
కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. రెండు మూడు రెట్ల లాభాలు గడించేస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'కోర్ట్' మూవీ సూపర్ హిట్ అయింది. నాని నిర్మించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఓ రికార్డ్ మార్క్ చేరుకుంది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)
కేవలం రూ.9-10 కోట్లతో నిర్మించిన కోర్ట్ మూవీ.. రిలీజ్ కి ముందు ఓటీటీ డీల్ పూర్తయింది. అలా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రీమియర్ల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి వీకెండ్ లోనే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. 10 రోజుల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్ గా ప్రియదర్శి చేయగా.. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)

Comments
Please login to add a commentAdd a comment