారు ‘సరిపోదా శనివారం’ సినిమా మేకర్స్. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో నాని పాత్ర పేరు సూర్య. గురువారం ఈ సినిమా నుంచి సూర్య సెకండ్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘సండే టు ఫ్రైడే.. వయొలెన్స్‌కి ఇన్సూరెన్స్ (హింసకు బీమా) సూర్య’ అంటూ తన సెకండ్ లుక్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని.అంటే... మిగతా రోజుల్లో కూల్‌గా ఉండే సూర్య శనివారం శత్రువుల భరతం పడతాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానున్న ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి. మురళి. -
గరం గరం యముడయో...
అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్ సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తొలి పాటలోనే 'గరం గరం' అంటూ నాని రచ్చ
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గరం గరం' అంటూ సాగే ఈ పాట నాని అభిమానుల్లో జోష్‌ను నింపుతుంది. హై బడ్జెట్‌తో యూనిక్ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ అందించారు. -
క్లైమాక్స్‌లో సరిపోదా
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్ పవర్–ప్యాక్డ్ క్యారెక్టర్లో నాని కనిపించనున్నారు. హై బడ్జెట్‌తో యూనిక్ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన సెట్‌ను నిర్మించాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
వేడుకలో...
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయిక. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయికుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫొటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ‘‘హై బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్
గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్‌ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించింది. అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్‌తో శివకార్తికేయన్‌తో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్‌కు స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్‌కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం. మరొకటి డాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత తెలుగులో పవన్‌కల్యాణ్‌తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్ రూమ్‌లో ఫొటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి గ్లామర్ పాత్రలకు గ్నీన్ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్ అవుతోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
రెడీ... యాక్షన్
యాక్షన్ మోడ్‌లోకి వెళ్లనున్నారు హీరో నాని. ‘అంటే.. సుందరానికీ..’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు నాని అండ్ కో రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో కనిపిస్తారు నాని. ఈ చిత్రంలో వారంలో మిగతా ఆరు రోజులు శాంతంగా ఉండి, ఆ రోజుల్లో జరిగే ఘటనలను పేపర్ మీద రాసు కుని, శనివారం మాత్రమే శత్రువులను వేటాడే సూర్య పాత్రలో నాని కనిపిస్తారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్. -
అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!
హీరోయిన్ ప్రియాంక మోహన్.. అభిమాని అడిగిన వింత ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇన్ స్టాలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు 'ఆస్క్ ఎనీ థింగ్' పేరు ఫన్ సెషన్ లాంటిది పెడుతుంటారు. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు. తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) నాని' గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత 'శ్రీకారం' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు 'ఓజీ', 'సరిపోదా శనివారం' లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. 'ఆస్క్ ఎనీథింగ్' అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. 'మీ గోళ్లు చూపించండి మేడమ్' అని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 'వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో' అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
శనివారమే 'నాని' వేట!
‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్‌జె సూర్య చెప్పే డైలాగ్స్‌తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు. -
నాని 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్ అలాంటి సినిమా చేసిందా..?
కథానాయికలు ఒక స్థాయికి చేరే వరకు పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి కష్టాలు వారికి ఉంటాయి. ఆ తర్వాత వారేంటో చూపిస్తారు. నటి ప్రియాంకా అరుళ్ మోహనన్ కూడా ఇందుకు అతీతం కాదన్నది ఇటీవలే తెలిసింది. ఈ కన్నడ బ్యూటీ చదివింది ఇంజినీరింగ్. అయితే ఎంచుకున్న వృత్తి మాత్రం నటన. మొదట్లో మోడలింగ్ చేసిన ఆ తర్వాత మాతృభాషలో కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. కన్నడ చిత్రంలో నటించిన వెంటనే తెలుగు చిత్రంలో లభించే అవకాశం వరించింది అలా విక్రమ్‌కుమార్ నానీకి జంటగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక తన నటనతో అందరి దృష్టిలో పడ్డారు. అలాంటి సమయంలో డాక్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే హీరోతో జతకట్టి డాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ప్రియాంకమోహన్‌కు స్టార్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. వరుసగా సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్ (ET), ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ నటించి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో శృంగారభరితంగా నటించారా..? ఈ బ్యూటీకి అందాలారబోతలకే దూరం అనే పేరు ఉంది. తాజాగా తెలుగులోనూ నానితో సరిపోదా శనివారం చిత్రం చేస్తుంది. ప్రియాంక తమిళంలో నటించిన తొలి చిత్రం డాక్టర్ అనేది ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే ఆమె 'టిక్ టాక్' అనే చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో ప్రియాంకమోహన్ బెడ్ రూమ్ సన్నివేశాలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. కారణం అందులో ఈ అమ్మడు శృంగారభరితంగా నటించడమే. దీంతో కెరీర్ ఆరంభంలో ఇదంతా సహజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపిస్తున్నారు. సీన్స్ కట్.. పోలీసులకు నిర్మాత ఫిర్యాదు 'టిక్ టాక్' సినిమా నుంచి ప్రియాంక మోహన్ సీన్స్ తొలగించడంతో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక మోహన్ 2017లో 'టిక్ టాక్' అనే తమిళ సినిమాకు సంతకం చేసినట్లు చెబుతున్నారు. నటి ప్రియాంక మోహన్‌తో మూడున్నర కోట్ల రూపాయలతో ‘టిక్‌టాక్’ సినిమా తీశానని, ఆ తర్వాతే ఆమె ఇతర సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 2023లో డిఎస్ఆర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని చూసి నిర్మాత షాక్ అయ్యాడు. సినిమాలోని ప్రియాంక మోహన్‌కి సంబంధించిన ముఖ్యమైన 20 నిమిషాల సన్నివేశాలను నిర్మాతకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా తొలగించారు, దీంతో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో నిర్మాతకు మూడున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, సినిమా పరాజయానికి DSR ఫిలింస్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్మాతకు నష్టం కలిగించిన డీఎస్ఆర్ ఫిల్మ్, మాస్టరింగ్ ఇంజనీర్ దినేష్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను నిర్మాత కోరారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల.. టైటిల్ సీక్రెట్ ఇదే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో నాని యాంగ్రీమెన్లా కనిపిస్తున్నాడు. ఎస్ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు. వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు. -
నేడు ఈ టాప్ హీరో పుట్టినరోజు.. ఎవరో గుర్తుపట్టారా?
రేడియో జాకీగా తన కెరియర్ను మొదలు పెట్టిన నాని నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. అపజయాలు వచ్చినా మళ్లీ ఎలా నిలుదొక్కుకోవాలో తెలిసిన హీరో నాని మాత్రమే అని చెప్పవచ్చు. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు.. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు జరుపుకోనున్నారు. నానికి అక్క కూడా ఉన్నారు. పై ఫోటోలో ఉండేది ఆమెనే..పేరు దీప్తి. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తొలినాళ్లలో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైంన ఆయన నట ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. రీసెంట్గా దసరా,హాయ్ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో రానున్నాడు. సినిమాల్లో 'నేచులర్ స్టార్'గా ఎదిగిన నాని కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. తన అక్క దీప్తి అంటూ ఆయనకు ఎంతో ప్రేమ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే తన కుమారుడితో పాటు సతీమణి అంజనాకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పాడు. జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని, బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో నాని తెలిపాడు. తాను తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఇతర చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని నేడు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే సినిమాలు తీసే స్థాయికి నాని చేరుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా శుభాకాంక్షలు తెలపండి. -
హైదరాబాద్‌లో సరిపోదా...
‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్–΄్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తారు. హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. పాన్ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
శివకార్తికేయన్ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా?
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. 2019లో ఒందు కథై హేల అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి ఈమె. ఆ వెంటనే టాలీవుడ్లో నాని 'గ్యాంగ్ లీడర్' ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పాగా వేసింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్ చిత్రంలో నటించి దాంతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఏకంగా సూర్యతో రొమానన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రియాంక మోహన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ఆ వెంటనే మరోసారి శివకార్తికేయన్‌తో డాన్ చిత్రంలో జతకట్టే అవకాశం వరించింది. లక్కీగా ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలా లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ అమ్మడికి మరోసారి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా నానితో 'సరిపోదా శనివారం' అనే చిత్రం ద్వారా రెండో సారి జతకట్టనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తుండటంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా నటుడు శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఆయనతో తాను రెండు చిత్రాలు చేసినట్లు చెప్పింది. శివ కార్తికేయన్‌కు ఒక ఎడిక్ట్ ఉందని, ఆయన స్వీట్స్ ఎక్కువగా తింటారని చెప్పింది. షూటింగ్ స్పాట్లో కూడా స్వీట్స్ తింటూ పక్కనున్న వారికి కూడా ఇస్తారని చెప్పింది. అలా ఆయన తనను కూడా స్వీట్స్ తినమని ఒత్తిడి చేసే వారని చెప్పింది. అలా ఒక హీరో అయ్యుండి కూడా బరువు పెరుగుతాననే భయం కూడా శివకార్తికేయన్‌కు ఉండదని నటి ప్రియాంకా మోహన్ పేర్కొంది. అలా పరోక్షంగా తను ఎందుకు బొద్దుగా అయిందో ఇలా చెప్పకనే చెప్పిందా బ్యూటీ.. కాగా దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తరచూ తన గ్లామరస్ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ట్రెండింగ్ అవుతోంది. -
వారాలను వాడేస్తున్న డైరెక్టర్స్.. టాలీవుడ్లో ఈ టైటిలే ట్రెండింగ్!
ఒకప్పుడు సినిమా టైటిల్ చూడగానే దాని కథ ఏంటి? ఏ జానర్ ఫిల్మ్? అనేది ఈజీగా తెలిసిపోయేది. కానీ ఇప్పటి సినిమాలకు మాత్రం విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. కొన్ని టైటిల్స్‌కి కథతో సంబంధం ఉంటే.. మరికొన్నింటికి మాత్రం మీనింగే ఉండడం లేదు. కొత్తగా, ట్రెడింగ్లో ఉన్న పదం కనిపిస్తే చాలు అదే సినిమా టైటిల్ అవుతుంది. ఇక టాలీవుడ్లో అయితే ఇటీవల వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా వాడేస్తున్నారు దర్శకులు. ఆదివారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. ‘శనివారం’వాడేసిన నాని ‘అంటే సుందరానికీ.. ’తర్వాత నాని, వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా సోమవారం టైటిల్‌ని ప్రకటిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ‘యాక్షన్ మాస్ ఎంటర్టైనర్’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మంగళవారం’కోసం పాయల్ ఎదురుచూపులు ‘మంగళవారం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక ఊర్లో ప్రతి మంగళవారం జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రెండేళ్ల క్రితమే ‘గురువారం’ వాడేసిన శ్రీసింహా రెండేళ్ల క్రితమే గురువారాన్ని తన టైటిల్‌గా వాడేశాడు కీరవాణి కొడుకు శ్రీసింహా. ఆయన హీరోగా మణికాంత్ గెల్ల దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. కానీ ఆ కామెడినీ ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఆడవాళ్ల కోసం ఆదివారం ఇక ఆదివారాన్ని సైతం తమ సినిమా టైటిల్‌గా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకుడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’అనే చిత్రం 2007లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇవే కాదు.. సోమ, బుధ, శుక్రవారం పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి. ఏ వెన్నెస్ డే(బుధవారం) పేరుతో నసీరుద్దీన్ షా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఈనాడు’తో కమల్ సినిమా వచ్చింది. శుక్రవారం, సోమవారం పేరుతో కూడా గతంలోనే సినిమాలు వచ్చాయి. మొత్తానికి మన దర్శక నిర్మాతలు అన్ని వారాలను వాడేశారు...ఇక మిగిలింది నెలల పేర్లే.. రానున్న రోజుల్లో జనవరి.. ఫిబ్రవరి.. అంటూ నెలల పేర్లు కూడా టైటిల్స్‌గా వస్తాయేమో చూడాలి.