
నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం రిలీజైన రెండు రోజే లాభాలు అందుకుంది. తొలిరోజేలానే రెండో రోజు కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది.
(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)
పోక్సో కేసు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'కోర్ట్' మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెగ్యులర్ కోర్ట్ డ్రామా అయినప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో చూడదగ్గ మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసొచ్చింది. అలా తొలిరోజు రూ.8.10 కోట్ల గ్రాస్ రాగా.. రెండో రోజుల్లో రూ.15.90 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.
రూ.10 కోట్ల కంటే తక్కువ ఖర్చుతో తీసిన 'కోర్ట్' మూవీ ఓటీటీ రైట్స్, ఆడియో హక్కులు ఇదివరకే విక్రయించేశారు. మరోవైపు పెట్టుబడి కూడా రెండు రోజుల్లోనే తిరిగొచ్చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండో రోజుకే సినిమా లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతగా నాని నమ్మకం నిజమైంది.
(ఇదీ చదవండి: 'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?)

Comments
Please login to add a commentAdd a comment