
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు.. థియేటర్లలో ఆడిన సందర్భాలు తక్కువే. మన తెలుగులో ఈ జానర్ లో సినిమాలు రావడమే అరుదు. అలాంటిది ఓ మాదిరి అంచనాలతో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న మూవీ 'కోర్ట్'(Court Movie 2025). హీరో నాని నిర్మించిన ఈ చిత్రం ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించింది? బాక్సాఫీస్ లెక్కలు ఓసారి చూద్దాం.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
నాని (Actor Nani) నిర్మించాడని తప్పితే 'కోర్ట్' మూవీపై రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాల్లేవు. కానీ రెండు రోజుల ముందే పడిన ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రాగా.. తొలిరోజే రూ.8 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది. అది అలా అప్పటినుంచి స్టడీగా సాగుతూ వెళ్తుంది. ప్రస్తుతం ఐదు రోజుల్లో రూ.33.55 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఐదు రోజుల్లో, అది కూడా ఓ కోర్ట్ (Court Movie Collection) రూమ్ డ్రామా సినిమాకు ఈ రేంజు వసూళ్లు అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు మూడు రెట్లు లాభాలని నిర్మాతతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ 800k డాలర్స్ వసూళ్లు వచ్చాయి. అంటే త్వరలో మిలియన్ డాలర్ మార్క్ కొట్టేయడం గ్యారంటీ అనిపిస్తోంది. తెలుగులోనూ ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.50 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?
(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?)

Comments
Please login to add a commentAdd a comment