breaking news
Nani
-
మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)
-
ప్రముఖ ఆలయంలో ది ప్యారడైజ్ హీరో నాని పూజలు
నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.165 కోట్ల మార్క్ దాటేసింది.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో నాని తెలంగాణలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. తన ప్యారడైజ్ టీమ్‌తో కలిసి ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క, సారలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.our SHER @NameisNani anna & team visited Sri Sammakka Saralamma Devasthanam in Medaram and sought the blessings of the revered deities. ✨#TheParadise Running Successfully All Over. pic.twitter.com/V948N9rfdd— THE PARADISE (@TheParadiseOffl) September 29, 20269, 2026 -
‘ది ప్యారడైజ్’కి పోటీగా 6 సినిమాలు.. ఇదీ టాలీవుడ్ పరిస్థితి!
‘ఒకటి పోతే మరొకటి’ అన్నట్టుగా టాలీవుడ్లో ఒక వారం మారగానే కొత్త సినిమాల సందడి మొదలవుతోంది. ఒక వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. మరో వారం చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకుల తీర్పే అంతిమం. గత వారం ‘ది ప్యారడైజ్’ హవాతో థియేటర్లు కళకళలాడగా.. ఈ వారం(అక్టోబర్ 2) మాత్రం ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఎవరి సినిమా ఎంతవరకు నిలబడుతుందనే ఆసక్తి నెలకొంది.గతవారం అంతా టాలీవుడ్లో ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరిగింది. ప్రీమియర్ షోలతో మొదలైన హంగామా ఆదివారం వరకు కొనసాగింది. సినిమా టాక్, కలెక్షన్లు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. ఇలా ట్రేడ్ వర్గాల్లో లెక్కలు జోరుగా సాగాయి. ‘లెక్కలు తేలితే గానీ అసలు సంగతి తెలియదు’ అన్నట్టుగా ఈ సినిమా విషయంలోనూ వసూళ్లపై చర్చ కొనసాగుతూనే ఉంది.(చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)అయితే ఇప్పుడు కొత్త వారం వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ బరిలోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఈ వారం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’, ‘తెల్లకాగితం’, ‘అనకాపల్లి’, ‘ప్రేమ అనే ఊరిలో’ వంటి తెలుగు సినిమాలతో పాటు ‘డొరోతి’ అనే డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఫహాద్ ఫాజిల్ సినిమాపైనే అందరి చూపుఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కానుండటంతో మూవీపై మరింత బజ్ వచ్చే అవకాశం ఉంది. ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు సినిమా కాన్సెప్ట్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.విజయ్ తనయుడి ‘సిగ్మా’పై ఆసక్తిమరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’**పై కూడా ప్రేక్షకుల దృష్టి ఉంది. దర్శకుడిగా సంజయ్ తొలి అడుగు కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. కొత్త దర్శకుడి ఆలోచన ఎలా ఉండబోతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే చర్చ కూడా జరుగుతోంది.‘తెల్లకాగితం’కు పాజిటివ్ బజ్ఈ వారం వస్తున్న మరో సినిమా ‘తెల్లకాగితం’. విడుదలకు ముందే ఈ సినిమాను పలువురు దర్శకులకు చూపించి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌పై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.కంటెంట్ వర్కవుట్ అయితే చిన్న సినిమా కూడా పెద్ద ప్రభావం చూపించగలదనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అందుకే ‘తెల్లకాగితం’పై కూడా ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే మరోసారి ‘కోర్ట్’ తరహా కంటెంట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది.‘డొరోతి’పై వివాదాల ప్రభావం?ఇక ఈ జాబితాలో డబ్బింగ్ సినిమా ‘డొరోతి’ కూడా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తమిళంలో ఇప్పటికే వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చ తెలుగు వెర్షన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.‘పారడైజ్’ రెండో వారం కీలకంకొత్త సినిమాల సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో ఉన్న ‘ది ప్యారడైజ్’కు ఈ వారం చాలా కీలకం. మొదటి వారం హడావుడి పూర్తయిన తర్వాత రెండో వారంలో సినిమా ఎంత నిలబడుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.సోమవారం కూడా సినిమాకు నిలకడైన వసూళ్లు కనిపించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకుని ‘పారడైజ్’ ఎంత వసూళ్లు సాధిస్తుందనేది కీలకంగా మారింది. -
ప్యారడైజ్ ఎఫెక్ట్.. రణబాలి టీమ్ కీలక నిర్ణయం
-
‘ది ప్యారడైజ్’లో బాబు మోహన్ సీన్లు లేపేశారా..?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. సంపూర్ణేష్ బిర్యాని పాత్ర, అలాగే కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమాలో బాబు మోహన్ కూడా నటించారనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించానని టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ఈ వార్తకు కాస్త బలం చేకూరుతోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.బాబు మోహన్ రోల్?‘నాని సినిమా ది ప్యారడైజ్‌లో నటిస్తున్నాను. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది. నేను మొదటిసారి ఈ సినిమా కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నాను. ఐదు రకాల గెటప్స్‌లో అనుకున్నారు.. కానీ ఫస్ట్ గెటప్ చూసి డైరెక్టర్ ఒకే అనేశారు. ఏ గెటప్ వేసినా నా మొఖానికి సూట్ అవుతుంది. ఈ సినిమా అంటూ బాబు మోహన్ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఇప్పుడీ వైరల్ కావడంతో బాబు మోహన్‌కు సంబంధించిన సన్నివేశాలను తొలగించారా? లేక ఆయన నటించలేదా? అని నెటిజన్లలో సందిగ్ధత నెలకొంది. అయితే దీనిపై చిత్రబృందం గానీ.. అటు బాబు మోహన్గానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ఇదీ చదవండి: సెహ్వాగ్‌కు కొత్త తలనొప్పి..! దుస్తులు చింపి.. ఆపై.. -
ది ప్యారడైజ్‌పై ట్రోల్స్ ఇక చాలు: నాని ఎమోషనల్ పోస్ట్
-
నాని ది ప్యారడైజ్. కలెక్షన్స్‌లో అదే హవా..!
నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్లు పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.ఆడియన్స్ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ది ప్యారడైజ్ మూవీ కలెక్షన్లపరంగా రాణిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిత్రాన్ని సవారీ అనే జాతి మనుషులు గుర్తింపు కోసం చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతంలో ఉండే వారి జీవితాల ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో కేసీఆర్‌లా ప్రియదర్శి నటించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా ఆకట్టుకుంది. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషించారు. A blockbuster first weekend for #TheParadise ❤🔥❤🔥Collects 155 CRORES+ GROSS WORLDWIDE in 4 days 💥💥Book your tickets now!🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/4mxStTXGVW— THE PARADISE (@TheParadiseOffl) September 28, 2026 -
‘మగధీర’కి లేని లాజిక్ ప్యారడైజ్‌కు ఎందుకు..?: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కథ, పాత్రలు, కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో కుక్క దేవుడికి దండం పెట్టే సన్నివేశంతో పాటు హీరోను కాపాడే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సీన్లకు లాజిక్ ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ ట్రోలింగ్‌పై నానీతో జరిగిన పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమాను సినిమాలాగే చూడాలని, ప్రతీ సన్నివేశంలో లాజిక్ వెతికితే ఎంజాయ్ చేయడం కష్టమని ఆయన అన్నారు. తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.ఇదీ చదవండి: పెన్ను పెట్టి రాసిన నా మొదటి డైలాగ్ ఆయనదే: త్రివిక్రమ్‘రాజమౌళితో నన్ను నేను పోల్చుకోవట్లేదు. కానీ ‘మగధీర’ సినిమాలో ‘ధీర బాద్షా’ అన్నప్పుడు గుర్రం గాల్లోకి ఎగిరి కాలితో తాడును విసిరేస్తుంది. ఆ సీన్ చూసి థియేటర్లలో మనమంతా పిచ్చెక్కిపోయి విజిల్స్ వేశాం. అక్కడ లేని లాజిక్.. ‘ప్యారడైజ్’ సినిమాలో కుక్క ఎమోషన్‌ను చూపించినప్పుడు ఎందుకు గుర్తొస్తోంది?’ అని శ్రీకాంత్ ఓదెల పరోక్షంగా ప్రశ్నించారు. ప్రతీ సన్నివేశానికి అతిగా లాజిక్ వెతికితే ఏ సినిమాను కూడా పూర్తిగా ఆస్వాదించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రోలింగ్‌కు పరోక్షంగా శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Reason Behind “Diamond” Praying & Crying!!Srikanth Odela Compares it with Rajamouli’s Magadheera Horse Scene.#TheParadise pic.twitter.com/G89ZltYl8X— cinee worldd (@Cinee_Worldd) September 27, 2026 -
కేసీఆర్‌ది 4 నిమిషాలే.. థియేటర్లో దద్దరిల్లింది.. చూసుకోండి మరి..: కేటీఆర్
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్.’ ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటకీ ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా 135 కోట్లు వసూళ్లు రాబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కేటీఆర్ శైతం సినిమాను థియేటర్‌కి వెళ్లి చూశారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చిత్రం బృందాన్ని అభినందించారు. కాగా మరోసారి ది ప్యారడైజ్‌పై స్పందించిన ఆయన.. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యంలు వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: సాయి పల్లవి స్పీచ్‌కి ఫ్యాన్స్ ఫిదాసినిమాలో 4 నిమిషాలు..ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో పార్టీ నేతలతో కలిసి తాను ‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో కేసీఆర్‌ను ప్రతిబింబించే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర కనిపించేది కేవలం నాలుగు నిమిషాలే. కానీ ఆ మూడు గంటలు ఒక ఎత్తు అయితే.. ఆ నాలుగు నిమిషాలు మరో ఎత్తు. ఆ పాత్ర తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వేరే లెవల్లో ఉంది’ అని తెలిపారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు తమ ఉనికి, అస్తిత్వం కోసం చేసే తిరుగుబాటును డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. ఇదీ చదవండి: ది ప్యారడైజ్ పై కేటీఆర్ రివ్యూ "మూడు గంటల #TheParadise సినిమా ఒక ఎత్తు...అందులో ఉన్న నాలుగు నిమిషాల #KCR సీన్ ఒక ఎత్తు."– #KTR pic.twitter.com/2B286TMt81— Gulte (@GulteOfficial) September 27, 2026 -
‘ది ప్యారడైజ్’లో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన ఈ నటి ఎవరో తెలుసా?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నానితో పాటు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు, విషిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇందులో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే పాత్రలో కనిపించారు. సాధారణంగా కామెడీ పాత్రలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్.. ఈ సినిమాలో మాత్రం కాస్త భిన్నమైన పాత్రలో కనిపించారు. ఆయన భార్య ‘దేవి’ పాత్రను నటి విషిక పోషించారు. ఆమె పాత్ర సినిమాలో ఎక్కువసేపు కనిపించకపోయినా.. కథలో కీలకమైన సందర్భాల్లో కనిపిస్తారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సంపూర్ణేష్ బాబు, విషిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథలో ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ధూమావతి దేవి విగ్రహం ముందు వచ్చే సీన్ అందరిని కంటతడి పెట్టిస్తుంది. అంతలా తనదైన సహజనటనతో ఆకట్టుకుంది విషిక. ఇక విషిక సీనీ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటికే ‘కోర్ట్’, ‘పతంగ్’, ‘పురుషః’ వంటి సినిమాలు, సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా తన పరిధిని పెంచుకుంటున్నారు. ‘ది ప్యారడైజ్’లో దేవి పాత్ర కూడా ఆమె కెరీర్లో మరో విభిన్నమైన పాత్రగా నిలిచింది.పెద్దగా హడావుడి లేకుండా తన పాత్ర పరిధిలో సహజంగా నటించడం ద్వారా విషిక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమాలో ఆమెది కీలక పాత్ర కాకపోయినా.. కథలో భాగమైన దేవి పాత్ర మాత్రం గుర్తుండిపోయేలా ఉందని చెప్పొచ్చు. అయితే ఆ సినిమాలో సవారీ జాతి మహిళగా డీగ్లామర్ పాత్రలో కనిపించిన విషిక..బయట మాత్రం చాలా అందంగా, హీరోయిన్ మెటిరియల్గా ఉంది. విషిక బ్యూటిఫుల్ ఫోటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kirthi♊️ (@vishika_14) -
‘ది ప్యారడైజ్’ డే3 కలెక్షన్స్.. టాక్ ఎలా ఉన్నా తగ్గేదేలే!
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. వసూళ్ల విషయంలో మాత్రం జోరు చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతూ.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇక మూడో రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.(చదవండి: తమ్ముడు శ్రీకాంత్.. మంచి సందేశమిచ్చావ్: కేటీఆర్ భావోద్వేగ ట్వీట్)మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో మూడో రోజు ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో విడుదలైన మూడు రోజుల్లోనే సినిమా రూ.136 కోట్ల మార్క్‌ను అందుకుంది.నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే కథ, కథనం విషయంలో కొంతమంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై పెద్దగా కనిపించడం లేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో పాటు వీకెండ్ అడ్వాంటేజ్‌తో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. It is JADAL ZAMANA at the box office 🔥🔥#TheParadise collects 136 CRORES+ GROSS WORLDWIDE in 3 days ❤🔥❤🔥Book your tickets now!🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/PCKO7J85gD— THE PARADISE (@TheParadiseOffl) September 27, 2026 -
50 ఏళ్ల సినీ కెరీర్.. 500పైగా చిత్రాలు.. ఇలాంటి పాత్ర చేయలేదు: మోహన్ బాబు
‘‘నా యాభై ఏళ్ల సినీ కెరీర్లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను. కానీ, ‘ది ప్యారడైజ్’లో సికంజా మాలిక్ లాంటి భయంకరమైన క్యారెక్టర్ చేయడం నా లైఫ్‌లో తొలిసారి. శ్రీకాంత్ ఓదెల నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువు దాసరి నారాయణరావుగారు కూడా చాలా టేకులు తీసుకునేవారు’’ అని నటుడు మంచు మోహన్ బాబు తెలిపారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమా ‘ది ప్యారడైజ్’. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా ములాఖత్ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. ఈ సినిమాలో నాని పడిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. అయితే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే ‘ప్యారడైజ్’ సూపర్ డూపర్ హిట్ అయింది’’ అని పేర్కొన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ల అభిప్రాయాన్ని చాలా నిజాయితీగా చెబుతారు. అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు తెలుగు సినిమా గొప్పగా ఉంటుంది. మోహన్ బాబుగారితో కలిసి పని చేసిన తర్వాత ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది’’ అని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించిన నటీనటులకు, పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. నాని, నా అనుబంధం ఇక్కడితో ఆగిపోయేది కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్ అందరూ ఈ రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు’’ అన్నారు సుధాకర్ చెరుకూరి. ఈ కార్యక్రమంలో నటులు ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ తదితరులు మాట్లాడారు. -
‘ది ప్యారడైజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రకటించిన మోహన్‌బాబు.. ఎవరికంటే..?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మోహన్‌బాబు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తనకు తమ్ముడిలాంటి గద్దర్‌ను గుర్తుచేసుకున్నారు. గద్దర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘నాకు తమ్ముడి లాంటి వారు గద్దర్. ఆయన పిల్లలు మా స్కూల్లోనే చదువుకున్నారు. రచయితలు అంటే నాకు చాలా ఇష్టం’’ అని మోహన్‌బాబు తెలిపారు. రెండు సంవత్సరాల పాటు ఉచితంగా.. ఈ సందర్భంగా ఓ రచయిత మృతి చెందిన విషయం తనకు తెలిసిందని గుర్తుచేసుకున్న మోహన్‌బాబు.. ఆయన కుమారుడిని స్టేజ్‌పైకి పిలిపించారు. అనంతరం అతడు ప్రస్తుతం ఏం చదువుతున్నాడని అడిగారు. ఫార్మసీ చదువుతున్నానని అతడు చెప్పడంతో.. ‘‘మా దగ్గర ఎం.ఫార్మసీ కూడా ఉంది’’ అని మోహన్‌బాబు తెలిపారు.అంతేకాదు, అతడికి రెండు సంవత్సరాల పాటు ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. ‘నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి అవ్వాలి’’ అంటూ ఆశీర్వదించారు. సక్సెస్ మీట్ వేదికగా మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన చూపించిన ఆప్యాయత, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మరోసారి మోహన్‌బాబు తన గొప్ప మనసును చాటుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్ -
ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు
-
నాని నన్ను తిట్టాడు..కొట్టాడు.. ఇదంతా నిజమే : శ్రీకాంత్ ఓదెల
ది ప్యారడైజ్ షూటింగ్ సమయంలో నానికి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి మధ్య గొడవ జరిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌పై నాని సీరియస్ అయ్యాడని.. శ్రీకాంత్ కూడా నానితో గొడవపడ్డాడని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై శ్రీకాంత్ ఓదెల స్పందించాడు.‘ది ప్యారడైజ్’ సినిమా సక్సెస్ మీట్లో శ్రీకాంత్ మాట్లాడుతూ..‘షూటింగ్ సమయంలో కొన్ని వార్తలు చదివాను. నాని అన్నకు కోసం వచ్చింది. నన్ను తిట్టాడని, కొట్టాడని..‘శ్రీకాంత్ గాడు అలిగాడు..అరిచాడు’అనిఇలా ఏదోదో రాసినట్లు విన్నాను. అవును అది నిజమే. నాని అన్న తిట్టిన మాట నిజమే.నేను అరిచిన మాట నిజమే కావొచ్చు. కానీ..నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే.. ‘నాని అన్న నేను కలిసి దసరా, ప్యారడైజ్ , రేపు ఇంకో సినిమా చేయొచ్చు. అయితే మా ఇద్దరి ఎమోషన్ ని ఆ సినిమాలో పెట్టకూడదు. వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు కానీ.. ఈ సినిమాల్లో మాత్రం మా ఇద్దరి ఎమోషన్ని పెట్టకూడదు. కచ్చితంగా నాని అన్న నన్న భరించాల్సిందే. మోయాల్సిందే..వేరే ఆప్షన్ లేదు. దీంట్లో తన్నుకుంటాం..ముద్దు పెట్టుకుంటాం..మూతులు నాక్కుంటాం..అది ఏది ఉన్నా సినిమా కోసమే. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర చూడకూడదు. చావుని దాటి చూడాలి. నాని అన్నతో నా బంధం ఇక్కడికే ఆగిపోయేది కాదు’ అని ఎమోషనల్‌గా చెప్పాడు. ది ప్యారడైజ్ విషయానికొస్తే.. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. అయితే కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. రెండు రోజుల్లోనే రూ. 114 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. -
అప్పుడు ఆగిన ఫోన్.. ఇప్పుడే మోగుతోంది అన్నా.. సంపూ ఎమోషనల్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. ఇందులో సంపూర్ణేష్ బిర్యాని పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవున్నాయి. చాలా సంతోషంగా ఉంది..‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. నా గెటప్ ముందల నాని అన్న.. ఓ సందర్భంలో చాలా టేక్‌లు తీసుకున్నా.. అసలు ఈ సినిమా చేస్తామా? లేదా అనిచాలా భయం వేసింది. అప్పుడు నాని అన్న చాలా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కొబ్బరిమట్ట రిలీజ్ తర్వాత ఆగిన ఫొన్ మళ్లీ ‘ది ప్యారడైజ్’ తర్వాతే మోగింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా ఇంత గుర్తింపు రాలేదు. ఇది చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’ అని భావేద్వేగంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడారు. ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్Kobbari Matta తర్వాత ఆగిన Phone Calls …#TheParadise తర్వాత మళ్లీ మోగింది! 🔥#SampoorneshBabu #Nani pic.twitter.com/S022LFD6A6— Milagro Movies (@MilagroMovies) September 26, 2026 -
అందం ఉన్నా అదృష్టం లేదు.. ముచ్చటగా మూడోసారి!
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు టైమింగ్, సరైన సినిమా, ఆ సినిమా ఫలితం కూడా కెరీర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. కొందరు నటీనటులకు మంచి అవకాశాలు వరుసగా వచ్చినా.. వాటిని విజయాలుగా మలుచుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఇప్పుడు యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే కనిపిస్తోంది. అందం, అభినయం ఉన్న ఈ భామకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ ఆమె ఖాతాలో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు చేరడం లేదు.‘అల్లూరి’తో టాలీవుడ్ ఎంట్రీ..కయాదు లోహర్ తెలుగులో తొలిసారి శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమాతో పరిచయమైంది. 2022లో వచ్చిన ఈ చిత్రంలో ఆమె సంధ్య పాత్రలో కనిపించింది. మంచి నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్లో కయాదు తొలి అడుగే విజయాన్ని అందించలేకపోయింది.ఆ తర్వాత కయాదు ఇతర భాషలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా తమిళంలో ‘డ్రాగన్’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో కయాదుకు దక్షిణాదిలో వరుస అవకాశాలు రావడం మొదలైంది.విశ్వక్సేన్తో ‘ఫంకీ’..ఆ గుర్తింపుతోనే టాలీవుడ్లో మరో మంచి అవకాశం దక్కింది. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫంకీ’లో కయాదు హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆమె చిత్త్ర పాత్రలో కనిపించింది. తెరపై కయాదు అందంగా కనిపించడంతో పాటు సహజమైన నటనతో ఆకట్టుకుందని రివ్యూల్లోనూ ప్రస్తావనలు వచ్చాయి.అయితే సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో కయాదు ఖాతాలో తెలుగులో రెండో సినిమా కూడా విజయాన్ని నమోదు చేయలేకపోయింది.‘ది ప్యారడైజ్’పై భారీ ఆశలు..ఇక కయాదు కెరీర్లో మరో కీలక అవకాశం ‘ది ప్యారడైజ్’. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు పాత్రలో కనిపించింది. తన గత పాత్రలకు పూర్తి భిన్నంగా, కథలో కీలకమైన పాత్ర లభించిందని కయాదు స్వయంగా చెప్పింది. ఈ సినిమా తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని కూడా పేర్కొంది.సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’కు మిశ్రమ స్పందన లభించింది. దీంతో కయాదు తెలుగులో నటించిన మూడు సినిమాల్లోనూ విజయం ఆమెకు దూరంగానే నిలిచింది. ‘అల్లూరి’, ‘ఫంకీ’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కూడా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోకపోవడంతో.. కయాదుకు కలిసి రావడం లేదనే చర్చ మొదలైంది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరుస పరాజయాలు ఉన్నప్పటికీ కయాదుకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘ది ప్యారడైజ్’తో పాటు తమిళంలో మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్, సూర్యతో ఓ సినిమా సహా పలు ప్రాజెక్టుల్లో ఆమె భాగమవుతోంది.అంటే కయాదు విషయంలో టాలెంట్ లేదని కాదు.. అవకాశాలు రావడం లేదని కూడా కాదు. మంచి పాత్రలు దక్కుతున్నాయి. గుర్తింపు తెచ్చుకునే సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆమె నటించిన సినిమాలు వరుసగా విజయం సాధించకపోవడమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇక అదృష్టం కలిసొచ్చే ఆ ఒక్క హిట్ కోసం కయాదు ఎదురుచూస్తోంది. ఆ విజయం ఎప్పుడు వస్తుందో.. అదే ఆమె టాలీవుడ్ కెరీర్‌కు కీలక మలుపుగా మారొచ్చు. -
‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ మూవీకి సంబంధించిన చర్చ కొనసాగుతోంది. సినిమా చూడబోతున్నా..తాజాగా ‘ది ప్యారడైజ్’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. శనివారం రాత్రి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడనున్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్లో సినిమా చూడబోతున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నా’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఇక ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ఆయన నటించారు. సవారీ తెగకు, శంకర్ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్ బీస్ట్..! ఇదేం ట్విస్ట్ బాస్.. After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”— KTR (@KTRBRS) September 26, 2026 -
‘ది ప్యారడైజ్’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
వేణుస్వామి పేరు సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలతోనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆయన తొలిసారి ఓ సినిమా గురించి స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న నాని ‘ది ప్యారడైజ్’పై వేణుస్వామి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలోని ఓ ప్రత్యేక అంశం తనను థియేటర్ వరకు తీసుకెళ్లిందని చెప్పడంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సాధారణంగా సినిమా చూడటానికి హీరో, కథ, దర్శకుడు లేదా ట్రైలర్ వంటి అంశాలు కారణమవుతుంటాయి. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో తనకు పూర్తిగా భిన్నమైన కారణం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అమ్మవారి నేపథ్యాన్ని సినిమాలో ఉపయోగించారని తెలియడంతో ఈ చిత్రంపై తనకు ఆసక్తి కలిగిందన్నారు.ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’లో ధూమావతి అమ్మవారి ప్రతీకను చూపించిన ఓ యాక్షన్ సన్నివేశాన్ని వేణుస్వామి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సన్నివేశంలో ధూమావతి ప్రతీకతో పాటు కాకిని కూడా ఉపయోగించారని, బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రోచ్ఛారణను పోలిన శబ్దాలను వినిపించారని తెలిపారు. దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అంశాన్ని సినిమాలో టచ్ చేయడం సాధారణ విషయం కాదని, ఇందుకు ఎంతో ధైర్యం అవసరమని వ్యాఖ్యానించారు.ఇక మంత్రాలు, ఆవాహన వంటి ఆధ్యాత్మిక అంశాలను సరైన అవగాహన లేకుండా ఉపయోగించడంపై తనకున్న విశ్వాసాలను కూడా వేణుస్వామి వెల్లడించారు. ముఖ్యంగా ధూమావతి అమ్మవారికి సంబంధించిన అంశాలను తెరపై చూపించేటప్పుడు వాటి నేపథ్యం, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu) -
ప్యారడైజ్ లో ధూమావతి అమ్మవారిని అలా ఎలా చూపిస్తారు..!
-
ఏమయ్యా రాహుల్... గిదా పద్దతి?, దావత్ ఇయ్యాలే: కేసీఆర్ స్టైల్లో ప్రియదర్శి రిప్లై
ది ప్యారడైజ్’ సినిమా చూసిన ప్రేక్షకులకు నాని పాత్రతో పాటు మరో క్యారెక్టర్ కూడా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. అదే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర. ఈ పాత్రలో ప్రియదర్శి కనిపించిన తీరు ప్రేక్షకులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. లుక్ దగ్గర నుంచి మాట తీరు, హావభావాలు, డైలాగ్ డెలివరీ వరకు ఆయన చూపించిన విధానం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉండటంతో థియేటర్లలో ప్రత్యేకమైన స్పందన వచ్చింది. రిలీజ్ వరకు ఈ పాత్రకు సంబంధించిన విషయాలను మేకర్స్ పూర్తిగా సీక్రెట్‌గా ఉంచడంతో.. తెరపై ప్రియదర్శిని చూసిన ఆడియన్స్‌కు ఇది బిగ్ సర్ప్రైజ్గా మారింది.‘ది ప్యారడైజ్’లో ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి తనదైన నటనతో అదరగొట్టారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ఆయన.. ఈ సినిమాలో ప్రజల కోసం నిలబడే నేతగా కనిపించారు. ఆయన లుక్‌ను గమనించిన ప్రతిసారీ కేసీఆర్ గుర్తుకు వచ్చేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాత్రను డిజైన్ చేశారు. ముఖ్యంగా ముక్కు ఆకారం, హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు.. ఇలా ప్రతి అంశంలోనూ కేసీఆర్ ఛాయలు కనిపించేలా ప్రియదర్శి నటించారు.అయితే ఈ పాత్రను కేవలం ఇమిటేట్ చేయడంతోనే ఆపకుండా.. తనదైన నటనతో ప్రియదర్శి మరింత ఆసక్తికరంగా మలిచారు. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నానికి ఎంతగా పేరు వచ్చిందో.. శంకరన్న పాత్రలో ప్రియదర్శికి కూడా అదే స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం ఆయన పేరు మారుమోగుతోంది.(చదవండి: నాని 'ప్యారడైజ్'కి రెండు రోజుల్లో ఎంతొచ్చాయ్?)ఈ నేపథ్యంలో ప్రియదర్శి నటనపై తోటి నటుడు రాహుల్ రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిని ఉద్దేశిస్తూ ‘బాపూ.. ఇచ్చి పడేసినావు’ అంటూ రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేశారు. దీనికి ప్రియదర్శి కూడా తన పాత్రను గుర్తుచేసేలా సరదాగా స్పందించారు. కేసీఆర్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను గుర్తుచేస్తూ.. ‘ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే’అంటూ రిప్లై ఇచ్చారు.ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ది ప్యారడైజ్’లో శంకరన్న పాత్రను మేకర్స్ ఇంతకాలం రహస్యంగా ఉంచడం.. ఇప్పుడు ఆ పాత్రకు వస్తున్న స్పందన సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారడం విశేషం. ముఖ్యంగా కేసీఆర్‌ను పోలిన లుక్, డైలాగ్ డెలివరీతో ప్రియదర్శి తెరపై కనిపించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి ‘ది ప్యారడైజ్’తో ప్రియదర్శికి మరో గుర్తుండిపోయే పాత్ర దక్కిందనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. Em vy Rahulluuu Gidha padhathi Gorre pilla kosi dawat iyyale🫂— Priyadarshi Pulikonda (@Preyadarshe) September 24, 2026 -
రెండో రోజుకి తగ్గిపోయిన 'ప్యారడైజ్' కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?
నాని 'ప్యారడైజ్' సినిమా గురించే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది. బాగుంది? బాగోలేదా? అనే కంటే మూవీలో సన్నివేశాలు, లాజిక్స్ గురించి జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు భారీగా వచ్చిన కలెక్షన్స్.. రెండో రోజుకి వచ్చేసరికి చాలానే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇప్పటివరకు వచ్చిన వసూళ్లెంత?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ)నాని 'ప్యారడైజ్' సినిమాకు ఏడాది ముందు నుంచే బీభత్సమైన హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే పాటలు హిట్టయ్యేసరికి బ్లాక్‌బస్టర్ కొట్టేస్తుందేమోనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.88 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ టాక్ రకరకాలుగా వినిపించింది. దీంతో రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు రూ.110 కోట్ల గ్రాస్ వచ్చిందనమాట.ఓవరాల్‌గా 'ప్యారడైజ్' సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినప్పటికీ టాక్ మిక్స్డ్ ఉంది. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు వస్తాయనేది ఇప్పుడు డిస్కషన్‌గా మారింది. ఇక మూవీ ఫలితం గురించి స్పందించిన నాని.. ట్రోల్స్ ఎంజాయ్ చేశాను. తప్పులు తెలుసుకున్నానని ట్వీట్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్) -
ఆ జర్నలిస్ట్ నోరు దొర్లాడు.. నోరు జారాడు వదిలేయండి
-
'ది ప్యారడైజ్ మూవీ.. తీవ్ర మనోవేదనకు గురయ్యా'
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఏకంగా రూ.88 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓ జాతి మనుగడ కోసం చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ నటించిన టాలీవుడ్ నటుడు రెమో రహీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సీన్లను ఎడిటింగ్‌లో తీసేశారంటూ మనోవేదనకు గురయ్యారు. నేను చేసిన సీన్ దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉందని తెలిపారు. కానీ రన్‌టైమ్ నిడివి కారణంగా.. తాను చేసిన ఓ చిన్న క్లిప్ మాత్రమే ఉంచారని ఆవేదన చెందారు. తాను ఎంతో కష్టపడి చేసిన సీన్స్ తొలగించడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రెమో రహీమ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'సినిమాల్లో నటించడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో ప్రాణం పెట్టి చేసిన సీన్లు ఎడిటింగ్‌లో కట్ అయినప్పుడు ఆ బాధ, నిరాశ వర్ణనాతీతం. ఒక నటుడిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా చాలా మానసిక వేదనను కలిగిస్తుంది. నేను చాలా బాధపడుతున్నా. నా ట్రక్ సీన్ వాస్తవానికి 5 నుంచి 7 నిమిషాల నిడివి ఉంటుంది. కానీ సినిమా నిడివి కారణంగా కుదించాల్సి వచ్చింది' అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Remo Raheem Actorr (@remoraheem_actor) -
'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ప్యారడైజ్'. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇస్తున్నారు. ఇప్పుడు వీటిపై నాని స్వయంగా స్పందించాడు. ట్రోల్స్, మూవీపై వస్తున్న నెగిటివిటీ గురించి ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)'మీ అందరి స్పందన, ప్రేమని చూశాను. మీ ఫన్నీ ట్రోల్స్ ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ దానిలా దగ్గరకు తీసుకోవడం నా మనసుని తాకింది. అదే టైంలో విమర్శకులు, రివ్యూయర్లు ఎత్తిచూపిన లోపాల నుంచి కూడా నేను నేర్చుకున్నాను. అన్నింటికీ థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను''మీకు ఓ ప్రత్యేకమైన అనుభూతి అందించాలనే ఉద్దేశంతో 'ద ప్యారడైజ్' సినిమాని కష్టపడి తీశాం. ఇప్పుడు ఇది పూర్తిగా మీది. మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదా జడ్జ్ చేయొచ్చు. సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై మీరు చూపించిన ఆప్యాయత నన్ను ఎంతో సంతోషపడేలా చేశాయి' అని నాని ట్వీట్ చేశాడు.బానిసలుగా బతుకుతున్న ఓ తెగకు హీరో ఎలా గుర్తింపు తీసుకొచ్చాడు? ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనే స్టోరీ లైన్‌తో ఈ సినిమా తీశారు. తొలిరోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ.88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఫలితం.. చిరంజీవితో సినిమా సంగతేంటి?) -
'ప్యారడైజ్' ఫలితం.. చిరంజీవితో సినిమా సంగతేంటి?
'ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఎక్కువగా నెగిటివ్, మిక్స్డ్ రివ్యూస్ వినిపించాయి. దీంతో ఈ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. తర్వాత చిరంజీవితో కలిసి పనిచేస్తాడా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ సంగతేంటి?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ దగ్గర పనిచేశాడు. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కంటెంట్ పరంగా ఇది పర్లేదనిపించింది. 'ప్యారడైజ్'కి వచ్చిన హైప్‌కి బ్లాక్‌బస్టర్ కొట్టేస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ డీసెంట్‌గా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫస్టాప్ అదరగొట్టినప్పటికీ సెకండాఫ్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు కనిపించాయని అంటున్నారు.అయితే 'ప్యారడైజ్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా చిరంజీవి హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఫుల్ యాక్షన్ కథతో దీన్ని తీయబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చారు. మరి 'ప్యారడైజ్'కి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 'ప్యారడైజ్' ప్రమోషన్స్‌లో మాట్లాడిన నాని.. సంక్రాంతి తర్వాతే చిరు-శ్రీకాంత్ మూవీ షూటింగ్ మొదలవుతుందని అన్నాడు. మరి చిరు కోసం శ్రీకాంత్ ఓదెల ఎలాంటి కథ సిద్ధం చేశాడో? దీని గురించి అప్డేట్ ఎప్పుడిస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్) -
Day 1: పారడైస్ @ 100 కోట్ల వసూల్
-
ది ప్యారడైజ్.. హిట్టా..? ఫట్టా..?
-
తొలిరోజు ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. దుమ్మురేపుతున్న కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపిస్తోంది. ఫస్ట్ డే వసూళ్లతో నాని కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచినట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ తొలి రోజు ఇండియాలో రూ.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం..దేశవ్యాప్తంగా 47 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో నాని గత చిత్రాలు ‘దసరా’, ‘హిట్: ది థర్డ్ కేస్’ ఫస్ట్ డే వసూళ్లను ఈ మూవీ అధిగమించిందట. గతంలో నాని నటించిన ‘దసరా’ ఫస్ట్ డే దాదాపు రూ.23.20 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. ‘హిట్: ది థర్డ్ కేస్’ రూ.21 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. వీటితో పోలిస్తే ‘ది ప్యారడైజ్’ భారీ ఓపెనింగ్ నమోదు చేసిందనే చెప్పాలి. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’..కాగా.. ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కీర్తి సురేశ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’ -
'ఏషనాగుల కట్టమీద'.. కొరియోగ్రాఫర్ జంట అద్భుతమైన డ్యాన్స్..!
టాలీవుడ్లో ఇప్పుడుంతా ది ప్యారడైజ్ ఫీవర్ నడుస్తోంది. నాని హీరోగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు ఆడియన్స్ నాని నటనపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరేమో కథలో ఎమోషన్స్ పండలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.ముఖ్యంగా ఏషనాగుల కట్టమీద సాంగ్ రిలీజయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల వ్యూస్‌తో పాటు రీల్స్ చేస్తూ ఆడియన్స్ ఊగిపోయారు. తాజాగా ఈ పాటకు హూక్స్టెప్తో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ఆయన సతీమణి జ్యోతిరాజ్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఈ పాటకు కొరియోగ్రఫీ ఆట సందీప్ మాస్టర్ అందించడం మరో విశేషం. వీరిద్దరు దంపతులు ఫుల్ ఎనర్జీతో ఏషనాగుల కట్టమీద పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
‘ది ప్యారడైజ్’ వచ్చేది ఈ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నాని ‘ది ప్యారడైజ్’ నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దసరా’తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాలకు తగ్గట్లుగా లేదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినిమాలో ప్రధానంగా ఎమోషన్ మిస్ అయిందని పలు న్యూస్ వెబ్‌సైట్స్ తమ రివ్యూల్లో పేర్కొన్నాయి.కొంతమంది కావాలని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే నాని అభిమానులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా భారీ స్థాయిలో పోటీపడ్డాయి. అయితే చివరకు రూ. 50 కోట్లకు పైగా వెచ్చించి.. నెట్ఫ్లిక్ ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది.(చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ )స్ట్రీమింగ్ అప్పుడేనా..?థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఒప్పందంతో రైట్స్ అమ్ముకున్నారట నిర్మాత. ఈ లెక్కన చూస్తే.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20-22 తేదీల మధ్య ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఇందులో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా.. సోనాలి కులకర్ణి, 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక చాలా కాలం తర్వాత డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు. -
థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా..
-
నాని 'ప్యారడైజ్'.. ప్రేక్షకులు ఏమంటున్నారు?
నాని 'ప్యారడైజ్' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. విడుదలకు ముందు విపరీతమైన హైప్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. దాన్ని నిలబెట్టుకుందా? చూసిన ప్రేక్షకులు అసలేమంటున్నారు? సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీకి కారణమేంటి? చూస్తున్నవన్నీ నిజమైనా అభిప్రాయాలేనా?(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)ఏ సినిమాపై అయినా విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు దాన్ని అందుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఏ మాత్రం అటుఇటైనా అడ్డంగా బోల్తా కొట్టేయడం గ్యారంటీ. 'ప్యారడైజ్' విషయంలో ఇప్పుడు అదే జరిగిందని ఆడియెన్స్ అంటున్నారు. స్టోరీ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ టేకింగ్ పరంగా ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని ఆశపడితే అలాంటిదేం లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఫస్టాప్ పర్లేదనిపించినప్పటికీ సెకండాఫ్ మరీ దారుణంగా ఉందని అంటున్నారు.మరికొందరు అయితే 'ప్యారడైజ్'.. బిర్యానీ కాదు కిచిడీ, పులిహోర అని ఘోరమైన విమర్శలు చేస్తున్నారు. వందలాది రూపాయల టికెట్ కొని ఎంతో ఆశతో థియేటర్‌కి వెళ్లి ఉసూరుమన్న చాలామంది సోషల్ మీడియా వేదికగా తన కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)నాని కష్టాన్ని మెచ్చుకుంటున్న ప్రేక్షకులు.. మోహన్ బాబు విలనిజం బాగుందని అంటున్నారు. కాయదు పాత్రని వ్యాంప్ తరహాలో డిజైన్ చేయడం కొందరికి తెగ నచ్చేయగా.. మరికొందరు 'పెద్ది'లో జాన్వీ పాత్రతో పోలుస్తున్నారు. ఇద్దరినీ అందాల ప్రదర్శన కోసమే తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి రాఘవ్ జుయల్‌తో చేయించిన విలనీ మరీ కామెడీగా ఉందని ఏకిపారేస్తున్నారు.బిర్యానీ అనే పాత్రలో నటించిన సంపూర్ణేశ్ బాబు.. 'ప్యారడైజ్' కోసం రెండేళ్ల పాటు ఇదే లుక్ మెంటైన్ చేస్తే సరైన సీన్ గానీ సరైన ఎలివేషన్ గానీ పడలేదని అంటున్నారు. అనిరుధ్.. పాటల్లో తప్పితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మెప్పించలేకపోయాడని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎందుకనో పూర్తిగా దృష్టి పెట్టి ఈ మూవీ తీయలేదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా నాని.. మాస్ సినిమాలు తగ్గించి గతంలో చేసినట్లు ఫీల్ గుడ్ లేదా కామెడీ మూవీస్ చేయాలని సగటు సినీ ప్రేక్షకులు, అతడి అభిమానులు కోరుతున్నారు.సోషల్ మీడియాలో 'ప్యారడైజ్' విషయంలో కనిపిస్తున్నదంతా చాలావరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూసినవాళ్లలో పాజిటివ్స్ చెప్పినవాళ్లు ఒకరో ఇద్దరో ఉండగా.. మిగిలిన వాళ్లు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ అసలు ఫలితం ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: సుకుమార్ శిష్యులిద్దరిదీ ఒకే కథ.. ప్చ్) -
The Paradise: మధ్యలోనే ఆపేసిన ప్రీమియర్ షో ఫ్యాన్స్ రచ్చ రచ్చ
-
'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్
నాని 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. మూవీ ఫలితం సంగతి పక్కనబెడితే ఇందులో కొన్ని అంశాలు.. ప్రేక్షకుల్ని అలరించాయి. వాటిలో కేసీఆర్, ఎన్టీఆర్‌ని పోలిన పాత్రలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి గురించే సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.1980ల్లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కల్పిత కథతో 'ప్యారడైజ్' సినిమా తీశారు. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలబడే ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి నటించాడు. అయితే ఈ పాత్రని చూస్తున్నంతసేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే గుర్తొస్తారు. ఈ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి.అలానే సీనియర్ ఎన్టీఆర్‌గా పి.విజయ్ కుమార్ నటించారు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నటించింది ఈయనే. కేసీఆర్‌ని పోలిన పాత్రకు స్క్రీన్ స్పేస్, డైలాగ్స్ ఉన్నాయి గానీ ఎన్టీఆర్ రోల్ జస్ట్ అలా కనిపించి వెళ్లిందంతే. సవారీలు నివసించే ప్రాంతానికి ఎమ్మెల్మే శంకరన్న పాత్ర ముఖ్యమంత్రిని తీసుకొస్తారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే పేరు ఎక్కడా ఉపయోగించలేదు. కానీ పాత్రలు చూస్తే ఎవరికైనా అవి ఎవరనేది అర్థమైపోతుంది. ఇలా సినిమాలో ఈ రెండు పాత్రల్ని చూపించి సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాని 'ప్యారడైజ్' సినిమా రివ్యూ) -
‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ది ప్యారడైజ్నటీనటులు: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులునిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: చెరుకూరి సుధాకర్రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయిఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 24, 2026ఒకప్పుడు నాని అంటే క్లాస్ ఎంటర్టైనింగ్ సినిమాలు గుర్తొచ్చేవి. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో అలరించేవాడు. కానీ ‘దసరా’తో తన రూట్ మార్చాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ తనలోని వయెలెంట్ యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు చూడని మాస్ అవతారంతో ‘ది ప్యారడైజ్'అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన పాటలు, టీజర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నాని చేసిన మాస్ ప్రయోగం ఫలించిందా? శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించాడా? రివ్యూలో చూద్దాం. (The Paradise Movie Telugu Review)కథేంటంటే..ఈ సినిమా కథ 1947లొ మొదలై 80లలొ ముగుస్తుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా..హైదరాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతం మాత్రం సంపన్న వర్గానికి చెందిన శికంజ మాలిక్(మోహన్ బాబు) ఆధీనంలో ఉంటుంది. అక్కడ నివసించే సవారీ జాతి వాళ్లకు గుర్తింపు ఉండదు. తమను భారతీయులుగా గుర్తించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ జాతికి చెందిన సమ్మక్క(సోనాలి కులకర్ణి).. శికంజ మాలిక్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమె కొడుకే జడల్(నాని). చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన కారణంగా మాలిక్‌తో పాటు తల్లిపై కోపం పెంచుకుంటాడు. హత్యానేరంపై జైలుకెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగివస్తాడు. శికంజ మాలిక్‌ని చంపడమే తన లక్ష్యం. మరి జడల్ లక్ష్యం నెరవేరిందా? ప్యారడైజ్‌లో శికంజ మాలిక్ కొడుకు(రాఘవ్ జుయల్)సృష్టించిన విధ్వంసం ఏంటి? అసలు జడల్..తన తల్లిపై ఎందుకు కోపంగా ఉన్నాడు? గుర్తింపు కోసం తన తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? తల్లి చేస్తున్న ఈ పోరాటంలోకి జడల్ ఎలా వచ్చాడు? చివరకు సవారీలకు గుర్తింపు వచ్చిందా రాలేదా? ఈ కథలో బిర్యానీ(సంపూర్ణేష్ బాబు), సుబ్బు(కయాదు లోహర్) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ మధ్యకాలంలో ది ప్యారడైజ్ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకూ రాలేదనే చెప్పాలి. టీజర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగింది. అయితే కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడినట్టు ఆ స్థాయి అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ది ప్యారడైజ్ కథలో కొత్తదనం కనిపించదు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు కోసం ఓ వర్గం చేసే పోరాటం.. ఆ వర్గాన్ని ఓ బలమైన వ్యక్తి అణచివేయడం.. ఆ అణచివేత నుంచి ఓ కథానాయకుడు ఎదగడం.. చివరకు తన వర్గానికి గుర్తింపు తీసుకురావడం.. ఈ తరహా కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా కథలో కొత్తదనం లేకపోయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన ట్రీట్మెంట్తో దానికి కొత్త రూపు ఇవ్వాలని ప్రయత్నించాడు. కథలోని ప్రపంచాన్ని, పాత్రలను, అక్కడి పరిస్థితులను ఆయన నిర్మించిన విధానం బాగుంది కానీ.. అయితే ముఖ్యమైన ఎమోషన్ మిస్సయింది. ధురంధర్ తరహాలో ఈ సినిమాను చాప్టర్లుగా విభజిస్తూ కథనాన్ని ముందుకు నడిపాడు. మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. అందులో మొదటి చాప్టర్లో సవారీ జాతి నేపథ్యాన్ని,అణచివేతకు గురైన తీరుని చూపించారు. ఇది కొంతవరకు ఆసక్తికరంగానే సాగుతుంది. ఇక రెండో చాప్టర్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే ఆమె తండ్రిపై ప్రేమలో చేసే ఒక పని.. లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్గానూ అంతగా ఆకట్టుకోలేదు. చాప్టర్ 3లో మదర్ సెంటిమెంట్‌ని చూపించారు. ఒకవైపు కథను ఎమోషనల్‌గా నడిపిస్తూనే మరోవైపు శృతిమించిన వయెలెన్స్‌ని చూపించారు. సినిమా ప్రారంభం నుంచే రక్తం ఏరులైపారుతుంది. తలలు ఎగిరిపడుతుంటాయి. రక్తపు మడుగులో బొర్లుతుంటారు. అయినప్పటీకీ ఆయా సీన్లు అంతగా ఆకట్టుకోలేవు. ఇంటర్వెల్ సినిమా మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిన పెంచుతుంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత ఇంకేదో ఉంటుదని.. ఇప్పుడు ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలావరకు గాడీ తప్పింది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే శంకర్రావు( కేసీఆర్‌ను పోలిన పాత్ర) ఎపిసోడ్ మాత్రం థియేటర్స్‌లో ఈలలు వేయిస్తుంది. అయితే ఆ కథకు ఆ పాత్రకు పెద్దగా సంబంధం ఉండదు. ఆ తర్వాత కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నా.. మళ్లీ నరుకుడు పద్దతినే ఎంచుకున్నాడు దర్శకుడు. విపరీతమైన హింస సన్నివేశాలను జోడించాడు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..జడల్ జమానా పాత్రలో నాని జీవించేశాడు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. తన శక్తికి మించిన పాత్రను చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని కెరీర్లోనే ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక 'శికంజ మాలిక్' పాత్రలో మోహన్ బాబు తనదైన గాంభీర్యం, డైలాగ్ డెలివరీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమాకు ప్లస్ అయింది. చాలా కాలం తర్వాత మోహన్ బాబు ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక శికంజ మాలిక్ కొడుకుగా రాఘవ్ జుయల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కయాదు లోహర్ పాత్ర నిడివి తక్కువే అయినా గుర్తిండిపోయే పాత్ర చేసింది. ఇక హీరో తల్లి సమ్మక్కగా సోనాలి కులకర్ణి తనదైన నటనతో ఆకట్టుకుంది. సంపూర్ణేష్ బాబు కొత్త తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు.అయితే దర్శకుడు అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. యాక్షన్ సీన్స్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. ఇక పాటల గురించి తెలిసిందే. రిలీజ్‌కి ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఏష నాగుల పాటలకి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. మిగిలిన పాటలన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్యారడైజ్ వరల్డ్‌ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ది ప్యారడైజ్ రిలీజ్.. నాని సతీమణి ఎమోషనల్ పోస్ట్
నాని ది ప్యారడైజ్ రిలీజ్ వేళ ఆయన సతీమణి అంజనా ఆసక్తికర పోస్ట్ చేసింది. మీ సినిమా చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి మరి మరి వెళ్లామని గుర్తు చేసుకుంది. 2009లో మీ సినిమా విడుదలైన రోజు మొదటి షో పడలేదని తెలిపింది. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజే తనకు తెలిసిందని రాసుకొచ్చింది.అంజనా తన పోస్ట్‌లో రాస్తూ..'2009 నాకు ఇంకా గుర్తుంది. మీ సినిమా చూడటానికి మేము ఇద్దరం కాలేజీ ఎగ్గొట్టాం. కానీ ఆ రోజు ఉదయం షో కూడా పడలేదు. ఒక కొత్త దర్శకుడికి సమయానికి సినిమా విడుదల చేయడం కూడా ఎంత కష్టమో అని ఆరోజు నేను అనుకున్నా. ఆ సంగతి ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత.. మీరు ఒక్కో సినిమాతో సంపాదించుకున్న నమ్మకం వల్ల 'ప్యారడైజ్' మూవీకి జనం తరలిరావడం చూస్తుంటే మా అందరికీ చాలా భావోద్వేగంగా అనిపిస్తోంది. ఈ ప్రయాణం ఒక్క రోజులో నిర్మించింది కాదు.. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ప్రతి సినిమా మీరు బిడ్డలా భావించడాన్ని నేను చూశా. సినిమా ఎప్పటికీ మీ బిడ్డే. ఈ రోజు రాత్రి 'ప్యారడైజ్' తన తొలి అడుగులు వేస్తోంది. ఏది జరిగినా.. అంతా మంచే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది ఆంతే.. మరెవ్వరూ లేనంతగా మేము మీకు అండగా ఉన్నాం' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) -
నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే
-
‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ రివ్యూ: ఆ సీన్లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
‘ది ప్యారడైజ్’.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రిమియర్స్పడబోతున్నాయి. అసలు ఈ సినిమా కథేంటి? సెన్సార్ సభ్యులను సైతం భయపట్టిన సన్నివేశాలు ఏంటి? ఇప్పటివరకు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన టాక్ ఎలా ఉంది? ఫస్ట్రివ్యూలో చూద్దాం.సెన్సార్ టాక్.. ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. తీవ్రమైన రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ దృశ్యాల కారణంగా 18 ఏళ్ల పైబడిన వాళ్లు మాత్రమే సినిమా చూడాలంటే ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. నాని సైతం ఈ సినిమాకు చిన్న పిల్లలను తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయెలెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మొత్తం చూసి సెన్సార్ సభ్యులు ఈ మధ్యకాలంలో ఇలాంటి వయెలెన్స్ చిత్రం చూడలేదని చెప్పారట. మొత్తం 21 మార్పులు సూచించారట. అలాగే కొన్ని అభ్యంతరకరమైన డైలాగులను మ్యూట్ చేశారు. సెన్సార్ తర్వాత ఈ సినిమా రన్ టైమ్ 2.45 గంటలకు ఫైనల్ చేశారు. (చదవండి: ‘ది ప్యారడైజ్’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?)ప్యారడైజ్ కథేంటి?ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ ఇలా సాగుతుందట. 1984 కాలంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ పరిసర ప్రాంతల్లో నివసించే సంచార జాతీ సవారీలకు గుర్తింపు ఉండదు. వాళ్లు అసలు జనాభ లెక్కల్లో ఉండరు. అలా బాగా అణచివేతకు గురైన సవారీల జాతికి చెందిన యువకుడే జడల్ జమానా(నాని). మొదట్లో అందరిలా బతికే జడల్.. శికంజ మాలిక్(మోహన్ బాబు), అతని కొడుకు(రాఘవ్ జుయల్) తన జాతిపట్ల చూపించే వివక్షను తట్టుకోలేక ఎదురు తిరుగుతాడు. తన జాతి గుర్తింపు కోసం జడల్ చేసిన పోరాటం ఏంటి? అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తికి మధ్య జరిగే సుదీర్ఘ పోరాటమే ఈ సినిమా మిగతా కథ.హైలెట్స్ ఇవే!ఈ సినిమా సినిమా ప్రధానంగా నాలుగు భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అవి సినిమాకే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించని విధంగా ఉంటుందట. కథ ప్రారంభం అయినా కాసేపటికే అందరూ ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఇక చివరి 40 నిమిషాలు అయితే మరింత ఆసక్తికరంగా సాగుతుందట. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు చాలా సర్ప్రైజులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ది ప్యారడైజ్.. నాని, మోహన్ బాబు, కీర్తి సురేశ్.. పారితోషికం ఎంతెంత?)నాని కెరీర్ బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడట. అలాగే అనిరుధ్ బీజీఎం అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ మాత్రమే కాదు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయట. సినిమా పూర్తయిన తర్వాత బరువైన హృదయంతో బయటకు వస్తారట. ఇక వయెలెన్స్ విషయానికొస్తే..ఇంతకు ముందు తెలుగు తెరపై చూడని భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయట. సలసలకాగే ఆయిల్ లో పడి కాలడం, మహిళలతో బలవంతంగా బట్టలు విప్పించడం మహిళలను వేలంలో అమ్మడం.. నాని తనకి తాను దిష్టి తీసుకునే క్రమంలో శరీరం అంతా రక్తసిక్తం కావడం లాంటి సన్నివేశాలు స్ర్కీన్‌పై చూస్తుంటే కాస్త ఇబ్బందిగా, భయంకరంగానే ఉంటాయట. (చదవండి: ది ప్యారడైజ్ మూవీ స్పెషల్.. థియేటర్స్‌లో సర్వపిండి!)తల్లి, కొడుకు ఎమోషన్ ఈ సినిమాకు మరో ప్రధాన బలమని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాక్ అయితే సినిమా హిట్ అన్నట్లుగానే ఉంది. మరి ఇందులో నిజమెంత? ఈ వయెలెంట్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. -
ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు
-
‘ది ప్యారడైజ్’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?
మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 24 రిలీజ్..23న ప్రీమియర్స్) ది ప్యారడైజ్ మూవీ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ ..మరే చిత్రానికి రాలేదు. ప్రమోషన్స్ కోసం వదిలిన ప్రతి కంటెంట్ సూపర్ హిట్ అయింది. అందుకే ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు అయిన ఖర్చు ఎంత? ఇప్పటివరకు వచ్చింది ఎంత?నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్.. సినిమా సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాడు నాని. ‘దసరా’కి రూ.70 కోట్లకు పైగా ఖర్చు అయింది. అప్పటివరకు అదే అత్యధిక బడ్జెట్.. ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా వరుసగా బడ్జెట్ పెంచుకుంటూనే వస్తున్నాడు. ఇక ప్యారడైజ్‌కి అయితే ఆయన రేంజ్‌కి మించిన బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాకు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేశారట నిర్మాత సుధాకర్ చెరుకూరి. ముందుగా అనుకున్న బడ్జెట్‌కి మించి ఖర్చు చేశారట. అయినా కూడా నిర్మాత హ్యాపీగానే ఉన్నాడు. మీడియాతో మాట్లాడుతూ..వాయిదా పడినా.. ఖర్చు పెరిగినా ఏమాత్రం భయపడలేదని చెప్పాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. రెమ్యునరేషన్ ఎవరికెంత?)నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంతంటే..?ఈ సినిమాకు ముందుగానే బిజినెస్ అయింది. నాన్ థ్రియేట్రికల్ రైట్స్ కింద మొత్తంగా రూ. 80-100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చాయట. అందులో ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ నుంచే రూ. 50 కోట్ల వరకు ఉన్నాయట. నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తం చెల్లించి ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఇక ఆడియో రైట్స్ కింద రూ. 15 కోట్ల వరకు వచ్చింది. ఈ మొత్తం ఒక్క ఆయా షేర్ పాట నుంచే సదరు ఆడియో కంపెనీకి వచ్చిందట. అలాగే ఓవర్సీస్లోనూ మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆడియో, శాటిలైట్, ఓటీటీ..ఇలా మొత్తంగా రూ. 100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చినట్లు తెలుస్తోంది.థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రే ఈవెన్ టార్గెట్ ఎంత?ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ నాని కెరీర్లోనే అత్యధికంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే భారీగానే వసూలు చేయాలి. బయ్యర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే (బ్రేక్ ఈవెన్) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. గ్రాస్ రూపంలో చెప్పాలంటే ఇది సుమారు రూ.200 కోట్లకు సమానం. సినిమాకు వచ్చిన బజ్‌ని బట్టి చూస్తే.. తొలి రోజు రూ. 60 కోట్లకు వరకు వసూలు చేసే అవకాశం ఉంది. హిట్ టాక్ వస్తే మాత్రం తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ది ప్యారడైజ్.. అదే జరిగితే నాని కెరీర్లోనే బెస్ట్..!
నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఈ రోజు సాయంత్రం నుంచే థియేటర్లలో అలరించనుంది. స్పెషల్ ప్రీమియర్ షోలతో జడల్ జమానా షురూ కానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ క్రేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. మొదటి రోజు రూ. 18.16 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ మూవీకి 6,849 షోలతో దాదాపు 8.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలంగాణలో రూ. 9.14 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ రూ.5.63 కోట్లు, కర్ణాటక రూ.2.01 కోట్లు, తమిళనాడు రూ.68.54 లక్షలు, మహారాష్ట్ర రూ. 20.61 లక్షలు సాధించింది.ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ డేటా ప్రకారం ఈ మూవీ మొదటి రోజే రూ.60 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే నాని కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా ది ప్యారడైజ్ నిలవనుంది. నాని సినిమాల మొదటి రోజు వసూళ్లుసరిపోదా శనివారం- రూ.24.11 కోట్లుదసరా- రూ.38 కోట్లుహిట్: ది థర్డ్ కేస్- రూ.43 కోట్లుది ప్యారడైజ్- రూ.50-60 కోట్లు(అంచనా) -
'ప్యారడైజ్' సినిమా.. రెమ్యునరేషన్ ఎవరికెంత?
నాని 'ప్యారడైజ్' సినిమాకి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి ఫ్యామిలీస్ ఈ మూవీకి దూరంగానే ఉంటారు. అంటే పెద్దోళ్లు, యూత్ మాత్రమే ఈ చిత్రాన్ని ఆదరించాలి. పాటలతో ఇప్పటికే మంచి బజ్ తీసుకొచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో స్టోరీ ఏమై ఉండొచ్చని డిస్కషన్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. మిగతా భాషల సంగతేమో గానీ తెలుగు రాష్ట్రాల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే ఉన్నాయి. ఇక మిగిలింది కంటెంట్ రిజల్ట్ మాత్రమే.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)సరే ఈ సంగతులన్ని పక్కనబెట్టెస్తే 'ప్యారడైజ్' సినిమాని నాని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో జడల్ అనే పాత్రలో నటించినందుకుగానూ నాని ఏకంగా రూ.30-35 కోట్ల మధ్య పారితోషికం అందుకున్నట్లు టాక్.సికంజా మాలిక్ అనే విలన్‌గా చేసిన సీనియర్ నటుడు మోహన్ బాబుకు రూ.5 కోట్లు, 'యేషనాగుల' అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించిన కీర్తి సురేశ్‌కి రూ.కోటి, సుబ్బు అని హీరోయిన్ పాత్ర చేసిన కాయదు లోహర్కి రూ.1.5 కోట్లు, విక్రమ్ మాలిక్ అనే మరో విలన్‌గా చేసిన బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయెల్కి రూ.2-2.5 కోట్లు, బిర్యానీ అని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సంపూర్ణేశ్ బాబుకి రూ.38 లక్షలు, ఇక ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతమందించిన అనిరుధ్ రవిచందర్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్'.. నాని కోరిక తీరడం కష్టమే) -
‘ది ప్యారడైజ్’ మూవీ స్పెషల్.. ఇంటర్వెల్లో సర్వపిండి!
సినిమా థియేటర్‌కు వెళ్లామంటే ఇంటర్వెల్లో పాప్‌కార్న్, సమోసా తినడం చాలామందికి అలవాటే. రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నా.. సినిమా మధ్యలో ఏదో ఒకటి కొనుక్కుని తినాల్సిందే. ఇన్నాళ్లూ థియేటర్ అంటే పాప్‌కార్న్, సమోసాలే గుర్తొచ్చేవి. ఇకపై ఆ జాబితాలో తెలంగాణ సంప్రదాయ వంటకం సర్వపిండి కూడా చేరబోతోంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా సందర్భంగా మైత్రీ థియేటర్స్ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. అసలైన స్థానిక రుచిని సింగిల్ స్క్రీన్ థియేటర్ల క్యాంటీన్లలోకి తీసుకొచ్చింది. దీంతో సినిమా చూడటంతో పాటు తెలంగాణ సంప్రదాయ రుచిని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.(చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)హైదరాబాద్‌లోని మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్స్‌లో సర్వపిండిని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక వంటకాలకు పెద్దపీట వేస్తూ మైత్రీ థియేటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతోంది.ఇక ప్యారడైజ్ సినిమా విషయానికొస్తే.. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ో తెరకెక్కిన చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్‌ా నటించగా..మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజు ముందుగానే అంటే సెప్టెంబర్23 ప్రీమియర్స్ షోలు పడనున్నాయి. Bringing the Taste of Telangana to Your Favourite Single Screens! ❤️🔥Mythri Theatres brings Telangana’s much-loved Sarvapindi to Mythri Vimal & Mythri Shiva Ganga, making it a special part of the interval experience for #TheParadise. 🌾❤️ pic.twitter.com/Xa2YhB8GUj— Mythri Theatres (@MythriTheatre) September 23, 2026 -
'ప్యారడైజ్'.. నాని కోరిక తీరడం కష్టమే
నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా.. బుధవారం(సెప్టెంబరు 23) సాయంత్రం ప్రీమియర్లతో రిలీజ్ కానుంది. అయితే తన చిత్ర ప్రీమియర్ షోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్లో అభిమానులతో కలిసి చూడాలనుకుంటున్నానని.. ఈ మేరకు తనకు అనుమతి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పోలీసులని ఉద్దేశించి ట్విటర్లో విజ్ఞప్తి చేశాడు.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)అయితే ప్రీమియర్ సందర్భంగా అవసరమైన అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్స్ పూర్తిగా పాటిస్తామని నాని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చిత్ర బృందం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టుకోవాలని.. ప్రజల భద్రత, జనసమూహ నియంత్రణని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇక రేవంత్ రెడ్డి ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్ సిటీ కమీషనర్ సీవీ ఆనంద్.. ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు, ప్రజల రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నందున, అదనపు పోలీసు బలగాలని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై హైదరాబాద్ నగర పోలీసులతో సంప్రదించాల్సి ఉందన్నారు. గతంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనని ఈ సందర్భంగా ప్రస్తావించారు.దీనిపై స్పందించిన నాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్ల ప్రాధాన్యతని తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని.. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం పడటం లేదా ప్రజలకు అసౌకర్యం కలగడం తమ ఉద్దేశం కాదని అన్నాడు. పోలీసు శాఖ తుది నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశాడు. భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటే, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రీమియర్‌కు రాకపోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. చూస్తుంటే ప్రీమియర్ల బంతి పోలీసులు చేతిలో ఉంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నాని కోరిక నెరవేరడం కష్టమే.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)Thank you for your prompt response, Hon’ble Chief Minister @revanth_anumula Garu.We completely understand the importance of public safety, especially with the Ganesh Nimarjanam arrangements. We would not want to add any burden to the police department or cause any inconvenience… https://t.co/AoDTphdFuO— Nani (@NameisNani) September 23, 2026 -
'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?
హీరో నాని.. పక్కా ప్లానింగ్‌తో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాడు. అలాంటి ఇతడి ప్లానింగ్‌ని డిస్ట్రబ్ చేసిన మూవీ 'ప్యారడైజ్'. ఇతడితో గతంలో 'దసరా' మూవీ చేసిన శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు. ఇప్పటికే మార్చి, ఆగస్టులో వస్తుందని చెప్పి వాయిదాలు వేశారు. ఈసారి అలాంటిదేం లేకుండా ఎలాగైనా సరే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ 'ప్యారడైజ్'.. నానితో పాటు మిగతా వాళ్లకు ఎందుకంత కీలకం? అసలు జనాలు దీని గురించి ఏమనుకుంటున్నారు?నాని చాలావరకు కొత్త దర్శకులతోనే కలిసి పనిచేస్తుంటాడు. అలా సుకుమార్ సహాయకుడు శ్రీకాంత్ ఓదెలకు అవకాశమిచ్చి 'దసరా' చేశాడు. మాస్ లుక్‌లో నాని ఆకట్టుకున్నాడు. ఇది మరీ సూపర్ మూవీ అనిపించుకోలేదు గానీ కాస్త డిఫరెంట్‌గా ఆకట్టుకుంది. మళ్లీ ఇదే దర్శకుడితో నాని కలిసి పనిచేస్తున్నాడనేసరికి ఏంటా అంత నమ్మకం అని మాట్లాడుకున్నారు. సరిగ్గా అలాంటి టైంలో 'ప్యారడైజ్' గ్లింప్స్ వదిలారు. ఇది చూసి అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)రెండు జడలతో నాని లుక్, కాకుల రిఫరెన్స్, డార్క్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా గ్లింప్స్ దెబ్బకు ఒక్కసారిగా 'ప్యారడైజ్'పై బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఇదంతా ఏడాది క్రితం అంటే గతేడాది మార్చి టైంలో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 26న సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం శ్రీకాంత్ ఓదెల పట్టుబట్టడం లాంటి వాటితో షూటింగ్ ఆలస్యమైంది. అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. కట్ చేస్తే ఆగస్టు 21న అని మరోసారి ప్రకటించారు. ఈ తేదీని కూడా అందుకోలేక మళ్లీ వాయిదా వేశారు.ఫైనల్‌గా సెప్టెంబరు 24న 'ప్యారడైజ్' మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. ఈసారి కూడా రిలీజ్ కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ చివరి నిమిషం రీషూట్స్ లాంటివి ఓ పక్క చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఈ కారణంగా ట్రైలర్ ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఆయా షేర్, యేషనాగుల పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కావాల్సినంత హైప్ అయితే ఉంది. కంటెంట్‌తో మెప్పించడమే ఇక మిగిలుంది.సినిమా మొదలైనప్పుడు ఏకంగా 8 భాషల్లో రిలీజ్ ఉంటుందని ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ వాయిదాల కారణమో ఇంకేంటో తెలీదు గానీ ప్రస్తుతానికైతే తెలుగులో తప్పితే మిగతా చోట్ల పెద్దగా బజ్ లేదు. అయినా సరే బెంగళూరు, ముంబై, కొచ్చీ అని తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. టీమ్ అంతా తెగ కష్టపడుతున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు)ఇప్పటివరకు నాని అంటే మిడ్ రేంజ్ సినిమాలు చేసే హీరోగానే పేరుంది. ఇప్పుడొచ్చే 'ప్యారడైజ్' గనక బ్లాక్‌బస్టర్ హిట్ అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలున్న టాప్ లీగ్‌లోకి వెళ్లే అవకాశముంటుంది. బుధవారం (సెప్టెంబరు 23) సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా పడే ప్రీమియర్లతో నాని భవితవ్యం ఏంటనేది తెలుస్తుంది. గురువారం(సెప్టెంబరు 24) నుంచి రెగ్యులర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.'దసరా'తో హిందీలోనూ కొంత మార్కెట్ ఏర్పరుచుకున్న నాని.. 'ప్యారడైజ్'తో దాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. అలానే ఇప్పటివరకు నాని కెరీర్లో వచ్చిన చిత్రాలన్నింటికీ బడ్జెట్ అదుపులో ఉండేది. 'ప్యారడైజ్'కి మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువే పెట్టేశారు. ఈ మూవీకి లాభాలు రావాలంటే బీభత్సమైన టాక్ వచ్చి థియేటర్లు రెండు మూడు వారాలైనా కళకళాలాడిపోవాలి. మరి అలా జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాలి?(ఇదీ చదవండి: నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం రేవంత్) -
ఎదురుదెబ్బల నుంచి ఎదుగుదల వరకు.. చిరు, నాని చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
వ్యక్తిత్వ వికాసం గురించి పుస్తకాల్లో చదివిన విషయాలకంటే.. స్వయంగా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి చెప్పే మాటలకు మరింత విలువ ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం కష్టపడటం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదురైనా తనపై తాను నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నానని వెల్లడించారు. ఆయన చిరంజీవిగా తన పేరును మార్చుకొని నేటికి సరిగ్గా 48 ఏళ్లయింది. అప్పటి నుంచి ఈ 48 ఏళ్ల సుదీర్గ సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, మరెన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. తనపై విమర్శలొచ్చినప్పుడు ఎలా నిలబడాలో తెలుసుకున్నారు. అవన్నీ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.మరోవైపు నాని కూడా తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మనం ఎదుగుతున్న కొద్దీ ప్రశంసించే వారితో పాటు కిందకు లాగాలని చూసేవాళ్లు కూడా ఉంటారని చెప్పారు. పెరుగుతున్న కొద్దీ నెగెటివిటీ కూడా పెరుగుతుంది. దానిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగాలని సూచించారు. తన కెరీర్ ప్రారంభం నుంచి నెగెటివిటీకి దూరంగానే ఉన్నాను. అలానే నా కెరీర్‌ని ఇలా నిర్మించుకున్నాను. అందరూ అలానే ఆలోచించాలని కూడా నాని అన్నారు.ఇలా ఒకే సమయంలో అటు చిరంజీవి, ఇటు నాని తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను తమ అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మాటలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. -
పుష్ప మూవీ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి నాని రిక్వెస్ట్
టాలీవుడ్ హీరో నాని తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ఓ సినిమా హీరోగా తాను ప్రేక్షకులతో కలిసి నా మూవీ ఆస్వాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల నిబంధనలు, భద్రతా చర్యలు పాటిస్తామని హీరో ట్వీట్ చేశారు. నా అభ్యర్థనను సీఎం, సినిమాటోగ్రఫి మంత్రి పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజ్ సమయంలో జరిగిన సంఘటన వల్లే నాని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు.నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈనెల 23న సాయంత్రం ఆరు గంటల నుంచే ది ప్యారడైజ్ హంగామా షురూ కానుంది. ప్రీమియర్ షో (సెప్టెంబర్ 23) కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని థియేటర్‌కు వచ్చి వీక్షించేందుకు నాని సిద్ధమవుతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు.Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…— Nani (@NameisNani) September 22, 2026 -
‘ది ప్యారడైజ్’లో ‘ధూం ధూం తఃతః’ మంత్రం.. ఎవరీ దేవత?
ది ప్యారడైజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, రా స్టేట్మెంట్.. ఇలా ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులు, నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’లోని కాకులు, ‘ఆయా షేర్’ పాటలో వినిపించే ఓ మిస్టీరియస్ బీజీఎం మధ్య ఉన్న లింక్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.ఒక్క బీజీఎంతో కథపై కొత్త చర్చ..నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 23న ప్రీమియర్స్ జరగనున్నాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ‘ఆయా షేర్’ పాట ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు మంచి స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అదే పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.‘ధూం ధూం తఃతః’.. ధూమావతి మంత్రమేనా?‘ఆయా షేర్’ పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం.. ‘ధూం ధూం ధూమావతి తఃతః’ అనే మంత్రాన్ని పోలి ఉందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ బీజీఎంకు, సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఏదైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది.సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో మొదటి నుంచీ కాకులు పదేపదే కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన రా స్టేట్మెంట్లోనూ కాకుల ప్రస్తావనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశిర్రు గానీ.. గదే జాతిల పుట్టిన కాకుల గురించి బైంగన్ బి రాయలే.. గిది కడుపుమండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రత్తం పోసి పెంచిన ఓ జాతి కథ..’ అనే డైలాగ్‌తో విడుదలైన ఈ రా స్టేట్మెంట్.. సినిమాలో కాకులకు ఉన్న ప్రాధాన్యంపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను ‘ఆయా షేర్’లోని ‘ధూం ధూం తఃతః’ బీజీఎంతో లింక్ చేస్తూ నెటిజన్లు తమదైన రీతిలో కథను అంచనా వేస్తున్నారు.ధూమావతి దేవికి.. కాకులకు ఉన్న సంబంధమేంటి?హిందూ తాంత్రిక సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ధూమావతి దేవిని ఏడో మహావిద్యగా పరిగణిస్తారు. ‘ధూమావతి’ అనే పేరు పొగతో కూడినది, పొగమయమైనది అనే అర్థాలను సూచిస్తుంది. ఇతర దేవతలతో పోలిస్తే ఆమె రూపం కూడా భిన్నంగా ఉంటుంది.సాధారణంగా ధూమావతి దేవిని వృద్ధ వితంతువు రూపంలో, అలంకారాలు లేకుండా, చేతిలో చాటతో ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమెకు సంబంధించిన ప్రతీకల్లో కాకికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ధూమావతి దేవి ప్రస్తావన వచ్చినప్పుడు కాకి ప్రతీక కూడా గుర్తుకు వస్తుంది.‘ప్యారడైజ్’లోనూ అదే థీమ్నా?ఇక్కడే నెటిజన్ల థియరీ ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యం.. మరోవైపు ‘కడుపుమండిన కాకుల కథ’ అంటూ వచ్చిన రా స్టేట్మెంట్.. దీనికి తోడు ‘ఆయా షేర్’లో వినిపించే ‘ధూం ధూం తఃతః’ బీజీఎం.. ఇవన్నీ కలిపి చూస్తే ధూమావతి దేవికి సంబంధించిన ఏదైనా ప్రతీకాత్మక అంశం సినిమాలో ఉండొచ్చా? అనే చర్చ జరుగుతోంది.ఇది నిజమైన క్లూనా?అయితే ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా నెటిజన్ల విశ్లేషణ, అభిమానుల థియరీగానే చూడాలి. సినిమా విడుదలైన తర్వాతే కాకులు, ధూమావతి దేవి, ‘ధూం ధూం తఃతః’ బీజీఎం మధ్య అసలు కనెక్షన్ ఏంటి? అనేది స్పష్టమవుతుంది.అయితే విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌లోని చిన్న చిన్న అంశాలను పట్టుకుని ప్రేక్షకులు ఇంతలా విశ్లేషణలు చేయడం మాత్రం ‘ది ప్యారడైజ్’పై ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. నిజంగానే ఇవన్నీ కథలో భాగమా? లేక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కావాలనే ఇలాంటి క్లూస్ వదిలారా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.ధూమావతి దేవి ఎవరు? ధూమావతి దేవి హిందూ శాక్త సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ఏడో మహావిద్యగా ప్రసిద్ధి. సాధారణంగా ఆమెను వృద్ధురాలైన, వితంతువు రూపంలో, గుర్రాలు లేని రథంపై కూర్చున్న దేవతగా చిత్రిస్తారు. రథంపై కాకి చిహ్నం ఉండటం లేదా కొన్ని సంప్రదాయాల్లో ఆమె కాకిపై కూర్చున్నట్లుగా చూపించడం ప్రత్యేకత.‘ధూమావతి’ అనే పేరు ఎలా వచ్చింది?సంస్కృతంలోని ‘ధూమ’ అంటే పొగ. అందుకే ధూమావతిని సాధారణంగా ‘పొగతో కూడినది’ లేదా ‘పొగ స్వరూపిణి’గా అర్థం చేసుకుంటారు. అగ్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిగిలే పొగ, బూడిద వంటి భావనలకు ఆమె రూపం ప్రతీకగా భావించబడుతుంది. ఇది క్షయం, శూన్యత, అంతం, వైరాగ్యం వంటి భావాలను సూచిస్తుందని తాంత్రిక సంప్రదాయంలో వివరణలు ఉన్నాయి.ధూమావతి ఎలా ఆవిర్భవించింది?ధూమావతి ఆవిర్భావానికి సంబంధించిన కథనాలు ఒకే విధంగా లేవు. ముఖ్యంగా రెండు ప్రసిద్ధ పురాణ-తాంత్రిక కథనాలు కనిపిస్తాయి.సతి దహనం నుంచి ధూమావతి: దక్ష యజ్ఞంలో సతి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నప్పుడు, ఆ దహన ప్రక్రియ నుంచి వెలువడిన పొగలోంచి ధూమావతి అవతరించిందని ఒక కథనం చెబుతుంది. అందుకే ఆమెకు ‘ధూమావతి’ అనే పేరు వచ్చిందని వివరణ.శివుడిని మింగిన సతి కథ: మరో కథనం ప్రకారం సతికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. శివుడు ఆహారం ఇవ్వకపోవడంతో కోపంతో ఆమె శివుడినే మింగుతుంది. అనంతరం శివుడిని బయటకు విడుదల చేసిన తర్వాత, ఆమె వితంతువు రూపమైన ధూమావతిగా మారుతుందని ఈ కథనం వివరిస్తుంది. 🤯మీకు తెలుసా?#MovieSecretsWithAnjiShette - Day 1#TheParadise మూవీ థీమ్ సాంగ్‌లో మారుమోగే పవర్ఫుల్ మంత్రం వెనుక అసలు కథ ఇదేదశ మహావిద్యల్లో ఐదవ రూపమైన "ధూమావతి" అమ్మవారి మంత్రం🔥శత్రు సంహారానికి ప్రతీకగా నిలిచే అమ్మవారి మంత్రం వింటే గూస్ బంప్స్🔥#Nani #Paradise pic.twitter.com/Plz4yiK02I— Anji Shette (@AnjiShette) September 21, 2026 -
సుమ కొంగుపట్టి అదిపోయే స్టెప్పులేసిన రాఘవ్.. ఎవరీ నటుడు?
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న ఆయన.. ఈవెంట్లో తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.సుమ కొంగు పట్టుకుని ‘ఏష నాగుల..’ పాటకు రాఘవ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన డ్యాన్స్ చూసిన నెటిజన్లు ‘అదేం ఎనర్జీ సామీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో విలన్‌గా కనిపించనున్న రాఘవ్‌లోని మరో కోణాన్ని ఈ ఈవెంట్ ప్రేక్షకులకు చూపించింది.డ్యాన్స్‌తో గుర్తింపు..రాఘవ్ జుయల్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీ టెలివిజన్, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితుడే. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మంచి డ్యాన్సర్‌గానే కాకుండా యాంకర్, ప్రజెంటర్, నటుడిగానూ తనదైన ముద్ర వేశారు.2009లో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్లో పాల్గొనడం ద్వారా రాఘవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తన ప్రత్యేకమైన డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘క్రాకడైల్’ వంటి పవర్ఫుల్ మూవ్స్‌తో పాటు ‘క్రాక్ రోచ్’ తరహా స్లో మోషన్ డ్యాన్స్‌ను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ విభిన్నమైన స్టైల్ కారణంగానే రాఘవ్ జుయల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.విలన్‌గా మరో కోణం..డ్యాన్స్ మాత్రమే కాకుండా నటన, యాంకరింగ్‌లోనూ రాఘవ్ తన ప్రతిభను చాటుకున్నారు. 2014లో వచ్చిన ‘సోనాలి కేబుల్’ సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించారు. 2020లో వచ్చిన ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఆ తర్వాత ‘కిల్’, ‘యుధ్ర’, ‘భాయ్ తేరా స్టార్ మేరా’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న విలన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలోనూ రాఘవ్ జుయల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. డ్యాన్స్ షోతో కెరీర్‌ను ప్రారంభించి.. యాంకర్‌గా, నటుడిగా ఎదిగిన రాఘవ్ జుయల్.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.CHHOTA MAALIK BRINGS THE SWAG! 🔥🕺@TheRaghav_Juyal & @ItsSumaKanakala dance to Yeshanagula at the #TheParadise Grand Pre-Release Event ❤️🔥⚡GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26 pic.twitter.com/m4lbcyApWb— THE PARADISE (@TheParadiseOffl) September 21, 2026 -
నా దగ్గరకి రావడానికే భయపడతారు: మోహన్ బాబు
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ మరో రెండు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిన్న( సోమవారం) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు పోషించిన విలన్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తన పాత్రపై స్వయంగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.నా వద్దకు రావడానికే భయపడతారు..ఓ సందర్భంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూనే.. ‘ఈ కేరింతలు, చప్పట్లు అన్నీ ‘ప్యారడైజ్’ సినిమా కోసమేనని నాకు అర్థమవుతోంది. అయితే సెప్టెంబర్ 24న థియేటర్లలో ఆ సినిమా చూసిన తర్వాత ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రారు. నా వద్దకు రావడానికే భయపడతారు. ఎందుకంటే ఆ చిత్రంలో నా పాత్ర అంత భయంకరంగా, అత్యంత క్రూరంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన రోల్ సరికొత్త తరహాలో ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంతో తాను చూపించబోయే భీకర విలనిజం గురించి మోహన్‌బాబు ఇచ్చిన హింట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. #TheParadise సినిమా చూశాక ఎవరు నా దగ్గరలోకి కూడా రారు.#Mohanbabu #ShikanjaMaalik#Nani @SLVCinemasOffl pic.twitter.com/mChC4fBuRe— SZN (@Suzenbabu) September 21, 2026 -
నాని ‘ది ప్యారడైజ్’మూవీ HD స్టిల్స్
-
ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేశాం.. తగలబడిపోవాల్సిందే: నాని
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారుఈవెంట్లో నాని మాట్లాడుతూ..'ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మా సవారీ గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ నెల 24న మా కష్టాన్ని మీరంతా చూస్తారు. ఈ సినిమాకు కాసర్ల శ్యామ్ సాంగ్స్ అద్భుతంగా రాశారు. శ్రీకాంత్ ఓదెల ప్రతి ఒక్కరితో పని చేయించారు. ఈ మూవీతో శ్రీకాంత్ సక్సెస్ కొట్టబోతున్నారు. సంపూ బిర్యానీ పాత్రలో ఇరగదీశారు. ఈ సినిమా సెట్లో సోనాలి, రాఘవ్ నా ఫేవరేట్ యాక్టర్స్. ఈ మూవీ కయాదు అద్భుతంగా చేసింది. సుబ్బు పాత్ర మీ గుండెల్లో నిలిచిపోతుంది. మోహన్‌బాబు గురించి మాకు బాగా తెలుసు. ఆయన కటౌట్ ఏంటనేది ప్యారడైజ్ మరోసారి గుర్తుచేస్తుంది. అనిరుధ్ ఈ మూవీ కోసం తన ప్రాణం పెట్టేశాడు' అని అన్నారు. ఈనెల 23 ప్రీమియర్ షో నుంచే థియేటర్స్ ఊగిపోతాయని నాని ధీమా వ్యక్తం చేశారు. మీ నెగెటివిటీ కూడా పాజిటివ్‌గా మారిపోవాలని ఫ్యాన్స్‌కు సూచించారు. మనం ఓడిపోతే చూద్దామనుకునేవాళ్లు ఉంటారు..కానీ నేను గెలుస్తాననే నమ్మేవాళ్లకోసం నేను కష్టపడుతూనే ఉంటానని తెలిపారు. నా నమ్మకం మీద మీ అందరికీ నమ్మకముందని నాకు తెలుసని అన్నారు. సినిమా మొదలైనప్పుడే జడలకు.. మీకు ఓ లాక్ పడుతుందన్నారు. దర్శకుడు శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతాదన్నారు. చివర్లో ఈ మూవీలోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు హీరో నాని. -
ది ప్యారడైజ్.. ఏపీలో టికెట్ ధరల పెంపునకు అనుమతి
నాని ది ప్యారడైజ్ మూవీకి ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. టిక్కెట్లతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబరు 23న వేయనున్న స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.400(మల్టీప్లెక్స్‌ల్లో), రూ.300( సింగిల్ స్క్రీన్‌లో)గా నిర్ణయించారు. దీంతో పాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఒక్కో టికెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకునేందుకు అనుమతించారు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి లభించింది.ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అంజనా అంజనా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ సైతం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తుండగా.. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని ది ప్యారడైజ్.. సెన్సార్ భారీ కట్స్.. ఊహించని రన్‌టైమ్!
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు భారీగానే కట్స్ చెప్పారు. దాదాపు 21 సీన్స్ మార్పులు, చేర్పులు సూచించారు. మార్పుల అనంతరం ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 54 నిమిషాల 4 సెకన్లపాటు ఉండనుంది. ఇందులో మితిమీరిన వయొలెన్స్ సీన్స్ ఉండడం వల్లే భారీ కట్స్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు. -
ది ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే..?
-
10వేల మందికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన నాని..! ఫ్యాన్స్‌కు పండగే..
నేచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన భారీ ఫ్యాన్స్ మీట్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న నాని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 10 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్లో నాని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. అభిమానులను కలుసుకోవడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. వంటకాలతో భోజనం..అంతేకాదు.. కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కోసం నాని ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వెజ్, నాన్-వెజ్ వంటకాలతో వారికి ఘనంగా భోజనం పెట్టించారని సమాచారం. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాన్స్ కోసం నాని తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్యారడైజ్ స్టోరీ రివీల్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు. Natural Star @NameisNani with fans ❤️#TheParadise pic.twitter.com/dNf8kNXO64— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 21, 2026 -
కదిలిస్తే.. కన్నీరే.. ఇదే కయాదు జర్నీ
సినిమా రంగంలో ఎలాంటి నేపథ్యం లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదగడం అంత సులభం కాదు. కొందరికి తొలి సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరు ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు దాటిన తర్వాత తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అస్సామీ బ్యూటీ కయాదు లోహర్ ఒకరు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారింది. (ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు.. హీరోయిన్గా మారకముందు తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంది. తన కుటుంబ పరిస్థితులు, చేసిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.టీలు అందించే స్థాయి నుంచి..కయాదు మాట్లాడుతూ.. తాను పుణెలో పుట్టి పెరిగినట్లు తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని.. అయితే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో కాఫీ షాపులో టీలు అందించే పని కూడా చేశానని కయాదు గుర్తుచేసుకుంది. ఆ తర్వాత బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేశానని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎలాంటి పని చేయడానికి కూడా వెనుకాడలేదని ఆమె చెప్పుకొచ్చింది.కన్నీళ్లతో బయటకు..కయాదు జీవితంలో ఐటీ ఉద్యోగం కూడా ఓ భాగమేనట. కొంతకాలం ఐటీ కంపెనీలో పనిచేసిన ఆమె.. అక్కడి పని ఒత్తిడి తనకు ఏమాత్రం సరిపోలేదని చెప్పింది. తన ఆలోచనలు, తనకు నచ్చిన జీవితం ఆ ఉద్యోగంతో ముడిపడటం లేదని భావించినట్లు తెలిపింది. ఓ దశలో ఆఫీసులోనే తీవ్ర ఒత్తిడికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసినట్లు వెల్లడించింది. మోడలింగ్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమాల్లోకి వచ్చింది కయాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చిన్న ఉద్యోగాలు చేస్తూ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో స్టార్ హీరో సరసన హీరోయిన్గా నటించే స్థాయికి చేరుకోవడం విశేషం.సినిమాల విషయానికి వస్తే..టాలీవుడ్లో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ (2022) సినిమాతో కయాదు లోహర్ హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చినప్పటికీ.. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో వెంటనే వరుస అవకాశాలు రాలేదు. తర్వాత ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ (2025) ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో కయాదుకు వరుస అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ‘ఫంకీ’, ‘పళ్ళి చట్టంబి’ వంటి చిత్రాల్లోనూ నటించి తన పరిధిని పెంచుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: విడాకులపై కాజల్ ఆసక్తికరమైన కామెంట్స్) -
తొలి చిత్రమే ఓ ప్రయోగం.. నాని ప్యారడైజ్‌లో సమక్క గురించి తెలుసా?
-
ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్.. స్టోరీ లైన్ చెప్పేసిన నాని..!
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు.ఈ సినిమాలో ఒకట్రెండ్ ఎపిసోడ్స్‌ను శ్రీకాంత్ మరింత ఎక్స్ట్రీమ్గా తీశాడని అన్నారు. నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్స్ అవేనని పంచుకున్నారు. యాక్షన్ సీన్స్ ఒక కమర్షియల్ మాస్ సినిమాలో ఇలా ఉంటాయా అని థియేటర్లలో ఆడియన్స్ షాక్ అవుతారని అన్నారు. తాను మేకప్ వేసుకోవడానికి గంటన్నర పడితే.. జడల వల్ల రోజంతా వెనుకకు ఆనుకోవడానికి కూడా టైమ్ ఉండేది కాదని వెల్లడించారు. కొన్నిసార్లు ఏకంగా 36 గంటల పాటు షూట్ చేశామని.. లోపల స్కాల్ప్ అంతా ఎర్రబడి గాయాలయ్యాయని తాను పడ్డ కష్టాన్ని వివరించారు. జడల వల్ల ఎన్నో గాయాలు అయినా ప్రతీ షాట్ నేనే చేశా... థియేటర్లలో ప్రతీ ఫైట్, ప్రతీ పంచ్ పూనకాలు తెప్పిస్తుందని హైప్ పెంచేశారు నాని. -
ది ప్యారడైజ్ ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే?
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ది ప్యారడైజ్ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో మొదటి నాలుగు రోజులు రూ.48 పెంచుకోవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్‌లో రూ.94 అదనంగా వసూలు చేసేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 28వ తేదీ నుంచి అక్టోబరు 3 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.23, మల్టీప్లెక్స్‌ల్లో రూ.45 పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.అంతేకాకుండా తెలంగాణలో ఈనెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ వచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ ఎల్ఎల్పీ రూ.కోటి అందజేసింది. -
నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్.. (ఫోటోలు)
-
ఏజ్ ఉంది.. ఓపిక ఉంది.. అన్ని నేనే చేశా : నాని
స్టార్ హీరోల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెరపై హీరో ఎంత రిస్క్ తీసుకున్నట్లు కనిపించినా.. వాస్తవానికి కొన్ని యాక్షన్ సీన్లను డూప్‌ల సాయంతో పూర్తి చేయడం సాధారణమే. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫైట్లు, హై-రిస్క్ స్టంట్స్ ఉన్నప్పుడు హీరోలకు బదులుగా డూప్‌లు రంగంలోకి దిగుతుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమాల విషయంలో ఈ పద్ధతికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడట. తనకు డూప్‌తో సన్నివేశాలు చేయించడం అసలు ఇష్టం లేదని చెబుతున్నాడు.నాని నటించిన భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న విడుదల కాబోతుంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని యాక్షన్ సీన్లను డూప్‌తో చేశారా? లేక మీరే చేశారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.‘నాకిప్పుడు ఏజ్ ఉంది.. ఓపిక ఉంది..అందుకే అన్నీ నేనే చేశాను. 50 ఏళ్లు దాటిన తర్వాత డూప్‌ని పెడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమాల్లో డూప్‌ని పెట్టడం నాకు నచ్చదు. నా సినిమాలో ఒక్క డూప్ షాట్ కనిపించినా ఎంజాయ్ చేయలేను. సినిమా చూస్తున్నప్పుడు ఆ షాట్ నాది కాదనుకోండి.. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూనే.. ఆ సీన్ రాగానే ‘అబ్బా.. డూప్ షాట్’ అనుకుంటా. దాన్ని నేను ఓన్ చేసుకోలేను. ప్రశంసలు కూడా తీసుకోలేను. ఎవరైనా ‘నాని బాగా చేశావ్’ అంటే.. ‘ఆ నాలుగు డూప్ షాట్లు తప్పితే’ అని నా మనసు నాకు చెబుతూనే ఉంటుంది. అందుకే చిన్న చిన్న లెగ్ షాట్స్ కూడా నేనే చేస్తా. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాంటి సీన్లను డూప్‌తో చేద్దామని అనుకుంటారు. కానీ నేను ముందుగానే వాళ్లకు చెబుతా.. నా సీన్లన్నీ నేనే చేస్తానని చెప్పి క్యారవ్యాన్‌లోకి వెళతా. అయితే ఈ కసి, ఓపిక మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుందో లేదో చెప్పలేను. ప్రస్తుతానికి మాత్రం సినిమాల్లో డూప్ లేకుండా వీలైనంత వరకు అన్ని సన్నివేశాలను నేనే చేయాలని అనుకుంటున్నాను’అని నాని చెప్పుకొచ్చాడు. -
ప్రచారంలో ఉన్నట్లు రీషూట్స్ చేయలేదు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
‘‘నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లైనా తీస్తాను. ఈ విషయంలో మా ప్యారడైజ్’ టీమ్‌ను ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత రీషూట్ జోలికి వెళ్లను’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ ఓదెల చెప్పిన సంగతులు.. ⇒ ‘దసరా’తో నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చిన వ్యక్తి నానీగారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మరో మూవీ చేద్దామని నానీగారు అన్నారు. ‘ది ప్యారడైజ్’లో జడల్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. నానీగారికి జడలు వేద్దామని నా టీమ్‌తో అంటే వద్దన్నారు. కానీ కథని, క్యారెక్టర్ని నమ్మి నానీగారు ఒప్పుకున్నారు. మోహన్‌బాబుగారు ఇందులో మెయిన్ విలన్. ఆయన, నానిమధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ⇒ ‘ది ప్యారడైజ్’ని 171 రోజులు షూట్ చేశాం. నేను అనుకున్నట్లు సినిమా తీయడానికి, టార్గెట్ రీచ్ కావడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో యూనిట్ అందరి కాల్షీట్స్ మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకానీ ప్రచారంలో ఉన్నట్లు రీ షూట్స్ చేయలేదు. బౌండ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేయలేదు. షూటింగ్ ప్లాన్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానేమో అనిపించింది. నెక్ట్స్ టైమ్ ఇచ్చిన మాటపై నిలబడాలనుకుంటున్నాను.. అంటే చెప్పిన టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయడం, అనుకున్న టైమ్‌లో షూట్ పూర్తి చేయడం వంటివి. ⇒ ‘ది ప్యారడైజ్’లో బిట్ సాంగ్స్‌తో కలిపి ఆరు పాటలున్నాయి. నా చిన్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ‘ఏషనాగుల..’ పాట వినేవాడిని. ‘దసరా’ చిత్రానికే ఈ పాట పెడదామనుకున్నా. ‘ది ప్యారడైజ్’కు కుదిరింది. ⇒ నా దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. అలాగే చిరంజీవిగారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత మా ఫ్యామిలీతో టైమ్ గడపాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ మూవీ గురించి చెబుతాను. -
‘మీరే విగ్గు పెట్టుకున్నారు.. జడల కోసం మాకేలా చెప్తున్నారు’
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఇటీవల బెంగళూరులోనూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీకి ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.మీరు చెప్తే ఎవరు వింటారునాని మీడియా సమావేశంకి వచ్చిన ఓ లేడీ జర్నలిస్ట్‌ని చూసి.. ‘మీ హెయిర్ చాలా బాగుంది. ప్రస్తుతం హెయిర్ ఫాల్ అవుతోంది. జాగ్రత్తగా ఉండండి. నాలా జడలు పెట్టుకోండి అని పోస్టర్ని చూపిస్తూ సరదాగా అన్నారు. దీనికి స్పందించిన వేరే కన్నడ మహిళా జర్నలిస్ట్ ‘మీరు జడలు పెంచుకొని చెప్తే మీము వింటాం. కానీ మీరు జడలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ( బెంగళూరు)కి వచ్చి చెప్తే ఎవరు వింటారు’ అని నానిని ప్రశ్నించారు.సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా..‘నేను యాక్టర్‌ని అందుకే ఇలా చెప్పా.. మీరు జీవితంలో నిజంగా ఏడుస్తారు. నేను సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా.. అందుకే ఇలా చూపించి చెప్పా అని కౌంటర్‌ని కవర్ చేస్తూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. A Kannada Journalist’s QUESTION to #NANI :“మీరు #TheParadise లో lo JADAL పెంచుకుని చెప్తే పర్లేదు…మీరు WIG పెట్టుకుని, మాకు ఎలా చెప్తున్నారు…?”That CRAZY Response from the Crowd to #Nani’s Answer… 😂🔥 pic.twitter.com/0k9xXsqEl0— Rangasthalam (@RangasthalamIN) September 18, 2026 -
‘ది ప్యారడైజ్’లో ‘సమ్మక్క’.. అంచనాలు పెంచేసిన నాని
ది ప్యారడైజ్.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్, టీజర్ ..ప్రతీది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడమేకాకుండా..సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.ఇది ‘సమ్మక్క’ కథ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి సినిమా టైటిల్‌పై ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ ది ప్యారడైజ్ చిత్రానికి మరో పేరు పెట్టాల్సి వస్తే..ఏం పెడతారు?’ అని యాంకర్ అడిగింది. దానికి నాని వెంటనే ‘సమ్మక్క’ అనే టైటిల్ ఈ కథకు వందశాతం సెట్ అవుతుందని చెప్పారు.(ఇదీ చదవండి: ‘రాకా’.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..)సమ్మక్క ఎవరు?నాని నోటి నుంచి సమ్మక్క అనే పేరు రావడంతో.. అసలు సమ్మక్క ఎవరు? భారీ యాక్షన్ కథకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని తల్లి పెరు ‘సమ్మక్క’ అట. ఇది తల్లి కొడుకు కథ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సార్లు చెప్పారు. తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పాడు. అందుకే నాని ఈ కథకు ‘సమ్మక్క’ అనే టైటిల్ సరిపోతుందని చెప్పాడు. (ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్లో..’) తల్లి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయట. ఈ సినిమాలో నాని తల్లిగా మరాఠి నటి సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్, క్యారెక్టర్ డిజైన్ గురించి ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్‌తో ఆ పాత్రను ఎలా చూపిస్తారనే అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. -
ది ప్యారడైజ్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు
-
‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.‘సినిమాకి చాలా కష్టపడ్డాను. కథ డిమాండ్ చేసింది కాబట్టే జడలు వేసుకున్నా. ఊరికే ఎవరైనా వచ్చి వేయమంటే వేయను. సోషల్‌మీడియాలో ఏ చిన్న తప్పు దొర్లినా ట్రోల్ అవుతోంది. కానీ కథకు అనుగుణంగా ఈ రిస్క్ తీసుకున్నా. ‘ఆయా షేర్’ సాంగ్ విడుదలైన తర్వాత రీల్స్ చేసేందుకు చాలా మంది జడలు కొన్నారట. సుమారు లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట. ఈ విషయం మా టీమ్ చెప్పింది’ అని తెలిపారు. Nani ki #Paradise lo jadalu pettadam…mother character thanaki koothuru kavali ani edho emotion valla ayyuntadha?Just a thought?? pic.twitter.com/yH4g7fTMAu— AlluArjunFANS (@AlluArjunFFANS) September 17, 2026 -
‘హీరో నానినే.. నా ఇన్స్పిరేషన్’
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.(ఇదీ చదవండి: నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు)డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమా ని ఒకే చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని అన్నారు. ఖాన్ దురాని మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాని సెప్టెంబర్ 18 బదులు సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నాం. పారడైజ్ కి పోటీ వెళ్తున్నారా అని చాలామంది అడిగుతున్నారు. మేము ఎవ్వరికీ పోటీ వెళ్లడం లేదు. మొన్న జరిగిన ఈవెంట్ లో కూడా చెప్పా నాని అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్’ అని అన్నారు. (ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!) -
ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే చైన్నైలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సినిమా చూసి వచ్చాక..నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఓ మంచి కథని భోవోద్వేగాలతో తెరపైకి తీసుకొస్తున్నాం. సినిమాపై చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పుడు నన్ను అంతా నాని అని పిలుస్తున్నారు. సినిమా చూసి వచ్చాక జడల్ అనే పేరుతో పిలుస్తారు. జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో మహిళలకు హ్యాట్సాఫ్. ఎందుకంటే జీవితాంతం ఆ జడలతోనే ఉంటారు. కయాదు చాలా బాగా నటించింది. సుబ్బు అనే పాత్రకు నూరుశారం న్యాయం చేసింది’ అని అన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)కాగా ట్రైలర్ లేకుండా డైరెక్ట్‌గా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదీ చదవండి: సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా? -
‘బిర్యానీ’ కోసం జుట్టు, గెడ్డం పెంచా.. యాక్షన్ సీన్స్ కూడా చేశా : సంపూర్ణేష్ బాబు
‘‘నేను ఇప్పటివరకూ చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. అయితే ‘ది ప్యారడైజ్’లో చేసిన బిర్యానీ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను వేరే ఏ సినిమాలు ఒప్పుకోలేదు. జుట్టు, గెడ్డం పెంచడంతో పాటు బరువు పెరిగి ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాను. యాక్షన్ సీన్స్ కూడా చేశాను. నా కెరీర్లో బిర్యానీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. (ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నాని, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘ది ప్యారడైజ్’ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని బిర్యానీ పాత్రకు లుక్ టెస్ట్ చేసి, సరిపోతానని నన్ను ఎంపిక చేశారు శ్రీకాంత్ ఓదెల. నానీగారి అనుచరుడిగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తాను. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా ఒప్పుకున్నాను. ‘ది ప్యారడైజ్’ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. -
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుతో వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్‌కు ఫ్లాట్‌గా రూ.400 ధర నిర్ణయించినట్లు, తొలి రోజు నుంచి పది రోజుల వరకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక జీవోలు రావాల్సి ఉంది.అయితే అసలు ప్రశ్న టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనేది కాదు.. ఎందుకు పెంచుతున్నారనేదే. కంటెంట్‌పై నమ్మకం ఉంటే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ‘ఇరుముడి’ వంటి సినిమాలు నిరూపించాయి.‘ది ప్యారడైజ్’ మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాను ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తూ ఓ రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుతో మరో రిస్క్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా.. లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలనుంది.తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 24 తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
ఏషనాగుల సాంగ్.. పుష్ప, దేవర రికార్డ్స్ బ్రేక్..!
నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ అభిమానులు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇటీవల రిలీజైన ఫోక్ సాంగ్ ఏషనాగుల ఏకంగా పూనకాలు తెప్పిస్తోంది. ఈ మూవీ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. విడుదలైన కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న టాలీవుడ్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఇదే క్రమంలో పుష్ప మూవీలోని ఊ అంటావా మావా, దేవర సినిమాలోని చుట్టమల్లే పేరిట ఉన్న రికార్డులను అధిగమించింది. కాగా.. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారు
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఒక రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాంన్నటాయి.వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. అయితే ఈ ది ప్యారడైజ్ మూవీ విడుదల కాకముందే అభిమానులు తమదైన స్టైల్లో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. విశాఖపట్నంలో ‘ది ప్యారడైజ్’ థీమ్‌ను తలపించేలా ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి పూజలు నిర్వహించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ( సమంత సీమంతం వేడుక.. అసలెందుకు ఇంత స్పెషల్?)ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్కాగా ఇటీవల‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్#TheParadise గణేష్ ….. pic.twitter.com/qGruzAux4L— Rajesh Manne (@rajeshmanne1) September 14, 2026 -
టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్‌కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో.. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు మొదలైంది.నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి నార్త్ అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 23న నార్త్ అమెరికా ప్రీమియర్ షోలు గ్రాండ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకున్నాయి.తాజాగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది ప్యారడైజ్’ 250K డాలర్ల మార్క్‌ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్లో తన సత్తా చాటుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ప్రీమియర్ షోల సమయానికి ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇక ‘ది ప్యారడైజ్’పై నాని అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘దసరా’కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.మొత్తానికి.. థియేటర్లలోకి రాకముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్లో రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్‌కు ఇంకా సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.#ThePARADISE North America PREMIERES PRE-SALES $250K and Counting 💥Bookings Open Now 🎟️Overseas By @PrathyangiraUS , Premieres On SEPTEMBER 23 👊@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/50lUAYqiTr— Vamsi Kaka (@vamsikaka) September 14, 2026 -
ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఆయా షేర్, ఏషనాగుల సాగ్స్ ఎలాంటి రికార్స్ సృష్టించారో చెప్పనవసరంలేదు. ఒక్క ఏషనాగుల సాంగే విడుదలైన కొద్ది రోజులకే 52 మిలియన్ వ్యూస్ దాటింది. మరి ఈ పాటలు పాడిన సింగర్‌కు ఎంత పారితోషకం ఇచ్చుంటారని సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా..ఈ పాటలను పాడింది సింగర్ జంగి రెడ్డి అని విషయం తెలిసిందే.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ తన రెమ్యునరేషన్ కోసం వెల్లడించారు. ‘ ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా చిన్నది. పాటల సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు ‘అంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుట్రైలర్ లేకుండానే సినిమా..కాగా ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
Hero Nani: మన టార్గెట్ ఒక్కటే కొడితే..!
-
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
మరో రెండు వారాల్లో నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మార్చి, ఆగస్టు అని చెప్పి రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలానే జరగొచ్చు అని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!'ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతడు నానితో 'దసరా' తీశాడు. ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎప్పుడు చూసినా గానీ శ్రీకాంత్ సీరియస్‌గా ఫేస్ పెట్టి కనిపిస్తుంటాడు. పెద్దగా నవ్విన సందర్భాలు కూడా లేవు. ఎవరో ఈ విషయమై కామెంట్ చేయగా.. దీనికి రిప్లై ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నా ముఖమే అంతా' అని ఓ మీమ్ ఫొటోని పోస్ట్ చేసి సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.పీరియాడికల్ సినిమాగా తీసిన 'ప్యారడైజ్'లో ప్రధానంగా తల్లికొడుకుల ఎమోషన్ ఉండనుందని హీరో నాని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ లాంటిది ఏం లేకుండానే చిత్రం థియేటర్లలోకి రానుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? దీని తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో మూవీ కమిట్ అయ్యాడు.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు😂♥️#TheParadiseWillRiseFromSept24 https://t.co/pw00Bli9v0 pic.twitter.com/Sb3obcARmG— Nani (@NameisNani) September 11, 2026 -
‘ది ప్యారడైజ్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. వైరల్‌గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. చదవండి: సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమఅయితే సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో మూవీ విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని చిత్ర బృందం మరోసారి ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 18 years of entertaining. And this year, the stage is all set to burn with #TheParadise 🔥🔥🔥Natural Star @NameisNani as JADAL 💥#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial musical 🎼… pic.twitter.com/sGx22f8BIK— SLV Cinemas (@SLVCinemasOffl) September 5, 2026 -
కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం కావడంతో అంచానాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్‌లు, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఏషనాగుల పాట ఇప్పటికీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో రీపోస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్, నాని ఇదే సాంగ్‌ను దసరా సినిమాలోని చమ్కీల సాంగ్‌తో మిక్స్ చేసి ఈ రెండు పాటలపై క్రాస్ ఓవర్ వీడియో చేశారు. అదికాస్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ50 మిలియన్లు దాటిన ఏషనాగుల..తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఏషనాగుల సాంగ్.. ఐదు రోజుల్లోనే అరుదైన రికార్డ్..!
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్ అభిమానులను అలరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మరో సాంగ్ విడుదల చేశారు.తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Yeshanagula sets an unprecedented record 🔥🔥Becomes the FASTEST TELUGU SONG TO HIT 50 MILLION+ VIEWS in under 5 days 💥💥#TheParadise second single is TRENDING #1 on YouTube Global Charts ❤🔥▶️ https://t.co/yqhCQaF2JdGRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star… pic.twitter.com/uVMACvbSOC— SLV Cinemas (@SLVCinemasOffl) September 3, 2026 -
మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
-
సినీ సెప్టెంబర్
ఆగస్టులో విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ తో సినిమా ఇండస్ట్రీకి మరింత ఊపిరి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఇది తెలుగు బాక్సాఫీస్‌కు మరింత ఊపునిచ్చింది. తాజాగా సెప్టెంబరులో కూడా ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఆశ్చర్యకరంగా స్ట్రయిట్ చిత్రాలతో పాటు సెప్టెంబరులో ప్రతివారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా కూడా ఉంది. లవ్, యాక్షన్, డివోషన్, ఎమోషన్, యూత్‌ఫుల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సెప్టెంబరులో సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి... ఏ వారం ఏయే సినిమా రిలీజ్ కానుందో, ఏ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ లుక్ వేయండి.రంభ... ఊర్వశి... మేనక భూలోకానికి వస్తే! సినిమా హీరో అవ్వాలన్నది సూరి ఆశయం. కానీ సూరి ఏ మాత్రం కష్టపడకుండా సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. షార్ట్‌కట్ లో తాను హీరో కావాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మాయా పుస్తకం సాయంతో ఏకంగా రంభ... ఊర్వశి... మేనకలను భూలోకానికి తీసుకువస్తాడట సూరి. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? సూరి ఆశయం నెరవేరి అతను సినిమా హీరో అయ్యాడా? ‘రంభ... ఊర్వశి... మేనక డ్రామా కంపెనీ’ సూరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది... అనేది ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో చూడొచ్చు. అల్లరి నరేశ్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ప్రేమ... హాస్యం... ఉత్కంఠ ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాల్లో మంచి ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను ఆడియన్స్ చూశారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమా మాత్రం ఎక్కువగా ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందడం విశేషం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ‘‘కాలేజీ స్టడీస్ పూర్తయిన తర్వాత కొంతమంది యువత లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేని విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ కాంప్లిసిటీ నేపథ్యంలో ‘రోమాంచకం’ సినిమా కథనం సాగుతుంది’’ అని ఇటీవల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ గురువారం ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే... నేడే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. లైఫ్ ఆఫ్ సంజు ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘సహా’ (లైఫ్ ఆఫ్ సంజు). శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిశాంత్ కోదాటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వేల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది. ‘‘సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్ చేస్తుంది. ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను కథలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ ఎంటర్టైనర్ సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజక వర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట మేకర్స్. అవినీతి, డ్రగ్ మాఫియాలపై ఓ సామాన్యుడు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నటి కస్తూరి ఈ సినిమాలో ఓ విలన్ రోల్ చేశారని టాక్. వారాహి అమ్మవారి శాపం ఎందుకు? సుమంత్ హీరోగా నటించిన ఆధ్యాతి్మక మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. దాదాపు 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.మధ్యతరగతి జీవితాలు ‘బేబీ’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మధ్య తరగతి యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ పడే కష్టాలు, వారి కుటుంబాల ఇబ్బందులు ... వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే లవ్, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. విలేజ్ యాక్షన్ డ్రామా నటుడు–నిర్మాత రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ విలేజ్ యాక్షన్ డ్రామా సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, దీపా బాలు హీరోయిన్గా నటించారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆ ఊరి గ్రామదేవతకు ఓ ఆంబోతును సమరి్పస్తారు గ్రామస్థులు. కానీ సడన్‌గా, అది అదృశ్యం అవుతుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నదే ఈ సినిమా కథనం అని సమాచారం. ప్రేమకథ వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లు గా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం లో కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈ సెపె్టంబరు 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ‘‘మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. మా సినిమా చూస్తే మీ ప్రేమకథ గుర్తుకు వస్తుంది’’ అని ఈ సినిమా గురించి దర్శకుడు ఎంజీఆర్ తుకారాం చెప్పారు. స్పై డ్రామా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి, యాక్షన్, థ్రిల్, స్పై యాక్షన్ డ్రామా, హ్యూమర్ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. జడల్ జమానా నాని హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘దిప్యారడైజ్’. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని కపిస్తారు. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘ఏష నాగుల గట్టుపైన..’ అనే స్పెషల్ సాంగ్‌లో కీర్తీ సురేష్ డ్యాన్స్ చేశారు. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. ‘దిప్యారడైజ్’ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేశారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఐడెంటిటీ, ఆధిపత్య పోరు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెప్టెంబరు నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.⇒ ఈ సెప్టెంబరు నెలలో వారానికొక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు తెరకు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్ వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెప్టెంబరు 3న విడుదలæ కానుంది. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు –దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జిమ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ⇒ మలయాళ నటుడు నివిన్ పౌలి హీరోగా, మమితాౖ బెజు హీరోయిన్గా నటించిన లవబుల్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబయూనిట్’. సూపర్‌హిట్ ‘ప్రేమలు’ ఫేమ్ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబరు 4న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. వయసు వ్యత్యాసంతో కూడిన లవ్‌స్టోరీగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ⇒ సూపర్‌హిట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఆధారంగా ‘మిర్జాపూర్:ది మూవీ’ అనే హిందీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి, అభిషేక్. బి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ⇒ తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘సర్దార్ 2’. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్లు ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు కార్తీ. దేశభక్తి, తండ్రీ కొడుకుల భావోద్వేగం ప్రధానంగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా కలిసి ‘సర్దార్ 2’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలæకానుంది. ⇒ తెలుగు హీరో సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా ‘మండాడి’. ఈ చిత్రంలో సూరి, సుహాస్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. సుహాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. సముద్రంపై సాగే పడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది. ⇒ కీర్తీ సురేష్ ప్రధాన పాత్రధారిగా సనంత్, రిషికాంత్ ఇతర కీలక పాత్రధారులుగా నటించిన పీరియాడికల్ విలేజ్ డ్రామా ‘డొరోతి’. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీ™Œ æమోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. స్నేహం, ఆశ, ఆశయం, పక్షపాత ధోరణి వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని కోలీవుడ్ టాక్.ఈ సినిమాలే కాకుండా... జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘ఇమ్మోర్టల్’, ‘డీమాంటీ కాలనీ 3’ వంటివి సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కోవలో మరికొన్ని పరభాషా సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆయా షేర్ సాంగ్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.ఇటీవలే ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏషనాగుల కట్టమీద అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ఊహించని విధంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది.తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో ఓ రిక్షాలో సందడి చేశారు. ఈ క్రమంలో ఏషనాగుల పాట బీట్‌కు దరువు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. NANI & ANI are us. Vibing to #YeshaNagula everywhere and anywhere 🔥🔥#TheParadise second single is TRENDING #1 on YouTube ▶️ https://t.co/ffTvysQUod pic.twitter.com/9jIf1NfADQ— THE PARADISE (@TheParadiseOffl) August 31, 2026 -
'యెష నాగుల' సాంగ్ తో సోషల్ మీడియా షేక్..!
-
'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)
-
ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. మీరు విన్నారా?
నాని 'ప్యారడైజ్' సినిమా వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. చెప్పాలంటే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి. తొలుత మార్చి అనుకున్నారు కుదరలేదు. ఆగస్టుకి వాయిదా వేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబరు అంటున్నారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.ఆరు నెలల క్రితం ఈ సినిమాలోని 'ఆయా షేర్' పాట రిలీజ్ చేయగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'యేషనాగుల' అంటూ అందరికీ తెలిసిన తెలంగాణ ఫోక్ సాంగ్‌ని ఈ మూవీ కోసం రీక్రియేట్ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో అనిరుధ్ స్వయంగా ఈ పాటని ఆలపించి రిలీజ్ చేశాడు. యూట్యూబ్, స్ఫూటిఫై లాంటి వాటిలో ఆడియో వదిలారు. వీడియో సాంగ్ కూడా తాజాగా రిలీజ్ చేశారు.సోషల్ మీడియాలో 'యేషనాగుల' సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఒరిజినల్ పాట పాడిన జంగిరెడ్డి దీనిని కూడా అలపించగా, ఈయనతో పాటు ప్రభ కూడా పాడింది. సినిమాకు తగ్గట్లు కొన్ని కొత్త లిరిక్స్ కాసర్ల శ్యామ్ రాశారు. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ప్రస్తుతం శ్రోతలకు తెగ నచ్చేస్తోంది. -
చిన్న కరెక్షన్!
విమర్శలను కూల్‌గా ఎదుర్కోవడం ఒక కళ. అందుకు తాజా ఉదాహరణ కీర్తి సురేష్. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కీర్తి ఒక స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. కీర్తి ఈ పాట చేయడాన్ని విమర్శిస్తూ, ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. అవకాశాలు లేక ఇలా ఐటమ్ సాంగ్ చేసిందని ఆ యువతి విమర్శించింది. పైగా కన్నడ సినిమా ‘ది ప్యారడైజ్’లో కీర్తి నటించినట్లుగా పేర్కొంది.ఈ విమ ర్శకు కీర్తి సురేష్ కూల్‌గా సమాధానం ఇచ్చారు. ‘వేరే లెవెల్ (కన్నడ సినిమా అని చెప్పడాన్ని ఉద్దేశించి అయ్యుండొచ్చు)... చిన్న కరెక్షన్... నాని నటిస్తున్నది తెలుగు సినిమా... కన్నడ సినిమా కాదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కీర్తి స్పందించారు. అంతే... ‘భలే చురక వేశావ్... సరైన రీతిలో చె ప్పావ్’ అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక నాని–కీర్తి సురేష్ ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 24న విడుదల కానుంది. -
భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్?
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మరో క్రేజీ ఆఫర్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి వరుసగా క్రేజీ సినిమాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ‘లెనిన్’తో ఆమెకు తొలి సాలిడ్ హిట్ దక్కింది. ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళంలో కూడా శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. -
నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. దిష్టి తీయాల్సిందే..!
-
జడల్ జమానా షురూ.. మోస్ట్ వయొలెంట్ టీజర్ చూశారా?
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే కథ ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. యాక్షన్‌లో సీన్స్‌లో ఎక్కడా చూసినా రక్తపాతమే కనిపిస్తోంది. ఈ ఫుల్ వయొలెంట్ టీజర్ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ మూవీ మోహన్‌బాబు పాత్ర హైలెట్‌గా ఉండనుందని టీజర్లో తెలిసిపోతోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
ఇంటి నుంచే లొకేషన్‌కి...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు భలే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ స్వదేశంలో జరుగుతుంటే మరికొన్ని చిత్రీకరణలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా చిత్రీకరణలతో ఆయా సెట్స్‌లో సందడి నెలకొంది. లోకల్లోనే షూటింగ్ కాబట్టి ఇంటి నుంచే షూటింగ్‌కి వెళ్లి సందడి సందడిగా షూటింగ్ చేస్తున్నారు స్టార్స్. ఇలా ‘కేరాఫ్ హైదరాబాద్’ అంటూ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు, సాయిదుర్గా తేజ్... తదితర హీరోలు తమ మూవీ షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం... ఆర్ఎఫ్సీలో... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిరుబాబీ 2’ (వర్కింగ్ టైటిల్). చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నివేత పేతురాజ్, అనశ్వరా రాజన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట బాబీ.‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బాబీ కొల్లి ‘మెగా 158’లో చిరంజీవిని పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత ఫెరోషియస్ లుక్‌లో ప్రజెంట్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం 12 గంటల పాటు వర్షంలో తెరకెక్కించిన ఓ ఫైట్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అజీజ్ నగర్లో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేష్–డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. వెంకటేశ్–కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ‘వెంకీఅనిల్ 5, ఎన్‌కేఆర్‌ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని నటీనటులు పాల్గొంటుండగా కీలక సీన్స్ తీస్తున్నారట అనిల్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ గా నటించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. కోకాపేటలో... ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘ఫౌజి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ మూవీని ఈ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శంషాబాద్‌లో... మహేశ్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.ఈ సినిమా కోసం మహేశ్ బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో సగటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారట వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘సింగ’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేసింది యూనిట్. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్ కూడిన పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ‘సింగ’ సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు ముఖ్యమైన నటీనటులపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. పీరియాడిక్ యాక్షన్ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘ది ప్యారడైజ్’లో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి విడుదల కాక పోవచ్చని, సెప్టెంబరు 24న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ‘‘19వ సెంచరీ నేపథ్యం కథతో రూపొందుతోన్న చిత్రం ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ మూవీలోని విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సెప్టెంబరు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. శంకరపల్లిలో... వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించింది. ఆ హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబోలో ద్వితీయ చిత్రం రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్ తీస్తున్నారు రామ్ అబ్బరాజు. తొలి చిత్రంతో కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబినేషన్ రెండో సినిమాతో ఏ మేర నవ్వులు పంచనున్నారో వేచి చూడాలి. శంకరపల్లిలో... సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ‘‘తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు సాయి దుర్గాతేజ్. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ కథనం, ఉత్కంఠ భరితమైన విజువల్స్, హై యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు రోహిత్. చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రోడక్షన్ పనులను ప్రారంభిస్తాం. ఈ సినిమాని డిసెంబరులో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ్రపాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్‌తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఓజీ-2 ప్రకటన వెలువడిన తర్వాత నాని-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం, లొకేషన్ల పరిశీలన చేపట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి ప్రాజెక్ట్‌గా 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం లండన్‌లో కీలకమైన, భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్ పూర్తిస్థాయిలో ఓజీ-2 పనులపై దృష్టి సారించనున్నాడు. -
హీరో నాని నిర్మాతగా... నితిన్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
నాని-నితిన్ 'అలియాస్ రుక్మిణీ'.. గ్లింప్స్ చూశారా?
'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న నాని.. నిర్మాతగా కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దీనికి దర్శకుడు. తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'అలియాస్ రుక్మిణీ' అనే అచ్చ తెలుగు పేరుని ఫిక్స్ చేశారు.ఇంజినీరింగ్ బుక్స్ ముందేసుకుని పడుకునే హీరోని చూపిస్తూ.. గరం గోపాల్, ఆమెకు ఆమెంటే ఇష్టం, వ్రతం వెంకన్న పుస్తకాల్ని చూపించారు. వీటిని రాసింది రుక్మిణి అనే మహిళ. ఈమె ఎవరా అని మనం ఆలోచిస్తుండగా.. ఆమె నా భార్య అని హీరో పాత్రధారి అయిన నితిన్ చెప్పడం బాగుంది. మరి రొమాంటిక్ నవలలు రాసే భార్య ఉన్న హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేది స్టోరీనా అనిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం బాగుంది. -
వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్ ఎప్పుడు?
టాలీవుడ్లో రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్న తీరు కొత్తేం కాదు. కానీ ఇటీవలి కాలంలో చాలా సినిమాల రిలీజ్లు వాయిదాలు పడుతున్నాయి. ‘పెద్ది, లెనిన్, మా ఇంటి బంగారం’... ఇలా పలు చిత్రాలు తమ తొలి రిలీజ్ డేట్‌ను మార్చుకుని, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే. ఈ కోవలో మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్‌ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. కొన్ని సినిమాల రిలీజ్‌లకు ఓటీటీ డీల్స్ అడ్డంకిగా మారితే, మరికొన్ని సినిమాలు వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల వాయిదా పడుతున్నాయి. మరి... ఏ సినిమాల రిలీజ్లు గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతున్నాయి? ఏ సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా కన్ఫార్మ్ కావాల్సి ఉంది? అన్న విషయాలపై ఓ లుక్ వేయండి.సత్య లోకానికి దారేది?చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్స్‌గా నటించగా, కునాల్ కపూర్ విలన్ రోల్లో చేశారని తెలిసింది. బాలీవుడ్ కథనాయిక మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా గత ఏడాది సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది వేసవికి ‘విశ్వంభర’ సినిమా విడుదలవుతుందని ఓ సందర్భంలో యూనిట్ పేర్కొంది. కానీ ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది.‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమా గురించిన విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్స్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ ఈ తరహా విమర్శలు పునరావృతం కాకూడదని చిత్రయూనిట్ పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ను చాలా జాగ్రత్తగా చేస్తోందట. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నీ ప్లాన్ చేసినట్లుగా సాగితే ఈ సినిమాను అక్టోబరు 16న రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్రస్తుత ప్లాన్ అని తెలిసింది.ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి, అవని అనే పాత్రలో త్రిష నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను నిర్మించారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక పద్నాలుగు లోకాలు దాటి సత్య లోకానికి వెళ్లి అక్కడ్నుంచి హీరోయిన్ను హీరో ఎలా తిరిగి తీసుకు వస్తాడనే అంశం ఆధారంగా ‘విశ్వంభర’ కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ప్రయాణంలో విశ్వంభర అనే పుస్తకం కథలో కీలకంగా ఉంటుందని తెలిసింది.డిసెంబరులో ఫౌజి దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అండ్ లవ్‌స్టోరీ సినిమా ‘ఫౌజి’. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్ ఈ చిత్రంతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తెలిసింది. ప్రధాన కథాంశం రజాకార్ల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ కార్యకలా పాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ దేశభక్తి చిత్రంలో హను రాఘవపూడి ప్రస్తావించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే హీరో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఇక ‘ఫౌజి’ సినిమాను తొలుత ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాక పోవడం,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌పై టీమ్ మరింత ఫోకస్ పెట్టాలనుకోవడం వంటి కారణాల చేత ఈ సినిమా రిలీజ్ దసరాకు సాధ్యపడలేదట. ఇటీవల ‘ఫౌజి’ చిత్రాన్ని 2026 డిసెంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం లేక పోలేదనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తుండటం మరో విశేషం. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.రాకా రాక ఎప్పుడు? ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్ చేస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.మేకర్స్ అయితే షూటింగ్‌ను ఈ ఏడాదే ముగించే పనిలో ఉన్నారని తెలిసింది. కానీ ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే అట్లీ సృష్టించారని, దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. అందుకే ‘రాకా’ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ముగిసినా రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. జడల్ జమానా ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1980 కాలం నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని, సుబ్బుగా కయాదు లోహర్, శిఖంజా మాలిక్‌గా మోహన్‌బాబు, విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ (బాలీవుడ్ ‘కిల్’ సినిమా ఫేమ్..), బిర్యానిగా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు. బాబుమోహన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ప్రముఖ కథనాయిక కీర్తీ సురేష్ పాల్గొంటుండగా, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ను యూనిట్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 26నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్వాలిటీ, కంటెంట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని నాని, శ్రీకాంత్ డిసైడ్ కావడంతో ఈ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 21కి వాయిదా వేశారు.ఈ నెల 21న కూడా విడుదల కావడం లేదని, కాంప్రమైజ్ లేకుండాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి చేసేందుకు యూనిట్‌కు మరికొంత సమయం కావాల్సి వచి్చందని, దీంతో ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ నెల 6న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్లో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.నిధి అన్వేషణ ‘తండేల్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘వృషకర్మ’. ‘విరూ పాక్ష’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మిథికల్ థ్రిల్లర్ సినిమాలో అర్జున్ పాత్రలో నాగచైతన్య, ఆర్కియాలజిస్ట్ దక్షగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను తొలుత ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కాలేదు.అయితే ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో సాగుతుందని, కొన్ని మైథాలజీ, హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సక్సేనా సహ–నిర్మాతగా వ్యవహరిస్తుండగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.రణబాలి ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. విజయ్ దేవరకొండకు ‘టాక్సీవాలా’ వంటి హిట్ సినిమాను అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణబాలిగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.హాలీవుడ్ నటుడు ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ మూవీలో విలన్ సార్ థియోడర్ హెక్టార్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వంద రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ 90 శాతం పూర్తయింది. కాగా, ఈ సినిమాను ఈ ఏడాది సెపె్టంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ సెప్టెంబరు 11న ‘రణబాలి’ సినిమా విడుదల కాక పోవచ్చని తెలిసింది. తాజాగా హీరోయిన్ రష్మికమందన్నా గాయపడ్డారు. ఆమెకు ఆరు వారాలు వైద్యులు విశ్రాంతి సూచించారు. ఈ ప్రభావం కూడా ‘రణబాలి’ చిత్రంపై పడుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది దీ పావళి సందర్భంగా నవంబరు 6న ‘రణబాలి’ సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట మేకర్స్.అయితే ఈ కొత్త విడుదల తేదీపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. టీ సిరీస్ ఫిల్మ్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్–అతుల్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ అనే ఓ పీరియాడికల్ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి... దీ పావళికి ‘రణబాలి’ విడుదలై, ఆ వెంటనే డిసెంబరులో ‘రౌడీ జనార్ధన’ సినిమా కూడా విడుదలైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది? మరి.. ఇలానే జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సెంగోల్ రక్షణ నిఖిల్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ విడుదల తేదీని ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఆ తేదీకి కూడా రిలీజ్ కాలేదు. వేసవిలో రిలీజ్ అనే ప్రచారం జరిగినప్పటికీ అదీ జరగలేదు. అంతేకాదు... ఈ చిత్రం రిలీజ్‌పై ఇప్పటికీ సరైన స్పష్టత రాలేదు. మేకర్స్ అయితే ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కానీ భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్,పోస్ట్ ప్రోడక్షన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో ఓ వారియర్ పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. సెంగోల్ అనే ఓ రాజచిహ్నం రక్షణ అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం అని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకు తోడుగా ఓ గుర్రం ఉంటుందని తెలిసింది.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారని, సుబ్బరాజు మరో కీలక పాత్రపోషించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.డిసెంబరులో ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్‌పై స్పష్టత రాలేదు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇలా రిలీజ్ డేట్లు ప్రకటించి, ఇంకా విడుదల మార్చుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే షూటింగ్ స్టార్ట్ చేసి ఏడాది పైనా అవుతున్నా రిలీజ్ డేట్లు ఇంకా ఖరారు చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
నాని 'ప్యారడైజ్' నుంచి క్రేజీ అప్డేట్
హీరో నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా ద 'ప్యారడైజ్'. సాధారణంగా ఏడాది రెండు మూడు మూవీస్ చేసే నాని.. దీని కారణంగా వేరే ప్రాజెక్టులేం చేయట్లేదు. లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. అయితే ఈసారి కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ చర్చ అలా ఉండగానే టీజర్ అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)ఆగస్టు 06న అంటే వచ్చే గురువారం నాడు 01:35 నిమిషాల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా దీనితో పాటు విడుదల తేదీపైనా క్లారిటీ ఇస్తారేమో. ఇకపోతే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, కాయదు లోహర్ జంటగా నటించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయోల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పటికే 'ఆయా షేర్' అనే పాట రిలీజైంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్) -
‘ది ప్యారడైజ్’లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆమెకే చాన్స్!
ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పుటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రచార కంటెంట్.. సూపర్ హిట్‌గా నిలిచింది. పాటలు అయితే దుమ్మురేపుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. సంగీత దర్శకుడు అనిరుధ్ ఆ పాటను మరింత స్పెషల్‌గా తీర్చిదిద్దాడట. ఈ పాట కోసం మరో క్రేజీ హీరోయిన్ని రంగంలోకి దించబోతన్నట్లు సమాచారం. ఆ క్రేజీ బ్యూటీ మరెవరోకాదు..గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’మూవీ హీరోయిన్ కీర్తి సురేశ్.ఫైనల్‌గా కీర్తి.. స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అనిరుధ్. ఆయన ఇప్పటి వరకు అందించిన ప్రతి ప్రత్యేక పాట సూపర్ హిట్ అయింది. ఇందులో కూడా పాట పెట్టాలని ముందే భావించారట. అయితే ఆ పాట కోసం ఎవర్నీ తీసుకుందామా అని చాలా రోజులుగా ఆలోచించారట. ఫైనల్‌గా కీర్తి సురేశ్‌ని అనుకున్నారట. నాని, కిర్తి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరికి తెలుసు. ఆ చనువుతోనే నాని... కీర్తిని అడిగాడట. ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో భారీ సెట్..ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని వేశారట. రేపటి నుంచి అందులోనే ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. దాదాపు 1000 మందికి పైగా జానియర్ ఆర్టిస్ట్‌లు, డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుటికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ సరైర సమయానికి పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదిని ప్రకటించబోతున్నారు. -
ఆగస్టులో పండగే పండగ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాల పండగ అంటే సంక్రాంతి అని ఠక్కున చెప్పేస్తారు. తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి వంటి పండగలకు కూడా పలు చిత్రాలు రిలీజ్‌కి ముస్తాబవుతుంటాయి. అదే విధంగా వేసవి సెలవుల్లోనూ సినిమాల సందడి నెలకొంటుంది. ఈ ఏడాది వేసవి పూర్తయింది.అయితే ఈసారి ఆగస్టు నెలలో కూడా వెండితెరపై సినిమాల సందడి ఓ రేంజ్లో ఉండనుంది. ఇప్పటికే రవితేజ ‘ఇరుముడి’, యశ్ ‘టాక్సిక్’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నాని ‘ది ప్యారడైజ్’, శర్వానంద్ ‘భోగి’, వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వంటి సినిమాలతో పాటు ‘అగధ, అనకాపల్లి, హుషారు పిట్టలు’ వంటి సినిమాలు ఆగస్టు స్లాట్‌ను బుక్ చేసుకున్నాయి. అదేవిధంగా మహేశ్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దూకుడు’ కూడా రీ రిలీజ్ కానుంది. మరి... ఆగస్టులో వెండితెరపై సందడి చేయనున్న ఆ సినిమాల విశేషాలు ఏంటో చూద్దాం... 7న కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్–ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందింది. హారర్, కామెడీ, ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషించారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని చక్కగా బ్లెండ్ చేస్తూ వినోదాత్మకంగా మేర్లపాక గాంధీ ఈ కథను తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సౌత్ కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు, ముఖ్యమైన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. హీరో ప్రభాస్ విడుదల చేసిన మా మూవీ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. 7న అనకాపల్లి విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ముఖ్య పాత్రను పోషించారు త్రినాథరావు నక్కిన. తారక్ పొన్నప్ప, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ ఇతర పాత్రలు పోషించారు. భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు.కాండ్రేగుల కుమార్ రాజా కోప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. ‘‘రా అండ్ రస్టిక్ మూవీగా ‘అనకాపల్లి’ రూపొందింది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దేవ్ జండ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అమ్మోరు దిగినాది...’, ‘లబ్బరు బొమ్మ...’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. అలాగే రొమాంటిక్, ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల...’కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. 14న అగధ ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అగధ’. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘ఈ మూవీలో మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల నటించగా ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌కి, జోవిక విజయ్ కుమార్ నటించిన హరిణి పాత్ర క్యారెక్టర్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చింది.‘అగధ’ నా కలల ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్లా అనిపించే సినిమా ఇది. భావోద్వేగాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవిక తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన మా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. 14న పళ్ళ బురుసు ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఆ... ఏందిరా పళ్ళ బురుసా? తేలేదురా, ఈడు పళ్ళ బురుసు తేడు... నా నొప్పి తక్కువ కాదు’ అంటూ సుధాకర్ రెడ్డి, ‘నా బిడ్డ పెళ్లి... మా అయ్య లొల్లి... ఏందో ఈ పళ్ళ బురుసు’ అంటూ మురళీధర్ గౌడ్ చెప్పే డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి. 15న హుషారు పిట్టలు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు బిక్ష, నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే కొంతమంది తెలియక బ్యాడ్ కామెంట్లు పెట్టారు. కానీ, సినిమా విడుదల తర్వాత మా చిత్రంలో ఉన్న అసలు కథ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఎంతో ఫ్రొఫెషనల్‌గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల తర్వాత అందరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇతర భాషల వాళ్లు ‘హుషారు పిట్టలు’ గురించి మాట్లాడుకుంటారు’’ అని తెలిపారు. 21న ఇరుముడి... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ‘ఇరుముడి’ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ వంటి అంశాలు ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. 21న దిప్యారడైజ్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘దిప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించినా వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఫైనల్‌గా ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రత్యేకించి ఆ తేదీకి ఎందుకంటే వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసి వస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీని ఫిక్స్ చేసిందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘పాన్ వరల్డ్ మూవీ ‘దిప్యారడైజ్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్డేట్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాని ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 26న టాక్సిక్ ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీపై రూపొందిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఆగస్టు 26న విడుదల కానుంది.ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 2026 మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేసి, జూన్ 4న విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ వాయిదా పడి, ఫైనల్‌గా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ మిశ్రా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘తబాహీ...’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. 14న విశ్వనాథ్ అండ్ సన్స్సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘సార్ (వాత్తి), లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాల తర్వాత నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సూర్య పాత్ర సరికొత్తగా ఉంటుంది. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి హిట్స్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ స్థాయిలో రూపొందిన మా చిత్రం కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే అంశాలతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘నేనో బటర్ ఫ్లై...’కి మంచి స్పందన వచ్చింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందే ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. 30న దూకుడు రీ రిలీజ్మహేశ్బాబు హీరోగా నటించిన చిత్రం ‘దూకుడు’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రశాష్రాజ్, ఎమ్మెస్ నారాయణ, నాజర్, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుమన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా 2011 సెప్టెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ మూవీని ఆగస్టు 30న 4కె వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘దూకుడు’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటించిన ‘ పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 28 న భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న పాన్–ఇండియా పీరియడ్ యాక్షన్ మూవీ ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో రక్షా బంధన్ పండగ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రం విడుదల కానుంది.‘‘1960ల నాటి నేపథ్యంలో సాగే ‘భోగి’ చిత్రం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు, ఈ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ తొలిసారి కలిసింది.ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పుట్టినరోజు పోస్టర్లకు అదిరి పోయే రెస్పాన్స్ వచ్చింది. పల్లెటూరి యువతిగా అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు. మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
దిల్ రాజు చేతికి ది ప్యారడైజ్.. నిర్మాత ఏమన్నారంటే?
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది. అయితే మరోసారి కూడా వాయిదా పడనుందనే వార్తలొస్తున్నాయి.ది ప్యారడైజ్ వాయిదా వార్తల వేళ మరో న్యూస్ టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. నాని మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారని ఓ టాక్ వైరలవుతోంది. తాజాగా ఈ వార్తలపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. అలాంటిదేం జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పంపిణీ హక్కుల గురించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని కోరారు. ఏదైనా అధికారిక సమాచారం మా అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతో ది ప్యారడైజ్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లైంది. -
నాని–నితిన్ కాంబోలో కొత్త ప్రాజెక్టు.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
నేచురల్ స్టార్ హీరో నాని నిర్మాతగా, నితిన్ హీరోగా ఒక కొత్త సినిమా దాదాపు ఖరారైనట్టే సమాచారం. గత ఏడాది వచ్చిన ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి నచ్చడంతో, తన సొంత బ్యానర్‌పై ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆమెతో ఈ చిత్రంపై చర్చలు జరిగాయి. అనంతరం రుక్మిణి నుంచి సరే చూద్దాం అన్న స్థాయిలోనే మాట ముగిసిందని సమాచారం. కానీ ఈ సినిమాలో నితిన్ సరసన రుక్మిణి వసంత్ ఫిక్స్ అయింది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. ప్రస్తుతం నితిన్ ఓ సినిమా షూట్లో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు ఆయన బిజీగా ఉండే అవకాశం ఉంది. రుక్మిణి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ నాటికి ఆమె తన కాల్షీట్లు సర్దుబాటు చేయగలనో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు మాత్రమే చర్చలు జరిగాయి. అధికారికంగా దీనిపై రుక్మిణి ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాని కూడా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూట్లో ఉన్నాడు. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాతే ఈ కొత్త ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వనున్నాడు. ఆ తరువాతే రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఉంటుందో లేదో తేలిసే అవకాశం ఉంది. -
నాని ది ప్యారడైజ్.. ముచ్చటగా మూడో 'సారీ'..!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది.తాజాగా ఈ మూవీ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 21న ది ప్యారడైజ్ రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24కు పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేశారని సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్స్‌కు తగినంత సమయం కావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
జోరుగా హుషారుగా...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ప్రత్యేకించి హైదరాబాద్‌లో తెలుగు చిత్రాల మూవీస్ షూటింగ్స్ సందడి జోరుగా హుషారుగా ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. వెంకటేశ్, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, కల్యాణ్ రామ్, శ్రీ విష్ణు వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో జోరుగా హుషారుగా పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం...శంషాబాద్‌లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్‌బాబు రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంకా చోప్రా మందాకినిగా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇందులోని రామాయణం ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా సెట్ వేయించారు. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబు లేకున్నప్పటికీ కీలక తారాగణంపై ఈ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రాజమౌళి.ఈ సినిమా చిత్రీకరణకు కాస్త బ్రేక్ రావడంతో కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన మహేశ్‌బాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 16 నుంచి ఆయన ‘వారణాసి’ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు మోకిలా... ఇటు శంకర్పల్లి హీరో వెంకటేష్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా, అటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ... ఇలా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారాయన. వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఐదో సినిమాగా, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబోలో రెండో సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘వెంకీఅనిల్5, ఎన్‌కేఆర్‌ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన భారీ సెట్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలిలో వినోదాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ‘‘వెంకటేష్–కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ అనుబంధం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ పుట్టినరోజు (జూలై 5న) సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 2న విడుదల కానుంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో గోపీచంద్ కూడా స్పీడ్ పెంచారు. ఓ వైపు ‘సింగ’, మరోవైపు ‘భరతవర్ష’ మూవీస్‌తో బిజీగా ఉన్నారాయన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘సింగ’ ఒకటి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను యూనిట్ రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్.. గోపీచంద్‌ని ఎంత పవర్ఫుల్ మాస్ లుక్‌లో చూపించనున్నారో గ్లింప్స్‌తోనే చూపించాం.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించనున్నారాయన. యాక్షన్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా వెంకట్ చేస్తున్న ఈ ప్రయాణంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అజీజ్ నగర్లో... హీరో ప్రభాస్ యమా జోరు మీద ఉన్నారు. వరుస పాన్ ఇండియన్ మూవీస్‌తో దూసుకెళుతున్నారాయన. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్, ఫౌజీ, కల్కి 2’ వంటి సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్‌తో పాటు కీలక తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట సందీప్ రెడ్డి. ‘‘భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్‌తో రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రం ప్రేక్షకులకు ఓ ఇంటెన్స్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకుట్టుకునేలా ఈ మూవీని రూపొందిస్తున్నాం. 2027 మార్చి 5న 8 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ సినిమా విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారట దర్శకుడు.ఈ మూవీలో ఓ లుక్‌లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిసింది. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘డ్రాగన్’ మూవీపై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ బజ్ నెలకొంది. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ ప్రాంతంలోని అంతర్జాతీయ అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్ అనే పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా ‘రణబాలి, రౌడీ జనార్థన’ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘రణబాలి’ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.విజయ్ దేవరకొండతో పాటు ఈ మూవీలోని ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట రాహుల్. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. విజయ్ దేవరకొండ బర్త్ డే (మే 9) సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లోని యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.భారీ అంచనాలున్న మా సినిమాని సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్‌పల్లిలో... శ్రీ విష్ణు హీరోగా రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కామ్రేడ్ కళ్యాణ్’ కాగా మరో చిత్రానికి డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) ఘన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది.మై త్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాకు ‘ఫ్యామిలీప్యాక్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.టైటిల్‌కు తగ్గట్టే ఈ మూవీలో కంప్లీట్ కామెడీతో పాటు ఎమోషన్స్ ఉంటాయని, కుటుంబ సభ్యులందరూ చూసేలా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్‌కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్‌తో వింటేజ్ హెయిర్ లుక్‌లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్‌తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
న్యాయ వ్యవస్థకే తలవంపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నానిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవ్యవస్థ అంటే తమకు అపార గౌరవమని తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ నేతలు ఈ విధంగా న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం తీరు చూస్తుంటే ఈ వైఖరిని ప్రోత్సహిస్తున్నట్లుందని తప్పు పడుతున్నారు. నానిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేని పక్షంలో ఆందోళనకు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ను విమర్శించినా, తప్పులను ఎత్తిచూపినా వెంటనే అరెస్ట్ చేయిస్తున్న ప్రభుత్వానికి.. పులివర్తి నాని బూతులు, బెదిరింపులు వినిపించకపోవడం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ న్యాయమూర్తులే లక్ష్యంప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ పచ్చ మూకలు న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేస్తూ చెలరేగిపోయాయి. చంద్రబాబుకు లేదా తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చినా, తీర్పులు ఇచ్చినా సహించలేని పచ్చ ముఠాలు సోషల్ మీడియా వేదికగా దూషణలు సాగించాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు రిమాండ్ విధించిన మహిళా న్యాయాధికారిని అత్యంత జుగుప్సాకరంగా, అసభ్య పదజాలంతో కొన్ని నెలలపాటు దూషిస్తూ వచ్చాయి. అలాగే కొందరు హైకోర్టు న్యాయమూర్తులను సైతం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దారుణంగా దుష్ప్రచారం సాగించారు. వీటిని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నానికి కొమ్ముకాస్తున్న టీడీపీ పెద్దలు వృద్ధ దంపతులు దశాబ్దాల క్రితం కష్టపడి కొనుక్కున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకోవడమే కాకుండా, దానికి అడ్డుపడిన వారిపై అధికార బలంతో పులివర్తి నాని విరుచుకుపడటం, అతనికి అధికార పార్టీ పెద్దలు కొమ్ము కాయడం రాజకీయ దురహంకారానికి పరాకాష్టగా న్యాయవర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఆ వృద్ధ దంపతుల తరఫున కేసు వాదించేందుకు ముందుకొచ్చిన రిటైర్డ్ జడ్జిపై అధికార పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని వాడిన పదజాలం వింటే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక రౌడీల రాజ్యంలో ఉన్నామా.. అనే అనుమానం కలగక మానదు. జడ్జిలకు, న్యాయవాదులకు రక్షణ లేకపోతే, ఇక సామాన్య పౌరుడి గతి ఏమిటనే ప్రశ్న ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు భూ కబ్జాలు చేస్తూ, మరోవైపు అడ్డు వచ్చిన వారిని బెదిరించడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రజల ఆస్తులనే దోచుకుంటూ, ప్రశ్నించిన వారిని బెదిరించడం బాబు పాలనలోని నియంతృత్వ ధోరణిని సూచిస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి.న్యాయ వ్యవస్థను కించపరచడమేపులివర్తి నాని అసభ్యకర దూషణలు, బెదిరింపులు న్యాయ వ్యవస్థను కించపరచడమే. ఇది కోర్టు ధిక్కారం కూడా. రిటైర్డ్ జడ్జిని తిట్టినా, పదవిలో ఉన్న జడ్జిని తిట్టినా.. అది క్షమించరాని నేరం. హైకోర్టు దీనిపై సుమోటోగా చర్యలు చేపట్టాలి. రిటైర్డ్ జడ్జికి రక్షణ కల్పించాలి.– జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇంత అసహనమా?ఎమ్మెల్యే పులివర్తి నాని చర్యలు ముమ్మాటికీ న్యాయ వ్యవస్థను కించపరిచేవే. జడ్జిగా గౌరవప్రద బాధ్యతలు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ.. బాధితులకు అండగా నిలవడం తప్పా? అలాంటి వ్యక్తిని దూషించడం, బెదిరించడం అధికార దురంహకారానికి పరాకాష్ట. ఇది అధికార పార్టీ నేతల నిజ స్వరూపాన్ని సూచిస్తోంది. నానిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.– ఎస్.శరత్ కుమార్, సీనియర్ న్యాయవాది -
మారిపోతున్న మన హీరోలు.. మార్పు మంచిదే!
హీరో అంటే కేవలం హ్యాండ్సమ్గా, క్లాస్ లుక్‌లోనే కనిపించాలి... చొక్కా నలగకుండా విలన్లను రఫ్ఫాడించాలి.. కొత్త కొత్త ట్రెండీ డ్రెస్‌లతో హీరోయిన్లతో ఆడిపాడాలన్నది గతం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ట్రెండ్ మారుతూ వస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత మాస్ లుక్‌లో అయినా కనిపించేందుకు హీరోలు సై అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం చొక్కాలు విప్పి మరీ విలన్ల భరతం పడుతున్నారు. ఆయా పాత్రల కోసం లాంగ్ హెయిర్ స్టైల్,పొడవాటి గెడ్డం, సిక్స్ ప్యాక్ బాడీ... ఇలా తమ అభిమానులనే కాదు... సగటు సినీ ప్రేమికులను అలరించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నిఖిల్, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్ కర్ణ వంటి హీరోలు తమ తాజా చిత్రాల కోసం లుక్స్ ఛేంజ్ చేసి, సరికొత్త లుక్‌లోకి మారారు. ఇలా మారడం మంచిదే అంటూ... ఏ సినిమాల కోసం ఇలా సరికొత్తగా మేకోవర్ అయ్యారు? అనే వివరాలు చూద్దాం... వారణాసి కోసం... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారాయన. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్‌బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ డ్రాగన్... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. బిజూ మీనన్ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గుత్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, బిమల్ జీత్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్స్‌లోకి మారిపోయారు. ఈ మూవీలో ఆయన రెండు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం సన్నగా మారిపోయారాయన. అలాగే మరో పాత్రకు తగ్గట్లు సిక్స్‌ప్యాక్‌తో పవర్ఫుల్ లుక్‌లోకి మారారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ ్ర΄ాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ అక్రమ వ్యా΄ారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే ΄ాత్రలో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యక్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్ 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ∙యాక్షన్ సింగ... హీరో గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివ రకూ ఎన్నో యాక్షన్ రోల్స్, మాస్ క్యారెక్టర్స్ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. గోపీచంద్ కెరీర్లో 34వ సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టై¯Œ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్‌తో ΄ాటు ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది యూనిట్. ఈ మూవీ కోసం ఆయన ఫుల్ మాస్ లుక్‌లో మేకోవర్ అయ్యారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న చిత్రం ‘సింగ’. గెడ్డం, మీసం, చెవి΄ోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించాలో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించనున్నారు వెంకట్’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రా అండ్ రస్టిక్ జడల్ ‘దసరా’ (2023), ‘హిట్ : ది థర్డ్‌కేస్’ (2025) వంటి సినిమాల తర్వాత ‘ది ΄్యారడైజ్’ కోసం మరోసారి పక్కా రా అండ్ రస్టిక్ లుక్‌లోకి మారి΄ోయారు హీరో నాని. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష¯Œ లో రూ΄÷ందుతున్న సినిమా ఇది. వారిద్దరి కాంబినేషన్లో ‘దసరా’ మూవీ నిర్మించిన సుధాకర్ చెరుకూరి ‘ది ΄్యారడైజ్’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు విలన్‌గా, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూ΄÷ందుతోన్న ఈ సినిమా కోసం పవర్ఫుల్ రా అండ్ రస్టిక్ లుక్‌లోకి మారి΄ోయారు నాని. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే ఫుల్ మాస్ ΄ాత్రలో నటిస్తున్నారాయన. ఈ క్యారెక్టర్ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో కొత్త లుక్‌లోకి మారారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌లో నాని రెండు జడలు వేసుకుని కనిపించగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక వెండితెరపై నాని ఏ స్థాయిలో తన నట విశ్వరూపం చూ΄ారో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న రిలీజ్ అవుతోంది. డబుల్ ధమాకా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవి కిరణ్ కోలా దర్శకుడు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో భారీ ΄ాన్ ఇండియా ్ర΄ాజెక్ట్గా తెరకెక్కుతోన్న ‘రౌడీ జనార్థన’ సినిమాలో విజయ్ తొలిసారి పూర్తి స్థాయి పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న విడుదల చేసిన విజయ్ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘విజయ్ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, ‘రౌడీ జనార్థన’ లాంటి పూర్తి స్థాయి మాస్ ΄ాత్ర ఇంతవరకు చేయలేదు. తొలిసారి ఈ సినిమాలో తనతో తూర్పు గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. – మ మ మాస్... అక్కినేని అఖిల్ చూడ్డానికి ఫుల్ క్లాస్ లుక్‌లో కనిపిస్తుంటారు. అయితే ఆయన మాస్ లుక్‌లో కనిపించిన తొలి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు అఖిల్. ఆ మూవీ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మాస్.. మ మ మాస్ అంటూ పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పొడవాటి హెయిర్ స్టైల్‌తో పాటు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందింది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెప్పారు అఖిల్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మే 23కి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నాగార్జున 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్’ టీజర్‌ని విడుదల చేశారు. ‘ఎన్టీఆర్ అంత గొప్ప కాకపోయినా నువ్వు బానే సెప్పినావులే’, ‘ఏయ్... ఏందమ్మీ అట్టా మాట్టాడుతుండావు... ఈ లెనిన్గాడు నిప్పు’, ‘నేను తప్పి΄ోయి రాలేదు మచ్చా.. మీ అందర్నీ వెతుక్కుంటూ వచ్చిన’ అంటూ టీజర్లో అఖిల్ చెప్పే డైలాగులకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా జూన్ 26న విడుదల కావాల్సి ఉండగా జూలై 10కి వాయిదా పడింది. పీరియాడిక్ యాక్షన్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ‘భోగి’ సినిమా కోసం శర్వానంద్ సరికొత్తగా మాస్ లుక్‌లో మేకోవర్ అయ్యారు. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూ΄÷ందుతోన్న సినిమా ‘భోగి’. ఈ ΄ాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేలా మా సినిమా ఉంటుంది. మోస్ట్ ఇంటె¯Œ ్స, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని శర్వానంద్ చూపించబోతున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో ΄ాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ సిద్ధార్థ పొడవైన హెయిర్ స్టైల్, గెడ్డంతో సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జూన్ 1న నిఖిల్ సిద్ధార్థ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘స్వయంభు’ నుంచి నిఖిల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెన్స్ ప్రిపరేషన్‌కి సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్‌గా రూపొందిన చిత్రం ‘స్వయంభు’. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా మా మూవీ రూపొందింది. వైర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, గాల్లో చేసే విన్యాసాలు, ఫ్లిప్స్, క్లిష్టమైన ఫైట్ మూమెంట్స్‌ను నిఖిల్ సాధన చేస్తున్న దశ్యాలు ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రాచీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూ΄÷ందిస్తున్నాం. ΄ాన్ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన మా సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఏటిగట్టుపై సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తన క్యారెక్టర్ కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గుబురు గెడ్డం, కండలు తిరిగిన దేహంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారాయన. ఈ మూవీ చివరి షెడ్యూల్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరులో విడుదల కానుంది. ఇరుముడికి... క్లాస్, మాస్... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోతుంటారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఈ పాత్రకు తగ్గట్టు గెడ్డం, కొంచెం పొడవాటి హెయిర్ స్టైల్‌తో మేకోవర్ అయ్యారాయన. ‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.రెండో సినిమాకే... ‘పెదకాపు’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విరాట్ కర్ణ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చి త్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. 2023 సెప్టెంబరు 29న ఈ చిత్రం రిలీజైంది. తొలి సినిమాలోనే మాస్ క్యారెక్టర్లో కనిపించి, నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్ కర్ణ. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించారు.కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలో రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు విరాట్ కర్ణ. తన కెరీర్లోనే రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో ఆయా పాత్రల కోసం సిక్స్ ప్యాక్, పొడవాటి జుట్టు, గెడ్డంతో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నటించారు విరాట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘నాగబంధం’ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 3న విడుదల కానుంది. డబుల్ ధమాకా హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్లో ఒకేసారి రెండు మాస్ మూవీస్‌లో నటిస్తున్నారు. వాటిలో ‘రణబాలి, రౌడీ జనార్థన’ సినిమాలుఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న ΄ాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ‘మమ్మీ’ మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘రణబాలి’ చిత్రం కోసం విజయ్ దేవరకొండ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. హెయిర్‌స్టైల్‌తో పాటు లావుపాటి మీసాలతో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సెప్టెంబరు 11న విడుదల కానుంది. పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాదు... మరికొంత మంది స్టార్, సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ సినిమాల కోసం సరికొత్తగా లుక్స్ ఛేంజ్ చేస్తున్నారు. -
చేతులు కట్టేసి... న్యూడ్ వీడియో తీసి..
గచ్చిబౌలి (హైదరాబాద్): స్నాప్‌చాట్‌లో పరిచయమైన మహిళాటెకీకి మాయమాటలు చెప్పి హోటల్‌కు రప్పించి అనంతరం కత్తితో బెదిరించి చేతులు కట్టేసి, న్యూడ్ వీడియో తీసి ఓ యువకుడు రూ.1.10 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని (24) గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. మాదాపూర్‌లోని హోలా కో లివింగ్ పీజీ హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. అతనికి స్నాప్‌చాట్ యాప్ ద్వారా ఓ ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. నాగతేజ ఐదు రోజుల క్రితం గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సమీపంలోని ఎల్లో స్టోన్ హోటల్లో ఫేక్ డాక్యుమెంట్లతో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. యువతికి మాయమాటలు చెప్పి రాత్రి 8 గంటలకు హోటల్‌కు రప్పించాడు. అనంతరం యువతి చేతులు కట్టేసి, కత్తితో బెదిరించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో, మీ తల్లిదండ్రులకు ఆ వీడియో పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో యువతి డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం యువతి ఫోన్ నంబర్‌తో క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా నాగతేజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు, ముగ్గురు యువతుల న్యూడ్ వీడియోలు కూడా అతని సెల్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నిందితుడి తల్లిదండ్రులు చిన్న కొడుకు చదువు కోసం ఉన్న ఒక్క ఎకరం పొలం అమ్మేసి రూ.10 లక్షలు తమ బ్యాంక్ ఖాతాల్లో ఉంచుకున్నారు. వారికి తెలియకుండానే ఇద్దరి ఖాతాల నుంచి మొత్తం డబ్బును నాగతేజ కాజేసి, క్రికెట్ బెట్టింగ్‌లలో పోగొట్టాడని పోలీసులు వెల్లడించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
-
'ప్యారడైజ్' నుంచి మరో విలన్.. కానీ అది మాత్రం
సాధారణంగా నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. కానీ ప్రస్తుతం 'ప్యారడైజ్' విషయంలో మాత్రం అలా కుదరలేదు. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ చిత్రం లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు. ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు అదీ జరగట్లేదు. వాయిదా రూమర్స్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది. అలానే మరో విలన్ రాఘవ్ జూయెల్ ఎంట్రీ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)'ప్యారడైజ్'లో జడళ్ అనే పాత్ర నాని చేస్తుండగా.. సికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారు. ఇప్పుడు సికంజా కొడుకు పాత్ర అయిన విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జూయెల్ నటిస్తున్నాడు. మెడలో కిలోల కొద్ది నగలతో లుక్ డిఫరెంట్‌గా బాగుంది. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ విషయానికొస్తే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో అయితే విడుదల తేదీ లేదు. దీంతో వాయిదా పక్కా అని తేలిపోయింది. మరి డిసెంబరులో వస్తుందా? లేదంటే వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్) -
కథ చెప్పండి గురూ!
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.సంక్రాంతి తర్వాతే..! హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్‌లో వెంకటేశ్ రీసెంట్గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్‌కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్‌ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.నెక్ట్స్ ఎవరు? రాజమౌళి డైరెక్షన్‌లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్‌బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్‌బాబు.కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్‌బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్‌ను మహేశ్‌బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్‌బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్‌బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.ముందు ఎవరు? హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్‌లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాస్త సమయం ఉంది.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్‌తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్‌బస్టర్‌ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్‌కు నాని సూచించారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.మ్యూజికల్ లవ్‌స్టోరీ! ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్‌లోని 25వ సినిమాను లవ్ జానర్లో చేయాలా? లేక యాక్షన్ జానర్లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.అయితే రొటీన్ లవ్‌స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్‌కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్‌లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్‌కు శరత్‌మరార్ మరో నిర్మాత.రెండు సంవత్సరాల తర్వాత తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్‌గా సుధీర్‌బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్‌ను ఇంప్రెస్ చేసిందట.ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్‌పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్‌ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్‌గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.అడవిలో పోరాటం ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్‌చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్‌తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో ‘కిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్‌తోనూ ఓ సినిమా విషయమై రామ్‌చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.– ముసిమి శివాంజనేయులు -
చిరంజీవి-నాని.. ఒకే సినిమాలో?
ఇప్పుడు హీరోలు కూడా ట్రెండ్‌కి తగ్గట్లే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వయలెన్స్, బీభత్సమైన యాక్షన్ లాంటి అంశాలతో సినిమాలు వస్తున్నాయి. నాని 'ద ప్యారడైజ్' ఈ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ మూవీలో ఇప్పుడు చిరంజీవి కూడా నటించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'దసరా'తో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే 'ప్యారడైజ్'. లెక్క ప్రకారం ఈ పాటికే అంటే మార్చిలోనే రిలీజైపోవాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటివరకైతే ఆగస్టు 21న అని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్ర క్లైమాక్స్‌లోనే చిరంజీవి కనిపిస్తారనేది లేటెస్ట్ రూమర్.'ప్యారడైజ్' మొదలైన కొన్నాళ్లకే చిరు-శ్రీకాంత్ ఓదెల్ కాంబోపై ప్రకటన వచ్చింది. నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ మూవీకి 'ప్యారడైజ్'తో లింక్ చేస్తున్నారట. అంటే రెండు చిత్రాల్లోని హీరోల పాత్రలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ రాసుకున్నాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే 'ప్యారడైజ్' విషయంలో హైప్ పెరగడం గ్యారంటీ. అలానే టాలీవుడ్లో మరో సినిమాటిక్ యూనివర్స్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఆయా షేర్... రికార్డ్
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ వంటి హిట్ మూవీ నిర్మించిన సుధాకర్ చెరుకూరి ‘ది ప్యారడైస్’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి నాని ఇంట్రో సాంగ్‌గా విడుదలైన తొలిపాట ‘ఆయా షేర్...’ కి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాందీపాడగా, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈపాట తెలుగు వెర్షన్ 150 ప్లస్ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించినట్లు పేర్కొని, నాని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.‘‘నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్‌బస్టర్‌గా ‘ఆయా షేర్...’ నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ వేదికలను షేక్ చేస్తూ ఈపాట ఒక కల్చరల్ ఫెనామినల్గా మారింది’’ అని చిత్రబృందం తెలిపింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ సాయి. -
గ్యాంగస్టర్స్గా మారిన స్టార్ హీరోలు
థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ సినిమాను మెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ‘పుష్ప, కేజీఎఫ్’, ఇటీవల ‘ధురంధర్’... ఇలా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆడియన్స్‌కు థియేటర్స్‌లో మాస్ మూమెంట్స్‌ను అందించేందుకు కొందరు స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై గ్యాంగస్టర్స్గా మారారు. మరి... ఈ గ్యాంగ్స్టార్స్పై ఓ లుక్ వేయండి.ఒక్కరు కాదు... ఇద్దరు!‘అపూర్వ రాగంగళ్’, ‘అంతులేని కథ’, ‘గిరఫ్తార్’... ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (తెలుగులో ’అల్లావుద్దీన్ అద్భుత దీపం’) సినిమా తర్వాత రజనీకాంత్–కమల్హాసన్ల కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. తాజాగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ హీరోలుగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది.రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, ఇందులో రజనీకాంత్, కమల్‌హాసన్... ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్‌గా నటిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా జానర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథలో మంచి సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. ఇక ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రధారిగా త్రిష నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.2027 దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించనున్నారు. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. సో... రజనీకాంత్ – సీబీ చక్రవర్తిల కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ తర్వాత, కమల్‌హాసన్–రజనీకాంత్‌ల మల్టీస్టారర్ మూవీ సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.కాకాజీ?హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రధాన కథాంశం కోల్కత్తా నేపథ్యంతో సాగుతుందని, ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కూడా బలంగా ఉంటుందని, ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగు తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, ఆయన కుమార్తె పాత్రలో అనస్వరా రాజన్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఆ దిశగా షూటింగ్ షెడ్యూల్స్‌ను జరిపేందుకు బాబీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. మరో గ్యాంగ్‌స్టర్ సినిమా? హీరో నానితో ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానీతోనే ‘ది ΄్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నారు. ‘ది ΄్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అయితే హీరో చిరంజీవి– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నాని ఈ సినిమాకు నిర్మాత. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉంది. ఈ సినిమా 2027లో సెట్స్‌కు వెళ్లొచ్చు.ముంబై మాఫియాబాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించి, హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమా కోసం ఓ చారిత్రాత్మక కథను అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. దీంతో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఈ ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.పోలీస్ ఆఫీసర్ పోరాటంప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రోఫెసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఖైదీగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. గ్యాంగ్‌స్టర్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ‘స్పిరిట్’ సినిమాలోని కొంత కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇందులో త్రిప్తి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్, త్రిప్తి భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్ తండ్రి, జైలర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. మరో కీలక పాత్రలో సీనియర్ నటి కాంచన, విలన్స్‌గా వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ నటిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తోనే ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్–వివేక్ ఒబెరాయ్‌ల మధ్య కీలమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట సందీప్‌రెడ్డి వంగా. టీ సిరీస్ ఫిల్మస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. కోల్‌కతాలో డ్రాగన్కోల్కతాలో ‘డ్రాగన్’ చెప్పిందే జరగాలి. వెండితెరపై ఆ డ్రాగన్ ఎవరంటే ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్రాగన్’ టైటిల్‌ను ఓ గ్లింప్స్ వీడియోతో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆలియా భట్ లేదా రష్మికా మందన్నా నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.ఫుడ్ మాఫియా..!డ్రగ్స్ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్... ఇలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా చూసి ఉంటారు. కానీ కాస్త డిఫరెంట్‌గా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్నారు హీరో నాని. ‘సాహో, ఓజీ’ వంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ తీస్తున్న తాజా సినిమా ‘బ్లడీ రొమియో’. ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రధానంగా ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘బ్లడీ రొమియో’ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.గోవాలో డ్రగ్ మాఫియా‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ :చాఫ్టర్ 2’ వంటి చిత్రాల తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (ఇంగ్లిష్, కన్నడ) ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’. 1940–1970 మధ్య కాలంలో, గోవా నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే... రాయ, టికెట్..అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న యశ్ లుక్స్ బయటకు వచ్చాయి. గోవా తీర ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ సినిమా. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.ఈ సినిమాలో నాడియాగా కియారా అద్వానీ, గంగ పాత్రలో నయనతార, ఎలిజబెత్ పాత్రలో హ్యూమా ఖురేషీ, రెబెకా పాత్రలో తారా సుతారియా, మెల్లిస్సాగా కియారా అద్వానీ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ ‘టాక్సిక్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ, రిలీజ్‌ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ‘టాక్సిక్’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సామ్రాజ్యంనార్త్ చెన్నైలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు హీరో శింబు. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ సినిమా ‘అరసన్’. కలైపులి యస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఆండ్రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ హీరోగా ‘వడ చెన్నై’ సినిమా వచ్చింది. కానీ ‘వడ చెన్నై’ సినిమాకు, ‘సామ్రాజ్యం’ చిత్రానికి సంబంధం లేదని దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే ధనుష్‌తోనే ‘వడ చెన్నై 2’ సినిమా తీయను న్నట్లుగా వెట్రిమారన్ తెలిపారు.డీసీ‘మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తీసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘డీసీ’ అనే సినిమా చేశారు. ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. లోకేశ్ కనగరాజ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి నటించగా, ఓ కీలక పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటించారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో లోకేశ్, చంద్రగా వామికా గబ్బి నటించారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ ‘డీసీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది.ఇలా గ్యాంగ్‌స్టర్స్‌గా వెండితెరపై నటిస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.– ముసిమి శివాంజనేయులు -
నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి.. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..
-
TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు
-
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్‌లో వేసిన ఒక సెట్స్‌లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్‌పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. అఫీషియల్‌గా ప్రారంభం
రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు. Antha Easy ga Ela Pulloff chesthaav @TheDeverakonda AnnA outfits Anni 🥵❤️💥!...#VDShouryuvpic.twitter.com/rkzc9UR5Qz— Therajamohan (@therajamohan) April 20, 2026 -
తెలుగు మాస్ సాంగ్‌తో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం.. వీడియో వైరల్
ఐపీఎల్ సందడి మామూలుగా ఉండదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే తెలుగువారికి పూనకాలే. అది కూడా హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే ఆ జోష్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని ఉన్న సీఎస్కే టీమ్‌తో మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్. ఈ క్రేజీ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే తలపడగా.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు సాంగ్స్ క్రికెట్ ప్రియులను ఊర్రూతలుగించాయి. ముఖ్యంగా నాని మూవీ ప్యారడైజ్ సాంగ్ స్డేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్ మధ్యలో పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ అనే పాటను ప్లే చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్‌కు ఏకంగా పూనకాలతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ప్యారడైజ్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉప్పల్ రోర్స్ విత్ ఆయా షేర్ మానియా అంటూ వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో కేవలం తెలుగులోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా.. నాని హీరోగా వస్తోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోసారి వీరిద్దరు కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. Nannu peekuthava...Jumbalikay aayasher 💥💥Uppal Stadium roars with #AayaSher mania🧡 pic.twitter.com/T9WIePBKzN— THE PARADISE (@TheParadiseOffl) April 18, 2026 -
లేట్ అయినా లేటెస్ట్గా...
చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్‌నీల్’, రామ్‌చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... విశ్వంభర ఎప్పుడు? చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. జూన్‌లో ఎన్టీఆర్ నీల్? ‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించడం హైలెట్‌గా మారాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. జూన్‌లో పెద్ది రెడీరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్æమాస్ లుక్‌లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్‌తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టులో ప్యారడైస్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్‌కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. లెనిన్ డేట్ ఫిక్స్అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్‌లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్‌తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మేలో స్వయంభు ‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్‌నగర్ టాక్.ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్‌ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. సంబరాలు ఎప్పుడు?సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు. – డేరంగుల జగన్ మోహన్ -
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన నాని..
-
రజనీకాంత్ కొత్త చిత్రం ఆగిపోవడానికి.. నానినే కారణం..?
-
‘ది ప్యారడైజ్’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి!
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట సోషల్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ లుక్‌ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్ 11) ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్‌కి చాలా ప్రాధన్యత ఉంటుంది. దసరాలో కీర్తి సురేశ్ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
చరణ్, నాని.. షేర్ ఎవరు..?
ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్‌ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలిసాంగ్‌గా రికార్డు నెలకొల్పింది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్‌లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్‌లను దాటింది. సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మరింత ఈ నంబర్ పెరగవచ్చు. అయితే, వ్యూస్ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్‌లో ఉంది... ఆయా షేర్ పాట 91 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్ చరణ్ చికిరి పాటనే టాప్‌లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. -
బైక్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్‌ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
కాంట్ అవాయిడ్
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...కాన్సెప్ట్ పోస్టర్‌తోనే అంచనాలు చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు నాని. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్‌ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. మూడువేల మందితో... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్‌కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించారు. ఈ సెట్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో... ‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్‌ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. సలార్ 2లోనూ.... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.అంతకు మించి... ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్‌తో మేకోవర్ అయ్యారు.ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవర్ఫుల్ కల్ట్విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మించారు.ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.‘ఫలక్‌నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్ జడల్ ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్. మాస్ రణబాలి హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్‌గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.రగ్డ్ డెకాయిట్ అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్‌లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్‌గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్‌డోర్‌లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. ఎ బ్లడ్ ఫెస్ట్శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్‌లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నాని & వెంకీ మూవీ ఫిక్స్..!
-
'ఆయా షేర్' కోసం ఇంత కష్టమా?.. మేకింగ్ విశేషాలివే!
‘ఆయా షేర్..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. నాని వేసిన హుక్ స్టెప్‌కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్‌పై, డ్యాన్స్‌పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్‌ను నిర్మించారట. ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్‌లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్‌ను రూపొందించారు. ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్‌ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట. దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్‌ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్లో సెట్ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆయా షేర్...’కి వారం పట్టింది.. ‘జడల్’ లో ఎమోషన్ ఉంది: కాసర్ల శ్యామ్
‘‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్...’ పాట ప్రోమో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాట రిలీజ్ తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతోంది. నా సాహిత్యానికి అనిరుధ్‌గారు జనాలకి రీచ్ అయ్యే విధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు ఏ పాటా ఇవ్వలేదు’’ అని పాటల రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి విడుదల చేసిన తొలి పాట ‘ఆయా షేర్...’కి మంచి స్పందన వస్తోందని యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్ విలేకరలతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నానీగారి చేస్తున్న జడల్ క్యారెక్టర్లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల వెనుక మంచి కథ ఉంది. ఇప్పుడు అందరూ జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆయా షేర్...’ జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తినిచ్చే క్రమంలో వచ్చే పాట. ఈ పాట రాయడానికి వారం పట్టింది. ఈ చిత్ర కథ 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలావరకు ఉర్దూ పదాలు ఉపయోగించాను. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడిన ఓ వ్యక్తి.. నా పాటతో కొత్త స్ఫూర్తి పొందానని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ మధ్య ‘లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల్లో పాటలు రాశాను’’ అని చెప్పారు. -
ఆయా షేర్ నా తొలి పాట కావడం హ్యాపీ: సుధన్
‘దసరా’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లో దూసుకెళుతోందని యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ పాట కొరియోగ్రాఫర్ సుధన్ మాట్లాడుతూ– ‘‘దసరా’ చిత్రానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఆ సమయంలో ‘నువ్వెప్పుడు కొరియోగ్రాఫర్ అవుతావు’ అని అడిగేవారు. ‘సాంగ్ ఇస్తే చేస్తానని’ చెప్పేవాడిని. అలా నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత మొదట కలిసింది శ్రీకాంత్గారినే. ‘ఆయా షేర్’ పాట కొత్తగా ఉండాలని శ్రీకాంత్‌గారు చె΄్పారు. సినిమాలో నానీగారి ఇంట్రో సాంగ్ ఇది. దీంతో నానీగారిని కొత్తగా చూపించాలనే ఆలోచనతో కొరియోగ్రఫీ స్టార్ట్ చేశాను.ఒక ఎడిట్ వెర్షన్ చేశాను. హుక్ స్టెప్ కూడా అద్భుతంగా కుదిరింది. దర్శకుడికి నచ్చింది. ఒక కొత్త కొరియోగ్రాఫర్‌గా నా తొలి పాటను ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి చేయడం కాస్త ఒత్తిడిగానే ఉంటుంది. దర్శకుడు ఇచ్చిన చాన్స్‌కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పని చేశాను. ఇప్పుడు ‘ఆయా షేర్...’ పాటకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ సాంగ్ తర్వాత మా నిర్మాత కొరియోగ్రఫీ గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాలకు కూడా చాన్స్‌లు వస్తున్నాయి’’ అని చెప్పారు. -
నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్
-
ట్రెండింగ్‌లో నాని జడలు ఆయా షేర్ తో అరాచకం
-
'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల.. 'ఆయా షేర్' పాట వింటూ చిల్ అయిపోతున్నారు. నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమాలోని పాట ఇది. అనిరుధ్ సంగీతమందించాడు. నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం దీన్ని రిలీజ్ చేయగా.. వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మ్యూజిక్, బీట్, లిరిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. ఓ యూట్యూబ్ మాత్రం ఇందులో నాని వేసిన హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేశారని అంటున్నాడు.(ఇదీ చదవండి: పవన్‌ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్)హైదరాబాద్‌లో బాబా జాక్సన్ పేరుతో ఉన్న ఓ ఇన్ఫ్లూయెన్సర్.. ఇన్ స్టా, యూట్యూబ్‌లో డాన్స్ వీడియోలతో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో ఇతడు ఓ విదేశీయుడితో కలిసి వేసిన స్టెప్నే ఇప్పుడు 'ఆయా షేర్' పాటలో కాపీ కొట్టేశారని అంటున్నారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో సదరు ఇన్ఫ్లూయెన్సర్.. ఒరిజినల్ ఇదే అంటూ రెండు వీడియోలు కూడా పోస్ట్ చేశాడు.నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ద ప్యారడైజ్'. పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. తొలుత మార్చి 26నే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి వాయిదా వేశారు. కొన్నిరోజుల క్రితమే అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా తొలి గీతం వదిలి, అమాంతం హైప్ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని) View this post on Instagram A post shared by Baba Jackson (@babajackson2019) -
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్?
టాలీవుడ్ హీరోలు యంగ్ దర్శకులపై చర్చ వస్తే తరచూ అట్లీ, ప్రశాంత్ నీల్, నీల్సన్, కార్తీక్ సుబ్బరాజు వంటి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ మన దగ్గర కూడా యూత్‌ను ఆకట్టుకునే స్టైలిష్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించగల టాలెంట్ ఉన్న దర్శకులు ఉన్నారు.అందులో ముఖ్యంగా నిలుస్తున్న పేరు సుజీత్. ‘ఓజి’తో సుజీత్ ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా చుట్టూ ఏర్పడిన అంచనాలు, టీజర్లు, పోస్టర్లు—అన్నీ కలిపి సుజీత్‌ను పాన్ ఇండియా రేంజ్లో చర్చకు తెచ్చాయి. ‘ఓజి’ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్‌పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.సుజీత్ తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉండనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘బ్లడీ రోమియో’ అనౌన్స్మెంట్ వీడియో ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత ఇచ్చింది. వీడియోలో కనిపించిన విజువల్స్ ఆధారంగా ఈ సినిమా యుకే ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని అర్థమవుతోంది. ఫుడ్ రెసిపీలు, చెఫ్ ఎలిమెంట్స్, వంటకాలకు సంబంధించిన సింబాలిజం వంటివి కథలో కీలక భాగమని సూచిస్తున్నాయి. లోగోలో కనిపించిన లండన్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్టింగ్‌ను క్లియర్ చేసింది.ఇప్పటివరకు విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న నాని, శ్రీకాంత్ ఓడెలతో కలిసి ఇటీవల రగ్డ్ పీరియాడిక్ టచ్ ఉన్న ‘పారడైజ్’ తరహా కథ తర్వాత సుజీత్‌తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్లోకి అడుగుపెడుతున్నారు. గన్స్, గర్ల్స్, స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఫుల్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్. యూత్‌కు నచ్చేలా స్టైలిష్‌గా సినిమా తీయగల దర్శకుడిగా సుజీత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి నటుడితో కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రం టాలీవుడ్‌కు కొత్త స్టైలిష్ యాక్షన్ ఫేజ్‌ను తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి. -
వైరల్ అయిపోతున్న 'ఆయా షేర్' పాట రిలీజ్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. లెక్క ప్రకారం మార్చిలోనే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' అంటూ సాగే ఈ గీతం.. ప్రోమోతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి పాట కూడా అలానే అదరగొడుతోంది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'ప్యారడైజ్' సినిమా తీస్తున్నారు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్గా చేస్తోంది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విడుదలకు ఇంకా చాలారోజులు ఉంది కానీ హైప్ అయితే ఈ మూవీపై మామూలుగా లేదు. -
నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)
-
‘ఓకేరా నీ ఇష్టం’.. ఈ మాట భయపెడుతోంది : నానిపై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఆ చిత్రం..బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. శ్రీకాంత్ తొలి సినిమానే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన రెండో సినిమా కూడా నానితోనే ప్లాన్ చేశాడు. అదే ‘ది ప్యారడైజ్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. నాని బర్త్‌డే(ఫిబ్రవరి 24) సందర్భంగా ఈ రోజు ‘ఆయా షేర్’ అనే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela ) నానికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఎక్స్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.‘నాని(Nani) అన్న..‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారి నాకు ‘శ్రీకాంత్ నిన్ను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపించేది. ఆ నమ్మకం నన్ను ప్రతిసారి భయపెట్టేసింది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం ప్రతి సెకను నా రక్తాన్నా, ఆత్మను ధారపోశాను. నేను నీ సినిమా రూల్స్‌ని బ్రేక్ చేశాను. మీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్ మార్చేశాను. మీ సినిమా రిలీజ్ డేట్ ప్లానింగ్‌ని కూడా బ్రేక్ చేశాను. చివరకు మీ వర్కింగ్ స్టైల్‌ని కూడా మార్చేశాను. ఇలా మీరు పెట్టిన ప్రతి నియమాన్ని నేను ఉల్లంఘించాను. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా పని చేసేలా చేసింది. నువ్వు నమ్మినంతగా నన్ను ఇంకెవరు నమ్మలేదు అన్న. సినిమా కోసం నేను జడలు వేసుకోవాలి అంటే.. ఓకేరా నీ ఇష్టం అన్నావు. టాటూ వేసుకోవాలని చెబితే నీ ఇష్టం అన్నావు. ప్రతిరోజు లెక్కలేనన్ని రీటేకులతో నిన్ను టార్చర్ చేసినా.. సింపుల్‌గా ‘ఓకేరా నీ ఇష్టం’ అన్నావు. నీతో ఎప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ..‘నువ్వు ఎప్పుడూ ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని ఎందుకు అంటావు అనే దానికి సమాధానం కోసం నా జీవితంలో ప్రతి సెకను నిరంతరం వెతుకుతున్నాను. బహుశా ‘ది ప్యారడైజ్’(The Paradise) సినిమాతో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. నన్ను నమ్మిన నా ధరణికి(దసరాలో నాని పాత్ర పేరు) నన్ను మళ్లీ నమ్ముతున్న నా జడల్‌కి( ది ప్యారడైస్లో నాని పాత్ర పేరు)కి హ్యాప్తీ బర్త్‌డే. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నాని అన్న’ అని శ్రీకాంత్ ఓదెల రాసుకొచ్చాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ ఆగస్ట్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. Nani Anna,Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.I broke your every rule of cinema.I broke your working days pattern...I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026 -
నాని- సుజీత్ కొత్త సినిమా టైటిల్ ఇదే (వీడియో)
టాలీవుడ్ నటుడు నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. రీసెంట్గా ఓజీతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు సుజీత్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఒక వీడియోను విడుదల చేశారు. వీడు నంబర్ వన్ చెఫ్ కాదు.. గ్యాంగ్‌స్టర్ అంటూ నాని పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ స్టైల్లో ఈ మూవీ ఉంటుందని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనిమస్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు.‘ది ప్యారడైజ్’ సినిమా పూర్తికాగానే బ్లడీ రోమియో సినిమా పట్టాలెక్కనుంది. ఇది తన మార్క్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. డార్క్ హ్యూమర్‌తో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా క్లిష్టతరంగా ఉండనుందంటూనే సాంకేతికంగా మరోస్ధాయికి చేరుకుంటుందన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూరప్‌లో చిత్రీకరణ చేసుకోనుందని క్లారిటీ ఇచ్చారు. -
నాని 'ది ప్యారడైజ్' టైటిల్ సాంగ్ ప్రోమో
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఆయా షేర్... అంటూ వందలాదిమంది డ్యాన్సర్లతో నాని వేసిన స్టెప్పులకు అదిరిపోయేలా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉంది. కాసర్ల శ్యామ్ కుమార్ రచించిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఫిబ్రవరి 24న పూర్తి సాంగ్‌ను విడుదల చేస్తామని ప్రోమోలో ప్రకటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, స్పానిష్‌లో ఆగష్టు 21న ఈ మూవీ విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ఒక ప్రేత్యకమైన గెటప్‌లో కనిపించనున్నారు. మొదటి సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు ఇప్పటికే తెలిపాయి. -
గెట్... సెట్... గో గెటప్ ఛేంజ్
వెరైటీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నటీనటులు పర్ఫార్మెన్స్ పరంగానే కాదు... లుక్స్ పరంగా కూడా వెరైటీ చూపించడానికి రెడీ అయిపోతారు. ఒక్కోసారి గుర్తు పట్టడానికి వీలు లేనంతగా క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోతారు. డార్క్ మేకప్,ప్రోస్థెటిక్ మేకప్... ఇలా మేకప్‌తో డిఫరెన్స్ చూపించడంతో పాటు ఫిజికల్‌గా కూడా క్యారెక్టర్‌కి తగ్గట్టు సన్నబడతారు... లావైపోతారు. హీరోలైతే క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోతారు... క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గెడ్డం పెంచుకుంటారు... జుట్టు కూడా పెంచుకుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్, ఎన్టీఆర్, రవితేజ, నాని, అఖిల్, సాయి దుర్గాతేజ్, విరాట్ కర్ణ, సంపూర్ణేష్ బాబు... ఇలా స్టార్ హీరోస్తో పాటు యంగ్ హీరోస్ తమ సినిమాల కోసం గెటప్ ఛేంజ్ చేశారు. గెట్... సెట్... గో అంటూ ఇలా గెటప్ ఛేంజ్ చేసిన ఆ హీరోలు, వారు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్రపా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు తొలిసారి ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. గతంలో ఎన్నడూ కనిపించనంతగా పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారాయన.ఇప్పటికే విడుదలైన మహేశ్ గెటప్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందట. ‘వారణాసి’పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. సరికొత్తగా... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. తన పాత్రకు తగ్గట్టు సన్నగా మారిపోయారాయన. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తీసిన పాట హైలెట్‌గా మారనున్నాయి. జూన్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇరుముడి కోసం వరుస సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతుంటారు రవితేజ. క్లాస్, మాస్... ఇలా పాత్రకి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఆయా లుక్‌లోకి మారిపోతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఆధ్యాత్మికప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పాత్ర కోసం రవితేజ మేకోవర్ అయ్యారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఇరుముడి’.రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా విడుదల చేసిన టైటిల్, రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక లుక్‌లో రవితేజ చక్కగా ఒదిగిపోయారనే ప్రశంసలు లభించాయి. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది. రవితేజ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. మరోసారి మ మ మాస్ రామ్‌చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో నటించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక. ఈ సినిమాలో పోడవాటి జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా పక్కా మాస్ లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్ ఆ తర్వాత లుక్స్ మార్చారు. తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు రామ్‌చరణ్. ఈ మూవీ కోసం మరింత మాస్ లుక్‌లోకి మారారాయన. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, సాంగ్ చూస్తే ఆయన ఎంత మాస్‌గా కనిపించనున్నారో అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం పోడవైన జుట్టు, గెడ్డం, లుంగీ... ఇలా రెండోసారి మ మ మాస్ లుక్‌లోకి మారిపోయారు.ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, సినిమాపై మరింత బజ్‌ని పెంచింది. ఈ మూవీని రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ప్యారడైస్ కోసం... హీరో నాని మరోసారి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘దసరా’, ‘హిట్ : ది థర్డ్‌కేస్’ వంటి సినిమాల్లో ఫుల్ మాస్‌గా కనిపించిన ఆయన తాజాగా ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం పవర్ఫుల్ మాస్ లుక్‌లోకి మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే రా రస్టిక్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని పక్కా మాస్ లుక్‌లో కనిపించగా ఏ స్థాయిలో స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి పోస్ట్‌పోన్ అయ్యి ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లెనిన్ కోసం... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందుతోంది. ఈ మూవీలో తన పాత్ర కోసం తొలిసారి రాయలసీమ యాసలో డైలాగులు చెబుతున్నారు అఖిల్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీని వేసవి కానుకగా మే 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సంబరాల కోసం... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేకించి తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఇప్పటివరకూ చూడని పాత్రలో సాయిదుర్గా తేజ్ ప్రేక్షకులను అలరిస్తారని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండుసార్లు విడుదల వాయిదాపడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. నాగబంధంలో... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ద్వితీయ సినిమా ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు విరాట్ కర్ణ. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.‘‘అభిషేక్ నామా అత్యంత భారీగా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీ కోసం విరాట్ కర్ణ అద్భుతంగా ట్రాన్ ్సఫార్మ్ అయ్యారు. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా శివుని అవతారంలో కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా సినిమాని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సరికొత్త బిర్యానీ... ‘ది ప్యారడైస్’ సినిమాలో నటుడు సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జడల్ పాత్ర పోషిస్తున్న నాని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ కనిపించనున్నారు. బిర్యానీ పాత్ర లుక్‌ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో సంపూర్ణేష్ గెటప్ ఆశ్చర్యపరచేలా ఉంది. పోడవాటి హెయిర్, గెడ్డం, రఫ్ లుక్, ఇంటెన్ ్స ఎక్స్ప్రెషన్ తో ఈ పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారాయన. ఈ మూవీ నుంచి విడుదలైన సంపూర్ణేష్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే ఆయన పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కూడా తమ పాత్రల కోసం సరికొత్తగా గెటప్ ఛేంజ్ చేస్తున్నారు.– డేరంగుల జగన్ మోహన్ -
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్'తో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'ఓజీ' సుజీత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని లైన్లో ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న నాని.. ఇప్పుడు ఓ బోల్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.(ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)పలు హిందీ చిత్రాల్లో నటించిన తృప్తి దిమ్రికి.. సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' మూవీ ఓవర్‌నైట్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో వరస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగా తీస్తున్న 'స్పిరిట్'లో ప్రభాస్‌కి జోడీగా చేస్తోంది. మరి మెయిన్ లీడ్ లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇదలా ఉండగానే ఇప్పుడు నాని చేయబోయే ఓ మూవీ కోసం తృప్తిని హీరోయిన్గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి.. టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావొచ్చు.గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన నాని.. అందుకు తగ్గట్లే బాలీవుడ్లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'ప్యారడైజ్'లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యూయెల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో?(ఇదీ చదవండి: 18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
వారణాసి, పెద్ది, ప్యారడైస్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది?
టాలీవుడ్లో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ సోమవారం వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.📽️ ఎన్టీఆర్ - డ్రాగన్: తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.📽️ అల్లు అర్జున్ - AA22: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో జరుగుతోంది.📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. -
షేర్ రెడీ
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ‘‘ది ప్యారడైజ్’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మా సినిమాకి అనిరుధ్ రవిచందర్ చక్కని సంగీతం అందించారు. ‘ఆయా షేర్’పాటని సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వందలాది మంది డ్యాన్సర్లతో నానిపై భారీ సెట్లో చిత్రీకరించాం. ఈ సాంగ్ నాని ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్‌లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి కెమెరా: సీహెచ్ సాయి. -
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్‌కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్‌కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్‌బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్‌తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్‌నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది. -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్‌కి థియేటర్స్‌కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్‌కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్‌పోన్ స్టోరీ తెలుసుకుందాం.వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్æమాస్ లుక్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్‌తో ఈ సాంగ్‌ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్‌పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్‌లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్‌కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్లానింగ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్‌ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్‌నగర్ టాక్.మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్‌కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్‌లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్‌నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్‌లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్‌పోన్ అయింది.అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్


