
టాలీవుడ్ హీరో నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ పేరిట గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను మా అమ్మనే గుర్తుకు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
హీరో నాని మాట్లాడుతూ..'నా మోస్ట్ ఫేవరేట్ పర్సన్ ఇన్ సినిమా ఆమెనే. రోహిణి మేడంను చూడగానే మా అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మను చూడగానే రోహిణి మేడం గుర్తొస్తుంది. ప్రతి సినిమా సెట్‌లో ఆమెను చూడగానే మా పని సులువుగా అయిపోతుందని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను మణిరత్నం గారికి గ్రేటేస్ట్ ఫ్యాన్‌ను. ఆయన చాలా సినిమాల్లో హీరోయిన్లకు రోహిణి మేడం డబ్బింగ్ చెప్పింది. అందుకే మాకు మొదటి నుంచి ఎక్కడో కనెక్షన్ ఉందినిపిస్తుంది. చాలా ఈవెంట్స్‌లో మేం ఇద్దరం చాలా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తాను' అంటూ నటి రోహిణిపై ప్రశంసలు కురిపించారు.
కాగా.. తొలిరోజే కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు ఏకంగా రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అతని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిరోజు బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. రెండు రోజుల్లోనే రూ.15.90 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ. 20 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని టాలీవుడ్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment