
సాధారణంగా సినిమాలు హిట్ అయినప్పుడు, కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినప్పుడు ఆనందం కొద్దీ నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు లగ్జరీ బహుమతులు ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే దాన్ని చాలామంది చెప్పుకొంటారు. కానీ నాని మాత్రం దీని గురించి ఏ మాత్రం బయటపెట్టలేదట.
హీరోగా వరస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. గత నెలలో థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కోర్ట్' నిర్మించింది నానినే. అయితే ఈ సినిమా కోసం రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై ఎఫెక్ట్!)
అయితే ఈ సినిమా అద్భుతమైన హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయిన నాని.. 'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ రామ్ జగదీశ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నాని చేతుల మీదుగా కారు బహుమతిగా అందుకోవడం ఒక అచీవ్ మెంట్ అని రామ్ జగదీష్ చెప్పుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినట్లు బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని, లేదంటే గట్టిగా అరిచి తనకు కారు కొనిచ్చాడని చెప్పేవాడినని అన్నాడు.
(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)