నేడు ఈ టాప్‌ హీరో పుట్టినరోజు.. ఎవరో గుర్తుపట్టారా? | Natural Star Nani Birthday Special | Sakshi
Sakshi News home page

వంద కోట్ల స్టార్‌ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?

Published Sat, Feb 24 2024 10:04 AM | Last Updated on Sat, Feb 24 2024 12:17 PM

Natural Star Nani Birthday Special - Sakshi

రేడియో జాకీగా తన కెరియర్‌ను మొదలు పెట్టిన నాని నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. అపజయాలు వచ్చినా మళ్లీ ఎలా నిలుదొక్కుకోవాలో తెలిసిన హీరో నాని మాత్రమే అని చెప్పవచ్చు. నాని పూర్తి పేరు ఘంటా నవీన్‌ బాబు.. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు జరుపుకోనున్నారు. నానికి అక్క కూడా ఉన్నారు. పై ఫోటోలో ఉండేది ఆమెనే..పేరు దీప్తి. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

తొలినాళ్లలో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైంన ఆయన నట ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. రీసెంట్‌గా దసరా,హాయ్‌ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో రానున్నాడు.

సినిమాల్లో 'నేచులర్‌ స్టార్‌'గా ఎదిగిన నాని కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. తన అక్క దీప్తి అంటూ ఆయనకు ఎంతో ప్రేమ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. షూటింగ్‌ నుంచి ఇంటికి రాగానే తన కుమారుడితో పాటు సతీమణి అంజనాకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పాడు.

జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని, బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో నాని తెలిపాడు. తాను తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఇతర చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. కెరీర్‌ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని నేడు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టే సినిమాలు తీసే స్థాయికి నాని చేరుకున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా శుభాకాంక్షలు తెలపండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement